11, ఏప్రిల్ 2011, సోమవారం

అమృతవాక్కు --- వంద ఉద్బోదలకన్నా ఒక అనుభవం గొప్పది

అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో... మనిషిలో... రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. నూతన ఆదర్శాలు, మతాత్మకమైన ఆశయాలు అవలంబించినా, కొత్త సిద్ధాంతాలతో, కొత్త పద్ధతులలో మనిషిని నిర్భందించినా ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది.
--------------------------------------------------------------------------------------
*******తనను తాను విమర్శించుకోవడం వివేకం, ఇతరులను విమర్శించడం ఆవివేకం.
*******ఇసుమంత ఆచరణ ఇరవై వేల టన్నుల మాటలతో సమానము.
*******ఈ లోకంలో ప్రతి మనిషీ పూర్ణానందాన్ని కోరుకుంటాడు. కాబట్టి అటువంటి ఆనందాన్ని కేవలం సత్కార్యం ద్వారానే మానవుడు పొందగలడు.
*******జీవితంలోని సగం బాధలు 'సరే' అని త్వరగాను.. 'వద్దు' అని అలస్యంగాను.. చెప్పటం వల్లనే కలుగుతాయి.
*******నిన్ను నిన్నుగా వదిలేస్తే నువ్వు నీలోని శక్తులని గుర్తించగలుగుతావు.
*******ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న.
*******నీవు ఎంతగా ఉహిస్తూ ఉంటావో అంతగా విశ్రాంతి కి దూరం అవుతావు

స్వామి దేశభక్తి

ఒకసారి రాంతీర్థ జపాన్‌లో పర్యటిస్తూ అందులో భాగంగా రైలులో ఒక ఊరి నుండి మరో ఊరికి ప్రయాణిస్తున్నాడు.స్వామికి మధ్యలో ఆకలి అయ్యి పండ్ల కోసం ఒక స్టేషన్‌లో దిగి పండ్ల కోసం వెదికాడు.కాని ఎక్కడా దొరకలేదు. అలానే రైలు ఆగిన మరో మూడు స్టేషనులలో ప్రయత్నించాడు కానీ దొరకలేదు.ఇదంతా గమనిస్తోన్న ఎదుటి సీట్‌లో కూర్చొని ఉన్న ఒక జపాన్ కార్మికుడు రైలు మరో స్టేషనులో ఆగుతుందనగా రైలు ఆగీఆగకనే దిగివేసి బయటకు పరుగెత్తుకు వెళ్ళి పండ్లు కొనుక్కొనివచ్చి రామతీర్థ గారికి ఇచ్చాడు.రామతీర్థ గారు “ఎందుకంత కష్టం తీసుకొన్నావు?” అంటూ డబ్బు అతని చేతికి ఇవ్వబోగా అతను తీసుకోవడానికి నిరాకరిస్తూ ఒక్క మాట మాత్రం అన్నాడు.”స్వామీ! మీరు జపాన్ నుండి భారతదేశమునకు తిరిగవెళ్ళిన తర్వాత అక్కడ మీరు జపాన్ లో కనీసం తినడానికి కూడా పండ్లు దొరకలేదని అనకండి.అందుకే నేనిలా చేసాను.అదే మీరు నాకు ఇచ్చే పదివేలు” అన్నాడు.

బంగారు ధర భగ భగ....... ;)

బంగారు ధర
భగ భగ లాడుతున్న సమయంలో
తలుచుకోవడానికే బాధ వేసే సమయంలో
ఆ పేరెందుకని నా మీద పేలకండి

బంగారు కోడి పెట్ట అంటూ
మనలను ఉర్రూతలూగించి
తనయునితో కూడా
బంగారు కోడి పెట్ట అంటూ
మరో సారి ఉషారెత్తించిన
మెగా మేష్టారు
కన్నడ నాట
బంగారుపేటలో చెయ్యికి
చేయూతనివ్వండి అని
వ్రాక్కులిచ్చిన సందర్భంగా
యధాలాపంగా ఆ బంగారు గురించి
తలపుకు వచ్చింది

కథానాయకిని బంగారు కోడి పెట్టతో పోల్చి
పాటతో ఆట పట్టించినా
తన అత్తోల్ల ఊరిలో
బంగారు ఉషా రాణి చేతిలో
భంగపడిన ఈయన
ఇతర రాష్ట్రాలలో ఉన్న
బంగారు పేట లాంటి పట్టణాలలో
ఇలా ఇరగదీస్తుంటే కాస్త
నవ్వొచ్చింది అంతే

అభిమానులు ఇప్పుడైన మీరు మేలుకోండి

అమీర్ ఖాన్ లాంటి సెలెబ్రిటీలు కూడా
అవినీతి పై సమరంలో
వయో వృద్దునికి బాసటగా
నిలిచాడు ప్రధానికి ఓ లేఖ వ్రాసి
అవినీతి పై అరివీర భయంకరంగా
పోరాడే కథలతో అభిమానుల గుండెల్లో
పోటుగాళ్ళుగా నిలిచినా మీరు
పోయేదేముందని జాతికోసం
తామూ మద్దతు తెలిపితే పోయేదేముంది
కొంతమంది కథానాయకుల
అభిమానులు తమ వెబ్ సైట్ ల లో
అవినీతి పై పోరాటానికి
ఇస్తున్న ప్రచారాన్ని చూసైనా
సంభందిత కథానాయకులు
తామూ జాతిలో భాగమని భావించి స్పందించాలి