2, నవంబర్ 2011, బుధవారం

అన్నదాతల గుండెకోత ఎవరికి తెలుసు ????

ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకృత విధానాల ప్రభావాన్ని మన రైతు చవిచూస్తున్నాడు. వీటివల్ల దేశంలో సంపద అనూహ్యంగా పెరిగింది. ఉత్పత్తులు కూడా పెరిగాయి. వాటికి మార్కెటింగ్‌ సౌలభ్యం వృద్ధిచెందింది. అదే సమయంలో ఈ దేశంలో రైతు మాత్రం నీరుగారిపోయాడు. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతాంగం అప్పులపాలైంది. వ్యవసాయం నష్టదాయకంగా మారింది. అప్పులు తీర్చలేక ఆర్థిక ఇబ్బందులకు గురైన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనంతటికీ కారణం ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల ఆదేశాలే. వీటిమేరకు భారత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సబ్సిడీల్ని తగ్గించింది. అంచెలంచెలుగా మొత్తం తొలగిస్తోంది

ఒక్క మాటలో చెప్పగలనా !!!!!

విల్లు పట్టి నిలుచున్నది
అన్నా
లేక
రాముడు గా మారిన బాల కృష్ణుడా
అని అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే

నందమూరి నుండి
మరొకరు రాముడు గా
వచ్చి
విల్లు పట్టిన విధం చూసి
నిలువెల్లా పులకరిస్తూ

ఆ రౌద్రం చూసి
రోమాంచిత ఉద్వేగం కలగగా

అన్నగారి తరం లో
తెలుగు వాడిగా పుట్టినందుకు
మరో సారి వారి వారసుల తరంలో
రాముడిని చూసి తరిస్తున్నందుకు
నా జన్మే అదృష్టం
అని ఒక్క మాటలో చెప్పగలను

అరకొర జ్ఞానంతో

అరకొర జ్ఞానంతో
తెలుగు గడ్డపై
దర్శకుల కొదవ అన్న వారు
అప్పుడప్పుడూ తాము
మద్రాసులో ఉండగా
అబ్భిన అరవ పాండిత్యాన్ని కూడా
పదే పదే చెప్పుకొనే వారు
తాము పుట్టక ముందు
అదే అరవ మద్రాసులో
తెలుగు శంకరాభరణం
సంవత్సరం పైగా ఆడింది అని తెలుసుకోవాలి
ప్రేమాభిషేకం కూడా
సంవత్సరం పైగా ఆడింది అని తెలుసుకోవాలి
వాటి దర్శకులు కూడా
మన తెలుగు వారే అని గర్వపడండి
జాతి ని తక్కువ చేసి మాట్టాడే ముందు
ముందూ వెనుకా చూసుకొని మాట్టాడండి

స్వాతి ముత్యం అనుకొని ఇన్నాల్లో మురిసిన వారు

ఇడుపలేసుని పైన
ఈగ వాలినా
వారసుల గురించి
వివాదస్పద వాక్యాలు
ఎక్కడ వినిపించినా
ఇడుపలేసుని ఇచ్చ బంటులా
తక్షణం అక్కడ వాలి
అలా మాట్టాడే వారిని
బంతాడుతుంటే
ఇడుపలేసుని భక్తుల ఆనందం
అంబరాన్ని అంటేది.

ఇడుపలేసుని బంటుగా
భరితెగించి ప్రజల ఆస్తులు
స్వామికి సమర్పిస్తున్నా
ఎదురు దాడితో
అదే బంటుతో
దడ దడ లాడించే వారు.

ఓ ప్రక్క ఇడుపలేసుని వారసుడు
అక్కా చెల్లీ తల్లీ అంటూ
చెంతకు వచ్చిన వారి
చెక్కిళ్ళు నిమిరి
ఓదార్చుతుంటే
ఇక్కడ బంటు
“చెప్పు సంజనా టెల్ మీ ” అంటూ
ఆడవారి వారి పైన చూపిన
గౌరవ మర్యాదల
గుట్టు రట్టు అయిన వేళ
ఇడుపలేసుని భక్తుల గొంతులో
పచ్చి వెలక్కాయ పడింది.

బంటు గారి బరితెగింపు
హాస్కీ వాయిస్ తో
అలరిస్తుంటే అవాక్కాయి
ఎలా ఎదురు దాడి చేస్తారా అనే
ఆసక్తి అందరిలోనూ ప్రభలుతోంది.

ఇడుపలేసుని వారసుని
స్వాతి ముత్యం అనుకొని
ఇన్నాల్లో మురిసిన వారు
ఆ ముత్యం పై ముసురుకొంటున్న
ఆస్తుల కేసులతో
అసలు రంగు ఇప్పుడిప్పుడే అవగతం చేసుకొంటుంటే
ఇన్నాళ్ళూ ఆణిముత్యం లాంటి వాడనుకొన్న
బంటు లీలలు బయటపడడం
తప్పక మరింత బాధిస్తాయి.

ప్రక్కనోడిని ఎప్పుడు తినేద్దామా అని ఎదురు చూసే సముద్ర నాయకులకు అర్థం అవుతుందంటారా?

చేతిలో సెయ్యిట్టిన సన్నివేష సంబడాన్ని
అంబరాన్ని అంటేలా చేద్దామనుకొంటే
సముద్రం లోని నాయక తిమింగలాలు తీరనివ్వలేదు
సరే సర్దుకు పోదాం అని
దిగమింగుకొని సర్దుకు పోతున్నా
కరేపాకుకు ఇచ్చిన విలువ కూడా ఇవ్వకుండా
ఆటలో అరటిపండు అనే మాటలకు తెరదించకుండా
ఇంకో సినిమాకు కథలు వింటూ భారంగా కాలం వెళ్లదీసే వేళ
అవిశ్వాస తీర్మానం అనే పదం
‘ఆటలో అరటిపండు’లో ఆశను రేపింది

అరటిపండు అవసరం వచ్చే రోజు
ఆసన్నమయ్యింది అని గుర్తుకు తెచ్చేలా
సముద్రం లోని తిమింగల నాయకులకు
ఓ విందు పెట్టి గుర్తు పెట్టుకోమనింది

ప్రక్కనోడిని ఎప్పుడు తినేద్దామా అని
ఎదురు చూసే సముద్ర నాయకులకు
ఈ అరటి పండు పడే ఆరాటం
అర్థం అవుతుందంటారా?
లేదా ఇదీ ఒక ‘ఆటలో అరటిపండు’ ఆర్భాటమే అని
అపార్థం చేసుకొంటారా?

ప్రచార కర్త వారసులు (రక్త & రాజకీయ వారసులు)

వ్యవసాయం దండగని అని
అన్నావో లేదో తెలియదు కాని
తేల్చమని నువ్వు చెప్పినా
ఎవరూ రాకున్నా

ప్రచార కర్త వారసులు (రక్త & రాజకీయ వారసులు)
మాత్రం నిన్ను వదలడం లేదు
వారి పెద్ద వ్యవసాయానికి చేసిన పండగ గురించి
నోరు పెగల్చడం లేదు

అయినా వ్యవసాయం పండగో దండగో
అది ప్రక్కన బెడితే
మీ వృత్తి
అదే రాజకీయాలు
భ్రస్టుపట్టి పోతూ
దండగ అయిపోయే సమయం
ఆసన్నమయ్యిందని
వేర్పాటు వాదులు
ఓదార్పు వీరులు
ఒకింత ముందుగానే గ్రహించినట్టు ఉంది

అందుకే రాజకీయాలు పండగ చెయ్యాలని
ప్రబుత్వాన్ని పడగొట్టండి
అవిశ్వాసం పెట్టండి అని
ఆత్రం గా అడుగుతున్నారు

ఆలకించండి మరి
ప్రభుత్వం పడినా పడక పోయినా
పాలకుల బేరసారాలతో
రాజకీయాలు పండగ చెయ్యాలని
ఉవ్వీళ్ళూరే వీరి
బేరసారాలకు
బేషజాలకు పోకుండా
బేరాలు చేసుకోనివ్వండి.

గో ధూళిని లేపే వారు లేరు

వృద్దుల చే సుద్దులు చెప్పించుకోవాల్సిన
భావి తరం ఎండమావుల వెంట వెళ్ళిపోగా
పండిన వృద్దులే ఇప్పుడు దాని సంతోషం

గో ధూళిని లేపే వారు లేరు
పాలిచ్చే ఆవులను మాత్రం ఆశగా చూసుకొనే వారు మాత్రం
అక్కడక్కడా అగుపిస్తుంటే

కూలీలు దొరక్క
కరెంటు తో దాగుడు మూతలు ఆడలేక
గిట్టు బాటు గాక
ప్రతిసారి అదృష్టం పరీక్షించుకోలేక
సరైన పోషకాహారం దొరక్క
నీరసపడి
బీడుల చూస్తూ

అందులో పూర్వం పండించిన బంగారాన్ని తలచుకొని
నెమరేసుకొంటూ
ఇవి ఇలాగే ఉంటే
భావి తరాలు ఏమి తిని బతుకుతారో
అని బాధ పడుతూ

ఆశలు రేపిన
జల యజ్ఞం
జనాల స్వేదం
ధనంగా
పాలకుల పంటలు పండిస్తుంటే
పల్లె లో మొలకెత్తే ఆశలు కూడా
అక్కడే అడుగంటి పోతున్నాయి.

కాకి పిల్ల కాకికి ముద్దు

అవినీతో
అధికార దుర్వినియోగామో
నాన్న అన్నీ ఇచ్చి వెళ్ళాడు
కూర్చునే కుర్చీ తప్ప

ఆ కుర్చీ వుంటే తప్ప
వెనకేసిన కుప్పను కప్పలేము

దానికి దిష్టిబొమ్మ లా కుర్చీ కావాల్సిందే
నలుగురి దిష్టి పడితే కుప్ప వెనకాల ఉన్న
అవినీతి కృషి బయటపడుతుంది

ఇప్పుడు అదే జరిగింది
కుర్చీ లేని సమయం చూసి
ఆ అవినీతి కుప్ప రగులుకుంది
చూస్తుంటే ఆ కుప్ప బొచ్చె ఇచ్చి కారాగారంలో గాలితో కూడా కూర్చోపెట్టేట్టు వుంది

అందుకే అమ్మా
గుడ్డు మీద నాన్న పీకలేని ఈకలు
నీ బాబు కోసం
బాబు జుట్టు మళ్ళీ పట్టుకో

జుట్టు రాకపోయినా పరవాలేదు పాత జట్టు నాయకురాలిని ప్రాధేయపడి
మన పట్టు గురించి పసందుగా చెప్పి
జైలులో మంచి భోజనాలు పెట్టించమని చెప్పొచ్చు
అలాగే బరితెగించిన మన బంటు నిర్వాకం బూడిద అవుతుంది

కాకి పిల్ల కాకికి ముద్దు అనే సామెత ఒకటి మరో సారి సమైక్యాంధ్రకు సాటి
ఎట్టన్నా నాన్న మంత్రదండంతో మదించి వచ్చిన
అవినీతి సాక్షులతో సహా అన్నీ
పదికాలాల పాటు
పదిలంగా వుండేలా చూడమ్మా
అత్యవసరంగా ఆ అవినీతి కుప్పను ఆర్పమ్మా.

ఆ సంపాదన సాక్షిగా చెరపట్టే దుశ్శాసనులు

ప్రకృతికి చెందిన పంచభూతాలను వంచనతో ద్రుతరాస్ట్రుడికి మల్లే దురాశపడిన కొడిక్కి దోచి ఇచ్చిన దొర పై ఓపిక నశించిన ప్రకృతే పగబట్టి విజయం సాధిస్తే ఇంకా ఆ సంపాదన సాక్షిగా చెరపట్టే దుశ్శాసనులు వీక్షకుల ముందు వచ్చి విశ్లేషణలు గావిస్తుంటే శకుని శత్రు శిబిరం నుండి సంకేతాలు పంపుతుంటే సమరంలో నిలిచిన కొడికి పక్షాన ప్రజల కళ్లకు గంతలు గడుతూ స్వయంగా తల్లే తలపడుతోంది పంచభూతాల పగకు పతి ప్రాణాలు పణంగా పెట్టినా పసి వాడి పాడు బుద్ధికి సుద్దులు చెప్పడం మరిచి మళ్ళీ తలపడడం మనందరికీ ఆశ్చర్యం కలిగించి నాది అక్షర సత్యం మహా భారతం మళ్ళీ నడుస్తోంది

ఆ పిల్లోడోల అమ్మ ఊరుకోదు

ఆ పిల్లోడిని చూడు
వాడికి ఏం కావాలన్నా ఇవ్వడానికి
వాళ్ళ అమ్మ దగ్గర అన్నీ వున్నాయి
అయినా వాడు నీలా
యాగీ చెయ్యడు చూసి నేర్చుకో
వాళ్ళ అమ్మ మన తాతకు ఇచ్చిన
కుర్చీనే కావాలని
ఏడుస్తావెందుకు
మాటి మాటికీ
వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి
మన తాత కుర్చీలో కూర్చుంటానని
మారాం చేస్తున్నావంట
నీకు బుద్ది రావాలనే
ఆ పిల్లోడిని వాళ్ళ అమ్మ
మన ఇంటికో సారి పంపి
నన్ను ఎక్కువ మర్యాద చెయ్యకండి
నేను మా ఇంట్లో గెడ్డం తాత కూర్చొనే కుర్చీ అడగడం లేదు
అని సెప్పి పంపింది వాడు అలాగే సేత్తున్నాడు
ఇంకైనా కొంచెం ఇజ్జత్ తెచ్చుకో
భాగ్యనగర పండక్కు
నువ్వేమీ ఎగేసుకొని ఎల్లకున్నా
ఎదురుచూసే వాళ్ళు లేరు
వెళ్లాలనుకొంటే వెళ్లి ఏడువు
నువ్వు అడిగే కుర్చీలో నుండి తాత లేవలేదని
తాతను ఎవన్నా అన్నావో
ఆ పిల్లోడోల అమ్మ ఊరుకోదు
నీకు నీ డోలుకు వీపు విమానం మోతే
దాంతో పాటు నిన్ను పాలేరు చేసి
సిన్మాల్లో నటించే ఆ మొద్దబ్బాయిని
దత్తత చేసుకోమంటోంది, జాగ్రత్త.