కొత్త ఆశయాలకు కొత్త భావాలకు
పరికల్పనలు బంగారు కలలకు
కొన్ని సత్యాలకు, స్నేహ బంధాలకు
త్యాగాలకు రాగాలకు
ఆత్మీయానుబంధాలకు స్వాగతం! సుస్వాగతం!!
2011 నీకు ఘన స్వాగతం
పరిగెడుతున్న కాలం పురివిప్పింది నెమలిలా
వేయి వీణలను మీటి నవ వసంత, సలలిత రాగసుధా గానాన్ని
వినిపించి వీనుల విందు చేసింది
నవ జ్యోతులను వెలిగించింది
ప్రతి అణువు పులకించింది
ప్రతి గుండె ఆనందంతో పరవశించింది
జగతిన క్రొత్త సంవత్సరం మెరిసింది
విశ్వవేధికపై మధువసంతం మురిసింది
జీవితాలకు క్రొత్త ఊపిరి పోసింది
2011లోనైనా మానవతకు విలువ ఉంటుందని ఆశిద్దాం
జాతి, మత, భాషా ప్రాంతీయ భేదాలు విడనాడి
విశ్వశాంతికై ఐక్యతాగీతాన్ని పాడుకుందాం.
25, డిసెంబర్ 2010, శనివారం
సంతోషకరమైన క్రిస్ఠ్మస్ !
ఏమండీ
మీరు ఏలా ఉన్నారు ?
చాలా కాలమైంది మిమ్మల్ని చూసి !
మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది
మీకు సంతోషకరమైన క్రిస్ఠ్మస్
ధన్యవాదములు
మీరు ఏలా ఉన్నారు ?
చాలా కాలమైంది మిమ్మల్ని చూసి !
మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది
మీకు సంతోషకరమైన క్రిస్ఠ్మస్
ధన్యవాదములు
8, డిసెంబర్ 2010, బుధవారం
నా తొలి బుల్లి కవిత్వం – ఓ మనసు తత్వం !
మదిలొ మెదిలే ఆలొచనలకు మనసుని మాటలుగా, భావాన్ని అక్షరాలుగా మార్చాలనే పోరాట పటిమతొ “కవిత్వం” అనే సాగరం లొ ఒక చినుకుగా ప్రవహించాలని ఆశతొ ఈ నా తొలి బుల్లి కవిత్వం(?)
పెదవి పలకని మాటలెన్నో, మాటకు అందని మౌనాలెన్నో
ఊహకు అందని ఊసులెన్నో,బాషకు అందని భావాలెన్నో
సమయం సరిపోని స్వప్నాలెన్నో, తనువు గుర్తించని స్పర్శలెన్నో
చూపులకు తెలియని అందాలెన్నో, మంతనాలు సాగని రోజులెన్నో
గుండె దాటని తలపులెన్నొ,గుప్పిట్లొ దాచలేని వన్నెలెన్నో
వయసుకు అందని కోరికలెన్నొ, వర్ణనకు అందని సొగసులెన్నో
దాచకుండ ఉంచని తీపి గుర్తులెన్నో, పాటకు అందని రాగాలెన్నో
కలుపు ఎరుగని వలపులెన్నొ, పంచుకోలేని అనుభవాలెన్నో
వ్యక్తపరచని అనుభూతులెన్నో, ఎన్నెన్నో.. మరెన్నో…!!!

నారపరెడ్డి రామిరెడ్డి
ప్రతి చేయి నమస్కరిస్తుంది
అయితే ఆ మనస్సులలో
మనస్సులేదు
ఆ చేతులకది
అలవాటయిందీ
సిగ్నల్ రెక్కల వలె”
అయితే ఆ మనస్సులలో
మనస్సులేదు
ఆ చేతులకది
అలవాటయిందీ
సిగ్నల్ రెక్కల వలె”
7, జూన్ 2010, సోమవారం
హాస్యలాపన
ఒకరోజు లింగం మావ లైబ్రరీకి వెళ్లి..
"ఏమిటి సార్ ఇది. వారం రోజుల క్రింద నేను తీసికెళ్ళిన పుస్తకం ఎంత చదివినా పూర్తి కాదు, కథ అర్ధం కాదు. అందులో వేళ , లక్షల పాత్రలు. పైగా విచిత్రం ఏంటంటే అందులో ప్రతి పాత్ర పక్కన ఒక ఫోన్ నంబర్. అలా ఎందుకున్నట్టు. కాస్త చెప్తారు?"
"దేవుడా !! వారం రోజుల నుండి టెలిఫోన్ డైరెక్టరీ కనపడక చస్తున్నా.. నువ్వు తీసికెళ్ళావా తండ్రీ?"
.................................................................................................................................................
ఒక వ్యక్తి హత్య చేసినందుకు మరణ శిక్ష పడింది. అతడిని విద్యుత్ కుర్చీలో కూర్చోబెట్టి శిక్ష వేయాలని తీర్పు ఇచ్చారు.
ఆ రోజు రానే వచ్చింది. ఖైదీని మరణ శిక్ష కోసం తయారు చేసారు.
కరెంట్ స్విచ్చివేసేముందు
"నీ చివరి కోరిక ఏదైనా ఉందా?"
" తీరుస్తారా సార్?"
"ప్రయత్నిస్తాము. ఏంటది చెప్పు"
"నాకు చాల భయంగా ఉంది. ధైర్యంగా ఉంటుంది కాస్త నా చేయి పట్టుకోండి"
"???????"
......................................................................................................................
అది ఒక ఆఫీసులో లంచ్ టైమ్. కామేశం, వీరేశం, గిరీశం ముగ్గురు తమ తమ లంచ్ బాక్స్ లు తీసారు.
కామేశం : " ఉప్మా!!!.. రోజు ఉప్మా తినలేక చచ్చిపోతున్నా. రేపు కూడా నా లంచ్ బాక్స్ లో ఉప్మా పంపితే చచ్చిపోతానంతే.
వీరేశం : " చపాతీలు!!!..రోజు ఈ చపాతీలు తిని తిని విసుగెత్తింది. రేపు కూడా నాకు చపాతీలు పంపితే నేనూ చచ్చిపోతాను. బ్రతికి లాభంలేదు..
గిరీశం : " పులిహోర!!!.. రోజు ఈ నిమ్మకాయ పులిహోర తిని తిని ప్రాణం మీది తీపి చచ్చిపోయింది. రేపు కూడా నాకు పులిహోర పంపితే నేను బ్రతకనంతే."
మరుసటి రోజు ముగ్గురికీ అవే లంచ్ బాక్స్ లు వచ్చాయి. దానితో ముగ్గురూ ఆఫీసు పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురి భార్యలు వచ్చారు.
కామేశం భార్య : "ఏవండి. వెదవది ఉప్మా కోసం ప్రాణంతీసుకున్నారా ? ఒక్క మాట చేప్తే వేరే చేసేదాని కదా" అని ఏడుస్తుంది.
వీరేశం భార్య : "ఏవండి.. చపాతీలు ఇష్టం లేదని ఒక్క మాట అంటే వేరే ఏదైనా చేసి పంపేదాన్ని కదా . ఇంత దానికే ఆత్మహత్య చేసుకున్నారా ?" అని ఏడుస్తుంది.
గిరీశం భార్య మాత్రం ఎటువంటి స్పందన లేకుండా అలా కూర్చుంది.
ఆఫీసు వాళ్ళు వచ్చి "ఏంటమ్మా ! మీ భర్త చనిపోతే ఎటువంటి బాధలేకుండా అలా కూర్చున్నావు?"
గిరీశం భార్య " ఈ నా కొడుకు! రోజు తనే వంట చేస్తాడు కదా ! రోజొక వంట చేయొచ్చుగా. రోజు పులిహోర ఎవడు తెచ్చుకొమ్మన్నాడు. దొంగ సచ్చినోడు. అనవసరంగా నన్ను ఇరికించాడు."
-------------------------------------------------------------------------------------------

బావా --బామ్మర్ది
రామారావు పేపర్ చదువుతూ కూర్చున్నాడు. అంతలో అతని బామ్మర్ది వచ్చి " బావా! బోర్ కొడుతుంది ఒక జోక్ చెప్పవా "
"సరే! సన్నగా , పొడుగ్గా, ఎర్రగా ఉంది . ఏందది?"
" ఏమో . నువ్వే చెప్పు"
"ఎర్రదారం"
"సన్నగా, నల్లగా ఉంది అదేమిటి?"
"ఏమో. నాకేం తెలుసు?"
" దాని నీడ."
" సరే .ఇంకోటి.. సన్నగా, పొడుగ్గా , తెల్లగా ఉంది .ఏమై ఉంటుంది. కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. అందాక నేను ఈ పేపర్ చదివేస్తాను"
" సరే . నేను ప్రయత్నిస్తాను."
గంటతర్వాత...
"బావా! నాకు రావట్లేదు కాని . నువ్వే చెప్పు."
" ఏం లేదోయ్! అది దాని ఆత్మ." అంటు లేచి వెళ్ళిపోయాడు బుర్ర గోక్కుంటున్న బామ్మర్దిని వదిలేసి.

ఇల్లాలు , ప్రియురాలి గురించి చెప్పమంటే ఏమంటారో చూద్దాం.. ఈ మహాత్ములు...
డాక్టర్:
ఇల్లాలు : ఆయుర్వేదిక్ మందులాంటిది. స్ట్రాంగ్ గా ఉంటుంది కాని శాశ్వత పరిష్కారం.
ప్రియురాలు : అల్లోపతి మందులాంటిది. వేగంగా పనిచేస్తుంది. జాగ్రత్తగా ఉండకుంటే, నిర్లక్ష్యం చేస్తే మాత్రం రియాక్షన్ వస్తుంది.
పోలీసు :
ఇల్లాలు : ఖాకీ డ్రెస్ లాంటిది. ఎప్పుడూ వేసుకోవాల్సిందే. దర్పం ఎక్కువగా ఉంటుంది.
ప్రియురాలు : సివిల్ డ్రెస్ లాంటిది. అప్పుడప్పుడు వేసుకుంటే బావుంటుంది. వినయంగా ఉండాలి.
ఉద్యోగి :
ఇల్లాలు : టంచనుగా వచ్చే జీతం లాంటిది. వచ్చినదాంతో సరిపెట్టుకోవాలి.
ప్రియురాలు : అప్పుడప్పుడు దొరికే లంచం లాంటిది. ఆకర్షణీయంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండకుందే సస్పెండ్ చేయిస్తుంది.

ఓటు సిత్రాలు...
ఓటర్లకు , నాయకులకు
ప్రాణం ఓటు
మీకు, మాకు, అందరికి
ప్రాణం ఓటు (O2)...
ఇంటిలోన పాలబిల్లు
ఎంతో తెలీదంట
ఓటడగా వెళ్లి
నేర్పుగా పాలు పితికేరంట....
వందనోటు విడిపిస్తే
ఏగాని మిగలదంట
ఆ వందకే నెల సరుకులు
ఎలా ఇచ్చేరంట...
నల్లచుక్క కనపడదు
నాలుగు రోజుల్లో
నాయకుడు కనపడదు
నాలుగు ఏళ్లలో .....
మీట నొక్కేవరకు
నీ కాల్మొక్త బాంచన్
మీట నోక్కేసాక
నా కాల్మోక్కరా బద్మాష్..
కొద్ది కాలంగా జరుగుతున్న మన రాష్ట్రంలో జరుగుతున్న వింతలు, విశేషాలు, మోసాలు, తమాషాలు, వేషాలు చూసి చిరాకేసి రాసుకున్న భావవ్యక్తీకరణ. అసలైతే ఇంతకంటే వందరెట్లు చిరాకుగా , కోపంగా ఉంది..

వాన
ఎంత అల్లరిదమ్మ ఈ వాన
రానని ఉడికించి వరవడిగ వస్తుంది
వదలక గిలిగింతలు పెట్టి
ఉల్లాసంగా ఉప్పొంగి నవ్వుతుంది
ఆషాడ మాసాన సాయం వేళ
నేనొస్తున్నా రారమ్మంటూ గాలితో కబురంపింది
రానంటే అలిగింది
రప్పించి నెగ్గింది
ఆనందమో, ఆకతాయితనమో
చినుకులతో తట్టి తనువంతా తడిపింది
అది చూసి మెరుపు కన్ను కొట్టింది
మేఘం రెచ్చి కురిసింది
చెలిమి చేయమంది బాధ మరవమంది
మనసు తెప్పరిల్లి తనువు మించి చల్లనయింది
జగతి మరిచితిని
నెచ్చెలి వానతో జత కలిపితిని ....

వ్యక్తిత్వం అంటే
నాకు కలిగే ఎన్నో సందేహాలను తీర్చుకోవడానికి ఇలా ఒక్కోటి అడుగుతున్నాను.
ఒక వ్యక్తి యొక్క గుణగణాలు, స్వభావం, అతని పుట్టుకతో వస్తాయా, పెంపకం వల్లా, పెరుగుతున్నపుడు అతని చుట్టు ఉన్న పరిస్థితుల వల్లా???. అంటే సహాయ గుణం, అల్లరి, ఆత్మీయత మొదలైనవి. ఇవి నేర్చుకుంటే రావుగా ??
ఒక వ్యక్తి యొక్క గుణగణాలు, స్వభావం, అతని పుట్టుకతో వస్తాయా, పెంపకం వల్లా, పెరుగుతున్నపుడు అతని చుట్టు ఉన్న పరిస్థితుల వల్లా???. అంటే సహాయ గుణం, అల్లరి, ఆత్మీయత మొదలైనవి. ఇవి నేర్చుకుంటే రావుగా ??
నాపై ఎందుకింత ప్రేమ??
సంతోషంగా ఉన్నవేళ
నన్ను స్పృశించ సాహసించవు
సమూహంలో ఉండగా
నన్ను పలకరించ భయపడేవు.....
కాస్త దిగులుగా ఉన్నంతనే
నేనున్నానంటూ తడిమేస్తావు
ఒంటరిగా బెదిరి ఉన్న సమయాన
జడివానలా, జలపాతంలా కమ్మివేస్తావు....
నా మనసులో , భావనలలో
అలుముకుని, అల్లుకుపోయిన దుఃఖమా!
ఆనందంలో పలకరించేవు, ఆవేదనలో తోడుండేవు
ఎంత అణచిపెట్టినా, అడ్డు చెప్పినా కంటి కొనలో నిలిచేవు...
ఉప్పెనలా నన్ను చుట్టేసి
భావోద్వేగపు వెల్లువను శాంతపరిచేవు
తుఫానులో చిగురుటాకులా నన్ను వణికించే
దుఃఖమా? నాపై ఇంత ప్రేమ ఎందుకమ్మా???

ఎందుకు? ఏమిటి? ఎలా??
ఎందుకు? ఏమిటి? ఎలా? ఈ డైలాగు వినగానే మీకు ఎవరు గుర్తొస్తారో నాకు తెలుసు? కాని నేను అడిగేది వేరు. గత రెండు మూడు నెలలుగా ఎంతో మంది బ్లాగర్లు తమ బ్లాగు పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఒకసారి గత స్మృతులను నెమరేసుకుంటున్నారు. బహు బాగు. ఎలాగూ ఈ సంవత్సరం ఐపోవచ్సింది. ఒక్కసారి మన బ్లాగు అనుభవాలు, అనుభూతులు గట్రా మాట్లాడుకుందామా? ఐతే..
మీరు బ్లాగు ఎందుకు మొదలెట్టారు?
బ్లాగు రాయడం వల్ల మీరు నేర్చుకున్నది ఏమిటి?
బ్లాగు వల్ల ఎలా లాభపడ్డారు? బాధపడ్డారు?
ఇలా మీరు బ్లాగు మొదలెట్టినప్పటినుండి బ్లాగు ఏ ఉద్దేశ్యంతో మొదలెట్టారు. అది నెరవేరిందా.. మీ బ్లాగు గురించి మీరు ఏమనుకుంటున్నారు. దాన్ని ఎలా తీర్చి దిద్దాలనుకుంటున్నారు వగైరా చెప్పండి. ఇది చెప్పడానికి బ్లాగు మొదలెట్టి సంవత్సరాలే కానక్కరలేదు. నెల రోజుల క్రింద ప్రారంభించినవారు కూడా తమ అనుభవాలు రాయొచ్చు. ఏదైనా సమస్యలు ఉంటే చెప్పొచ్చు. ఒక్కటి మాత్రం నిజం. ఇక్కడ అంటే తెలుగు బ్లాగ్లోకంలో సాయం అడిగితే తప్పక అందుతుంది. నేను అలా అడిగి నేర్చుకున్నదాన్నే. అడగందే అమ్మైనా పెట్టదు మరి..

జామాత దశమగ్రహ:
పెళ్లి ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు. రెండు కుటుంబాలు, రెండు వంశాల శాశ్వత కలయిక. ఎక్కడో పుట్టి , ఎక్కడో పెరిగిన అమ్మాయి, అబ్బాయి పవిత్రమైన వివాహబంధంలో ఒక్కటవుతారు. అటువంటప్పుడు కోడలు, అల్లుడు గురించి ఎన్నో సర్దుబాట్లు, సమస్యలు. ఆరోపణలు తప్పవు కదా. కోడలంటే అత్తవారు చెప్పినట్టు చేయాలి కాబట్టి ఆరోపణలు ఉన్నా తక్కువే అని చెప్పవచ్చు. కాని అల్లుడు విషయంలో మాత్రం అలా కాదు. ఇప్పుడు అల్లుడు ఎందుకు గుర్తొచ్చాడు అనుకుంటున్నారా? అబ్బే!! నాకు అల్లుడు రావడానికి టైముంది కాని అప్పుడెప్పుడో అల్లుళ్లైనవాళ్లు, మొన్న మొన్న అల్లుళ్లైనవాళ్లు, ఇపుడు కాబోయే అల్లుళ్లు, కొన్నేళ్ల తర్వాత కాబోయే అల్లుళ్లు. అందరికీ ముందుగా అభినందనలు. ఇక అసలు విషయానికొద్దాం. కోడలు మా ఇంటి మహాలక్ష్మి, గృహలక్ష్మి అది ఇదీ అంటారు. కాని అల్లుడంటే అంత మంచి అభిప్రాయం లేదు చాలామందికి. ఎప్పుడూ కట్టుకున్న ఇల్లాలిని, అత్తవారిని పీక్కుతింటాడు అనుకుంటారు. ఇప్పుడే కాదు పురాణకాలం నుండి అల్లుడిని ఆడిపోసుకునేవాళ్లే... కవులైనా , సామన్యులైనా.. పాపం అల్లుడిని దశమగ్రహం అని కూడా అంటారు. మనకు ఉన్నవి నవగ్రహాలే. కాని ఈ అల్లుడు పదో గ్రహమెందుకయ్యాడు?
అల్లుణ్ని దశమ గ్రహమంటూ ఒక కవి ఇలా అన్నాడు.
అల్లుణ్ని దశమ గ్రహమంటూ ఒక కవి ఇలా అన్నాడు.
అమృత వాక్కు
అమృతం కురిసిన రాత్రి
అందరూ నిద్రపోతున్నారు
అలసి నిత్యజీవితంలో సొలసి సుషుప్తి చెందారు
అలవాటునీ అస్వతంత్రతనీ కావలించుకున్నారు
అధైర్యంలో తమలో తాము ముడుచుకుపోయి పడుకున్నారు
అనంత చైతన్యోత్సవాహ్వానాన్ని వినిపించుకోలేక పోయారు
అందుకే పాపం
ఈనాటికీ ఎవరికీ తెలియదు
నేను అమరుడనని!

గుణ
కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హ్రుదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఉహాలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలొ
ఒహోకమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హ్రుదయమే
ప్రియతమ నీవచట కుశలమా నేనిచట కుశలమే
గుండెల్లో గాయమేదొ చల్లంగా మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమైన గాని నా మేనికేమిగాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది
నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటే స్వచ్ఛమైనది
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
ఉమాదేవి గా శివుని అర్ధ భాగమై నా లోన నిలువుమా
శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమా దేవి లాలి లాలి జో లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా
చిత్రం : గుణ
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.పి.శైలజ
సంగీతం : ఇళయరాజా

Broken Mirror/ పగిలిన అద్దం
Somewhere I took a turn
and ran into a mirror.
Shattered pieces of glass
now surround me.
I think I am bleeding
but I know not where.
It really does not hurt or
I just pretend not to care.
The wounds may last
they may haunt me
as time goes past.
I look at the pieces
see myself in bits,
some of them smile
they say I am just fine.
Then there are those
that tell me I am fragile
I can break like them.
Or they seem to tell me
broken already I am.
I just gather the pieces
trying to fix what it reflects
The image is too vague
to be a puzzle to solve
The reflections too many
to be a piece of art.
Mirrors once shattered
can not be unbroken
Pain once experienced
can not be truly forgotten.
-------------------------------------------
వెళ్ళే వెళ్ళే దారిలో
కాలానికి కథనానికీ కంటి చూపు కరువైంది.
మేలుకొని చూస్తే,
చుట్టూ అద్దం ముక్కలు.
ముక్క ముక్కకో కథ
కథలన్నీ కలిపితే నా జీవితం.
దేహం పై గాయాలు కనిపించేవేగాని
అనిపించేవేవి కావు.
గాయాలు చెప్పే కథ ఒకటి
అద్దంలో నుండి నడిచింది నేనేనని.
కారే రక్తం చెప్పే కథ వేరు
కనిపించే గాయాలు ఎప్పటికైనా అనిపించేవేనని.
ఇతరుల కోసం దుఃఖించే మనసుదో ముక్క
బాధ్యత నేర్చని మేధస్సుదో ముక్క
దురాచారాని లోంగనందుకో దర్పణం
జడిసి జంకినందుకో దర్పణం
ముక్కలన్నీ కలిపితే
అవి నన్ను నిజంగా చూపించేనా
చూపించినా నే చూడగలనా
విరిగిన అద్ధం సరే
విరిగిన మనసు అతికేనా
ఇంకో రోజుతో ఇంకో వ్యక్తి ఉదయించేనా
ఒక సారి కరిగిన ఉక్కు
పదిమంది ఇంటికి పునాదిగా నిలిచేనా ?

నిరుద్యోగులు
అంతేలే, నిరుద్యోగ రెజ్యుమేలు !
కంచల్లే మ్రోగే ఖాళీ చెంబులు !
మానవ వనరుల భామల బల్లలపై,
పింగుపాంగులాడే కుంటి కుందేళ్లు !
అంతేలే, నిరుద్యోగ ఈమెయిళ్లు !
వ్యాకరణం వాడని తిరస్కారములు !
అసమర్ధ చితులుండే శ్మశానాల్లో
కాలని కళేబరాల పేలని పుఱ్ఱెలు !
అంతేలే, నిరుద్యోగుల అర్హతలు !
సిగ్గువిడిచిన సినిమా హీరోయిన్లు !
నత్తనడకన సాగే ఎకానమీకి,
నివాళులొసగు హారతి కర్పూరాలు !
అంతేలే, నిరుద్యోగ జీవితాలు !
జీతం పెట్టని మహోద్యోగాలు !
శోకమనే సెలయేటిలో కాగిన
పాకంపట్టని గులాబ్జామూఁలు !
అంతేలే, నిరుద్యోగ భోజనాలు!
పూరీలు, పరాటాలు, పులావులు,
పాల పాయసాలు, పెసరపప్పు చార్లు !
పర్సు కాళి గాని పేగు కనలనీరు !
కంచల్లే మ్రోగే ఖాళీ చెంబులు !
మానవ వనరుల భామల బల్లలపై,
పింగుపాంగులాడే కుంటి కుందేళ్లు !
అంతేలే, నిరుద్యోగ ఈమెయిళ్లు !
వ్యాకరణం వాడని తిరస్కారములు !
అసమర్ధ చితులుండే శ్మశానాల్లో
కాలని కళేబరాల పేలని పుఱ్ఱెలు !
అంతేలే, నిరుద్యోగుల అర్హతలు !
సిగ్గువిడిచిన సినిమా హీరోయిన్లు !
నత్తనడకన సాగే ఎకానమీకి,
నివాళులొసగు హారతి కర్పూరాలు !
అంతేలే, నిరుద్యోగ జీవితాలు !
జీతం పెట్టని మహోద్యోగాలు !
శోకమనే సెలయేటిలో కాగిన
పాకంపట్టని గులాబ్జామూఁలు !
అంతేలే, నిరుద్యోగ భోజనాలు!
పూరీలు, పరాటాలు, పులావులు,
పాల పాయసాలు, పెసరపప్పు చార్లు !
పర్సు కాళి గాని పేగు కనలనీరు !
Non-duality
A few tunes down the Waltz
she will be him.
A few miles down the Stream
flow will be calm.
A few degrees up the scale
ice will be water,
A few more up the same
liquid will be air.
Like rivers in the ocean
Like songs in the heart
The same joy manifests in
various forms transient
And...
A few tides down the time
land will be sea.
A few lives down the soul
you will be me.
she will be him.
A few miles down the Stream
flow will be calm.
A few degrees up the scale
ice will be water,
A few more up the same
liquid will be air.
Like rivers in the ocean
Like songs in the heart
The same joy manifests in
various forms transient
And...
A few tides down the time
land will be sea.
A few lives down the soul
you will be me.
28, మే 2010, శుక్రవారం
శ్రీ నందమూరి తారకరాముని 86 వ జయంతి రోజున అంజలి ఘటిస్తూ..
ఫేరు వింటే పరవశం..
తలచుకుంటే తన్మయం..
ఒక తరాన్ని తన నటన తో వుర్రూతలూపి..
ఒక తరాన్ని చేయి పట్టుకు రాజకీయ ఓనమాలు దిద్దించి....
ఒక తరానికి వేగు చుక్కలా వినీలాకాశంలో నిలిచిన ...ఒకే ఒక్కడు..
ఆతను నవరసభరితమైన నటనలో రాగద్వేషాలని..రక్తి కట్టించి రసజగత్తు లో జనసామాన్యాన్ని ఓలలాడించిన విధం నభూతో నభవిష్యతి..
రాముడిగా రావణునిగా
కృష్ణునిగా కృష్ణరాయలుగా
భీష్మునిగా భీమునిగా
కర్ణునిగా కిరీటిగా
బృహన్నలగా భబ్రువాహనునిగా
సత్యహరిశ్చంద్రునిగా
సుయోధన సామ్రాట్టుగా..
చెప్పుకుంటూపోతే.. చిత్రాలు ఎన్నో..
అంతులేని కథ ఆయన
మత్తగజాల ఘీంకారాలు ఆ మందహాసం ముందు మూగబోయాయి
మేరుపర్వతాలు పదివేలు ఆ మొండితనం ముందు మోకరిల్లాయి
వేలవెన్నెల రాత్రులు ఆ వదనారవిందం ముందు వెలవెలపోయాయి
ముక్కుసూటి..ఆవేశం.. మొండితనం.. పట్టుదల.. క్రమశిక్షణ..పదాలకు పర్యాయపదం ఆయన..
ఎంతగా ఎదిగినా..
జనహితం మరువని జగదేకవీరుడతను..
యుగధర్మం తప్పని యుగపురుషుడాయన..
అందుకే..
అన్నవస్త్రాలు లేక అల్లాడుతున్న జనాన్ని వదిలి..
ఆకాశమర్గాన అవినీతి స్వర్గాన హడావిది గ వెళ్తున్న
రాజకీయ రధచక్రాల్ని..
భూమార్గం పట్టించి భూకంపం సృష్టించిన భగీరథుదు NTR
దశాబ్దాలుగా దారితప్పి
దేశరాజధాని లో దేహీ దేహీ అంటున్న
రాష్ట్ర రాజకీయాల్ని
భాగ్యనగరం దిశ పట్టించి మన భాగ్యరేఖల్ని మార్చినవాడు NTR.
గుడిసెల ముందు రాజకీయాన్ని తెచ్చి గుట్టగాపోసిన గుండెగుడిదేవుడాయన..
చైతన్యరధమెక్కి చైతన్యాన్ని అడుగడుగునచాటిన చరిత్రకారుడాయన..
పేదప్రజలకోసం తనదైనప్రపంచాన్ని సృష్టించిన విశ్వామిత్రుడాయన..
వేలవేలు నాయకులున్నా ఒకేఒక్కడిగా ఆయన మాత్రమే ఎందుకు ఎదిగాడు..
పూరిగుడిసెల్లో పటాలు, గుండెగుండెలో గుడి ఆయనకి మాత్రమే ఎందుకున్నాయి..
ఎంత మందికి తెల్సు..1980 కి ముందు జరిగిన వరకట్నహత్యలు..
ఎంత మందికి తెల్సు..1980 కి ముందు మీ ప్రజాప్రతినిధి ఎవరో..
ఎంత మందికి తెల్సు..1980 కి ముందు సగం ఊళ్ళకి బస్సులు కుడా లేవని..
NTR రాజకీయ ప్రవేశం తో రాజకీయాల కి రంగు,రుచి,వాసన వచ్చాయి..
ప్రజలు ప్రశ్నించటం నేర్చుకున్నారు..
ఆడపడుచులకి అస్తిహక్కు వచ్చింది..
రైతాంగానికి రాయితీలు వచ్చాయి..
పల్లెల్లో ప్రాథమిక అవసరాలు తీరాయి..
నేలవిడిచి సాము చేసే నాయకుల నారతీసిన నిరంకుశుడాయన..
పల్లెపల్లెకి పరిపాలనని తీసుకెళ్ళిన ప్రజారాముడాయన..
అధికారయంత్రాంగం అహంకారాన్ని అణిచిన రాజారాముడాయన..
జనం గుండెఘోషనే తనశ్వాసగా మార్చుకుని..
మదిమదిని మైమరిపించిన మహానాయకుడు..
చిరకాలం చెప్పుకునే చందమామకథ ఆయన..
కలత నిద్దుర కలల్లోని కమ్మనిరూపం ఆయన..
ఉదయసాయంసంధ్యల్లో ఉత్తేజపరిచే ఊహ ఆయన..
శక్తిగా మారిన ఒకవ్యక్తి ఆయన..
చరిత్ర కి చిక్కని చిత్రం ఆయన..
అందుకే..అరవయ్యేళ్ళుగా
జనం జీవితాల్లో జీవనది NTR
సూర్యచంద్రులు వున్నన్నాళ్ళు..
కృష్ణాగోదావర్లు పారినన్నాళ్ళు..
తెలుగువారి తొలిదైవం NTR
ఆంధ్రులకి ఆత్మగౌరవాన్నితెచ్చి..
మద్రాసీమచ్చకి మందువేసి..
విశ్వవినువీధుల్లో తెలుగుజెండాని ఎగరేసి సగర్వంగా చెయ్యెత్తి జైకొట్టిన తెలుగోడు..
తను నవ్వితే..జనం నవ్వారు.. ఏడిస్తే జనం ఏడ్చారు ..
తనలోనే దైవాన్ని చూసారు..
ఆ చైతన్యరథం రేపిన దుమ్ము తొలగకముందే.. వడివడిగా వెళ్ళిపోయాడు ఆ రాముడు..
కమ్మకులకీర్తిచంద్రుదు శ్రీ నందమూరి తారకరాముని 86 వ జయంతి రోజున అంజలి ఘటిస్తూ..
నా ఆత్మబంధువు కి అక్షరాభిషేకం చేస్తున్నాను..
"ఆత్మబంధూ !
నీ అభిమాన సింధువు* లో నేనొక బిందువుని మాత్రమే.. (సింధువు-- సముద్రం)
పుష్కరాలకోసం ఎదురుచూసే వరదగోదావరి లా..
అన్నా ! నీ కోసంఆర్తిగా ఎదురుచూస్తున్నాం..
మళ్ళీ పుట్టు మా కోసం.."
కన్నీటి తో..

26, ఏప్రిల్ 2010, సోమవారం
నాకు నచ్చిన కొన్ని మంచి వాక్యాలు మీకు కూడా నచ్చితే follow అవ్వండి.....,
1."ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్ని విధి
పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరే ఆగిపోయేవాడు అనామకుడు గానే
మిగిలిపోతాడు"...
2.'అంతా తనదే' అన్నది మమకారము.'అంతాతనే' అన్నది అహంకారము...
3."నేడు రేపటికి 'నిన్న' అవుతుంది.నిన్నటి గురించి రేపు బాధ పడకుండా
వుండాలంటే,నేడు కూడా బావుండాలి"...
4."మలుపు తిరగటానికి కరెక్ట్ ప్లేస్..Dead End....'అంతే అయిపోయింది
ఇంకేమీ లేదు' అనుకున్నచోట ఆగిపోకు. ప్రక్కకి తిరుగు. మరోదారి
కనపడుతుంది"...
5."నిన్నెవడయినా తప్పు పట్టాడంటే,నువ్వు తప్పు చేస్తునావని కాదు.నువ్వు
చేస్తున్నపని వాడికి నచ్చలేదన్నమాట"...
6."ఓడిపోయేవాడు ఒక్కసారే ఓడిపోతాడు.గేలిచేవాడు తొంబైతొమ్మిదిసార్లు
ఓడిపోతాడు.వందసార్లు ప్రయత్నిస్తాడు కాబట్టి"...
7."నిన్నటినుంచి పాఠం గ్రహించి,రేపటి గురించి కలలుకంటూ ఈ రోజుని
ఆనందించు.కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్దం చేసుకోకు.ఇవ్వటంలో నీకు
అనందం వుంటే ఇస్తూ అనందించు.అలా కాని పక్షంలో నీ అనందానికి అడ్డువచ్చే
వారినందరిని నీ దినచర్య నుండి తోలగించు.రాజీపడి మాత్రం బ్రతక్కు"...
అర్ధం అయిoదా....?
ఓటమే గెలుపే
"ఈ క్షణపు ఓటమే మరు క్షణపు గెలుపేమో
ఈ నిమిషపు గెలుపే జీవితాన మలుపేమో "
అనితలుస్తూ వాస్తవంలో బతుకుతూ భావుకతని ఆరాధిస్తూ తెలుగన్నా, తెలుగు
సంస్కృతి అన్నా ఎంతో ఇష్టపడే సామాన్యుడిని నేను..
కవితలు చెప్పే హృదయం వుంది !
ప్రేమించే మనసు వుంది
మనసులొన మంచి ఉహ వుంది
ఉహల లొకం లొ ఒక ఆశ వుంది
కలసి వుండే కోమలి యెక్కడ వుందొ?
చెప్పాలి అంటే చాలా వుంది వినే ఓపిక వుందా.....

చిన్న నవ్వే
ఒక చిన్న నవ్వే నవ్వి యుధ్దాలేన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి బంధాలేన్నో కలాపొచ్చూ
చిరునవ్వుల దీపం వెలిగించూ
నీ బాధలకీగతి తొలగించూ
చిరునవ్వుల బాణం సంధించూ
శత్రువులే ఉండరు గమనించూ
మణిషాన్నోడే మనసారా తానే నవ్వొచ్చూ
మనసున్నోడే తనవారిని కూడా నవ్వించూ
పైనున్నోడే నీ నవ్వును చూసి దిగి వచ్చూ
నీతో పాటే తన కాస్ఠం మారవచ్చూ
నీ గుండెళ్లోనా గాయాలెంనున్నా
నవ్వే వాటికి మందూ
నీ కన్నుళ్లోనా కన్నీరెంతున్నా
ఆదరాలా నవ్వే వాటికి హద్దూ
త్వరగా నిను చూసి నవ్వేవారు నిద్దూర పోయేట్తూ
సరిగా నీ నవ్వుని నిచ్చెనా సేసి ఎక్కర పై మెట్టూ
నీ కోపం నువ్వే కరిగించు
నీ రూపం నువ్వే వెలిగించూ
ఈ పాఠం నువ్వే పాటించు
పది మందికి నువ్వే చాటించూ
ఏడ్చేవాళ్ళుంటే కసీతీరా ఎడ్పిస్తుందీ లోకం
నవ్వే వాలుంటే కాదుపారా ఏడుస్తుందీ కాలం
కనుకే లోకాన్ని ఎదిరిచేతి మార్గం కనిపెట్టు
కదిలే కాలానీ ఎదురీదేటి ధైర్యం చూపేట్టూ
ఈ జీవిత సత్యం గుర్తించూ
ఆఆనందం నీవై జీవించూ
నీ చలనం నీవె గమనించూ
సంచలనం నువ్వే సృస్టించూ

మన స్నేహం
కన్నులు తెలిపె సత్యం, మనసులు పలికె ఆచారం
భావలు రాసే కావ్యం, మోనాలు రాసే గ్రంధం
మాటలు చెసే యుద్దం
అదె మన స్నేహం
ఆనందం చెప్పా లేనిది....,
సంతోషం పట్టరానిది......,
కోపం పనికిరానిది.......,
ప్రేమ చెరిగిపోనిది.......,
కాని...
స్నేహం మరువలేనిది .
భావలు రాసే కావ్యం, మోనాలు రాసే గ్రంధం
మాటలు చెసే యుద్దం
అదె మన స్నేహం
ఆనందం చెప్పా లేనిది....,
సంతోషం పట్టరానిది......,
కోపం పనికిరానిది.......,
ప్రేమ చెరిగిపోనిది.......,
కాని...
స్నేహం మరువలేనిది .
ధనం
"ధనం" ఉంటే "జనం" ఉంటారు - "ఆత్మీయులు" ఉండరు
కొట్టినా తిట్టినా పడి ఉన్నారు అంటే "ధనం" గోప్పతనమేగాని "నీ" గొప్పతనం కాదు
"ధనం" తో సాధించడం గొప్పకాదు "తెలివి" తో సాధించడం గొప్ప
తిన్నది కరిగిపోతుంది . చేసిన మేలు మిగిలిపోతుంది .
విశాలమైన భావంతులకంటే - విశాలమైన హృదయం ముఖ్యం
"అందం" కాదు ముఖ్యం - ఆనందాన్ని పంచే "మనసు" ముఖ్యం
వేదాలు తెలుపని సత్యం, శాస్రాలు పలుకని ఆచారం
కాలాలు చూడని కావ్యం, గ్రహాలు తిరగని గమనం
పండితులు చదవని శాస్రాం, కవులు వ్రాయని గ్రంధం

ప్రేమ
ప్రేమ,
నాకు సంతోషాన్ని పంచింది
నన్ను మనిషిని చేసింది
నాలో కోరికలని పెంచింది
నా జీవితం పై ఆస పుట్టించింది.
ప్రేమ,
నా నవ్వుకి కారణమయ్యింది
నా ముంగిటికి స్వర్గాన్ని తెచ్చింది
నా ఆశకి అంతు లేకుండా చేసింది
నా శక్తిని పెంచింది.
ప్రేమ,
నా చేత ఫోనులో అంత సేపు మాట్లాడించింది
నన్ను మంచులో పడుకోబెట్టింది
నా చేత పరుగులు పెట్టించింది
నన్ను ప్రతి క్షణం జీవింపచేసింది
ప్రేమ,
నన్ను వర్షంలో తడిపింది
మండుటెండలో నడిపింది
చిరుగాలి స్పర్శ తెలియజెప్పింది
చిరు నవ్వుకు అర్థం తెలిసోచ్చేలాచేసింది
ప్రేమ,
భవిష్యత్తు పై భయం పుట్టించింది
"బంగారు" బాటకు తపింపజేసింది ( ఆమెను బంగారూ అని పిలుచుకునేవాడిని )
డబ్బులు పోగేయించింది
బ్రతుకుపై బరోసా కల్పించింది
ప్రేమ,
కలలు ఎలా కనాలో తెలియచేసింది
కన్నీళ్లు కానరానీయలేదు
వృత్తిలో పోటీ పెంచింది
"మా" బంగారు భవిష్యత్తుకి మార్గం సుగమం చేసింది.
ప్రేమ,
ఆమె మనసు మార్చింది
ఆమె మాటలు నాకు వినిపించకుండా చేసింది
ఆమెకు నా వేదన కనిపించకుండా చేసింది
ఆమెకు వేరొకరిని వెతికిపెట్టింది..

ప్రేమ...అంటే
ప్రేమ...అంటే.....? చంపేదో , చచ్చోదో కాదు....బ్రతికేది ,
బ్రతికించేది.....ప్రేమ గుడ్డిది కావచ్చు...
కానీ మనం గుడ్డి వాళ్ళం కాదు.....
బ్రతికించేది.....ప్రేమ గుడ్డిది కావచ్చు...
కానీ మనం గుడ్డి వాళ్ళం కాదు.....
ఓ నేస్తమా
కన్నులు కలలను మరచిపోవు...
ఊపిరి శ్వాసను మరచిపోదు...
వెన్నెల చంద్రుడిని మరచిపోదు...
నా మనసు నీ స్నేహన్ని మరచిపోదు...
విరిసిన వెన్నెల కరిగిపోతుంది...
వికసించిన పువ్వు వాడిపోతుంది..
కాని చిగురించిన మన స్నేహం చిరకాలం మిగిలిపోతుంది...
వద్దన్నా వచ్చేది మరణం...
పోవద్దన్నా పోయేది ప్రాణం..
తిరిగి రానిది బాల్యం....
మరువలేనిది మన స్నేహం..
కుల మత బేధం లేనిది...
తరతమ భావం రానిది...
ఆత్మార్పణమే కోరుకొనేది...
ప్రతిఫలమన్నది ఎరుగనిది ని స్నేహం
కిరణానికి చీకటి లేదు,
సిరి మువ్వ కి మౌనం లేదు,
చిరు నవ్వు కి మరణం లేదు,
మన స్నెహానికి అంతం లేదు,
మరిచే స్నెహం చేయకు,
చేసే స్నెహం మరవకు......ఓ నేస్తమా .......................

అందుకే ప్రేమను
సహజంగా వుడటానికి ఇష్టపడతాను
ప్రేమ అనే పరీక్షా రాసి వీచివున్న విద్యార్ధిని
జీవితమే ఒక ఆట ఆ ఆట లో గెలుపుతో పటుఓటమి
ప్రేమ తో పాటు భాద ఆనందం తో దుక్కము ఉంటుంది
సముద్రపు అలలా పైకి క్రిందకు ఎగసి పడుతుంది
జీవితం లో ఒక సరి జారిగిన తప్పు మరల రేపెట్ చైయకుంటే చాలు మనం జీవితం లో
గెలుపొంధతనికి
ఒక అందమైన చిన్ని కథ - చెబుతాను వింటారా? ఊఁ కొట్టండి!!
ఒక అబ్బాయికి కేన్సర్, నెలరోజులు మాత్రమే బ్రతుకుతాడు..
ఆ అబ్బాయి ఒక CD షాపులో పనిచేసే ఒక అందమైన అమ్మాయిని ఇష్టపడతాడు.
కాని అతడు తన ప్రేమ గురించి ఆ అమ్మాయికి చెప్పడు.
ప్రతిరోజూ కేవలం ఆమెతో మాట్లాడడానికి అతను ఆ షాపుకి పోయి ఒక CD కొంటాడు.
... ఒక నెల రోజుల తర్వాత తను చనిపోతాడు..
ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇంటికెళ్ళి అతని గురించి వాకబు చేస్తుంది.
అతని అమ్మగారు అతను చనిపోయాడని చెప్పి - అతని గదిలోకి ఆమెని తీస్కెల్లుతుంది....
అతను కొన్న అన్ని సిడీలు ఇంకా తెరవలేదనీ.. ఆ అమ్మాయి గమనిస్తుంది....
ఆ అమ్మాయి ఏడ్చీ, ఏడ్చీ చివరకు - తనూ మరణిస్తుంది.
తనెందుకు ఏడ్చిందో మీకేమైనా తెలుసా???
ఆమె కూడా తనని ప్రేమిస్తుంది.
ఆమె - అతనిపట్ల ఉన్న ప్రేమని ఉత్తరాలుగా రాసి ఆ CD కవర్లలో ఉంచుతుంది.
ఈ చిన్ని కథలో నీతి ఏమిటంటే:
మీరు ఎవరినైనా ప్రేమిస్తే, ఏదైనా చెప్పాలని అనుకుంటే - సూటిగా చెప్పేయండి....
ప్రేమించిన వాళ్ళు పక్కన వుంటే ప్రపంచం అందంగా కనిపిస్తుంది. ఒకవేళ వారి
ప్రేమే దూరమైతే ఎంతో అందంగా కనిపించిన ప్రపంచం కూడా అందకారంగా
మారిపోతుంది... అందుకే ప్రేమను, ప్రేమించే వాళ్ళను ఎప్పుడు దూరం
చేసుకోవద్దు.... ప్లీజ్.

గు౦డె చప్పుడు
ప్రేయసి ఊర్వసి నా అ౦దాల రాక్షసి..
మేఘ౦ లా నే నిను విడిచి పొవునడది...వర్ష౦లా నీ దరి చేరే౦దుకే..
నా హ్రుదయ౦లో నిదురి౦చే చెలి...
ఒక్క సారి నీ కనులు మూసి చూడు..
నీ గు౦డె చప్పుడు వినిపి౦చే౦త దగ్గరగా నేను౦టాను
మేఘ౦ లా నే నిను విడిచి పొవునడది...వర్ష౦లా నీ దరి చేరే౦దుకే..
నా హ్రుదయ౦లో నిదురి౦చే చెలి...
ఒక్క సారి నీ కనులు మూసి చూడు..
నీ గు౦డె చప్పుడు వినిపి౦చే౦త దగ్గరగా నేను౦టాను
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)