ఎవరి వెర్రి వాళ్ళ కానందం అని పెద్దలు ఉరికే అనలేదు. ఆ రోజుల్లో కూడా మన రామ్ గోపాల్ వర్మ వంటి వాళ్ళు ఉండనే ఉంటారు గనుక, అలా తీర్మానించేసి ఉంటారు. నేనసలే కొంచెం మెంటల్ అని గర్వంగా చెప్పుకొంటూ బోర విరుచుకు తిరిగే రామ్ గోపాల్ వర్మ, ఆ సంగతిని మనమెక్కడ మరిచిపోతామోనని బెంగ పెట్టుకొని తరచూ తన ట్వీటార్ ద్వారా ఏదో రూపంగా మనందరికీ గుర్తు చేస్తూనే ఉంటాడు.
తనను తను మహా మేధావిగా భావించుకొంటూ ఎల్లపుడూ భ్రమలో బ్రతికే మన చెడ్డరాముడు, మొన్న మొన్నతన ట్వీటార్లో "అసలీ అన్నాహజారే ఎవరో, అతనెందుకు ఉపవాసాలు చేస్తున్నాడో" తనకసలు తెలీనే తెలీదని తన లోక జ్ఞాన్నాన్ని చాటుకోవడమే గాక, తను అండర్ వరల్డ్ గూండాల పట్ల, తన సినిమా ప్రపంచం పట్ల తప్ప మరేది ఆసక్తి చూపనని సెలవిచ్చాడు. అసలు తానెప్పుడు తిండి మానె ప్రసక్తే లేదని కూడా సెలవిచ్చాడు. తిండి మానక పోయిన ఈ దేశానికి కోత్తగా వచ్చే నష్టం ఏమి లేదుగాని, అలా పిచ్చి సినిమాలు తీయడం మానుకొంటే మాత్రం దేశానికి చాల మేలు చేసినవాడవవుతవని నా వంటి పామరులు చాల మంది అభిప్రాయ పడుతున్నట్లు వినికిడి.
ఇక అసలు విషయంలోకి వస్తే, ఈ రోజు ఆయనకీ కొన్ని ధర్మ సందేహాలు కలిగాయి. అది కూడా శ్రీ రామ నవమి నాడే అంతే!వెంటనే, తన సెల్ ఎత్తి నాలుగు ట్వీట్లు ట్వీటేసాడు. మీలోఎవరికయినా ఆయన సందేహాలకి సమాధానాలు చెప్పగలిగే జ్ఞానం ఉందని అనిపిస్తే వెంటనే ఈ క్రింద ఇచ్చిన ఆయన గారి ట్వీట్ పేజీలోకి దూరి సరయిన సమాధానాలు వ్రాసి అయన మెప్పు పొందగలరని నా విజ్ఞప్తి.
ఆయన సందేహాలివే:
1 అందరూ శ్రీరాముడి జన్మ దినాన్ని ఘనంగా జరుకొంటారు గాని, ఎవరు ఆయన ఎప్పుడు పోయాడో ఎందుకు మాట్లాడరు?
2. అసలు శ్రీ రాముడు తన స్వంత పని మీద అంటే తన భార్య సీతకోసం లంకకి వెళ్లి రావణుడితో యుద్ధం చేసి రావడం తప్ప, అతను అయోధ్య వాసులకోసం అసలేమి చేసాడు?
3. దశరధుడు తన ప్రజలని గాలికొదిలి, తన భార్య కైకేయి కోసం రాముడిని అడవికి పంపినందుకి స్వర్గంలో ఎలా స్థానం సంపాదించెడో? అందుకు ఎలా అర్హత పొంద గలిగేడో?
4. రాముడి వెంట వనవాసానికి వెళ్ళిన పతివ్రత సీత ఒకవేళ స్వర్గానికి వెళ్ళినట్లయితే మరి లక్ష్మణుడి భార్య నరకానికి వెళ్లి ఉంటుందా?
5. బహుశః స్వర్గం లోదొరికే అమృతం మంచి నిషానిచ్చే మందు అయి ఉంటుందనుకొంట, అంతే గాని అదేదో గొప్ప ఫ్రూట్ జ్యుసు కాదనుకొంటా.
6. స్వర్గంలో దొరికే అమృతం, రంభ, ఊర్వశి, తిలోత్తమ వంటి అందగత్తెలు అన్నీకూడా మగవాళ్ళకోసమే అయితే, మరి ఆడవాళ్ళకి వేరే ప్రత్యేకమయిన ఏర్పాట్లు లేక పోవడం చాల అన్యాయం. ఈ విషయంలో మన మహిళా సంస్థలు దేముడితో సంప్రదింపులు మొదలు పెట్టలిసిన అవసరముంది.
7. ఆ రోజుల్లో అసలు బాణాలు గాని లేకపోయి ఉంటే రాముడు తన తొలియుద్ధం ఎలా చేయగలిగేవాడో మరి?
8. సీతారామ లక్ష్మణులు 14 ఏళ్ళ వనవాసానికి వెళ్ళేపుడు, దశరధుడు వాళ్లకి అన్నేళ్ళకి సరిపోయే బట్టలు మూట కట్టి ఇచ్చేడా, ఇస్తే వాటన్నిటిని ఆ ముగ్గురిలో ఎవరు మోసి ఉంటారు? ఇవ్వక పోతే, 14 ఏళ్ళ పాటు వాళ్ళు ముగ్గురు కూడా ఒకే బట్టలు ధరించి వనవాసం చేసేసారా?
వ్రాయవలసినదంత వ్రాసేసిన తరువాత, తన పనికి మాలిన సస్పెన్స్ సినిమాలాగ, చివరన ఇదంతా ముప్పాళ్ళ రంగ నాయకమ్మ వ్రాసిన రామాయణ విష వృక్షంలోని సందేహాలే తప్ప నా స్వంతవి గావని ఓ ట్విస్టు కూడా ఇచ్చి ముగించేడు. తన జీవితంలో చదివిన అతి గొప్ప పుస్తకం కూడా అదేనని సెలవిచ్చేడు కూడా.
ఇప్పుడు మీకు అతని గురించి మంచి అవగాహన ఏర్పడి ఉంటుంది గనుక, మరి ఆయన వంటి మేధావిని కలవాలని తహ తహ కూడా మీలో ఏర్పడి ఉండాలి కదా? మరెందుకు ఆలస్యం వెంటనే త్వీటర్ సైటు లోకి వెళ్లి
@RGVzoomin అనే హ్యండిల్నిఅందుకొంటే మీకు మీ రాముడు ప్రత్యక్షమవుతాడు. మరింకెందుకు ఆలస్యం
22, ఏప్రిల్ 2011, శుక్రవారం
తెగ ఖర్చు చేస్తున్నారు ..ఎవడబ్బ సొమ్మని
డబ్బు ..డబ్బు ..కడపలో ఎక్కడ చూసిన డబ్బే ......ప్రజలు (ఓటర్లు ) ఎంత అందుకుంటూ న్నారో తెలియదు కాని కట్టలుకట్టాలే అట ....కొన్ని చోట్ల డబ్బును కూడా కాల్చెయ్య దాన్ని బట్టి ఎంత డబ్బు విర్జిమ్ముతున్నారో అర్ధమవుతుంది . ఈపార్టి ..ఆ పార్టి అని లేదు ..అన్ని తమకు అందినంత .....తెగ ఖర్చు చేస్తున్నారు ..ఎవడబ్బ సొమ్మని ..ప్రజల సొమ్మేకదా..""పాపం సొమ్ము ""మళ్ళి ప్రజలకే ...ఎన్నికైన తర్వాత ఎలాగు చెయ్యరని కాబోలు ఓటర్లు కూడా చెయ్య చాపుతున్నారుఅంత డబ్బు మాయం ..ఎంత ఖర్చు పెట్టిన ఎవరి ఎన్ని ఓట్లు వస్తాయి ?ఏమో ఆ దేవుడికే తెలియాలి .
నారా లోకేష్ రాజకీయ ప్రవేశానికి లైన్ క్లియర్
తన కుమారుడు నారా లోకేష్ రాజకీయ ప్రవేశానికి లైన్ క్లియర్ చేయడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తన జన్మదిన వేడుకల సందర్భంగా బుధవారం చంద్రబాబు చెప్పిన మాటలే ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. తన రాజకీయ వారసత్వం గురించి మీడియా ఊహాగానాలు చేస్తుందని ఆయన అన్నప్పటికీ లోకేష్ రాజకీయ రంగ ప్రవేశాన్ని మాత్రం కొట్టి పారేయలేదు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని తాను లోకేష్‌కు చెప్పినట్లు ఆయన తెలిపారు. ఆస్తులు పోగు చేయాలనే ఆలోచన ఉండకూడదని చెప్పినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం నారా లోకేష్ తమ కుటుంబ వ్యాపారాలను చూస్తున్నాడని, అప్పుడప్పుడు తనకు సలహాలు ఇస్తుంటాడని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు నగదు బదిలీ పథకం గురించి చెప్పింది నారా లోకేషేనని అంటారు.
ఇదిలా పుంటే, స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబమంతా తనతోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కుటుంబంతో తన బంధం మరింత పటిష్టమవుతోందని ఆయన చెప్పారు. నందమూరి బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిని తన కుమారుడు లోకేష్‌కు చేసుకోవడం ద్వారా, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కు తమ సమీప బంధువుల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తుండడం ద్వారా ఆ బంధం మరింత గట్టి పడుతోందని ఆయన అన్నారు. దీన్ని బట్టి నందమూరి కుటుంబ సభ్యులు తన మాట జవదాటకుండా, తనకు అనుకూలంగా ఉండే విధంగా పెళ్లిళ్లతో చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారని చెప్పవచ్చు.
నారా లోకేష్‌ను తన వారసుడిగా నిలబెట్టేందుకు వీలుగానే చంద్రబాబు పెళ్లిళ్ల వ్యవహారాలు నడుపుతున్నారని ఆంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో స్వర్గీయ ఎన్టీఆర్ వారసుడిగా ముందుకు రాకుండా ఉండడానికి తన సమీప బంధువు నార్నే శ్రీనివాస రావు కూతురు లక్ష్మీప్రణతిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారని అనుకోవచ్చు. ఇప్పటికే బాలకృష్ణ చంద్రబాబును వ్యతిరేకించే స్థితిలో లేరు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తనను వ్యతిరేకించకుండా చూసుకోగలితే నారా లోకేష్ రాజకీయ ఆరంగేట్రానికి ముప్పు ఉండదనేది చంద్రబాబుకు తెలుసు

ఎన్నో మానవాతీత శక్తులు వున్నాయని చెప్పుకునే బాబా, తన రోగాన్ని తాను ఎందుకు తగ్గించుకోలేక పోయాడు.
అరచేతుల నుండి బూడిద, నోటి నుండి లింగాలు, గాలి నుండి గొలుసులు తీసే సత్యసాయి బాబా, మాములు మనిషా లేక అతీతశక్తులు కలిగిన దేముడా? బాబా కి రోగం వస్తే వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్ళారు. ప్రాణం కాడికి వచ్చే సరికి వైద్యవిజ్ఞానం పైన ఆధారపడ్డారు. ఎన్నో మానవాతీత శక్తులు వున్నాయని చెప్పుకునే బాబా, తన రోగాన్ని తాను ఎందుకు తగ్గించుకోలేక పోయాడు. ఒక వైపు కిడ్నీలు, కాలేయం పాడైపోయి, ఊపిరి పీల్చుకోలేక వెంటిలేటర్ పైన బాబా మనుగడ సాగిస్తుంటే, కొన్ని టీవీ ఛానళ్లు ‘‘బాబా మళ్ళీ దర్శనం” ఇస్తారని’ ప్రచారం చేయటంలో మతలబు ఏమిటి? సత్యసాయి ట్రస్టు నడిపే ఆసుపత్రిలో పనిచేసే డా. సఫయా, బాబా ఆరోగ్య పరిస్థితిపైన తప్పుడు ప్రకటనలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. యీ ప్రకటనల విశ్వసనీయత పరీక్షించకుండా, కొంత మంది మీడియా, ఛానెళ్లు ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసం.
ఇరవైయి ఒకటవ శతాబ్దంలో మనిషి ఎంత పురోగతి సాధించినా, శాస్త్రీయ విజ్ఞానం ఎంత ప్రగతి చెందినా,అరచేతి లో స్వర్గం చూపించే బాబాలను నమ్మటం ఎంత శోచనీయం. జనం, ఆధ్యాత్మిక బాబాల మాయజాలం లో చిక్కుకుపోతున్నారు. మనిషి తన మీద తాను నమ్మకం కోల్పోయినప్పుడు, తన శక్తి సామర్ధ్యాల పైన విశ్వాసం కోల్పోయినప్పుడు, రాతి దేవుళ్ళని, అరచేతి స్వర్గం చూపే బాబాలను నమ్మడం మొదలుపెడతాడు. జనం బలహీనతలమీద బాబా గారు కోట్లాది రూపాయల ఆస్థి పోగేసుకున్నారు.
“చేతికి అంటుకున్న ఎంగిలి మెతుకులు కాకులకీ బిచ్చం వేసినట్లు” గా కొంత డబ్బును ఆసుపత్రులు, కాలేజీలపైన ఖర్చుపెట్టారు. బాబా కోటరీ లక్షలాది కోట్ల ఆస్తులతో రాజ భోగాలను అనుభవిస్తుంది. నడవలేని, మాట్లాడ లేని, ఆఖరి కి ఊపిరి తీసుకోలేని బాబాను, ఒక బొమ్మగా చేసి జగన్నాటకం ఆడుతున్నారు. ప్రముఖ తెలుగు దిన పత్రిక-టీవీ ఛానల్ పరిశోధనాత్మక రిపోర్టు ప్రకారం సత్యజిత్, డాక్టరు అయ్యర్ మరికొన్ని అదృశ్య శక్తులు బాబాను మత్తులో ముంచెత్తి, ఒక జీవచ్ఛవంగా మార్చారు. వీళ్ళ చుట్టూ బడా రాజకీయనాయకులు, గద్దె నెక్కిన మంత్రులు, పోలీసులు కాపలా కాస్తున్నారు.
కొంతమంది సత్యసాయి ట్రస్టు సభ్యులు, బాబా పైన మత్తుమందులు, డ్రగ్స్ ప్రయోగించారని ఆరోపణలు వున్నాయి. ఏబిన్ – ఆంధ్రజ్యోతి కొంత సాహసం చేసి బాబా బండారాన్ని, సత్యసాయి మందిరం చొరబడిన దొంగల కుట్రలను బయటపెట్టింది కేంద్ర ప్రభుత్వానికి చెందిన బడా నాయకులు, హోమ్-మంత్రి చిదంబరం, రాజకీయ దళారులు, పోలీసు అధికారులకు సత్యసాయి ట్రస్టు కుంభకోణం తో సంబంధం వుందని తీవ్రమైన ఆరోపణలున్నాయి.
సాయిబాబా పేరున జరుగుతున్న తతంగం లోగడ ప్రేమానంద్, ఇన్నయ్య, అబ్రహాం కోవూర్, బయట పెట్టి విచారణ జరపమని కోరారు. ఎన్.టి.రామారావు అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేయమని ఉత్తరువులు ఇస్తే, చంద్రబాబు నాయుడు , పోలీసు అధికారి దొర లోపాయికారి వ్యవహారంతో ఆపారు. బెంగుళూరు వైస్ ఛాన్సలర్ నరసింహయ్య చాలెంజ్ చేసారు. పి.వి. నరసింహరావు, వాజపేయి, చివరకు అబ్దుల్ కలాం కూడా బాబా కాళ్ళు మొక్కి సెక్యులర్ సూత్రానికి ద్రోహం చేశారు. ఇప్పుడు బాబా విషయంలో జరుగుతున్న దానిని బట్టి అతను సామాన్య వ్యక్తి అని, మహత్తులు బూటకమనీ తేలింది. టి.వి. చానళ్ళు ఆధారాలు లేని ప్రసారాలు ఆపాలి .బాబా చుట్టూ మంత్రుల ప్రదక్షిణ అనుమానాలకు తావిస్తుంది గనుక వారు ప్రజలకు సంజాయిషి చెప్పాలి. తక్షణమే బాబా ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని , గూడు పుఠాణి జరగకుండా చూడాలి.
బాబా ఆరోగ్య పరిస్థితి పైన రాష్ట్రప్రభుత్వం వాస్తవ పరిస్థితిని వెల్లడించాలి. సత్యసాయి ట్రస్టులోని లక్షలాది కోట్ల ఆస్తులను ప్రభుత్వం జాతీయం చేసి, ప్రజల ఆరోగ్య, విద్య అవసరాల కోసం వినియోగించాలి. టీవీ ప్రసారసాధనాలు బాబాలకు గుడ్డిగా భజన చేయకుండా, జర్నలిస్టు విలువలను కాపాడుతూ, వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలి. బాబాలు చెప్పే కట్టుకథలను నమ్మకుండా, శాస్త్రీయ దృక్పథం తో ఆలోచించి, విచక్షణా జ్ఞానం తో వాస్తవాలను తెలుసుకోవాలి. మానవతా విలువలతో, శాస్త్రీయ ఆలోచన విధానం తో వికసించే సమాజం కోసం కృషిచేయాలి

సత్య సాయిబాబా సజీవ సమాధి
ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో సత్య సాయిబాబా సజీవ సమాధి పొందారని ట్రస్టు ప్రకటించే అవకాశాలున్నాయని పుకార్లు పుడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు నడిచే దేవుడిగా కొలిచే సత్య సాయిబాబా గత నెల 28 తేదీ నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన చికిత్స పొందుతున్న సత్యసాయిబ ఉన్నత వైద్య శాస్త్ర సంస్థ వద్దకు పెద్ద యెత్తున భక్తులు చేరుకున్నారు. ఆయనకిప్పుడు 86 ఏళ్లు.
జీవించి ఉండగానే చైతన్యం పొందిన ఆత్మలు సమాధిలోకి వెళ్లిపోవడాన్ని సజీవ సమాధి చెందడం అంటారు. ట్రస్టు వ్యవహారాలపై చర్చించడానికి సత్యసాయి కేంద్ర ట్రస్టు సభ్యులు గురువారం అత్యవసరంగా సమావేశమైన నేపథ్యంలో సత్య సాయిబాబా సజీవ సమాధి పొందుతారనే ప్రచారం ఊపందుకుంటోంది. సత్యసాయిబాబా సోదరుడి కుమారుడు, ట్రస్టు సభ్యుడు రత్నాకర్‌కూ ఇతర సభ్యులకు మధ్య విభేదాల కారణంగా కూడా ఆ ప్రచారం జరుగుతున్నట్లు చెబుతున్నారు.
సత్య సాయిబాబా ఆరోగ్యం క్షీణిస్తుండడంపై, బాబాకు అందిస్తున్న వైద్యంపై శ్రీసత్య సాయిబాబా భక్తుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ట్రస్టు సభ్యుల వ్యవహార శైలిపై సంఘం అధ్యక్షుడు ధనంజయ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, పుట్టపర్తిలో ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది. పెద్ద యెత్తున బలగాలను దింపింది.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)