హెల్తీఫుడ్ అంటే ఏది? ఈ సందేహం చాలా మందికి ఉంటుంది. రోజూ ఏ డైట్ తీసుకోవాలి? వారంలో ఎన్ని రోజులు మాంసాహారం తీసుకోవచ్చు? ఇలాంటి సందేహాలను తీర్చడానికే హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించి ఏమేం తినాలో వెల్లడించారు.
* తాజా కూరగాయల్లోనూ, పండ్లలోనూ యాంటీ అక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వారంలో ఐదు రోజులు పండ్లు, కూరగాయలు తీసుకోండి. ముఖ్యంగా పళ్లలో మెదడును రక్షించే యాంటీఅక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బ్రొక్కోలి, క్యాలీఫ్లవర్‌లలో ఎక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడానికి అంతగా ఇష్టపడని మహిళల్లో మెదడు వారి వయస్సుకంటే ఒకటి రెండెళ్లు తక్కువగా ఉంటుంది. యాపిల్స్, గ్రేప్స్, ఆనియన్స్, వైన్, టీ, డార్క్ చాక్‌లెట్‌లలో కూడా యాంటీఅక్సిడెంటు ్ల ఉంటాయి. వారంలో ఐదు రోజులు వీటిని తీసుకుంటే యాంటీ అక్సిడెంట్లకు కొదవే ఉండదు.
* ఆలివ్ఆయిల్, నట్స్, సన్‌ఫ్లవర్‌సీడ్స్, అవొకొడస్‌లో యాంటీ అక్సిడెంట్‌గా పనిచేసే ఇ-విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది అల్జీమర్స్ వ్యాధికి బాగా పనిచేస్తుంది. తరచుగా వీటిని తీసుకునేవారిలో అల్జీమర్ వ్యాధి బారిన పడే అవకాశం 67శాతానికి తగ్గిపోతుంది. కాబట్టి వీటిని వారంలో ఒకరోజైనా మీ మెనూలో ఉండేలా చూసుకోండి.
*వారానికి రెండుసార్లు చేపలు తీసుకుంటే రక్తంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ డీహెచ్ఏ లెవల్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీంతో మెదడులోని కణాలు సమర్థంగా పనిచేస్తాయి. కాబట్టి వారంలో రెండు రోజులు చేపలు తినండి.
18, జూన్ 2011, శనివారం
17, జూన్ 2011, శుక్రవారం
నీవొస్తావని... నా కలలను నిజం చేస్తావని ఎదురు చూస్తూ ఉండే నీ
ఏ జన్మ బంధమో తెలియదుగానీ నిను చూచిన ఆ మొదటి క్షణం పోగొట్టుకున్న నిధిని మళ్లీ
సొంతం చేసుకున్నట్టు నా మనసు పొంగిపోయింది. నా మనసెందుకు నిను మెచ్చిందో
తెలియదుగానీ మంత్రం వేసినట్టు నా మది నీ తలపులతో నిండిపోయింది. కలనైనా నిను
ఎరగని నేను ఆశ్చర్యంగా నీవే నా ఆశ, శ్వాస అనేంతగా మారిపోయానంటే ఆశ్చర్యంకాక
మరేమిటి.
ప్రేమంటే అర్థమైనా తెలియని నేను ఇప్పుడు నీపేరే జపిస్తున్నానంటే నాకు సైతం
వింతగానే అనిపిస్తుంది. ఇన్నాళ్లూ ఒంటరిగా గడిచిపోయిన నాలోకంలోకి నీవొచ్చావని
కాబోలు అప్పుడప్పుడూ మాత్రమే అందంగా కనిపించే ఈ లోకం నాకిప్పుడు నిత్య
శోభాయమానంగా గోచరిస్తోంది.
చెట్టు, పుట్ట, రాయి, రప్ప ఒకటేమిటి ప్రతీదానిలో నీవే కనిపిస్తుంటే ఇన్నాళ్లూ
నేను కోల్పోయిందేమిటో కొంచెం కొంచెంగా తెలిసొస్తోంది. నాకూ మనసుందని, దానిలోనూ
స్పందనుందని నాకు తెలిసిందంటే అది నిను చూశాకే అని నే చెప్పే మాటలు పొగడ్తలుగా
నీకు అనిపించినా అవి నిజంగా నిజాలే సుమా.
స్త్రీలో ఆకర్షణ మాత్రమే ఉంటుందనుకున్న నాకు ఆ ఆకర్షణకు మించిందేదో ఉందని
తెలిసిందంటే దానికి కారణం నీవే. కట్టిపడేసే నీ చూపులు చాలు నా జీవితాంతం నీ
బంధీగానైనా ఉండిపోవాలనిపిస్తుంది. స్వర్గతుల్యమైన నీ సానిహిత్యం చాలు యుగాలు
సైతం గడిపేయొచ్చనిపిస్తుంది. అమృతమై వర్షించే నీ మాటలు చాలు సప్త స్వరాలూ
వద్దనిపిస్తుంది.
పండు వెన్నెలలాంటి నీ నీడలో నేనూ నా జీవితం గడిచిపోతే చాలనిపిస్తుంది....
ఇవన్నీ ప్రేమ లక్షణాలైతే నేస్తం నీ మీద నాకున్నది తప్పకుండా ప్రేమే...... కానీ
నా ప్రేమను అంగీకరించి నీవొస్తావన్న ఆశతో నీకోసం ఎంత కాలమైనా ఎదురు
చూస్తుంటాను... కరుణించి వరమిచ్చినా... కాదంటూ నన్ను శపించినా నీపై నాలో మొగ్గ
తొడిగిన ప్రేమ నిత్యం పెరిగి వికసిస్తుందే తప్ప అది ఎప్పటికీ వాడిపోదు.

ప్రతిరోజూ ఒక మంచి మాట
రాజకీయాలు అంత అప్రతిష్టపాలైన వ్యాపారం కానే కాదు. కానీ ప్రతిష్టలేని వ్యక్తులే దాన్ని అలా తయారు చేస్తారు.
ఏమీ తెలియనప్పుడు మౌనంగా ఉండాలి. అలాగే అన్నీ తెలిసినప్పుడు కూడా.
మీకు కాలం అనుకూలంగా లేనప్పుడు, మీరే కాలానికి అనుకూలంగా మెలగండి.

16, జూన్ 2011, గురువారం
కాఫీ మేలు కూడా చేస్తుంది..!
కాఫీ ప్రియులకు ఓ శుభవార్త. కాఫీతో కొన్ని ఆరోగ్యకరమైన లాభాలు కూడా ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలడం విశేషం. ఇప్పటివరకు కాఫీ సేవనం అనారోగ్య వ్యసనంగా భావిస్తుండగా ఈ వార్త కాఫీ ప్రియులను మరింత ఉత్సాహపరుస్తుంది. ప్రతిరోజు నాలుగు, అయిదు సార్లయినా కాఫీ తాగనిదే ఉండలేరు కొందరు కాఫీ ప్రియులు. కాఫీ తాగకుంటే నీరసంగా అనిపిస్తోందని భావిస్తూ దీన్ని సేవిస్తారు. చివరికి కాఫీ వారికి వ్యసనంగా మారుతుంది. ఈ వ్యసనం నుంచి ఎలా బయటపడాలా అని కొందరు ఆలోచిస్తుం టారు. కానీ కాఫీ మరీ అనారోగ్యకరమైన వ్యసనమేమి కాదని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. కాఉత్సాహపరుస్తుంది. ఫీతో కొన్ని ఆరోగ్యకరమైన లాభాలు కూడా ఉన్నాయని ఈ అధ్యయనంలో తేలింది.
టైప్ 2 డయాబెటిస్, గుండె సంబంధింత వ్యాధులు, సమస్యలతో బాధపడేవారికి కాఫీ మేలు చేస్తుందని తెలిసింది. కానీ దీంఓ కొన్ని సైడ్ ఎఫెక్ట్‌లు కూడా ఉన్నాయని తేలింది. కాఫీలోని కెఫీన్ మూలంగా శరీరంలో ఒకరకమైన వ్యాధి నిరోధక శక్తి అనూహ్యంగా పెరుగుతుంది. ఫలితంగా ఈ శక్తి కార్డియోవాస్క్యులర్ వ్యాధులు, క్యాన్సర్, టైప్2 డయాబెటిస్ సమస్యలను నివారిస్తుంది. కాఫీలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కప్పు కాఫీలో 6 కేలరీలు ఉంటే అందులో కలిపే చక్కెరలో 23 నుంచి 27 కేలరీలు ఉంటాయి. కాఫీలో చక్కెర కలపకుంటే కేలరీలు పెరిగే సమస్యే ఉండదు.
లో బ్లడ్ ప్రెషర్‌తో బాధపడే వారికి కాఫీ ఎంతో మేలు చేస్తుంది. దీన్ని సేవిస్తే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ క్రమ,క్రమంగా పెరుగుతాయి. కానీ ఎక్కువగా కాఫీ తీసుకుంటే శరీరంలో యాంటిఆక్సిడెంట్స్ పెరుగుతాయి. ఫలితంగా గుండెలో మండినట్టవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఏర్పడతాయి. కాఫీ ఎక్కువగా తీసుకుంటే ‘కాఫీ జిట్టర్స్’ అనే స్థితికి చేరుకుంటారు. కెఫీన్ ఎక్కువగా శరీరంలో చేరడం వల్ల యాంగ్టిటీతో పాటు నిద్రలేమి సమస్యలు కూడా ఏర్పడతాయి. ఎక్కువగా దీన్ని సేవిస్తే ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కాఫీని అవసరమైన మేరకు సేవిస్తేనే మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

13, జూన్ 2011, సోమవారం
ఎంఎస్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్‌నే కాదు, సీనియర్ ఎన్టీఆర్‌ను కూడా ఉతికి ఆరేశారు.
సహజ కవి, నిర్మాత మల్లెమాల అలియాస్ ఎంఎస్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్‌నే కాదు, సీనియర్ ఎన్టీఆర్‌ను కూడా ఉతికి ఆరేశారు. టాలీవుడ్ సినీ ప్రముఖులపై తన వ్యాఖ్యలతో దుమ్మురేపాడు. ఇదీ నా కథ పేర ఆయన తన అనుభవాలను పుస్తక రూపంలో తెచ్చారు. ఈ పుస్తకంలో సినీ ప్రముఖలతో తన అనుభవాలను రాశారు. జూనియర్ ఎన్టీఆర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలరామాయణం సినిమాలో దర్శకుడు గుణశేఖర్ వద్దంటున్నా జూనియర్ ఎన్టీఆర్‌కు రాముడి పాత్ర ఇచ్చానని, తాను ఓసారి వెళ్తే తనను బయట నిలబెట్టారని, దాంతో తాను వెనక్కి తిరిగి వచ్చానని ఆయన చెప్పుకున్నారు. గుణశేఖర్‌పై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాలో తాను రాసిన పాటను తీసేసి, తల పొగురు సమాధానం ఇచ్చారని, బడ్జెట్ పెంచేసి తనను కష్టాల పాలు చేశారని ఆయన అన్నారు.
శ్రీకృష్ణ విజయం సినిమాలో సీనియర్ ఎన్టీ రామారావు తాను వేసిన కృష్ణుడి వేషంలో పౌండ్రక వాసుదేవుడిగా నాగభూషణం గెటప్ చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, ఆ పాత్ర అలాగే ఉంటుందని - సినిమాలో నటిస్తే నటించండి, లేకుంటే మానుకోండి అని చెప్పానని, దాంతో ఆయన మారు మాట్లాడకుండా నటించారని ఆయన చెప్పుకున్నారు. చంద్రబాబునాయుడితో తన కూతురు భువనేశ్వరి పెళ్లి సందర్భంలో తనను గదులు బుక్ చేయాలని ఎన్టీఆర్ అడిగారని, వాటిని బుక్ చేసి బిల్లులు పంపితే ఆ డబ్బులు ఇవ్వలేదని ఆయన చెప్పారు. అలాంటిదే మరో సంఘటనను కూడా ఆయన వివరించారు. ఈ చేదు అనుభవాలతో తాను ఎన్టీ రామారావుతో సినిమాలు తీయడమే మానేశానని ఆయన చెప్పుకున్నారు.
ప్రజారాజ్యం పార్టీ నేత, చిరంజీవిపై కూడా ఆయన తన చేదు అనుభవాన్ని రాశారు. ప్రముఖ సినీ నటుడు స్వర్గీయ అల్లు రామలింగయ్య తన అభిప్రాయం తీసుకున్న తర్వాతనే సురేఖను చిరంజీవికిచ్చి పెళ్లి చేశారని ఆయన చెప్పారు. తాతయ్య ప్రేమలీలలు సినిమాతో తాను నష్టపోయానని, ఆ సమయంలో చిరంజీవితో సినిమా తీసి నష్టం పూడ్చుకోవాలని అల్లు రామలింగయ్య సూచించారని, చిరంజీవికి అల్లు రామలింగయ్య చెప్పారని, అయినా చిరంజీవి తనకు సమయం కేటాయించలేదని, ఆ విషయం అడగడానికి వెళ్తే మొహం చాటేశారని ఆయన రాసుకున్నారు. శోభన్‌బాబుకు, జమునకు తాను షాక్ ఇచ్చిన విషయాలను కూడా ఆయన రాశారు. రాజశేఖర్‌తో సినిమా తీస్తే అడుక్కు తినాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఇలా మల్లెమాల సినీ ప్రముఖులతో తనకు సంబంధాలపై ఆ పుస్తకంలో రాశారు. జయసుధను మాత్రం ఆయన మెచ్చుకున్నారు. ఈ పుస్తకంలోని రాతలపై సినీ ప్రముఖులు ఎవరు కూడా నోరు మెదపడం లేదు. కొన్ని విషయాలపై మౌనం వహించడమే మంచిదని, దానివల్ల విషయాలు మరుగున పడిపోతాయని మన పెద్దలకు తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవచ్చు.

8, జూన్ 2011, బుధవారం
ఈ జోడీ చాలా హాట్ గురూ !
రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా..! ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌కు, పీసీసీ కొత్త నేత బొత్స సత్యనారాయణకు మధ్య రాజకీయ కురుక్షేత్రానికి బీజాలు పడ్డాయా..! విరుద్ధ వాతావరణాన్ని కాంగ్రెస్ అధిష్ఠానమే ఏరి కోరి వాంఛిస్తున్నదా..! అందులో భాగంగానే ఈ సర...ికొత్త సమీకరణాలకు తెర తీసిందా..! ఇప్పటిేక వైరంతో... రాజకీయ విభేదాలతో... అంటీ ముట్టనట్టున్న ఇద్దరు నేతలను కీలక పదవులతో దరి చేర్చే వ్యూహంలోని పరమార్థం అర్థంకాక కాంగ్రెస్ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారుు. మెుత్తం మీద ఇది కాంగ్రెస్‌లో రెండు ప్రధాన కులాల మధ్య సం‘కుల’ సమరంగా మారబోతు న్నదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నారుు..!
రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న అస్తవ్యస్థ పరిస్థితిని యుద్ధప్రాతిపదికన చ క్కదిద్ది, అన్ని ఖాళీలూ భర్తీ చేసిన పార్టీ నాయకత్వం ఇద్దరు ప్రముఖుల మధ్య పెట్టిన పోటీ ఆసక్తి కలిగిస్తోంది. సీఎం కిరణ్ వ్యతిరేకించే బొత్స సత్యనారాయణకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడంతో మళ్లీ చాలా ఏళ్ల తర్వాత విభజించిపాలించే రాజనీతికి తెర లేచిన ట్టయింది. వైఎస్ అనుభవాన్ని దృష్టిలో ఉంచు కున్న నాయకత్వం ఆంధ్రలో మళ్లీ అలాంటి చేదు ఫలితాలు ఎదురుకాకుండా ఇప్పటినుంచే విభ జించి పాలించే సూత్రాన్ని అమలుచేస్తుండటం చర్చనీ యాంశమయింది. సుదీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న స్పీకర్-డిప్యూటీ స్పీకర్- మండలి చైర్మన్-వైస్ చైర్మన్ పదవులను చకచకా భర్తీ చేసిన నాయకత్వం అదే ఊపులో పీసీసీ అధ్యక్ష పదవి కూడా భర్తీ చేసి, పార్టీకి సంబంధించిన అనిశ్చితిని పూర్తిగా తొలగిం చింది.
అయి తే... ఎవరూ ఊహించని విధంగా ఉత్త రాంధ్రకు చెందిన బొత్సకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశమయింది. ఎవరూ ఊ హించని విధంగా తెలంగాణ కోటా కాదని, ఆ స్థానంలో పీసీసీ పగ్గాలు అందు కున్న బొత్స, సీఎం కిరణ్‌కు చెక్ పెడతారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో బాహాటంగానే జరుగుతోంది. కిరణ్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనప్పటికీ... సీని యర్ అయినా ఆయనకు ఇతరులతో చొరవ తీసుకునే లక్షణం గానీ, అందరినీ సమన్వయం చేసుకునే శైలిగానీ లేవు. ఫలితంగా పార్టీకి- ప్రభుత్వానికి దూరం పెరుగు తోంది.
సీనియర్ మంత్రులు కిరణ్‌ను మానసికంగా సీఎంగా అంగీకరించడం లేదు. అసలు బొత్సకు పీసీసీ ఇవ్వడం సీఎంకు సుతరాము ఇష్టం లేదన్నది బహిరంగ రహస్యం. దూకుడుగా వెళ్లడం, చొర వ తీసుకుని అన్ని వర్గాలను దగ్గరకు తీసే నైజం ఉన్న బొత్సకు పీసీసీ పగ్గాలు ఇస్తే తనకు ఏకుమేకవుతారన్న భయం కిరణ్‌లో లేకపోలేదంటున్నారు. అందుకే బొత్సకు అవకాశాలు రాకుండా అడ్డుపడుతూ వస్తున్నారు. మొన్నటి వరకూ పీసీసీ చీఫ్‌గా పనిచేసిన డీఎస్‌కు మండలి సభ్యత్వం దక్కకుండా చూడటంలో విజయం సాధించిన కిరణ్, ఈసారి బొత్స విషయంలో మాత్రం సఫలం కాలేకపోయారు.
స్పీకర్‌గా నాదెండ్ల మనోహర్, మండలి చైర్మన్ చక్రపాణికి ఆ పదవులు రాకుండా కిరణ్ అడ్డుపడినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చక్రం తిప్పడంతో వారిద్దరికీ ఆ పదవులు దక్కాయన్నది బహిరంగ రహస్యం. అదే సమయంలో బొత్స విషయంలో కూడా రోశయ్య సిఫారసు పనిచేసిందని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. అసలు రాష్ట్రంలో పార్టీ-ప్రభుత్వానికి సంబంధించి ఇటీవల జరిగిన ఏ ఒక్క నియామకం కూడా కిరణ్‌కు ముందస్తు సమాచారం కూడా లేదన్న ప్రచారం జరుగుతోంది.
బొత్స పీసీసీ సారథిగా రావడంతో కిరణ్‌కు కష్టాలు తప్పవంటున్నారు.
అన్ని వర్గాలతో సన్నిహితంగా వ్యవహరించే బొత్స పార్టీ నేతలందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి, సమాంతర పాలన సాగిస్తే కొత్త సమస్యలొస్తాయన్న ఆందోళన కూడా లేకపోలేదంటున్నారు. మంత్రులు-ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటే భవిష్యత్తులో తనకు ప్రమాదమేనన్న ఆందోళన కూడా కిరణ్‌కు ఉందని చెబుతున్నారు.ప్రభుత్వంతో పార్టీని సమాంతరంగా నడిపిస్తే కిరణ్ ఇమేజ్ కంటే, బొత్స ఇమేజే సహజంగా ఎక్కువ పెరుగుతుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గతంలో వైఎస్ ఉన్నప్పుడు డీఎస్ పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పటికీ, ఆయన డీఎస్‌ను ఏ విషయంలోనూ జోక్యం చేసుకునే అవకాశం ఇచ్చేవారు కాదు. అధిష్ఠానం వద్ద వైఎస్‌కు ఉన్న పలుకుబడి గ్రహించిన డీఎస్ మౌనంగానే ఉండేవారు. దానితో పార్టీ వైఎస్ చుట్టూ తిరిగి, చివరకు కాంగ్రెస్‌ను ఓ ప్రాంతీయపార్టీగా మారింది. వైఎస్ మృతి చెందిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ ముక్కలయిపోవడంతో పార్టీకి తాను చేసిన తప్పేమిటో తెలిసొచ్చింది.
బొత్స నియామకం బట్టి... వైఎస్ మాదిరిగా కిరణ్ ఎదగకుండా, ఆయనకు చెక్ పెట్టి రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవాలన్న వ్యూహమే నాయకత్వ నిర్ణయాన్ని చాటుతో ంది. బొత్స సహజ మనస్తత్వ ప్రకారం.. డీఎస్‌లా మౌనంగా, అన్నిటికీ సర్దుకుని పోయే నైజం కాదు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని పటిష్టం చేసే క్రమంలో కార్పొరేషన్ చైర్మన్ నుంచి ఇతర నామినేటెడ్ పదవుల పంపిణీ వరకూ పార్టీ నేతలకు వాటా కల్పించాలని బొత్స పట్టుపట్టే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.పీసీసీ అధ్యక్షుడిగా తనను తాను నిరూపించుకున్న తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్నది బొత్స అసలు లక్ష్యం. ఆ లక్ష్యసాధన కోసమయినా బొత్స అహర్నిశలు పార్టీ కోసం కష్టపడటం ఖాయం. ఈ క్రమంలో కిరణ్-బొత్స మధ్య దూరం పెరగడం అనివార్యమని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ సీజన్‌లో బెస్ట్
ఎండలు తగ్గాయ్. చిరుజల్లులు మొదలయ్యాయి. ఒక్కసారిగా సీజన్ మారేసరికి మన శరీరం వెంటనే అడ్జస్ట్ కాలేదు. అందుకే జలుబు, తలనొప్పి, దగ్గు లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా సీజన్ మారినప్పుడల్లా ఇబ్బంది పెట్టే ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలో సూచిస్తున్నారు నిపుణులు.
* శరీరం ఫిట్‌గా ఉండాలంటే వ్యాధినిరోధక సామర్థ్యం బావుండాలి. ఇది మనం తీసుకునే ఆహారం నుంచే డెవలప్ అవుతుంది.
* ఆకుకూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ మంచి పోషకాలను అందించడమే కాదు.. వ్యాధినిరోధక శక్తిని కూడా పెంచుతాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
* ఎండాకాలంలో చల్లదనాన్ని పెంచే నిమ్మ చల్లని వాతవరణంలో తీసుకోవద్దని అనుకుంటారు. దానివల్ల జలుబు చేస్తుందన్న అపోహ కూడా చాలామందిలో ఉంది.
నిజానికి నిమ్మ వల్ల శరీరం చైతన్యవంతం అవుతుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ పునరుత్తేజితం అవుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి తరచుగా నిమ్మరసం తీసుకుంటే జలుబు లాంటి ఇబ్బందులు తగ్గుతాయి కూడా.

5, జూన్ 2011, ఆదివారం
నెమ్మదినెమ్మదిగా ఉప్పు వాడకాన్ని తగ్గించండి.
వండుకుని తినేందుకు టైం ఉండడం లేదంటూ ఫాస్ట్‌ఫుడ్ మీద ఆధారపడుతున్నారు ఎక్కువమంది. టైం వృథా కాకుండా ఉంటుంది. అంతవరకు ఒకె. కాని ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారా? ఎందుకంటే ఫాస్ట్‌ఫుడ్‌ను రోజూ తింటే ఎముకల పైన ఉండే త్వచం పలుచబడడమే కాకుండా ఎముకల సాంద్రత కూడా తగ్గిపోతుంది. మొత్తం మీద ఎముకలు బలహీనంగా తయారవుతాయన్నమాట. అది సరే కాని ఫాస్ట్‌ఫుడ్‌కి దీనికి సంబంధం ఏముందనిపిస్తోందా? ఫాస్ట్‌ఫుడ్ నిల్వ ఉండడం కోసం ఎక్కువ ఉప్పు వినియోగిస్తుంటారు. దాంతో శరీరంలోకి ఎక్కువ ఉప్పు చేరిపోయి కాల్షియం బయటకు పంపబడుతుంది. అందుకనే ఉప్పు తక్కువగా తినమనేది. ముఖ్యంగా ఆడవాళ్లు తక్కువ ఉప్పు తీసుకోవాలి. లేకపోతే నెలసరికి వారం ముందు శరీరంలోకి నీరు చేరి ఉబ్బినట్టు తయారవుతారు. అందుకే ఆహారంలో ఉప్పు మోతాదును తగ్గించాలి.
- ప్యాకేజి ఆహారాన్ని కొనేప్పుడు ప్యాకెట్ పైన రాసి ఉన్న పోషకవిలువల సమాచారాన్ని చదవాలి. తక్కువ ఉప్పు ఉన్న పదార్ధాలనే కొనాలి.
-వంటల్లో ఉప్పు తగ్గించేయాలి. తినేటప్పుడు ఉప్పును ఆహారపదార్ధాలపైన చల్లుకునే అలవాటును మానుకోవాలి.
-బంగాళాదుంపల చిప్స్ వంటి స్నాక్స్ మానేయాలి. అలాగే చీజ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడీ ఈట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
-వంట సాస్ వాడకం తగ్గించాలి. సీజనింగ్ కోసం వాడే సాయ్, చిల్లీ, సలాడ్ డ్రస్సింగ్, మస్టర్డ్ సాస్ వంటి వాటిలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని వాటిని వంట గదికి దూరంగా ఉంచాలి.
-పళ్లు, కాయగూరలు వంటి పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినాలి. అరటిపండ్లు, పాలకూర, గెనుసుగడ్డ (స్వీట్ పొటాటో), పప్పు ధాన్యాలు, సోయా, చిక్కుడు గింజలు, రాజ్మా వంటివి ఆహారంలో చేర్చితే సోడియం వల్ల కలిగే రక్తపీడన లోపాన్ని అధిగమించవచ్చు.
ఏమీ తినకుండా మూతికట్టుకు కూర్చుంటే ఎలా? బతికిన కొన్నాళ్లు జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేం దొరికిందంతా తింటాం. మాకివన్నీ చెప్పొద్దు అనే వాళ్లు కూడా శరీరంలోకి అధికంగా చేరే సోడియంను తగ్గించుకోవచ్చు. పచ్చళ్లు, పాపడ్లు, చట్నీలు తినకుండా ఉండలేం అనే వాళ్లు కూడా ఉప్పును దూరంగా ఉంచొచ్చు. అందుకు ఏం చేయాలంటే...
- ఒక్కో మీల్‌కి నాలుగు నుంచి ఆరు గంటల ఖాళీ ఉండాలి.
- ఆ ఖాళీ సమయంలో నాలుగు నుంచి ఆరు గ్లాసుల నీళ్లు, రెండు గ్లాసుల కొబ్బరి నీళ్లు లేదా ఒక గ్లాసు టొమాటో రసం తాగాలి. టొమాటో రసంలో ఉప్పు వేయకూడదు. ఇలా చేస్తే శరీరంలోకి చేరిన అదనపు సోడియంను వేరు చేసే అవకాశం ఉంటుంది.
-రోజూ 30 నిమిషాల బ్రిస్క్ వాక్ చేయాలి. ఇలాచేస్తే శరీరంలో అదనంగా ఉన్న సోడియం స్వేదం రూపంలో బయటకుపోతుంది.
- ఉప్పు ఎక్కువగా ఉన్న ఒక మీల్ తరువాత తీసుకునే రెండవ మీల్‌లో కీరదోసకాయ ముక్కలు, టొమాటోలు, అర చెక్క యాపిల్, కారెట్ తురుము, దానిమ్మ గింజలు సగం వేసిన సలాడ్‌ను లాగించండి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ సలాడ్‌లో కూడా ఉప్పు కలపొద్దు.
- ఒక్కసారిగా కాకపోయినా నెమ్మదినెమ్మదిగా ఉప్పు వాడకాన్ని తగ్గించండి. ఉప్పు తగ్గించిన పదార్ధాలను తినేందుకు రెండు నుంచి మూడు వారాలు రుచిమొగ్గలు అలవాటుపడేందుకు టైం పడుతుంది. ఆ తరువాత నుంచి తక్కువ ఉప్పు ఉన్న ఆహారపు రుచిని ఎంజాయ్ చేయడం మొదలుపెడతారు.

4, జూన్ 2011, శనివారం
ఇప్పుడు పరీక్ష వైయస్ జగన్‌కే
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి గురి చూసి కొట్టిన బంతి తిరిగి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోర్టులోనే పడింది. ఇప్పుడు పరీక్ష వైయస్ జగన్‌కే గానీ, చంద్రబాబు నాయుడికో, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికో కాదు. కాంగ్రెసుతో కుమ్మక్కు కావడం వల్లనే చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించడం లేదని వైయస్ జగన్ పదే పదే వ్యాఖ్యానిస్తూ వచ్చారు. చంద్రబాబు అవిశ్వాసం ప్రతిపాదిస్తే తమ సత్తా ఏమిటో చూపిస్తామని సవాల్ చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా అవిశ్వాసం ప్రతిపాదించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని చెబుతూ వచ్చారు. మధ్యంతర ఎన్నికలకు భయపడి చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించబోరని ఆయన అనుకుని ఆ రకంగా మాట్లాడుతూ వచ్చి ఉంటారు. కానీ, చంద్రబాబు కర్రు కాల్చి వాత పెట్టినంత పని చేశారు.
అనూహ్యంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనను ముందుకు తెచ్చి వైయస్ జగన్‌కు పరీక్ష పెట్టారు. ఇప్పుడు జగన్ తన బలాన్ని నిరూపించుకోవాల్సిన అనివార్యతలో పడ్డారు. తమకు మ్యాజిక్ ఫిగర్ కన్నా ఒక ఎమ్మెల్యే ఎక్కువే ఉన్నారని అంటూ వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అసలు పరీక్ష ఎదురవుతోంది. చంద్రబాబు అవిశ్వాస తీర్మాన అస్త్రాన్ని వెలికి తీయడంతో జగన్ తన జెరూసలేం పర్యటనను రద్దు చేసుకున్నారు. తమ పార్టీ ముఖ్య నేతలతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. అవిశ్వాస తీర్మానంపై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసుకోవడంలో ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే జగన్‌కు కనీసం 40 మంది కాంగ్రెసు శాసనసభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. అంత మంది శాసనసభ్యులను జగన్ చీల్చగలుగుతారా అనేది అనుమానమే.
పార్టీ నిర్మాణంపై, సంస్థాగత వ్యవహారాలపై జగన్ దృష్టి పెట్టిన సందర్భంలో చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి దృష్టి మళ్లించారు. వైయస్ జగన్ వెంట 27 మంది శానససభ్యుల దాకా ఉన్నట్లు ఇప్పటి వరకు అంచనాలు సాగుతూ వచ్చాయి. వీరిలో 25 మంది దాకా కాంగ్రెసు ఎమ్మెలున్నారని చెబుతూ వచ్చారు. కానీ, ఆ బలం కూడా ఉంటుందా, ఉండదా అనేది ఇప్పుడు అనుమానంగా మారింది. శాసనసభ్యురాలిగా వైయస్ విజయమ్మ చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 10 మది శాసనసభ్యులు హాజరయ్యారు. ఈ పది మంది కచ్చితంగా జగన్ వైపు ఉండే అవకాశాలున్నాయని అనుకోవచ్చు.
తమకు సరైన బలం లేదని గ్రహించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఇప్పుడు ఆత్మప్రబోధానుసారం ఓటేయాలనే అంశాన్ని ముందుకు తెచ్చారు. ఆత్మప్రబోధానుసారం ఓటు చేసి ప్రభుత్వాన్ని కూల్చాలని వారు కాంగ్రెసు శాసనసభ్యులకు పిలుపునిస్తున్నారు. ఇంకా మూడేళ్ల కాలవ్యవధి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి ముందుకు వస్తారా అనేది అనుమానమే. తన దయాదాక్షిణ్యాల మీద ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని, తాను కన్నెర్ర చేస్తే ప్రభుత్వం పడిపోతుందని చెబుతూ వచ్చిన వైయస్ జగన్‌కు ఇది అసలు సిసలైన పరీక్ష అనడంలో సందేహం లేదు.

వైయస్ జగన్ వెంట 34 మంది శానససభ్యులు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట 34 మంది శానససభ్యులున్నారనే ప్రచారం జరుగుతోంది. మరో ఆరుగురిని కూడగడితే ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యమవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే, వైయస్ జగన్ శుక్రవారం సాయంత్రం ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యురాలు వైయస్ విజయమ్మ కాకుండా 22 మంది శాసనసభ్యులు హాజరయ్యారు. కుంజా సత్యవతి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి, సుచరిత, రామచంద్రా రెడ్డి, రవి, ఆదినారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, కొండా సురేఖ, శేషారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ప్రసాద రాజు, బాలరాజు, కొర్ల భారతి, ధర్మాన కృష్ణదాస్, బాబూరావు, శ్రీనివాసులు, శివప్రసాద్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జయసుధ, శోభానాగి రెడ్డి, అమర్నాథ్ రెడ్డి శుక్రవారంనాటి సమావేశానికి హాజరయ్యారు.
నిక్కచ్చిగా జగన్ వెంట నడిచే బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ సమావేశానికి రాలేదు. వీరిద్దరు జగన్ వెంటే ఉంటారని కచ్చితంగా చెప్పవచ్చు. ఆళ్ల నాని, జోగి రమేష్ వంటి శాసనసభ్యులు కూడా జగన్ వెంట ఉంటారని భావిస్తున్నారు. పలువురు శాసనసభ్యులతో జగన్ ఫోన్‌లో మాట్లాడినట్లు చెబుతున్నారు. శాసనసభ్యురాలిగా వైయస్ విజయమ్మ ప్రమాణ స్వీకారానికి శుక్రవారం ఉదయం 13 మంది శాసనసభ్యులు వచ్చారు. సాయంత్రానికి ఆ సంఖ్య 22కి పెరిగింది. స్పీకర్ ఎన్నిక విషయంలో, అవిశ్వాస తీర్మానం విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ శానససభ్యులతో విడివిడిగా మాట్లాడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వాన్ని కూల్చడానికి అవసరమైన సంఖ్యను కూడగట్టేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.
ముఖ్యనేతల సమావేశానికి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు కొండా మురళి, జూపూడి ప్రభాకర రావు, పుల్లా పద్మావతి కూడా హాజరయ్యారు. ప్రస్తుత స్థితిని బట్టి అవిశ్వాస తీర్మానం రాజకీయం రసకందాయంలో పడిందనే చెప్పాలి.

3, జూన్ 2011, శుక్రవారం
బలం లేక పోయినా బాబుగారు బకరా అవడానికా
మేడం చెప్పిన సభాపతుల ను
ఎన్నుకొనే సంబరానికి పాలకులు
సన్నద్దమవుతుంటే
సందట్లో సడేమియాలా
బాబు గారు తన పార్టీ నుండి
పోటీకి పెడుతున్నాడు.
బలం లేక పోయినా
బకరా అవడానికా అనే సందేహం
అందరికీ వస్తుంది.
ఇటీవల ఏ పార్టీని కదిపినా
ఎదుటి పార్టీలు రెండూ
మ్యాచ్ ఫిక్సింగు చేసుకొన్నాయి అని
మాటల తూటాలు పేల్చుతున్నారు.
బాబు గారు తమ్ముళ్ళ తరుపున పోటీ తో
తుపాకీ పేల్చుతున్నారు.
ఇక్కడ జగన్ గ్యాంగు సాహసం చేస్తే
అనర్హత వేటు పడుతుంది.
సాహసం చేయక పొతే
గురి తప్పి తుస్స్ మంటుంది అని అనుకొంటే పొరబాటే.
తూచ్ మీరిద్దరే మ్యాచ్ ఫిక్సింగు చేసుకొన్నారు అని
అనడానికి పనికి వస్తుంది.
పనిలో పనిగా తెలుగు తమ్ముల్లలో తెలంగాణా వారిని పెడితే
మొత్తం తెలంగాణా ప్రజా ప్రతినిధులు
నానా పాట్లు పడి గింజుకొంటారు.

తిరుపతి ప్రజాపతినిది పత్తాలేడు
రాజ్యం నేత
తమ ప్రజా ప్రతినిధి
కనిపించడం లేదని
తిరుపతి వెటర్నరీ విద్యార్థులు
వాల్ పోస్టర్లు వేసి నిరసన తెలుపుతున్నారు
పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేసారు.
సినిమాల్లో నటించక తన బొమ్మ ఉన్న పోస్టర్ ను
చూసుకోక చాన్నాల్లైందని
ఇలాగైనా నా బొమ్మ కనిపించదని మురుసిపోతాడో
లేక సామాజిక న్యాయం పై
సోనియా ఇంట్లో జరగబోయే చర్చల్లో
మునిగి తేలుతున్నానని
బదులు ఇచ్చి బడాయి పోతాడో చూడాలి.

ఆ అరవోడు ఎవరు
ఆ అరవోడు ఎవరు మాకు చెప్పడానికి
అని మన రాష్ట్ర పార్టీలు అరిచి చెప్పినా
అన్నీ తెలిసిన ఆయన గారు మాత్రం
తెలంగాణా పై తన గానాన్ని వినిపిస్తూ
అన్ని పార్టీలు ఒప్పుకొంటే
అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి
ఏకాభిప్రాయానికి కృషి చేసి
తెలంగాణా పై తేల్చేస్తామని
మరో సారి మన తెలంగాణా వాదులను
తెల్లబోయేట్టు చేసారు.
అవతల తెలంగాణా ఆచార్యులు మాత్రం
కారు అద్దాలు దించకుండా ప్రయాణిస్తూ
కమలం కనిపిస్తే మాత్రం కరచాలనం చేసి వస్తున్నారు.
జెండాలన్నీ పక్కన బెట్టి
అందరినీ కలుపుకుని
ఉద్యమించే విషయంలో
ఎవరూ ఎలాంటి చొరవా చూపించక పోవడం చూస్తుంటే
ఎవరికీ తెలంగాణా రావడం ఇష్టం లేనట్టు ఉంది.
ఉస్మానియా విద్యార్థుల జాక్ కూడా
హైజాక్ కాబడినట్లే కనిపిస్తోంది.
వాళ్ళు కూడా ఈ విషయంలో
వింతగా ప్రవర్తిస్తున్నారు.
మొత్తానికి అందరూ కలిసి
ఆశలు పెట్టుకొన్న
అమాయక జీవికి
తమకు తెలంగాణా దక్కదు
కానీ మేమూ పోరాడాము అని
చెప్పుకొనే దిశ గా
ఉద్యమం దిక్కులు చూసేలా చేస్తున్నారు.

టీ ఆర్ పీ రేటింగుల కోసం ఉపయోగించబడే కుక్కల గోల తప్ప.
పంచ కట్టాడు
ప్రతిపక్షంగా విశ్వాస పరీక్ష పెట్టిస్తా అని అంటున్నాడు
ఒక్క ఎం ఎల్ ఏ తో ఉన్నాయన
మాజిక్ ఫిగరు కన్నా ఎక్కువ
బలముందని దింపే వరకు
మడమ తిప్పేది లేదు అని అంటున్నాడు
గతంలో పంచలూడ గొట్టండి అని అన్నా
ఇప్పుడు నాలుక కరుచుకొని
పడగొడితే నిలబెడుతా అని అంటున్నాడు మరొకాయన
వేర్పాటు వాద పార్టీ
అవిశ్వాసం పెట్టండి
మేము మద్దతు ఇస్తాము అని అంటున్నారు
నిజ్జంగా విశ్వాస పరీక్ష జరిగి
ప్రభుత్వం పడితే వెంటనే ఏమౌతుంది
పడక పొతే ఏమౌతుంది?
రైతుల కష్టాల పేరుతో పెట్టే పరీక్షా ఫలితం
గోనే పట్టలు సిద్దం చేస్తుందా?
కరిచే కుక్కలను కరవకుండా చేస్తుందా?
టీ ఆర్ పీ రేటింగుల కోసం
ఉపయోగించబడే కుక్కల గోల తప్ప.

‘చేతి’ డబ్బు సంచులు మొత్తం స్విస్ బ్యాంకు లోనే ఉన్నట్టు ఉంది
యోగా బాబా రాం దేవ్ సత్యాగ్రహం అంటూ
హస్తిన అడుగిడిన మరుక్షణం
అమ్మగారి సేనా పతులు
ప్రణభ్, సిబాల్, బన్సాల్
విమానాశ్రయానికి వచ్చి మరీ
స్వాగతం చెప్పి మంతనాలు జరుపుతున్నారంట
చూస్తుంటే ప్రభుత్వానికి చెమటలు పడుతున్నట్టు ఉంది
నల్ల దానం వెలికితీయడానికి వెనుకాడడం చూస్తుంటే
‘చేతి’ డబ్బు సంచులు మొత్తం స్విస్ బ్యాంకు లోనే ఉన్నట్టు ఉంద.

తామర కూడా తన వంతు ప్రయత్నిస్తోంది
బురదలో వికసించడానికి బదులు
కూరుకు పోతున్న తామరను
కర్ణాటక కుర్చీ పై పెట్టాలని
ఘనుల దోపిడీదారులను దోసిట పట్టి
వారి పుణ్యాన పాలకులుగా పులకరిస్తూ
ఇప్పుడు వాళ్ళు పాపాత్ములుగా తేలుతున్న సమయాన
సుష్మా లాంటి వాళ్ళు
ఘనుల దొరలను దోసిట పట్టింది
నేను కాదంటే నేను కాదని
కడిగేసుకో చూస్తున్నారు చోద్యంగా.
తాము అధికారంలోకి వస్తే
వెంటనే తెలంగాణా అని
తీరా ప్రధాని పీటమెక్కిన పద్మం
ఇస్తే తామర హస్తిన కుర్చీ నుండి కింద పడుతుందని
తెప్ప తగలెట్టి తామూ ఆ తానూ ముక్కలే అని
తెలంగాణా వారికి తేట తెల్లం చేసారు.
ఇప్పుడు కొత్తగా
మరో సారి అధికారంలోకి వస్తే
మొదటగా చేసే పని తెలంగాణా ఇవ్వడమే అని
వింతగా మరో సారి వినుకోండి అని విన్నాపాలు చేస్తున్నారు.
వినే వాడి వెఱ్రిని బట్టి
రాజకీయ నాయకులు
తమకు తాళం వేసే లా
తమ నాలుకను నాట్యం చేయిస్తారు.
అందుకే కొత్తగా తామర కూడా తన వంతు ప్రయత్నిస్తోంది.

మన టోకెన్ ఎప్పుడు?
అరవ’జీ’లు ఇద్దరు ఎంత అరిచి మొత్తుకున్నా
కటకటాల వెనక కాలం వెళ్ళబుచ్చుతున్నారు
తాజాగా ౨ జీ లో ఇంకో జీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది
‘చెయ్యి’ దాటిపోయి సుప్రీం దగ్గర
ఏమి సుద్దులు వినాల్సి వస్తుందో అని
ఆ మూడో జీ నే సమాధానం చెప్పాలి అని
మనీష్ తివారీ మట్టి దులుపుకొన్నాడు.
కన్నడ నాట
కనకాడంబరాలతో
ఎదురులేదనుకొంటున్న
ఘనులకు కుర్చీ ఏసింది
నేను కాదంటే నేను కాదని
అందిన ముందస్తు ఉప్పుతో
కమల నాయకులు కలవరపడిపోతూ
కడిగేసుకోడానికి చూస్తున్నారు
ఆంధ్రాలో
అవినీతిపరులకు కూడా
అన్నీ సిద్దం చేస్తున్నారు
పాపం వీళ్లేమో పార్టీ అంటూ
అప్పుడే టికెట్ల సర్వేలు
గెలుపోటముల సర్వేలతో
ఊహల్లో తేలుతున్నారు
సమరం ముందు
సమస్యల్లోకి నెట్టబడి
ఊచలు లెక్కించ బడే సన్నివేశాలను మాత్రం
మాట మాత్రంగా కూడా
మదిలో రానియ్యడం లేదు.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)