25, జనవరి 2011, మంగళవారం

సుఖం

ఆండాళ్ ,భర్త బతికున్నంత కాలం పట్టించుకొనలేదు .ఈ మధ్యనే పైకెళ్ళి పోయాడు శ్యామసుందరం. అప్పటి నుండీ ఆమెకు ,సుందరం లేని లోటు బాగా అనుభవం లోకి వచ్చింది.తను చేసిన తప్పులకు బాధ పడింది.ఎలాగైనా సుందరాన్ని క్షమించమని అడగాలనుకొంది. ఉగ్రానంద స్వామి వారి సహాయంతో సుందరం ఆత్మతో మాట్లాడ గలిగింది ,

" ఏవండీ, నేను ఆండాళ్ ని, మిమ్మల్ని బాగా బాధ పెట్టాను,క్షమించండి.నాతో ఒక్కసారి మాట్లాడండి"

" చెప్పు ఆండాళ్ళు , ఎలా ఉన్నావు ? "

"మీరు వెళ్ళిన తరువాత ఇక్కడ నాకు ఏమీ బాగా లేదు .మీరెలా ఉన్నారు ? "

"నేను బానే ఉన్నాను "

" ఇక్కడ ఉన్నప్పటి కంటే బాగున్నారా ? "

"నాకు ఇక్కడ చాలా బాగుంది "

" అంటే మీరు స్వర్గం లో ఉన్నారా ? "

" లేదు , నరకం అంధకూపం లో "

సిగ్గులేని బండ

రైతులు చస్తున్నారంటే
సన్నాసి వైరాగ్యాన్ని చూపించి
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై
తక్షణమే స్పందించి
అధిక ధరలపై
49రూ. 99రూ. లకే
రక రకాల కూరగాయలు అని ప్రకటించి
ఆచరణలో చేతులెత్తేసి
రచ్చ బండ దగ్గర చర్చ చేద్దామని వచ్చే
వీళ్ళను చూసి
రచ్చ బండే సిగ్గు పడుతుందేమో

మనవాళ్ళకు దక్కాల్సిన అందలానికి మన అంధత్వమే అడ్డవుతోందా

అనగనగా ఒక ధీరుడు గురించి మన అంతర్జాల సమీక్షకులు చిన్నపిల్లలు చూసే సినిమా గా తేల్చేసారు.
కానీ నా దృష్టిలో అది ప్రతి ఒక్క తెలుగువాడు చూసి ఆనందించదగిన చిత్రంగా అనిపించింది.
ప్రతినాయకి గా మంచు లక్ష్మి నటన ప్రత్యేకం. దానికన్నా ప్రత్యేకమయినది దర్శకుని ప్రతిభ.
మొదటి నుండి చివరి వరకు కనులు ఆరగించే విందులో రెప్ప పాటు వల్లా ఏమన్నా తప్పిపోతామో అని సంకోచించే దృశ్య కావ్యం. అంతర్జాతీయ స్థాయి కి తగ్గకుండా డిస్నీ తో కలిసి మన దర్శకేంద్రుని కుమారుడు తీసాడు. సాంకేతికంగా మన తెలుగు సినీ స్థాయి ఒక మెట్టు ముందుకు పడింది. ఒక అరవోడు కాని ఇందులో అర్ధ స్థాయి కి చేరినా అరిచి గోల చేసే వారు. వారితో పాటు పొరిగింటి పులగూర పొగడ్త రాయుళ్ళు రెచ్చి పోయేవారు.
కానీ మనవాళ్ళకు దక్కాల్సిన అందలానికి మన అంధత్వమే అడ్డవుతోందా అనిపిస్తోంది.