రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా..! ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌కు, పీసీసీ కొత్త నేత బొత్స సత్యనారాయణకు మధ్య రాజకీయ కురుక్షేత్రానికి బీజాలు పడ్డాయా..! విరుద్ధ వాతావరణాన్ని కాంగ్రెస్ అధిష్ఠానమే ఏరి కోరి వాంఛిస్తున్నదా..! అందులో భాగంగానే ఈ సర...ికొత్త సమీకరణాలకు తెర తీసిందా..! ఇప్పటిేక వైరంతో... రాజకీయ విభేదాలతో... అంటీ ముట్టనట్టున్న ఇద్దరు నేతలను కీలక పదవులతో దరి చేర్చే వ్యూహంలోని పరమార్థం అర్థంకాక కాంగ్రెస్ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారుు. మెుత్తం మీద ఇది కాంగ్రెస్‌లో రెండు ప్రధాన కులాల మధ్య సం‘కుల’ సమరంగా మారబోతు న్నదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నారుు..!
రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న అస్తవ్యస్థ పరిస్థితిని యుద్ధప్రాతిపదికన చ క్కదిద్ది, అన్ని ఖాళీలూ భర్తీ చేసిన పార్టీ నాయకత్వం ఇద్దరు ప్రముఖుల మధ్య పెట్టిన పోటీ ఆసక్తి కలిగిస్తోంది. సీఎం కిరణ్ వ్యతిరేకించే బొత్స సత్యనారాయణకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడంతో మళ్లీ చాలా ఏళ్ల తర్వాత విభజించిపాలించే రాజనీతికి తెర లేచిన ట్టయింది. వైఎస్ అనుభవాన్ని దృష్టిలో ఉంచు కున్న నాయకత్వం ఆంధ్రలో మళ్లీ అలాంటి చేదు ఫలితాలు ఎదురుకాకుండా ఇప్పటినుంచే విభ జించి పాలించే సూత్రాన్ని అమలుచేస్తుండటం చర్చనీ యాంశమయింది. సుదీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న స్పీకర్-డిప్యూటీ స్పీకర్- మండలి చైర్మన్-వైస్ చైర్మన్ పదవులను చకచకా భర్తీ చేసిన నాయకత్వం అదే ఊపులో పీసీసీ అధ్యక్ష పదవి కూడా భర్తీ చేసి, పార్టీకి సంబంధించిన అనిశ్చితిని పూర్తిగా తొలగిం చింది.
అయి తే... ఎవరూ ఊహించని విధంగా ఉత్త రాంధ్రకు చెందిన బొత్సకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశమయింది. ఎవరూ ఊ హించని విధంగా తెలంగాణ కోటా కాదని, ఆ స్థానంలో పీసీసీ పగ్గాలు అందు కున్న బొత్స, సీఎం కిరణ్‌కు చెక్ పెడతారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో బాహాటంగానే జరుగుతోంది. కిరణ్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనప్పటికీ... సీని యర్ అయినా ఆయనకు ఇతరులతో చొరవ తీసుకునే లక్షణం గానీ, అందరినీ సమన్వయం చేసుకునే శైలిగానీ లేవు. ఫలితంగా పార్టీకి- ప్రభుత్వానికి దూరం పెరుగు తోంది.
సీనియర్ మంత్రులు కిరణ్‌ను మానసికంగా సీఎంగా అంగీకరించడం లేదు. అసలు బొత్సకు పీసీసీ ఇవ్వడం సీఎంకు సుతరాము ఇష్టం లేదన్నది బహిరంగ రహస్యం. దూకుడుగా వెళ్లడం, చొర వ తీసుకుని అన్ని వర్గాలను దగ్గరకు తీసే నైజం ఉన్న బొత్సకు పీసీసీ పగ్గాలు ఇస్తే తనకు ఏకుమేకవుతారన్న భయం కిరణ్‌లో లేకపోలేదంటున్నారు. అందుకే బొత్సకు అవకాశాలు రాకుండా అడ్డుపడుతూ వస్తున్నారు. మొన్నటి వరకూ పీసీసీ చీఫ్‌గా పనిచేసిన డీఎస్‌కు మండలి సభ్యత్వం దక్కకుండా చూడటంలో విజయం సాధించిన కిరణ్, ఈసారి బొత్స విషయంలో మాత్రం సఫలం కాలేకపోయారు.
స్పీకర్‌గా నాదెండ్ల మనోహర్, మండలి చైర్మన్ చక్రపాణికి ఆ పదవులు రాకుండా కిరణ్ అడ్డుపడినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చక్రం తిప్పడంతో వారిద్దరికీ ఆ పదవులు దక్కాయన్నది బహిరంగ రహస్యం. అదే సమయంలో బొత్స విషయంలో కూడా రోశయ్య సిఫారసు పనిచేసిందని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. అసలు రాష్ట్రంలో పార్టీ-ప్రభుత్వానికి సంబంధించి ఇటీవల జరిగిన ఏ ఒక్క నియామకం కూడా కిరణ్‌కు ముందస్తు సమాచారం కూడా లేదన్న ప్రచారం జరుగుతోంది.
బొత్స పీసీసీ సారథిగా రావడంతో కిరణ్‌కు కష్టాలు తప్పవంటున్నారు.
అన్ని వర్గాలతో సన్నిహితంగా వ్యవహరించే బొత్స పార్టీ నేతలందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి, సమాంతర పాలన సాగిస్తే కొత్త సమస్యలొస్తాయన్న ఆందోళన కూడా లేకపోలేదంటున్నారు. మంత్రులు-ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటే భవిష్యత్తులో తనకు ప్రమాదమేనన్న ఆందోళన కూడా కిరణ్‌కు ఉందని చెబుతున్నారు.ప్రభుత్వంతో పార్టీని సమాంతరంగా నడిపిస్తే కిరణ్ ఇమేజ్ కంటే, బొత్స ఇమేజే సహజంగా ఎక్కువ పెరుగుతుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గతంలో వైఎస్ ఉన్నప్పుడు డీఎస్ పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పటికీ, ఆయన డీఎస్‌ను ఏ విషయంలోనూ జోక్యం చేసుకునే అవకాశం ఇచ్చేవారు కాదు. అధిష్ఠానం వద్ద వైఎస్‌కు ఉన్న పలుకుబడి గ్రహించిన డీఎస్ మౌనంగానే ఉండేవారు. దానితో పార్టీ వైఎస్ చుట్టూ తిరిగి, చివరకు కాంగ్రెస్‌ను ఓ ప్రాంతీయపార్టీగా మారింది. వైఎస్ మృతి చెందిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ ముక్కలయిపోవడంతో పార్టీకి తాను చేసిన తప్పేమిటో తెలిసొచ్చింది.
బొత్స నియామకం బట్టి... వైఎస్ మాదిరిగా కిరణ్ ఎదగకుండా, ఆయనకు చెక్ పెట్టి రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవాలన్న వ్యూహమే నాయకత్వ నిర్ణయాన్ని చాటుతో ంది. బొత్స సహజ మనస్తత్వ ప్రకారం.. డీఎస్‌లా మౌనంగా, అన్నిటికీ సర్దుకుని పోయే నైజం కాదు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని పటిష్టం చేసే క్రమంలో కార్పొరేషన్ చైర్మన్ నుంచి ఇతర నామినేటెడ్ పదవుల పంపిణీ వరకూ పార్టీ నేతలకు వాటా కల్పించాలని బొత్స పట్టుపట్టే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.పీసీసీ అధ్యక్షుడిగా తనను తాను నిరూపించుకున్న తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్నది బొత్స అసలు లక్ష్యం. ఆ లక్ష్యసాధన కోసమయినా బొత్స అహర్నిశలు పార్టీ కోసం కష్టపడటం ఖాయం. ఈ క్రమంలో కిరణ్-బొత్స మధ్య దూరం పెరగడం అనివార్యమని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
8, జూన్ 2011, బుధవారం
ఈ సీజన్‌లో బెస్ట్
ఎండలు తగ్గాయ్. చిరుజల్లులు మొదలయ్యాయి. ఒక్కసారిగా సీజన్ మారేసరికి మన శరీరం వెంటనే అడ్జస్ట్ కాలేదు. అందుకే జలుబు, తలనొప్పి, దగ్గు లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా సీజన్ మారినప్పుడల్లా ఇబ్బంది పెట్టే ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలో సూచిస్తున్నారు నిపుణులు.
* శరీరం ఫిట్‌గా ఉండాలంటే వ్యాధినిరోధక సామర్థ్యం బావుండాలి. ఇది మనం తీసుకునే ఆహారం నుంచే డెవలప్ అవుతుంది.
* ఆకుకూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ మంచి పోషకాలను అందించడమే కాదు.. వ్యాధినిరోధక శక్తిని కూడా పెంచుతాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
* ఎండాకాలంలో చల్లదనాన్ని పెంచే నిమ్మ చల్లని వాతవరణంలో తీసుకోవద్దని అనుకుంటారు. దానివల్ల జలుబు చేస్తుందన్న అపోహ కూడా చాలామందిలో ఉంది.
నిజానికి నిమ్మ వల్ల శరీరం చైతన్యవంతం అవుతుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ పునరుత్తేజితం అవుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి తరచుగా నిమ్మరసం తీసుకుంటే జలుబు లాంటి ఇబ్బందులు తగ్గుతాయి కూడా.
* శరీరం ఫిట్‌గా ఉండాలంటే వ్యాధినిరోధక సామర్థ్యం బావుండాలి. ఇది మనం తీసుకునే ఆహారం నుంచే డెవలప్ అవుతుంది.
* ఆకుకూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ మంచి పోషకాలను అందించడమే కాదు.. వ్యాధినిరోధక శక్తిని కూడా పెంచుతాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
* ఎండాకాలంలో చల్లదనాన్ని పెంచే నిమ్మ చల్లని వాతవరణంలో తీసుకోవద్దని అనుకుంటారు. దానివల్ల జలుబు చేస్తుందన్న అపోహ కూడా చాలామందిలో ఉంది.
నిజానికి నిమ్మ వల్ల శరీరం చైతన్యవంతం అవుతుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ పునరుత్తేజితం అవుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి తరచుగా నిమ్మరసం తీసుకుంటే జలుబు లాంటి ఇబ్బందులు తగ్గుతాయి కూడా.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)