31, మార్చి 2011, గురువారం

బాబాయ్ - అబ్బాయ్ మధ్య ఉప ఎన్నికల పోరు ప్రారంభమైనట్లే.

కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ సీట్లకు బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డికి, అబ్బాయ్ వైయస్ జగన్ మధ్య ఉప ఎన్నికల పోరు ప్రారంభమైనట్లే. ఈ రెండు స్థానాలకు ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడులైంది. దీంతో వివేకానంద రెడ్డి, జగన్ మధ్య ఉప ఎన్నికల పోరు జోరందుకుంటుంది. ఇప్పటికే ఈ ఎన్నకలకు కాంగ్రెసు పార్టీ వ్యూహరచన చేసింది. బుధవారంనాడు కడప జిల్లా ఇంచార్జీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ జిల్లా నాయకులతో విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, అహ్మదుల్లాలతో పాటు శాసనసభ్యుడు వీరశివా రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.


పార్టీ బలహీనంగా ఉన్న జమ్మలమడుగు వంటి ప్రాంతాల్లో పార్టీ ఇంచార్జీలను నియమించాలని కాంగ్రెసు నాయకులు నిర్ణయించుకున్నారు. మంత్రి పదవికి రాజీనామా సమర్పించిన వివేకానంద రెడ్డి ఇక పూర్తిగా ఉప ఎన్నికలపైనే దృష్టి కేంద్రీకరించనున్నారు. వైయస్ జగన్‌ను ఓడించేందుకు తగిన వ్యూహరచన చేస్తున్నారు. జిల్లా నాయకులతో, కార్యకర్తలతో ఆయన తన సంబంధాలను పునరుద్ధరించుకుంటారు. శాసనసభలో జరిగిన వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు సిద్ధపడుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి లక్ష్మణుడిలా కాపు కాశానని, ఇందులో భాగంగానే వైయస్‌ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీని ఎదుర్కున్నానని ఆయన చెప్పుకునే అవకాశాలున్నాయి.

వైయస్ రాజకీయాలకు వాస్తవంగా తానే వారసుడినని చాటుకోవడానికి ఆయన ప్రయత్నిస్తారు. పులివెందుల శాసనసభ నియోజకవర్గంలో ఆయన తన వదిన వైయస్ విజయలక్ష్మి మీద పోటీ చేయనున్నారు. కడప పార్లమెంటు సీటులో వైయస్ జగన్‌పై తన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి పోటీకి దించుతున్నారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని, తనకు పదవులపై ఆశ లేదని, అయితే వైయస్ ఆశయాలు కొనసాగాలంటే తనను గెలిపించాలని ఆయన ఓటర్లతో చెప్పే అవకాశాలున్నాయి.

వైయస్ జగన్ వర్గం దిమ్మ తిరిగి పోయింది.

మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి వ్యూహానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ వర్గం దిమ్మ తిరిగి పోయింది. వైయస్ రాజశేఖర రెడ్డి భూ కేటాయింపులపై తెలుగుదేశం పార్టీ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సమయంలో శాసనసభలో వివేకానంద రెడ్డి రెచ్చిపోయారు. తెలుగుదేశం సభ్యులపైకి దూసుకెళ్లి దాడికి యత్నించారు. ఈ సమయంలో వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు వివేకానంద రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఆవేశకావేశాల మధ్య జరుగుతున్నదేమిటో వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులకు అర్థం కాలేదు. అర్థమయ్యే సరికి దృశ్యం మారిపోయింది.

త్వరలో జరిగే పులివెందుల, కడప ఉప ఎన్నికల నేపథ్యంలో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను తాను తప్ప మరెవరూ కాపాడలేరని చెప్పుకోవడానికి వైయస్ వివేకానంద రెడ్డి శాసనసభలో అంతగా రెచ్చిపోయారని కాస్తా ఆలస్యంగా వైయస్ జగన్ వర్గం గుర్తించింది. దీంతో అప్పటి వరకు వివేకాకు మద్దతుగా నిలిచిన వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు రివర్స్ గేర్ వేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమ్మక్కయి వివేకానంద రెడ్డితో నాటకం ఆడించారని ఆడిపోసుకోవడం ప్రారంభించారు.

అతను కనిపించేవాడు కాదు,పాత్ర మాత్రమే కనిపించేది

నటుడు నూతన్ ప్రసాద్ ఇక లేరంటే నమ్మడం కష్టమే. బామ్మ మాట బంగారు బాట సినిమా షూటింగ్‌లో 1989లో ప్రమాదానికి గురై వీల్ చైర్‌కే పరిమితమైనప్పుడు ఒక్కసారి తెలుగు సినీ ప్రేక్షక లోకం ఓసారి విషాద సముద్రంలో మునిగిపోతే, ఇప్పుడు ఆయన మరణవార్త విని కన్నీటి సముద్రమైంది. తెలుగు సినీరంగంపై, ప్రేక్షక లోకంపై నూతన్ ప్రసాద్ వేసిన ముద్ర చిన్నదేమీ కాదు. విభిన్న పాత్రలను పోషించిన నూతన్ ప్రసాద్ ప్రేక్షకులకు ఆయన పోషించిన పాత్ర మాత్రమే కనిపించేది, అతను కనిపించేవాడు కాదు. సునిశితమైన హాస్యంతో విలనిజాన్ని పండించిన ఘనత నూతన్ ప్రసాద్‌కు దక్కుతుంది. తనదైన డిక్షన్‌తో, బాడీ లాంగ్వేజ్‌తో నూతన్ ప్రసాద్ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. నూటొక్క జిల్లాల అందగాడు ఎవరంటే ఇప్పటికీ ఆయనే.


నూతన్ ప్రసాద్ 1950 అక్టోబర్ 10వ తేదీన కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించాడు. 1973లో అక్కినేని నాగేశ్వర రావు హీరోగా నటించిన అందాల రాముడు సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యాడు. బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాలముగ్గు సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. రావుగోపాల రావుతో కలిసి విలనిజాన్ని అతను పండించాడు. ఏ పాత్ర పోషించినా తనదైన ముద్ర వేశాడు. హాస్య నటుడిగా, కెరీర్ ఆర్టిస్టుగా, విలన్‌గా ఆయన విభిన్న పాత్రలను పోషించాడు. ఒక సినిమాలో హీరోగా కూడా చేశాడు. పాత్రకు తగిన మ్యానరిజాన్ని చూపడంలో నూతన్ ప్రసాద్‌ది అందే వేసిన చేయి. నటనలో నూతన్ ప్రసాద్ తమను మించిపోతాడేమోనని సహ నటులు భయపడి పోటీ పడి నటించేవారట.

రాజాధిరాజ సినిమాలో నూతన్ ప్రసాద్ పోషించిన పాత్ర ప్రత్యేకమైంది. కొత్తా దేవుడండీ అనే పాటకు ఆయన నటించిన తీరును తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఆయన నోట వచ్చిన దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉంది అనే డైలాగ్ అన్ని రంగాల్లో ఓ ఊతపదంలా మారింది. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి వంటి పలువురు అగ్ర హీరోలతో కలిసి ఆయన నటించారు. ఎవరితోనూ నూతన్ ప్రసాద్‌కు విభేదాలు గానీ గొడవలు గానీ లేకపోవడం, ఆయనపై ఫిర్యాదులు కూడా లేవు. గాసిప్స్ లేవు. అంటే, అతని వ్యక్తిత్వమేమిటో అర్థం చేసుకోవచ్చు.
తొలి తరం కథానాయకులతో ఎంత విస్తృతంగా ఆయన నటించారో, రెండో తరం కథానాయకులతోనూ అంతే విస్తృతంగా నటించారు. పట్నం వచ్చిన ప్రతివ్రతలు, ఖైదీ, మగమహారాజు, శ్రీవారికి ప్రేమలేఖ, కథానాయకుడు, అహ నా పెళ్లంట వంటి పలు చిత్రాల్లో ఆయన నటించి మెప్పించారు. 1984లో నూతన్ ప్రసాద్ నంది అవార్డు అందుకున్నారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డు కూడా ఆయనను వరించింది. అవార్డులు ఆయన విశిష్టతను వ్యక్తం చేయలేవు. ప్రేక్షకులపై, సినీ రంగంపై ఆయన వేసిన విశిష్ట ముద్ర ఎల్లకాలం నిలబడిపోతుంది.

చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి భారత్ పైనల్లో అడుగు పెట్టింది.

చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి భారత్ పైనల్లో అడుగు పెట్టింది. మొదట్లో భారత బౌలర్లను భయపెట్టిన పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ వచ్చింది. బలమైన భాగస్వామ్యం నెలకొనకుండా భారత బౌలర్లు పాకిస్తాన్‌ను కట్టడి చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు ఏ మాత్రం ప్రభావం చూపని స్పిన్నర్ హర్భజన్ ఈ మ్యాచు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అతను రెండు వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో విఫలమైన యువరాజ్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ మిస్బావుల్ హక్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఫైనల్లో భారత్ ఏప్రిల్ 2వ తేదీన శ్రీలంకను ఎదుర్కుంటుంది. పాకిస్తాన్‌పై భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ ప్రధాని గిలానీ మ్యాచును చివరి దాకా చూశారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కూడా భారత విజయాన్ని ఆస్వాదించారు.


యువరాజ్ సింగ్ 103 పరుగుల పాకిస్తాన్ స్కోరు వద్ద కమ్రాన్ అక్మల్‌ను అవుట్ చేయడంతో పరుగుల వరదకు బ్రేక్ పడింది. ఆ తర్వాత కొద్ది సేపటికే 106 పరుగుల వద్ద యువరాజ్ సింగ్ యూనిస్ ఖాన్‌ను అవుట్ చేసి పాకిస్తాన్ వెన్ను విరిచాడు. తొలి ఓవర్లలో ఏ మాత్రం ప్రభావం చూపని భారత ఫాస్ట్ బౌలర్లు ఆ తర్వాతి స్పెల్స్‌లో పాకిస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడమే కాకుండా వికెట్లు కూడా తీశారు. నెహ్రా చివరి ఓవర్లలో బాగా రాణించాడు. పాకిస్తాన్ స్కోర్ 142 పరుగులు ఉన్నప్పుడు ఉమర్ అక్మల్ అవుట్ కావడంతో దాదాపుగా భారత విజయం ఖాయమైంది. పాకిస్తాన్ కెప్టెన్ ఆఫ్రిదీ దూకుడుగా ఆడి 184 పరుగుల వద్ద హర్భజన్ చేతిలో అవుటయ్యాడు.
నెహ్రా 199 పరుగుల వద్ద రియాజ్ వాహబ్‌ను, 208 పరుగుల వద్ద ఉమర్ గుల్‌ను అవుట్ చేశాడు. పాకిస్తాన్ అప్పటికి 23 బంతుల్లో 53 పరుగులు చేయాల్సి ఉంది. పాకిస్తాన్ చేతిలో ఒకే ఒక వికెట్ ఉంది. జహీర్ ఖాన్ బౌలింగ్‌లో మిస్బావుల్ హక్ అదరగొట్టాడు. ఆ తర్వాత మునాఫ్ పటేల్ ఓవర్‌లో అతను ఓ భారీ సిక్స్ కొట్టాడు. ఆ స్థితిలో 49 ఓవర్లలో పాకిస్తాన్ 231 పరుగులు చేసింది. ఒక ఓవరులో పాకిస్తాన్ 30 పరుగులు చేయాల్సి ఉంది. చివరి ఓవరులో జహీర్ ఖాన్ పాకిస్తాన్‌ను పూర్తిగా కట్టడి చేశాడు. దీంతో భారత్ విజయం ఖాయమైంది. ఒక బంతి మిగిలి ఉండగా జహీర్ చివరి వికెట్‌ను పడగొట్టాడు. దీంతో భారత్ విజయాన్ని అందుకుంది.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ ఆరంభంలో అదరగొట్టింది. వీరేంద్ర సెహ్వాగ్ మెరుపు ఇన్నింగ్సు తర్వాత భారత్ ఆ వేగాన్ని ఏ సందర్భంలోనూ అందుకోలేకపోయింది. భారత బ్యాట్స్‌మెన్ పేలవమైన ఆటనే ప్రదర్సించారని చెప్పవచ్చు. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 260 పరుగులు చేసింది. పాకిస్తాన్ ముందు 261 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బ్యాట్స్‌మెన్‌లో సచిన్ టెండూల్కర్ కాస్తా మెరుగ్గా కనిపించాడు. అతనికి కూడా నాలుగు లైఫ్‌లు వచ్చాయి. సెహ్వాగ్ 38 పరుగులకు అవుట్ కాగా, టెండూల్కర్ 85 పరగులు చేశాడు. చివర్లో సురేష్ రైనా కాస్తా మెరుగ్గా ఆడి 36 పరగులు చేయడం వల్ల ఆ కాస్తా స్కోరునైనా చేయగలిగింది. ప్రపంచ కప్ పోటీల్లో అద్భుతంగా రాణించిన యువరాజ్ సింగ్ డకౌట్ కావడం భారత్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. విరాట్ కోహ్లీ కూడా తక్కువ స్కోరే చేశాడు.

పాకిస్తాన్ బౌలర్ వాహబ్ రియాజ్ భారత బ్యాట్స్‌మెన్ వెన్ను విరిచాడు. అత్యంత కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచులో అతను ఐదు భారత వికెట్లు పడగొట్టాడు. షోయబ్ అక్తర్‌ను పక్కన పెట్టి తనను తీసుకున్నందుకు తగిన ప్రతిఫలాన్ని పాకిస్తాన్‌కు అందించాడు. ఎప్పటిలాగే భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగులో విఫలమయ్యాడు.

30, మార్చి 2011, బుధవారం

""దేశం చాలా క్లిష్ట పరిస్ధితుల్లో ఉంది"' కాని నూటొక్క జిల్లాల అందగాడు ఇకా లేరు

ప్రముఖ సినీ నటుడు నూతన ప్రసాద్ ఈ రోజు(30, మార్చి 2011) ఉదయం అపోలో హాస్పటల్ లో మృతి చెందారు.ఆయన గత కొంత కాలంగా అస్వస్ధతో చికిత్స పొందుతున్నారు.నూటొక్క జిల్లాల అందగాడు గా ఫేమస్ అయిన నూతన ప్రసాద్ కెరీర్ అక్కినేని.. అందాల రాముడు(1973) చిత్రంతో మొదలైంది. ఆ తర్వాత ఆయన నీడలేని ఆడది వంటి చిత్రాలు చేసినా బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు చిత్రంతో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు. నెగిటివ్ పాత్రలను తనదైన శైలిలో పండిస్తూ ఒకానొక స్టేజిలో నూతన ప్రసాద్ లేనిదే తెలుగు సినిమా లేదు అన్న స్ధితికి చేరుకున్నారు. ఆయన డైలాగ్ డెలవరి కామిక్ టచ్ తో విలనిజానకి కొత్త అర్దం చెప్తూ సాగింది.

ఎన్టీఆర్, ఎన్నార్, కృష్ణ, చిరంజీవి వంటి పెద్ద పెద్ద హీరోలందరితో చేసిన నూతన ప్రసాద్ కామిడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు అన్న తేడా లేకుండా అన్ని పాత్రలకూ న్యాయం చేస్తూ వచ్చారు.ఇక రాజాధిరాజు చిత్రంలో ఆయన కొత్త దేముడండి అనే పాటతో పీక్ స్దాయికి వెళ్ళారు.దేశం చాలా క్లిష్ట పరిస్ధితుల్లో ఉంది అంటూ పట్నం వచ్చిన పతివ్రతల్లో ఆయన చెప్పిన డైలాగు ఇప్పటికీ ఓ తరం తెలుగు వారందరికీ పరిచయమే. 1989 లో బామ్మ మాట బంగారు బాట చిత్రం సమయంలో ఆయనకు యాక్సిడెంట్ అయి కెరీర్,శరీరం కుంటుపడినా తన మనోబలంతో జయించి నటనలో కంటిన్యూ అయ్యారు. ఈ టీవీ వారి నేరాలు- ఘోరాలు లో ఆయన చెప్పే వాయిస్ కూడా అద్బుతంగా పేలింది. ఇలా తనకంటూ తెలుగువారి గుండెల్లో స్ధానం ఏర్పడుచుకున్న నూతన ప్రసాద్ మరణం తెలుగు సినీ పరిశ్రమకే కాక తెలుగు వారందిరీ తీర్చేలేని లోటే. ఆయన మరణానికి నేను నా ప్రగాడ సంతాపం తెలియచేస్తోంది

ఈ 30 ఏళ్లలో తెలుగుదేశం స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయాయి.

తెలుగుదేశం పార్టీ 29 ఏళ్లు పూర్తి చేసుకుని 30 ఏళ్ల పడిలో అడుగు పెట్టింది. ఎన్‌టి రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారు. ఈ 30 ఏళ్లలో తెలుగుదేశం స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయాయి. పుట్టిననాటి లక్షణాలు, లక్ష్యాలు పార్టీకి ఏ మాత్రం లేవు. ప్రాథమిక లక్ష్యాలను కూడా తన చేతిలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వదిలేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవం ఎన్టీ రామారావు ప్రధాన నినాదం. దాని గురించే తాము కూడా పాటుపడుతున్నామని చంద్రబాబు చెబుతున్నారు. ఈ విషయంలో కూడా చంద్రబాబుకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఏ తెలుగు ప్రజల ఆత్మగౌరవమని తెలంగాణ ప్రజలు ప్రశ్నించేంతగా పరిస్థితులు మారిపోయాయి. తెలంగాణలో ఎన్టీ రామారావుకు ఎంతగా ఆదరణ ఉండేదో చంద్రబాబుకు అంతగా ఆదరణ తగ్గిపోయింది.


తెలంగాణ ఉద్యమం చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఈ ప్రాంతంలో కూకటివేళ్లతో పెకలించే పరిస్థితి ఏర్పడింది. ఎన్టీ రామారావు తెలుగుదేశం ద్వారా తెలంగాణలోని బిసిలు, ఎస్సీలు, ముఖ్యంగా యువకులు రాజకీయాల్లో అడుగు పెట్టారు. రాజకీయానుభవం లేని పలువురు విద్యావంతులైన యువకులు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. కొత్తరక్తం తెలుగుదేశంలోకి ఇప్పుడు రావడం లేదు. తెలంగాణ ఉద్యమం వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆ పాత్ర నిర్వహిస్తోంది. తెలంగాణ ఉద్యమం వల్ల తెలుగుదేశం నష్టపోవడమే కాకుండా కొత్తగా వచ్చే వారు లేకుండా పోయారు. ఈ విషయాన్ని అలా పక్కన పెడితే సీమాంధ్రలోనూ తెలుగుదేశం పార్టీలోకి వచ్చే వారు లేకుండా పోయారు. తెలుగుదేశం పార్టీ నుంచే కొత్తగా వచ్చే రాజకీయ పార్టీల్లోకి వలసలు పోతున్నారు. ఇంతకు ముందు చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్తే, ఇప్పుడు వైయస్ జగన్ పార్టీలోకి వెళ్తున్నారు. ఎన్టీ రామారావు అందించిన స్ఫూర్తిని రాజకీయ శ్రేణులకు, ప్రజలకు అందించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే, తెలుగుదేశం పార్టీకి ప్రాణ వాయువుగా పనిచేస్తూ వచ్చిన చాలా ప్రజా సంక్షేమ పథకాలకు చంద్రబాబు తిలోదకాలిచ్చారు. కొన్ని పథకాల రూపురేఖలు మార్చేశారు. అభివృద్ధి పేరుతో కార్పొరేట్ వ్యవస్థను ఆయన నమ్ముకున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ నడపాలనే ఉద్దేశంతో కాకుండా తాను చెప్పినట్లుగా, తన విధానాలకు అనుగుణంగా ప్రజలు మారాలనే విధానాన్ని చంద్రబాబు అనుసరించారు. ఇందులో భాగంగానే ఆయన వ్యవసాయం దండుగ అని, మానవ శాస్త్రాలు చదవడం అనవసరమని కొత్త సూత్రాలను ప్రచారం చేస్తూ వచ్చారు. దీంతో, పునాది స్థాయిలో చంద్రబాబు మద్దతును కోల్పోతూ వచ్చారు. ఇక్కడే, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పాపులు కదిపి గ్రామీణ, పేద వర్గాల మద్దతును సంపాదించుకున్నారు. దీంతో 2004లో చంద్రబాబు అధికారం కోల్పోయారు. తొమ్మిదేళ్ల పాటు అందించిన పాలన వల్ల చంద్రబాబు విశ్వసనీయతను కోల్పోయారు. దాంతో 2009 ఎన్నికల్లో ప్రజలు ఆయనను విశ్వసించలేకపోయారు. దానివల్ల అధికారం మళ్లీ కాంగ్రెసుకే దక్కింది.

అంతేకాకుండా, చంద్రబాబు తాను చెప్పిందే అందరూ వినాలనే వైఖరిని అవలంబిస్తుండడం వల్ల సలహాలు ఇచ్చేవారు కరువయ్యారు. పార్టీ నాయకులు చంద్రబాబు చెప్పింది వినడం లేదా పక్కకు జరగడం అనే పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. వారి సలహాలకు, వారి అభిప్రాయాలకు ఏ మాత్రం విలువ ఉండడం లేదు. ఎన్టీ రామారావు చండశాసనుడిలా కనిపించినా, ప్రజలకు మేలు జరుగుతుందని నమ్మేట్లు చెప్తే వినేవారు. తన వైఖరిని మార్చుకోవడానికి కూడా సిద్ధపడేవారు. ఈ లక్షణం చంద్రబాబులో లేదు. మొత్తంగా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ఏ విధంగానూ పోలిక లేదు. పేరుకు మాత్రమే ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీగా మిగిలిపోయింది.

దాయాదుల మధ్య పోరుకు సమయం ఆసన్నమైంది.

దాయాదుల మధ్య పోరుకు సమయం ఆసన్నమైంది. బుధవారం భారత్, పాకిస్తాన్ మధ్య జరగనున్న క్రికెట్ పోరుకు మొహాలీ స్టేడియం వేదిక కానుంది. ఆ ఆటను చూడటానికి భారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ ప్రధాని గిలానీతో పాటు పలువురు వివిఐపిలు సిద్ధంగా ఉన్నారు. ఇరు జట్లు అద్భుత పటిమ కనబరుస్తూ సెమీ ఫైనల్‌కు వచ్చి కప్పు కోసం పోరుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ ఆటలో భారత్‌తో పాటు పాక్ జట్టుపై కూడా ఒత్తిడి పని చేస్తుంది. సొంత గడ్డపై ఆడటం, ప్రధాని, సోనియా వంటి హేమాహేమీలు మ్యాచ్ చూడటం తదితర అంశాలు భారత్‌ను ఒత్తిడికి గురి చేస్తే, ఫిక్సింగ్ హెచ్చరికలు పాక్‌ను తప్పకుండా ఒత్తిడికి గురి చేసే అంశం. ఇప్పటి వరకు వారిపై ఒత్తిడి లేకున్నప్పటికీ ఈ అంశం మాత్రం వారిని అన్నింటికంటే ఎక్కువ ఒత్తిడిలోకి నెట్టివేసే అంశం

ఈ దశలో భారత్ శారీరక కసరత్తుతో పాటు మానసిక కసరత్తును కూడా చేస్తోంది. భారత కెప్టెన్ ధోని తన సహచరులకు ఒత్తిడికి గురి కావద్దని సూచనలు చేస్తున్నారు. మ్యాచ్‌ను కూడా ఎక్కువగా ఊహించుకోవద్దని ధోనీ సూచనలు ఇచ్చారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన బ్యాట్ బరువు కూడా పెంచుతున్నట్లుగా తెలుస్తోంది. బరువైన బ్యాట్‌తో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడానికి సచిన్ సిద్ధమయ్యారు. గ్రూప్ దశలో భారత్ ఒక మ్యాచ్‌లో ఓడిపోయి మరో మ్యాచ్‌ను డ్రా చేసుకొని సెమీస్‌లోకి ప్రవేశించినప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొన్నది. అయితే ధీటైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో మాత్రం ఆడిన మ్యాచ్‌లో భారత క్రికెటర్లు అందరూ సమష్టిగా రాణించి విజయం సాధించారు.
ఆసీస్‌పై సమిష్టి విజయం, యువరాజ్ సింగ్ ఫాంలోకి రావడం భారత్‌కు కలిసి వచ్చే అంశాలు. అయితే బౌలింగ్‌లో ఆసీస్ మ్యాచ్‌లో తప్ప మొదటి నుండి జహీర్ తప్ప మిగిలిన ఫేసర్లు ఎవరూ అతనికి తోడ్పాటును ఇవ్వడం లేదు. గ్రూపు దశలో దక్షిణాఫ్రికాతో ఓటమి చెందిన భారత్ ఓ దశలో అందరి అంచనాలలోనుండి తొలగిపోయిన పరిస్థితి ఏర్పడినప్పటికీ ఆసీస్‌పై గెలుపుతో అవే అంచనాలు భారీగా పెంచుకుంది. బ్యాటింగ్ ఆర్డర్ భారత్‌కు బలంగానే ఉన్నప్పటికీ ఒక్క వికెట్ కోల్పోతే క్యూలైన్ కట్టడమే భారత్‌ను భయపెడుతున్న అంశం. ఆసీస్ మ్యాచ్ మాత్రం అందుకు మినహాయింపు. ఇదే మనకు ఊరట. ఆసీస్‌పై చెలరేగుతాడనుకున్న భజ్జీ ఇంత వరకు ప్రపంచ కప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన చూపించలేదు.

తన భుజ బలంతో పాటు బుర్రతో బౌలింగ్ చేసే ఉమర్ గుల్ భారత క్రికెర్లను కట్టు చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే పాక్ కెప్టెన్ అఫ్రిదీ సచిన్‌ను సెంచరీల సెంచరీలు చేయకుండా అడ్డుకుంటామని చెప్పి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అప్పుడు సచిన్ వర్సెస్ అక్తర్ పోరు, ఇప్పుడు సచిన్ వర్సెస్ ఉమర్ గుల్ మధ్య సాగనుంది. సచిన్‌ను బోల్తా కొట్టించడంలో అక్తర్ ఫెయిల్ అయినప్పటికీ గుల్ మాత్రం పూర్తి నమ్మకంతో ఉన్నాడు. గ్రూపు దశలో పాక్ మొదట హ్యాట్రిక్ విజయాలతో దూసుకు పోయింది. అయితే ఆ తర్వాత అతిచిన్న జట్లతో చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచింది.

పాక్‌పై అనిశ్చిత జట్టు అనే ముద్ర కూడా ఉంది. సెమీ ఫైనల్లో వెస్టిండీస్‌ను బోల్తా కొట్టించినప్పటికీ వెస్టిండీస్‌పై ఎవరికీ అంచనాలు లేవు. అసలు వెస్టిండీస్ గ్రూపు దాటుతుందా అనే పరిస్థితిలో నుండి బయట పడి బంగ్లాదేశ్‌తో సమానంగా పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రెట్ కారణంగా క్వార్టర్‌కు చేరుకుంది. ఆలాంటి జట్టుపై పాక్ గెలవదని ఎవరూ అనుకోరు. అయితే క్వార్టర్‌నుండి సెమీస్‌కు ఈజీగా వచ్చిన పాక్ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన, బలమైన భారత జట్టుతో తలపడి గెలవాలని భావిస్తోంది.

భారతీయత

భారతీయుడై పుట్టినందుకు గర్వించకు.
భారతీయత ఆచరించినప్పుడు గర్వించు.

తెలుగువాడిగా పుట్టినందుకు ఆనందించకు
తెలుగుతనాన్ని చాటి చెప్పినప్పుడు ఆనందించు.

వేదాలతో విద్యావంతుణ్ణని విర్రవీగకు
వెలుపలి వారికి విద్యా దానం చేసినపుడు విర్రవీగు.

తాతలు నేతులు తాగారని నినదించకు
చేతలు నీతిగ సాగినపుడు నినదించు.

ఏదీ కానప్పుడు నోరు మూసుకో
ఎగతాళి మాత్రం చేయకు.

ఇదండీ సామాన్య ప్రజలకు, దేశాన్ని నడపాల్సిన రాజకీయ నాయకులకు ఉన్న తేడా!

ఒకానొక రోజున ఒక పూల కొట్టాయన క్షవరం చేయించుకోవటానికి మంగలి కొట్టుకు వెళ్ళాడట. సరే వెళ్ళిన పని అయినాక, డబ్బులు ఎంత ఇవ్వాలి అని ఆయన అడగ్గా, మంగలిగారు, "మీ దగ్గర డబ్బులు తీసుకొను, నేను ప్రస్తుతం ఈ వారం అంతా సోషల్ సర్వీస్ చేస్తున్నాను!" అవటా అనేసాడుట. ఆ పూల కొట్టాయన చాలా సంతోషించి వెళ్ళిపోయాడట.

మర్నాడు కొట్టు తెరవబోయిన మంగాలాయనకు, కొట్టు బయట ఒక డజను చక్కటి గులాబీ పూలు చక్కగా అమర్చి కనబడ్డాయట, వాటితోపాటుగా, పూలకోట్టాయన పంపిన "ధన్యవాదాలు" కార్డు కూడ ఉన్నదట.

మర్నాడు మంగాలాయన తన షాపు తెరిచాడు, ఆ రోజున ఒక పోలీసాయన క్షవరానికి వచ్చాడు, అయనకి కూడ మంగాలాయన డబ్బులు తీసుకోలేదు. పోలీసాయన చాలా సంతోషించి వెళ్ళిపోయాడు. మర్నాడు మంగాలాయన షాపు తెరిచేప్పటికి బయట చక్కటి తినుబండారాలు షాపు బయట ఆయనకోసం పోలీసాయన పంపినవి సిద్ధంగా ఉన్నాయట.

ఈరోజు ఎవరొస్తారో కదా అనుకుంటూ ఉండగా, ఒక రాజకీయ నాయకుడు క్షవరానికి వచ్చాడు. పని అయినాక , అయనకి కూడ మంగాలాయన డబ్బులు తీసుకోను, నేను సోషల్ సర్వీస్ చేస్తున్నాను అనేశాడు. ఆ రాజకీయ నాయకుడు కండువా దిద్దుకుంటూ సంతోషంగా వెళ్ళిపోయాడు.

మర్నాడు మంగాలాయన కొంచెం తొందరగానే వెళ్ళాడు షాపు తెరవటానికి, ఇవ్వాళ ఏమి ఆశ్చర్యం చూడాలో అనుకుంటూ. కానీ షాపు ఇంకా తెరవకుండానే, ఓ పాతిక మంది రాజకీయ నాయకులు ఒకరినొకరు తోసుకుంటూ, తిట్టుకుంటూ షాపు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూస్తున్నారుట.

మంగాలాయన అక్కడకు వెళ్లి, "బాబూ, ఏమిటి మీరంతా ఇలా!!?" అన్నాడుట వాళ్ళందరినీ రోజూ పేపర్లో చూస్తున్న ఫొటోలతో గుర్తించి. అప్పటిదాకా ఒకరినొకరు తోసుకుంటూ తిట్టుకుంటున్న వాళ్ళంతా, ఏక కంఠంతో, అస్సలు ఒక్కళ్ళే మాట్లాడుతున్నారా అన్న భ్రమ కలిగేట్టుగా, "మా సోదరుడు చెప్పాడు, ఇక్కడ ఉచితంగా క్షవరం చేస్తారుటగా, అందుకే వచ్చాం" అన్నారుట నెత్తిమీద టోపీలు వగైరాలు తీస్తూ. ఇదండీ సామాన్య ప్రజలకు, దేశాన్ని నడపాల్సిన రాజకీయ నాయకులకు ఉన్న తేడా!

29, మార్చి 2011, మంగళవారం

TV-గజిబిజి రిపోర్టర్ !!??!!!??

మనం రోడ్ మీద వెళ్తూ ఉంటాం. ఒక కుక్క పిల్ల కాలు విరిగి కుంటుతుంటుంది. మనకి టైం ఉంటె ఆగి దానికి ఏమి కావాలొ చూస్తాం, లేదు అంటె అయ్యో పాపం అని జాలి పడి వెళ్ళిపోతాం.

TV-గజిబిజి రిపోర్టర్ వెళ్తున్నాడు, వెంటనె TV-గజిబిజి ఆఫిస్ కి ఒక ఫొన్ వెళ్తుంది, వాడు కెమెరామెన్ ని పంపుతాడు.

ఇక మొదలు........

క్రిష్ణ ఆ కుక్క పరిస్తితి ఎలా ఉంది? ఎప్పటి నుంచి అక్కడ ఉంది?

ఈ కుక్క మార్నింగ్ నుంచి ఇక్కడే ఉంది, ఇప్పుడు కుంటుంతుంది......స్వప్న

ఆక్కడి వాళ్ళు ఏమన్న చెబుతున్నారు ?...క్రిష్ణ

స్వప్న...ఇక్కడి వాళ్ళు ఇది ఒక కుక్క అని, దాని కాలుకు దెబ్బ తగలటం వల్ల కుంటుతుంది అని చెప్తున్నారు. ఈ విధంగా గతం లొ ఆ కుక్క ఈ area లొ ఇలా కుంటలేదని, ఇదె తాము మొదటి సారి చూడటం అని చెప్తున్నారు

కుంటుతున్న కుక్క స్పందన ఎలా ఉంది? .....క్రిష్ణ

కుక్క ప్రస్తుతం కుంటుతుంది స్వప్న. ఈ విధంగా కాలు కు దెబ్బ తగలటం కొత్త అనుకుంట, అందుకె కుంటటం రాక ఇబ్బంది పడుతుంది. మాట్లాడించటనికి ప్రయత్నించిన అది సమాధానం చెప్పకుండ, మూలుగుతుంది.....స్వప్న

థాంక్ యు క్రిష్ణ, ఎప్పటికప్పుడు తాజా పరిస్థితి సమీక్షిస్తు ఉండటానికి మీకు కాల్ చేస్తూ ఉంటాం.


ఇది గాయపడి కుంటుతున్న కుక్క స్థితి మీద మా క్రైం ప్రతినిధి క్రిష్ణ అందించిన వివరాలు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్..
బ్రేక్ తర్వాత కుక్కలు-కుంటుడు అంశం పై చర్చింటానికి ప్రముఖ Doctor కుక్కుటేశ్వర రావ్ గారు మన Studio కి వస్తున్నారు..


బ్రేక్ తర్వాత..........


బెజార్రావ్ : చెప్పండి కుక్కుటేశ్వర్ రావ్ గారు గతం లొ మీరు ఎప్పుడైన ఇలా కుక్కలు కుంటటము చూసారా? ఒక వేళ చూస్తె ఏ జాతి కుక్కలు కుంటటము చుసి ఉంటారు.

కుక్కుటేశ్వర్ : ఈ విధంగా కుక్కలు కుంటటం ఇది మొదటి సారి కాదు. ఫ్రపంచవ్యాప్తంగ ఎన్నో జాతుల కుక్కలు, ఎన్నో సందర్భాల్లొ ఇలా కుంటినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. కుంటటానికి జాతి తో సంబందం లేదు

బెజార్రావ్: అంటె కుక్కలు కుంటేటప్పుడు వాటికి ఏమన్న బాధ ఉంటుందా? ఉంటె ఎటువంటి బాధ?

కుక్కుటెశ్వర్ : బాధ లొ రకాలు ఉండవండి. కుంటెటప్పుడు general గ దెబ్బ తలిగిన కాలు కి నొప్పి ఉంటుంది అని Dog's Medical Science లొ గట్టి ఆధారాలు ఉన్నాయి.


బెజార్రావ్: తాజా పరిస్థితి చెప్పేందుకు మా క్రైం ప్రతినిధి క్రిష్ణ టెలి ఫొన్ లొ సిద్దం గ ఉన్నారు...క్రిష్ణ చెప్పండి..ఆ కుక్క పరిస్థితి ఎలా ఉంది.

క్రిష్ణ : (చెవిలొ ear piece పెట్టుకుని బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు..)

క్రిష్ణ చెప్పండి..ఆ కుక్క ఫరిస్థితి ఎలా ఉంది?

బేజా... ... కుక్క మూలుగుతుంది, ఇప్పుడె blue cross వాళ్ళు దానిని తీసుకువెళ్ళారు.


కుక్క కాలు కి దెబ్బ తగిలింది, దాని ఇతర శరీర భాగాలు ఎలా ఉన్నయి?...క్రిష్ణ

బేజా, కుక్క కాలు కి మాత్రమే దెబ్బ తగిలింది. కాని ఈ కుక్క తోక వంకర గా ఉంది.

వంకర అంటె ఎలా ఉంది...క్రిష్ణ (ఇప్పుడు బెజార్రావ్ మొహం లొ expressions ఇంకెక్కడా చూడలేము, శత్రువు టాంకర్ ని ద్వంసం చెయ్యటానికి wait చెస్తున్న soldier face లొ తప్ప)


బేజా! వంకర గ అంటిచుకుని ఉంది, నేను ఇప్పటికి దానిని straight చెయ్యటనికి try చేస్తున్నాను కాని అది చుట్టుకుపొతుంది. బహుశ కాలు కి దెబ్బ తగలటం వల్ల అని నా ఉద్దెశం.

థాంక్ యు క్రిష్ణ....కుక్కుటెశ్వర్ గారు, కాలు కి దెబ్బ తగలటం వల్ల తోక వంకర అయ్యి ఉంటుంది అని మా ప్రతినిధి క్రిష్ణ చెప్తున్నారు, దీని పై మీ స్పందన ఏంటి?

కుక్కుటెశ్వర్:స్పందన అంటె ఏమి ఉంటుంది రా పుండకార్ వెధవ...కుక్క తోక కాలు కి దెబ్బ తగలటం వల్ల వంకర అయ్యేది ఏంట్రా పిచ్చోడా . ఏమి మనిషివిరా నువ్వు, ఇప్పటి వరకు నువ్వు రాసి ఇచ్చిన answers చదివాను, ఇంక నా వల్ల కాదు, నా టీ మరిగిపొతూ ఉంటుంది. బంగారం లాంటి మల్లయ్య అనే పేరు మార్చి కుక్కుటెశ్వర్ రావ్ అని మార్చి, షర్ట్, పాంట్ రెంట్ కి తెచ్చి నాకు ఇచ్చి డాక్టర్ లాగ act చెయ్యలా? ఇల act చేస్తె నా tea కొట్టు నుంచి ఎదురు గ ఉన్న మీ గజిబిజి టీవీ office కి రొజు 100 tea లు ఆర్డెర్ ఇస్తారా. మనస్సాక్షి ఉందంట్ర వెధవ *్*్*్*.దొంగ నా &%%్**( గాలి న &$%్**.. మీ బతుకులు చెడ....)

(ఇలా తిడుతు ఉండగానె, గజిబిజి లోగొ వచ్చి, మెరుగైన మీ బతుకులకోసం చూస్తూనే ఉండండి గజిబిజి టీవీ అని voice వినిపించి ads రావటం మొదలవుతాయి..)

వీటి తాకిడికి దూరంగా పోవాలంటే అడవుల్లో బతకాల్సిందే!

ఎక్కడ చూసినా ప్రకటనలే ఇది కొను, అది కొను, మా బ్రాండ్ అంటే మా బ్రాండ్ అంటూ మనల్ని తికమక పెట్టి, మనకు పనికి వచ్చేదో , ఎక్కువసార్లు ఎందుకూ కొరగాని వస్తువులో, సర్వీసెస్ పేరిటో మన చేత అనవసరపు ఖర్చు చేయిస్తున్నాయి ఈ వ్యాపార ప్రకటనలు. వీటి తాకిడికి దూరంగా పోవాలంటే అడవుల్లో బతకాల్సిందే! అంతగా పాకిపోయ్యి కాలుష్య దశకు చేరుకున్నది ఈ వ్యాపార ప్రకటన పిచ్చి.

అవసరం ఉన్నా లేక పోయినా ప్రతి ఉత్పత్తిదారు, చివరకి మధ్య దళారులు కూడా ఎక్కడ పడితే అక్కడే ప్రకటనలను గుప్పించటం, ఒకటో రెండో గీతాలు గీసేసి వాటిని బ్రాండ్ అన్న పేరుతొ మనకు కలల్లో కూడా అవ్వే వచ్చేట్టుగా చెయ్యటం . ఏమన్నా అంటే "Top of Mind Awareness" ట, అంటే ఎల్లాప్పుడూ వాళ్ళ బ్రాండే మనకు గుర్తుకు రావాలని ప్రతివాడి తాపత్రయం.

చివరకు జరిగేది ఏమిటి. తామర తంపరలా పెరిగిపోయిన ఈ వ్యాపార ప్రకటనలు, రోడ్ల మీద, రేడియోలో, టి విల్లో సరే సరి, డివైడర్ల మీద, పత్రికల్లో , మాగాజైన్లల్లో, రైలు పెట్టెల మీద, ఇలా ఎందెందు వెదికిన అందే కలదు ఈ ప్రకటనా గరళం. మనల్ని తోచుకోనివ్వకుండా వెంటాడి వెంటాడి ఏమైనా సరే వాళ్ళు చెప్పిన వస్తువుల్ని కోనేట్టుగా ప్రేరేరింప చెయ్యటమే ఈ ప్రకటనల ముఖ్య ఉద్దేశ్యం.

మనచేత ఈ కాలుష్యాన్ని (శబ్ద, చిత్ర అంతకంటే ప్రమాదకరమైన మానసిక కాలుష్యం) మనకు తెలియకుండానే మన మస్తిష్కాల్లోకి మెల్లి మెల్లి గా (like slow poison) ఎక్కిస్తున్నది ఈ వ్యాపార ప్రకటనల మాఫియా.

ఈ మధ్య ఒక ప్రకటన టి విల్లో తెగ గుప్పిస్తున్నారు. అందులో ఒక బేవార్సు గాడు కార్లో దిగి పనికి రాని చెత్త డైలాగు వల్లిస్తూ, అక్కడే బస్ స్టాప్ లో ఉన్న అమ్మాయిని తన సెల్ ఫోన్ లో ఫోటో తియ్యబోతాడు. ఆ ఫోటో సరిగ్గా రాదు. అప్పుడు ఈ యాడ్ హీరో వచ్చి దీంట్లో తీసుకో అని తన దగ్గర ఉన్న సెల్ ఇవ్వబోతాడు. ఇది ఆ సెల్ ఫోన్ కొనమని చెప్పే వ్యాపార ప్రకటన తీరు. ఇటువంటి యాడ్ల వల్ల చిన్న పిల్లలకు ఏ విధమైన సందేశం వెళ్తున్నది అన్న జ్ఞానం అటు యాడ్ చేసినవాడికీ లేదు, ఇటు చూపించే టి వి వాళ్ళకూ లేదు . ఇది ప్రస్తుతం ఈ యాడ్ మాఫియా తీరు.

ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని, ఈ వ్యాపార ప్రకటనలను తప్పనిసరిగా నియంత్రించి కట్టడి చెయ్యకపోతే, మనం కొనుక్కునే వస్తు, సేవల ధరలు పెరగటమేకాక, మానసిక వైద్యులకు గిరాకీ కూడ పెరిగిపొయ్యేఅవకాశం బాగా ఉన్నది.

దేశంలో ప్రజాస్వామ్యం పేరిట జరుగుతున్న నాటకాలు

"అధిష్టానం" అనే పదం గత కొన్ని దశాబ్దాలలో మన రాజకీయ జీవుల జీవితాల్లో ఒక ముఖ్యమైన మాటగా మారిపొయ్యింది. ఇది అది అని లేదు అన్ని పార్టీలకు ఈ జాడ్యం పట్టింది. పేర్లొక్కటే మార్పు, ఒకళ్ళు "అధిష్టానం" అంటె మరొకళ్ళు "పోలిట్‌బ్యూరో" . అని అదే లంపటం గురించి వ్యవహరిస్తుంటారు. మన రాజ్యాంగం ప్రకారం, అధిష్టానం పాత్ర ఏమిటి? ఏమీ లేదు. అధిష్టానం అన్న మాట రాజ్యాంగంలో లేనేలేదు.

అసెంబ్లీ లో కాని, పార్లమెంటు లో కాని, ఎవరైతే ఎక్కువమందికి ఇష్టపాత్రుడో ఆ వ్యక్తి ముఖ్య మంత్రి లేదా ప్రధాన మంత్రి అవుతాడు. కాని రాజకీయాలు వెర్రి తలలు వేసి, మనం ఎన్నుకునే ప్రజా ప్రతినిధులు వారి నాయకులను ఎన్నుకునే పధ్ధతిలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. ఏ పార్టీకి ఎక్కువమంది సభ్యులు ఉంటే వాళ్ళందరూ కలసి వారికి కావలిసిన నాయకుణ్ణి ఎన్నుకోవాలి. కాని, జరుగుతున్నది ఏమిటి? వీళ్ళందరూ అసలు సమావేశమే జరగదు. వీళ్ళందరూ ఎన్నికయ్యి ఢిల్లీకో హైదరాబాదుకో వెళ్ళి అక్కడా ఇక్కడా వరండాల్లో, కారిడార్లలోనూ, గేట్ల బయట వేళ్ళాట్టమే జరుగుతున్నది.

ప్రజా ప్రతినిధులుగా వారికి రావలిసిన గౌరవం కాని, వాళ్ళ నాయకులని ఎన్నుకునే స్వాతంత్రం కాని మన చేత ఎన్నుకోబడ్డ మన ప్రతినిధులకు లేదు. వాళ్ళ జీవితంలో ఏనాడూ ప్రజలచేత ఎన్నుకోబడని, లేదా ప్రజలచేత తిరస్కరించబడినవాళ్ళే ఈ పాలిట్బ్యూరోల్లోనూ, అధిష్టానాల్లోనూ ఉంటారు. వీళ్ళు, ప్రజలచేత ఎన్నుకోబడ్డ ఎం ఎల్ ఏ లకు ఎం పీ లకు వారు వారి నాయకుడిగా ఎవర్ని ఎన్నుకోవాలో చెప్తారు.

అన్నిటికంటె ఎంతో దుర్మార్గమైన పధ్ధతి, ప్రజాస్వామ్య విరుధ్ధమైన పని, పూర్తిగా చెంచాగిరిగా నడుస్తున్నది ఏమంటే, మన చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రథినిధులు, తాము తమ నాయకుణ్ణి ఎన్నుకోకుండా, ఆ పని అధిష్టానానికి ఒప్పచెప్తూ ఒక తీర్మానం ఏకగ్రీవంగా చేస్తారు. ప్రజాస్వామ్యాన్ని ఇంతకంటే అపహాస్యం, అవహేళన చెయ్యటం ఏమన్నా ఉండటానికి అవకాశం ఉన్నదా!

రాజ్యాంగం ప్రకారం పని చేస్తామని ప్రమాణ స్వీకారం చేసిన ప్రజా ప్రతినిధులు, తాము చేయవలిసిన ఒక ముఖ్యమైన బాధ్యతను, మరొకరికి అప్పగించే అధికారం వారికి ఉన్నదా? ఈ విషయాన్ని రాజ్యంగా నిపుణులు తప్పనిసరిగా పరిశీలించి ఈ జాడ్యానికి మందు వెయ్యాలి.

ఒక అధికారి తాను నిర్వహించాల్సిన బాధ్యతలను మరొకరికి అప్పగించే అధికారం ఉన్నదా? లేనే లేదు. ప్రభుత్వంలో ఒక అధికారి తన బాధ్యతలను మరొకరికి ఇవ్వలేనప్పుడు, ప్రజలచేత ఎన్నుకోబడి, రాజ్యాంగానికి లోబడి పని చేస్తానని ప్రమాణం చేసిన ఈ ప్రజా ప్రతినిధులు, తమ నాయకుణ్ణి ఎన్నుకునే ముఖ్య బాధ్యతను, రాజ్యెంగేతర శక్తులకు ధార పొయ్యటం ఎంతవరకు సమంజసం. వీళ్ళు చేస్తున్నది రాజ్యంగా ధిక్కారం కాదా అన్న విషయం ఎవరూ పట్టించుకోక పోవటం శోచనీయం.

పూర్తిగా ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రతినిధులు ఎన్నుకున్న నాయకుడు ముఖ్యమంత్రో, ప్రధాన మంత్రో అయ్యి, మనల్ని పరిపాలించాల్సింది పోయి, ఎవళ్ళొ కుట్రలూ కుహకాలకూ అలవాటుబడ్డ కొంతమంది ఒక గుంపుగా ఏర్పడి, వాళ్ళు చెప్పినవాడు మనకి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అవ్వటమా. ఎంత సిగ్గుచేటు.

ఆపైన మంత్రివర్గ నిర్మాణం మరింత హాస్యాస్పదమైనది. ఏ ముఖ్యమంత్రీ లేదా ప్రధాన మంత్రీ స్వతంత్రంగా తన మంత్రివర్గ సహచరులను నియమించుకునే స్థితిలో లేడు. మంత్రివర్గ నిర్మాణం కాని, మంత్రివర్గ విస్తరణకాని, అధిష్టానం కనుసన్నలలోనే జరగాలిట.

ఏ శాఖకి ఏ ప్రజా ప్రతినిధికి ఆ శాఖను సమర్ధవంతంగా నిర్వహించే అర్హత, తెలివితేటలు ఉన్నాయో చూడాల్సిన పనే లేదు. ఆ మనిషికి అధిష్టానంలో కొద్దో గొప్పో పలుకుబడి ఉంటే చాలు, కావలిసిన మంత్రి అవుతాడు. విద్యా శాఖ మంత్రికి ఆ శాఖ గురించి తెలియాల్సిన పని లేదు. రక్షణ శాఖ మంత్రికి దేశ పటం ఎలా ఉంటుందో కూడా తెలియాల్సిన పనిలేదు. అందరికీ అధిష్టానమే వడ్డిస్తుంది.

అసలు ఈ అధిష్టానాలూ, పోలిట్‌బ్యూరోలు ఎందుకు ఉంటున్నాయి, వీటి పాత్ర ప్రజాస్వామిక ప్రభుత్వంలో ఏమిటి . అధిష్టానాల పేరుతో జరిగే పనులన్నీ కూడ రాజ్యాంగ విరుధ్ధమే అని నా అభిప్రాయం.

ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి, స్వతంత్రంగా ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితి. తమ అధినాయకత్వపు కనుసన్నల్లో మెలుగుతూ, అన్నీ వారికి చెప్పే చెయ్యాలి.

ఈ అధిష్టానం ఎవరు? వాళ్ళను మన ఎన్నుకోలేదే. వాళ్ళెవరో కూడ మనకు తెలియదే. ఇలా ప్రభుత్వాల్లో కలుగచేసుకుని, ప్రజస్వామిక ప్రక్రియలో ఎప్పటికప్పుడు అనవసరంగా తమకు తామే నాయకత్వం అపాదించుకోవటం, ప్రజాస్వామ్య విరుధ్ధమని ఎవరూ అనుకోవటంకూడా లేదు.

ఘనత వహించిన మన మీడియా వాళ్ళు కిమ్మనకుండా, ఆ అధిష్టానల బయట తమ విలేఖర్లని నిలబెట్టి, ఎందుకూ కొరగాని "బ్రేకింగ్ న్యూస్" వదలటమే పరమావధిగా పెట్టుకున్నారు, ఆపైన ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంట ఈ మీడియా. ఇలా అధిష్టానాలు, పాలిట్‌బ్యూరోలు ప్రభుత్వ పనుల్లో, నాయకుల ఎన్నిక, మంత్రివర్గ కూర్పుల్లో కలుగచేసుకోకుండా, సుప్రీం కోర్టు వారు "సువ్వో మోటో" గా తమంతట తామే ఒక కేసుగా స్వీకరించి, ఈ అధిష్టానలన్నిటినీ నిషేధించాలి. ఎలెక్షన్ కమీషన్ ను ఈ కింది విధంగా అదేసించాలి:

1. ఎలెక్షన్ ప్రక్రియలో భాగంగా, ఎన్నికల కమిషనే, ప్రజా ప్రతినిధులకు ఎన్నికైనట్టుగా సర్టిఫికేట్ ఇచ్చిన వెంటనే వాళ్ళను హైదరాబాదు కాని ఢిల్లీ కాని వెంటనే తమ అధీనంలోనే తీసుకు వెళ్ళాలి. వెంటనే వారి చేత ప్రమాణ స్వీకారం చేయించాలి.
2. ప్రజా ప్రథినిధులను సమావేశపరిచి, వారి నాయకుణ్ణి ఎన్నుకోవటం ఎలెక్షన్ కమీషన్ అధీనంలో, పర్యవేక్షణలో, అన్ని టి వి చానెళ్ళు లైవ్ టెలికాస్ట్ చేస్తుండగా జరగాలి. ఈ పని ఎన్ని గంటలు/రోజులు జరిగినా సరే, ప్రత్యక్ష ప్రసారం ఆపకూడదు, ప్రజా ప్రతినిధులు బయటకు వెళ్ళకూడదు. వారికి కావలిసిన సర్వ సౌకర్యాలు అక్కడే కలిగించాలి. సాధ్యమైనంత వరకూ, ప్రజాప్రతినిధిగా అప్పటికే ఎన్నిక ఐన మనిషే వారి నాయకుడిగా ఎన్నుకోవాలి. అలా కాకుండ, ఎం ఎల్ ఏ కాని ఎం పి కాని వ్యక్తిని వారి నాయకుడిగా ఎన్నుకోవల్సివస్తే, అటువంటి వ్యక్తిని మామూలుగా ఒకరు ప్రపోజ్ చెయ్యటం మరొకరు తూ తూ మంత్రంగా సెకండ్ చెయ్యటం కాకుండా, మొత్తం ప్రజా ప్రతినిధుల్లో మూడో వంతుమంది ప్రపోజ్ చెయ్యాలి.
3. ఈ ఎన్నిక కూడ సీక్రెట్ బాలెట్ పధ్ధతిలో ఎలెక్షన్ కమీషనే జరిపించాలి. ఒకవేళ ఇలా ఎన్నుకోబడ్డ వ్యక్తి ప్రభుత్వం పడిపోతే, ఇదే ప్రక్రియ మళ్ళి ఎలెక్షన్ కమీషన్ ఆధ్వర్యంలోనే జరగాలి తప్ప మరెవ్వరూ కలుగ చేసుకోకూడదు.
4. ప్రజా ప్రతినిధులు వారి నాయకుణ్ణి ఎన్నుకోంగానే, ఆ నాయకుడి చేత ముఖ్య మంత్రి లేదా ప్రధాన మంత్రిగా వెనువెంటనే, ప్రమాణ స్వీకారం గవర్నర్ లేదా రాష్ట్రపతి చేయించాలి.
5. ఈ పని పూర్తయ్యిన తరువాత మాత్రమే ఎలెక్షన్ కమిషన్ పని పూర్తయ్యినట్టు.
6. ఏ పార్టీ అధ్యక్షుడుకాని, అధిష్టానం పేరుతోకాని, ఈ ప్రక్రియలో ఎటువంటి ప్రత్యక్ష లేదా పరోక్ష విధానంలో కలిగించుకున్నా అటువంటి వ్యక్తులను వెంటనే రాజద్రోహం నేరం కింద అరెస్టుచేసి 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష వెనువెంటనే వేసే అధికారం ఎన్నికల కమీషనర్లకు ఉండాలి.
7. సమాజంలో అన్ని రంగాలలోనూ నిష్ణాతులైన నిపుణుల కమిటీలు తయారుచెయ్యాలి, ఆ నిపుణులను లాటరీ పధ్ధతిలో ఎంపిక చెయ్యాలి. ప్రతి మంత్రివర్గ శాఖకు నియామక కమిటీని ఎన్నికల అయిన వెంటనే లాటరీ పద్ధతిన ఆ కమిటీలో ఉండటానికి అర్హతలున్న వారిని ఎలెక్షన్ కమీషన్ సభ్యులే తీస్తారు.ఆ కమిటీ సభ్యులందరూ కూడ అప్పటికి ఏ పదవిలోనూ ఉండి ఉండకూడదు. అందరూ అరవై ఐదు సంవత్సరాలు దాటినా వారై ఉండాలి. వారి జీవితంలో ఎక్కడా కూడ రాజకీయ వాసన ఉండి ఉండకూడదు, వారి బంధువులలో కూడ రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఉండకూడదు.
8. ముఖ్య మంత్రి లేదా ప్రధాన మంత్రి తమ మంత్రివర్గంలో మంత్రులను నియమిస్తూ వారి శాఖలను వెంటనే ప్రకటించాలి.
9. ఆ విధంగా ప్రకటించబడ్డ మంత్రివర్గ అబ్యర్ధులను, పైన చెప్పిన కమిటీ పూర్తిగా ఇంటర్వ్యూ చేసి, వారికి కేటాయించబడ్డ శాఖను సమర్ధవంతంగా నిర్వహించగలడా లేదా అన్న విషయం పరిశీలించి నిర్ణయిస్తారు. ఆ కమిటీ ఆమోదం ఇచ్చిన తరువాతే ఆ ప్రజా ప్రతినిధి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తన పని మొదలు పెట్టాలి. అనర్హుడని కమిటీ భావిస్తే ఎం ఎల్ ఏ గానో, ఎం పీ గానో మాత్రమే ఉండాలి లేదా తనకు తగ్గ మత్రిత్వ శాఖను మళ్ళి ఆ శాఖకు చెందిన కమిటీ ముందు తన సామర్ధ్యాన్ని నిరూపించుకుని మంత్రి అవ్వాలి.
10. పైన చెప్పిన ఇంటర్‌వ్యూలన్ని కూడ లైవ్ టెలికాస్ట్ చెయ్యాలి. ప్రజలు ఎప్పుడైనా సరే ఆ ఇంట్రవ్యూలను సీదాగా వెళ్ళి చూసే అవకాశం కల్పించాలి. ఇంటర్వ్యూ కు అక్కడ నిలబడ్డ ప్రజా ప్రతినిధులు, తమ అనుచరులచేత గలాభా చేయించటం, నినాదాలు చేయించటం, బ్రూట్ ఫోర్సు ను చూపించటం జరిగితే వెనువెంటనే అటువంటి ప్రజా ప్రతినిధిని ప్రకటించి, ఆ నియోజకవర్గంలో మళ్ళి ఎన్నికలు జరిపించాలి.ఆ మనిషి ఆ ఎన్నికల్లో నిలబడకుండా అనర్హుడిగా ప్రకటించాలి.
11. అన్నిటికన్న ముఖ్యంగా ఓటువెయ్యటం తప్పనిసరి చెయ్యాలి. ఓటు వెయ్యని వారికి ఇంకంటాక్సులో రాయితీలన్ని తొలగించాలి, రేషన్ ఆరునెలలపాటు ఇవ్వకూడదు, ఉద్యోగి ఐతే వెంటనే సంవత్సరం పాటు సస్పెండు చెయ్యాలి. సస్పెన్షన్ పూర్తయిన తరువాత ప్రస్తుతం ఉన్న చోటునుండి వేరొక చోటుకు తప్పనిసరిగా బదిలీ చెయ్యాలి.

ఇవి నాకు తోచిన కొన్ని సూత్రాలు. ఈ విషయాలమీద కూలంకషంగా దేశంలో ప్రజాస్వామ్యం పేరిట జరుగుతున్న నాటకాలన్నిటిని చూసి బాధపడుతున్న వారందరూ స్పంధించి సంస్కరణలను ప్రవేశ పెట్టటానికి చర్చలు జరుపుతూ తప్పనిసరిగా ఒక మంచి విధానాన్ని రూపొందించుకునే పని చెయ్యగలగాలి. అప్పుడే భావి పౌరులు మనల్ని గౌరవించే అవకాశం ఉన్నది

28, మార్చి 2011, సోమవారం

"మన తెలుగు చందమామ"

చిన్న తనంలో చందమామ ఒక్కటే నచ్చిన పుస్తకం. కొంత కాలానికి మరో పత్రిక కూడ పిల్లలకోసమే'ట' అనితెలిసింది. అదే బాలమిత్ర పత్రిక. బాలమిత్ర స్వతహాగా తమిళ పత్రిక అనుకుంటాను, తెలుగులో కూడ ప్రచురించటం మొదలుపెట్టారు. చందమామ తరహాలోనే బొమ్మలు అవి ప్రతి పేజీలో కుడి ఎడమ పక్కనఅప్పుడప్పుడూ కింద వేసేవారు. కాని చందమామకు ఉన్న 'మెరుపు' బాలమిత్రకు ఉండేది కాదు. పాపం వాళ్ళు మెరుపు కాయితం మీద ముఖ చిత్రం అచ్చు వేసేవారు అయినా చందమామ ముందు తేలిపోయ్యేది.

ఇదంతా ఎందుకు వ్రాస్తున్నాను అంటే, ఈ రోజున ఆదివారం కదా అని అలమార్లు, షెల్ఫులు, సోరుగులు అన్ని గాలించి చెత్తంతా వదిలిస్తున్నాను. అందులో బాలమిత్ర ఒకటి, ఒక ఐదారేళ్ళ క్రితంది అనుకుంటాను, కనపడింది. దాంతోపాటే అలాగే కనిపిస్తున్న మరికొన్ని పుస్తకాలు కనడ్డాయి. పారేద్దామని అన్నిటిని ఒక మూలకి విసిరేశాను.

బాలమిత్రలె అని నేను పారేసిన వాటితో పాటుగా నేను గత పదేళ్ళల్లో అప్పుడప్పుడు కొన్న చందమామలు కూడా ఉన్నాయి. కాని పెద్దగా తేడా తెలియటం లేదు. గట్టిగా పట్టి పట్టి చూస్తె కాని ఇది చందమామ, ఇది బాలమిత్ర అని తెలియని స్థితికి వచ్చింది ప్రస్తుతపు చందమామ. అవే వడ్డాది వారి బొమ్మలు, కాని ప్రింటు చెయ్యటంలో పూర్వపు శ్రద్ధ లేదు. అందుకనే చందమామలో మెరుపు తగ్గింది. ప్రస్తుతం చందమామ పేరుతొ వస్తున్న పత్రిక ఏదో పాత వాసన పోక పారేయ్యలేక దాచుకోవటమే కాని, దాచుకోవటం వల్ల చోటు నష్టం తప్ప మరేమీ లేదు అనిపించింది.

పై విషయం గమనించి ఆశ్చర్యపోయి, నా దగ్గర వపాగారు వేసిన చందమామ అట్ట మీది బొమ్మలన్నీ ఒకచోట ఉంచిన విషయం జ్ఞప్తికి వచ్చి బయటకు తీశాను. అందులో ఒకే బొమ్మ ఆయన వేసినదే కొంతకాలం తరువాత మళ్ళి ప్రచురించినది దొరుకునా అని అన్వేషించటం మొదలు పెట్టాను. నా ప్రయత్నం ఫలించింది.

మహాభారత యుద్ధంలో భీష్ముడు పడిపోయినాక, ఆయన దాహాన్ని తీర్చటానికి అర్జునుడు తన ధనుర్విధ్యతో పాతాళ గంగతో ఆయనకు మంచి నీళ్ళు అందించే దృశ్యం . వడ్డాది పాపయ్య గారు అద్భుతంగా చిత్రీకరించారు. మొదటిసారి ఫిబ్రవరి 1974 సంచికలో వేశారు. అదే బొమ్మ ముఖ చిత్రంగా డిసెంబరు 2000 సంచికకు వేశారు . ఇరవై ఆరు సంవత్సరాల్లో వచ్చిన మార్పు ఒక్క ధరలోనే కాదు (ఒకటి పక్కన సున్నా చేరింది) బొమ్మ విషయంలో కూడా స్పుటంగా తెలుస్తున్నది. 1974 లో లేని సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ఎన్నో రెట్లు మన పత్రికల వారి వద్ద ఉన్నది. కాని 21 శతాబ్దంలో అచ్చు వేయబడిన బొమ్మ రెండున్నర దశాబ్దాల క్రితం వేసిన బొమ్మ కన్నా మెరుగుగా లేకపోగా, పాత బొమ్మే ఆకర్షణీయంగా ఉన్నది అనిపిస్తున్నది.

చందమామ ప్రస్తుత నిర్వాహకులు పత్రిక ప్రింటు వెయ్యటంలో కాని, అందులోని శీర్షికల విషయంలో కాని శ్రద్ధ తీసుకోవటం మొదలు పెట్టాలి. లేకపోతె, మన చిన్నప్పుడు మనకు తెలిసిన "మన తెలుగు చందమామ" ఎక్కువ కాలం మనగలుతుందా అని బాధపడటం తప్ప మరేమైనా చెయ్యగలమా!!??

వాళ్ళ ఓట్లు ఎందుకు అమ్ముకుంటున్నారు??

వాడెవడో వికీలీక్స్ వాడు చెప్పాలా మనకి!! మనదేశంలో ఏమి జరుగుతున్నదో మనకి తెలియదా? అది చూసి, అందరూ మరొకరి వంక వేలు చూపిస్తూ సంభ్రమాశ్చర్యాలు ప్రకటించటం, వీళ్ళేదో పెద్ద మనుషులైనట్టుగా తెగనటించటం. ఓట్లు రాజకీయ నాయకులు కొంటున్నారు అంటే, అమ్మేవాళ్ళు ఉన్నట్లే కదా? వాళ్ళు వాళ్ళ ఓట్లు ఎందుకు అమ్ముకుంటున్నారు??వాళ్ళను ఎవరూ తప్పు పట్టటంలేదు. అదే విచిత్రం!!

ఈరోజున పేపరు చూస్తె, మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఎన్నికలట, అక్కడ ఉన్న ఒక ప్రధాన ప్రాంతీయపార్టీ నాయకుడు (ఈయన సదా కళ్ళకు గంతలు కట్టుకునే ఉంటాడు) ఈ రోజున తన అద్భుత ఎన్నిక విజయ పథకం రచించి అందరి ముందు ఉంచాడు. ఆ మనిషి చెప్పిన కతలు చూస్తే, తన్ను గెలిపిస్తే తాను ఎవరెవరికి ఏమేమి ఉచితం ఇస్తాడో చెప్పాడు. ఒక సారి పరికించండి.

* గృహిణులు అందరికీ ఉచితంగా గ్రైండరు లేదా మిక్సీ
* గర్భంతో ఉన్న గృహిణులకు ప్రస్తుతం ఆర్నెల్లపాటు నెలకు ఆరువేల రూపాయలు ఇస్తున్నారట అది ఇక నుంచి వీరిని గెలిపిస్తే పదివేలు చేస్తారుష. ఒకానొకప్పుడు జర్మన్ ప్రభుత్వం వారి జనాభాను పెంచుకోవటానికి ఎక్కువమంది పిల్లలను కన్న తల్లులకు ఇలాగే నజరానాలు ఇచ్చేదిట.
* ఒక కిలో అయోడిన్ ఉప్పు ఉచితం
* స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే ఋణం నాలుగు లక్షల రూపాయలకు పెంపుట పైగా అందులోరెండు లక్షలు మాఫీనట.
* నిరుపేదలకు ప్రతి నేలా 35 కిలోల ఉచిత బియ్యం
* అరవై ఏళ్ళ పైబడిన వారికి బస్సుల్లో ఉచిత ప్రయాణం . వయో వృద్ధులకు ప్రత్యేకంగా ఉచిత బస్సులు.
* ప్రభుత్వ, ప్రవైటు కళాశాలల్లో వృత్తి విద్య అభ్యసిస్తున్న వెనుకబడిన, దళిత విద్యార్ధులకు చేరిన మొదటి ఏడాదే ఉచిత ల్యాప్ టాప్ లు
* 2006 - 2009 మధ్య చదువుకోసం తీసుకున్న ఋణాలపై వడ్డీ మాఫీ.

ఇదిలా ఉంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఈ గంతల నాయకుడే ఇన్నన్ని ఉచితాల ప్రలోభాలు పెడుతుంటే, గత కొన్నాళ్ళుగా అధికారంలో లేని ఆ సినిమాలావిడ మరెన్ని ఇస్తానంటుందొ అని ప్రస్తుతం మన తంబీ లు అంగలారుస్తున్నారుషా !!

రాజకీయ నాయకులు అధికారంలోకి రావటానికి ఓట్లు కొనుగోలు చేస్తున్నారని చెప్పటానికి మనకి వికీ లీక్స్ కావాలా !! ఇంత బాహాటంగా మానిఫెస్టో పేరున పైన చెప్పినవాన్నే ఏమిటి? ఓట్లు కొనటం కాక. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందుగా మానిఫెస్టో విడుదల చేయటం పరిపాటి. కాని అందులో వారు చెప్పే అభూత కల్పనలకు ఒక పరిమితి అంటూ ఉండాలి.

ఇవన్నీ ఉచితంగా ఇస్తానంటున్న గంతల నాయకుడు, వాటికి నిధులు ఎక్కడ నుంచి తెస్తాడో చెప్పటంలేదు. తన అనుంగు శిష్యుడు 'రాజా' హవాలా చేసేసిన డబ్బులోంచా ? ఛా... ఛా ... అంతటి నికృష్టపు పని చేస్తే మిగిలిన రాజకీయ నాకులు ఈయన గంతల మీద ఉమ్మేయరూ! ఎంత పరువు తక్కువ పనిచేసావు అని.

ఓటుకు ఇంత అని డబ్బులిస్తేనేమిటి, ఇలా ఉచితాలు ప్రకటించి ఇస్తేనేమిటి, రెండూ ఒకటే. మొదటిది ఏదో ఘోరమని , రెండోది రాజకీయమనీ మనలాంటి అమాయకులు అనుకుంటున్నన్నాళ్ళూ ఓటర్లుగా పిలవబడుతున్న "మందలు" అమ్ముడు పోతూనే ఉంటాయి.

చదువుకున్నాం, "మా కాలరు ఎప్పుడూ తెలుపే!" అనుకునే ఘరానా మనుషులు, ఎన్నికల పేరున వచ్చే శలవు ఆనందిస్తున్నంత కాలం ఇంతే. "ఎన్నికల్లో ఓటు వెయ్యటమా!!" అని చీదరించుకునే వాళ్ళందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. అలా అని అంటే చదువుకున్న వాళ్ళల్లో డబ్బులకు ఓట్లేసే వాళ్ళు లేరని కాదు. కాస్తోకూస్తో చదువు అంటి ఉంటే, ప్రజాస్వామ్యం, ఎన్నికలు, వాటి ప్రాధాన్యత తెలిసి ఉంటుందేమో అని దురాశ అంతకంటే ఏమీ లేదు.

ఎన్నికల మానిఫెస్టోలో పార్టీలు తమ ఇష్టం వచ్చినట్టుగా ఆకాశాన్ని కూడ కిందకి తెచ్చేస్తాం వంటి ప్రకటనలు లేకుండా మన ఎలక్షన్ కమీషన్ కట్టడి చేసేట్టుగా చట్టాలను సవరించి తీరాలి.

1. ప్రతి పార్టీ ఎన్నికల మానిఫెస్టోను అందరి ముందు చర్చకు పెట్టాలి. తాము చేస్తామని ప్రగల్భాలు పలికేవాటికి నిధులు ఎక్కడ నుంచి వస్తాయి అన్న విషయం తప్పకుండా చెప్పి తీరాలి. ఊరికే ప్రమాణాలు చేసేసి, కుర్చి ఎక్కేసి, మాకు ముందున్నవాడు ఖజానా ఖాళీ చేసేసాడు (వాడూ ఇటువంటి ఉచితాలు ఇచ్చే ఖజానా ఖాళీ చేసి ఉంటాడు) మా వల్ల కాదు అని చేతులు ఎత్తేయ్యకూడదు.
2. ఇలా చర్చ చేసి ఆ చర్చలో ఆమోదం పొందిన తరువాతే మానిఫేస్టోను ప్రకటించాలి. ఈ విధమైనచర్చలను చెయ్యటానికి ప్రతి జిల్లాలోనూ అన్ని వర్గాల నుండి ప్రజలను ఎన్నికల కమీషనే నిష్పాక్షపాతంగా ఎన్నిక చేసి ఆ చర్చను టి వి లలో లైవ్ టెలికాస్ట్ చెయ్యాలి. ప్రజలు టెలిఫోన్ ద్వారా ఆయాపార్టీలను వాళ్ళు చేద్దామనుకుంటున్న ప్రమాణాలు/వాగ్దానాల మీద నిగ్గతీసే అవకాశం ఉండాలి. ఈ ప్రక్రియ మొత్తం ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు నుంచే మొదలు పెట్టాలి.
3. అప్పటికే అధికారంలో ఉన్న పార్టీ ఐతే, ముందు తాము అధికారంలోకి రావటానికి ఇచ్చిన మానిఫెస్టోలోవ్రాసినవి ఎన్ని ఎంతవరకూ చేసారో లెక్కలు తప్పనిసరిగా ఈ చర్చలో చెప్పాలి. చెయ్యలేకపోతే, ఆ పనిగురించి వాగ్దానం ఎందుకు మానిఫెస్టోలో పొందు పరిచారో ప్రజలకు వివరణ ఇవ్వాలి.
4. అంతకు ముందటి మానిఫెస్టోలో ఉన్నవి కనీసం 25% చెయ్యలేని పార్టీని తదుపరి ఎన్నికలోనిలబడటానికి అనర్హులుగా ప్రకటించాలి.
5. కొంగొత్త పార్టీ ఐతే, అప్పటికే అధికారంలో ఉన్న పార్టీ కంటే తాము ఏమి చేసి ప్రజల జీవన సరళిమార్చగలరో నిర్దిష్టంగా చెప్పాలి. అలా చెయ్యటానికి ప్రణాళిక ఏమిటి వివరించాలి. అంతే కాని నోటికొచ్చిన ప్రకటనలు చెయ్యటం నిషేధించాలి. నాన్న పేరు తాత పేరు చెప్పుకుంటూ పార్టీలు పెట్టటం ప్రోత్సహించ కూడదు.
6. ఏదైనా సరే ఉచితంగా ప్రజలకు ఇవ్వటం పూర్తిగా నిషేధించాలి. ఇలాంటి పనులు సోమరిపోతుల్ని పెంచి పోషించటం తప్ప మరేమీ కాదు.
7. వాళ్లకు ఇవ్వబడే ఐదేళ్ళల్లో వాళ్ళు చెయ్యబొయ్యే నిర్దిష్ట కార్యక్రమాలు, సామాన్య భాషలో చెప్పాలి, జిడిపి పెంచుతాం, ద్రవ్యోల్బణం తగ్గిస్తాం లాంటి వెర్రి మాటలతో మోసగించకూడదు.
8. తమ పరిపాలన చేపట్టాక, ఎన్ని ఉత్పాదక ఉద్యోగాలు కల్పించగలిగారో చెప్పాలి. అలా చెయ్యటానికి తాము తీసుకోబోయ్యో చర్యలు పూర్తిగా వివరించాలి. గోడమీది పిల్లివాటంగా మాట్లాడకూడదు, ఆకాశానికి నిచ్చెనలు వెయ్యకూడదు.
9. ఇజాల గురించి మానిఫేస్టోలలో మాట్లాడకూడదు. ఎందుకు అంటే, ఐదేళ్ళల్లో ఉన్న వ్యవస్థ మార్చటంఎవరి తరం కాదు. ఆపైన ఐదేళ్లకు మాత్రమె అధికారం పొందిన పార్టీలకు, పూర్తి వ్యవస్థను సంపూర్ణంగామార్చిపారేసే హక్కు లేదు. ఐతే గియితే ప్రజలే వాళ్లకు అవసరం అనుకుంటే, ప్రజల్లో నుండే(ఎవరూరెచ్చగొట్ట కుండా ) స్వచ్చందంగా అటువంటి మార్పు క్రమంగా రావాలి. విప్లవం విప్లవం అని అరుచుకుంటూ తమ సంఘ జీవనాన్ని ధ్వంసం చేసుకున్న ఇంకా చేసుకుంటున్న దేశాలు, వాటి చరిత్ర చూశాం కాబట్టి, అటువంటి అవివేకపు పనులు చేస్తామని రాజకీయ పార్టీలు మానిఫేస్టోలలో ప్రకటించటం నిషేధించాలి.

ఏతావాతా ఏమంటే రాజకీయాలు అంటే ప్రతి వెధవా వెళ్ళిపోయి, ఏదో ఒకటి అయిపోవచ్చు అని తెగబడి, ఎగబడేట్టుగా ఉండ కుండా, బాబోయ్ రాజకీయాలు అంటే బాధ్యతతో కూడిన వ్యవహారం, ఒళ్ళు దగ్గరపెట్టుకుని ప్రజలకు సేవ చేసే చెయ్యాలి అన్న భావన కలిగించాలి. ఇందులో ప్రజలమైన మనకే ఎక్కువ బాధ్యతా. అన్నిటికంటే, ముందు, అందరూ ఓట్లు వెయ్యటం తప్పనిసరిగా చెయ్యాలి. ఓటు వెయ్యకపోవటం ఒక సిగ్గుమాలిన పనిగా, ఒక సాంఘిక దురాచారంగా పరిగణించాలి . ఈ విధంగా ఒక రెండు మూడు దశాబ్దాలు చెయ్యగలిగితే మన రాజకీయాలలో కొద్దో గొప్పో మార్పు వచ్చే అవకాశం ఉన్నది. లేకపోతె మూడు స్కాములు, ఆరు వికీ లీక్సు గానే సాగుతుంటాయి ఎప్పటికైనా సరే!

రగులుతున్న రాష్ట్రం!!!!

ఎందుకోసం ఈ విద్వేషాలు!?
ఎవరికోసం ఈ కోపతాపాలు..?

ఒకరి ఉద్యమం నిజమైతే..
మరొకటి అబద్దమవుతుందా!?
ఒక విద్యార్థి విప్లవకారుడైతే..
మరొకడు తీవ్రవాదా!?

అభివృద్దికి ఆటంకం ప్రజలా..
నిన్ను దోచిన నాయకులా!?

ఇన్నినాళ్ళూ ఏం జేస్తున్నడు
సిగ్గులేని నాయకుడు..

మతం,కులం,ప్రాంతమని
జనాన్ని విడదీస్తున్నడు..

రగులుతున్న రాష్ట్రం చూసి
సంబరపడిపోతున్నడు..

మొట్టికాయలు వేసింది..

ఊహలలోకం లోని కలలు, చెదరిన మైకంలోని కథలు

కలం నుండి జారిపడి కాగితం కోసం చూస్తుంటే..

ఈ ‘ అంతర్జాలము ‘ నా అంతరంగాన్ని కనిపెట్టేసింది..

నన్ను కట్టుకోమంటూ నాలుగు మొట్టికాయలు వేసింది..

నేనూరుకుంటానా దాన్ని ఒక టపాతో కట్టిపడేసాను.

27, మార్చి 2011, ఆదివారం

తదుపరి తరాలకి మంచి వాతావరణాన్నిస్వచ్చయిన గాలిని అందివ్వాలని కోరుకుంటున్నాం.

మన భారతీయులం సాధారణంగా తమ స్వంత సుఖఃసంతోషాల కన్నా మన పిల్లలు, వాళ్ళ పిల్లలు అంటూ భావితరాల శ్రేయస్సు గురించే ఎక్కువ ఆలోచిస్తూవుంటాం. ఎంత సంపాదించినా మనకోసం ఎక్కువ ఖర్చుపెట్టుకోకుండా ముందుచూపుతో మన తరువాతి తరాలకోసం దాచి పెడుతూ వుంటాం. మన పిల్లల కోసం ఎలాంటి త్యాగనికయినా వెనుకాడం. భావితరాలగురించి అంత సెంటిమెంట్ గా ఎంతో ముందుచూపుతో ఆలోచించే మనం వాళ్ళకి ఎలాంటి పర్యావరణాన్ని ఇవ్వబోతున్నాం. ఎంత స్వచ్చయిన గాలిని, నీటిని అందివ్వాలని కోరుకుంటున్నాం. మన అవగాహనారాహిత్యంతో , నిరాసక్తితో , తెలిసినా ఒకింత స్వార్ధపూరిత లేక బద్ధకంతో కూడిన నిర్లక్ష్యంతో మనం అనుభవించిన ఆహ్లాదకరమయిన వాతావరణాన్ని మన భావితరాలకి లేకుండా చేస్తున్నాం. మీకు జీవితానిచ్చిన ఈ ప్రకృతిమీద ప్రేమ వుందా ? లేక మీ తదుపరి తరాలకి మంచి వాతావరణాన్ని , పరిశుబ్రమయిన గాలి, నీరు , భూమి తద్వారా మంచి ఆరోగ్యాన్ని అందివ్వాలన్న తపన ఉందా ? అయితే ఈ టపా చదవండి. మీ పనుల్లో బిజీగా ఉండి అంత తీరిక లేకపోతె టపా ఆఖరులో ఇచ్చిన సూచనలు అన్నా కాస్తా మీ విలువయిన సమయం వెచ్చించి చదువుతారని ఆశిస్తున్నా. ఇది చదివి ఒక్కరిద్దరయినా కన్విన్స్ అయ్యి నేను ఇక్కడ పొందుపరిచిన సూచనలలో కొన్నయినా ఆచరిస్తే నా ప్రయత్నం సఫలమయినట్టే . ఆ సూచనల్లో చాలామటుకు నేను ప్రస్తుతం ఆచరిస్తున్నవే.


కాలుష్యం , గ్రీన్ హౌస్ అఫ్ఫెక్టు దానివల్ల వచ్చే వాతావరణ అసమానతలు (అంటే అకాల వర్షాలు, అసాధారణ ఉష్ణోగ్రతలు లాంటివి) వీటిగురించి మనం ఈమధ్య తరుచుగా వింటున్నాం. ఆసియా దేశాలయిన భారత్ , చైనా లు పర్యావరణం విషయం లో బాధ్యతారహితం గా ప్రవర్తిస్తున్నాయని అమెరికా యూరోప్ లు, అమెరికానే ఎక్కువ కాలుష్యం విడుదల చేస్తుందని మనం ఏ వేదిక దొరికితే ఆ వేదిక మీద ఆరోపణలు చేసుకుంటున్నా , కనీసం ఇదొక సమస్య అని ఇప్పటికయినా అందరూ గుర్తించినందుకు సంతోషం. అయితే ప్రభుత్వాలు, వాటి బాద్యతలు పక్కనే పెట్టి అసలు సామాన్య పౌరుడి గా మన బాద్యత ఏమిటి , ఆసలు ఈ కాలుష్యకారకాల మీద మనకెంత అవగాహన వుంది అని చర్చించాల్సిన అవసరం ఎంతయినా వుంది.

కాలుష్యం అనగానే మనకు ముందు గుర్తొచ్చేది వాయుకాలుష్యం (Air Pollution). ఇది అన్ని కాలుష్యాలలో కెల్లా ప్రధానమైనది ఇదే కానీ దీనితోపాటు మనం తెలుసుకోవాల్సిన మిగతా కాలుష్యాలు నీటి/తాగునీటి కాలుష్యం (Water Pollution) , భూమి కాలుష్యం/ భూమి విషతుల్యమవడం (Soil Contamination) , ద్వని కాలుష్యం (Noise Pollution) మరియూ కాంతి కాలుష్యం (Light Pollution) మొదలైనవి .

వాయుకాలుష్యం: పేరుకి వాయుకలుష్యమయినా ఇవి ద్రవ (Liquid Droplets) , వాయు, ఘనపదార్ధాల (Solid Particles) రూపం లో ఏరూపం లో అయినా ఉండొచ్చు. వాయురూపం లో వుండే సల్ఫర్ డై ఆక్సైడ్ (SOx) లు , నైట్రోజెన్ ఆక్సైడ్ లు (NOx ) , కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ లు , ఘనరూపం లో వుండే బూడిద , దుమ్ము, ధూళి ఇవన్నీ వాయుకాలుష్యం కారకాలు . ఈ కాలుష్యానికి కారణాలు ఎక్కువశాతం మానవ తయారినే (man made) ఆయినా కొన్ని ప్రకృతి సిద్దమయిన కారణాలు కూడా వాయు కాలుష్యం కలగచేస్తాయి. మానవుడు సృష్టించిన పరిశ్రమలు , అసంఖ్యాకమయిన వాహనాలు, విద్యుత్ కేంద్రాలు, ఓడలు ఇలా ఇంధనం మండించడం ద్వారా శక్తిని ని వేలికితేసే యంత్రాలన్నీ కాలుష్యకారకాలే (కొన్ని ఇంధనం నుండి శక్తి ని వెలికి తీసినా ఈ కోవలోకి రావు .. అవి వేరే టపాలో రాస్తాను) . అలాగే కొన్ని కెమికల్స్ , ప్లాస్టిక్ వస్తువులు మండించినప్పుడు విడుదలయ్యే విషవాయువులు (Toxic gases ) కూడా చాలా ప్రమాదకరమయినవి. థర్మల్ విద్యుత్ కేంద్రాలనుండి మరియు బొగ్గుతో నడిచే ఓడలనుండి విడుదలయ్యే బూడిద గాలిలో కలవడం వల్ల కలిగే కాలుష్యం కూడా ఆందోళన కలిగించే స్తాయిలోనే వుంది (ఘనపదార్దల వల్ల కలిగే వాయు కాలుష్యానికి ఇదే ఉదాహరణ ) . అలాగే ప్రకృతి సిద్దమయిన కారకాలు అంటే అగ్నిపర్వతాలు పేలినప్పుడు విడుదలయ్యే బూడిద, అడవులు తగలబడటం (wildfire) , పొడిబారిన మైదాన ప్రాంతాల్లో రేగే దుమ్ము, పశువులు విడుదల చేసే మీథేన్ ( జీర్ణక్రియ వల్ల ఉత్పత్తి అవుతుంది ) ఇవన్నీ.
ఈ వాయుకాలుష్యం జీవుల ఆరోగ్యం మీద ఎంతో దుష్ప్రభావాన్ని చూపుతుంది. WHO అంచనా ప్రకారం ప్రపంచంలో ఏటా కనీసం 25 లక్షలమంది ఈ వాయుకాలుష్యం వల్ల చనిపోతున్నారు. ఎన్నో కోట్లమంది ఆస్మా, bronchitis, రకరకాల ఊపిరితిత్తుల మరియు గుండెజబ్బుల బారిన పడుతున్నారు. ఏ దేశం ఎంత కాలుష్యాన్ని విడుదలచేస్తుంది అని లెక్కలు చూసుకునే ముందు మన జన సాంద్రత కూడా పరిగణలోకి తీసుకోవాలి. అమెరికా అన్నిదేశాల కన్నా ఎక్కువ వాయుకాలుష్య కారక వాయువులు విడుదల చేసినా వారి దేశ విస్తీర్ణం , వున్న ఆటవీసంపద, చెట్లు ఆ కాలుష్య ప్రభావాన్ని చాలావరకు తగ్గిస్తాయి. మన భారతదేశం లాంటి తక్కువ విస్తీర్ణం మరియు అధిక జనసాంద్రత కలిగిన దేశాలు కొద్ది కాలుష్యాన్ని విడుదల చేసినా అది మనమీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అలాగే వాయుకాలుష్యం వల్ల ఓజోన్ పొర మీద పడే దుష్ప్రభావం చాలా ఆందోళన కలిగించే స్తాయిలో వుంది.

ఈ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయ్. వాహనాలకు, పరిశ్రమలకు అవి విడుదల చేసే కాలుష్యకారక వాయువుల లెవెల్స్ కి లిమిట్స్ పెట్టడం (అంటే నిర్ధారించిన లెవెల్ కన్నా ఎక్కువ NOx, SOx వాయువుల విడుదల చేయకూదన్నమాట .. మన బండి పొల్యుషన్ సర్టిఫికేట్ అదే చెబుతుంది ) , తక్కువ కాలుష్యం విడుదల చేసే యంత్రాలకు , పరిశ్రమలకు ప్రోత్సాహాలు ఇవ్వడం , దానికి సంబందించిన పరిశోధనలు ప్రోత్సహించడం , అలాగే గాలిలో వున్న particles ని కలక్ట్ చెయ్యడానికి "Electrostatic precipitators మరియు dust collectors " లాంటివి ఏర్పాటు చెయ్యడం ఇవన్నీ కాలుష్యాన్ని నియంత్రించే ప్రయత్నాల్లో బాగమే. (అమెరికా లోని కాలిఫోర్నియా రాష్ట్రం తక్కువ కాలుష్యకారక వాయువులు విడుదల చేసే హైబ్రీడ్ కార్లకు పన్ను రాయితీ ఇస్తుంది. అలాగే రోడ్ల మీద ప్రత్యేకమయిన లేన్లను వాళ్లకు కేటాయిస్తుంది ).

(అమెరికా లో మీరు వుండే ఏరియా లో గాలి ఎంత పరిశుబ్రం గా వుందో తెలుసోకోవాలంటే డైలీ పేపర్లోగానీ http://www.airnow.gov లో గాని Air Quality Index అని వుంటుంది లో చూడండి)

నీటి కాలుష్యం : ప్రకృతి మనకు మంచినీటిని అందించే నదులు, సరస్సులు, భూగర్బ జలాలు ఒకటేమిటి అన్నింటిని మనం విషతుల్యం చేసిపారేస్తున్నాం . పరిశ్రమలు విడుదల చేసే విష రసాయినాలు, పురుగుమందులు, పెట్రోలు పదార్దాలు, తినిపారేసిన చెత్త, మంచినీటిని శుబ్రంచెయ్యడానికి ఉపయోగించే రసాయనం మోతాదు మించడం, మితిమీరిన డిటర్జెంట్ వాడకం ఇలా చాలా కారణాలు వున్నాయి నీటిని విషతుల్యం చెయ్యడానికి. అలాగే చెట్లనుండి రాలిన ఆకులు , పడిపోయిన చెట్లు నీళ్ళలో కుళ్లడం వల్లకూడా నీటి కాలుష్యం ఏర్పడుతుంది. వినాయకచవితి అప్పుడు ఆ వినాయకుడి విగ్రహ తయారీ లో వాడే కొన్ని రసాయనాలు వల్ల కూడా నీటి కాలుష్యం ఏర్పడవచ్చు (దీని గురించి వేరే టపా ). ఇలా రసాయనాలు , బ్యాక్టీరియా కలవడం వల్లే కాకుండా ఇంకో రకం నీటి కాలుష్యం కూడా వుంది అది థెర్మల్ కాలుష్యం. విద్యుత్ కేంద్రాలు మరియు ఐస్ ఫ్యాక్టరీ లాంటి పరిశ్రమలలోను యంత్రాలను చల్లబరచడానికి నీటిని ఉష్ణవాహకాలుగా ఉపయోగిస్తుంటారు. అంటే మనం నీటి ఉష్ణోగ్రత ను దానియొక్క సహజసిద్దమయిన ఉష్ణోగ్రత నుండి పెంచుతున్నాం అన్నమాట.. ఈ పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల నీటిలోని ఆక్సిజన్ శాతం తాత్కాలికం గా తగ్గి ఎన్నోచేపలు మిగతా జలచరాలు చనిపోవడానికి కారణమవుతుంది. ఈ నీటి కాలుష్యం వల్ల వెనుకబడిన దేశాల్లోనే కాకుండా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న చైనా , భారత్ లో కూడా పరిస్తితి చాలా ఆందోళనకరం గా వుంది. ఈ నీటి కాలుష్యం కారణం గా ఏటా ప్రపంచవ్యాప్తం గా కనీసం 50 లక్షల మంది చనిపోతున్నట్టు అంచనా.. ముఖ్యంగా మనదేశం లో రోజుకి వెయ్యికి పిల్లలు పైగా డైఏరియా బారిన పడుతున్నారు. మనం నదుల్లోకి, సముద్రాల్లోకి విడిచిపెడుతున్న విషతుల్యమయిన రసాయినాలు వల్ల ఎన్నో కోట్ల జీవరాసులు అంతరించిపోతున్నాయ్.

ఈ కాలుష్య నివారణకు కొన్ని ప్రబుత్వాలు ఎంతో శ్రద్ద చూపిస్తున్నాయ్. కొన్ని దేశాలు ఇంకా అశ్రద్ద తోనే వ్యవహరిస్తు సమస్య ని మరింత జటిలం చేస్తున్నాయ్. ఉదాహరణ కి జనరల్ ఎలెక్ట్రిక్ అనే పేరు మోసిన బహుళజాతి సంస్థ Housatonic River ని పోల్యుట్ చేసినందుకు 250 million dollars కట్టాల్సి రావడం తో అక్కడ మిగాతా కంపెనీలు అన్నీ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రబుత్వం విదించిన కాలుష్య నివారణ సూచనలను, నిబంధనలను జాగ్రత్తగా పాటిస్తున్నాయ్. మన దేశం లో ప్రభుత్వాలకి ప్రజల ఆరోగ్యం , పర్యావరణం కన్నా పెద్ద కంపెనీల శ్రేయస్సే ముఖ్యం కనుక ఇలాంటివి ఇక్కడ ఆశించడం అత్యాశే ..

ధ్వని కాలుష్యం : పెద్దపెద్ద యంత్రాలు , వాహనాలు ముఖ్యం గా విమానాలు, ఎమర్జెన్సి సైరన్లు , construction work, లౌడ్ స్పీకర్లు, బాణాసంచా, ట్రాన్స్ఫొర్మెర్ లు వంటి యంత్రాలనుండి వచ్చే హమ్మింగ్ నాయిస్ (geeee అని వస్తుంది ) ఇవన్నీ ధ్వని కాలుష్యం లోకే వస్తాయి. ధ్వని కాలుష్యం వల్ల మనుషుల్లోనూ మరియూ జంతువుల్లోను శారీరక , మానసిక అనారోగ్యం కలగవచ్చు. వినికిడి శక్తి తగ్గడం, హై బిపి , నిద్రలేక పోవడం, హై స్త్రెస్స్ కి గురికావడం లాంటి అనారోగ్యాలు ద్వనికాలుష్యం వల్ల కలగుతాయి . ఈ శబ్ద తీవ్రతను డేసిబెల్స్ (db) లలో కొలుస్తారు. యంత్రాలు విడుదల చేసే శబ్ద తీవ్రతకు ప్రబుత్వాలు కూడా కొన్ని లిమిట్స్ పెట్టింది. ఉదాహరణకు ఇంట్లో వాడుకునే కంప్యుటర్, ట్యూబు లైటు లాంటి డెస్క్ టాప్ ఐటమ్స్ యొక్క శబ్దతీవ్రత 45db మించి వుండకూడదు. డెస్క్ సైడ్ ఐటమ్స్ అంటే మనకి కొంత దూరం లో ఉండేవి 50 db అని , ఆరుబయట ఉపయోగించే యంత్రాలకు 75-80 db అని, పరిశ్రమల్లో ఉపయోగించే యంత్రాలు ఫలానా db level దాటకూడదని , ఎక్కువ శబ్దాలు విడుదల చేసే యంత్రాల దగ్గర పని చేసే కార్మికులు తప్పనిసరిగా చెవులు కాపాడుకునే ear plugs ధరించాలని ఇలా చాలా మార్గదర్శకాలు ఏర్పాటు చేసింది.


భూమి విషతుల్యమవడం (Soil Contamination):
విపరీతంగా పెరిగిపోయిన ప్లాస్టిక్ వాడకం, అధిక పురుగుమందుల వాడకం, భూగర్భంలో వుండే స్టోరేజీ టాంకులు ప్రమాదవసాత్తు పగిలిపోవడం , పరిశ్రమల నుండి వచ్చే వేస్ట్ వాటర్ డైరెక్ట్ గా భూమిలోకే వదిలెయ్యడం ఇలాంటి కారణాలవల్ల మన నేల విషతుల్యమయిపోతుంది. ఇలా ఈ కాలుష్యం 'విషతుల్యమయిన మట్టిమీద' జీవించేవారి ఆరోగ్యం మీద తీవ్రప్రభావం చూపుతుంది. అలాగే ఈ ప్రమాదకరమయిన రసాయనాలు భూగర్భజలాల్లో కలసి ఆ నీటినికూడా వాడటానికి పనికిరాకుండా చేస్తున్నాయి. హైదరాబాద్ లో వస్తాదనుకున్న ఫ్యాబ్ సిటీ రాకుండా పోయినప్పుడు ఎంతమంది నిరాశచెందారో తెలీదు కానీ నేను మాత్రం చాలా సంతోషించాను. ఫ్యాబ్ ప్రాసెస్ చాలా ప్రమాదకరమయినది. ఆ ఫ్యాబ్ ప్రాసెస్ లో సిలికాన్ వేఫర్లను క్లీన్ చెయ్యడానికి పరిశుబ్రమయిన మంచినీరు అవసరం. ఆ క్లీన్ చెయ్యగా మిగిలిన నీరు అత్యంత విషపూరితం. తాగడానికి నీళ్ళులేని, 'కాలుష్య ప్రమాణాలు, ప్రభుత్వ నిబంధనలని' అత్యంత సులువుగా గాలికొదిలేసే మనదేశం లో పరిశుబ్రమయిన మంచినీరు అ పరిశ్రమ కిచ్చి విషపునీరు మనం తీసుకోవడం ఎంతమాత్రం సరి కాదు. దానివల్లే వచ్చే ఉద్యోగాల సంగతి అటుంచి దానివల్ల చుట్టుపక్కలవారికోచ్చే జబ్బులను పరిగణలోకి తీసుకుంటే మన దేశం లో అందులో నీళ్ళకి అల్లలాడే హైదరాబాద్లో ఫ్యాబ్ సిటీ కావాలని ఎవరు అనరు అని నా అభిప్రాయం.

ఇంక కాంతి కాలుష్యం అంటే అవసరం లేని చోట కూడా ఎక్కువ కాంతి వచ్చే బల్బులు పెట్టడం. అలాంటివి మనలాంటి పొదుపు దేశం లో తక్కువే. అందుకే దానిగురించి ఎక్కువ వివరించడం లేదు. ఇది కాక ఇంకో ముఖ్యమయిన కాలుష్యం " radioactive contamination " అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలో మరియు అణుబాంబు తయారి లో వాడే రేడియోఆక్టివ్ ఇంధనాల వల్ల కలిగే కాలుష్యం. ఇది కంట్రోల్ చెయ్యడానికి కూడా సామాన్యుడిగా మనం చేసేది ఏమి పెద్దగా ఏమి వుండదు కాబట్టి దీనిగురించి కూడా ఎక్కువ రాయడం లేదు.

పైన ఇచ్చిన పరిచయం తో బాద్యతకల పౌరుడిగా మనం ఏమి చెయ్యాలో చూద్దాం . వీటిలో చాలామటుకు నేను ఆచరణ లో పెట్టినవి .

1. మనం ముందుగా చేయాల్సింది కాలుష్య దుష్ప్రభావం గురించి , వాటి నివారణా చర్యల గురించి మనం అవగాహన పెంచుకోవడం తో పాటు మన పిల్లలకి కూడా అవగాహన కల్పించాలి . వాళ్ళలో మన ప్రకృతి గురించి ఒకరకమయిన సెంటిమెంట్ ఏర్పరచాలి. ఏదయినా మనం నిజాయితీగా చేస్తే మన పిల్లలు అదో బాధ్యత గా తీసుకుంటారు. ఈ విషయం లో ఎవరికయినా క్లాసు పీకల్సి వస్తే అస్సలు మొహమాటపడొద్దు.

2. నగరాల్లోనూ పట్టణాల్లో బయట రోడ్డుమీద తిరుగుతున్నప్పుడు వీలయినప్పుడల్లా ముక్కుకి చేతిరుమాలు కట్టుకోండి. ముఖ్యం గా ద్విచక్ర వాహన దారులు మరియు నాన్ AC వాహనాల్లో తిరిగేవారు. తడిపిన కర్చీఫ్ అయితే మరీ మంచిది. నేను బండి నడుపుతున్నప్పుడు కర్చీఫ్ తడిపి ముక్కుకు కట్టుకుని ఆ పై హెల్మెట్ పెట్టుకునే వాడిని. ప్రస్తుత వాయుకాలుష్యానికి నివారణగా ఇది తప్పనిసరి. ప్రతీసారి ఇది కుదరకపోవచ్చు కానీ వీలయినంత సేపు వాడండి. చాలావరకు 'dust particles' ని , కొన్ని రసాయన వాయువుల్ల్ని ఈ తడి కర్చీఫ్ విజయవంతం గా వడబోస్తుంది.

3 . వీలయినంత వరకు విద్యుత్ వాడకాన్ని తగ్గించండి. అవసరం లేని చోట ఫ్యాన్లు , లైట్లు కట్టేయండి. (మీకు శ్రమ లేకుండా దానంతట అవే ఆఫ్ అయిపోయే స్విచ్లు వస్తున్నాయ్.. వాటిగురించి వేరే టపా లో రాస్తాను ) . ప్రస్తుతానికి ఆ పని మీరే చెయ్యండి. దీనివల్ల రెండు రకాల లాభాలు . i ) మీ కరెంట్ బిల్లు అదా చేస్తారు. ii) మీ తక్కువ విద్యుత్ వాడకం వల్ల తక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తే చాలు..తక్కువ విద్యుత్ ఉత్పత్తి అంటే తక్కువ కాలుష్యం .. ఇది చాలా చిన్నది గా కనిపించినా దీనివల్ల కలిగే ఉపయోగం చాలా పెద్దది మరియు మనం చాలా సులభం గా చెయ్యగలిగినది.

4 . మనం నెలంతా కస్టపడి గుర్తుపెట్టుకుని లైట్ లు , ఫాన్స్ ఎప్పటికప్పడు కట్టేస్తూ చాలా అదా చేసేసి ఏదో ఒకరోజు ఏ వాటర్ హీటర్ లేక ఎలెక్ట్రిక్ పొయ్య లాంటివి ఆన్ చేసి మర్చిపోతూ వుంటాం. ఒక్క గంట వాటర్ హీటర్ అదనం గా ఉపయోగిస్తే (అంటే అవసరం లేనప్పుడు మర్చి పోయి వదిలెయ్యడం ) 16 గంటలు మనం లైట్ లు , ఫ్యాన్ల కట్టడం ద్వారా అదా చేసినా విద్యుత్ అంతా ఖర్చుపెట్టినట్టే.. అందువల్ల ఎక్కువ పవర్ తీసుకునే వస్తువుల మీద మీరు ముందు ద్రుస్తిపెట్టండి. (అంటే హీటర్ లు, AC లు , ఎలెక్ట్రిక్ పోయ్యలు, వెట్ గ్రైండర్ లు , మిక్సిలు, వాటర్ పంపులు లాంటివి. )

5 . వీలయినంత వరకు AC వాడకం తగ్గించండి. AC , refrigerator వాడకం వల్ల విద్యుత్ అధికం గా ఖర్చు అవడమే కాదు ఈ పరికరాల పనిచేస్తున్నప్పుడు విడుదలయ్యే కొన్ని రసాయన వాయువుల వల్ల పర్యావరణానికి (ముఖ్యం గా ఓజోన్ పొరకు) కూడా చాలా నష్టం . నేను వీటి వాడకం తగ్గించడమే కాదు , restaurent కి వెళ్ళినప్పుడు కూలింగ్ వాటర్ కూడా తీసుకొను. షాప్ లో కూల్డ్రింక్స్ కొనవలసి వస్తే room temperature దగ్గర ఉండేవే కొంటాను. అలా నా refrigerator వాడకమే కాకుండా ఆ షాప్/ రెస్టారెంట్ వాడి refrigerator వాడకం కూడా తగ్గించాలని నా తాపత్రయం. ఇండియాలో మరీ ఇలా కష్టం కానీ వీలయినంత ప్రయత్నించండి.

6. వీలయినంత వరకు బట్టలకు వాడే డిటర్జెంట్ వాడకాన్ని తగ్గించండి. మీరు కొన్ని హోటల్స్ లో చూసే వుంటారు. ఈ 'డిటర్జెంట్ వాడకాన్ని తగ్గించడానికి' మీకు అవసరమయిన టవల్స్ మాత్రమె వుతకడానికి ఇవ్వండి అని. అది నిజం . అలాగే వంట పాత్రలు కడగటానికి వాడే (dish washer) సోప్ లిక్విడ్లు కూడా .

7. మోటార్లతో వాటర్ టాంకులు నింపుతున్నప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. టాంకు నిండాక కట్టడం మర్చిపోయిన ప్రతిసారి మనం డబల్ తప్పు చేస్తున్నాం అని గుర్తుపెట్టుకోండి. ఒకటి మంచినీటిని వృదా చేస్తున్నాం. రెండు కరెంటుని వృదా చేస్తున్నాం. ట్యాంక్ నిండిపోయినప్పుడు ఆటోమాటిక్ గా మోటార్ ఆగిపోయే పరికరాన్ని ఏర్పాటుచెయ్యండి. అవి ఇప్పడు చాలా చవకగానేదొరుకుతున్నాయి.
8 . వీలయినంత వరకు ప్లాస్టిక్ బాగ్ ల వాడకం తగ్గించండి. నెలసరి సరుకులు కొనటానికి వెళ్ళినప్పుడు మీ సంచులు మీరే తీసుకెల్లండి. (ఒకప్పుడు మనం ఇలానే వుండే వాళ్ళం .. ఈ పశ్చిమ దేశాలోల్లు మనకీ ప్లాస్టిక్ అలవాటు చేసి పోయారు :-) ) . బెంగుళూరులో నేను ఇప్పుడు వున్న అపార్ట్మెంట్ లో చాలామంది ఇలాంటి సంచులు తీసుకుని సూపర్ మార్కెట్ కి వెళ్ళడం చూస్తుంటే చాలా సంతోషం గా వుంది .

9 . అలాగే మీరు ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్ లు ఎక్కడ పడితే అక్కడ పాడేయవద్దు . దయచేసి మున్సిపాలిటి వాళ్ళు కలక్ట్ చేసే చెత్తబుట్టల్లోనే వెయ్యండి. ముఖ్యం గా మీరు ప్రయాణించేడప్పుడు , విహరయత్రాలకి, పిక్నిక్ లకి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కవర్ లు ఎక్కడపడితే అక్కడ పడేయవద్దు. మైసూరు జూలో ప్లాస్టిక్ వాడకం నిషిద్దం .. అలా అన్నిచోట్ల రూల్స్ వస్తే బావుంటుంది. ఎన్ని రూల్స్ పెట్టిన ఫైనల్ గా అది మన చిత్తశుద్ది మీదే ఆధారపడి వుంటుంది. అలాగే పిల్లల డైపర్స్ వాడకం కూడా , వాటిని dispose చెయ్యడం కూడా ప్లాస్టిక్ వస్తువులలానే జాగ్రత్త తీసుకోవాలి . వీలయినప్పుడల్లా (అంటే ఇంట్లో వున్నప్పుడు ) డైపర్ వాడకుండా మన పాత పద్దతిలో re -usable పాత గుడ్డలు వాడటం బెటర్ .

10. మీరు కొనగలిగే ధరల్లో వున్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని కొనండి. అది మీ ఆరోగ్యానికి మంచిది మరియు మీరు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని ఉత్పత్తిచేసేవారికి ప్రోత్సాహం ఇచ్చిన వారవుతారు.

11. మీరు వ్యవసాయదారుల కుటుంబం నుండి వచ్చిన వారయితే , మీ కుటుంబం లోని వ్యవసాయం చేసివారికి అధిక ఎరువులు వాడకం వల్ల కలిగే నష్టాలు తెలియపరచండి. సేంద్రీయ ఎరువుల వాడకం వల్ల పర్యావరణానికి ఎంత ఉపయోగమే తెలియచెయ్యండి. అవసరానికి మించి పురుగుమందులు (pesticides ) వాడొద్దని చెప్పండి. పర్యావరణానికి , పండే భూమికి చేటు తెచ్చే చేపల/రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహించకండి. అవి తాత్కాలికం గా ఎక్కువ లాభాలోస్తాయి కానీ తరువాత పండించడానికి ఆ భూమిపనిచెయ్యదు ఆఖరుకి ఆ చేపలు పెంచడానికి కూడా

12. మనిషికో మొక్కయినా పెంచాలి. మొక్కలంటే గులాబీ మొక్కలు కాదు. వేప చెట్టు ,మామిడి చెట్టి లాంటివి. గులాబీ మొక్కలాంటివి అయితే కనీసం మనిషికి ఒక 20 -30 ఆయినా పెంచాలి.

13 . మీ వాహనానికి రెగ్యులర్ గా పొల్యుషన్ చెక్ చేయిస్తూవుండండి . పాత వాహనాలని మనం సెంటిమెంట్ తోనో లేక పడివుంటుందిలే అనో లేక నడిచేవరకు నడిపిద్దాం అనో ఎన్నేళ్ళయినా ఇంకా వాడుతూ వుంటాం . వాటిని అప్పుడెప్పుడో తాయారు చెయ్యడం వల్ల , అప్పట్లో ఈ వాహన తయారీదారులకి అంత అవగాహన లేకపోవడం వల్ల , ఆ వాహనాలు ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి . అందువల్ల పాత వాహనాలు వాడటం తగ్గించండి. కావాలంటే షో పీస్ లా పెట్టుకోండి.


14. Reuse మరియూ Recycle గురించి పిల్లల్లో అవగాహన కల్పించాలి . reuse గురించి మనకి ఒకరు చెప్పక్కర్లేదు. దాంట్లో మనం మాస్టర్స్ .. కానీ recycle గురించి మనకి ఇంకా అంత అవగాహన లేదు . అమెరికా లో వాడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ , కూల్ డ్రింక్ కేన్స్ లాంటివి అవి అమ్మిన షాప్ వాళ్ళే వెనక్కి తీసుకుంటారు . మనం వెనక్కి ఇచ్చిన ప్రతి బాటిల్ /కాన్ కి ఇంతని మనకి తిరిగి చెల్లిస్తారు . వీలయినంతగా డిస్పోసబెల్ వస్తువుల వాడకం తగ్గించండి . ఒకప్పుడు మనం పెళ్లి బోజనాలకి చక్కగా అరిటాకులు వాడేవాళ్ళం ..ఇప్పడు అందరూ బుఫేలు.. డిస్పోసబెల్ ప్లేట్లు అంటున్నారు ..:((

15. ఆఫీసుల్లో కాఫీ డిస్పోసబెల్ కప్పుల్లో మానేసి మీరే మాంచి కప్ కొనుక్కెళ్ళండి . అది చూసినవారంతా ఆ కప్ గురించి అడగకపోరు . అప్పుడు మీరు వాళ్ళకి disposable కప్పుల వల్ల నష్టాలు వివరించవచ్చు .

16. మనం వాడేసిన ఎలక్ట్రానిక్ వస్తువులు (సెల్ ఫోన్స్ , కంప్యూటర్స్ , లాప్టాప్స్) మరియు దాంట్లో వాడే బాటరీలు చాలా విషపూరితమయినవి . అందుచేత మనం వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. మునిసిపాలిటి చెత్తబుట్టల్లో కూడా పడేయకూడదు . ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనం వాడేసిన బాటరీలు తిరిగి తీసుకుని వాటిని జాగ్రత్తగా dispose చేసే బాద్యత మనకి అమ్మిన షాప్ వాడిదే . అంటే మీ నోకియా సెల్ ఫోన్ బాటరీ మీరు నోకియా షాప్ లో తిరిగి ఇస్తే వాడు తీసుకోవాలి . ఆ షాప్ వాడు ఇలా కస్టమర్స్ ఇచ్చిన వాడేసిన బాటరీలు అన్ని నోకియా కంపనీ కు పంపిస్తే వాళ్ళు ఆ బాటరీలు నుండి విష రసాయనాలు (లెడ్, కాడ్మియం లాంటివి ) అన్ని వేరుచేసి ఆ తరువాత వాటిని జాగ్రత్తగా ప్రబుత్వ నిబంధనల ప్రకారం dispose చేస్తారు . బాటరీల్లోను, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డుల్లోనూ వుండే రసాయినాలు చాలా చాలా ప్రమాదకరమయినవి కనుక వీటి విషయం లో మనం చాలా శ్రద్ద తీసుకోవాలి . (వీటి
గురించి మరింత వివరాలు వేరే టపాలో రాస్తాను )

17. ఎలక్ట్రానిక్ వస్తువులు , ప్లాస్టిక్ వస్తువులు , కొన్ని రకాల రబ్బర్లు అవసరం లేకుండా కాల్చొద్దు . అవి చాలా toxic వాయువులు విడుదల చేస్తాయి .

18. కారు /బైక్ పూలింగ్ చేసుకోండి (అంటే మీ కొలీగ్స్ ఎవరయినా మీ ఇంటి దగ్గర లో నివసిస్తుంటే రెండు వాహనాలకి బదులు ఒకటే ఇద్దరు షేర్ చేసుకోండి ). దానివల్ల పెట్రోల్ ఖర్చు తక్కువ , మీ ఆఫీసు లో పార్కింగ్ ప్రాబ్లం వుంటే దానికి ఇది ఒక పరిష్కారం ..అన్నిటికన్నా కాలుష్యం తగ్గించినవారవుతారు .

19. వీలయినంత దూరం నడిచి వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యండి . " ఆరోగ్యానికి ఆరోగ్యం - అదాకి అదా - ప్రకృతికి మేలు " .. నడవలేక పొతే సైకిల్ ఆయినా కొనుక్కోవచ్చు . నేను త్వరలో ఒక సైకిల్ కొనబోతున్నా

20. దూరమయితే పబ్లిక్ ట్రాన్స్పొర్టెషన్ లొ వెళ్ళగలరెమో ప్రయత్నిచండి (అటో కాదు .. బస్సు /ట్రైన్ లాంటివి ). అది కుదరకపోతేనే మీ కారు /బైక్ తియ్యండి . ఆటో లో వెళితే మీ వాహనం కంటే ఎక్కువ కాలుష్యం అది విడుదల చేస్తుంది .అందువల్ల ఆటో కన్నా మీ వాహనమే బెటర్.

21. ఎప్పుడయినా బయట ఫుడ్ తిన్నాక పేపర్ నాప్కిన్స్ మిగిలిపోతే అవి పడెయ్యకుండా తీసి దాచుకోండి . తరువాత ఉపయోగించోచ్చు . నేనయితే పేపర్ నాప్కిన్స్ వాడను . నా హ్యాండ్ కర్చీఫ్ ఎప్పుడూ నా జేబులోనే వుంటుంది .

22. షాపులో ప్లాస్టిక్ సంచులు బదులు పేపర్ సంచులు ఇస్తున్నారని వాటిని ప్రోత్సహించకండి . అవి ప్లాస్టిక్ లా విషపూరితం కాదు కానీ పేపర్ చెట్లనుండే తయారవుతుందని మర్చిపోకండి . రెస్ట్ రూముల్లో పేపర్ నాప్కిన్స్ బదులు మీ కర్చీఫ్ వాడండి. కొన్ని చోట్ల పేపర్ నాప్కిన్స్ బదులు హ్యాండ్ డ్రైయర్లు పెడతారు . అక్కడ పేపర్ సేవ్ చేస్తున్నాం కానీ బోల్డంత కరెంటు ఖర్చుపెడుతున్నాం . అందుకే అన్నిటికన్నా మన కర్చేఫ్ మేలు .

23. ఎక్కువ బాటిల్ వాటర్ కొనకుండా ఒక మంచి బాటిల్ కొని అవసరమయినప్పుడు రీఫిల్ చేసుకోండి .

24. మీరు షాపింగ్ చేసేటపుడు లేక ఏదయినా హోటల్ కి వెళ్ళినప్పుడు environment friendly (or eco friendly) వస్తువులు కొనడానికి మక్కువ చూపండి. వాటిపట్ల మీ ఇంట్రెస్ట్ వారికి తెలియపరచండి .

అప్పుడు వాళ్ళ దగ్గర లేకపోయినా మీ కోరిక వాళ్ళకి తెలియపరిస్తే నెక్స్ట్ టైం మీకు అవి అందుబాటులో ఉంచడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు . ఏదయినా వస్తువు లేక పరికరం తాయారు చేసేముందు ఆ కంపెనీ వాళ్ళు ' ఆ వస్తువునుండి కస్టమర్ ఏమి ఆశిస్తున్నాడు' అని ఎంక్వయిరీ చేస్తారు (దీన్నే వాళ్ళ పరిబాషలో 'వాయిస్ అఫ్ కస్టమర్' అంటారు ). అవి ప్రతీసారి కస్టమర్ ని అడిగి తెలుసుకోవడం కుదరక ఆ షాపులు లేక డీలర్స్ ని అడిగి తెలుసుకుంటారు . ఆ షాపువాళ్ళు లేక డీలర్లు గనుక "ఎక్కువ కస్టమర్స్ గ్రీన్ వస్తువులు (environmental friendly) వస్తువులు కొనడానికి ఇష్టపడుతున్నారు" అని చెబితే కంపెనీలు కూడా ఆ వైపుగా ఆలోచిస్తాయి.

నాకు ఇప్పటికి గుర్తొచ్చినవి రాసాను. మీకు ఇంకా తెలిసే వుంటాయి. నాకు గుర్తొచ్చినవి ఇక్కడ అప్డేట్ చేస్తూ వుంటా .. మీకు సమయం చిక్కినప్పుడల్లా ఒక లుక్కేస్తూ వుండండి . వీటిలో మీరు చాలా చేస్తూ ఉండొచ్చు. మీరు చేసేవి మీతోనే ఉంచుకోవద్దు. మిగతా వాళ్లకి చెప్పండి. వాళ్ళు చెయ్యగలిగే వాళ్ళని ఇంకొంతమందిని inspire చెయ్యమనండి . (pay it forward లా లేక మన తెలుగు స్టాలిన్ లా )

మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి .. వృదాచెయ్యడం తగ్గిస్తే సగం ప్రాబ్లం తీరినట్టే .. ఆ వృదాచెయ్యడం విద్యుత్ అవ్వచ్చు , పేపర్ అవ్వొచ్చు , నీళ్ళు అవ్వచ్చు. ఇంకేదయినా కానీ పొదుపు గా వాడదాం .. పర్యావరణాన్ని కాపాడదాం .. ఇది మనందరి బాద్యత .. మన కోసం కాదు ..మన పిల్లల కోసం .. వాళ్ళ పిల్లల కోసం .. మన భావితరాల కోసం ..

ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపనతో వీటికే అతుక్కుపోతున్నారు.

కంప్యూటర్‌ అవసరం రోజు రోజుకీి పెరిగిపోతోంది. దాంతో అనేక అవసరాలకు దీని వాడకం అందరికీ అలవాటు అయిపోయింది. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉన్నవారికే అవకాశాలు ఎక్కువవుతున్నాయి. దీంతో యువత కంప్యూటర్‌ వైపు మొగ్గు చూపిస్తున్నారు. యువత కొంతమంది ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపనతో వీటికే అతుక్కుపోతున్నారు. వీటి వల్ల చిన్న చిన్న సమస్యలతో పాటు, రిపిటేటివ్‌ స్ట్రెయిన్‌ ఇంజ్యురీస్‌ (ఆర్‌ఎస్‌ఐ) అనే డిజార్డర్స్‌ వచ్చే అవకాశాలున్నాయిని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదే పనిగా కంప్యూటర్‌కే అంకితమవ్వకుండా కాసేపు కళ్లతో పాటు, చేతులకు విశ్రాంతినిస్తే మేలని సూచిస్తున్నారు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యో గులతో పా టు, యానిమేషన్‌ వంటి ఇతర రంగా ల్లో పనిచేసే యువత ఎక్కువ భాగం కం ప్యూటర్‌ దగ్గరే గడు పుతుంటారు. అలా గడిపేటప్పుడు కొన్ని అవయవ భాగాల్ని అతిగా కదిలించడం వల్ల కొన్ని ఇబ్బందులొస్తుంటాయి. వాటినే ‘రిపిటేటివ్‌ స్ట్రెయిన్‌ ఇంజ్యురీస్‌(ఆర్‌ఎస్‌ఐ) అంటారు. వీటినే ‘క్యుమ్యులేటివ్‌ ట్రామా డిజార్డర్స్‌’ అంటారు. బాగా కదలించిన అవయావాలకు నొప్పి కలుగుతుంటుంది. ఒత్తిడి వల్ల కదలికలు బాగా తగ్గడం లేక బాగా పెరుగుతాయి. ధూమపానం, జంక్‌ఫుడ్స్‌ తీసు కోవడం వల్ల ఇలాంటి అనారోగ్యాలు రావచ్చు.

లక్షణాలు..
ఆర్‌ఎస్‌ఐలో చాలా అలసటగా అనిపిస్తుం టుంది. నొప్పి వచ్చే భాగాన్ని ఉప యోగించడానికి ఇప్టపడరు. రాత్రిళ్లు ఈ నొప్పులు ఎక్కువవుతుంటాయి. వేళ్ళల్లో కొన్ని ప్రాంతాల వద్ద నొప్పి ఉంటుంది. అవి ట్రిగరింగ్‌ ఫిం గర్‌లో వేళ్ళు ముడుచుకునేటప్పు డు చాచేప్పుడు అరచేతిలో నొప్పి వస్తుంటుంది. వేళ్లని చాపడం ఇబ్బందవుతుంది.

డికర్‌వీన్స్‌ డిసీజ్లో అనే డిజా ర్డర్స్‌లో బొటన వేలు క్రింద బా గా నొప్పి వస్తుంటుంది. అప్పు డు బొటనవేలుతో చేసే పనుల న్నీ కష్టమవుతాయి. మరోటి కార్పెట్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌. పై నుంచి నరం అరచేతిలోకి ఓ టన్నెల్‌ ద్వారా వస్తుంటుంది. ఆ టన్నెల్‌ సన్నవైనప్పుడు నరం మీద ఒత్తిడి పడి బొటన వేలు, చూపుడు వేలు, మధ్యవేలు తిమ్మిర్లు, మంటలతో బాటు పటుత్వం తగ్గుతుంది.

టెన్నిస్‌ ఎల్బో...
టెన్నిస్‌ ఎలోలో మోచేతి బయటి వైపు నొప్పి వస్తుంటుంది. చేయి కదిలించినా, దేనినైనా చేతిలో పట్టుకోవాలని చూసినా నొప్పి ఎక్కు వవుతుంది. గోల్ఫర్స్‌ ఎల్బోలో మోచేతి లోపలి భాగంలో నొప్పి ఉం టుంది. భుజాల దగ్గర టెండన్స్‌ దెబ్బ తినడం వల్ల ఇబ్బంది వస్తుంది. చెయ్యి పక్క కెత్తినా నొప్పే...!

‘కంప్యూటర్‌ ఐ’ అనే డిజార్టర్‌ వస్తుంటుంది. అలా కంప్యూటర్‌ స్క్రీన్‌కేసి చూస్తుండడంతో కళ్లు ఎర్రబడతాయి. కళ్ళు బరువుగా అనిపిస్తాయి. చూపు మసకబారవచ్చు. దీనికి కంటి వైద్యుణ్ణి సంప్రదించి గ్లాసెస్‌ ఉపయోగించాలి.

జాగ్రత్తలు..

* కంప్యూటర్‌ నుంచి 30 సెం.మీ మధ్య దూరంలో కూర్చోవాలి. దూరం ఎక్కువ కాకూడదు. తక్కువ కాకూడదు.

* కుర్చీ కూడా వెనుక ఎత్తుగా మెడ ఆన్చేలా ఉండాలి. కుర్చీలో వెనక్కి జరిగి కూర్చోవాలి.


* కంటి చూపుకి కంప్యూటర్‌ తెర కొద్దిగా క్రిందకి ఉండాలి.


* కొంతమంది అవసరం లేకపోయినా ఎప్పుడూ కంప్యూటర్‌ మౌస్‌ని చేతితో కదిలిస్తుంటారు. అది మంచిది కాదు. కొంచెంసేపు విశ్రాంతి ఇవ్వాలి. కంప్యూటర్‌ మౌస్‌ని గట్టిగా పట్టుకోకూడదు. రెండు ప్రక్కల కీస్‌ని ఒకే చేత్తో ఆపరేట్‌ చేయకూడదు. రెండో కీస్‌ కోసం రెండు చేతుల్ని వాడాలి.

* ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా చేయడం మంచిది.


* ధూమపానం ఆపాలి. జంక్‌ఫుడ్స్‌ తినకూడదు.

* గంటల కొద్దీ కుర్చీలో కదలకుండా కూర్చోకూడదు. గంటకోసారైనా అయిదు నిముషాల పాటు లేచి అటు ఇటు తిరగాలి. జీవన విధానాన్ని మార్చుకోవాలి.


* ఆర్‌.ఎస్‌.ఐని మందులు, ఫిజియోథెరపీలాంటి వాటితో తగ్గించవచ్చు. అప్పటికీ తగ్గకపోతే శస్తచ్రికిత్సతో నయం చేయవచ్చు.

* పోటీ తత్వానికి తగినట్టుగా కష్టపడడం తప్పులేదు. కాని ఆ సమయంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అందుకు పైన జాగ్రత్తలను పాటిస్తూ మీ రంగాల్లో లక్ష్యాలను చేరుకోవాలి. మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలి.

26, మార్చి 2011, శనివారం

మనకు చరిత్ర లేదు. సమాజం లేదు

యువరత్న నందమూరి బాలకృష్ణ శ్రీరాముడిగాప్రముఖ దర్శకులు బాపు దర్శకత్వంలో సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం శ్రీరామరాజ్యం. ఈ చిత్రంలో వాల్మీకిగా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నటిస్తున్నారు. లక్ష్మణునిగా శ్రీకాంత్, భరతునిగా సాయికుమార్, సీతగా నయనతార నటిస్తున్నారు.

ఈతరం వారికే కాక రేపటి తరం వారికి ఆ ముందుతరం వారికి మన రామాయణం పట్ల ఇంట్రెస్ట్ కలిగేలా, శ్రీరాముడిని గుర్తుంచుకునేలా ఉండాలని ప్రేక్షకులుగా మేము కొరుకుంటునము.మన రామాయణ, భాగవత, భారతాలు ఎప్పటికీ జనజీవనాలు. మన సంస్కృతీ సంప్రదాయాలకు పట్టుగొమ్మలు. వాటిని మర్చిపోతే మనకు గతం లేదు. మనకు చరిత్ర లేదు. సమాజం లేదు.

తెలుగు సినిమాల స్థాయిని తమిళవాళ్లకి తెలియజేయునున ఎన్టీఆర్ ‘శక్తి’

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంత వరకు మరే సినిమా సాధ్యం కాని రికార్డులు నెలకొల్సిన‘మగధీర’కి ఇంతదాకా తమిళనాడు జోన్ ని ఎన్స్ ప్లాయిట్ చేసే ఛాన్స్ దక్కలేదు. తమిళంలోకి అనువదించాలనే ఆలోచనతో అసలు చెన్నై లో కూడా ఆ చిత్రాన్ని విడుదల చేయకుండా వచ్చే రాబడిని వదులుకున్నారు. అప్పట్నుంచీ తమిళ వెర్షన్ ని విడుదల చేయాలని చూస్తున్నా కానీ ఇంతదాకా అది వెలుగు చూడలేదు. తెలుగు సినిమాల స్థాయిని తమిళవాళ్లకి తెలియజేసి, ఇకపై మన అనువాదాలకోసం వారు పోటీ పడేలా చేస్తుందని భావించిన మగధీర ఇంకా తమిళనాడు బార్డర్ దాటకుండా ఉండిపోతే, జూ ఎన్టీఆర్ మాత్రం తన ‘శక్తి’ అక్కడి వాళ్లకి చూపించడానికి సమాయత్తమవుతున్నాడు.

ప్రస్తుతం విడుదల అవుతున్న ఉన్న చిత్రాల్లో భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో ‘శక్తి’ ఒకటి. జూ ఎన్టీఆర్ ఇలియానా జంటగా మొహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జైట్ తొ అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ‘శక్తి’ ఆడియో విడుదలయ్యింది. ఇక..ఈ సినిమా కథ ఎలా ఉంటుంది? అనే విషయంపై ఫిలింనగర్ లో చర్చలు జరుగుతున్నాయి

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘శక్తి’ చిత్రం తమిళంలోకి ‘ఓం శక్తి’ పేరుతో అనువాదమవుతోంది. తెలుగుతో పాటు తమిళంలోను ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చరణ్ చేద్దామని చేయలేకపోతున్న దానిని ఎన్టీఆర్ ముందు చేసి చూపించి, మగధీర తమిళ వెర్షన్ కి మార్గం సుగమం చేస్తాడమో చూడాలి

నా ఈ కోరిక తీరేది ఎపుడో

రజనీకాంత్.... సముద్రంలా కనిపించే నది. కమల్‌హాసన్... నదిలా కనిపించే సముద్రం. ఇక ఇద్దరూ కలిస్తే వెండితెరపై సునామీ. ‘అంతులేని కథ, అందమైన అనుభవం, వయసు పిలిచింది, పాటగాడు, ఎత్తుకు పై ఎత్తు’ తదితర తెలుగు చిత్రాల్లో, ‘పదినారు వయదినిలే, అపూర్వ రాగంగళ్’ వంటి తమిళ చిత్రాల్లో కలిసి నటించారు రజనీకాంత్, కమల్‌హాసన్. కెరీర్ ఆరంభంలో ఈ విధంగా కలిసి నటించిన రజనీ, కమల్‌లు విడివిడిగా స్టార్‌డమ్ తెచ్చుకున్న తర్వాత ఎవరి సినిమాలతో వారు బిజీ అయ్యారు.

అయినప్పటికీ వీరి కాంబినేషన్‌లో సినిమా చేయడానికి పలువురు దర్శకులు ప్రయత్నాలు చేశారు. కానీ సాధ్యపడలేదు. ఇక ఈ కాంబినేషన్ కలవాలంటే వారి గురువు ‘కె.బాలచందర్’ రంగంలోకి దిగాల్సిందేనని, ఆయన ఒక్కడి వల్లే అది సాధ్యమవుతుందని చాలామంది అభిప్రాయపడ్డారు కూడా. కానీ బాలచందర్ మాత్రం.. ‘ఇప్పుడు ఈ హీరోలతో సినిమా చేయలేను. ఒకప్పుడు వాళ్లకు ఇమేజ్ ఉండేది కాదు. నేను అల్లుకున్న కథలుతో వారితో సినిమాలు చేశాను. ఇప్పుడు వాళ్ల ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమా చేస్తే.. నా కథ కిల్ అవుతుంది’ అని ఓ సందర్భంలో పేర్కొన్నారు.దాంతో ఈ సూపర్‌స్టార్ల కలయికలో ఇక సినిమా వచ్చే అవకాశం లేదని చాలామంది ఫిక్స్ అయ్యారు.

కొత్త ఇమేజ్‌ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

హీరోలు తమ ఇమేజ్ చట్రంనుండి బయటకు రాలేరా ?
కథకులు.. నిర్మాతలు.. దర్శకులు హీరోల ఇమేజ్‌ని మార్చగలరా? కొత్త ఇమేజ్‌లు వచ్చిపడితే అవి ఎంతకాలం నిలబడతాయి? ఇంతకీ ఇమేజ్ ఎంతవరకు అవసరం? ఇలా ఎన్నో ప్రశ్నలు హీరోలను వేధిస్తుంటాయి.
హీరోలుగా తెరంగేట్రం చేసిన కొద్దిరోజులకే ఇమేజ్ ఏర్పడడం జరుగుతుంది. చేసిన సినిమాలు తక్కువే అయినా, అటు పరిశ్రమ ఇటు ప్రేక్షకులు ఓ ఇమేజ్ చట్రంలో హీరోను ఫిక్స్ చేసేస్తారు. అలా ఇమేజ్ చట్రంలో ఇరుక్కున్న తరువాత ప్రయోగకథలు, ప్రయోగ వేషాలు వేయకపోవడం ఉత్తమమని హీరోలు సైతం భావించి తమ ఇమేజ్‌ని రెట్టింపుచేసే మూసపాత్రల కోసమే ఎదురు చూస్తారు.
చాలామంది హీరోలు ఏ ఇమేజ్ చట్రంలోను ఇరుక్కోకూడదని చిత్రపరిశ్రమని ప్రేక్షకులను అబ్బురపరుస్తూ కొత్త కొత్త పాత్రలకోసం కథలకోసం అనే్వషించి చిత్రాల్లో నటిస్తారు. అవి సక్సెస్ అయితే సరి లేకపోతే తమ ఇమేజ్ చట్రమే పదిలమని భావించి అలాంటి చిత్రాల్లో నటించడానికే సిద్ధపడతారు. ఇమేజ్ చట్రం నుండి బయటపడడానికి నటించే చిత్రాలు కూడా హీరోలకు కొత్త ఇమేజ్‌ని తెచ్చిపెట్టినా ఆశించినంతగా కలెక్షన్లు రాబట్టలేకపోవడంవల్ల హీరోలు అలాంటి చిత్రాలు వరసగా చేయడానికి ఇష్టపడరు.

మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, స్టయిలిష్‌స్టార్ అల్లు అర్జున్, యువరత్న బాలకృష్ణ, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్, రెబల్‌స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, సూపర్‌స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేష్‌బాబు, నట సామ్రాట్ అక్కినేని, యువ సామ్రాట్ నాగార్జున, యాంగ్రీయంగ్‌మాన్ రాజశేఖర్, పీపుల్స్‌స్టార్ ఆర్.నారాయణమూర్తి, లవర్‌బోయ్ తరుణ్, విక్టరీ వెంకటేష్, మ్యాన్లీస్టార్ శ్రీహరి ఇలా హీరోగా నటించే నటుల ముందు ఏదో ఒక స్టార్‌ని తగిలించి ఇమేజ్ చట్రంలో బంధించడం జరిగిపోతుంది. దానినుండి బయటపడలేక హీరోలు నానా అవస్థలు పడతారు. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసాను...లోపల ఒరిజినల్ అలాగే ఉంది. అది బయటకు వచ్చిందో రచ్చరచ్చ...ఈ డైలాగ్ ‘బృందావనం’లో ఎన్టీఆర్‌ది. ఇది ఎన్టీఆర్‌కేకాదు పరిశ్రమలో హీరోలందరికీ వర్తిస్తుంది. ఎవరి పరిధిలో వారు వారి క్యారెక్టర్‌లో నటిస్తున్నా ఒరిజినల్ అనేది ఎప్పుడూ సపరేట్‌గా ఉంటుంది. ఆ ఒరిజినల్‌కే రకరకాల పాత్రలను అద్ది నటిస్తూ ఉంటారు. ఒరిజినల్ ఏమిటనేది పరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలో నటించిన కొద్దిపాటి సినిమాలతోనే బయటపడిపోతుంది. అయితే దానినితప్పించుకోవడానికి రకరకాల పాత్రలను ట్రై చేయడం జరిగినా ఎక్కడో ఒక చోట ఈ నటుడు ఫలానా క్యారెక్టర్స్ బాగా చేయగలడని పరిశ్రమతోపాటు ప్రేక్షకులు కూడా ఫిక్సయిపోతారు. అదే ఇమేజ్ చట్రం. దానికి తగ్గిచేసినా, పెంచి చేసినా ఒకటి రెండు చిత్రాల వరకు ఆదరిస్తారే తప్ప కంటిన్యూగా ఆదరించరనేది చాలామంది హీరోలకు తెలిసిన విషయమే.

జూ.ఎన్టీఆర్ ఇమేజ్‌ని మేము మార్చేశాం. ఇకమీదట ఎన్టీఆర్‌ని ఇలాగే ఇష్టపడతారని నిర్మాత దర్శకులు తెగసంబరపడిపోతున్నారు. అయితే ఈ సినిమనిర్మాణపరంగా హైబడ్జెట్‌తో తయారైనా మూస కథ కావడంతో ఆశించినంత హీరో ఇమేజ్‌ని గాని, చిత్ర ఆదరణ గాని అందలేదు. దాంతో సదరు నిర్మాత పైరసీ యుద్ధాన్ని ప్రారంభించారు. యంగ్ టైగర్‌గా ముద్రపడిన ఎన్టీఆర్ చేసిన చిత్రాల్లో అధిక భాగం ఆవేశంతో కూడుకున్న కథాంశాలే. వాటిలో కూడా అంతర్గతంగా ఫ్యామిలీ డ్రామా ఉంది. ఈ సినిమాలే ఎన్టీఆర్‌కి మాస్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టి భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టాయి. అయితే పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘ఆంధ్రా అల్లుడు’ గతంలో పల్టీ కొట్టడంతో ఎన్టీఆర్ మళ్లీ మాస్ ఇమేజ్‌ని పెంచే యాక్షన్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. ‘బృందావనం’ వంటి సాఫ్ట్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా తరువాత కూడా ‘శక్తి‘వంటి పవర్‌ఫుల్ టైటిల్‌తో రావడం గమనిస్తే ఎన్టీఆర్ ఇమేజ్ ఏమిటన్నది మనకే అర్ధమవుతుంది.
పాతతరంలో ఎన్టీఆర్ సాంఘిక చిత్రాల్లో ఎంత రాణించినా పౌరాణికాలు జానపదాలు ఆయనకు తెచ్చిన ఇమేజ్ ప్రత్యేకం. ఎఎన్‌ఆర్ మొదట్లో పౌరాణిక జానపద చిత్రాలు చేసినా ఆ తరువాత ఆయనకు సాంఘిక చిత్రాలే మంచి ఇమేజ్‌ని తెచ్చాయి. కృష్ణకు సాంఘిక చిత్రాలతోపాటు కౌబాయ్, గూఢచారి చిత్రాలు పెద్ద ఇమేజ్‌ని తెచ్చాయి. శోభన్‌బాబు చిత్రాల్లో భారీ ఇమేజ్‌ని తెచ్చిన చిత్రాలు పక్క్ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లే. కృష్ణంరాజుకి ఆవేశపూరిత పాత్రలు కలిగిన చిత్రాలే రెబల్‌స్టార్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టాయి. వారి ఇమేజ్ పరిధి దాటి లేదా తగ్గి సినిమాలు చేసినపుడు మిశ్రమ ఫలితాలను పొందడం జరుగుతుంది. అందుకే హీరోలు ఎక్కువగా వారి ఇమేజ్ చట్రంలోనే నటించడం ఉత్తమం అని భావిస్తారు.

మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి సైతం రుద్రవీణ, ఆరాధన, ఆపద్బాంధవుడు వంటి చిత్రాల్లో తనలోని నటుడిని సంతృప్తిపరుచుకున్నా, ఇమేజ్‌పరంగా ప్రేక్షకుల్ని అలరించలేకపోయారు. దాంతో తన ఇమేజ్ పంథా చిత్రాలనే ఇప్పటివరకు అనుసరిస్తుండడం కనిపిస్తుంది. ప్రస్తుతం రాజకీయ ప్రవేశంతో ఎలాంటి సినిమాలలో నటించాలా? అనే ఆలోచనలో పడ్డా తన ఇమేజ్‌కి తగ్గట్టుగానే కథ, సినిమా ఉంటుందని ప్రకటించడంబట్టే అర్ధమవుతుంది ఇమేజ్ అంటే ఏమిటో?

చిరంజీవి తనయుడిగా చిరుత, మగధీర వంటి రెండు చిత్రాల్లోనే భారీ ఇమేజ్‌ని మూటగట్టుకున్న రామ్‌చరణ్ రాబోయే ‘ఆరెంజ్’ చిత్రంతో యువతను కూడాపెద్దఎత్తునఖాతాలోవేసుకోవాలన ప్రయత్నించాడు. అన్నివర్గాల ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా నటించే నటుడికి ఉండే ఇమేజ్ ఏమిటన్నది తండ్రినిబట్టి ఈ తనయుడికి అర్ధమై వుంటుంది. అందుకే ఆ బాటలో ప్రస్తుతానికి నడుస్తున్నట్టు కనిపిస్తుంది.

తన తండ్రితో ఎన్నో పాత్రలు పోషించిన బాలకృష్ణ ప్రత్యేకంగా ఏ ఇమేజ్‌ని చాలాకాలంవరకు ఏర్పరచుకోలేకపోయినా రానురాను పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలను, సీమ ఫ్యాక్షనిస్టు పాత్రలతో టాలీవుడ్‌ని షేక్ చేసాడు. అయితే ఈ కాలంలో నటించిన ‘మిత్రుడు' వంటివి ఎన్నో సాఫ్ట్ టైటిల్సతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడడంతో నిన్నటి ‘సింహా’తో మరోమారు తన ఇమేజ్ చట్రంలోకి ఇరుక్కుని నటించాడు. ఫలితం కూడా ఆరేంజ్‌లోనే దక్కింది. కానీ మళ్లీ శ్రీరామరాజ్యం చూస్తే ఇమేజ్ చట్రం బయటకు వచ్చి నటిస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే నటుడు అనేవాడు ఎలాంటి పాత్రలైనా నటించగలిగి ఉండడంతోపాటు ప్రేక్షకుల్ని మెప్పించగలగాలి అన్నది సత్యం.

కృష్ణంరాజు వారసునిగా అదే ఆవేశభరిత పాత్రలను ఎంతో ఈజ్‌తో చేయగలడనే ఇమేజ్‌తో వచ్చిన ప్రభాస్ ఆ తరహా చిత్రాలలోనే భారీ విజయాలను సాధించాడు. సెంటిమెంట్ పాళ్లు ఎక్కువయిన యోగి, ఏక్‌నిరంజన్‌లు, హాస్యంతోరక్తి కట్టించాలని ప్రయత్నించిన డార్లింగ్, బుజ్జిగాడు ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయాయి. ప్రిన్స్ మహేష్‌బాబు ‘అతడు’తో ఓ తరహా ఇమేజ్‌ని సాధించినా ‘పోకిరి’తో ప్రత్యేక ఇమేజ్‌లో ఫిక్స్ అయిపోయాడు. అంతే! ఆ ఇమేజ్ అతని పాలిట శాపమైందని చెప్పాలి. అందుకే తరవాత వచ్చిన అతిథి, ఖలేజాలు బాక్సాఫీస్‌వద్ద నిరాశను మిగిల్చాయి.

పవర్‌స్టార్ ఇమేజ్‌తో రాణిస్తున్న పవన్ కళ్యాణ్ అల్లరి స్టూడెంట్, లవర్‌గా మంచి ఇమేజ్‌ని సంపాదించి వరస విజయాలను కైవసం చేసుకున్నా మధ్యలో ఇమేజ్ చట్రం బయటకు వచ్చి చేసిన జాని, గుడుంబా శంకర్, కొమరంపులి బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. దాంతో ప్రస్తుతం పాత ఇమేజ్ చట్రంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఇటీవలి కాలంలో నూతన పంథాలోకి కథలను ఎంపిక చేసుకోవడంతో వరసగా వరుడు, ఆర్య-2, వేదం వంటివి ప్రయోగాత్మక పాత్రలుగా మిగిలాయే తప్ప తన ఇమేజ్‌ని పెంచడంలో గానీ ప్రేక్షకులను రంజింపచేయడంలోగానీ ఏమాత్రం ఉపయోగపడలేదు.

లవర్‌బాయ్ ఇమేజ్‌లతో వచ్చిన తరుణ్, నితిన్, ఉదయ్‌కిరణ్ కొంతకాలం పెద్దనటులకే గట్టిపోటీనిచ్చినా ఆ ఇమేజ్ వారికి ఏవిధంగా ఉపయోగపడలేదు సరికదా కెరీర్‌ని బిల్డప్ చేసుకోవడంలో కూడా ఉపయోగపడకపోవడంతో వీళ్లంతా ప్రస్తుతం నిరాశతకొనసాగుతున్నారు. మోహన్‌బాబు వారసులుగా వచ్చిన మనోజ్, విష్ణులు కూడా ప్రేక్షకుల్లో సరైన ముద్ర వేసుకోలేకపోయారు. ‘జోష్’తో పల్టీకొట్టిన నాగార్జున తనయుడు చైతన్య రెండో సినిమా ‘ఏ మాయ చేసావె’తో లవర్‌బాయ్ ఇమేజ్‌ని సంపాదించాడు. అలాంటి ఇమేజ్‌తోనే ప్రస్తుత సినిమా ‘దటీజ్ మహాలక్ష్మి’ (పేరు నిర్ణయించలేదు) చేయడం విశేషం!
హాస్యపు హీరోగా ప్రత్యేక ఇమేజ్‌ని చేజిక్కించుకున్న రాజేంద్రప్రసాద్ తన ఇమేజ్‌కి భిన్నంగా పలుమార్లు నటించి పరాజయాలతో పాటు అవార్డులు కూడా దక్కించుకున్నాడు. గతంలో ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి వంటివి మంచిపేరు తెచ్చినా హాస్య కిరీటికి ప్రేక్షకుల్లో ఎక్కువ అభిమానాన్ని తెచ్చిపెట్టలేకపోయాయి.

అగ్రహీరోగా చలామణి అవుతున్న నాగార్జున ‘శివ’ తెచ్చిన కొత్త ఇమేజ్‌తో వరస ఫ్లాపులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం పవర్‌పుల్, అల్లరిపాత్రలతో కెరీర్‌ని లాగించేస్తున్నాడు. పవర్‌ఫుల్ పాత్రల జోలికి వెళ్లి ఎన్నోసార్లు నిరాశను మిగుల్చుకున్న విక్టరీ వెంకటేష్ ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తోనే సక్సెస్‌లు చవి చూసాడు. అందుకే అతని ఇమేజ్ తగ్గ ఫ్యామిలీ పాత్రలు ఎంచుకుంటూ మధ్యమధ్యలో అభిరుచికోసం వెరైటీ పాత్రలను చేసి ఫ్లాపులను మూటకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం అతని ఇమేజ్‌కి స్ర్తిపేర్లు బాగా (లక్ష్మి, తులసి) ఉపయోగపడుతున్నాయి.

విలన్‌పాత్రల్లో బ్రహ్మాండంగా రాణించిన శ్రీహరి లక్కీగా హీరో ఇమేజ్‌ని సంపాదించుకున్నాక పవర్‌ఫుల్‌పాత్రల్లో వరస విజయాలను కైవసం చేసుకున్నాడు. రానురాను ఆ ఇమేజ్ అతనికి ఆటంకంగా మారడంతో ఈ మధ్యకాలంలో సపోర్టుపాత్రల వెంట మళ్లీ నడిచి కొత్త ఇమేజ్‌ని తెచ్చుకున్నాడు. కాని అడపాదడపా భైరవ వంటి సినిమాల్లో నటిస్తూ తన పాత ఇమేజ్‌వైపు పయనిస్తున్నాడు. ‘అంకుశం’ సినిమా తర్వాత పోలీస్ పాత్రలంటే రాజశేఖరే చేయాలి అనేంత ఇమేజ్‌తో ఆవేశపూరిత పాత్రను అవలీలగా చేసే నటుడుగా రాజశేఖర్ ఎదిగాడు. అయితే ఈ ఇమేజ్ అతనికి మైనస్‌గా మారడంతోరకరకాల పాత్రలవైపు పయనించాడు. దానిలో భాగంగా రాఘవేంద్రరావు ‘అల్లరి ప్రియుడు’తో రాజశేఖర్‌ని సాఫ్ట్‌గా మలిచాడు. ఈ కొత్త ఇమేజ్ ఎంతోకాలం నిలబడకపోవడంతో మళ్లీ పోలీస్ పాత్రలను పోషించినా ఫలితం లేకపోయింది. తర్వాత ఆవేశపూరిత పాత్రలు చేస్తూ వస్తున్నా, మరోసారి ‘మహంకాళి’ సినిమాలో పోలీస్ పాత్రను పోషించడానికి రెడీ అయ్యాడు. పీపుల్స్‌స్టార్ ఆర్.నారాయణమూర్తి సైతం ఎర్రసినిమాలకు ఇమేజ్ స్టార్‌గా ఎదగడంతో వరస విజయాలను చవిచూసినా ఆ ఇమేజ్ ఎంతోకాలం నిలబడకపోవడంతో ‘వీర తెలంగాణ’ వంటి విప్లవ చిత్రాల పంథాను అనుసరించడం జరుగుతుంది.

హీరోలకు ఇమేజ్‌ని తెచ్చిపెట్టే చిత్రాలు ఒక్కోసారి వారి కెరీర్‌కి ప్రతిబంధకంగా కూడా మారతాయనడంలో సందేహమే లేదు. అలాంటప్పుడు వేరే తరహా చిత్రాలను చేసి ప్రేక్షకులనుండి కొత్త ఇమేజ్‌ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో అంచాలను తారుమారుచేసే సక్సెస్‌లు ఫెయిల్యూర్స్ కూడా రావచ్చు. ఏ హీరో అయినా ఇమేజ్ చట్రంనుండి తాత్కాలికంగా బయటపడి విజయాలు, పరాజయాలు పొందుతాడే తప్ప, పూర్తిగా ఇమేజ్ చట్రంనుండి బయటపడతాడని భావించలేం.

25, మార్చి 2011, శుక్రవారం

పుట్టకముందు మమ్మల్ని చంపొద్దు.మమ్మల్ని బ్రతకనివ్వండి.

సృష్టికి మూలం ఆదిశక్తి అంటారు. కాని ఆ ఆడపిల్లకే జన్మించే , జీవించే హక్కు లేకుండా పోతుంది. ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి.

ఆడపిల్ల పుట్టగానే అమ్మో! ఆడపిల్లా అని మూతి విరుస్తున్న పెద్దమనుష్యులు ఎందరో ఈ సమాజంలో ఉన్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలుసుకుని మరీ ఊపిరి పోసుకోకముందే పిండాన్ని నాశనం చెస్తున్నారు. అలా వీలుకాకపోతే పుట్టిన తర్వాత చెత్తకుండీలోనో , మురికి కాలువలోనో పనికిరాని వస్తువులా పడేస్తున్నారు. రక్తపు మరకలు ఆరని, కళ్లు కూడ తెరవని ఆ పసికందు ఊరకుక్కలకు, పందులకు ఆహారమవుతుంది. ఈ భ్రూణ హత్యలలో ఎక్కువగా ఆడశిశువులే ఉన్నారు. ప్రాణం ఉన్న పసికందును నోటకరుచుకుని ఎత్తుకుపోతున్న కుక్కను తరిమికొట్టిన జనాలు కన్నతల్లిని నోటికొచ్చినట్టు తిడుతున్నారు. అసలు అది కన్నతల్లేనా? మదమెక్కి కడుపు తెచ్చుకుని కని ఇలా పారేసింది? ఈ పసిగుడ్డును అలా పారేయడానికి దానికి మనసెలా వచ్చింది? అని అంటారు కాని ఒక్కరైనా ఆ తల్లి ఏ పరిస్థితిలో తన పేగు పంచుకుని పుట్టిన బిడ్డను బ్రతికుండగానే ఎందుకు వదిలించుకుంది. అల్లారు ముద్దుగా తన పొత్తిళ్లలో పెంచాల్సిన చిట్టితల్లిని నిర్దాక్షిణ్యంగా చెత్తకుండీ దగ్గర వదిలేసింది. అలా వదిలేసేటప్పుడు ఆ తల్లి ఒక్క క్షణమైనా తల్లడిల్లకుందా? ఇది ఎవరు ఆలోచిస్తారు?
ఆ బిడ్డను కని చెత్తకుండీ పాల్జేసినందుకు ఆడదాన్ని ఆక్షేపిస్తారు కాని ఆ బిడ్డ జన్మకు కారణమైన మగవాడు ఎక్కడ? అతని గురించి ఎవరూ ఒక్క మాట మాట్లాడరు ఎందుకు? ఒకవేళ జరిగింది తప్పైతే దానిలో ఇద్దరికీ సమానమైన పాత్ర ఉంది. కాని ఫలితం, పర్యవసానం ఆడదే భరించాలి. పెళ్లి అయ్యాక బిడ్డని కంటే గొడవ ఉండదు. కాని పెళ్లి కాకముందు జరిగిన తప్పుకు బాధ్యత ఆడదానిదే. మగవాడు అమ్మాయిని వాడుకుని, తన కోరికను తీర్చుకుని హాయిగా వెళ్లిపోతాడు. దానిని తప్పు అని నిలదీసేవాళ్లు కూడా ఉండరు. పైగా మగవాడు .. ఏది చేసిన చెల్లుతుంది. ఆడదే జాగ్రత్తగా ఉండాలి అని నీతులు చెప్తుంది ఈ గౌరవనీయ సమాజం. ప్రేమలో ఓడిపోయి గర్భవతి ఐన అమ్మాయిని ఈ సమాజం ఆదరిస్తుందా? లేదు. దానికి కారణమైన మగావాడు మాత్రం దర్జాగా తిరుగుతుంటాడు. మరో పెళ్లి కూడా చేసుకుంటాడు. నష్టపోయేది అమ్మాయే కదా. ఇటువంటి విపత్కర పరిస్థితిలో తన బ్రతుకే అగమ్యగోచరంగా ఉంటే తన కడుపున పుట్టిన నేరానికి ఆ పసికందును అందునా ఆడపిల్లను ఎలా పెంచగలను అని వదిలేస్తుంది గుండె భారం చేసుకుని. అలా కాకుండా ఆ బిడ్డను పట్టుకుని ఒంటరిగా కూడా బ్రతకగలదా?. బ్రతకనివ్వదు ఈ సమాజం. చెడిపోయిన ఆడది అని ముద్ర వేస్తారు. ఆమెతో తిరిగిన మగవాడు మాత్రం చెడిపోలేదు. ఎంతమందితో తిరిగినా అతను పుణ్యపురుషుడే. అందుకే తరచూ మనకు ఎంతో మంది ఆడపిల్లలు ప్రాణమున్నా, లేకున్నా మురికి కాలువలో, చెత్తకుండీల్లో చీమలకు ఆహారంగా, కుక్కలకు విందుభోజనంగా కనిపిస్తారు. ఆ చిట్టితల్లికి అదృష్టముంటే ప్రాణం పోకముందే ఎవరికంటైనా పడుతుంది. ఇలా ఆడశిశువని తెలియగానే తల్లేకాదు, భర్తా, పెద్దవాళ్లు కూడా చెత్తకాగితంలా విసిరేస్తున్నారు.

ఆడపిల్లలను పుట్టిన తర్వాత వదిలించుకోవడమే కాదు , పుట్టకముండే ఆడపిల్లని తెలుసుకుని పుట్టకుండా చంపేస్తున్నారు. ఎందుకంటే ఆడపిల్లంటే అదో పెద్ద దింపుకోలేనిభారం. నెట్టిమీద బండలాంటిది. చదివించాలి, కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి. ఆ తర్వాత వరకట్న సమస్యలు. అదే మగవాడైతే గాలికి పెరుగుతాడు. ఏదో ఒక పని చేసి సంపాదిస్తాడు. వంశాన్ని ఉద్ధరిస్తాడు. జీవిత చరమాంకంలో తల్లితండ్రులను , ఆస్థిని చూసుకునేది వాడే. అందుకే మగపిల్లాదే కావాలి. కాని తనను కన్నది ఆడదే , ఆ ఆడపిల్ల జన్మకు కారణం తానే అని తెలిసినా తెలియనట్టు ఆడపిల్లను వద్దు అంటాడు సదరు మొగుడు. ఇంతకుముందు లింగ నిర్ధారణ పరీక్షలు యదేచ్చగా జరిగేవి. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలియగానే గర్భస్రావం చేయిస్తారు. అలా తన బిడ్డను చంపుకోవాల్సి వస్తున్నందుకు ఆ తల్లి ఎంత ఆక్రోశించిందో ఎవరికీ పట్టదు. జన్మనిచ్చే తల్లికి కూడా తను ఎప్పుడు, ఎవరికి జన్మనివ్వాలో కూడా నిర్ణయించుకునే అధికారం లేదు. నాకు ఆడపిల్ల పుట్టడానికి నువ్వే కారణం, చంపడానికి వీళ్లేదు అని అని భర్తను నిలదీసే ధైర్యం ఆ ఇల్లాలికి ఎప్పుడు వస్తుందో?

పుట్టి పెరిగి మరో ఇంటికి ఇల్లాలై వెళ్లినా కూడా ఆడపిల్లకు జీవితం క్షణక్షణం గండంగానే ఉంటుంది. ముఖ్యంగా వరకట్న బాధితులకు. ఈ సమస్య ఈ కాలంలో పట్టణవాసుల్లో, చదువుకున్నవారిలో లేకపోవచ్చు కాని పల్లెల్లో, చాలా కుటుంబాలలో జరుగుతుంది. ఇప్పటికీ పోరాడి అలసిన ఎందరో అమ్మాయిలు ఈ కట్నదాహానికి బలి అవుతున్నారు.

అందుకే సృష్టిలో జన్మనివ్వడం ఆడదానికే ఉన్న అద్భుతమైన వరం. కాని ఆడపిల్ల జీవితమే నిత్యాగ్నిహోత్రంలా మారుతుంది. పుట్టినప్పటి నుండి మట్టిలో కలిసిపోయేవరకు ప్రతి క్షణం గండమే. అన్నింటికి అణగిమణగి ఉండాలి. తప్పు చేసినా , చేయకున్నా బాధ్యత వహించాలి. అన్నింటికీ జవాబుదారీగా ఉండాలి. వీటన్నింటికి చావు మాత్రమే పరిష్కారం అవుతుంది.

పుట్టకముందు మమ్మల్ని చంపొద్దు. పుట్టాక చెత్తకుండీ పాలు చెయొద్దు. కట్నం కోసం మమ్మల్ని సమిధలా మార్చొద్దు. మమ్మల్ని బ్రతకనివ్వండి.

ఇటీవల ఎవరో చెత్తకుండీ దగ్గర ఆడపిల్లను పడేసారంట అని విని కోపంతో రగిలిపోయా.ఇంత దారుణమా? అని.. అది మనసులో దాచుకోలేక ఇలా.......

ఏది చెప్పినా విన్పించుకునే స్థితిని దాటిపోయాం.

హక్కులూ, ఆత్మగౌరవాలపై పెరుగుతున్న శ్రద్ధ మనుషులకు బాధ్యతలపై మృగ్యమవుతోంది. ఎక్కడ చూసినా హక్కుల కోసం పోరాటాలే.. వాటిని తప్పుపట్టలేం, కానీ మనం నిర్వర్తించవలసిన బాధ్యతల్లో చిన్న లోపాన్ని ఎవరు ప్రశ్నించినా తట్టుకోలేం! కూడుపెడుతున్న వృత్తి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉండదు.. ఆదాయంపై ధ్యాస తప్ప! మన పట్లా, మనం చేసే పని పట్లా, సమాజం పట్లా బాధ్యతని విస్మరిస్తూనే హక్కుల కోసం ఉద్యమిస్తుంటాం. మన ధర్మాన్ని గాలికొదిలేసి నిరంతరం మన క్షేమం పట్లే మమకారం పెంచుకోవడం ఎంత దౌర్భాగ్యస్థితో అర్థమయ్యేటంత సున్నితత్వం మనలో ఇంకా మిగిలి లేదు. చేసే పని పట్ల నిర్లక్ష్యం ఎంత ఉపేక్షించరానిదో అర్థం చేసుకునే పరిస్థితిలోనూ లేము. మన పొరబాట్ల పట్ల అపరాధభావం కూడా మచ్చుకైనా కన్పించకుండా పోతోంది. పరోక్షంగా మన మనఃసాక్షికే జవాబుదారీగా ఉండడం ఎప్పుడో మానేశాం. మన శరీరాలు మందమవుతున్నాయి, బుద్ధులు సంకుచితమవుతున్నాయి. వితండవాదం, తర్కంతో మూర్ఖంగా అన్నీ నెగ్గించుకునే రాక్షస ప్రవృతి మనల్ని స్వారీ చేస్తోంది. ఎవరు చెప్పినా, ఏది చెప్పినా విన్పించుకునే స్థితిని దాటిపోయాం. ఒకవేళ విన్పించుకునే హృదయం ఇంకా మిగిలి ఉన్నా ప్రతీ ఒక్కరూ హక్కులనూ దక్కించుకోమని ప్రబోధించేవారే.. బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించమని నిర్దేశించేవారేరీ? అందరూ మనలాంటి ప్రజల పక్షాన హక్కులకై పోరాడతారు.. హక్కులను సాధించుకోమని ప్రేరేపిస్తారు.. ఏదైనా తేడా వస్తే వ్యవస్థని దుమ్మెత్తిపోస్తారు. వ్యవస్థని పతనావస్థకు చేరుస్తున్నది చేతులారా మనకు మనం కాదా? హక్కుల గురించి పోరాడేవారు బాధ్యతలను ఎందుకు ఉద్భోధించరు? సరిగ్గా పనిచేయమంటే అసలుకే మోసం వస్తుందని.. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాల్సిన బాధ్యతని విస్మరించడం ఎంతవరకూ సబబు? అసలు ప్రతీ మనిషీ తాను చేయాల్సిన ధర్మాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తే వ్యవస్థలో లోపాలెందుకు ఉంటాయి?

బాధ్యతాయుతంగా నడుచుకోవడానికి కూడా మనకు ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. ఏ ప్రయోజనం లేనిదే చివరకు బ్రతకడం కూడా వృధా అనేటంత వ్యాపారాత్మక ధోరణిని అలవర్చుకున్నాం. దాంతో ఎక్కడా తృప్తి మిగలట్లేదు. బేరసారాలు తలకెక్కక ముందు సమర్థవంతంగా ఏదైనా పనిచేస్తే ఎంతో సంతృప్తిని మూటగట్టుకునే వాళ్లం. ఇప్పుడా సంతృప్తులు ఎక్కడా లేవు. మనం చేసే ఏ పనిలోనూ పరిపూర్ణత గోచరించదు.. అతుకుల బొంతలా ఏదో చేయాలి కాబట్టి చేయడం తప్ప! ఇలాంటి పలాయనవాదంతో జీవిస్తూ మళ్లీ మనకు సమాజంలో దక్కాల్సిన అన్ని హక్కులూ దక్కాలి. ఇదో గొప్ప జీవనశైలీ.. దీన్ని మళ్లీ పద్ధతిగా గడుపుకొస్తున్న జీవితంగా అందరికీ చెప్పుకుని మురిసిపోవడం! ఫలానాది దక్కాలని పోరాడి.. అంతకన్నా పెద్దది మనం చేయాల్సి ఉండీ కూడా నిమ్మళంగా దాటేసి జీవితంలో ఎంతో సాధించామని మురిసిపోవడం ఎంతగా పాతాళానికి దిగజారిపోయామో తేటతెల్లం చేస్తుంది. హక్కులను వదులుకోమని ఎవరూ చెప్పరు.. కానీ హక్కుల కన్నా మన బాధ్యతలు చాలా శక్తివంతమైనవనీ.. హక్కులు ఒకరిస్తే తీసుకునే భిక్షం వంటివనీ, బాధ్యతలు మనకు మనం మన వంతు చేసే దానాల వంటివనీ గ్రహించగలిగిన రోజున మనవంతు ఏమీ దానం చేయకుండా ఉండిపోతూ, మరోవైపు మొండి చేతుల్ని చాచి అడుక్కోవడానికి మనసొప్పదు.

ఇదేమి రాజ్యం? ఇదేమి పాలన?

సాక్ష్తాత్తు ప్రజలు ఎన్నుకున్న ఒక చట్టసభ సభ్యుడిని, ఆ చట్ట సభ ఆవరణలోనే కొట్టమని ప్రోత్సహించిన వారు కూడా చట్ట సభ సభ్యులే. ఆ ప్రోత్సహించిన వారే ఈ నాడు ఆ వాహన చోదకుడిని ప్రభుత్వం ఉదారంగా విడిచెయ్యమని కోరడం లో ఔచిత్యం ఏమిటి?

ఇదేమి రాజ్యం?
ఇదేమి పాలన?
ఇదేమి ప్రాంతీయవాద సమర్ధన?

24, మార్చి 2011, గురువారం

కాసేపు నవ్వుకొండి మనసార

నవ్వడం ఒక భోగం

నవ్వలేక పోవడం ఒక రోగం

నవ్వించడం ఒక యోగం

మీకోసము ఒక్క చిన్న ప్రయత్నము;)

వారులేని ఈ బతుకేల?!
"మా వారు తప్పిపోయారని వారం రోజుల క్రితం రిపోర్టు ఇచ్చాను. ఇంత వరకు వారి అచూకీ కనుక్కోలేకపోయారు. ఆయన లేకుండా నేను బతకలేనండీ ... '' రెండు చేతులతో మొఖం కప్పుకుని ఏడ్చింది కోమలి.
"క్షమించమ్మా! మీవారి మీద మీకున్న ప్రేమను అర్థం చేసుకోగలను. ఐనా మా ప్రయత్నం మేం చేస్తూనే ఉన్నాం ...'' జాలిగా అన్నాడు పోలీస్ అధికారి.
"ఆయన వెళ్లినదగ్గర్నుండి ఎక్కడి పనులక్కడే ఆగిపోయాయంటే నమ్ముతారా? ఇల్లంతా మాసిన బట్టలే ... సింకునిండా అంట్లే ... ఏ మూల చూసినా బూజే ... హాటల్ తిండి తినలేక నిజంగానే చచ్చిపోతున్నాను ఎస్.ఐ. గారూ ...'' ఏడుపు ఆపి, కొంగుతో కళ్లొత్తుకుంటూ చెప్పింది కోమలి.
ఏడాదిలో రాత్రులెన్ని?
"సంవత్సరానికి 365 రోజులైతే ... అందులో రాత్రులెన్ని?'' అడిగింది టీచర్.
"పది టీచర్?'' చెప్పాడు టింకూ.
"అదెలా?'' ఆశ్చర్యపోయింది టీచర్.
"ఒక శివరాత్రి, తొమ్మిది నవరాత్రులు... మొత్తం పది'' వివిరించాడు టింకూ వేళ్లు లెక్కబెడుతూ.
ఆర్డర్ - ఆర్డర్
ఒక కేసు విచారణ నిమిత్తం నిషాలో ఉన్న మంగరాజుని కోర్టుకి తీసుకొచ్చి బోనులో నిలబెట్టారు పోలీసులు.
కోర్టు హాల్లో అందరూ మాట్లాడుకోవడం గమనించిన జడ్జి "ఆర్డర్ - ఆర్డర్'' అంటూ గట్టిగా కేకేశాడు.
వెంటనే "ఒక చిల్లీ చికెన్, క్వార్టర్ రాయల్ స్టాక్ విస్కీ తీసుకురా'' జడ్జీకంటే గట్టిగా అరిచి, జనాల్ని చూసి నాలుక కరుచుకున్నాడు గంగరాజు.
యథా గురూ ...
"గోల్డ్ చెయిన్ కరిగిస్తే ఏమొస్తుంది పిల్లలూ?''
"గోల్డు సార్ ... ''
"వెండి చెయిన్ కరిగిస్తే?''
"వెండి సార్ ...''
"సైకిల్ చెయిన్ కరిగిస్తే?''
"సైకిల్ సార్ ...''
" !!!!! .... ???''
'ఉత్త'ర కుమారుడు
"ఐదు సంవత్సరాలనుండి కమలకి ప్రేమలేఖల్ని రాస్తున్నాను తెలుసా?'' విచారంగా అన్నాడు ప్రేమారావు.
"అయితే ఓకె అంటుంది - బాధ పడకు'' ధైర్యం చెప్పాడు మిత్రుడు గోపాల్రావు.
"ఓకె అంది కాని నాతో కాదు, ఈ ఐదేళ్లూ నా ఉత్తరాల్ని అందించిన పోస్టుమాన్‌తో'' అసలు సంగతి చెప్పాడు ప్రేమారావు.
కొళాయి నీళ్లు వాడుతున్నాం!
"మీవారు ఇంటి వెనకున్న బావిలో పడి,పోయారట కదా? పాపం - బాధని ఎలా భరిస్తున్నారో?'' అంది చుట్టంచూపుగా వచ్చిన ఆదిలక్ష్మి.
"భరించక తప్పుతుందా వదినా ? ఎంచక్కా నూతి నీరు వాడుకునేవాళ్లం. ఇప్పుడు కొళాయి నీటి కోసం రెండు మైళ్లు నడవాల్సి వస్తోంది - ఖర్మ'' ఉస్సురంటూ చెప్పింది సుబ్బలక్ష్మి.
కోపం వచ్చింది...
వెంగళప్ప భార్య వెంగళప్పకు రెండు పది రూపాయల నోట్లిచ్చి పది రూపాయలకు వంకాయలు, పది రూపాయలకు దోసకాయలు తెమ్మని బజారుకు పంపింది. వెంగళప్ప హుషారుగా సంచితో బయలుదేరి, కొద్దిసేపటికే వెనక్కి వచ్చేశాడు.
అతడి చేతిలో ఖాళీ సంచి తప్ప కూరగాయలు లేవు. వెంగళప్ప భార్య పట్టలేని కోపంతో ‘‘కూరలేవీ?’’ అని అడిగింది.
‘‘నువ్యు ఏ పదితో వంకాయలు ఏ పదితో దోసకాయలు తెమ్మన్నావో చెప్పలేదు కదా. నన్నంటావేం?’’ అన్నాడు వెంగళప్ప కోప్పడుతూ.
-------------------------------------------------------------------------
"ఈ మధ్య అస్తమానం పళ్లు తోముతున్నావేంట్రా?'' ఆశ్చర్యపోయాడు తండ్రి.
"నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందట నాన్నా - టీచర్ చెప్పింది'' బదులిచ్చాడు నాని.
----------------------------------------------------------------------
70 కిలోలు
‘‘ఏమే లలితా... నెలరోజులు ఎక్సర్‌సైజ్ చేసేసరికి నా బరువు ఆరు కిలోలు తగ్గిపోయింది’’ చెప్పింది కవిత ఆశ్చర్యంగా.
‘‘నెల రోజులకు ఆరు కిలోలేనా?
‘‘నాకు ఒక్క రోజులో డెబ్బయ్ కిలోలు తగ్గిపోయింది తెలుసా?’’ అంది లలిత.
‘‘మైగాడ్ ఎలా?’’ అడిగింది కవిత.
‘‘మా ఆయనకు డైవోర్స్ ఇచ్చేశాను’’ అసలు విషయం చెప్పింది లలిత.
డబ్బులు చాలవ్
చెడు అలవాట్ల గురించి టీచర్ పాఠం చెబుతూ... స్టూడెంట్స్‌కు ప్రశ్నలు వేస్తోంది.
టీచర్: శ్రీకాంత్ నువ్వు చెప్పు బ్రాందీ, విస్కీ లాంటివి తాగొచ్చా?
స్టూడెంట్: తాగకూడదు అని మా డాడీ చెప్పారు.
టీచర్: వెరీగుడ్. తండ్రి అంటే అలా ఉండాలి. మరి ఎందుకు తాగకూడదో చెప్పారా?
స్టూడెంట్: చెప్పారు టీచర్. ఇద్దరం తాగితే డబ్బులు చాలవట.
3 వికెట్లు, 6 పేషెంట్లు
ఊళ్లోని ప్రముఖులంతా కలసి క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు.
ఓ డాక్టర్ బౌలింగ్ చేస్తూండగా ఓ వ్యక్తి మ్యాచ్ చూడ్డానికొచ్చాడు.
‘‘డాక్టరుగారు ఎలా ఆడుతున్నారు?’’ పక్కనున్న వ్యక్తిని అడిగాడతను.
‘‘అదరగొట్టేస్తున్నారు! ఇప్పటికిప్పుడే ఆయనకు మూడు వికెట్లు, ఆరు పేషంట్లు దొరికారు’’.
రోజుకి 25
‘మా మావయ్య, ఒక సంవత్సరంగా పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నాడండీ...’ సైకాలజిస్ట్ దగ్గరకొచ్చి చెప్పాడు శంకర్రావు.
‘‘ఏం చేస్తున్నాడు?’’
‘‘ప్రొద్దున్నుంచీ సాయంత్రం వరకూ కుర్చీలో కూర్చుని చేతుల్లో స్టీరింగ్ ఉన్నట్లు ఊహించుకుని కారు నడుపుతున్నట్లు ప్రవర్తిస్తున్నాడండీ!’’
‘‘అది కారు కాదనీ, కుర్చీ అనీ నువ్వు చెప్పలేదూ?’’
‘‘ఎలా చెప్తానండీ! సాయంత్రం కారు కడిగినందుకు నాకు రోజుకి పాతిక రూపాయలిస్తూంటేనూ!’’
‘‘మరిప్పుడెందుకు ఇక్కడికి వచ్చినట్లు?’’
‘‘ఇప్పుడు కారు తనే కడుక్కుంటున్నాడండీ...’’
చంద్ర వంట
భార్యావిధేయుడయిన రంగారావ్ ఓ మనస్తత్వ వైద్యుడి దగ్గరకొచ్చాడు.
‘‘ప్రతిరోజూ ఒకటే కలండీ! పద్నాలుగుమంది ప్రపంచంలో కెల్లా అందమైన సుందరీమణులతో నేను చంద్రమండలం మీద దిగానట...’’ దిగులుగా చెప్పాడతను.
‘‘ఓరినీ! అంత అద్భుతమయిన కల వస్తూంటే ఆ విచారం దేనికోయ్?’’
‘‘భలేవారే? వాళ్ళందరికీ అన్నం వండిపెట్టడం తేలికనుకున్నారేమిటి?’’ మరింత దిగులుగా అన్నాడతను.
తేడా లేదు!
ఎండాకాలం: వర్షాభావం వల్ల రిజర్వాయర్లు ఎండిపోవడంతో అధికారికంగా విద్యుత్ సరఫరా 6 గంటలు తగ్గించడమైనది.
వర్షాకాలం: అధిక వర్షాల కారణంగా కరెంటు తీగెలు తెగిపడిపోయినందువల్ల విద్యుత్ సరఫరా నిరవధికంగా నిలిపివేయడమైనది.
పెళ్లే పెద్ద గుండె కోత!
భార్య: ఏంటండీ, టీవీ చూస్తూ ఏడుస్తున్నారు. ఏం సీరియల్ వస్తుందేంటి?
భర్త: ఓసి పిచ్చి మొహమా! సీరియల్ అయితే ఎందుకేడుస్తానే, నేను చూస్తోంది మన పెళ్లి సీడీ!
తిట్ల పుట్ట
మామగారు: ఏమోయ్ అల్లుడూ! ఎప్పుడూ మా అమ్మాయిని తిడుతున్నావట?
అల్లుడు: అలా చెప్పి చచ్చిందా ఆ చచ్చు పీనుగ!
నీదీ అదే రూపం!
సుబ్బారావ్: మీ అక్క గుమ్మంలో నిలబడి అస్తమానం నన్నే చూస్తోంది ఎందుకని?
అప్పారావ్: మా అక్కయ్యకు కొండముచ్చులంటే భలే ఇష్టంలేరా!
పంచ్!
టీచర్: ‘నారు పోసినోడే నీరు పోస్తాడు’ లాంటి సామెత ఇంకొకటి చెప్పరా!
స్టూడెంట్: పాఠం చెప్పిన వాళ్లే పరీక్ష రాయాలి టీచర్!
ఇదుంటే చాలు వచ్చేస్తాడు!
యముడు: పిసినారి పాపయ్యను తీసుకురమ్మంటే, అతని ఇనప్పెట్టెను తెచ్చారేంట్రా?
యమకింకరులు: ఇది లేకుండా అతను రావట్లేదు యమా!
పోతే పోనియ్!
కావేరి: అక్కా, ఈరోజు బియ్యంలో రాళ్లు ఏరడం లేదేంటి?
కీర్తన: ఈరోజు నేను ఉపవాసం కదా, వంట ఆయనొక్కరికే!
భళా మీ హస్తవాసి!
డాక్టర్: నేను రాసిచ్చిన మందులతో ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ ఉందా?
పేషెంట్: ఎందుకులేదండీ, పోయినసారి 50 అయితే, ఈసారి 80 తీసుకున్నారు!
ఎటకారం!
భర్త: బంగారంలాంటి పాలు, పిల్లిపాలు చేశావే!
భార్య: గేదెపాలు పిల్లిపాలు ఎలా అవుతాయండీ!
గుడ్డు గుడ్డు.... కోడిగుడ్డు!
బడిలో టీచరు అంటోంది .....!
‘‘రామూ! ఇలా రాస్తే పరీక్షల్లో నీకు కోడి గుడ్లు రాక తప్పదు’’
రాము : అయ్యో వాటితో నాకేం లాభం టీచర్, మేం శాకాహారులం.
బాతుగుడ్డు బబ్లూ...
అల్లరిపిల్లాడైన బబ్లూ కిరాణా షాప్‌కి వెళ్ళి... ‘బాతుగుడ్లు వున్నాయా?’ అని అడిగాడు.
‘లేవు’ అని జవాబిచ్చాడు యజమాని.
మర్నాడు వెళ్లి మళ్లీ అదే ప్రశ్న వేస్తే ‘మా దగ్గర దొరకవు’ అన్నాడు యజమాని.
బబ్లూ రోజూ వెళ్ళి అదే ప్రశ్న వేస్తుండటంతో విసిగిపోయాడు యజమాని.
‘రేపొచ్చి మళ్ళీ బాతుగడ్డు అడిగావంటే కాళ్ళలో మేకులు దిగేస్తా’ అన్నాడు కోపంగా.
ఆ మర్నాడు బబ్లూ మళ్ళీ షాప్‌కి వచ్చాడు.
‘మీ దగ్గర మేకులున్నాయా?’
‘లేవు’
‘అయితే మరి బాతుగుడ్లున్నాయా?’
గండం
‘ఏంటల్లుడూ... బంగారంలాంటి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశావట’
అడిగారు ఆగమేఘాల మీద వచ్చిన మామగారు.
‘మరేం చేస్తారు నాన్నా, ఆయనకు నిద్రలో ప్రాణగండం ఉందని జ్యోతిష్కుడు చెప్పాడు’ అసలు విషయం చెప్పింది కూతురు.

పరిగెత్తాడు ఫ్రెండ్.
బడాయి
రంగారావు ఉత్తరధ్రువం పర్యటనకు వెళ్లొచ్చాడు. మర్నాడు తన స్నేహితులతో యాత్రా విశేషాలు చెబుతున్నాడు.
‘‘అక్కడ ఎంత చల్లగా ఉందంటే... మేం సిగరెట్ ముట్టించడానికి అగ్గిపుల్ల వెలిగించగానే మంట గడ్డకట్టుకుపోయేది. ఎంత ఊదినా ఆరేది కాదు’’ అన్నాడు.
ఇంతలో పక్కనే ఉన్న పాపారావు... ‘‘అందులో గొప్పేం ఉంది? మేం వెళ్లినప్పుడైతే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. మా నోట్లోంచి శబ్దం రావడం ఆలస్యం, మాటలన్నీ గడ్డకట్టుకుపోయేవి. ఆ తర్వాత మా తిప్పలు తిప్పలు కావు. ఆ మాటలన్నిటినీ జాగ్రత్తగా ఏరుకుని వెచ్చబెట్టే దాకా, ఎవరు ఏం మాట్లాడారో తెలిసేది కాదు’’ అని చెప్పాడు.
చల్లని చేయి
"ఎందుకు ఆ డాక్టరు దగ్గరకే ఎక్కువ రోగులు వెళతారు?’’ అడిగాడు ఒకాయన నర్సుని.
‘‘ఎందుకంటే ఆ డాక్టరు చేతి చలువ అలాంటిది. రోజూ గంటకోసారి ఆయన ఫ్రిజ్‌లో చేయి పెడుతుంటారు. అందుకే ఆ డాక్టర్ దగ్గరికే వెళతారు’’ అక్కసుగా అన్నది నర్సు.

విడాకులు
కొత్తగా కాపురం ప్రారంభించిన శ్రీదేవి మొదటిసారిగా భర్తకు వంట చేసి పెట్టింది.
అతను మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆత్రంగా అడిగింది...
‘‘రోజూ ఇన్ని ఐటమ్స్‌తో ఇలాగే వంట చేస్తే నాకేమిస్తారేంటి’’ అడిగింది గోముగా.
‘విడాకులు’ కరుగ్గా చెప్పాడు భర్త తరుణ్.
సిమెంట్...
‘పొద్దున్నుంచి చూస్తున్నా, ఏమైంది మీ ఆయన అసలు నోరు తెరవడం లేదు’ అడిగింది పక్కింటి పంకజం.
‘అదా... పళ్లు కదులుతున్నాయని నిన్న డాక్టర్ దగ్గరకెళ్తే సిమెంట్ పెట్టాలి. రెండు వేలు అవుతుంది అన్నారట. అదేదో నేనే పెట్టుకుంటా అని ఇంట్లో ఉన్న సిమెంట్‌ను పళ్లకు పెట్టుకున్నారు అంతే! అలా ఉండిపోయారు’ చెప్పింది విశాలాక్షి.
ఏం చేస్తానంటే...
రవి: మీ నాన్నగారి జేబులోంచి పది రూపాయలు కింద పడిపోయాయనుకో, ఏం చేస్తావు?
రాజు: పదితో ఏం చేస్తాం, మరో పది అమ్మ ఎక్కడయినా దాచిందేమో వెతుకుతా.

ఒకాయన: ఏయ్! టైలర్! ఈ బట్టలింత పొట్టిగా కుట్టేవేం! గుడ్డ ఏమన్నా మిగుల్చుకున్నావా!
టైలర్: ఆ అదేంలేదుసార్! మీరిచ్చినప్పుడు కొలతంతే. ఎటొచ్చి నేను ఇప్పుడిచ్చానంతే!
తెలివి మీరిన పులి
"ముసలోడా ఆగు ...'' అడవిదారిలో అడ్డుపడి అంది పులి.
"ఈ దారిలో యువకులు చాలామంది వస్తుంటారు. వాళ్లది వేడి రక్తం'' తెలివిగా తప్పించుకోబోయాడు ముసలాయన.
"నా కెందుకో ఈ రోజు కూల్‌డ్రింక్ తాగాలని ఉంది మరి'' చెప్పింది పులి.


పుత్రరత్నం తెచ్చేశాడు
"ఎదురింటి సుబ్బారావుగారి అమ్మాయికి లెక్కల్లో 99 మార్కులొచ్చాయండి'' గొప్పగా చెప్పింది భార్య.
"అవునా? మరి మిగిలిన ఒక్కటీ ఎవరు ఎత్తుకెళ్లారట?'' ఎదురింటివారి గొప్పదనం భరించలేని భర్త సాగదీస్తూ అన్నాడు.
"మిగిలిన ఆ ఒక్కటీ మీ పుత్రరత్నం తీసుకొచ్చేశాడు లెండి'' మరింత వ్యంగ్యంగా సంధించింది భార్య.


పట్టిక ప్రభావం
"అదేంటి అర నిమిషం క్రితం నీ బి.పి.నార్మల్ ఉంది. వెంటనే ఇంతలా పెరిగిపోయిందేం?'' ఆశ్చర్యపోయాడు డాక్టర్ నిర్మల్‌కుమార్.
"సార్ ఎదురుగా ఉన్న మీ ఫీజు పట్టిక ఇప్పుడే చదివాను'' పిడచకట్టుకుపోయిన నాలుకని తడుపుకుంటూ అన్నాడు బ్రహ్మానందం.
పారిపోయింది
"బబ్లూ ... కుక్కపై వ్యాసం రాసుకురమ్మని చెప్పానా? మరెందుకు రాసుకురాలేదు?'' అడిగింది టీచర్."రాద్దామని కుక్కపైన పెన్ను పెట్టగానే పారిపోయింది టీచర్'' చాలా అమాయకంగా మొహం పెట్టి చెప్పాడు బబ్లూ.
వచ్చివెళ్లారు
"మేము మొత్తం 25 మందిమి అన్నా చెల్లెళ్లం తెలుసా?''
"అదేంటి? కుటుంబనియంత్రణ అధికార్లు మీ ఇంటికి రాలేదా?''
"వచ్చారు కానీ, ఇదేదో స్కూలు తాలూకూ క్లాసురూం అనుకుని తిరిగి
వెళ్లిపోయారు''

వెయిటింగ్ రూంలెందుకు?
"ప్రతి రైలూ లేటుగా వస్తే ఈ పనికిమాలిన టైం టేబుల్ ఇక్కడెందుకూ?'' రైల్వే అధికారితో పేచీ పెట్టుకున్నాడు రామానందం.
"ప్రతి రైలూ కరెక్టు టైంకు వస్తే నీవు విశ్రాంతి తీసుకుంటున్న ఈ వెయింటింగ్ రూంలు ఎందుకు?'' మరింతగా మిర్రిచూస్తూ అన్నాడు రైల్వే అధికారి.

నాకూ ఇప్పుడే తెలిసింది
"డార్లింగ్ మనం ఇప్పుడు ఎక్కడి కెళ్తున్నాం?'' మెడచుట్టూ చేతులు వేసి గోముగా అడిగింది ప్రేయసి.
"అనంత దూరాలకు ప్రియా'' కంగారు పడుతూ చెప్పాడు ప్రియుడు.
"అంత దూరమా? ముందే నాకెందుకు చెప్పలేదు?'' అలకతో అంది ప్రేయసి.
"అంత దూరమని ఇందాక వెహికల్ బ్రేకులు ఫెయిలయ్యాకే తెలిసింది'' చెప్పాడు ప్రియుడు.

భయపడేదాన్ని కాను
"నాకు నీ మాటలతో కోపం తెప్పించకు. నాలో జంతువు ప్రవేశిస్తుంది'' అరిచాడు సుబ్బారావు.
"ఆ విషయం నాకు తెలుసు. కాని ఎలుకకి భయపడేంత పిరికిదాన్ని కాను నేను'' మరింత కోపంగా అంది.
సిగ్గు లేదా......
జడ్జి కోర్ట్ బోనులో నిలబడ్డ దొంగను ఉద్దేశించి అంటున్నాడు ఇలా.... 'ఇది మూడోసారి నువ్వు రావడం. నీకు సిగ్గనిపిన్చాడంలేదా ?
దొంగ :మీరైతే రోజు వస్తున్నారుగా !
మీకెందుకు సిగ్గు రావడం లేదు ?
నొప్పి...
పేషెంట్: ఎడమ కాలు నొప్పి పెడుతోంది. ఏంచేయమంటారు?
డాక్టర్: ఆందోళన పడకండి. ఓల్డ్ ఏజ్‌లో ఇలాంటివి సహజమే...
పేషెంట్: నా కుడికాలుకి కూడా సేమ్ ఏజ్ కదా... మరి అదెందుకు నొప్పి పెట్టడం లేదు?

గొప్పలు
తన తండ్రి గురించి కొడుకు ఇలా చెబుతున్నాడు.
‘మా నాన్న పులి, నరసింహ, ఠాగూర్’ అన్నాడు. పక్కనే ఉన్న అతడి ఫ్రెండ్ ఇలా అన్నాడు. ‘అవునా అయితే మీ నాన్నను చూడాలంటే టికెట్టెంత?’ అన్నాడు.

ఆ నలుగురి ఆచూకీ ఎందుకు కనిపెట్టలేకపోతున్నారన్నది మాత్రం ‘మిలియన్’ డాలర్ ప్రశ్నగా మిగుల్తోంది.

మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై జరిగిన విగ్రహాల విధ్వంసం కేసులో టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీష్‌రావు, కె.తారక రామారావులు గత పది రోజులుగా పరారీలో ఉన్నారు. అవును ఇది పచ్చినిజం. అదేంటి నిత్యం వీరు ఏదో ఒక సమావేశంలో పాల్గొంటూ ప్రజల మధ్యే ఉంటున్నారు కదా.. పరారీలో ఉండటమేంటి అన్న ధర్మ సందేహం సగటు మనిషికెవరికైనా రావచ్చు. అయితే పోలీసులకు మాత్రం అలాంటి సందేహం రాలేదు. నవ్విపోదురుగాక మాకేంటి.. అన్నట్లుగా విధ్వంసం కేసులో ఆ నలుగురూ పరారీలో ఉన్నారని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. విధ్వంసం దృశ్యాలున్న టెలివిజన్ చానల్స్ ఫుటేజీ ఆధారంగా వేర్వేరు ప్రాంతాలకు చెందిన 58 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. ఆ నలుగురి ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ కార్యక్రమానికి పిలుపునివ్వడంతోపాటు అనుమతి లేకున్నా ఆ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ తదితరులపై కేసులు నమోదు చేసిన గాంధీనగర్ పోలీసులు.. వారిని అరెస్టు చేయడం మాత్రం మరిచిపోయారు. పైగా తమ తప్పు ఉండకూదనే ఉద్దేశంతో వారంతా పరారీలో ఉన్నట్లుగా చూపుతూ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. అయితే విధ్వంసంతో సంబంధం ఉందనే ఆరోపణలతో ట్యాంక్‌బండ్‌కు సమీపంలోని ఆలయంలో పురోహితుడు పి.శ్రీనివాసాచారి, మచిలీపట్నం ప్రాంతానికి చెందిన పర్యావరణ ఉద్యమకారుడు అడ్డాల నారాయణరావు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి గాంధీ ఆస్పత్రికి వచ్చిన మితేష్, రమేష్ సహానీ, మైనర్ విద్యార్థులు శరత్, సందీప్, న్యాయవాదులు శ్రీరంగారావు, ఆదిత్య, ఇంద్రసేన్‌రెడ్డి, రాము తదితరులపై కేసులు బనాయించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
నిందితుల సంఖ్యను భారీగా చూపేందుకు పదుల సంఖ్యలో యువకుల అరెస్టులు చూపారు. ఇంతమందిని కష్టపడి కనిపెట్టి అరెస్టు చేసిన పోలీసులు... ఆ నలుగురి ఆచూకీ ఎందుకు కనిపెట్టలేకపోతున్నారన్నది మాత్రం ‘మిలియన్’ డాలర్ ప్రశ్నగా మిగుల్తోంది. సంచలనం సృష్టించిన కేసుల్లో హంతకులను పట్టుకునేందుకు మెరికల్లాంటి పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన తరహాలోనే ఆ నలుగురినీ పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఖాకీ బాస్‌లు ప్రకటించినా ఆశ్చర్యపోనక్కరలేదేమో

కీళ్లకు సంబంధించిన సమస్యలు ఎందుకు అధికమవుతాయి?

పొద్దున్నే చలికి వణికిపోతూ తప్పని పరిస్థితిలో పనులున్నాయని లేచి కూర్చుంటున్నారా? మంచం మీద నుంచి కాలు కింద పెడదామంటే భరించరానంత నొప్పిగా ఉంటుందా? నొప్పి నివారణకు అదేపనిగా పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ చలికాలాన్ని ఎలాగోలా గడిపేయాల్సిందే అంటూ నిట్టూరుస్తున్నారా? చలికాలంలో ఎముకలకు, కీళ్లకు సంబంధించిన సమస్యలు ఎందుకు అధికమవుతాయి? వీటి నుంచి రిలీఫ్ పొందడం ఎలా?

చలికాలం శరద్ రుతువు చివరన మొదలై హేమంత రుతువులో బలీయంగా ఉండి శిశిర రుతువు మొదటి భాగం వరకు ఉంటుంది. ఈ కాలంలో ఉత్తర దిక్కు నుంచి వీచే అతి చల్లని గాలుల వల్ల మన చర్మం పొడిబారి, ఎండినట్టుగా అవుతుంది. చలి, రూక్ష గుణం(పొడిబార్చే గుణం) వల్ల వాతం ప్రకోపం చెందుతుంది. ఈ కాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. సరైన వేళలో తగినంత ఆహారం తీసుకోకుంటే ఈ అగ్ని శరీర ధాతువులను వికృతం చేస్తుంది. భోజన వేళలు పాటించకపోతే వాతం వృద్ధి చెందుతుంది. అధిక ప్రయాణాలు, రాత్రిపూట ఎక్కువ సమయం మేల్కొని ఉండటం, పగలు నిద్రించడం, చల్లని గాలులు అధికంగా ఉండటం... వల్ల వాతం ప్రకోపం చెంది (పెరిగి) అది శరీరంలో వివిధ అవయవాలలో చేరి అనేక వ్యాధులను కల్గిస్తుంది.
ఆమవాతం (రుమటాయిడ్ ఆర్థరైటిస్):

శరీరంలోని ఆమం (అన్‌డెజెస్టైడ్ మెటీరియల్) ప్రకోపించి వాతంతో అనేక జాయింట్స్‌కు చేరి, అక్కడ తీవ్రమైన నొప్పిని, వాపును, మంటను కలిగిస్తుంది. ఈ వ్యాధులకు కారణభూతమైన ఆమం శరీరంలో విషంతో సమానమైంది. మిగిలిన కాలాలతో పోలిస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ చలికాలంలో తీవ్రంగా ఉండి అమితమైన బాధకు గురిచేస్తుంది. ఈ వ్యాధి కేవలం జాయింట్స్‌లోనే గాక శరీరమంతా విస్తరించడంతో ఉదయం పూట శరీరం కదలించలేకపోతారు. ఆకలి మందగిస్తుంది. జ్వరంగా ఉంటుంది. కీళ్లలో తేలు కుట్టినంత నొప్పి ఉంటుంది. మలం దుర్వాసన వస్తుంది. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే కీళ్లు పూర్తిగా స్తంభించిపోయి, శరీరాన్ని కదిలించలేకపోతారు. మెల్లగా గుండెకు కూడా పాకుతుంది. తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండానే మళ్లీ తినడం, మసాలాలు, నూనె ఉన్న పదార్థాలు, మాంసాహారం, రాత్రిపూట పొద్దుపోయిన తర్వాత భుజించడం... వంటి కారణాల వల్ల ఈ వ్యాధి ఎక్కువవుతుంది. సంధివాతం, ఆమవాతంలలో కీళ్ల నొప్పులు వస్తాయి. చలికాలంలో అధికమవుతాయి. అయితే ఈ రెండింటి చికిత్సలో పూర్తి విరుద్ధమైన చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. ఆమవాతం ఉన్నవారికి మొదట ఆకిలిని, జీర్ణ శక్తిని పెంపొందించాలి. కీళ్లలో ఉండే ఆమం (ఇన్‌డైజేషన్ మెటీరియల్)ను కరిగించే పాచన చికిత్స అనే ప్రక్రియ ద్వారా బయటకు పంపేయాలి. ఈ చికిత్సలో వాలుకాస్వేదం, ధాన్యామ్లధార, కషాయధార, వస్తికర్మ, విరేచనం వంటి శోధన చికిత్సలు, ఔషధాలతో కలిపి శమన చికిత్స చేయాలి. శమన చికిత్సలో భాగంగా షడ్‌ధరనచూర్ణం, ఎరండతైలం, సింహనాదగుగ్గులు, ఆమవాతంరస్, షడ్గుణ సింధూరం, వాతగజాంకుశరస్ వంటి ఔషధాలు వాడాలి.
ముందు జాగ్రత్తలు:
ఆమవాతం లక్షణాలు కనిపించినప్పుడు సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఎప్పుడూ గోరువెచ్చని నీరు తాగాలి. భోజనం చేసిన వెంటనే కనీసం వంద అడుగులు నడవాలి. శొంఠి చూర్ణం, బియ్యం కడుగును వేడినీళ్లతో సేవిస్తే ఉపశమనం పొందవచ్చు. ఈ ఆమవాతానికి ఉదయం పూట చిన్న చిన్న యోగాసనాలు చేస్తే మార్నింగ్ స్టిఫ్‌నెస్ నుంచి విముక్తి పొందవచ్చు. గృధ్రసీ వాతంలో కాళ్లు తిమ్మిరి పట్టడం, నడుంనొప్పి వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే భుజంగాసనం, వజ్రాసనం వంటి ఆసనాలు, వేడినీళ్లతో స్నానంతో ఉపశమనం పొందవచ్చు. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. కాస్త గట్టిగా ఉండే పడకమీద నిద్రించాలి. రాత్రిళ్లు ఎక్కువసేపు మేలుకోకూడదు. ఈ కాలం శరీరంలో వాతం ప్రకోపించడం వల్ల నొప్పులు (కండరాల నొప్పి), శరీరం పట్టేసినట్టు ఉండటం, సైనసైటిస్, బద్దకంగా అనిపించడం సాధారణ లక్షణాలు. అధిక రూక్షత్వం (పొడిబారడం) వల్ల చర్మం పొడిగా ఉండి దురద, పగుళ్లు, చుండ్రు ఎక్కువవుతాయి. చలికాలంలో ప్రతీ ఉదయం సాధారణంగా మన ఇళ్లలో లభించే నువ్వుల నూనెతో శరీరం అంతా మర్దన చేసుకోవడం, ఉష్ణ జల స్నానం, వేడిని కలిగించే వస్ర్తాలతో శరీరాన్ని కప్పి ఉంచాలి. శీతల పానీయాలను తీసుకోకూడదు. తప్పనిసరిగా నెయ్యి భోజనంలో వాడాలి. పైన చెప్పిన పంచకర్మచికిత్సలు వ్యాధులను తగ్గించడమే కాకుండా, వ్యాధి రాకుండా చేస్తాయి. అయితే ఈ పంచకర్మలను నిపుణుల పర్యవేక్షణలోనే చేయించుకోవాలి.
సంధివాతం (ఆస్టియో ఆర్ర్థరైటిస్):
ఈ వ్యాధి ప్రకోపిస్తే వాతం సంధుల (కీళ్లు)లో చేరి ఎముకల అరుగుదలకు కారణమై వాపు, నొప్పి, తిత్తివటిస్పర్మ వల్ల ఎముకల మధ్య ఖాళీ ప్రదేశం తగ్గుతుంది. కాళ్లను కదిలించినప్పుడు తీవ్రమైన నొప్పితో బాధపడతారు. నడవలేరు. వ్యాధి తీవ్రావస్థలో నడవకున్నా విపరీతమైన బాధ కలుగుతుంది. ఈ వాతం కారణంగా కీళ్ల వద్ద ఎముకలను పట్టి ఉంచే డిస్క్ ముడుచుకొని ఉంటాయి. స్ర్తీలలో రుతుస్రావం ఆగిపోయిన తర్వాత, చిన్న వయసులో గర్భాశయం తొలగించినప్పుడు కలిగే హార్మోన్ల అసమతుల్యం వల్ల, అధిక బరువు కారణంగా ఎముకల మీద ఒత్తిడి పెరిగి ఎముకలలో పటుత్వం తగ్గి ఈ వ్యాధితో బాధపడాల్సి వస్తుంది.
చికిత్స:
రోగి వయసు, శక్తిని బట్టి శమన, శోధనకర్మ చికిత్స చేయాలి. శోధన చికిత్స శరీరంలో ఉండే అనేక విషపదార్థాలను బయటికి పంపడమే కాకుండా నీరసపడ్డ జీవకణాల్లో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. వ్యాధి పూర్తిగా శోధనం అయిన తర్వాత శమన చికిత్స (ఔషధా లు) ద్వారా పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. ఈ సంధివాతానికి చికిత్సలో అభ్యంగస్వేదనం చేయాలి. అభ్యంగన వల్ల శరీరంలోని అన్ని జాయింట్లలో కదలికలు సాధారణ స్థితిలో కల్పించవచ్చు. ఈ అభ్యంగ చికిత్సలో అవసరాన్ని బట్టి పత్రపోటల స్వేదం, కాయసేకం, వస్తికర్మ, షస్టికశాలిపిండస్వేదం, రక్తమోక్షణం (జలగలచే చెడు రక్తం తీయడం) వంటి పంచకర్మ ప్రక్రియల ద్వారా చికిత్స చేయాలి. వీటిలో వస్తికర్మ చాలా ప్రధానం. అయితే దీన్ని వైద్యుల పర్యవేక్షణలోనే చేయాలి. తైల అభ్యంగం, వేడినీటి స్నానం ద్వారా మంచి ఉపశమనం కలుగుతుంది.

కీళ్లనొప్పులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కాల్షియం అధికంగా ఉండే పాలు, పెరుగు, మజ్జిగ, ఘృతం(నెయ్యి),

కీరదోస... లను విరివిగా తీసుకోవాలి. వ్యాయామాలు ఎక్కువగా చేయకూడదు.

మెట్లు, కొండలు, గుట్టలు ఎక్కడం, కింద కూర్చోవడం వంటివి చేయకూడదు.

చల్లని నీటితో స్నానం చేయకూడదు.

తీపి, పులుపు రసాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

దుంపకూరలు, శనగపిండి తీసుకోకూడదు.
చలి కాలంలో బాధించే వ్యాధులు...
సంధివాతం (ఆస్టియో ఆర్ర్థరైటిస్), ఆమవాతం (రుమటాయిడ్ ఆర్ర్థరైటిస్), కటిశూలం (లో బ్యాకేక్), గృధ్రసీ (సయాటికా), అస్థిచ్యుతి (డిస్క్ ప్రొలాప్స్), శిరశ్శూల (మైగ్రెయిన్), అస్థి సౌషీర్యం (ఆస్టియో పోరోసిస్), వాతవహసిర (వేరికోస్‌వైన్స్), ఆర్జిత వాతం (ఫేసియల్ పెరాలసిస్), పక్షవాతం (పెరాలసిస్), నిద్రానాశనం (ఇన్‌సామ్నియా)... మొదలైనవి.
గృధ్రసీ వాతం (సయాటికా):
నడుములో నొప్పి మొదలై, కాలి బొటనవేలి వరకు లాగినట్లు నొప్పి ఉంటుంది. వెన్నెముకలో పూసలు (వర్టిబ్రే) అస్థచ్యుతి జరగడం, అరగడం, ఎముకల మధ్య ఉండే స్నాయువు (డిస్క్) ముందుకు జరగడం వల్ల అక్కడి నుంచి మొదలయ్యే నరాల మీద ఒత్తిడి పడి ఆ నరం శరీరంలో ఎక్కడి వరకు వెళుతుందో అంతమేరకు సూదులు పొడిచినట్టుగా నొప్పి, బాధ, తిమ్మిర్లు కలుగుతాయి. దీంతో రోగి కుంటినట్లు నడుస్తాడు. ఈ వ్యాధి వల్ల ఎక్కువసేపు నిలబడలేక , కూర్చోలేక, నడవలేకపోతాడు. ఎగుడు దిగుడు ప్రదేశాలలో నడవడం, అధిక ప్రయాణం, సరైన పరుపు, పాదరక్షలు వాడకపోవడం, నడుముకు దెబ్బ తగలడం, ఎక్కువ సేపు కూర్చొని ఉండటం, అధికబరువు మోయడం, తీవ్రమైన మలబద్ధకం మొదలైన వాటి వల్ల, పైన చెప్పిన వాత ప్రకోప కారణాల వల్ల వాత ప్రకోపం జరిగి నడుము ఎముకలలోని సందులలో కదలికలు ఏర్పడి ఈ వ్యాధి వస్తుంది.
చికిత్స:
విరేచనం, వస్తికర్మ, కటివస్తికామసేకం, పత్రపోటలీ స్వేదం, షష్టికశాలి పిండస్వేదం మొదలైన శోధన కర్మలు ఈ సమస్యకు ఉపయుక్తంగా ఉంటాయి. వీటితో పాటు శమన చికిత్సలో భాగంగా బృహత్‌వాతచింతామణి, త్రయోదశాంగ గుగ్గులు, రసరాజరసం, యోగేంద్రరసం, రాస్నాసప్తక కషాయం.. అవసరం మేరకు వాడాలి.

వాతం ప్రకోపం చెంది శిరస్సును చేరినప్పుడు మైగ్రేన్, కళ్లనొప్పి, నిద్రానాశనం (ఇన్‌సామ్నియా) వస్తాయి. ఇతర హార్మోన్ సంబంధిత వ్యాధులను కలిగించే వాతం జీర్ణాశయం చేరినప్పుడు గ్యాస్‌ట్రబుల్, మలబద్ధకం, పైల్స్‌ను కలిగిస్తుంది. రక్తంతో చేరినప్పుడు శరీరంలో అనేక రకాలైన పుండ్లను, సిరలలో చేరినప్పుడు వేరికోస్ వెయిన్స్‌ను, గౌట్ కలిగిస్తుంది. వాతం - ఎముకలు, మజ్జతో చేరినప్పుడు కీళ్లనొప్పి, ఆస్టియోపోరోసిస్ కలిగిస్తుంది.