19, సెప్టెంబర్ 2016, సోమవారం

ఒంటరి ప్రయాణం .. ఈ.. నీ.... కోసం

ఎవరో వస్తారు అని నా జీవిత పయనం ఆగలేదు.. 
 ఎవరు రాలేదు కదా అని నేను ఏమి మారలేదు.. 
 ఈ ఒంటరి ప్రయాణం ఎందుకొరకో.. ఎవరికోరకో.. 
  ఇంకా ఎనాళ్ళు ఇలా..
 అలిసిపోయాను నేను నీ కోసం నిరీక్షించి..

నేనెప్పుడూ ఒక సంచారినినే ..........

నేనెప్పుడూ ఓటమిని కౌగిలించుకున్న ఒంటరిని
కలల ఎరల వలల ఉచ్చులో చిక్కిన బాటసారిని
రాగం ద్వేషం స్వార్థ మత్తు వ్యసనాలకి బానిసని
నైతికపతనమై అంబరమంటని నిస్సహాయుడిని
ఎత్తులకు కుయ్యెత్తులు వేయలేని అయోగ్యుడిని
మాటల బాణాలు సంధించలేని సమరయోధుడిని
మనసుండి కూడా ప్రేమించలేని భగ్నప్రేమికుడిని
ఇన్ని వైఫల్యాల వైకల్యమున్న నిండైన విగ్రహాన్ని
అయినా చెక్కుచెదరక సాగిపోతున్న ఒక సంచారిని

జీవించడానికి కారణం ఏం ......................

  రాతిరనక పగలనక విసిగి వేసారిపోక 
ఒంటరినై ఆలోచనలతో సతమతమౌతూ
శాంతిసౌధ కుటీరాన్ని నిర్మించే ప్రయత్నంలో 
పొడిబారిన కళ్ళలో కన్నీరు రాక పొగబారి
పగటి వెలుతురులో ఖాళీ కుండలు చూసి
రాత్రి చీకటిలో అగాధాన్ని చూసి జడిసి.. 
జీవించడానికి కారణం ఏం కనబడక
మరణించే మార్గంలేక బ్రతకడానికి వంక వెతుకుతూ
వయస్సుని మించిన నిడివి రోడ్డులో గమ్యం రాక
పరుగులు పెడుతూ ఆగక అపరిచితుల నడుమ 
తెలిసిన వారికోసం వెతుకుతూ తిరుగుతూ..   

ప్రపంచంలో ఇద్దరే వ్యక్తులుంటారు. ఒకరు చేసేవారు.రెండో వాడు చూసేవాడు!

అవును ఇది వాస్తవం. చేసేవాడు ఎప్పుడూ చేసుకుంటూ పోతాడు. చూసేవాడు చూస్తూనే ఉంటాడు. వాడికి చేసే వాడిని విమర్శించడం తప్ప మరొక పని ఉండదు. కాని చేసేవాడు అవేవీ పట్టించుకోడు.వాడు పని వాడు చేసుకుంటూ పోతాడు. ఎందుకంటే వాడికి విమర్శించే వాళ్లకు సమాధానం చెపుతూ కూర్చుంటే వాడి పని ముందుకెల్లదని తెలుసు.
పని చేసేవాడు తక్కువ మాట్లాడతాడు. ఎవరికీ చులకన కాడు. పని చేయనివాడు మాత్రమే ఇంతలేదు,అంతలేదు అంటూ విర్రవీగుతాడు. వీడికి సమయాన్ని ఇచ్చిన వాడు తన జీవితాన్ని కోల్పోవడం ఖాయం.
కాబట్టి ప్రతి వ్యక్తీ తమ,తమ రంగాలలో ముందుకు పోవడానికి శ్రమించాలి. ఎందుకంటే శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది.
ప్రతి రోజూ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.నిజానికి మనిషికి జ్ఞానమే పెద్ద ఆస్తి. అది ఉంటే మనిషి దేనినైనా సాధించగలడు.చేధించగలడు.కాబట్టి మనమందరమూ కూడా పని చేసే వర్గంలోనే కల్సిపోదాము.దీనికి మీరేమంటారు?

దేహమే దేవాలయం జీవుడే దేవుడు

"దేహమే దేవాలయం జీవుడే దేవుడు" అనే వేద ప్రమాణానుసారం, సృష్టిలో ఉండే ప్రతి జీవి దేహం ఒక దేవాలయమే. ప్రతి జీవి కూడా పరబ్రహ్మమే. అయితే ఇక్కడ మానవులు మినహా ఇతర ప్రాణులకు ఈ విషయం అనుభవంలోకి రాలేదు ఎందుకంటే వాటికి పుట్టుకతోనే విచక్షణాజ్ఞానం లేకుండా పుడతాయి, అదే బలహీనతను ఆసరా చేసుకొని మానవుడు ఇతర జీవుల పట్ల తనకున్న విచక్షణా జ్ఞాన్ని ఉపయోగించుకొని తన స్వార్ధం కోసం తన వశంలోకి తెచ్చుకొని ప్రయోజనాన్ని పొందుతున్నాడు. ఇదే విషయాన్ని శృతి "జ్ఞాన హీనః పశుభిస్సమానః" అంటే జ్ఞానం లేని ప్రతి వ్యక్తి పశువుతో సమానమని అర్ధం. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటని విచారిస్తే చతుర్వేదముల నుండి గ్రహించబడిన 4 మహావాక్యములు అంటే 4 వేదాల సారము (1) "అహం బ్రహ్మాస్మి"=నేనే పరబ్రహ్మమును (2) "అయమాత్మాబ్రహ్మ"=నా ఆత్మయే బ్రహ్మ అంటే దేవుడు(3) "ప్రజ్ఞానం బ్రహ్మ"= విశేషణమైన జ్ఞానమేదికలదో అదియే బ్రహ్మ (4) "తత్వమసి"=ఏదైతే దేవుడు పరబ్రహ్మము ఉన్నదో అది నీవే అయి ఉన్నావు. 

పై నాలుగు మహావాక్యములు నీవే భగవంతుడవు అనే నగ్న సత్యాన్ని మన ముందుంచినా "సముద్రము తలాపున ఉంచుకొని , చేప నీళ్ళకు ఏడ్చినట్లుగా" మనం జ్ఞాన స్వరూపులం, అఖండ సచ్చిదానంద స్వరూపులం అయి ఉండి కూడా నాకు 'సుఖం ' లేదు 'శాంతి ' లేదు అని బాధపడుతూ ఆ సుఖం, శాంతిని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా మనం పొందే సుఖం పరావర్తన సుఖం అంటే మన నుండి ఉద్భవించిన సుఖం అవే జ్ఞానం మనం మరచిపోయినందువల్లనే ఒక్క మానవ జీవితానికే ఇంత బాధ్యత తద్వారా ఇన్ని అనర్ధాలు, బాధలు, దుఃఖాలు, భయాలు కలుగుతున్నాయి. ఇది అనుభూతిలోకి రావడానికి (1)వేదవాక్యముపై విశ్వాసముంచి తద్వారా ఆ ఆత్మభూతస్థితిలో ఉండుట (2) శ్రుతి ప్రమాణాన్ని ఆచరించి అనుభూతి పొందిన మహాత్ముల 'పాదాలు ' ఆశ్రయించడమే. 

పై మార్గములలో (1)వ మార్గము కొంత ప్రయాసతో కూడుకొనినటువంటిది. (2)వ మార్గాన్ని గూర్చి కొంత విచారణ అవసరం.అసలు మహాత్ములు, ఋషులు అంటే ఎవరు? సృష్టి ఆరంభంలో తొలుత దేహధారణ చేసి తద్వారా ఈ ప్రపంచ రూపకల్పనకు మూల పురుషులు ఋషులే. అందుకే ఇది ఋషి పరంపర మనమంతా వారి సంతతి వారమే కావున మన పేరున అర్చన చేసుకొనేటప్పుడు మన గోత్రం అడుగుతారు పూజారి, అప్పుడు మనం అంగీరస మహాముని గోత్ర, గౌతమ ఋషి గోత్రమని చెపుతుంటాం. అంటే ఇక్కడ మనం వాడే పేర్లు ఋషులవే. మానవజాతి అంతా ఋషి సంతతే ఇదే మన భారతీయ సంస్కృతి. 

'శృతి ' చెప్పినట్లు (వేదం చెప్పినట్లు) నడిచేవాడు 'మానవుడు ' 'మతి ' చెప్పినట్లు నడిచేవాడు 'వానరుడు '. శృతి మాత చెప్పినట్లు మహర్షులు మంచిని ఆచరించి తన స్వార్ధానికి కాకుండా వారి జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసి లోక కల్యాణ నిమిత్తం వారి జీవితాల్ని గడపడం మనం చూస్తూనే ఉన్నాం. వారు పొందే ఆనందాన్ని అందరూ పొందాలనేదే వారి కోరిక. అందుకే కాబోలు ప్రవచనాల ద్వారా, హొమాల ద్వారా, యాగాల ద్వారా, సంకీర్తనల ద్వారా, నిస్వార్ధ విగ్రహ ప్రతిష్ఠనల ద్వారా, క్రియా యోగము ద్వారా శాంతిని మనకు అందజేస్తున్నారు. అసలు మహర్షిని గుర్తించడం ఎలా? ఒక వ్యక్తి ఏ కులస్థుడైనా, మతస్థుడైనా, ఉచ్చ జాతి వారైనా లేక నీచజాతి వారైనా అతని వద్దకు మనం వెళితే మనకు తెలియకుండానే మనం అతని వద్ద ఉన్నంత సేపు ఒత్తిడిలో నుండి విముక్తులమై శాంతంగా ఉండగలిగితే అతను నిస్వార్ధ జీవన విధానావలంబుడై ఉంటే, అతడే మహర్షి, మహాత్ముడు, సాధువు, భగవంతుడు, అల్లా, యేసు, గురునానక్, అహర్మీస్థా అలాంటి సాధువుల చేతులు మంచి పనులే చేస్తాయి, కాళ్ళు లోక కళ్యాణ నిమిత్తమే నడుస్తాయి, కనుల ద్వారా చల్లని చూపు. అంతెందుకు శరీరంలోని ప్రతి అంగము పరిశుద్ధంగావింపబడి ఉంటాయి. "ప్రతి జీవిని తనవలె" చూచె ఉత్తమోత్తమ ఆలోచన వారి మనస్సులో నిరంతరం కదలాడుతుంది. ఇదే అసలైన మన భారతీయ సంస్కృతి. పవిత్ర భారత దేశంలో, నివురు గప్పిన నిప్పుల్లా ప్రపంచ శాంతి కోసం ఎందరో మహర్షులు వారి జీవితాలను, తృణ ప్రాయంగా పెట్టి ఎన్నో కష్టాలకు ఓర్చి (1) మౌనం (2) పయోహారం (గోవు పాలు) మాత్రమే ఆహారంగా తీసుకొని (3) ఏకాంతవాసం చేసి (4) దిగంబరత్వం ఉండి గడుపుతున్నారు. 

"సాధూనాం దర్షనం పుణ్యం స్పర్షనం పాపనాషనం" 

అందుకే సాధువును దర్షించుకొంటే పుణ్యమనీ, వారి పాదాలను స్పృషించడం ద్వారా పాపాలు నాశన వుతాయని పెద్దల మాట. జ్ఞానస్థితిలో ఉన్న సాధువుల పాదాలలో సమస్త తీర్ధ క్షేత్రాలు ఉంటాయి. జ్ఞాన సహిత సాధువు దేహమే పవిత్ర దేవాలయం.

10, మార్చి 2012, శనివారం

షడ్రషోపేతమైన బోజనంగా

అవినీతి ఆకలేసిన వాడికి
మా ఆయన లేదనకుండా పెట్టేవాడు
ఆ పుణ్యం ఊరికే పోలేదు
మా బాబుకి
షడ్రషోపేతమైన బోజనంగా
ప్రవాహంలా వచ్చేది
ప్రజల సొత్తు
ఆశీర్వాదపు అల్లుడికి కూడా
లోటు రానివ్వలేదు
మా ఆయన పధకాలు కొనసాగించండి
అడ్డు అనిపించినా వారి మంగళ సూత్రాలు తెంచండి
ఎలా భొంచేస్తున్నారో చూడండి అని దిష్టి పెట్టిన వారి పై దాడి చెయ్యండి
మా భోజనాలకు లోటు రాకుండా చూసిన వారిని
చంచల్ గూడ జైలు లో చూస్తుంటే గుండె చెరువవుతోంది
వాళ్ళు లేక బోజన వేళలు తెలియడం లేదు
వాళ్ళను విడిపించి మా బాబు ను
ప్రపంచ వాణిజ్య వేత్తల సరసన చేర్చండి

ఆయన సేవకు ఓ ద్వీపాన్ని రాసిచ్చేసారు

బ్రాందీ దుకాణాలు వున్నా
గాంధీ భవన్ రాజైన
సత్తి కూడా ఓ సిండి’కేటు’
అని ఆరోపణ వస్తూనే
దర్యాప్తు జరపండి అని
దబాయించాడు

అబ్కారీ శాఖామాత్యుడికే
సిండి’కేట్ల’ తరపున
ఆమ్యామ్యాలు ఇచ్చానని
వినిపించిన సాక్ష్యం పై
బడుగు జీవులకే ఈ బాధలన్నీ అంటూ
అయినా నిరూపించండి అని
ఆ అమాత్యుని దబాయింపు

సేవకుడుగా అవతారమెత్తినా
మొత్తిన జనానికి జలక్ ఇచ్చి
జంప్ చేసి తనతో పాటు పార్టీని
ముంచేసిన ఆయన సేవకు
వెండి దీపం కానుకగా ఇచ్చినట్టు
ఓ ద్వీపాన్ని రాసిచ్చేసారు
అని వినవచ్చిన ఆరోపణలకు
తేలుకుట్టిన దొంగకు మల్లే వుండడం
ఆరోపణలు నిజమనా లేక
అనవసరంగా సభా సమయంలో
సమస్యలు తెచ్చుకోవడం ఎందుకని
ప్రజా సంపదల ‘సేవకుడు’ అనుకొన్నాడో
అర్ధం కావడం లేదు

30, నవంబర్ 2011, బుధవారం

అసలైన ఐడియల్ లైఫ్ స్టైల్

ఓ పెద్ద ఊర్లో ఒక సమావేశం జరుగుతోంది. దానికి దేశదేశాలనుంచి ఓ వంద మంది గొప్ప గొప్ప వ్యక్తులు, పేరు ప్రఖ్యాతులున్న పెద్దమనుష్యులు, అధ్యాపకులు, రాజకీయవేత్తలు, శాస్త్రవేత్తలు, పండితులు, మతాధిపతులు, పీఠాధిపతులు, వేంచేసి యున్నారు. ఇంతకీ అక్కడ సమావేశంలో చర్చించే విషయం అత్యున్నత జీవనశైలి (ఐడియల్ లైఫ్ స్టైల్) గురించి.ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, వారి వారి జీవితానుభవాలనుంచీ, వారు చదివిన పుస్తకాలు, మత గ్రంధాలు, శాస్త్ర గ్రంధాలనుండీ ఉదాహరణలు ఉటంకిస్తూ వారివారి అభిప్రాయాలను వెలి బుచ్చుతున్నారు. ఇష్టమున్నవాళ్ళు, ఆ అభిప్రాయలతో ఏకీభవించిన వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తూంటే, నచ్చనివాళ్ళూ, ఇష్టం లేనివాళ్ళూ వ్యతిరేకిస్తూ అడ్డుపడుతున్నారు.కొందరు ధనముంటే చాలంటే, మరికొందరు జ్ఞానవంతమైన జీవనానికి అనుకూలంగా వున్నారు. ఇంకొందరు దైవభక్తి, పాపభీతికి తలొగ్గితే, మరికొందరు అంగబలమూ, అధికారానికి పెద్దపీఠవేశారు. సాంకేతికంగా వృద్ధి చెందిన జీవనశైలే పరమావధిగా కొందరు భావిస్తే, ప్రశాంత మైన పల్లెజీవనానికి మించినదిలేదనేవారింకొందరు. ఈవిధంగా చాలా వేడి వేడిగా చర్చలు ఆరు రోజులుగా నడుస్తున్నా, ఇంతవరకూ ఒక ఏకాభిప్రాయానికి రాలేదు. ఏకాభిప్రాయానికి రావటానికి ఇంకొక్కరోజు మాత్రమే గడువుండటంతో చివరకు నిర్వాహకులు ఓటింగ్ పద్ధతిని అనుసరించడానికి నిర్ణయించారు. ఓటింగ్ ప్రక్రియ మొదలయ్యింది. ఒక్కొక్కళ్ళు వేడివేడిగా ప్రక్కవాళ్ళతో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలలోని పసను ప్రక్కవాళ్ళకు వినిపిస్తున్నారు. ఏదో ఒక విధంగా ప్రక్క వాళ్ళను ప్రభావితం చేసి ఇంకొన్ని ఓట్లను పొందుదామని తాపత్రయం. ఇలా అందరూ హడావుడిగా వుంటే, సాదా సీదాగా వున్న ఓ మధ్యవయసు వ్యక్తి ఎటువంటి హడావుడీ లేకుండా ప్రశాతంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఓటింగ్ కార్యక్రమం పూర్తయ్యింది. లెక్కించేందుకు ముందు చివరిసారిగా నిర్వాహకులు అందరూ ఓటువేశారా అని కనుక్కుంటున్నారు. నిర్వాహకుల్లో కొద్దిగా ఆలోచన కలిగిన ఓ చురుకైన వ్యక్తి, ముఖ్య నిర్వాహకుడు - మొదలునుంచీ ఎటువంటి హడావుడీ లేకుండా ప్రశాంతంగా వున్న మధ్య వయసు వ్యక్తిని గమనిస్తూవున్నాడు. అతనెప్పుడూ ఏ వ్యక్తితోనూ, ఎవరి అభిప్రాయంతోనూ ఏకీభవించడంగానీ, వ్యతిరేకించడంగానీ చేయలేదు. అసలు అతను అతని అభిప్రాయాన్ని కూడా ఎవరితోనూ పంచుకున్నట్లు కనబడనూలేదు. ఇప్పుడూ అలానే ప్రశాతంగా ఓ మూల కూర్చొని ఉన్నాడు. ఇదంతా చూసిన ఆ నిర్వాహకుడికి అతనికి కూడా ఓ అవకాశం ఇస్తే బాగుంటుందనిపించింది. ఇంతలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. అందరూ ఎవరికి వారే తమ అభిప్రాయమే గెలుస్తున్న అభిప్రాయంలో వున్నారు. ఫలితం ప్రకటించేందుకు ఆ చురుకైన నిర్వాహకుడు ఫలితాల కాగితంతో మైకు ముందుకు వచ్చాడు. అందరికీ ఉత్సాహంగా పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. వచ్చిన అందరికీ తమతమ అభిప్రాయాలను వెలిబుచ్చే అవకాశం వచ్చినా, ఒకవ్యక్తి మాత్రం తన అభిప్రాయాలను చెప్పలేకపోయాడనీ, చివరిగా అతనికీ ఓ అవకాశం ఇస్తున్నామనీ, దయచేసి అందర్నీ నిశ్శబ్ధంగా వుండమని ప్రార్థించాడు. మధ్యవయసు వ్యక్తి దగ్గరకు వచ్చి అతన్ని స్టేజ్ మీదకు మాట్లాడడానికి ఆహ్వానించాడు. ఆ మధ్యవయసు వ్యక్తి తన గురించి పరిచయం చేసుకుంటూ ఇలా అన్నాడు. "నేను భారత దేశం లోని ఓ సాధారణమైన చిన్న పట్టణం నుంచి వచ్చాను. నాకు ముగ్గురు పిల్లలు. నాలుగెకరాలు కూరగాయలు పండించే పొలం, గ్రామ సభలో అకౌంటెంటు ఉద్యోగం." ఈ మాటలు పూర్తయ్యీ కాకమునుపే సభలో మిగిలిన వారి ముఖాల్లో తేలికభావం, అసలెవరతన్ని ఈ సభకాహ్వానించారని గుసగుసలూ మొదలయ్యాయి. నిర్వాహకుడు వారించాక కొద్దిగా సద్దుమణిగారు. తిరిగి అతను మొదలు పెట్టాడు. "నేనేమీ ఈ సమావేశానికి వెళతాననలేదు, కానీ మా పట్టణ ప్రజలు, పెద్దల బలవంతం మీద వచ్చాను. కానీ ఇక్కడ మీలాంటి పెద్దల్నీ, పండితులనీ చూశాక నాలాంటి వాడు చెప్పేదేముంటుందని వూరకున్నాను." ఇంతలో సభలోంచి ఎవరో నీ వెవరి అభిప్రాయానికి ఓటేసావన్నారు. "మీ రెవరి అభిప్రాయంతోనూ నేనేకీభవించలేక పోయాను కనుక ఓటే వెయ్యలేదు" అన్నాడతను."మీరెవరి అభిప్రాయంతోనూ ఏకీభవించలేక పోయానన్నారు. బాగుంది. అయితే మీ అభిప్రాయంకూడా చెప్పండి" అన్నాడు నిర్వాహకుడు."మీరింతవరకూ చెప్పిన అభిప్రాయాలన్నీ మనిషి సుఖజీవితానికి తోడ్పడతాయి తప్ప అర్థవంతమైన జీవనానికి కాదు. అర్థవంతమైన జీవితమంటే ఏమిటో మీకు తెలియనిదేమీ కాదు. ఏ శ్రమా, కష్టం లేకుండా గడిపే సుఖవంతమైన జీవితానికీ, భూమిలోపల ఆరడుగుల గోతిలోని జీవితానికీ తేడా ఏముంది? ఇబ్బందులనధిగమిస్తూ, కష్టాలనెదుర్కొంటూ, అసహాయులకు ఆసరా అందిస్తూ సాగే జీవనమే సామాజిక, దేశ పురోభివృద్ధికి మూలం. అదే అసలైన ఐడియల్ లైఫ్ స్టైల్" అంటూ ముగించాడు. సభలో ఏ ఒక్కరూ ఏమీ మాట్లాడలేదు. నిర్వాహకుడు మైకు ముందుకు వచ్చి ఈ వ్యక్తి వెలిబుచ్చిన అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం ఎవరికైనా వుంటే మాట్లాడవలసిందిగా ఆహ్వానించాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. తన చేతిలోని ఫలితాల కాగితాన్ని తెరవకుండానే చించేసి, ఆ మధ్య వయసు వ్యక్తికి ధన్యవాదాలతో సభను ముగించాడు.

ఎప్పుడైనా ఆలోచించారా !!!!!!!!!!!!!!!!!!!!!!

మనం కొంపలు మునిగిపోయినట్లుగా అర్జంటుగా ఆపకుండానే కారు తోలుతూనో లేదా బైక్ నడుపుతూనో మొబైల్ లో మాట్లాడుతుండటం సహజం. కానీ దీని వల్ల ఇతరులు ఏవిధంగా ఇబ్బంది పడతారో ఎప్పుడైనా ఆలోచించారా. పోనీ మీరెప్పుడైనా అటువంటి ఇబ్బందులకు గురైయ్యారా. నావరకు రెండూ అయ్యాయి.

మాట్లాడుతూ వాహనం నడిపితే ఎంత హాని కలుగుతుందో అని గవర్నమెంటు - ట్రాఫిక్ వాళ్లు ఎంత ప్రయత్నించినా ఎవరూ అర్థం చేసుకోవటంలేదట. చివరకి ఫైన్లు వడ్డించినా పట్టించు కోవడం లేదట - ఎంత రుచిగా వుందో పాపం.

మిగిలిన వాహనాలు వెళ్ళే వేగంతో కాకుండా, నెమ్మదిగానో, లేకపోతే ఆగి ఆగి వెళ్ళడమో చేస్తాం. మన ఏకాగ్రత సరిగా వుండదు. చూపులు రోడ్డుమీదున్నా, చెవులు ఫోన్లోని మాటలమీద, మనసు ఆ మాటల గురించి ఆలోచిస్తూంటూంది.

మనం ట్రాఫిక్ నడిచే వేగం కన్నా మెల్లగా వెళడంతో వెనక వచ్చే వాహనాల కెంత చిరాకు కలిగింస్తుందో చెప్పనవసరంలేదు - హారన్లతో మోతెక్కిపోతుంటూంది
అంటే ఎదుటి వాహనం అకస్మాత్తుగా ఆగితే, దానికి ప్రతిస్పందించడం ఆలస్యం అవుతుంది - ఫలితం - ఢాం

ప్రక్కనో, వెనుకో హారన్ మోగినా వినటానికి చెవులు ఖాళీగా లేకపోవడంతో ఎవణ్ణో ఒకణ్ణి రుద్దో, గుద్దో తిట్లు లేదా తన్నులు తింటాం - హీనపక్షం గీతలూ, సొట్టలూనూ

కనిపించనిదింకొకటుంది - వేగంమీద కంట్రోలు లేకపోవటంతో, మూడునాలుగు గేర్ల బదులు రెండూమూడు గేర్లు వాడతాం - అంటే చమురు వదిలించుకోవడంతో పాటూ ఇంజను పెర్ఫార్మెన్సూ మందగిస్తుంది

ముఖ్యమైంది - ప్రక్కన కుర్చునేవారికి ఎంత ఇర్రిటేటింగా వుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా

మోహం, చపలత్వాల భ్రమ, భ్రాంతి

ఓ గురుకులంలో శిష్య పరమాణువు లందరూ విశ్రాంతి సమయంలో గుమిగూడి వాడి వేడిగా చర్చించుకుంటూ, తర్కించుకుంటూ, వాదించుకుంటూవున్నారు. ఆ వాదించుకునే విషయమేమిటంటే ప్రపంచంలోని ఈతి బాధలకు కారణమేమిటా అని.

కొందరు మనిషిలో స్వార్థం అన్నారు.
ఇంకొందరు భ్రమ, భ్రాంతి అంటున్నారు.
వేరొకరు మోహం, చపలత్వాల గురించి చెబుతున్నారు.
మరికొందరు సత్తుకీ అసత్తుకీ తేడా తెలియకుండా పోవడమే అని వివరిస్తున్నారు.

వారిలో వారు గుంపులుగా తయారయ్యి ఎవరికి నచ్చిన వాదనను బలపరుస్తూ మాట్లాడుతున్నారు.

చివరికి ఎటూ తేలక, ఏకాభిప్రాయానికి రాలేక గురువుగారికి విన్నవించారు. అందరి వాదనలూ ప్రశాంతంగా విన్న గురువు గారు ఇలా తేల్చారు.

" అన్ని బాధలకు మూల కారణం మనిషి కదలకుండా ప్రశాంతంగా మౌనంగా వుండలేకపోవడమే "

హద్దులు ఉంటాయి

జీవితం చిన్న చిన్న విషయాలలోనే వికసిస్తుంది, ఆదమరిస్తే హరిస్తుంది కూడా...
చిన్నవి అనేవాటికి హద్దులు ఉంటాయి. ఉండాలి! అందుకే అవి చిన్నవి. ఆ హద్దులు మనం గ్రహించం. అంతే!
పొరపాటున ఎవరైనా గుర్తు చేసినా ఒప్పుకోం, నచ్చదు. మాయ అందించే ఆనందం అలాంటిది మరి!,

నా చావుకు నన్నొదిలేసి, నా గొయ్యి లోతును కొలిచే పనికి రోజు పూనుకుంటుంది.

నన్ను నాకు నగ్నంగా చూపే పగటి వెలుగుకంటే
నన్ను నాలా ఉండనిస్తూ భద్రతనిచ్చే చిక్కటి చీకటి నాకు నచ్చుతుంది.

నాలో ఘోషని నిర్లక్ష్యం చేసే వెలుగుకు ఏ కొసైనా నా చింత లేదు.
తన నిశ్శబ్దంలో నన్ను ఐక్యం చేసుకునే చీకటి నిశ్చింతలో నాకు స్వాంతన దొరుకుతుంది.

తన కపట మాటలతో చేతలతో మభ్యపెట్టే, రోజు ఆడంబరంకంటే
చంటిపాపలా నన్ను లాలించే రేయిలోని ఆప్యాయత నన్ను నెగ్గుతుంది.

రెండు నిమిషాలు కూడా కుదురుండనివ్వని పగటి ఆర్భాటంకంటే
శాంతం కూర్చుని నా గాధలన్నీ ఓపికగా వినే యామిని స్నేహం ఆహ్లాదంగా ఉంది.

కాదని, కుదరదని, జరగదని అపహాస్యం చేసే వెలుగు రంగులకంటే
'నీకు నచ్చిన రంగులతో నన్ను నింపుకో' అని చీకటిచ్చే చనువు నన్ను కదిలిస్తుంది.

నా చావుకు నన్నొదిలేసి, నా గొయ్యి లోతును కొలిచే పనికి రోజు పూనుకుంటుంది.
జారిపోతున్న నాకు ఊతం అందించి, ఒడి పరిచి బడలిక తీరుస్తుంది రాత్రి.

పగటి వెలుగులో చీకట్లు ముసిరేస్తున్నాయి. చీకట్లో వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయి.
రేయి పాడిన పాటలలోని రాగాలు, ఉషోదయంతో కూనిరాగలై మాయమైపోతున్నాయి.

రణగొణగా అట్టహాసంగా సాగుతూ, ఎన్ని అపహాస్యాలు చేసి ఎంత కౄరంగా హింసించినా
ఎదిగే ప్రతి పొద్దును ఊపిరి బిగపట్టి ఓర్పుతో దాటేస్తున్నది ఎందుకంటే......
నిరాడంబరమైన నిశి పరిచే చల్లని ఒడిలో వెచ్చని ఊహలతో
నిశ్చింతగా నిదురించే సమయం తిరిగి నాదౌతుందన్న నమ్మకంతో......

29, నవంబర్ 2011, మంగళవారం

గాడిదను... గుర్రాన్ని ఒకే గాటన కడుతున్నారన్నదే నా బాధ

నేను ప్రతిపక్షంలోకి వచ్చి ఎనిమిదేళ్ళు కావొస్తోంది. ఇన్నాళ్ల తర్వాత కూడా ఇంకా కేసులు, విచారణల పేరుతో వేధించడం న్యాయమేనా? నేను అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు పాతికకు పైగా కేసులు వేశారు. వాటిన్నింటినీ కోర్టులు కొట్టివేశాయి. అనేక విచారణలు చేయించారు. ఎక్కడా తప్పులు పట్టుకోలేకపోయారు. ఇదంతా అయ్యాక మళ్ళీ బురద చల్లుతున్నారు. ఇలా వేధించడం ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా?' అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
బాబు మీడియా తో మాట్లాడుతూ తనపై విచారణ విషయం ప్రస్తావనకు రాగా, ఒకింత ఆవేదనతో- కేసులు, విచారణల పేరుతో తనను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ పరిణామాలన్నింటి వెనుకా కాంగ్రెస్ హస్తం ఉందని, భవిష్యత్తులో అన్నీ బయటకువస్తాయని పేర్కొన్నారు. 'అన్ని పార్టీలు కాంగ్రెస్కు లొంగిపోతున్నా మేం మాత్రమే పోరాడుతున్నాం. అందుకే ఈ వేధింపులు. కిరణ్బేడీ, రాందేవ్బాబా వంటివారిపై ఏనాటివో సాంకేతిక అంశాలను తోడి కేసులు పెడుతున్నారు. నేరుగా పోరాడటం చేతకాక దొంగ దెబ్బకు యత్నిస్తున్నారు' అని చెప్పారు.
'రాష్ట్రంకోసం గొడ్డు చాకిరీ చేశాను. చివరకు కుటుంబాన్ని కూడా విస్మరించాను. నేను అధికారంలో ఉండగా నా భార్య, కొడుకు ఏనాడైనా బయటకు వచ్చారా? నా అధికారాన్ని దుర్వినియోగం చేశారా? వారిపైనా కేసులు పెట్టారు. ఇదేం న్యాయం?' అని ప్రశ్నించారు. ఇరవై ఏళ్ళుగా తన భార్య ఇల్లు...కంపెనీ పని తప్ప మరోదానిలో తలదూర్చలేదని ఆయన పేర్కొన్నారు.
'నా కొడుకు లోకేశ్ అమెరికాలో చదువుకుంటే ఆ ఖర్చు రామలింగరాజు భరించారని పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు. స్టాన్ఫోర్డ్ వంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు విక్రయించరు. ఆరోపణలు చేసినవారికి అది కూడా తెలియదు. ఆ ఖర్చు కూడా భరించే స్థితిలో మేం లేమా?' అని విస్మయం వ్యక్తం చేశారు.
తాను స్కూల్లో చదువుతున్నప్పుడే వ్యాపారం చేస్తున్న రామోజీరావు తన బినామీ అంటే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదన్నారు. 'హైటెక్సిటీ పక్కన భూమి ఉంది కాబట్టి సినీనటుడు మురళీమోహన్ నా బినామీ అంటున్నారు. అంటే మాదాపూర్, శంషాబాద్ల్లో భూములున్నవారంతా నా బినామీలేనా? సింగపూర్లో నాకు హోటల్ ఉందని ఫొటో పెట్టారు. అదెవరిదో తెలపాలని సింగపూర్ హైకమిషనర్కు లేఖ రాశాను. దాని యాజమాన్యం బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్లో ఉందని జవాబు వచ్చింది.
అక్కడ పన్ను చట్టాలు లేవు కనుక వివరాలు బయటకు రావు. అందువల్ల నాపై బురద చల్లుతూనే ఉండవచ్చన్నది ప్రయత్నం' అన్నారు. డబ్బు పిచ్చితో వేల కోట్లు అక్రమంగా గడించినవారితో నన్ను పోల్చి గాడిదను... గుర్రాన్ని ఒకే గాటన కడుతున్నారన్నదే నా బాధ' అని వాపోయారు. కాగా.. తనకు సీబీఐ నుంచిగానీ, మరే దర్యాప్తు సంస్థ నుంచి గానీ ఎలాంటి నోటీసులూ అందలేదని చంద్రబాబు చెప్పారు. అయితే.. తన కుమారుడు లోకేశ్కు మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు వచ్చాయని తెలిపారు.
ఇదిలా వుంటే వైఎస్ విజయ వేసిన పిటిషన్ మేరకు తనతోపాటు మరికొందరి ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సోమవారం వెకేట్ పిటిషన్ దాఖలు చేశారు. "నాపై విజయ వేసిన పిటిషన్లో.. మా వాదనలు వినకుండా హైకోర్టు డివిజన్ బెంచ్ ఏకపక్షంగా (ఎక్స్పార్టీ) ఆదేశాలు ఇచ్చింది. వాటికి మీడియా విస్తృత ప్రచారం కల్పించింది. ఫలితంగా నా పరువుప్రతిష్ఠలకు తీవ్రనష్టం కలిగింది. ఇటువంటి ఆదేశాలు సహజ న్యాయసూత్రాలకు విరు ద్ధం. అంతేకాదు... రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగకరం'' అని ఆ పిటిషన్లో చంద్రబాబు పేర్కొన్నారు.

28, నవంబర్ 2011, సోమవారం

దేవుడి బిడ్డ అడ్డాలు బహిర్గతం కావడం

ఇడుపలేసుని మహిమలతో
ఈశాన్య రాష్ట్రాలలో కూడా
దేవుడి బిడ్డ అడ్డాలు బహిర్గతం కావడం
దేవుడి బిడ్డకే కాదు
ఆంధ్రులందరికీ గర్వకారణం.

సోమాలియా దొంగల కథ

ఒక డాక్టర్ గారు
తీరిక లేకుండా
రాష్ట్రానికి ఆపరేషను చేసి
సహజవనరులను వెలికి తీసి
కొడుకును కొండెక్కిస్తుంటే
ఎరువులు కావాలని రోడ్డెక్కిన రైతులకు
సోమాలియా దొంగల కథ చెప్పి
సమాధాన పరిచి
రైతు శాస్త్రవేత్తలుగా
పార్టీ కార్య కర్తలను పెట్టించి
మేఘమధనం పేరు చెప్పి ధన మధనం చేసి
రైతులకు ఆదాయం ఎక్కువజేసి
పంట విరామం చేయించిలా కృషి సల్పి
డాక్టర్ గారు చెప్పినట్లు
వ్యవసాయాన్ని పండగజేసినందుకు
ప్రక్క రాష్ట్రపు విద్యాలయం
పట్టండి మహా ప్రభో అని డాక్టరేట్ ఇస్తుంటే
పట్టరాని ఆనందం వచ్చింది
తీసుకొన్నందుకు మీకు లేని సిగ్గు
అభినందించడానికి మాకు ఎందుకు
అందుకే అందుకోండి శుభాకాంక్షలు.

ప్రతిపక్షానికి ప్రతిపక్షమై ప్రభుత్వం దగ్గరికి తమ ప్రతినిధులకు దారిచూపి

ప్రభుత్వం మైనార్టీలో పడింది
రక్షిస్తోంది ప్రతిపక్షమే అని
అవిశ్వాసం పెడితే
మేము పడగొట్టేస్తామని
ప్రగర్భాలు పలికి
ప్రతిపక్షానికి ప్రతిపక్షమై
ప్రభుత్వం దగ్గరికి
తమ ప్రతినిధులకు దారిచూపి

రైతు సమస్యలపై
అవిశ్వాసం పెడతాము
అని చెబుతున్న ప్రతిపక్షపు పల్లవిపై
పలుకే బంగారం చేసి బాబాయితో
రాయభారాలు నడుపుతున్నది ఎవరు?

వెంగలప్పలా పచ్చి వెలక్కాయ మింగి....................

సామాజిక న్యాయం అని
పడగొడితే నిలబెడతా అని
తనకు న్యాయం చేసుకోడానికి
అమ్మగారి దర్శనం చేసుకొంటూ
పార్టీ పెట్టినప్పటి నుండి అయోమయాన్ని దూరం చేసుకోకున్నా
అమాత్య పదవన్నా వస్తుంది అని
ఆశల పల్లకిలో ఒకరు

నాన్న అధికార మంత్రదండంతో
వాయు వేగాన వ్యాపారి అయి
అయ్య స్థానం కోసం అంగలార్చి
అలిగి
తోసేస్తానని
తోక జాడించి
ముసురుకొన్న కేసులతో
మద్దతు దారులు ‘దారులు’ వెతుక్కొంటుంటే
వెంగలప్పలా పచ్చి వెలక్కాయ మింగి
అమాత్య పదవన్నా వచ్చి వుండేదని
అంతులేని ఓదార్పు లో నిర్వేదపడుతూ
ఆటలో అరటి పండైనా ఓ అర్ధం వుండేది
అడ్డంగా కేసుల్లో ఇరుక్కొన్నామే అని ఇంకొకరు

నాన్నది తప్పా? అమ్మది తప్పా?

ఏభై శాతం మార్కులతో
అమెరికాలోని యూనివర్సిటీలలో
కొడిక్కి ఇరవై ఐదు కోట్ల డొనేషనుకట్టి
చదివించి అది చూపించుకోని
నాన్నది తప్పా?

ప్రజా సంపదను
పరుల దోసిట పట్టించి
కొడికి కంపెనీలలోకి
పెట్టుబడులు రప్పించి
కొడుకును పెద్ద వ్యాపార వేత్తగా
చూపించిన
నాన్నది తప్పా?

కొడుక్కోసం పాల వ్యాపారం చేస్తున్న
అమ్మది తప్పా?

కొడుకు రాజకీయ పదవి కోసం
అన్ని ఆరోపణలకు వెనకేసుకొని వస్తూ
రాజకీయ ప్రత్యర్ధులను వేధించడం మొదలెట్టిన
అమ్మది తప్పా?

21, నవంబర్ 2011, సోమవారం

ఆంధ్రాలో అయోధ్య లేని లోటును తీర్చాడు

సత్తు పళ్ళెం లో చప్పిడి తిండెట్టుకొని
ఏలగట్టిన కోడిని చూస్తూ
లొట్టలు వేసుకొని తినే
పింజారీ లు పైరసీలో చూసి
ఆనందిస్తాము అంటే
ఆడి బ్రతుకులో
ఆనందించడం
తెలుగు వాడిగా గర్వపడడం లాంటి పదాలు తెలియక
బురదలో బతికేసే రకం అని వదిలేయండి.
ఆ రాముడు
తారక రాముని దేహం లో
ఆవాహనం అయ్యి
ఆంధ్రాలో అయోధ్య లేని లోటును తీర్చాడు

చందాలతో భద్రాచల గుడి నిర్మించిన రామదాసు
నడయాడిన ఆంధ్రాలో
సయోధ్య కరువవ్వడం చూసి
ఆ రాముడు మరో సారి
బాలయ్య లో ఆవాహనం అయ్యి
ఆనంద భరితులను చేయ సంకల్పించాడు.

చరిత్ర సృస్టించాలన్నా .........అలా అనడం తప్పా????

గతంలో బాలయ్య గర్జిస్తే
ఆవేశం తో అంటున్నాడని ఆడిపోసుకొన్న వాళ్ళు
శ్రీ రామ రాజ్యంలో బాలయ్య విశ్వరూపం చూసి
సమాధాన పడ్డారా లేదా?
మొదట సింహమై గర్జిస్తూ
చరిత్ర సృస్టించాలన్నా .........అన్నప్పుడు
అవివేకంతో ఆడిపోసుకొన్న వారికి
దశాబ్దాల తరువాత
తెలుగు వాడికి మళ్ళీ రమ్యమైన రాముడి రూపం
చూపింది ఆ వంశమే కదా?
అలా అనడం తప్పా????
ఇక దర్శకుల గురించి
ఎవడినో ఉదహరిస్తూ
పళ్ళు రాలగొడతాను మన పరిశ్రమలో లేదంటే
అని ఆవేశ పడితే
అదును చూసి ఊదరగొట్టి
ఆ ఆవేశాన్ని పదే పదే ప్రశ్నించిన వాళ్లకు
అలనాటి లవ కుశ మాయా బజార్
సరసన నిలిపే
ఈనాటి శ్రీ రామ రాజ్యం దృశ్య కావ్యం
చూస్తే కనువిప్పు కలుగదూ??