31, మే 2011, మంగళవారం

వీళ్ళను తెలబాన్లు అంటే తప్పేంటి

ఉస్మానియా విద్యార్థుల ముసుగుల్లో ఉన్మాదులు
ఊరకుక్కల్లా ఊగిపోతూ
దాష్టీకాలు చేస్తే దానిని ఉద్యమం అనాలి.

తిరగబడి ఎదురు దాడి చేస్తే
ఉద్యమ కారులపైన దౌర్జన్యం అని ఖండించాలి.

అదే ఉన్మాదులు
ఇచ్చే పాలకుల దగ్గర పిల్లుల్లా ఉంటే
ఉలుకూ పలుకూ లేని ఉన్మాదుల నాయకుడిని
ఉద్యమ నాయకుడు అని ఒప్పుకోవాలి.

ప్రజాస్వామ్యంలో పక్క పార్టీలను అణచడానికి
ఆచరిస్తున్న పెడ ధోరణులకు
ఉద్యమం అని పేరెట్టుకొని
పెట్రేగి పోతున్న వీళ్ళను తెలబాన్లు అంటే తప్పేంటి.

రాజకీయాల కోసం మామ కోపాన్ని దిగమింగుకొన్నాడు.

అల్లుడా మజాకా
చూసి అలా తానూ అవ్వాలనో ఏమిటో
చిరంజీవికే అల్లుడై
అల్లుడా మజాకా చూపిస్తే
రాజకీయాల కోసం మామ కోపాన్ని
దిగమింగుకొన్నాడు.

ఎందుకోసమైతే తను సహించాడో
అదే రానప్పుడు
అసలు రూపం చూపాడు అల్లుడికి.

పాపం సుప్రీం కోర్టు కూడా సుప్రీం హీరో అల్లుడికి
బైలు నిరాకరించింది.

విశ్వసనీయతకు మారు పేరైన కుక్కలు.

రాజా గారు జనాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చి
తమకు ఇచ్చే లోపుల పోయాడని
రోశయ్య నుండి కిరణ్ వరకు ఇస్తారేమో నని
చూసి విసిగి అలిగి
అరిచే ఓపిక కూడా లేక
జనాలను కరుస్తూ తమ నిరసన తెలుపుతున్నాయి
విశ్వసనీయతకు మారు పేరైన కుక్కలు.

విశ్వసనీయతకు మారు పేరైన
ఆయనే ఉంటే ఆరోగ్య శ్రీ కార్డు వచ్చి
రేబిస్ రాకుండా టీకాలు వేయించుకొని ఉండేవేమో.

కనీసం ఉండవల్లి లాంటి వాళ్ళు కూడా
జరుగుతున్నా అన్యాయం పై
ఉలుకూ పలుకూ లేకపోయే సరికి
పౌరుషం వచ్చిందేమో.

దానితో పాటు పొద్దున్న
తాము అరవడం కన్నా ముందే
తమ బాషను రాజకీయ నాయకులు
యదేక్షగా టీ వీ లైవ్ షో లలో వాడేసుకొంటూ
తిట్టుకోడానికి తమతో కంపేర్ చేసుకొంటున్నారని
కంపరమెత్తి కక్ష గట్టాయా అన్నట్టుగా
అన్నిప్రాంతాల్లో ఏ పార్టీ కూడా చొచ్చుకు పోలేక
విఫలమౌతున్న సమయానా
ఇవి మాత్రం సందు సందు కూ సందడి చేస్తూ
అన్ని ప్రాంతాల్లోనూ తమ ప్రతాపం చూపిస్తున్నాయి.

ఏడుపు తుడిచే పని ప్రస్తుతానికి ఆపినా..

కొత్తగా కట్టిన అసెంబ్లీ
అమ్మకానికి పెడుతున్నారంటగా
మా మహా నేత తనయుడు యువనేత
దక్షిణాదిలో ప్రతి రాష్ట్రంలో
ఓ కోట ఉండేలా చూసుకొంటున్నాడు
మీదే కొనేస్తాడు
కానీ మీరు కొంచం సమయం ఇవ్వాలి
ఏడుపు తుడిచే పని ప్రస్తుతానికి ఆపినా
కన్నెర్ర చేసే కార్యక్రమం ఒకటి పెట్టుకొన్నారు
అదైన వెంటనే
దేవుడు దగ్గర ప్లీనరీ ఒకటి పెట్టుకొన్నారు
దానితో చిరంజీవి తరువాత
సునామీ సృష్టించేది తామే అని
నిరూపించుకొనే పనిలో
నిమిషం తీరిక లేకున్నారు.

రాజ్యం నేతకు ఆటలో అరటిపండు స్థానం ఇచ్చారు.

అధికారం ఇవ్వండి అని సునామీ సృష్టిస్తే
ఎగబడి వచ్చి చూసి ఎన్నో ఆశలు కల్పించిన జనాలు
రాజ్యం నేతకు ఆటలో అరటిపండు స్థానం ఇచ్చారు.

ఆ తరువాత పక్కలో బల్లెంలా తయారైన మీడియా
ప్రతిసారీ ప్రతి విషయం లో
రేటింగుల కోసం అరటి పండును చేసారు.

గౌరవ నిమజ్జనానికి
జనపద్ దగ్గర పడిగాపులు కాస్తూ
ఏదన్న విదిలిస్తారు అని ఎదురు చూస్తుంటే
ఎం ఎల్ సీ ఎంగిలి మెతుకులు కూడా విదల్చక
ఆటలో అరటిపండు స్థానానికి
భంగం వాటిల్లకుండా
వాటేసుకొంటామని వంచిస్తున్నారు.