పెట్టుబడికి, శ్రమ కి తేడా ఏంటి ?
టీచర్ : పెట్టుబడికి, శ్రమ కి తేడా ఏంటి ?
హరి : మీరు ఒక వ్యక్తి కి డబ్బు అప్పిచ్చారనుకోండి, మీరు అప్పు ఇచ్చిన డబ్బు పెట్టుబడి. దాన్ని మీరు అతని దగ్గర నుంచి వసూలు
చేయడానికి చేసే ప్రయత్నాలు శ్రమ.
---------------------------------------------------------------------
వారెవ్వా! ఏమి చెప్పేవు
చిన వెంగళప్ప : అన్నయ్య !' గో ' కి వెర్బ్ ఫామ్స్ చెప్పవా !
పెద వెంగళప్ప : వేరి సింపుల్ రా, GO , GOKED , GOKEN .
---------------------------------------------------------------------
18, మే 2011, బుధవారం
నభూతో... నభవిష్యత్
మారిషస్
లెక్కలేనన్ని బీచ్ లతో, పచ్చని కొండలు, అడవులతో అందంగా ఉండే ద్వీపం మారిషెస్. ఈ సమయంలో అక్కడ కొద్దిగా ఎండతో, అప్పుడప్పుడు చిరుజల్లులతో, 24 డిగ్రీల మినిమం టెంపరేచర్ తో గమ్మతైన శీతాకాల వాతావరణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హనీమూన్లకు ఈ సమయం అనువైనదిగా చెబుతారు. బీచ్ లకు పెట్టింది పేరు అయిన మారిషెస్ లో బ్లూబే బీచ్, పెరేయ్బెరే బీచ్, లా ప్రేనేఉసే బీచ్ వంటి తదితర బీచ్ లు కేవలం పర్యటకులనే కాకుండా షూటింగుల కోసం సినిమా వాళ్ళను కూడా అమితంగా ఆకర్షిస్తాయి.

కొన్ని ఆలోచనలు..
ఇష్టం
ఇష్టానికి మరణం ఉండదు
ఇష్టం ఉన్నపుడు కష్టానికి జననం ఉండదు!
-----------------------------------------------------
అతను - ఆమె
అతను - చందమామ
ఆమె - వెన్నెలమ్మ
చందమామ, వెన్నెలమ్మ రెండు కాదు ఒకటే.
---------------------------------------------------------
ప్రేమంటే...
ఒక్కోసారి అనిపిస్తుంది ప్రేమంటే -
"రెండు బలహీన హృదయాలు చాలా బలంగా ఇష్టపడడం" అని.
----------------------------------------------------------------
మన ప్రాణాలన్నీ...
నీ ఒంట్లో నలతగా ఉందంటేనే
నా మనసు ఎంతో కలత చెందుతుంది!
నా పంచ ప్రాణాలూ నీ ఒక్క ప్రాణమే అంటే
నా ఒక్క ప్రాణం కోసం నీ పంచ ప్రాణాలు పనంగా పెట్టవా?
మన ప్రేమలో ఒక్కోసారి నాకు బలంగా అనిపిస్తుంది-
కష్టం నీది అనుభవించాలని.. సంతోషం నీతో అనుభవించాలని...

పాత మిత్రులు ఒక్కటవుతారా
పాత మిత్రులు ఒక్కటవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దువ్వుతున్నట్లు ప్రచారం సాగుతోంది. స్టార్ అట్రాక్షన్ కోసమే కాకుండా సామాజిక వర్గంలో సమతౌల్యం కోసం చంద్రబాబును దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. తన బావమరిది హరికృష్ణ, మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్ తనపై కత్తి కట్టిన నేపథ్యంలో మోహన్ బాబును చేరదీయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ పెళ్లిలో చంద్రబాబు మోహన్ బాబుతో మాట్లాడుతూ చంద్రబాబు ఎక్కువ సమయం గడిపారు. బావ మరిది, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణతో ఆయన ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. తాను కుదిర్చిన పెళ్లి కాబట్టి చంద్రాబాబు కాస్తా హడావిడి చేసినట్లు భావిస్తున్నారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కూడా ఏ విధమైన విభేదాలు లేనట్లే పెళ్లిలో జూనియర్ ఎన్టీఆర్‌తో వ్యవహరించారు.

సూర్యనమస్కారం.. సమస్యలు దూరం
వేకువనే నిద్ర లేచి దినచర్య మొదలుపెడితే.. మానసికంగా, శారీరకంగా బోలెడు ప్రయోజనాలు. అలా లేచిన వెంటనే పనిలో పనిగా లేలేత భానుడికి నమస్కారాలు చేయాలని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దానివల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావంటున్నాయి.
సూర్యనమస్కారాలు చేయడం వల్ల గుండెకు చాలా మేలు జరుగుతుంది. కవాటాలకు రక్త సరఫరా చురుగ్గా ఉంటుంది. అలాగే రక్తంలో ప్రాణవాయువు శాతమూ సజావుగా సాగుతుందని చెబుతున్నాయి అధ్యయనాలు.
అజీర్తి సమస్యలు ఉన్నవారు.. నిపుణుల సూచనలతో సూర్యనమస్కారాలు చేయాలి. దీనివల్ల ఎంతో మార్పు ఉంటుంది. అలాగే నాడీవ్యవస్థా చురుగ్గా పనిచేస్తుంది. శ్యాసకోస సమస్యలుంటే దూరమవుతాయి. ఒత్తిడి, మానసిక కుంగుబాటు వంటివి దూరమై తనువు, మనసు ఉత్తేజితమవుతాయి.
నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికీ ఇది చక్కని పరిష్కారం. ఇలాంటి వారు నిశబ్ద వాతావరణంలో సూర్యనమస్కారాలు చేయాలి. చాలా మార్పు కనిపిస్తుంది. బద్ధకం వదిలి రోజంతా చురుగ్గా ఉల్లాసంగా ఉండాలన్నా సరే.. దీనిని మించిన ప్రత్యామ్నాయం లేదు. చేస్తున్న పనిపట్ల శ్రద్ధ, ఏకాగ్రత అలవడుతుంది.
వూబకాయం ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. క్రమం తప్పకుండా చేయడం వల్ల ఉదర కండరాలు దృఢమవుతాయి. పొట్ట చుట్టూ పేరుకొన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. సూర్య కిరణాల ప్రభావంతో శరీరంలోని అధిక కెలొరీలు ఖర్చవుతాయి. కొవ్వు నిల్వలు కరిగిపోతాయి. వెన్నెముక దృఢమవుతుంది. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. శరీరం తాజాదనాన్ని సంతరించుకున్న మార్పు ఇట్టే కనిపిస్తుంది.
నెలసరి సంబంధ సమస్యలతో బాధపడేవారు తరచూ వీటిని చేయడం మంచిది. అధ్యయనాల ప్రకారం.. యుక్తవయసు నుంచి సూర్యనమస్కారం చేయడం వల్ల భవిష్యత్‌లో ప్రసవ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను చాలామటుకు నివారించవచ్చు.
లేలేత, నులివెచ్చని సూర్యకిరణాలు ముఖాన్ని తాకితే చర్మానికి మేలు జరుగుతుంది. ముడతలు తొలగిపోతాయి.. వృద్ధాప్య చాయలు కనిపించవు. జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చుండ్రు సమస్యను సైతం నివారించవచ్చు.
అయితే... వీటిని చేసేముందు.. వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)