మనం చదవడమే నేర్చుకున్నాం కాని ఆలోచించడానికి శిక్షణను పొందలేదు.
--సర్వేపల్లి రాధాకృష్ణ
వంద ఉద్బోదల కన్నా ఒక అనుభవం గొప్పది
--వివేకానంద
ఒక వ్యక్తి సంతోషముగా వుంటే తప్ప ఇతరులకు సంతోషం కలిగించలేడు
--రమణ మహర్షి
మనం ముందుకే నడవాలి. ఎన్నో సార్లు, దారిలో నిరాశ ఆవహిస్తుంది. కాని చివరకు, దప్పికతో ఉన్న బాటసారి నీటిని కనుగొంటాడు. నిజానికి దప్పిక కంటే ముందే నీరు అక్కడ ఉంది.
-- ఓషో
ఇబ్బందులు కొత్త శక్తిని తెచ్చిపెడతాయి, మన ఆలోచనలకు పదునుపెడతాయి
--ఆల్బర్ట్ ఐన్‌స్టియిన్
అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో... మనిషిలో... రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. నూతన ఆదర్శాలు, మతాత్మకమైన ఆశయాలు అవలంబించినా, కొత్త సిద్ధాంతాలతో, కొత్త పద్ధతులలో మనిషిని నిర్భందించినా ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది
--జిడ్డు కృష్ణమూర్తి
నూతిలోని కప్పలా ఉండకూడదు. మతోన్మాదులంతా అలాంటి వారే. వారు తమ మతమే గొప్పదనుకుంటారు. కానీ, తక్కిన మతాలలోని మంచిని చూడరు.
- రామకృష్ణ పరమహంస
నీదనుకోనేది ఇక్కడలేదు. అది గ్రహించేసరికి నీవిక్కడ వుండటం లేదు
--కాజ చైతన్య
ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న
--మదర్ థెరిస్సా
నిన్ను నిన్నుగా వదిలేస్తే నువ్వు నీలోని శక్తులని గుర్తించగలుగుతావు
- ధీరూభాయి అంబానీ
బంగారాన్ని గాని, గంధాన్ని గాని ఏం చేసినా వాటి గుణం మారుదు. అదే విధంగా ఉత్తముడికి ఎన్ని కష్టాలు వచ్చినా అతని ఉత్తమ గుణం మారుదు.
--జవహర్ లాల్ నెహ్రూ
జీవితంలోని సగం బాధలు 'సరే' అని త్వరగాను.. 'వద్దు' అని అలస్యంగాను.. చెప్పటం వల్లనే కలుగుతాయి.
--ఆర్ట్ ఆఫ్ లివింగ్, శ్రీశ్రీ రవి శంకర్
ఈ లోకంలో ప్రతి మనిషీ పూర్ణానందాన్ని కోరుకుంటాడు. కాబట్టి అటువంటి ఆనందాన్ని కేవలం సత్కార్యం ద్వారానే మానవుడు పొందగలడు. ...
--స్వామి శివానంద సరస్వతి.
ఇసుమంత ఆచరణ ఇరవై వేల టన్నుల మాటలతో సమానము.
--వివేకానంద
తనను తాను విమర్శించుకోవడం వివేకం, ఇతరులను విమర్శించడం ఆవివేకం.
--మాతా అమృతానందమయి
27, జనవరి 2011, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)