8, నవంబర్ 2011, మంగళవారం

ధనం కోసం ధర్మ యుద్ధం చేస్తున్న ధర్మ ప్రభువులు

మా తాతల కాలం నుండి దొరలము
పన్నులు కట్టిన సంపన్నులము అని
సంకలు గుద్దుకుంటూ
చోర కళ తో సంపాదించిన
కరపత్రాలతో
రాష్ట్రంలో రాద్దాంతం చేస్తూ

కోటల్లోకి
వ్యాపార సామ్రాజ్యాల్లోకి
న్యాయ దేవత వడి వడి గా వస్తుంటే
ఆపడానికి

ఓ ప్రక్క ధర్మ యుద్ధం పేరుతో
బెదిరించ చూసి భంగపడి

మరో ప్రక్క అవినీతి ధనంతో
అత్యంత ఖరీదైన న్యాయ వాదులతో
సుప్రీం లో వాదించి
న్యాయ దేవత అడుగులను నిలువరించ చూస్తే

ఆ దేవత కూడా ‘దేవుడి’ బిడ్డను చిన్న చూపే చూసింది

ధనం కోసం ధర్మ యుద్ధం చేస్తున్న
ధర్మ ప్రభువులు

తమను ఎన్నుకొన్న ప్రజలు
తమ రాజకీయ జీవితాలకు
పాతరలు వేయక ముందే
మేల్కోండి

ప్రాణం అంటే పూచిక పుల్లలా తీసేస్తూ
అవినీతి పై ప్రభువులను
పరుగులు పెట్టిస్తున్న
పండుటాకులను చూసైనా
ప్రజల సొమ్ము కాపాడ
కలసి రండి

ధర్మ యుద్ధమని చేస్తున్న
ధన యుద్ధంలో
గెలుపు దక్కదని తెలుసుకోండి.

ఎలా పోయినా ఆర్థికంగా ఆదుకొంటారు.

అయితే నిత్య ఓదార్పు సభ్యులకు
నిమిషాల్లో సమాచారాన్ని చేరవేయండి.

మీ వాళ్ళు వాళ్ళపై జరుగుతున్న దాడులకు
గుండె పగిలి పోయారని
వాళ్ళు మీడియా కవరేజి ఇచ్చి
ఏదో ఓ రోజు మళ్ళీ
మందీ మార్బలంతో మీవాళ్ళ ఇంటికి వచ్చి
ఓదార్చి పోతారు.

ఎలా పోయినా
పోయిన దేవుడి భక్తులని
ఆర్థికంగా ఆదుకొంటారు.

సత్యం రాజు లా నిజాయితీ చూపారు......................

దొరికే వరకు దొంగ కూడా దొరే
చిక్కాక
చికాకు ప్రశ్నలకు
పట్టుబడుతారు

ఇవన్నీ జరగక ముందే
అనుమానపు చూపులు నిలిచినపుడు
ఎవరూ నేను దోషి అని
సత్యం రాజు లా నిజాయితీ చూపారు

ప్రతి వాడు ఇంకోడు జాతీ గా లేదు
అని జారుకోవాలనే చూస్తారు
తను జాతీ గా లేను అని
జన్మలో ఒప్పుకోరు
ప్రశ్నల జడివానతో జడిపిస్తే తప్ప

దొర దొంగయ్యే సమయం దరిదాపుల్లోకి వచ్చింది
అందుకే దడ మొదలయ్యింది
రాజకీయాలు విరక్తిగా కనిపిస్తోంది
ఒప్పుకోవడంలో నిజాయితీ చూపిస్తే
కనీస సానుభూతి దొరుకుతుంది

ఎవడూ జాతీగా లేదు
నన్ను మాత్రం జప్తెందుకు చేస్తారు అని
ఎదురు ప్రశ్నలతో జవాబును సానుభూతి రూపంలో
పొందాలని చూస్తే
చూసే వాళ్లకు చులకనవ్వడం తప్ప
చస్తే సానుభూతి దక్కదు.