ప్రతీ మనిషి వేరొకరిని ఏదో ఒక సందర్భంలో అడిగే లేదా ప్రశ్నించే వాక్యం ఇది.
"నువ్వు నన్నర్థం చేసుకోలేదు".
కానీ ఇదే ప్రశ్న మనకి మనం వేసుకొంటే? అంటే మనం మనకి అర్థం అయ్యామా?
"పూర్తిగా" అని గుండెలమీద చేయి వేసుకొని సమాధానం చెప్పగల మగధీరుడు కానీ,నారీరత్నం గానీ తారసపడతారని ఆశించడం లేదు.
ఎందుకంటే " నేను " అనేది సంక్లిష్టతల సమాహారం.
ఇది నా చిన్నప్పుడు, మా నాన్నగారు చెపుతుండగా విన్న కథ. తర్వాత్తర్వాత నా మీద ఎంతో ప్రభావాన్ని చూపించిన కథ.
" సర్వఙ్ఞ "
అనగనగా ఒక రాజుగారికి తన రాజ్యంలో సర్వఙ్ఞులు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలనిపించింది. సర్వఙ్ఞుడంటే అన్ని విద్యలూ పరిపూర్ణంగా తెలిసినవాడని అర్ధం. అంటే ఆ వృత్తి తన కుల వృత్తా అనిపించేంత నైపుణ్యం ఉండాలన్నమాట.
రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా!
తక్షణమే చాటింపువేసారు ఫలానారోజు పోటీ అని.
అందరూ ఎవరికివారే సర్వఙ్ఞులు.
పోటీ తీవ్రంగానే జరిగింది.
ఒక్కడు మాత్రమే అన్నింటా గెలిచి చివరిదాకా నిలబడ్డాడు.
సరే! వాడే బహుమతికర్హుడు.
బహుమతి ప్రదానం రోజొచ్చింది.
ఈయబోతూ ఈయబోతూ రాజుగారు ఆగిపోయారు.
' మళ్ళీ ఏమొచ్చిందిరా ' అనుకొంటూ సభికులు నిరుత్సాహపడ్డారు.
రాజుగారు మంత్రివైపు తిరిగి " ఏమండీ! మీరే కద కమిటీ అధ్యక్షులు. పరీక్ష సక్రమంగానే జరిగిందా మంత్రిగారూ? " అంటూ ప్రశ్నించారు.
" ఆర్యా! అన్ని విద్యల్లోనూ ఇతగాడు ప్రవీణుడే సుమండి!" అంటూ మంత్రిగారు ముక్తాయించారు.
"అయినా కాని నాదో చిన్న పరీక్ష" అంటూ విజేతవైపు చూచి
" ఏమయ్యా! నీకు చెప్పులు కుట్టడం వచ్చా?" అంటూ ప్రశ్నించారు.
సభికులంతా విస్తుపొయారు. ఒక సద్బ్రాహ్మణునిచే చండాల పని చేయించడమా? అప్రయత్నంగానే అందరి చూపుడువేళ్ళూ ముక్కులపైకి పోయాయి.
అతగాడు మాత్రం తడబడలేదు.
" చిత్తం మహారాజా!" అంటూ తనకు కావాల్సిన తోళ్ళూ,దారం,కత్తీ వగైరాలు తెప్పించికొని పని మొదలు పెట్టాడు.
రాజుగారు మాత్రం తదేకదృష్టితో అతడినే పరిశీలించసాగారు.
కొలతలు తీసుకున్నాడు.తోలు కత్తిరించుకున్నాడు.కుట్టడం పూర్తి కావొచ్చింది. చివరికి కంట్రాణీతో దారం బయటికి లాగి పూర్తిగా వచ్చిందొ లెదో తెలుసుకోవడం కోసమని ఆ దారం కొసని పళ్ళ మధ్య పట్టి గట్టిగా లాగాడు.
"శహభాష్. నువ్వే సర్వఙ్ఞుడివి" అంటూ కౌగలించుకొని బహుమతి ప్రదానం చేసాడు.
ఆ విధంగా దారాన్ని పళ్ళతో పట్టి లాగడం అనేది చెప్పులు కుట్టడం వృత్తిగాగల మాదిగవారు మాత్రమే చేయగల నిపుణత.
***************
కథ అయిపోయింది. కానీ నాలో ఆలోచన ప్రారంభం అయింది. అన్ని పనులూ ఏ ఒక్కరైనా అలా పరిపూర్ణమైన ప్రావీణ్యతతో చేయగలరా? అని.
సరే! ప్రయత్నిస్తే వచ్చే నష్టం ఏమి లేదు కదా అని ఆచరణలో పెట్టి చాలావరకు సాధించగలిగాను. అన్నిపనుల్లో కాకపోయినా, చేసిన పనిలో మాత్రం పరిపూర్ణత తీసుకురావడంలో మాత్రం చాలవరకు కృతకృత్యుణ్ణి కాగలిగాననడం సత్యదూరం కాదు.
"Even if a best thing is given to you, you should make it better" అనేది తర్వాతి కాలంలో నాకొక మంత్రం అయికూర్చుంది.
మీరూ ప్రయత్నించండి నేస్తాలూ.ఫలితం తప్పక కనిపిస్తుంది.
1, ఏప్రిల్ 2011, శుక్రవారం
మన స్థానం ఏంటి?మనకు కావలిసింది ఏంటి ?
జీవితం మంటే వందసంవత్సరాల కాలం కాదు,
వేల సంవత్సరాల జ్ఞాపకం..!
జ్ఞాపకం అంటే గతాన్ని గుర్తు పెట్టు కోవటం కాదు..!!
ప్రపంచానికి మనం గుర్తుండేల చేయడం.!!
ఎలా ?
ప్రపంచంలో మనం ఏంటి?
మన స్థానం ఏంటి?
మనకు కావలిసింది ఏంటి ?
ప్రపంచానికి మనం చేయాల్సింది ఏంటి?
అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ....!!
మనకి మనం ప్రేరణ కల్గించు కోవాలి..!!!
మనల్ని మనం నమ్మాలి.!!!!
మనకు మన ఒక లక్ష్యాన్ని రూపొందించుకోవాలి..!!!!!
దానిని సాదించడానికి కావాల్సిన సాధన చేయాలి.
పదిమందిలో మనం ఒకరం కాకూడదు.!
పదిమందికి మనం ఆదర్శం అవ్వాలి. పదిమందికి చేయూతనివ్వాలి .
మనకంటూ ఒక అత్యున్నత వ్యక్తిత్వం ఏర్పరుచుకోవాలి.
జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి.కళలు కనే వారే మరో ప్రపాపంచాన్ని సృష్టిస్తారు.
అలాగే ఏదయినా ఒక పనిని సాదించాలని కలలను కనటం ప్రారంబిస్తే....
ఆది ఆలోచనలకు దారి తీస్తుంది.
ఆ ఆలోచన జ్ఞానన్నిస్తుంది ఆ జ్ఞానం లక్ష్య సాధనకు ఎలా ఇస్టపడి కష్టించాలో నేర్పుతుంది.
దాని వల్ల అనుకున్నది సాదించటం సులువవుతుంది.
అందుకే life is purposeless without dreams అంటారు.
చేయగలిగిన సత్తా ఉన్నా చేయలేమోనన్నభయం వెంటాడుతుందా భయం శక్తివంతమయినడే
కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమయినది.
నమ్మకం తో మొదలుపెట్టిన పనులవల్ల విజయం ఎప్పుడూ... నీతోనే ఉంటుంది

ఇంతకి ఆ మాజీ సి ఎం ఎవరు ?
ఒకే వార్త ఆ రెండు రెండు రకాలుగా ప్రసారం కావడం గమనార్హం .హవాల బ్రోకర్ "హసన్ అలీ " చెప్పిన గుట్టు మాటలకు సంబంధించి ఓ మాజీ ముఖ్య మంత్రి ప్రస్తావన వచ్చింది .అయితే ఆయన ఎవరు ? అన్నదే ప్రశ్న.ఆ మాజీ ఇంకెవరో కాదు అంటూ సాక్షి "చంద్ర బాబు " అని తెల్సేసింది .రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఓ మాజీ సి ఎం విదేశాల్లో దాసిన రెండు వందల కోట్లు కూడబెట్టారని ...ఆ డబ్బును తానె హ్యాండిల్ చేసినట్టు అలీ చెప్పినట్టు సాక్షి కథనం .ఆ పత్రికలో అలీ ..బాబు "నల్ల " గుర్రం అంటూ మొదటి పేజి లో కథనం వచ్చింది .సరిగ్గా తెలుగు దేశం ఆవిర్భావ దినోత్సవం రోజునే ఈ కథనం రావడం విశేషం .
కాగ ఆ మాజీ ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి అని చంద్ర బాబు నాయుడు స్వయంగా ఈరోజు ప్రకటన్ చేసారు .సాక్షి వి బూటకపు కథనాలు అని మండి పడ్డారు.బాబు వ్యాఖ్యలు ఆయన చానల్ స్టూడియో -ఎన్ లో ప్రముఖంగా వస్తున్నై .హాసన్ అలీ ని అరెస్ట్ చేయమని తానె చెప్పానని ...విదేశాల్లో ధనం బయటకు తీసుకురావాలని పోరాడు తున్నానని చంద్ర బాబు చెబుతున్నారు ..ఇంతకి ఆ మాజీ సి ఎం ఎవరు ? మనకు నచ్చినట్టు మల్చుకోవడమేనా? అసలు నిజం తెలియాలంటే కేంద్రం తెలియ జేయాలి .ఆ సాహసం కేంద్రం చెయ్యగలదా?

రియల్ బూమ్ ఇంకా ఎంత ధర పలుకుతుందో!!!!!
తెలంగాణ విడిపోవడం ఖాయమని, దాని వల్ల సీమాంధ్ర రాజధాని విజయవాడ సమీపంలో రావచ్చునని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. హనుమాన్ జంక్షన్‌కు, నూజివీడుకు మధ్య రాజధాని ఏర్పాటవుతోందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దీంతో విజయవాడ చుట్టుపక్కల భూములకు విపరీతంగా గిరాకీ పెరిగింది. భూముల ధరలు అమాంతం పెరిగాయి. దీనిపై ఓ ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఎకరం ధర 20 నుంచి 60 లక్షల రూపాయలు పలుకుతోందని తెలుస్తోంది.
రాజధాని వార్తలు జోరుగా ప్రచారంలోకి రావడంతో రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగినట్లు తెలుస్తోంది. విజయనగరం పార్లమెంటు సభ్యుడు, శాసనసభ్యులు కొంత మంది పెద్ద యెత్తున భూములు కొనేసినట్లు టీవీ చానెల్ తెలిపింది. మైలవరం ప్రాంతంలోని భూములకు పెద్ద యెత్తున ధరలు పలుకుతున్నాయని అంటున్నారు. విజయవాడ చట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో భూముల ధరలు చుక్కలను అంటుతున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ, దాని చుట్టుపక్కల చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాజధాని ఊహాగానాలకు ఊతమిస్తోందని అంటున్నారు. విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగు రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా సాగుతున్నాయి. ఈ పథకాల అమలు రాజధాని ఏర్పాటు కోసమేనని ప్రచారం సాగుతోంది

కానుకగా అట్టి పెట్టుకొన్నాడేమో!
క్రికెట్ దేవుని
శతశతక సన్నివేశం
నిన్నే ఎందుకు జరుగలేదు?
బహుశా అన్ని లైఫ్ లతో చేసే
ఆ శతో శతకానికి
మచ్చ పెట్టడం దేవుడికి ఇష్టం లేదో
లేదా సొంతూరుకి
ఆ శతో శతకాన్ని
కానుకగా అట్టి పెట్టుకొన్నాడేమో!
శతశతక సన్నివేశం
నిన్నే ఎందుకు జరుగలేదు?
బహుశా అన్ని లైఫ్ లతో చేసే
ఆ శతో శతకానికి
మచ్చ పెట్టడం దేవుడికి ఇష్టం లేదో
లేదా సొంతూరుకి
ఆ శతో శతకాన్ని
కానుకగా అట్టి పెట్టుకొన్నాడేమో!
తప్పుడు సాక్ష్యంతో కట్టు కథలు వల్లిస్తూ............
ఎందఱో ఎందరెందఱో
వెఱ్ఱిగా నమ్ముకొన్న
భూమాతనే
తీరాలను కూడా వదలకుండా
పణంగా పెట్టి
ఆడిన క్రీడలో
గెలిచిన బహుమతులతో
తమ ధనాగారం నింపుకొని
ఇంకా తీరని దాహంతో
తప్పుడు సాక్ష్యంతో
కట్టు కథలు వల్లిస్తూ
సభా సంఘం అంటూనే
పెద్దలందరూ ఫిక్స్ అయిపోయారని
పెడబొబ్బలు పోతుండడం చూస్తుంటే
తెలు కుట్టిన దొంగ తెగించి
దొంగ భుజాలు తడుముకోవడం అన్నది పాతది అన్నట్టు
ఎదుటి వాళ్ళూ దొంగలే అని చేసే ఎదురు దాడి చూస్తుంటే
పాపం పక్వానికి వచ్చినట్టు కనిపిస్తోంది

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)