16, జూన్ 2011, గురువారం

కాఫీ మేలు కూడా చేస్తుంది..!

కాఫీ ప్రియులకు ఓ శుభవార్త. కాఫీతో కొన్ని ఆరోగ్యకరమైన లాభాలు కూడా ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలడం విశేషం. ఇప్పటివరకు కాఫీ సేవనం అనారోగ్య వ్యసనంగా భావిస్తుండగా ఈ వార్త కాఫీ ప్రియులను మరింత ఉత్సాహపరుస్తుంది. ప్రతిరోజు నాలుగు, అయిదు సార్లయినా కాఫీ తాగనిదే ఉండలేరు కొందరు కాఫీ ప్రియులు. కాఫీ తాగకుంటే నీరసంగా అనిపిస్తోందని భావిస్తూ దీన్ని సేవిస్తారు. చివరికి కాఫీ వారికి వ్యసనంగా మారుతుంది. ఈ వ్యసనం నుంచి ఎలా బయటపడాలా అని కొందరు ఆలోచిస్తుం టారు. కానీ కాఫీ మరీ అనారోగ్యకరమైన వ్యసనమేమి కాదని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. కాఉత్సాహపరుస్తుంది. ఫీతో కొన్ని ఆరోగ్యకరమైన లాభాలు కూడా ఉన్నాయని ఈ అధ్యయనంలో తేలింది.

టైప్‌ 2 డయాబెటిస్‌, గుండె సంబంధింత వ్యాధులు, సమస్యలతో బాధపడేవారికి కాఫీ మేలు చేస్తుందని తెలిసింది. కానీ దీంఓ కొన్ని సైడ్‌ ఎఫెక్ట్‌లు కూడా ఉన్నాయని తేలింది. కాఫీలోని కెఫీన్‌ మూలంగా శరీరంలో ఒకరకమైన వ్యాధి నిరోధక శక్తి అనూహ్యంగా పెరుగుతుంది. ఫలితంగా ఈ శక్తి కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులు, క్యాన్సర్‌, టైప్‌2 డయాబెటిస్‌ సమస్యలను నివారిస్తుంది. కాఫీలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కప్పు కాఫీలో 6 కేలరీలు ఉంటే అందులో కలిపే చక్కెరలో 23 నుంచి 27 కేలరీలు ఉంటాయి. కాఫీలో చక్కెర కలపకుంటే కేలరీలు పెరిగే సమస్యే ఉండదు.

లో బ్లడ్‌ ప్రెషర్‌తో బాధపడే వారికి కాఫీ ఎంతో మేలు చేస్తుంది. దీన్ని సేవిస్తే బ్లడ్‌ ప్రెషర్‌ లెవెల్స్‌ క్రమ,క్రమంగా పెరుగుతాయి. కానీ ఎక్కువగా కాఫీ తీసుకుంటే శరీరంలో యాంటిఆక్సిడెంట్స్‌ పెరుగుతాయి. ఫలితంగా గుండెలో మండినట్టవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఏర్పడతాయి. కాఫీ ఎక్కువగా తీసుకుంటే ‘కాఫీ జిట్టర్స్‌’ అనే స్థితికి చేరుకుంటారు. కెఫీన్‌ ఎక్కువగా శరీరంలో చేరడం వల్ల యాంగ్టిటీతో పాటు నిద్రలేమి సమస్యలు కూడా ఏర్పడతాయి. ఎక్కువగా దీన్ని సేవిస్తే ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కాఫీని అవసరమైన మేరకు సేవిస్తేనే మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.