యువరత్న నందమూరి బాలకృష్ణ శ్రీరాముడిగాప్రముఖ దర్శకులు బాపు దర్శకత్వంలో సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం శ్రీరామరాజ్యం. ఈ చిత్రంలో వాల్మీకిగా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నటిస్తున్నారు. లక్ష్మణునిగా శ్రీకాంత్, భరతునిగా సాయికుమార్, సీతగా నయనతార నటిస్తున్నారు.
ఈతరం వారికే కాక రేపటి తరం వారికి ఆ ముందుతరం వారికి మన రామాయణం పట్ల ఇంట్రెస్ట్ కలిగేలా, శ్రీరాముడిని గుర్తుంచుకునేలా ఉండాలని ప్రేక్షకులుగా మేము కొరుకుంటునము.మన రామాయణ, భాగవత, భారతాలు ఎప్పటికీ జనజీవనాలు. మన సంస్కృతీ సంప్రదాయాలకు పట్టుగొమ్మలు. వాటిని మర్చిపోతే మనకు గతం లేదు. మనకు చరిత్ర లేదు. సమాజం లేదు.
26, మార్చి 2011, శనివారం
తెలుగు సినిమాల స్థాయిని తమిళవాళ్లకి తెలియజేయునున ఎన్టీఆర్ ‘శక్తి’
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంత వరకు మరే సినిమా సాధ్యం కాని రికార్డులు నెలకొల్సిన‘మగధీర’కి ఇంతదాకా తమిళనాడు జోన్ ని ఎన్స్ ప్లాయిట్ చేసే ఛాన్స్ దక్కలేదు. తమిళంలోకి అనువదించాలనే ఆలోచనతో అసలు చెన్నై లో కూడా ఆ చిత్రాన్ని విడుదల చేయకుండా వచ్చే రాబడిని వదులుకున్నారు. అప్పట్నుంచీ తమిళ వెర్షన్ ని విడుదల చేయాలని చూస్తున్నా కానీ ఇంతదాకా అది వెలుగు చూడలేదు. తెలుగు సినిమాల స్థాయిని తమిళవాళ్లకి తెలియజేసి, ఇకపై మన అనువాదాలకోసం వారు పోటీ పడేలా చేస్తుందని భావించిన మగధీర ఇంకా తమిళనాడు బార్డర్ దాటకుండా ఉండిపోతే, జూ ఎన్టీఆర్ మాత్రం తన ‘శక్తి’ అక్కడి వాళ్లకి చూపించడానికి సమాయత్తమవుతున్నాడు.
ప్రస్తుతం విడుదల అవుతున్న ఉన్న చిత్రాల్లో భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో ‘శక్తి’ ఒకటి. జూ ఎన్టీఆర్ ఇలియానా జంటగా మొహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జైట్ తొ అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ‘శక్తి’ ఆడియో విడుదలయ్యింది. ఇక..ఈ సినిమా కథ ఎలా ఉంటుంది? అనే విషయంపై ఫిలింనగర్ లో చర్చలు జరుగుతున్నాయి
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘శక్తి’ చిత్రం తమిళంలోకి ‘ఓం శక్తి’ పేరుతో అనువాదమవుతోంది. తెలుగుతో పాటు తమిళంలోను ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చరణ్ చేద్దామని చేయలేకపోతున్న దానిని ఎన్టీఆర్ ముందు చేసి చూపించి, మగధీర తమిళ వెర్షన్ కి మార్గం సుగమం చేస్తాడమో చూడాలి

నా ఈ కోరిక తీరేది ఎపుడో
రజనీకాంత్.... సముద్రంలా కనిపించే నది. కమల్‌హాసన్... నదిలా కనిపించే సముద్రం. ఇక ఇద్దరూ కలిస్తే వెండితెరపై సునామీ. ‘అంతులేని కథ, అందమైన అనుభవం, వయసు పిలిచింది, పాటగాడు, ఎత్తుకు పై ఎత్తు’ తదితర తెలుగు చిత్రాల్లో, ‘పదినారు వయదినిలే, అపూర్వ రాగంగళ్’ వంటి తమిళ చిత్రాల్లో కలిసి నటించారు రజనీకాంత్, కమల్‌హాసన్. కెరీర్ ఆరంభంలో ఈ విధంగా కలిసి నటించిన రజనీ, కమల్‌లు విడివిడిగా స్టార్‌డమ్ తెచ్చుకున్న తర్వాత ఎవరి సినిమాలతో వారు బిజీ అయ్యారు.
అయినప్పటికీ వీరి కాంబినేషన్‌లో సినిమా చేయడానికి పలువురు దర్శకులు ప్రయత్నాలు చేశారు. కానీ సాధ్యపడలేదు. ఇక ఈ కాంబినేషన్ కలవాలంటే వారి గురువు ‘కె.బాలచందర్’ రంగంలోకి దిగాల్సిందేనని, ఆయన ఒక్కడి వల్లే అది సాధ్యమవుతుందని చాలామంది అభిప్రాయపడ్డారు కూడా. కానీ బాలచందర్ మాత్రం.. ‘ఇప్పుడు ఈ హీరోలతో సినిమా చేయలేను. ఒకప్పుడు వాళ్లకు ఇమేజ్ ఉండేది కాదు. నేను అల్లుకున్న కథలుతో వారితో సినిమాలు చేశాను. ఇప్పుడు వాళ్ల ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమా చేస్తే.. నా కథ కిల్ అవుతుంది’ అని ఓ సందర్భంలో పేర్కొన్నారు.దాంతో ఈ సూపర్‌స్టార్ల కలయికలో ఇక సినిమా వచ్చే అవకాశం లేదని చాలామంది ఫిక్స్ అయ్యారు.

కొత్త ఇమేజ్‌ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
హీరోలు తమ ఇమేజ్ చట్రంనుండి బయటకు రాలేరా ?
కథకులు.. నిర్మాతలు.. దర్శకులు హీరోల ఇమేజ్‌ని మార్చగలరా? కొత్త ఇమేజ్‌లు వచ్చిపడితే అవి ఎంతకాలం నిలబడతాయి? ఇంతకీ ఇమేజ్ ఎంతవరకు అవసరం? ఇలా ఎన్నో ప్రశ్నలు హీరోలను వేధిస్తుంటాయి.
హీరోలుగా తెరంగేట్రం చేసిన కొద్దిరోజులకే ఇమేజ్ ఏర్పడడం జరుగుతుంది. చేసిన సినిమాలు తక్కువే అయినా, అటు పరిశ్రమ ఇటు ప్రేక్షకులు ఓ ఇమేజ్ చట్రంలో హీరోను ఫిక్స్ చేసేస్తారు. అలా ఇమేజ్ చట్రంలో ఇరుక్కున్న తరువాత ప్రయోగకథలు, ప్రయోగ వేషాలు వేయకపోవడం ఉత్తమమని హీరోలు సైతం భావించి తమ ఇమేజ్‌ని రెట్టింపుచేసే మూసపాత్రల కోసమే ఎదురు చూస్తారు.
చాలామంది హీరోలు ఏ ఇమేజ్ చట్రంలోను ఇరుక్కోకూడదని చిత్రపరిశ్రమని ప్రేక్షకులను అబ్బురపరుస్తూ కొత్త కొత్త పాత్రలకోసం కథలకోసం అనే్వషించి చిత్రాల్లో నటిస్తారు. అవి సక్సెస్ అయితే సరి లేకపోతే తమ ఇమేజ్ చట్రమే పదిలమని భావించి అలాంటి చిత్రాల్లో నటించడానికే సిద్ధపడతారు. ఇమేజ్ చట్రం నుండి బయటపడడానికి నటించే చిత్రాలు కూడా హీరోలకు కొత్త ఇమేజ్‌ని తెచ్చిపెట్టినా ఆశించినంతగా కలెక్షన్లు రాబట్టలేకపోవడంవల్ల హీరోలు అలాంటి చిత్రాలు వరసగా చేయడానికి ఇష్టపడరు.
మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, స్టయిలిష్‌స్టార్ అల్లు అర్జున్, యువరత్న బాలకృష్ణ, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్, రెబల్‌స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, సూపర్‌స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేష్‌బాబు, నట సామ్రాట్ అక్కినేని, యువ సామ్రాట్ నాగార్జున, యాంగ్రీయంగ్‌మాన్ రాజశేఖర్, పీపుల్స్‌స్టార్ ఆర్.నారాయణమూర్తి, లవర్‌బోయ్ తరుణ్, విక్టరీ వెంకటేష్, మ్యాన్లీస్టార్ శ్రీహరి ఇలా హీరోగా నటించే నటుల ముందు ఏదో ఒక స్టార్‌ని తగిలించి ఇమేజ్ చట్రంలో బంధించడం జరిగిపోతుంది. దానినుండి బయటపడలేక హీరోలు నానా అవస్థలు పడతారు. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసాను...లోపల ఒరిజినల్ అలాగే ఉంది. అది బయటకు వచ్చిందో రచ్చరచ్చ...ఈ డైలాగ్ ‘బృందావనం’లో ఎన్టీఆర్‌ది. ఇది ఎన్టీఆర్‌కేకాదు పరిశ్రమలో హీరోలందరికీ వర్తిస్తుంది. ఎవరి పరిధిలో వారు వారి క్యారెక్టర్‌లో నటిస్తున్నా ఒరిజినల్ అనేది ఎప్పుడూ సపరేట్‌గా ఉంటుంది. ఆ ఒరిజినల్‌కే రకరకాల పాత్రలను అద్ది నటిస్తూ ఉంటారు. ఒరిజినల్ ఏమిటనేది పరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలో నటించిన కొద్దిపాటి సినిమాలతోనే బయటపడిపోతుంది. అయితే దానినితప్పించుకోవడానికి రకరకాల పాత్రలను ట్రై చేయడం జరిగినా ఎక్కడో ఒక చోట ఈ నటుడు ఫలానా క్యారెక్టర్స్ బాగా చేయగలడని పరిశ్రమతోపాటు ప్రేక్షకులు కూడా ఫిక్సయిపోతారు. అదే ఇమేజ్ చట్రం. దానికి తగ్గిచేసినా, పెంచి చేసినా ఒకటి రెండు చిత్రాల వరకు ఆదరిస్తారే తప్ప కంటిన్యూగా ఆదరించరనేది చాలామంది హీరోలకు తెలిసిన విషయమే.
జూ.ఎన్టీఆర్ ఇమేజ్‌ని మేము మార్చేశాం. ఇకమీదట ఎన్టీఆర్‌ని ఇలాగే ఇష్టపడతారని నిర్మాత దర్శకులు తెగసంబరపడిపోతున్నారు. అయితే ఈ సినిమనిర్మాణపరంగా హైబడ్జెట్‌తో తయారైనా మూస కథ కావడంతో ఆశించినంత హీరో ఇమేజ్‌ని గాని, చిత్ర ఆదరణ గాని అందలేదు. దాంతో సదరు నిర్మాత పైరసీ యుద్ధాన్ని ప్రారంభించారు. యంగ్ టైగర్‌గా ముద్రపడిన ఎన్టీఆర్ చేసిన చిత్రాల్లో అధిక భాగం ఆవేశంతో కూడుకున్న కథాంశాలే. వాటిలో కూడా అంతర్గతంగా ఫ్యామిలీ డ్రామా ఉంది. ఈ సినిమాలే ఎన్టీఆర్‌కి మాస్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టి భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టాయి. అయితే పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘ఆంధ్రా అల్లుడు’ గతంలో పల్టీ కొట్టడంతో ఎన్టీఆర్ మళ్లీ మాస్ ఇమేజ్‌ని పెంచే యాక్షన్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. ‘బృందావనం’ వంటి సాఫ్ట్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా తరువాత కూడా ‘శక్తి‘వంటి పవర్‌ఫుల్ టైటిల్‌తో రావడం గమనిస్తే ఎన్టీఆర్ ఇమేజ్ ఏమిటన్నది మనకే అర్ధమవుతుంది.
పాతతరంలో ఎన్టీఆర్ సాంఘిక చిత్రాల్లో ఎంత రాణించినా పౌరాణికాలు జానపదాలు ఆయనకు తెచ్చిన ఇమేజ్ ప్రత్యేకం. ఎఎన్‌ఆర్ మొదట్లో పౌరాణిక జానపద చిత్రాలు చేసినా ఆ తరువాత ఆయనకు సాంఘిక చిత్రాలే మంచి ఇమేజ్‌ని తెచ్చాయి. కృష్ణకు సాంఘిక చిత్రాలతోపాటు కౌబాయ్, గూఢచారి చిత్రాలు పెద్ద ఇమేజ్‌ని తెచ్చాయి. శోభన్‌బాబు చిత్రాల్లో భారీ ఇమేజ్‌ని తెచ్చిన చిత్రాలు పక్క్ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లే. కృష్ణంరాజుకి ఆవేశపూరిత పాత్రలు కలిగిన చిత్రాలే రెబల్‌స్టార్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టాయి. వారి ఇమేజ్ పరిధి దాటి లేదా తగ్గి సినిమాలు చేసినపుడు మిశ్రమ ఫలితాలను పొందడం జరుగుతుంది. అందుకే హీరోలు ఎక్కువగా వారి ఇమేజ్ చట్రంలోనే నటించడం ఉత్తమం అని భావిస్తారు.
మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి సైతం రుద్రవీణ, ఆరాధన, ఆపద్బాంధవుడు వంటి చిత్రాల్లో తనలోని నటుడిని సంతృప్తిపరుచుకున్నా, ఇమేజ్‌పరంగా ప్రేక్షకుల్ని అలరించలేకపోయారు. దాంతో తన ఇమేజ్ పంథా చిత్రాలనే ఇప్పటివరకు అనుసరిస్తుండడం కనిపిస్తుంది. ప్రస్తుతం రాజకీయ ప్రవేశంతో ఎలాంటి సినిమాలలో నటించాలా? అనే ఆలోచనలో పడ్డా తన ఇమేజ్‌కి తగ్గట్టుగానే కథ, సినిమా ఉంటుందని ప్రకటించడంబట్టే అర్ధమవుతుంది ఇమేజ్ అంటే ఏమిటో?
చిరంజీవి తనయుడిగా చిరుత, మగధీర వంటి రెండు చిత్రాల్లోనే భారీ ఇమేజ్‌ని మూటగట్టుకున్న రామ్‌చరణ్ రాబోయే ‘ఆరెంజ్’ చిత్రంతో యువతను కూడాపెద్దఎత్తునఖాతాలోవేసుకోవాలన ప్రయత్నించాడు. అన్నివర్గాల ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా నటించే నటుడికి ఉండే ఇమేజ్ ఏమిటన్నది తండ్రినిబట్టి ఈ తనయుడికి అర్ధమై వుంటుంది. అందుకే ఆ బాటలో ప్రస్తుతానికి నడుస్తున్నట్టు కనిపిస్తుంది.
తన తండ్రితో ఎన్నో పాత్రలు పోషించిన బాలకృష్ణ ప్రత్యేకంగా ఏ ఇమేజ్‌ని చాలాకాలంవరకు ఏర్పరచుకోలేకపోయినా రానురాను పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలను, సీమ ఫ్యాక్షనిస్టు పాత్రలతో టాలీవుడ్‌ని షేక్ చేసాడు. అయితే ఈ కాలంలో నటించిన ‘మిత్రుడు' వంటివి ఎన్నో సాఫ్ట్ టైటిల్సతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడడంతో నిన్నటి ‘సింహా’తో మరోమారు తన ఇమేజ్ చట్రంలోకి ఇరుక్కుని నటించాడు. ఫలితం కూడా ఆరేంజ్‌లోనే దక్కింది. కానీ మళ్లీ శ్రీరామరాజ్యం చూస్తే ఇమేజ్ చట్రం బయటకు వచ్చి నటిస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే నటుడు అనేవాడు ఎలాంటి పాత్రలైనా నటించగలిగి ఉండడంతోపాటు ప్రేక్షకుల్ని మెప్పించగలగాలి అన్నది సత్యం.
కృష్ణంరాజు వారసునిగా అదే ఆవేశభరిత పాత్రలను ఎంతో ఈజ్‌తో చేయగలడనే ఇమేజ్‌తో వచ్చిన ప్రభాస్ ఆ తరహా చిత్రాలలోనే భారీ విజయాలను సాధించాడు. సెంటిమెంట్ పాళ్లు ఎక్కువయిన యోగి, ఏక్‌నిరంజన్‌లు, హాస్యంతోరక్తి కట్టించాలని ప్రయత్నించిన డార్లింగ్, బుజ్జిగాడు ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయాయి. ప్రిన్స్ మహేష్‌బాబు ‘అతడు’తో ఓ తరహా ఇమేజ్‌ని సాధించినా ‘పోకిరి’తో ప్రత్యేక ఇమేజ్‌లో ఫిక్స్ అయిపోయాడు. అంతే! ఆ ఇమేజ్ అతని పాలిట శాపమైందని చెప్పాలి. అందుకే తరవాత వచ్చిన అతిథి, ఖలేజాలు బాక్సాఫీస్‌వద్ద నిరాశను మిగిల్చాయి.
పవర్‌స్టార్ ఇమేజ్‌తో రాణిస్తున్న పవన్ కళ్యాణ్ అల్లరి స్టూడెంట్, లవర్‌గా మంచి ఇమేజ్‌ని సంపాదించి వరస విజయాలను కైవసం చేసుకున్నా మధ్యలో ఇమేజ్ చట్రం బయటకు వచ్చి చేసిన జాని, గుడుంబా శంకర్, కొమరంపులి బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. దాంతో ప్రస్తుతం పాత ఇమేజ్ చట్రంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఇటీవలి కాలంలో నూతన పంథాలోకి కథలను ఎంపిక చేసుకోవడంతో వరసగా వరుడు, ఆర్య-2, వేదం వంటివి ప్రయోగాత్మక పాత్రలుగా మిగిలాయే తప్ప తన ఇమేజ్‌ని పెంచడంలో గానీ ప్రేక్షకులను రంజింపచేయడంలోగానీ ఏమాత్రం ఉపయోగపడలేదు.
లవర్‌బాయ్ ఇమేజ్‌లతో వచ్చిన తరుణ్, నితిన్, ఉదయ్‌కిరణ్ కొంతకాలం పెద్దనటులకే గట్టిపోటీనిచ్చినా ఆ ఇమేజ్ వారికి ఏవిధంగా ఉపయోగపడలేదు సరికదా కెరీర్‌ని బిల్డప్ చేసుకోవడంలో కూడా ఉపయోగపడకపోవడంతో వీళ్లంతా ప్రస్తుతం నిరాశతకొనసాగుతున్నారు. మోహన్‌బాబు వారసులుగా వచ్చిన మనోజ్, విష్ణులు కూడా ప్రేక్షకుల్లో సరైన ముద్ర వేసుకోలేకపోయారు. ‘జోష్’తో పల్టీకొట్టిన నాగార్జున తనయుడు చైతన్య రెండో సినిమా ‘ఏ మాయ చేసావె’తో లవర్‌బాయ్ ఇమేజ్‌ని సంపాదించాడు. అలాంటి ఇమేజ్‌తోనే ప్రస్తుత సినిమా ‘దటీజ్ మహాలక్ష్మి’ (పేరు నిర్ణయించలేదు) చేయడం విశేషం!
హాస్యపు హీరోగా ప్రత్యేక ఇమేజ్‌ని చేజిక్కించుకున్న రాజేంద్రప్రసాద్ తన ఇమేజ్‌కి భిన్నంగా పలుమార్లు నటించి పరాజయాలతో పాటు అవార్డులు కూడా దక్కించుకున్నాడు. గతంలో ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి వంటివి మంచిపేరు తెచ్చినా హాస్య కిరీటికి ప్రేక్షకుల్లో ఎక్కువ అభిమానాన్ని తెచ్చిపెట్టలేకపోయాయి.
అగ్రహీరోగా చలామణి అవుతున్న నాగార్జున ‘శివ’ తెచ్చిన కొత్త ఇమేజ్‌తో వరస ఫ్లాపులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం పవర్‌పుల్, అల్లరిపాత్రలతో కెరీర్‌ని లాగించేస్తున్నాడు. పవర్‌ఫుల్ పాత్రల జోలికి వెళ్లి ఎన్నోసార్లు నిరాశను మిగుల్చుకున్న విక్టరీ వెంకటేష్ ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తోనే సక్సెస్‌లు చవి చూసాడు. అందుకే అతని ఇమేజ్ తగ్గ ఫ్యామిలీ పాత్రలు ఎంచుకుంటూ మధ్యమధ్యలో అభిరుచికోసం వెరైటీ పాత్రలను చేసి ఫ్లాపులను మూటకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం అతని ఇమేజ్‌కి స్ర్తిపేర్లు బాగా (లక్ష్మి, తులసి) ఉపయోగపడుతున్నాయి.
విలన్‌పాత్రల్లో బ్రహ్మాండంగా రాణించిన శ్రీహరి లక్కీగా హీరో ఇమేజ్‌ని సంపాదించుకున్నాక పవర్‌ఫుల్‌పాత్రల్లో వరస విజయాలను కైవసం చేసుకున్నాడు. రానురాను ఆ ఇమేజ్ అతనికి ఆటంకంగా మారడంతో ఈ మధ్యకాలంలో సపోర్టుపాత్రల వెంట మళ్లీ నడిచి కొత్త ఇమేజ్‌ని తెచ్చుకున్నాడు. కాని అడపాదడపా భైరవ వంటి సినిమాల్లో నటిస్తూ తన పాత ఇమేజ్‌వైపు పయనిస్తున్నాడు. ‘అంకుశం’ సినిమా తర్వాత పోలీస్ పాత్రలంటే రాజశేఖరే చేయాలి అనేంత ఇమేజ్‌తో ఆవేశపూరిత పాత్రను అవలీలగా చేసే నటుడుగా రాజశేఖర్ ఎదిగాడు. అయితే ఈ ఇమేజ్ అతనికి మైనస్‌గా మారడంతోరకరకాల పాత్రలవైపు పయనించాడు. దానిలో భాగంగా రాఘవేంద్రరావు ‘అల్లరి ప్రియుడు’తో రాజశేఖర్‌ని సాఫ్ట్‌గా మలిచాడు. ఈ కొత్త ఇమేజ్ ఎంతోకాలం నిలబడకపోవడంతో మళ్లీ పోలీస్ పాత్రలను పోషించినా ఫలితం లేకపోయింది. తర్వాత ఆవేశపూరిత పాత్రలు చేస్తూ వస్తున్నా, మరోసారి ‘మహంకాళి’ సినిమాలో పోలీస్ పాత్రను పోషించడానికి రెడీ అయ్యాడు. పీపుల్స్‌స్టార్ ఆర్.నారాయణమూర్తి సైతం ఎర్రసినిమాలకు ఇమేజ్ స్టార్‌గా ఎదగడంతో వరస విజయాలను చవిచూసినా ఆ ఇమేజ్ ఎంతోకాలం నిలబడకపోవడంతో ‘వీర తెలంగాణ’ వంటి విప్లవ చిత్రాల పంథాను అనుసరించడం జరుగుతుంది.
హీరోలకు ఇమేజ్‌ని తెచ్చిపెట్టే చిత్రాలు ఒక్కోసారి వారి కెరీర్‌కి ప్రతిబంధకంగా కూడా మారతాయనడంలో సందేహమే లేదు. అలాంటప్పుడు వేరే తరహా చిత్రాలను చేసి ప్రేక్షకులనుండి కొత్త ఇమేజ్‌ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో అంచాలను తారుమారుచేసే సక్సెస్‌లు ఫెయిల్యూర్స్ కూడా రావచ్చు. ఏ హీరో అయినా ఇమేజ్ చట్రంనుండి తాత్కాలికంగా బయటపడి విజయాలు, పరాజయాలు పొందుతాడే తప్ప, పూర్తిగా ఇమేజ్ చట్రంనుండి బయటపడతాడని భావించలేం.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)