11, డిసెంబర్ 2007, మంగళవారం
కోల్పోయాన క్షణాలు
కరిగి పోతున్న క్షణాలని ఒడిసి పట్టాలని దోసిలి చాచానుదూరమవుతున్నా బంధాలని నిలుపుకోవలని ఆశ పడ్డానుమదిలో మెదిలే ఊసులా ఆనంద పడ్డానుఆవిరవుతున్నా ఆశలను చెమర్చినా కనులతో వీక్షించానుప్రతిక్షణం నాకోసం అనుకుంటూ ఆనందహేలిలో మునిగానుఅమూల్యమయిన క్షణాలను కొల్పోయిన అవేదనలో అలమటిస్తున్నానుప్రతి ఉదయం నాకోసమే అన్నా ఆలోచనలో ఎన్నో నిశ్శబ్ధ సాయంత్రాలని గడిపానుప్రతి అందం నాకె అన్నా మీమాంసాలో విలువైన క్షణాల కోల్పోయాను..తిరిగి చూస్తే తీరం ఎరుగని సాగర గర్భంలో ఉన్నానుగమ్యమెరుగని ఎడారిలొ ఇసుక తిన్నెలపై సాగిలపడి ఉన్నానునిశి రాతిరిలో వెలుగు చూపె దివ్వె కోసం వేచి ఉన్నాను..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)