1, మార్చి 2011, మంగళవారం

తెలుగు హీరోల్లో టాప్ రెమ్యునేషన్ ఆ హీరోకా.. . .. .

బెంగుళూరు మిర్రర్ పత్రిక రీసెంట్ గా టాలీవుడ్ హీరోల రెమ్యునేషన్స్ అంటూ ఓ లిస్ట్ ని ప్రచురించింది. ఆ లిస్ట్ లో రెమ్యునేషన్ లో ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. నిజంగా అంతంత రెమ్యునేషన్స్ ఆ హీరోలు అందుకుంటున్నారా అనేది పెద్ద చర్చనీయాంశమైంది.
ఆ పత్రికలో పడిన దాని ప్రకారం రెమ్యునేషన్స్ ...
జూ.ఎన్టీఆర్ : 9 కోట్లు
రవితేజ : 7 కోట్లు
పవన్ కళ్యాణ్ :6.5 కోట్లు
మహేష్ బాబు: 6 కోట్లు
రామ్ చరణ్ :6 కోట్లు
నాగార్జున :5 కోట్లు
అల్లు అర్జున్ : 5 కోట్లు
వెంకటేష్ : 4 కోట్లు
నాగచైతన్య : 3.5 కోట్లు
రాణా : 3 కోట్లు
ఇవీ ఆ రెమ్యునేషన్స్ ..వీటిని బేస్ చేసుకుని ఇప్పటికే కొన్ని టీవీ ఛానెల్స్ వారు పోగ్రామ్ లు ప్రసారం చేసారు. ఇంతకీ ఇవి నిజమేనంటారా...

ఆకాశం దాటి వస్తావా? ఓ చందమామ

ఏనాడు కనుగున్నానో నిను



చీకటిని అందంగా చూపే నీ వెలుగులో చుక్కలని తిరిగి లెక్కబెట్టాను
కవ్వించే నీ ఉనికితో నువ్వు పుట్టించిన ప్రశ్నలెన్ని!
ఆ ప్రశ్నల్లో సమాధానాలుగా నే జీవిస్తున్నపుడు ఎంత సంబరం!
గడిచే ప్రతీ క్షణం క్షణపు విలువని తిరగరాసింది
ఇది ఎందాకానో తెలియని నేను నిను అందుకోబోయాను
ఆకాశమంత దూరంగా నువ్వు..

నీ దగ్గరితనపు దూరం కనుగునే ప్రయత్నం నేనాపలేదు


నా నీడే నిను అలుముకుందో
మరి ఏ నీడ నిన్ను కమ్ముక్కుందో
నానాటికీ చిక్కిపోయావు
ఓ నాడు నా కన్నులకి చిక్కకుండాపోయావు
చిన్నబోయిన అవి నిన్ను వెతకడం మానేసాయి
వెలుగునే కనుగొనడం ఆపేసాయి




కాలం ఏ మాయ చేసిందో..
నా చూపుల దారిని మళ్ళించింది
ఇక నే ఎప్పటికీ కనుగోలేనేమొ అనుకున్న నువ్వు
అది నువ్వే - ఎన్నడూ చూడనంత నిండుగా!

పెల్లుబికే ప్రశ్నలు నీ సమాధానాల్లో జీవించమన్నాయి
ఈ క్షణపు విలువ ఎంత అంటూ,
నీ దూరం ఎంత దగ్గర అంటూ..
ఏదో తెలియని భావం కన్నుల్లో ముసురుకుంది
మసక మసకగా నువ్వు

చలం కలం లోంచి రవీంద్రుని గీతాలు

నీకు బాధంటే అసలు తెలీనే తెలీదేమోనని...

నాలోని లోతైన మాటల్ని నీతో చెప్పాలని వేదన పడతాను.
నువ్వు నవ్వుతావేమోనని భయం.
అందుకని నన్ను చూసి నేనే నవ్వుకుని
నా రహస్యాన్ని పరిహాసంలో వెదచల్లేస్తాను.
నా బాధని నువ్వు తేలిక చేస్తావేమోనని నేనే తేలిక చేసుకుంటాను.

నీతో చెప్పాలనుకున్న అసలు నిజమైన మాటల్ని
నీకు చెప్పాలని వాంఛిస్తాను.
కాని వాటిని నమ్మవేమోనని వూరుకుంటాను.
అందుకనే నేను అనుకున్న దానికి విరుద్దంగా
మాట్లాడి వాటిని అనృతంలో దాస్తాను.
నా ఆవేదనని నువ్వు హేళన చేస్తావేమోనని
నేను దాన్ని అర్థం లేకుండా మారుస్తాను.

నీకోసం నాలో వున్న విలువైన మాటల్ని పలుకుదామని
ఆశ పడతాను. కాని నువు వాటికి సరైన విలువనివ్వవని
భయపడి వూరుకుంటాను. అందుకనే నీకు
కఠినమైన పేర్లు పెట్టి మార్దవం లేని
కర్కశురాలివని ప్రగల్భాలు పలుకుతాను
నీకు బాధంటే అసలు తెలీనే తెలీదేమోనని నిన్ను గాయం చేస్తాను.

నీ పక్కనే నిశ్శబ్దంగా కూచోవాలని , వాంఛిస్తాను.
కాని నా పెదవుల్లోంచి నా హృదయం బయలు పడుతుందేమోనని
అధైర్యపడతాను. నా వేదనని మొరటుగా వాడతాను.
నువ్వే అట్లా చేస్తావేమోనని వెరచి

నేను నీనించి దూరంగా పోదామనుకుంటాను.
కాని నాకాధైర్యం లేదు. నా పిరికితనం నీకు
తెలిసిపోతుందేమోనని భయం .
అందుకనే నా తలని ఠీవిగా పైకెత్తి, నిర్లక్ష్యంగా నీ సమక్షానికి వొస్తాను.
నీ కళ్ళనించి అంతులేని ఘాతాలు నా గాయాల్ని మాననీవు

ఠాగూరు గారి ఒక గీతానికి స్వేఛ్చానువాదం!

దుమ్ము కొట్టుకుపోయిన బట్టలతో
గోడ వారగా నేలపై
నిద్రతో వొరిగి వున్నాడో యువ యోగి.
ఆరిపోయిన దీపాలు ,
మూసేసిన నగరపు గేట్లు,
నక్షత్రాలన్నీ నల్లని మేఘాలతో
కప్పిన ఆ రాత్రిలో...

హఠాత్తుగా అతని హృదయం వొణికింది.
అడుగులు ఘల్లుమంటో దగ్గిరవతోన్న చప్పుడు.
కలవరంగా కళ్లు తెరిచాడతడు.
ఆమె పట్టుకున్న దీపపు కాంతిలో అతని దయాపూరితమైన కళ్లు మెరిశాయి.
ఆ యువతి నాట్యకత్తె. ఆమె కళ్లు యవ్వనోత్సాహం నింపుకున్నాయి.
దీపపు కాంతిని చిన్నగా చేసి అంది.
' మీ క్షమను కోరుతున్నాను.
యిహ లోకపు సుఖాలన్నింటినీ త్యజించిన యువకుడా!
ధూళి నిండిన యీ పానుపు వీడి అందమైన నా మహలుకు రండి'.
'జవ్వనీ నీ దార్లో వెళ్లిపో .
సమయమొచ్చినపుడు నేను రాకుండా వుండను '.

*

ఆ నగరంపై చంద్రుడు అంతులేని ఆశలను
వెన్నెల్లో గుప్పించి కురిపిస్తున్నాడు.
దారికిరువైపులా చెట్లు తలలూపుతున్నాయి.
యెక్కణ్నించో సన్నని మురళీగానం గాల్లో తేలుతో.
ఆ దేవదారు చెట్ల మీంచి యేవో విషాద పాటలు ప్రవహిస్తున్నాయి.
అందరూ వొదిలేసిన ఆ వొంటరి వీధి వెంబడి
ఆ నగరపు గేట్లను దాటాడు ఆ యువ యోగి.
ఆ నగరపు గోడ నీడలో ఓ స్త్రీ , శరీరంపై మచ్చలతో .
యువకుడు కూచుని ఆమె తలని వొడిలోకి తీసుకున్నాడు.
ఆమె అంది 'దయను కురిపించే మీరు ధన్యులు.
యింతకీ యెవరు మీరు?'

'నీకిచ్చిన మాట ప్రకారం నేను వచ్చాను

మరణశయ్య

నా మరణశయ్య పక్కనుండి నువ్వెళుతున్నప్పుడు
వో పుష్ప గుఛ్చాన్ని వుంచుతావేమోనని ఆరాటపడ్డాను.
నీ స్పర్శతో పునరుజ్జీవనడవుతాననే
ఆశతో నీ వైపు దీనంగా చూశాను.

నీ కన్నీటి స్పర్శ నన్ను అమరుణ్ణి చేస్తుందని
నీ కంటి నుండి వొక్క చుక్కైనా రాలుతుందేమోనని
నిస్తేజంగా నీ వైపు చూశాను.

జాలిలేని నీ హృదయాన్ని యింకా యింకా కోరుకోవడం
మృత్యువుని నా దగ్గిరనుంచి యింకా యింకా దూరం చేస్తోంది.
నాకు వూపిరాడకుండా వుంది యీ సగం చావుతో.

నాకింక పొద్దు పొడవని గాఢమైన నిద్ర ఎపుడు లభిస్తుంది?

నువ్వు నిశ్చబ్దమైన వేళ !

నువ్వు నిశ్చబ్దమైనపుడు నాలో నువ్వు శబ్దమవుతున్నావ్!
గుండె గగనతలమంతా ఎడతెగని మహా విస్ఫోటనాలతో పగులుతున్నపుడు,
విశ్వాంతరాళాల్లోకి నల్లని వానరాతిరిలా పరుచుకుంటోన్న యేదో రహస్యం లాంటి నిశ్చబ్దం.

జీవితానికావలితీరాలనుంచి స్తబ్దతా గీతాలు నిశ్చబ్దంగా ప్రవహిస్తో
శబ్దం నిశ్చలమవుతో నిశ్చబ్దమై నన్ను ఆపాదమస్తకం అలుముకుంటోంది.

చెలీ!
ఏ నిశ్చబ్దశబ్ద ప్రకంపనాల మధ్య
ఏమిటి నీకళ్లు చెమ్మగిల్లుతున్నాయ్.

నువ్వూ నేననే మహా రూపోత్సవపు స్వప్నాలన్నీ శబ్దమవుతున్న వేళ
నీ నిశ్చబ్ద మహా భినిష్క్రమణం వేళ కాని వేళ !