24, మార్చి 2011, గురువారం

కాసేపు నవ్వుకొండి మనసార

నవ్వడం ఒక భోగం

నవ్వలేక పోవడం ఒక రోగం

నవ్వించడం ఒక యోగం

మీకోసము ఒక్క చిన్న ప్రయత్నము;)

వారులేని ఈ బతుకేల?!
"మా వారు తప్పిపోయారని వారం రోజుల క్రితం రిపోర్టు ఇచ్చాను. ఇంత వరకు వారి అచూకీ కనుక్కోలేకపోయారు. ఆయన లేకుండా నేను బతకలేనండీ ... '' రెండు చేతులతో మొఖం కప్పుకుని ఏడ్చింది కోమలి.
"క్షమించమ్మా! మీవారి మీద మీకున్న ప్రేమను అర్థం చేసుకోగలను. ఐనా మా ప్రయత్నం మేం చేస్తూనే ఉన్నాం ...'' జాలిగా అన్నాడు పోలీస్ అధికారి.
"ఆయన వెళ్లినదగ్గర్నుండి ఎక్కడి పనులక్కడే ఆగిపోయాయంటే నమ్ముతారా? ఇల్లంతా మాసిన బట్టలే ... సింకునిండా అంట్లే ... ఏ మూల చూసినా బూజే ... హాటల్ తిండి తినలేక నిజంగానే చచ్చిపోతున్నాను ఎస్.ఐ. గారూ ...'' ఏడుపు ఆపి, కొంగుతో కళ్లొత్తుకుంటూ చెప్పింది కోమలి.
ఏడాదిలో రాత్రులెన్ని?
"సంవత్సరానికి 365 రోజులైతే ... అందులో రాత్రులెన్ని?'' అడిగింది టీచర్.
"పది టీచర్?'' చెప్పాడు టింకూ.
"అదెలా?'' ఆశ్చర్యపోయింది టీచర్.
"ఒక శివరాత్రి, తొమ్మిది నవరాత్రులు... మొత్తం పది'' వివిరించాడు టింకూ వేళ్లు లెక్కబెడుతూ.
ఆర్డర్ - ఆర్డర్
ఒక కేసు విచారణ నిమిత్తం నిషాలో ఉన్న మంగరాజుని కోర్టుకి తీసుకొచ్చి బోనులో నిలబెట్టారు పోలీసులు.
కోర్టు హాల్లో అందరూ మాట్లాడుకోవడం గమనించిన జడ్జి "ఆర్డర్ - ఆర్డర్'' అంటూ గట్టిగా కేకేశాడు.
వెంటనే "ఒక చిల్లీ చికెన్, క్వార్టర్ రాయల్ స్టాక్ విస్కీ తీసుకురా'' జడ్జీకంటే గట్టిగా అరిచి, జనాల్ని చూసి నాలుక కరుచుకున్నాడు గంగరాజు.
యథా గురూ ...
"గోల్డ్ చెయిన్ కరిగిస్తే ఏమొస్తుంది పిల్లలూ?''
"గోల్డు సార్ ... ''
"వెండి చెయిన్ కరిగిస్తే?''
"వెండి సార్ ...''
"సైకిల్ చెయిన్ కరిగిస్తే?''
"సైకిల్ సార్ ...''
" !!!!! .... ???''
'ఉత్త'ర కుమారుడు
"ఐదు సంవత్సరాలనుండి కమలకి ప్రేమలేఖల్ని రాస్తున్నాను తెలుసా?'' విచారంగా అన్నాడు ప్రేమారావు.
"అయితే ఓకె అంటుంది - బాధ పడకు'' ధైర్యం చెప్పాడు మిత్రుడు గోపాల్రావు.
"ఓకె అంది కాని నాతో కాదు, ఈ ఐదేళ్లూ నా ఉత్తరాల్ని అందించిన పోస్టుమాన్‌తో'' అసలు సంగతి చెప్పాడు ప్రేమారావు.
కొళాయి నీళ్లు వాడుతున్నాం!
"మీవారు ఇంటి వెనకున్న బావిలో పడి,పోయారట కదా? పాపం - బాధని ఎలా భరిస్తున్నారో?'' అంది చుట్టంచూపుగా వచ్చిన ఆదిలక్ష్మి.
"భరించక తప్పుతుందా వదినా ? ఎంచక్కా నూతి నీరు వాడుకునేవాళ్లం. ఇప్పుడు కొళాయి నీటి కోసం రెండు మైళ్లు నడవాల్సి వస్తోంది - ఖర్మ'' ఉస్సురంటూ చెప్పింది సుబ్బలక్ష్మి.
కోపం వచ్చింది...
వెంగళప్ప భార్య వెంగళప్పకు రెండు పది రూపాయల నోట్లిచ్చి పది రూపాయలకు వంకాయలు, పది రూపాయలకు దోసకాయలు తెమ్మని బజారుకు పంపింది. వెంగళప్ప హుషారుగా సంచితో బయలుదేరి, కొద్దిసేపటికే వెనక్కి వచ్చేశాడు.
అతడి చేతిలో ఖాళీ సంచి తప్ప కూరగాయలు లేవు. వెంగళప్ప భార్య పట్టలేని కోపంతో ‘‘కూరలేవీ?’’ అని అడిగింది.
‘‘నువ్యు ఏ పదితో వంకాయలు ఏ పదితో దోసకాయలు తెమ్మన్నావో చెప్పలేదు కదా. నన్నంటావేం?’’ అన్నాడు వెంగళప్ప కోప్పడుతూ.
-------------------------------------------------------------------------
"ఈ మధ్య అస్తమానం పళ్లు తోముతున్నావేంట్రా?'' ఆశ్చర్యపోయాడు తండ్రి.
"నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందట నాన్నా - టీచర్ చెప్పింది'' బదులిచ్చాడు నాని.
----------------------------------------------------------------------
70 కిలోలు
‘‘ఏమే లలితా... నెలరోజులు ఎక్సర్‌సైజ్ చేసేసరికి నా బరువు ఆరు కిలోలు తగ్గిపోయింది’’ చెప్పింది కవిత ఆశ్చర్యంగా.
‘‘నెల రోజులకు ఆరు కిలోలేనా?
‘‘నాకు ఒక్క రోజులో డెబ్బయ్ కిలోలు తగ్గిపోయింది తెలుసా?’’ అంది లలిత.
‘‘మైగాడ్ ఎలా?’’ అడిగింది కవిత.
‘‘మా ఆయనకు డైవోర్స్ ఇచ్చేశాను’’ అసలు విషయం చెప్పింది లలిత.
డబ్బులు చాలవ్
చెడు అలవాట్ల గురించి టీచర్ పాఠం చెబుతూ... స్టూడెంట్స్‌కు ప్రశ్నలు వేస్తోంది.
టీచర్: శ్రీకాంత్ నువ్వు చెప్పు బ్రాందీ, విస్కీ లాంటివి తాగొచ్చా?
స్టూడెంట్: తాగకూడదు అని మా డాడీ చెప్పారు.
టీచర్: వెరీగుడ్. తండ్రి అంటే అలా ఉండాలి. మరి ఎందుకు తాగకూడదో చెప్పారా?
స్టూడెంట్: చెప్పారు టీచర్. ఇద్దరం తాగితే డబ్బులు చాలవట.
3 వికెట్లు, 6 పేషెంట్లు
ఊళ్లోని ప్రముఖులంతా కలసి క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు.
ఓ డాక్టర్ బౌలింగ్ చేస్తూండగా ఓ వ్యక్తి మ్యాచ్ చూడ్డానికొచ్చాడు.
‘‘డాక్టరుగారు ఎలా ఆడుతున్నారు?’’ పక్కనున్న వ్యక్తిని అడిగాడతను.
‘‘అదరగొట్టేస్తున్నారు! ఇప్పటికిప్పుడే ఆయనకు మూడు వికెట్లు, ఆరు పేషంట్లు దొరికారు’’.
రోజుకి 25
‘మా మావయ్య, ఒక సంవత్సరంగా పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నాడండీ...’ సైకాలజిస్ట్ దగ్గరకొచ్చి చెప్పాడు శంకర్రావు.
‘‘ఏం చేస్తున్నాడు?’’
‘‘ప్రొద్దున్నుంచీ సాయంత్రం వరకూ కుర్చీలో కూర్చుని చేతుల్లో స్టీరింగ్ ఉన్నట్లు ఊహించుకుని కారు నడుపుతున్నట్లు ప్రవర్తిస్తున్నాడండీ!’’
‘‘అది కారు కాదనీ, కుర్చీ అనీ నువ్వు చెప్పలేదూ?’’
‘‘ఎలా చెప్తానండీ! సాయంత్రం కారు కడిగినందుకు నాకు రోజుకి పాతిక రూపాయలిస్తూంటేనూ!’’
‘‘మరిప్పుడెందుకు ఇక్కడికి వచ్చినట్లు?’’
‘‘ఇప్పుడు కారు తనే కడుక్కుంటున్నాడండీ...’’
చంద్ర వంట
భార్యావిధేయుడయిన రంగారావ్ ఓ మనస్తత్వ వైద్యుడి దగ్గరకొచ్చాడు.
‘‘ప్రతిరోజూ ఒకటే కలండీ! పద్నాలుగుమంది ప్రపంచంలో కెల్లా అందమైన సుందరీమణులతో నేను చంద్రమండలం మీద దిగానట...’’ దిగులుగా చెప్పాడతను.
‘‘ఓరినీ! అంత అద్భుతమయిన కల వస్తూంటే ఆ విచారం దేనికోయ్?’’
‘‘భలేవారే? వాళ్ళందరికీ అన్నం వండిపెట్టడం తేలికనుకున్నారేమిటి?’’ మరింత దిగులుగా అన్నాడతను.
తేడా లేదు!
ఎండాకాలం: వర్షాభావం వల్ల రిజర్వాయర్లు ఎండిపోవడంతో అధికారికంగా విద్యుత్ సరఫరా 6 గంటలు తగ్గించడమైనది.
వర్షాకాలం: అధిక వర్షాల కారణంగా కరెంటు తీగెలు తెగిపడిపోయినందువల్ల విద్యుత్ సరఫరా నిరవధికంగా నిలిపివేయడమైనది.
పెళ్లే పెద్ద గుండె కోత!
భార్య: ఏంటండీ, టీవీ చూస్తూ ఏడుస్తున్నారు. ఏం సీరియల్ వస్తుందేంటి?
భర్త: ఓసి పిచ్చి మొహమా! సీరియల్ అయితే ఎందుకేడుస్తానే, నేను చూస్తోంది మన పెళ్లి సీడీ!
తిట్ల పుట్ట
మామగారు: ఏమోయ్ అల్లుడూ! ఎప్పుడూ మా అమ్మాయిని తిడుతున్నావట?
అల్లుడు: అలా చెప్పి చచ్చిందా ఆ చచ్చు పీనుగ!
నీదీ అదే రూపం!
సుబ్బారావ్: మీ అక్క గుమ్మంలో నిలబడి అస్తమానం నన్నే చూస్తోంది ఎందుకని?
అప్పారావ్: మా అక్కయ్యకు కొండముచ్చులంటే భలే ఇష్టంలేరా!
పంచ్!
టీచర్: ‘నారు పోసినోడే నీరు పోస్తాడు’ లాంటి సామెత ఇంకొకటి చెప్పరా!
స్టూడెంట్: పాఠం చెప్పిన వాళ్లే పరీక్ష రాయాలి టీచర్!
ఇదుంటే చాలు వచ్చేస్తాడు!
యముడు: పిసినారి పాపయ్యను తీసుకురమ్మంటే, అతని ఇనప్పెట్టెను తెచ్చారేంట్రా?
యమకింకరులు: ఇది లేకుండా అతను రావట్లేదు యమా!
పోతే పోనియ్!
కావేరి: అక్కా, ఈరోజు బియ్యంలో రాళ్లు ఏరడం లేదేంటి?
కీర్తన: ఈరోజు నేను ఉపవాసం కదా, వంట ఆయనొక్కరికే!
భళా మీ హస్తవాసి!
డాక్టర్: నేను రాసిచ్చిన మందులతో ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ ఉందా?
పేషెంట్: ఎందుకులేదండీ, పోయినసారి 50 అయితే, ఈసారి 80 తీసుకున్నారు!
ఎటకారం!
భర్త: బంగారంలాంటి పాలు, పిల్లిపాలు చేశావే!
భార్య: గేదెపాలు పిల్లిపాలు ఎలా అవుతాయండీ!
గుడ్డు గుడ్డు.... కోడిగుడ్డు!
బడిలో టీచరు అంటోంది .....!
‘‘రామూ! ఇలా రాస్తే పరీక్షల్లో నీకు కోడి గుడ్లు రాక తప్పదు’’
రాము : అయ్యో వాటితో నాకేం లాభం టీచర్, మేం శాకాహారులం.
బాతుగుడ్డు బబ్లూ...
అల్లరిపిల్లాడైన బబ్లూ కిరాణా షాప్‌కి వెళ్ళి... ‘బాతుగుడ్లు వున్నాయా?’ అని అడిగాడు.
‘లేవు’ అని జవాబిచ్చాడు యజమాని.
మర్నాడు వెళ్లి మళ్లీ అదే ప్రశ్న వేస్తే ‘మా దగ్గర దొరకవు’ అన్నాడు యజమాని.
బబ్లూ రోజూ వెళ్ళి అదే ప్రశ్న వేస్తుండటంతో విసిగిపోయాడు యజమాని.
‘రేపొచ్చి మళ్ళీ బాతుగడ్డు అడిగావంటే కాళ్ళలో మేకులు దిగేస్తా’ అన్నాడు కోపంగా.
ఆ మర్నాడు బబ్లూ మళ్ళీ షాప్‌కి వచ్చాడు.
‘మీ దగ్గర మేకులున్నాయా?’
‘లేవు’
‘అయితే మరి బాతుగుడ్లున్నాయా?’
గండం
‘ఏంటల్లుడూ... బంగారంలాంటి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశావట’
అడిగారు ఆగమేఘాల మీద వచ్చిన మామగారు.
‘మరేం చేస్తారు నాన్నా, ఆయనకు నిద్రలో ప్రాణగండం ఉందని జ్యోతిష్కుడు చెప్పాడు’ అసలు విషయం చెప్పింది కూతురు.

పరిగెత్తాడు ఫ్రెండ్.
బడాయి
రంగారావు ఉత్తరధ్రువం పర్యటనకు వెళ్లొచ్చాడు. మర్నాడు తన స్నేహితులతో యాత్రా విశేషాలు చెబుతున్నాడు.
‘‘అక్కడ ఎంత చల్లగా ఉందంటే... మేం సిగరెట్ ముట్టించడానికి అగ్గిపుల్ల వెలిగించగానే మంట గడ్డకట్టుకుపోయేది. ఎంత ఊదినా ఆరేది కాదు’’ అన్నాడు.
ఇంతలో పక్కనే ఉన్న పాపారావు... ‘‘అందులో గొప్పేం ఉంది? మేం వెళ్లినప్పుడైతే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. మా నోట్లోంచి శబ్దం రావడం ఆలస్యం, మాటలన్నీ గడ్డకట్టుకుపోయేవి. ఆ తర్వాత మా తిప్పలు తిప్పలు కావు. ఆ మాటలన్నిటినీ జాగ్రత్తగా ఏరుకుని వెచ్చబెట్టే దాకా, ఎవరు ఏం మాట్లాడారో తెలిసేది కాదు’’ అని చెప్పాడు.
చల్లని చేయి
"ఎందుకు ఆ డాక్టరు దగ్గరకే ఎక్కువ రోగులు వెళతారు?’’ అడిగాడు ఒకాయన నర్సుని.
‘‘ఎందుకంటే ఆ డాక్టరు చేతి చలువ అలాంటిది. రోజూ గంటకోసారి ఆయన ఫ్రిజ్‌లో చేయి పెడుతుంటారు. అందుకే ఆ డాక్టర్ దగ్గరికే వెళతారు’’ అక్కసుగా అన్నది నర్సు.

విడాకులు
కొత్తగా కాపురం ప్రారంభించిన శ్రీదేవి మొదటిసారిగా భర్తకు వంట చేసి పెట్టింది.
అతను మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆత్రంగా అడిగింది...
‘‘రోజూ ఇన్ని ఐటమ్స్‌తో ఇలాగే వంట చేస్తే నాకేమిస్తారేంటి’’ అడిగింది గోముగా.
‘విడాకులు’ కరుగ్గా చెప్పాడు భర్త తరుణ్.
సిమెంట్...
‘పొద్దున్నుంచి చూస్తున్నా, ఏమైంది మీ ఆయన అసలు నోరు తెరవడం లేదు’ అడిగింది పక్కింటి పంకజం.
‘అదా... పళ్లు కదులుతున్నాయని నిన్న డాక్టర్ దగ్గరకెళ్తే సిమెంట్ పెట్టాలి. రెండు వేలు అవుతుంది అన్నారట. అదేదో నేనే పెట్టుకుంటా అని ఇంట్లో ఉన్న సిమెంట్‌ను పళ్లకు పెట్టుకున్నారు అంతే! అలా ఉండిపోయారు’ చెప్పింది విశాలాక్షి.
ఏం చేస్తానంటే...
రవి: మీ నాన్నగారి జేబులోంచి పది రూపాయలు కింద పడిపోయాయనుకో, ఏం చేస్తావు?
రాజు: పదితో ఏం చేస్తాం, మరో పది అమ్మ ఎక్కడయినా దాచిందేమో వెతుకుతా.

ఒకాయన: ఏయ్! టైలర్! ఈ బట్టలింత పొట్టిగా కుట్టేవేం! గుడ్డ ఏమన్నా మిగుల్చుకున్నావా!
టైలర్: ఆ అదేంలేదుసార్! మీరిచ్చినప్పుడు కొలతంతే. ఎటొచ్చి నేను ఇప్పుడిచ్చానంతే!
తెలివి మీరిన పులి
"ముసలోడా ఆగు ...'' అడవిదారిలో అడ్డుపడి అంది పులి.
"ఈ దారిలో యువకులు చాలామంది వస్తుంటారు. వాళ్లది వేడి రక్తం'' తెలివిగా తప్పించుకోబోయాడు ముసలాయన.
"నా కెందుకో ఈ రోజు కూల్‌డ్రింక్ తాగాలని ఉంది మరి'' చెప్పింది పులి.


పుత్రరత్నం తెచ్చేశాడు
"ఎదురింటి సుబ్బారావుగారి అమ్మాయికి లెక్కల్లో 99 మార్కులొచ్చాయండి'' గొప్పగా చెప్పింది భార్య.
"అవునా? మరి మిగిలిన ఒక్కటీ ఎవరు ఎత్తుకెళ్లారట?'' ఎదురింటివారి గొప్పదనం భరించలేని భర్త సాగదీస్తూ అన్నాడు.
"మిగిలిన ఆ ఒక్కటీ మీ పుత్రరత్నం తీసుకొచ్చేశాడు లెండి'' మరింత వ్యంగ్యంగా సంధించింది భార్య.


పట్టిక ప్రభావం
"అదేంటి అర నిమిషం క్రితం నీ బి.పి.నార్మల్ ఉంది. వెంటనే ఇంతలా పెరిగిపోయిందేం?'' ఆశ్చర్యపోయాడు డాక్టర్ నిర్మల్‌కుమార్.
"సార్ ఎదురుగా ఉన్న మీ ఫీజు పట్టిక ఇప్పుడే చదివాను'' పిడచకట్టుకుపోయిన నాలుకని తడుపుకుంటూ అన్నాడు బ్రహ్మానందం.
పారిపోయింది
"బబ్లూ ... కుక్కపై వ్యాసం రాసుకురమ్మని చెప్పానా? మరెందుకు రాసుకురాలేదు?'' అడిగింది టీచర్."రాద్దామని కుక్కపైన పెన్ను పెట్టగానే పారిపోయింది టీచర్'' చాలా అమాయకంగా మొహం పెట్టి చెప్పాడు బబ్లూ.
వచ్చివెళ్లారు
"మేము మొత్తం 25 మందిమి అన్నా చెల్లెళ్లం తెలుసా?''
"అదేంటి? కుటుంబనియంత్రణ అధికార్లు మీ ఇంటికి రాలేదా?''
"వచ్చారు కానీ, ఇదేదో స్కూలు తాలూకూ క్లాసురూం అనుకుని తిరిగి
వెళ్లిపోయారు''

వెయిటింగ్ రూంలెందుకు?
"ప్రతి రైలూ లేటుగా వస్తే ఈ పనికిమాలిన టైం టేబుల్ ఇక్కడెందుకూ?'' రైల్వే అధికారితో పేచీ పెట్టుకున్నాడు రామానందం.
"ప్రతి రైలూ కరెక్టు టైంకు వస్తే నీవు విశ్రాంతి తీసుకుంటున్న ఈ వెయింటింగ్ రూంలు ఎందుకు?'' మరింతగా మిర్రిచూస్తూ అన్నాడు రైల్వే అధికారి.

నాకూ ఇప్పుడే తెలిసింది
"డార్లింగ్ మనం ఇప్పుడు ఎక్కడి కెళ్తున్నాం?'' మెడచుట్టూ చేతులు వేసి గోముగా అడిగింది ప్రేయసి.
"అనంత దూరాలకు ప్రియా'' కంగారు పడుతూ చెప్పాడు ప్రియుడు.
"అంత దూరమా? ముందే నాకెందుకు చెప్పలేదు?'' అలకతో అంది ప్రేయసి.
"అంత దూరమని ఇందాక వెహికల్ బ్రేకులు ఫెయిలయ్యాకే తెలిసింది'' చెప్పాడు ప్రియుడు.

భయపడేదాన్ని కాను
"నాకు నీ మాటలతో కోపం తెప్పించకు. నాలో జంతువు ప్రవేశిస్తుంది'' అరిచాడు సుబ్బారావు.
"ఆ విషయం నాకు తెలుసు. కాని ఎలుకకి భయపడేంత పిరికిదాన్ని కాను నేను'' మరింత కోపంగా అంది.
సిగ్గు లేదా......
జడ్జి కోర్ట్ బోనులో నిలబడ్డ దొంగను ఉద్దేశించి అంటున్నాడు ఇలా.... 'ఇది మూడోసారి నువ్వు రావడం. నీకు సిగ్గనిపిన్చాడంలేదా ?
దొంగ :మీరైతే రోజు వస్తున్నారుగా !
మీకెందుకు సిగ్గు రావడం లేదు ?
నొప్పి...
పేషెంట్: ఎడమ కాలు నొప్పి పెడుతోంది. ఏంచేయమంటారు?
డాక్టర్: ఆందోళన పడకండి. ఓల్డ్ ఏజ్‌లో ఇలాంటివి సహజమే...
పేషెంట్: నా కుడికాలుకి కూడా సేమ్ ఏజ్ కదా... మరి అదెందుకు నొప్పి పెట్టడం లేదు?

గొప్పలు
తన తండ్రి గురించి కొడుకు ఇలా చెబుతున్నాడు.
‘మా నాన్న పులి, నరసింహ, ఠాగూర్’ అన్నాడు. పక్కనే ఉన్న అతడి ఫ్రెండ్ ఇలా అన్నాడు. ‘అవునా అయితే మీ నాన్నను చూడాలంటే టికెట్టెంత?’ అన్నాడు.

ఆ నలుగురి ఆచూకీ ఎందుకు కనిపెట్టలేకపోతున్నారన్నది మాత్రం ‘మిలియన్’ డాలర్ ప్రశ్నగా మిగుల్తోంది.

మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై జరిగిన విగ్రహాల విధ్వంసం కేసులో టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీష్‌రావు, కె.తారక రామారావులు గత పది రోజులుగా పరారీలో ఉన్నారు. అవును ఇది పచ్చినిజం. అదేంటి నిత్యం వీరు ఏదో ఒక సమావేశంలో పాల్గొంటూ ప్రజల మధ్యే ఉంటున్నారు కదా.. పరారీలో ఉండటమేంటి అన్న ధర్మ సందేహం సగటు మనిషికెవరికైనా రావచ్చు. అయితే పోలీసులకు మాత్రం అలాంటి సందేహం రాలేదు. నవ్విపోదురుగాక మాకేంటి.. అన్నట్లుగా విధ్వంసం కేసులో ఆ నలుగురూ పరారీలో ఉన్నారని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. విధ్వంసం దృశ్యాలున్న టెలివిజన్ చానల్స్ ఫుటేజీ ఆధారంగా వేర్వేరు ప్రాంతాలకు చెందిన 58 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. ఆ నలుగురి ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ కార్యక్రమానికి పిలుపునివ్వడంతోపాటు అనుమతి లేకున్నా ఆ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ తదితరులపై కేసులు నమోదు చేసిన గాంధీనగర్ పోలీసులు.. వారిని అరెస్టు చేయడం మాత్రం మరిచిపోయారు. పైగా తమ తప్పు ఉండకూదనే ఉద్దేశంతో వారంతా పరారీలో ఉన్నట్లుగా చూపుతూ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. అయితే విధ్వంసంతో సంబంధం ఉందనే ఆరోపణలతో ట్యాంక్‌బండ్‌కు సమీపంలోని ఆలయంలో పురోహితుడు పి.శ్రీనివాసాచారి, మచిలీపట్నం ప్రాంతానికి చెందిన పర్యావరణ ఉద్యమకారుడు అడ్డాల నారాయణరావు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి గాంధీ ఆస్పత్రికి వచ్చిన మితేష్, రమేష్ సహానీ, మైనర్ విద్యార్థులు శరత్, సందీప్, న్యాయవాదులు శ్రీరంగారావు, ఆదిత్య, ఇంద్రసేన్‌రెడ్డి, రాము తదితరులపై కేసులు బనాయించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
నిందితుల సంఖ్యను భారీగా చూపేందుకు పదుల సంఖ్యలో యువకుల అరెస్టులు చూపారు. ఇంతమందిని కష్టపడి కనిపెట్టి అరెస్టు చేసిన పోలీసులు... ఆ నలుగురి ఆచూకీ ఎందుకు కనిపెట్టలేకపోతున్నారన్నది మాత్రం ‘మిలియన్’ డాలర్ ప్రశ్నగా మిగుల్తోంది. సంచలనం సృష్టించిన కేసుల్లో హంతకులను పట్టుకునేందుకు మెరికల్లాంటి పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన తరహాలోనే ఆ నలుగురినీ పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఖాకీ బాస్‌లు ప్రకటించినా ఆశ్చర్యపోనక్కరలేదేమో

కీళ్లకు సంబంధించిన సమస్యలు ఎందుకు అధికమవుతాయి?

పొద్దున్నే చలికి వణికిపోతూ తప్పని పరిస్థితిలో పనులున్నాయని లేచి కూర్చుంటున్నారా? మంచం మీద నుంచి కాలు కింద పెడదామంటే భరించరానంత నొప్పిగా ఉంటుందా? నొప్పి నివారణకు అదేపనిగా పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ చలికాలాన్ని ఎలాగోలా గడిపేయాల్సిందే అంటూ నిట్టూరుస్తున్నారా? చలికాలంలో ఎముకలకు, కీళ్లకు సంబంధించిన సమస్యలు ఎందుకు అధికమవుతాయి? వీటి నుంచి రిలీఫ్ పొందడం ఎలా?

చలికాలం శరద్ రుతువు చివరన మొదలై హేమంత రుతువులో బలీయంగా ఉండి శిశిర రుతువు మొదటి భాగం వరకు ఉంటుంది. ఈ కాలంలో ఉత్తర దిక్కు నుంచి వీచే అతి చల్లని గాలుల వల్ల మన చర్మం పొడిబారి, ఎండినట్టుగా అవుతుంది. చలి, రూక్ష గుణం(పొడిబార్చే గుణం) వల్ల వాతం ప్రకోపం చెందుతుంది. ఈ కాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. సరైన వేళలో తగినంత ఆహారం తీసుకోకుంటే ఈ అగ్ని శరీర ధాతువులను వికృతం చేస్తుంది. భోజన వేళలు పాటించకపోతే వాతం వృద్ధి చెందుతుంది. అధిక ప్రయాణాలు, రాత్రిపూట ఎక్కువ సమయం మేల్కొని ఉండటం, పగలు నిద్రించడం, చల్లని గాలులు అధికంగా ఉండటం... వల్ల వాతం ప్రకోపం చెంది (పెరిగి) అది శరీరంలో వివిధ అవయవాలలో చేరి అనేక వ్యాధులను కల్గిస్తుంది.
ఆమవాతం (రుమటాయిడ్ ఆర్థరైటిస్):

శరీరంలోని ఆమం (అన్‌డెజెస్టైడ్ మెటీరియల్) ప్రకోపించి వాతంతో అనేక జాయింట్స్‌కు చేరి, అక్కడ తీవ్రమైన నొప్పిని, వాపును, మంటను కలిగిస్తుంది. ఈ వ్యాధులకు కారణభూతమైన ఆమం శరీరంలో విషంతో సమానమైంది. మిగిలిన కాలాలతో పోలిస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ చలికాలంలో తీవ్రంగా ఉండి అమితమైన బాధకు గురిచేస్తుంది. ఈ వ్యాధి కేవలం జాయింట్స్‌లోనే గాక శరీరమంతా విస్తరించడంతో ఉదయం పూట శరీరం కదలించలేకపోతారు. ఆకలి మందగిస్తుంది. జ్వరంగా ఉంటుంది. కీళ్లలో తేలు కుట్టినంత నొప్పి ఉంటుంది. మలం దుర్వాసన వస్తుంది. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే కీళ్లు పూర్తిగా స్తంభించిపోయి, శరీరాన్ని కదిలించలేకపోతారు. మెల్లగా గుండెకు కూడా పాకుతుంది. తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండానే మళ్లీ తినడం, మసాలాలు, నూనె ఉన్న పదార్థాలు, మాంసాహారం, రాత్రిపూట పొద్దుపోయిన తర్వాత భుజించడం... వంటి కారణాల వల్ల ఈ వ్యాధి ఎక్కువవుతుంది. సంధివాతం, ఆమవాతంలలో కీళ్ల నొప్పులు వస్తాయి. చలికాలంలో అధికమవుతాయి. అయితే ఈ రెండింటి చికిత్సలో పూర్తి విరుద్ధమైన చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. ఆమవాతం ఉన్నవారికి మొదట ఆకిలిని, జీర్ణ శక్తిని పెంపొందించాలి. కీళ్లలో ఉండే ఆమం (ఇన్‌డైజేషన్ మెటీరియల్)ను కరిగించే పాచన చికిత్స అనే ప్రక్రియ ద్వారా బయటకు పంపేయాలి. ఈ చికిత్సలో వాలుకాస్వేదం, ధాన్యామ్లధార, కషాయధార, వస్తికర్మ, విరేచనం వంటి శోధన చికిత్సలు, ఔషధాలతో కలిపి శమన చికిత్స చేయాలి. శమన చికిత్సలో భాగంగా షడ్‌ధరనచూర్ణం, ఎరండతైలం, సింహనాదగుగ్గులు, ఆమవాతంరస్, షడ్గుణ సింధూరం, వాతగజాంకుశరస్ వంటి ఔషధాలు వాడాలి.
ముందు జాగ్రత్తలు:
ఆమవాతం లక్షణాలు కనిపించినప్పుడు సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఎప్పుడూ గోరువెచ్చని నీరు తాగాలి. భోజనం చేసిన వెంటనే కనీసం వంద అడుగులు నడవాలి. శొంఠి చూర్ణం, బియ్యం కడుగును వేడినీళ్లతో సేవిస్తే ఉపశమనం పొందవచ్చు. ఈ ఆమవాతానికి ఉదయం పూట చిన్న చిన్న యోగాసనాలు చేస్తే మార్నింగ్ స్టిఫ్‌నెస్ నుంచి విముక్తి పొందవచ్చు. గృధ్రసీ వాతంలో కాళ్లు తిమ్మిరి పట్టడం, నడుంనొప్పి వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే భుజంగాసనం, వజ్రాసనం వంటి ఆసనాలు, వేడినీళ్లతో స్నానంతో ఉపశమనం పొందవచ్చు. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. కాస్త గట్టిగా ఉండే పడకమీద నిద్రించాలి. రాత్రిళ్లు ఎక్కువసేపు మేలుకోకూడదు. ఈ కాలం శరీరంలో వాతం ప్రకోపించడం వల్ల నొప్పులు (కండరాల నొప్పి), శరీరం పట్టేసినట్టు ఉండటం, సైనసైటిస్, బద్దకంగా అనిపించడం సాధారణ లక్షణాలు. అధిక రూక్షత్వం (పొడిబారడం) వల్ల చర్మం పొడిగా ఉండి దురద, పగుళ్లు, చుండ్రు ఎక్కువవుతాయి. చలికాలంలో ప్రతీ ఉదయం సాధారణంగా మన ఇళ్లలో లభించే నువ్వుల నూనెతో శరీరం అంతా మర్దన చేసుకోవడం, ఉష్ణ జల స్నానం, వేడిని కలిగించే వస్ర్తాలతో శరీరాన్ని కప్పి ఉంచాలి. శీతల పానీయాలను తీసుకోకూడదు. తప్పనిసరిగా నెయ్యి భోజనంలో వాడాలి. పైన చెప్పిన పంచకర్మచికిత్సలు వ్యాధులను తగ్గించడమే కాకుండా, వ్యాధి రాకుండా చేస్తాయి. అయితే ఈ పంచకర్మలను నిపుణుల పర్యవేక్షణలోనే చేయించుకోవాలి.
సంధివాతం (ఆస్టియో ఆర్ర్థరైటిస్):
ఈ వ్యాధి ప్రకోపిస్తే వాతం సంధుల (కీళ్లు)లో చేరి ఎముకల అరుగుదలకు కారణమై వాపు, నొప్పి, తిత్తివటిస్పర్మ వల్ల ఎముకల మధ్య ఖాళీ ప్రదేశం తగ్గుతుంది. కాళ్లను కదిలించినప్పుడు తీవ్రమైన నొప్పితో బాధపడతారు. నడవలేరు. వ్యాధి తీవ్రావస్థలో నడవకున్నా విపరీతమైన బాధ కలుగుతుంది. ఈ వాతం కారణంగా కీళ్ల వద్ద ఎముకలను పట్టి ఉంచే డిస్క్ ముడుచుకొని ఉంటాయి. స్ర్తీలలో రుతుస్రావం ఆగిపోయిన తర్వాత, చిన్న వయసులో గర్భాశయం తొలగించినప్పుడు కలిగే హార్మోన్ల అసమతుల్యం వల్ల, అధిక బరువు కారణంగా ఎముకల మీద ఒత్తిడి పెరిగి ఎముకలలో పటుత్వం తగ్గి ఈ వ్యాధితో బాధపడాల్సి వస్తుంది.
చికిత్స:
రోగి వయసు, శక్తిని బట్టి శమన, శోధనకర్మ చికిత్స చేయాలి. శోధన చికిత్స శరీరంలో ఉండే అనేక విషపదార్థాలను బయటికి పంపడమే కాకుండా నీరసపడ్డ జీవకణాల్లో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. వ్యాధి పూర్తిగా శోధనం అయిన తర్వాత శమన చికిత్స (ఔషధా లు) ద్వారా పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. ఈ సంధివాతానికి చికిత్సలో అభ్యంగస్వేదనం చేయాలి. అభ్యంగన వల్ల శరీరంలోని అన్ని జాయింట్లలో కదలికలు సాధారణ స్థితిలో కల్పించవచ్చు. ఈ అభ్యంగ చికిత్సలో అవసరాన్ని బట్టి పత్రపోటల స్వేదం, కాయసేకం, వస్తికర్మ, షస్టికశాలిపిండస్వేదం, రక్తమోక్షణం (జలగలచే చెడు రక్తం తీయడం) వంటి పంచకర్మ ప్రక్రియల ద్వారా చికిత్స చేయాలి. వీటిలో వస్తికర్మ చాలా ప్రధానం. అయితే దీన్ని వైద్యుల పర్యవేక్షణలోనే చేయాలి. తైల అభ్యంగం, వేడినీటి స్నానం ద్వారా మంచి ఉపశమనం కలుగుతుంది.

కీళ్లనొప్పులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కాల్షియం అధికంగా ఉండే పాలు, పెరుగు, మజ్జిగ, ఘృతం(నెయ్యి),

కీరదోస... లను విరివిగా తీసుకోవాలి. వ్యాయామాలు ఎక్కువగా చేయకూడదు.

మెట్లు, కొండలు, గుట్టలు ఎక్కడం, కింద కూర్చోవడం వంటివి చేయకూడదు.

చల్లని నీటితో స్నానం చేయకూడదు.

తీపి, పులుపు రసాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

దుంపకూరలు, శనగపిండి తీసుకోకూడదు.
చలి కాలంలో బాధించే వ్యాధులు...
సంధివాతం (ఆస్టియో ఆర్ర్థరైటిస్), ఆమవాతం (రుమటాయిడ్ ఆర్ర్థరైటిస్), కటిశూలం (లో బ్యాకేక్), గృధ్రసీ (సయాటికా), అస్థిచ్యుతి (డిస్క్ ప్రొలాప్స్), శిరశ్శూల (మైగ్రెయిన్), అస్థి సౌషీర్యం (ఆస్టియో పోరోసిస్), వాతవహసిర (వేరికోస్‌వైన్స్), ఆర్జిత వాతం (ఫేసియల్ పెరాలసిస్), పక్షవాతం (పెరాలసిస్), నిద్రానాశనం (ఇన్‌సామ్నియా)... మొదలైనవి.
గృధ్రసీ వాతం (సయాటికా):
నడుములో నొప్పి మొదలై, కాలి బొటనవేలి వరకు లాగినట్లు నొప్పి ఉంటుంది. వెన్నెముకలో పూసలు (వర్టిబ్రే) అస్థచ్యుతి జరగడం, అరగడం, ఎముకల మధ్య ఉండే స్నాయువు (డిస్క్) ముందుకు జరగడం వల్ల అక్కడి నుంచి మొదలయ్యే నరాల మీద ఒత్తిడి పడి ఆ నరం శరీరంలో ఎక్కడి వరకు వెళుతుందో అంతమేరకు సూదులు పొడిచినట్టుగా నొప్పి, బాధ, తిమ్మిర్లు కలుగుతాయి. దీంతో రోగి కుంటినట్లు నడుస్తాడు. ఈ వ్యాధి వల్ల ఎక్కువసేపు నిలబడలేక , కూర్చోలేక, నడవలేకపోతాడు. ఎగుడు దిగుడు ప్రదేశాలలో నడవడం, అధిక ప్రయాణం, సరైన పరుపు, పాదరక్షలు వాడకపోవడం, నడుముకు దెబ్బ తగలడం, ఎక్కువ సేపు కూర్చొని ఉండటం, అధికబరువు మోయడం, తీవ్రమైన మలబద్ధకం మొదలైన వాటి వల్ల, పైన చెప్పిన వాత ప్రకోప కారణాల వల్ల వాత ప్రకోపం జరిగి నడుము ఎముకలలోని సందులలో కదలికలు ఏర్పడి ఈ వ్యాధి వస్తుంది.
చికిత్స:
విరేచనం, వస్తికర్మ, కటివస్తికామసేకం, పత్రపోటలీ స్వేదం, షష్టికశాలి పిండస్వేదం మొదలైన శోధన కర్మలు ఈ సమస్యకు ఉపయుక్తంగా ఉంటాయి. వీటితో పాటు శమన చికిత్సలో భాగంగా బృహత్‌వాతచింతామణి, త్రయోదశాంగ గుగ్గులు, రసరాజరసం, యోగేంద్రరసం, రాస్నాసప్తక కషాయం.. అవసరం మేరకు వాడాలి.

వాతం ప్రకోపం చెంది శిరస్సును చేరినప్పుడు మైగ్రేన్, కళ్లనొప్పి, నిద్రానాశనం (ఇన్‌సామ్నియా) వస్తాయి. ఇతర హార్మోన్ సంబంధిత వ్యాధులను కలిగించే వాతం జీర్ణాశయం చేరినప్పుడు గ్యాస్‌ట్రబుల్, మలబద్ధకం, పైల్స్‌ను కలిగిస్తుంది. రక్తంతో చేరినప్పుడు శరీరంలో అనేక రకాలైన పుండ్లను, సిరలలో చేరినప్పుడు వేరికోస్ వెయిన్స్‌ను, గౌట్ కలిగిస్తుంది. వాతం - ఎముకలు, మజ్జతో చేరినప్పుడు కీళ్లనొప్పి, ఆస్టియోపోరోసిస్ కలిగిస్తుంది.

కిడ్నీని కాపాడుకుంటే గుండెను రక్షించుకోవచ్చు.

రక్తాన్ని శుభ్రపరిచే అద్భుత యంత్రం కిడ్నీ ఒక్కసారిగా మూలనపడితే...! శరీరంలో మలినాలన్నీ పేరుకుపోయి వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం అయిపోతాయి. రక్తపోటు పెరిగి గుండె, మెదడు లాంటి ప్రధాన అవయవాలు కూడా దెబ్బతింటాయి. క్రానిక్ కిడ్నీ వ్యాధికి గురైనవారిలో గుండె దెబ్బతినడం వల్ల సగం మంది మృత్యువాత పడుతున్నారు. అందుకే కిడ్నీని కాపాడుకుంటే గుండెను రక్షించుకోవచ్చు.

శరీరంలోని మలినాలను అన్నింటినీ ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తూ ఉండే ప్రధాన అవయవం కిడ్నీ. శరీరంలోని అన్ని భాగాల నుంచి సేకరించిన రక్తాన్ని వడపోసి, ఆ మలినాలను మూత్రం రూపంలో బయటకు పంపిస్తుంది. కిడ్నీలో ఉండే నెఫ్రాన్‌లు ఈ వడపోతకు ఉపయోగపడతాయి. అనేక రకాల కారణాల వల్ల ఇలా కిడ్నీ పనితీరు దెబ్బతినడం వల్ల రక్తం వడపోత ప్రక్రియ సజావుగా సాగదు. ఫలితంగా రక్తం సక్రమంగా శుభ్రం కాదు. మలినాలన్నీ పేరుకుపోవడం వల్ల శరీరంలోని అవయవాలన్నీ దుష్ప్రభానికి లోనవుతాయి. రక్తపోటు పెరగడం వల్ల గుండెకు హాని కలిగే ప్రమాదం ఎక్కువ.

చాలా రకాల జబ్బులు కిడ్నీ దెబ్బతినడానికి కారణం అవుతాయి. మధుమేహం, అధిక రక్తపోటు, క్రానిక్ గ్లోమెర్యులో నెఫ్రైటిస్ (గ్లోమెర్యులస్ వాపు), పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ (కిడ్నీలో సిస్ట్‌లుఏర్పడటం), కుటుంబంలో ఎవరికైనా కిడ్నీవ్యాధులుంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంది. పెయిన్ కిల్లర్లు అతిగా వాడటం వల్ల కూడా కిడ్నీలు దెబ్బతింటాయి. కిడ్నీ పనితీరు బాగుంటే గుండెతో పాటు మిగిలిన అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి.

గుర్తించడం కష్టమే!
సాధారణంగా కిడ్నీ పూర్తిగా దెబ్బతినేవరకు పైకి ఎటువంటి లక్షణాలూ కనిపించవు. చాలా సందర్భాల్లో ఇతర జబ్బుల కోసం మూత్ర,రక్త పరీక్షలు చేసినప్పుడు సమస్య బయటపడుతుంది.

చాలామందిలో కిడ్నీ పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ ఏర్పడే మూత్రం పరిమాణం మాత్రం సాధారణంగానే ఉంటుంది. కానీ వాటిలో మాత్రం వ్యర్థ పదార్థాలన్నీ పోవు. మూత్ర పరిమాణం మామూలుగానే ఉండటం వల్ల కిడ్నీలో సమస్య ఉందనే అనుమానం రాదు.

కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు అనేక రకాల లక్షణాలు మూకుమ్మడిగా కనిపిస్తాయి. ఆకలి లేకపోవడం, వాంతులు, వికారం, గుండె చుట్టూ వాపు, నాడుల్లో సమస్యలు, మానసిక స్థితి సక్రమంగా ఉండకపోవడం, మగతగా ఉండటం, ఫిట్స్ రావడం, అపస్మారక స్థితిలోకి కూడా వెళ్లవచ్చు. ముఖం, పాదాల్లో వాపు, రక్తపోటు పెరగడం, రక్తహీనత, ఎముకల సమస్యలు, ఎలక్ట్రొలైట్ల పరిమాణంలో మార్పులు... ఈ లక్షణాలన్నింటినీ కలిపి యూరేమియా అంటారు.

టెస్ట్‌లే శరణ్యం
అల్బుమిన్, ప్రొటీన్ల మోతాదు తెలుసుకోవడం కోసం మూత్ర పరీక్ష చేస్తారు. క్రియాటినిన్, సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్‌ల మోతాదు రక్తపరీక్షలో తెలుస్తుంది. అవసరాన్ని బట్టి అల్ట్రాసౌండ్, సిటి స్కాన్, కిడ్నీ బయాప్సీ చేయించుకోవాల్సి ఉంటుంది.

మధుమేహం, అధిక రక్తపోటు లాంటి సమస్యలు ఉన్నాలేకపోయినా కిడ్నీ దెబ్బతింటే గుండె కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి రీనల్ ఫెయిల్యూర్‌ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఒకసారి కిడ్నీ పూర్తిగా దెబ్బతింటే గుండ పాడయ్యే అవకాశం 20 నుంచి 30 వంతులు అధికంగా ఉంటుంది. రక్తపోటును అదుపులో ఉంచుకోవడంతో పాటు, ప్రొటీన్‌ను మూత్రం ద్వారా వెళ్లిపోవడాన్ని తగ్గించగలిగితే కిడ్నీనే కాదు గుండెనూ కాపాడుకోవచ్చు.
నివారణ - చికిత్స
కిడ్నీలు దెబ్బతినడానికి గల కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ తగ్గాలంటే ముందుగా చేయాల్సింది రక్తపోటును నియంత్రించడం. ప్రొటీన్లు త క్కువగా తీసుకుంటే డయాలసిస్ అవసరాన్ని తగ్గించవచ్చు. కాబట్టి మాంసాహారం ద్వారా వచ్చే ప్రొటీన్‌ను తీసుకోకూడదు. పొటాషియంను తగ్గించాలి. కాబట్టి పండ్లు, పండ్ల రసాలను తీసుకోవద్దు. ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండే మాంసం, సోయాబీన్స్, డ్రై ఫ్రూట్స్ జోలికి వెళ్లకపోవడం మంచిది. తక్కువ కొవ్వు ఉండే ఆహారం, రక్తంలో చక్కెరలను నియంత్రించడం, ధూమపానానికి దూరంగా ఉండటం ద్వారా కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తపడాలి.

మధుమేహం ఉన్నవాళ్లు చక్కెరల శాతం పెరగకుండా మరింత జాగ్రత్తపడాలి. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుంది. కాబట్టి ఎరిత్రోపాయిటిన్, ఇనుము సప్లిమెంట్లు తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. కిడ్నీ పూర్తి స్థాయిలో దెబ్బతిన్నప్పుడు డయాలిసిస్ తప్పనిసరి అవుతుంది. అవసరాన్ని బట్టి హీమోడయాలిసిస్ లేదా పెరిటినియల్ డయాలిసిస్ గానీ చేయాలి. చివరి దశలో కిడ్నీమార్పిడి తప్ప మార్గం లేదు. మనదేశంలో ఏటా సుమారు రెండు లక్షల మందికి పైగా కిడ్నీ ఫెయిల్యూర్‌కి గురవుతున్నారు. వీరిలో చాలామంది గుండె దెబ్బతినడం వల్లనే మరణిస్తున్నారు. కిడ్నీ వ్యాధిని ముందుగా గుర్తించగలిగితే రెండింటినీ కాపాడుకునే వీలుంటుంది.

* అధిక రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంచుకోవడం

* ప్రొటీన్ల మోతాదు తగ్గించడం

* మాంసాహారం, పండ్లు, పండ్ల రసాలు వద్దు.

* ధూమపానానికి దూరంగా ఉండాలి.

* సోయాబీన్స్, డ్రైఫ్రూట్స్, కొవ్వు పదార్థాలు తీసుకోవద్దు

ఒత్తిడి భారం తగ్గాలంటే

నగరాల్లో పెరుగుతున్న పని భారం వల్ల ఒత్తిడి బారిన పడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దీనివల్ల గుండెజబ్బులు, రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధులు వచ్చిపడుతున్నాయి. అందుకే ఒత్తిడిని అధిగమించడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. జీవనశైలి మార్చుకోవడం, పని ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల వ్యాధులు రాకుండా చూసుకోవచ్చని వారు అంటున్నారు.

మెడిటేషన్, యోగ

మెడిటేషన్, యోగ వల్ల ఒత్తిడి దూరమవుతుంది. సూర్యనమస్కారాలు, ప్రాణాయామం వంటివి క్రమం తప్పకుండా చేయడం అలవాటు చేసుకోవాలి.
నిద్ర
ఒత్తిడి భారం తగ్గాలంటే కంటి నిండా నిద్ర పోవాల్సిందే. ఒత్తిడి నుంచి బయటపడటానికి మనసుకు, శరీరానికి తగినంత సమయం అవసరం. నిద్రలో శరీరానికి కావలసిన విశ్రాంతి లభిస్తుంది. సరిపడా నిద్ర పోతే ఒత్తిడి తాలూకు ఛాయలు కనిపించవు.
సమయానుగుణంగా..
ఆఫీసు వ్యవహారాలను, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే ఒత్తిడి లేకుండా ఉంటుంది. అందుకోసం ప్రణాళికతో వ్యవహరించాలి. పనిని వాయిదావేయకూడదు. సమయానుగుణంగా నడుచుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు.
నో డ్రింక్
మందు తాగడం వల్ల ఒత్తిడి పోతుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ నిజానికి అది తాత్కాలికంగా ఒత్తిడి తగ్గినట్లు అనిపిస్తుందంతే. రోజూ డ్రింక్‌కు అలవాటు పడటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. డ్రింక్ చేయకపోతే ఉండలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు డ్రింక్ జోలికి వెళ్లకుండా ఉండాలి.

సిగరెట్‌కు దూరం
చాలా మంది కొంచెం పని ఒత్తిడి పెరగగానే సిగరెట్ తాగడం కోసం బయటకు వెళుతుంటారు. సిగరెట్ తాగడం వల్ల రిలాక్స్ అవుతామని వారు భావిస్తుంటారు. కానీ అది తాత్కాలికమే. వాస్తవానికి పొగాకులో ఉండే నికోటిన్ స్పందించే గుణాన్ని మరింత పెంచుతుంది.
ఎక్సర్‌సైజ్
వ్యాయామం చేయడం వల్ల మనసు ఉల్లాసంగా ఉంటుంది. పాజిటివ్ ఆలోచనా ధోరణి పెరుగుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలసట దూరమవుతుంది. దీనివల్ల పనులు పెండింగ్‌లో పెట్టకుండా పూర్తి చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.

22, మార్చి 2011, మంగళవారం

వినే ఓపిక వుందా!!!!

ప్రే.మనాలుగు అక్షరాల పదం...
వంద అర్ధాలు...
వెయ్యి పొరపాట్లు..
పదివేల ప్రశ్నలు...
బట్ నో సింగిల్ ఆన్సర్
కవితలు చెప్పే హృదయం వుంది !ప్రేమించే మనసు వుందిమనసులొన మంచి ఉహ వుందిఉహల లొకం లొ ఒక ఆశ వుందికలసి వుండే కోమలి యెక్కడ వుందొ?చెప్పాలి అంటే చాలా వుంది వినే ఓపిక వుందా

నీ చిరునవ్వు....
మిలియన్ డాలర్లు ఐతే !
నేను కొనలేను నేస్తం....
మిలియన్ రక్తకణాలు ఐతే
ధమనుల్ని సిరల్నీ పిండి ఇవ్వగలను ......

చివరకు మిగిలేది మిత్రులే .....!

కదిలిపొయే కెరటంలా,
సాగిపొయే నావ లాంటి నా జీవితం లొ....
ఆశల హరివిల్లు పూయిస్తూ ఆప్యాయంగా
పలకరించిన మిత్రమా!
అరుణొదయ సంద్య లొగిలిలొ...
సుఖదు:ఖాల జీవిత సంగమం లో
చివరకు మిగిలేది మిత్రులే .....!
మరో సూర్యుడు నాకోసం ఉదయిస్తే
నేను మరో జన్మలొ మనిషి గా జన్మిస్తే నీలాంటి స్నేహితురాలి మమతానురాగాలు కోసం
ఎన్నిసార్లు అస్తమించడానికైనా నేను సిద్దమే .....!

తేలివిగల వ్యాపారీ ఇక నుంచి వ్యాపారాలు నుంచి తప్పుకుంటాడంట!!!!

కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి షాక్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధమయ్యారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఆటాడుకున్న గాలి జనార్దన్ రెడ్డి కార్యకలాపాలకు క్రమంగా బ్రేక్ పడుతోంది. తాజాగా, గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన బ్రహ్మణి ఇండస్ట్రీస్‌కు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం అయింది. పరిశ్రమల శాఖ తయారు చేసిన నోటీసును జారీ చేయడానికి న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. "ఒప్పందాన్ని ఉల్లంఘించారు. మూడేళ్ళలో తొలి దశ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉండగా కనీసం పది శాతం పని కూడా పూర్తి కాలేదు. ఒప్పంద ఉల్లంఘన జరిగినందున స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించిన భూములు ఎందుకు వెనక్కి తీసుకోకూడదు?'' అంటూ పరిశ్రమల శాఖ తన నోటీసులో పేర్కొంటోంది.


2007 మార్చి 26న అట్టహాసంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధ్యక్షతన కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై గాలి జనార్దన్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి బి. శ్యాంబాబులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం కంపెనీ మూడేళ్లలో తొలి దశ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. పరస్పర అంగీకారంతో ఈ గడువును పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే పొడగింపునకు ఇప్పుడు అవకాశం లేదని తెలుస్తోంది. కొద్ది రోజుల కిత్రమే పరిశ్రమల శాఖ బ్రహ్మణీ ఇండస్ట్రీస్ నుంచి ప్రాజెక్టు ప్రగతిపై నివేదిక కోరింది. ఈ నివేదికలో కంపెనీ 10760 ఎకరాల భూమి లెవలింగ్ పనులతోపాటు కాంపౌండ్ నిర్మాణం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ ప్రాజెక్టుపై 1350 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించారు.

కొంత మేర బ్లాస్ట్ ఫర్నేస్ మెషీనరీ ప్రాజెక్టులో వెచ్చించామని, మరికొంత మొత్తంతో మెషినరీకి ఆర్డర్ చేసినట్లు తెలిపారు. ప్రతిపాదిత స్టీల్ ప్లాంట్ కోసం సర్కారు కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో అంబవరం వద్ద 10760 ఎకరాలు కేటాయించింది. ఈ ప్రాజెక్టు విషయంలో కంపెనీ కనీస ప్రగతి కూడా చూపించలేకపోయినందున భూ కేటాయింపులు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసు జారీ చేస్తున్నారు.

ఈ సంస్థకు ప్రభుత్వం ఎకరా 18 వేల రూపాయల లెక్కన కేటాయించింది. బ్రహ్మణీ ఇండస్ట్రీస్ కోర్టుకు వెళ్లకుండా భూమి వెనక్కి ఇవ్వటానికి అంగీకరిస్తే ప్రభుత్వం ఈ భూమి ధరకు సంబంధించి కంపెనీ చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీకి కేటాయించిన 10760 ఎకరాలను తనఖా పెట్టి బ్రహ్మణీ ఇండస్ట్రీస్ బ్యాంకుల నుంచి రూ.350 కోట్ల రుణం పొందింది. ఇప్పుడు ఈ సంస్థకు కేటాయించిన భూములు వెనక్కి తీసుకుంటే ఈ రుణాన్ని ఎవరు చెల్లించాలన్నది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. తనకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే కావచ్చు, తాను వ్యాపారాల నుంచి తప్పుకుంటానని జనార్దన్ రెడ్డి ఇటీవల ప్రకటించారు

నీ ఉనికి చాటారా నీ సత్తా చూపారా

ఇది తెలంగాణా విజయమా,
తెలుగు ప్రజానీకానికి జరిగిన అవమానమా,
ప్రజా ప్రయోజనానికై జరుగుతోన్న సంఘర్షణా,
స్వప్రయోజనానికై చేస్తున్న దీక్షా కండమా
ఆనాడు తెల్ల దొర చేతిలో చీలింది దేశం,
ఈనాడు తెల్ల దొరసాని చేతిలో చెల్లా చెదురు
అవుతుంది రాష్ట్రం
నేతల ప్రయోజనాలకు చీలుదామా,
సమైక్య ఆంధ్రకు జై అందామా
సమస్యకు సమాదానం నేవే తమ్ముడా,
అగ్గి బారుట పట్టుకొని పోరాడే వీరుడా
తెలుగువీర లేవరా సమైక్యాంధ్ర కోరరా,
నీ ఉనికి చాటారా నీ సత్తా చూపారా

అమ్మను చంపి రక్తపుటేరులు పారిస్తూ శవాల మీద సాగించే ఈ కరాళ నృత్యం ఇంకా ఎన్నల్లు

రగులుతున్న ఆంధ్రావని ఎందరో త్యాగధనుల పుణ్యభూమి
నేడు రాజకీయాలకు బలై ఖండమై పోయింది
ముక్కలు చెక్కలై కుక్కలు చింపిన విస్తరిలా మారబోతుంది
అన్నదమ్ములు దాయాదులై తల్లిని పంచుకుంటారా
ఏది తెలంగానం ఏది ఆంధ్రరాజ్యం ఏది సీమరత్నం
కులాల చిచ్చు నేడు భాషకు కూడా పాకిందా..
పూర్ణ భోజనాన్ని చేతులారా కుక్కలపాలు చేస్తారా.
స్వార్థ రాజకీయాల కుతంత్ర యుక్తులకు బలై
వెర్రి ఆవేశాన్ని నింపుకొని సాగించే ఈ దహనకాండ
మారణ హోమం ఎవరి తృప్తి కోసం , ఎవరి మనుగడ కోసం
అమ్మను చంపి రక్తపుటేరులు పారిస్తూ శవాల మీద సాగించే
ఈ కరాళ నృత్యం, పైశాచిక ఆనందం, అఖండ భారతావని
భాషా చరిత్రలో మరో నికృష్ట అధ్యాయం .
సర్వ మానవాళి సిగ్గుతో తలవొంచుకునే దుర్దినం.
ఎవరి స్వార్థం కోసం ఈ అభినవ పద్మవ్యూహం
ఎందరో ఆభిమన్యులు కలి తంత్రాలకు బలై,
సొంత సోదరుల చేతిలో పతనమయ్యే ఈ
అభినవ భారత మహా సంగ్రామం, భాషా సంగ్రామం
ఆగేదేపుడు..దీనికి అంతమెపుడు..పగసేగలు చల్లారేదెపుడు

తెలుగు తల్లి మరో మారు పురిటి నొప్పులు పడుతున్నది

వేల ఏళ్ళ చరిత మనది
ఘనమైన కీర్తి మనది
విశిష్ట సంస్కృతి మనది
విభిన్న పద్ధతి మనది.

కోటిలింగాల శాతవాహనులు
విజయపురి ఇక్ష్వాకులు
ఓరుగల్లు కాకతీయులు
వేంగి చాళుక్యులు
చోళులూ రాయలూ
ఎందరెందరో...
రెండు సహస్రాబ్దుల పాటు
తెలుగు వారిని ఆంద్ర జాతిని
ఒక్క త్రాటి పై నడిపి
ఒకే సంస్కృతి గా నిలిపి
భరత వర్ష మందు
ఆంధ్ర జాతి భళిరా
యని దేశ దేశముల యందు
మన కీర్తిని ప్రజ్వలింప జేసిరి.

వేదాల లో ఉపనిషత్ లలో
రామాయణ భారతం లో
మనమంతా ఒక్కటని
ఆంధ్ర జాతి మనదని
తెలుగు వారం మనమని
చదివి విని ఘర్వ పడే
తెలుగు వారలందరికీ
చెప్ప మనసు రాని గాయం చే
ఏర్పడిన ఐదు వందలేళ్ళ
ఎడబాటును అడ్డు చూపి
ఐదు దశాబ్దాల నుంచి
స్వార్ధ పరులు కొందరు
తెలంగాణ పేరిట
వేరు కుంపటి రేపుతుంటే...

తెలుగు తల్లి మరో మారు
పురిటి నొప్పులు పడుతున్నది
ఈ చీలిక తానోర్వ లేనని
భరత మాతకు మొరపెట్టుకుంటున్నది!

తెలుగు వీర లేవరా తెలంగాణ సోదరా
చీలిక పేరు చెప్పే నాయకుల
నాలుకలు చీల్చి చెండాడరా.
తెలుగు వారలందరం
ఎప్పటికీ ఒక్కటేననీ-
తెలుగు బాష మనదని
ఆంధ్ర జాతి మనదని
మనమంతా ఆంధ్రులమని
భరత మాత బిడ్డలమని-
దిక్కులు పిక్కటిల్లేలా
సమైఖ్యాంధ్ర నినాదాన్ని
యావదాంధ్ర జాతి లో
ఏకమై వినిపించరా.

21, మార్చి 2011, సోమవారం

కనుమరుగవుతున్న పల్లె జీవనం...

మారిపోయిన పల్లె జీవనం... కనుమరుగవుతున్న ఆ ఆత్మీయ జీవితం..ఎదుగుతున్న దేశంలో.... విదేశీ సంపద ఇబ్బడి ముబ్బడిగా వచ్చి వాలుతుంటే అందినంత అందుకోవాలనే ఆత్రంతో నగరానికిపరుగులు పెడుతున్న మన పల్లె వాసులు..నేను కేరింతలు కొట్టిన ఆ చెరువు గట్ట్లు..ఇప్పుడు అంబరాన్ని తాకే కాంక్రీటు ప్లాట్లు.నేను ఎక్కిన ఆ తియ్యటి జామ చెట్టు..నేను కోసిన ఆ అల్ల నేరేడు కొమ్మఇప్పుడు ఆ కాంక్రీటు గోడల మధ్య నీర్జీవంగా వేలాడే ఉయ్యాల దిమ్మ.సాయం సంధ్యల్లో ఆరుబయట కూర్చున్నప్పుడురివ్వున ఎగురుతూ తీతువు పిట్ట చేసే సరాగాలుఇప్పుడు పాశ్చ్యాత్య సంస్కృతి తో వెలిసినబార్లో మనుషులు చేసే వికారాలు.యాంత్రిక జీవనంలో తాత్కాలికంగా..తార్కికంగా...తాంత్రికంగామాట్లాడే మనుషుల మధ్యకు వెళుతున్న ఓ పల్లె జీవులారామీరే మన సంస్కృతీ సౌరభాలకు ప్రతీకలు.మీరే నిష్కల్మషమైన మనసుకు దర్పణాలు.

రాష్ట్రం కొత్తగా సాధించింది ఏమీటి?

నాయకుల సంఖ్యకీ, కుర్చీల సంఖ్యకీ మధ్య సమన్వయం కుదర్చడం కోసం, ఏనాడో మరుగున పడిన మండలిని వెలికి తీసి పదవుల పందేరం మొదలు పెట్టారు. ఈ మండలి పుణ్యమా అని రాష్ట్రం కొత్తగా సాధించింది ఏమీ కనిపించక పోయినా, ఐదేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలని అడపాదడపా జరిపేసుకోడానికి బోల్డంత సాయం చేస్తోంది. దీంతో ఎన్నికలనేవి మరింత బహుళార్ధ సాధకంగా మారిపోయాయి. ఓ ఎన్నికల నోటిఫికేషన్ రావడం ఆలస్యం. సంబంధిత ప్రాంతంలో ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులూ మొదలు పెట్టక్కర్లేదు. ఈ మొదలు పెట్టకపోవడం అన్నది ఏ పద్దు కింద జరుగుతున్నప్పటికీ, ప్రజలు సహృదయంతో 'మోడల్ కోడ్' ఖాతాలో వేసేసుకుంటారు. అధికారులు, ఉద్యోగులకి కొంచం ఆటవిడుపు.ఆశావహులతో పార్టీ ఆఫీసులన్నీ కళకళలాడిపోతాయా? ఏ పుట్టలో ఏ పాముందో అనే భావంతో టిక్కెట్ ఆశించే వాళ్ళు పార్టీ ఆఫీసులో అందరితోనూ సత్సంభాదాలు నెరపుతారా? తమ నాయకుడికి టిక్కెట్ వచ్చేవరకూ, ఒకవేళ వస్తే ఎన్నికలయ్యే వరకూ అనుచరగణానికి అక్షరాలా పండుగేనా? స్వతహాగా కొంత, టీవీ చానళ్ళ పుణ్యమా అని మరికొంత వోటర్లు తెలివి మీరారు కాబట్టి, వాళ్లకి రావాల్సింది వాళ్ళు పోటీలో ఉన్న అందరినుంచీ నిక్కచ్చిగా రాబట్టుకుంటారా? ఇవన్నీ పైకి కనిపించే ప్రయోజనాలు. ఇంకా పెరిగే మద్యం అమ్మకాలు, ఒక్కసారిగా డబ్బు చెలామణి లోకి రావడంతో పెరిగే మార్కెట్ లావాదేవీలు... ఇలా ఒకటేమిటి? వెతికే కొద్దీ ప్రయోజనాలు కనిపిస్తూనే ఉంటాయి.

అసలు నన్నడిగితే, నల్లడబ్బు వెలికి తియ్యడం కోసం రకరకాల స్కీములు ఆలోచించడం, సభల్లో చర్చలు జరిపి సమయం వృధా చేయడం పూర్తిగా అనవసరం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలని ఐదేళ్లకోసారి కాక, ఏడాదికోసారిగా మారిస్తే దాచిన డబ్బంతా చెలామణి లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే, నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా, ఏ వ్యాపారాలు చేసే వాళ్లైనా చివరికి చేరేది రాజకీయాల్లోకే కదా. ఒకసారి వచ్చేసాక, ఐదేళ్ళ వరకూ డబ్బు సంపాదించడమే తప్ప, ఖర్చు చేద్దామన్నా చేసే అవుట్లెట్ ఉండడం లేదిక్కడ. దీంతో, డబ్బు మురిగిపోయి విదేశీ బ్యాంకులవైపు పరిగెత్తుతున్నారు మన నాయకులు. అదే, ఏడాదికోసారి ఎన్నికలైతే, ఎప్పటికప్పుడు లెక్క, జమ తేలిపోతూ ఉంటుంది. అందరికీ సమన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఓ ప్రభుత్వం పాతబడే లోగానే మరో కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది కాబట్టి, ఎవరికీ 'అసలు ప్రభుత్వం ఉందా?' లాంటి సందేహాలు కలగవు. ఆలోచించాల్సిన విషయమే కదూ?

20, మార్చి 2011, ఆదివారం

జీవితం ఒక నిరంతర పోరాటం

ప్రతి పనికి ఒకప్రారంభం.
ఆ పనిని పుర్తి చేయడానికి కొంత ప్రయత్నం.
ఆ ప్రయత్నం ఫలించడానికి ఏకాగ్రత కావాలి.
ఏకాగ్రత కావలంటే విద్య కావాలి.
విద్య కన్నా శ్రద్ధ ముఖ్యమైంది.
శ్రద్ధ లేని విద్య నిష్ప్రయోజనం.
కర్మ శరీరం నుండి,
తెలివి బుద్ధి నుండి,
శ్రద్ధ హృదయం నుండి ఉత్పన్నమవుతాయి.
శ్రద్ధ ఉంటే ఏ రంగమైన విజయం లభిస్తుంది.
జీవితం ఒక నిరంతర పోరాటం ,గెలుపుకు బానిసలు కాకుండా ఓటమికి బాధపడకుండా ముందుకు ఏకాగ్రతతో సాగిపోవాలి.శ్రీకృష్ణుడు భగవద్గీతలో చేయాల్సింది శత్రు సంహారమైనా ప్రశాంతంగా ఏకాగ్రతతో చేయాలంటాదు.

ఆటో వాలా - బాడీ సైకాలజీ :)

హైదరాబాదు ఆటో లో ప్రయాణించే బ్లాగు స్నేహితులకి చిట్కాలు.
ముందు ఆటో వాలా బాడీ సైకాలజీ గురించి తెలుసు కుందాము.
ఆటో వాలా (16-25 వయసు)
ఆటో ఎక్ష్త్రా డబ్బులు ఇవ్వాలి, కానీ ఎఫ్.ఎం రేడియో లేదా కొత్త పాటలు ఫ్రీగా వినవచ్చు. కళ్లు మూసి తెరిచే లోపు చేరుకోవచ్చు.

ఆటో వాలా (25-35 వయసు)
అతను ఎక్కడకు వెళ్ళాలనుకుంటాడో అక్కడకు మాత్రమే వస్తాడు, నెక్స్ట్ స్టాపు అయిన రాడు, సో మీ ఇల్లు అతని ఇంటి పక్కనో, వాళ్ల మామ ఇంటి పక్కనో ఉండేటట్టు చూసుకోండి.

ఆటో వాలా (35-45 వయసు)
వీరి ఆటో లో మీరు ఎక్కాలంటే మీకు కొంచం కరంట్ ఎఫయైర్ మీకు తెలిసి ఉండాలి, లేదా రోజు ఆపీసులో పేపర్లు తిరగవేయాలి, ఎందుకంటే వీరు మీరు ఆటో ఎక్కిన కొద్ది సేపటికి ఏదో ఒక విషయం మీద చర్చ లేవ దీస్తారు. మీరు కూడా కొంచం వంత పాడారు అనుకోండి, మీకు ఇంటిదాకా ఆటో లో ఎక్ష్త్రా గొనక్కుండా వస్తారు.

ఆటో వాలా (45-55 వయసు)
వీరి ఆటో సేఫ్ మనకు, కాని సినమా కి ౧౦ నిమిషాలు ఉందనగా ఎక్కకు అనుకోండి మినిమం ఇంటెర్వల్ కి చేరుకుంటారు. స్లోగా, స్పీడు బ్రేకర్లకు దెబ్బ తగలకుండా వెళ్తారు అన్నమాట.

ఎలాంటి ఆటో ఎక్కాలి .
ఆటోని మీరు పంజాగుట్ట కి వస్తావా అని అడిగారు, పంజాగుట్ట లో ఎక్కడ అని అడిగాడు అనుకోండి, సో మీటరు వేయడు అని అర్థం .

ఆటోవాలా స్లోగా రోడ్డు ఒక పక్కకు వస్తూ మీ వైపుకు వస్తూ ఉంటే పర్లేదు, మీరు ఎక్కడకు రమ్మనా వస్తాడు. ఎందుకంటే అది డెస్పరేట్ శిచివేషన్ అన్నమాట.

మీటరుకు షర్టు చుట్టాదనుకోండి ఇంక మనవాడి ఇష్టం వాట్, టాక్స్ అన్నే మీ మెడ వేస్తాడు అని అర్థం.

ఎలా వెళ్దాం అని అంటే మీ ఇష్టం అంటే, ఇక మీకు ameerpet to Punjagutta పంజాగుట్ట వయా kukatpalli గతి, సో ఎలా వెళ్దాం అంటే లెఫ్ట్ లో అని చెప్పండి. ఎందుకంటే హైదరాబాదు లో చాలామటుకు ఫ్రీ లెఫ్తులు ఉంటాయి.

చివరగా
ఆటో ఎక్కడం మాత్రమే నీవు చెయ్, మీటరు ఆ ఆటోవాలా కి వదిలేయ్.
మీటరు సృష్టించేది ఎవరు, ఫిక్స్ చేసేది ఎవరు, ఇదంతా మిధ్య
మీటరు ఒక్కటె శాశ్వతము, నిత్యము, సత్యము

ఒక్కసారిగా నమ్మకాలన్నీ చెరిగిపోయాయి

నావని గర్వం గా చెప్పుకున్నవి
ఇప్పుడు నన్నే కొత్తగా చూస్తుంటే,
నువ్వెవరని ప్రశ్నిస్తుంటే......


తలచుకుని తలచుకుని మురిసిన జ్ఞాపకాలు,
ఉద్వేగపు క్షణాలు...అన్నీ
నాది పిచ్చితనమంటూ గేలిచేస్తుంటే...


గతపు ఆనవాళ్ళు గుండెల్లో మాత్రం మిగుల్చుకుని
అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను

ఈక్షణంతో అందమయిన జ్ఞాపకాలన్నీ
ఒక్కసారిగా చెరిగిపోయాయి
నమ్మకాలన్నీ భ్రమలుగా మిగిలిపోయాయి

ఆర్టికల్ 19

ప్రజాస్వామ్యానికి ఈమద్య కాలంలో అర్దం మారుతున్నట్టుగా వుంది...కుల మత జాతి వర్ణ లింగ ప్రాంతీయ బాషా బేదాలు లేనిది నా భారతదేశం అని చెప్పటం అంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే...... ఇప్పటి వరకు కులాలు మతాల పేరుతో కొట్టుకున్న మనం ఇప్పుడు ఒక్క అడుగు ముందుకేశాము అదే ప్రాంతీయత.... ప్రతీచోట పని లేని, పస లేని, అధికారంలో లేని పనికిమాలిన పార్టీలకు, చోటా మోట నాయకులకు ఇది ఒక AK 47 లాంటిది... పార్టీ కార్యకర్తలు అంటూ ఒక రౌడి మూకను తయారు చేసి వాళ్ళకు బీరు, బిర్యాని ఇచ్చి ప్రాంతీయత పేరుతో అమాయకులయిన ఒక పదిమందిని కొట్టి పేపర్లో ఫొజులివ్వటం ఈమద్య కాలంలో ఒక అలవాటులా మారింది...

ఆంధ్రప్రదేశ్...

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కలిసి పోరాడిన రోజులు చరిత్ర పుస్తకాలకు పరిమితమయ్యేలా వున్నాయి......నా తెలంగాణా కోటి రతణాల వీణ అన్న పలుకులు ప్రాంతీయత చిచ్చులో అపస్వరాలు పలుకుతున్నాయి.... కుటుంబ పెద్ద అనేవాడు ఎప్పుడు తన కుటుంబం కలిసి వుండాలి అనుకుంటాడు కాని ప్రజా కుటుంబానికి పెద్దలం అని చెప్పుకుతిరిగే ప్రజానాయకులు మాత్రం ఎప్పుడు వీల్లని విడగొడదామా అని చూస్తున్నారు....నా తెలంగాణ.... నా తెలంగాణ అని అరిచే నాయకుల కొడుకులు మాత్రం పక్క దేశంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేయొచ్చు కాని అదే రాష్ట్రంలో పుట్టిన మనకు మాత్రం వాళ్ళ ప్రాంతంలో వ్యాపారాలు చేయకూడదు. నాకు తెలిసి టి.ఆర్.యెస్ వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం అంటుంది కేవలం ఆంధ్ర నుంచి తెలంగాణ రావటానికి, పోవటానికి కూడ ప్రత్యేక వీసాలు పెట్టాలి అని... ఎందుకంటే ఈ పార్టీలో నాయకులకు బాగా తెలిసిన వ్యాపారం దొంగ వీసాలతో పక్క దేశాలకు పంపటం...కాని కష్టంస్ వాళ్ళకు దొరికినప్పటినుంచి ఈ బిజినెస్ బాగా దెబ్బతింది దానితో ఆదాయం కూడా తగ్గింది ఇలా రాష్ట్రాన్ని విడగొడితే వీళ్ళు టాటా, బిర్లా, అంబానీలతో చాలా సులువుగా పోటీపడచ్చు.... కుటుంబంతో పాటు దొంగ వీసాలతో అమెరికా వెళ్ళాడు అని ఆరోపణలు ఉన్న ఒక అధికార పార్టీ నాయకుడు కూడా ప్రాంతీయత, ప్రత్యేక రాష్ట్రం అంటూ అరవటం చూస్తుంటే దొంగే ...దొంగా దొంగా అని అరవటంలాగ ఉంది. మొన్నటికి మొన్న తెలుగు మాజీ హీరోయిన్ పార్టీ పెట్టి ప్రజలకు కనిపించటం మానేసింది......కేవలం రెండు ఎమెల్యే సీట్లు ఉన్న బీజేపీ కూడ ప్రత్యేక రాష్ట్రం అంటుంది పాపం ఈసారి ఆ రెండు సీట్లు కూడ మిగలవని గ్రహిస్తే మంచిది.... కలిసుంటే కలదు బలం ఎదురురాదు ఏ అపజయం అన్న సంగతి గ్రహిస్తే మంచిది. ఈ ప్రాంతీయత అనే జబ్బు కేవలం ఎదో ఒక రాష్ట్రనికే పట్టలేదు మన పక్కన ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఇలా దేశమంతా అంటువ్యాదిలా వేగంగా పాకుతుంది...... దీనికి ప్రజలు అనే వైద్యులు ఓటు అనే వేక్సిన్ తో చంపాలి......

ఈ నాయకులందరు ఒక్కసారి భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 19 చదివితే బాగుంటుంది.... దళితులు మాకు దేవుళ్ళు అనే ఈ పార్టీలు నాయకులు కేవలం అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేయటం, పూల దండలు వేయటమేకాదు ఆయన రాసిన రాజ్యాంగాన్ని కూడా పాటించాలని తెలుసుకుంటే మంచిది...

ఆర్టికల్ 19: " ప్రతీ పౌరుడు భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా స్వేచ్చగా తిరగటానికి, నివశించటానికి అధికారం ఉంది ".

పిచ్చి వాడి చేతికి రాయి దొరికింద‌న్న మాట‌.

టీవీ నైన్ లో మ‌ళ్లీ తిరుమ‌ల‌పై సంవాదం అంటూ స్టోరీ ప్ర‌సారం అయింది. కొంత విష‌యం కొత్త‌ది అయినా, మొత్తం మ్యాట‌ర్ పాత‌దే. తిరుమ‌ల కొండ మీద బోలెడంత అవినీతి జ‌రిగిపోతోంది. అప‌చారం జ‌రిగిపోతోంది. దేవుడి స‌న్నిధి లో జ‌రిగేదంతా త‌ప్పుల త‌డ‌కే. ఒక్క టీవీ నైన్ అనే కాదు, చాలా చానెళ్లు ఈ మ‌ధ్య కాలంలో ఈ రూట్ లో తెగ ప్ర‌చారం చేస్తున్నాయి. ఎందుకు ఇలా జ‌రుగుతోంది. నిజంగానే తిరుమ‌లలో ప‌రిస్థితి అంత దిగ‌జారిపోయిందా.. తిరుమ‌ల వైభ‌వాన్ని దిగ‌జార్చే ప‌నులు ఎందుకు జ‌రుగుతున్నాయి.
దీని వెనుక ఒక లాజిక్కు ఉంది. దీన్ని టీవీ భాష‌లో రేటింగ్ అంటారు. న్యూస్ పేప‌ర్లు, మ్యాగ‌జైన్ల‌ను ఎంత మంది చదువుతున్నారు అనేది తెలుసుకోవాలంటే స‌ర్క్యులేషన్ చూస్తాం. ఎన్ని కాపీలు ప్ర‌చురిస్తున్నారు, ఎన్ని కాపీలు అమ్ముడుపోతున్నాయో చూస్తాం. దాన్ని బ‌ట్టి ఏ ప‌త్రిక కు పాపులారిటీ ఉంది, ఏది టాప్ పేప‌ర్ అన్న‌ది చూస్తారు. దీని ఆధారంగా ఎడ్వ‌ర్ట‌యిజ్ మెంట్ లు ఇస్తారు. టీవీ ఛానెళ్లు వ‌చ్చే స‌రికి రేటింగ్ ఆధారంగా అడ్వ‌ర్ట‌యిజ్ మెంట్లు ఇస్తారు. ఈ రేటింగ్ అన్న‌ది - ప్ర‌తీ అర‌గంట నిడివి లోనూ ఏ ఛానెల్ ఎంత మంది చూస్తున్నారు అనేది లెక్క గ‌డ‌తారు. ఈ దిక్కుమాలిన లెక్క ప్ర‌కారం తిరుమ‌ల మీద వార్త‌లు ప్ర‌సారం చేసిన ప్ర‌తీసారి రేటింగ్ లు వ‌స్తున్నాయ‌న్న సంగ‌తి ఛానెళ్ల‌కు అర్థం అయింది. అంటే పిచ్చి వాడి చేతికి రాయి దొరికింద‌న్న మాట‌.
తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర స్వామిని కానీ, గుడిని కానీ తెర మీద చూపితే చాలు జ‌నం బాగా చూస్తారు. మంచిగా స్వామి వైభ‌వాన్ని , స్వామి మ‌హిమ‌ల్ని చూపించ‌వచ్చు. కానీ, మ‌న మెదడంతా భ్ర‌ష్టు ప‌డితే త‌ప్ప టీవీ ఛానెళ్ల లో హెడ్‌ల స్థాయికి ఎద‌గ‌రు. అందుచేత పుచ్చిపోయిన మెద‌డుతో ఆలోచించే ఈ హెడ్‌లు తిరుమ‌లను కూడా అదే దృష్టి తో చూస్తారు. అందుకే తిరుమ‌ల మీద ప‌దే ప‌దే నెగ‌టివ్ స్టోరీలు చేసి ప్ర‌సారం చేస్తుంటారు. ఎటూ రేటింగ్ వ‌స్తుంది కాబ‌ట్టి మేనేజిమెంట్ లు కూడా అదే ప‌ని గా ప్రోత్స‌హిస్తుంటాయి. ఏ చిన్న పొర‌పాటు దొర్లినా, తప్పిదం చోటు చేసుకొన్నా.. ఆకాశం విరిగి నేల మీద ప‌డిపోతుంది అన్న రేంజ్‌లో ప్ర‌చారం చేస్తుంటారు.
అంత‌మాత్రాన తిరుమ‌ల అంతా స‌వ్యంగా ఉంది, బ్ర‌హ్మాండంగా ఉంది అని చెప్ప‌లేం. కానీ, అంత‌క‌న్నా అవినీతి లో, ఘోరమైన వ్య‌వ‌స్థ‌లో కూరుకొని పోయిన వ్య‌వ‌స్థ లు చాలా ఉన్నాయి. ముమైత్ ఖాన్ అయిట‌మ్ సాంగ్ పెడితే జ‌నం చూస్తార‌ని తెలిస్తే చాలు.. ప్రొడ్యూస‌ర్లంతా గుడ్డ‌లిప్పే డాన్స్ లు ఎందుకు పెట్టిస్తారో ఇది కూడా అంతే. తిరుమ‌ల మీద ఎంత నెగ‌టివ్ చేస్తే, అంత రేటింగ్ అన్న మాట‌. దీనికి తోడు, వీటి మీద చ‌ర్చ‌ల్లో పాల్గొనేందుకు కొంద‌రు ఆస్థాన పండితులు కూడా హైద‌రాబాద్ లో సిద్దంగా ఉంటారు. వీరికి తోడు జ‌న విజ్ఞాన వేదిక వంటి హేతువాద సంస్థ‌లు ఉండ‌నే ఉన్నాయి. భార‌తీయ సంస్కృతి మీద దాడి చేయటం మాత్ర‌మే ఏకైక ల‌క్ష్యంగా ప‌ని చేసే ఈ సంస్థ ల ప్ర‌తినిధుల‌కు భ‌లే ప్ర‌చారం కూడా దొరుకుతుంది.మ‌మ్మ‌ల్ని క్ష‌మించు వెంక‌న్నా.

19, మార్చి 2011, శనివారం

అందరికీ హొలీ శుభాకాంక్షలు!

ఈ రోజు హొలీ పండుగ. మన భారతదేశం వివిధరకాల ఆచారాలు,
సాంప్రదాయాలకు విలువ నిచ్చే దేశం. మన దేశంలో జరుపుకొనే
సరదా పండుగల్లో హొలీ ముఖ్యమైన పండుగ. ప్రధానంగా ఉత్తర
భారతదేశంలో ఈ పండుగని ఆనందోత్సహాలతో అన్ని వయసుల
వారు జరుపుకుంటారు వసంతకాలం రాకకు గుర్తుగా పకృతి అంతా
పచ్చపచ్చగా అగుపిస్తూ సుందరంగా కనులవిందు చేస్తుంది.
ఒకరిపై ఒకరు పిచికారీలతో రంగులు చిమ్ముకుంటూ సరదాగా
ఆడి పాడుకుంటారుమధుర,బృందావనంలలో
శ్రీకృష్ణుడు గోపికలతో రాసకేళి గడిపిన చోట శ్రీ కృష్ణుని విగ్రహాలపై రంగులు
పూసి హొలీ జరుపుకుంటారు.
అందరికీ హొలీ శుభాకాంక్షలు!

మరో చెర్నోబిల్ ఘటన!!!!!!!!!!!!!!!!!

* పుట్టిన , పుట్టబోయే పిల్లలకు కొత్త రోగాలు
* అణు ధార్మికతతో పలు రకాల కాన్సర్ లు
* జపాన్ లో పుట్టబోయే పిల్లలకు ఇక అంగవైల్యమేనా?
* తుడిచి పెట్టుకుపోనున్న జపాన్ ?
* హిరోషిమా ఘటనకంటే తీవ్రంగా రేడియోషన్ ?

జపాన్ లో భూకంపం అనంతరం..అణు విద్యుత్ ప్లాంట్ ల నుంచి వెలువడే రేడియో యాక్టివేషన్ వల్ల కొత్త సమస్యలు తలెత్తున్నాయి. రేడియో యాక్టివేషన్ కు గురైన ఆహారం, పదార్ధాలు తీసుకోవటం వల్ల పుట్టిన , పుట్టబోయే పిల్లలకు కొత్త రోగాలు వచ్చి ..మొత్తం దేశం తుడిచి పెట్టుకు పోనుందా? ఈ ఆందోళన తో అక్కడి సైంటిస్టులు, డాక్టర్లు కొట్టుమిట్టాడుతున్నారు.

టెక్నాలజీ లో అందరి కంటే ముందుండే ..జపాన్ ఈ కొత్త సమస్యను ఏవిధంగా ఎదుర్కొంటుందో అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. జపాన్ లో సంభవించిన భూకంపం తాలూకు ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్ధతో సహా అక్కడి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

భూకంపం వల్ల అణు విద్యుత్ ప్లాంట్ లకు ముప్పు ఏర్పడి ద్వారా అణు ధార్మికత వెలువడటంతో అక్కడి ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దీనిప్రభావంతో నీరు ,ఆహారం కలుషితమవటం ద్వారా పుట్టిన , పుట్టబోయే పిల్లలకు బోన్, లంగ్, లుకేమియా, ధైరాయిడ్ రావచ్చని , ప్రమాదకర స్ధాయిలో కాన్సర్ సంక్రమించే ప్రమాదం వుందని భయపడి చస్తున్నారు.

సముద్రంలో చోటు చేసుకునే రేడియోషన్ గుర్తించటానికి తగిన కొలమానాలు లేవని చైనాలోని పాధాలాజిస్టులు చెపుతున్నారు. గాలిలో కలిసిపోయే రేడియోషన్ వల్ల పంటలు , సముద్ర ఉత్పత్తులు ,తాగునీరు కలుషితం అవుతోందన్న భయం జపాన్ వాసులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. దీని ప్రభావం వల్ల మహిళలకు గర్భవిచ్ఛితి జరిగే ప్రమాదం వుందని డాక్టర్లు వర్రీగా వున్నారు. పురుషులైతే .పునరుత్పత్తి సామర్ధ్యం కోల్పోతారని .. డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

హిరోషిమా ఘటనను తీసుకుంటే నాటి బాధితుల్లో ఎక్కువమంది రేడియోషన్ ప్రభావం వల్ల ఇప్పటికీ అంగవైకల్యంతో బాధపడుతున్నారని చికిత్స చేసిన డాక్టర్లు గుర్తుచేసుకుంటున్నారు. అణు ధార్మికతను ..కొలవటానికి తగిన ప్రామాణికత లేదని జపాన్ సైంటిస్టులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఆసియాదేశాలైన ధాయ్ లాండ్, దక్షిణ కొరియా, తదితర దేశాలు జపాన్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై ఓ కన్నేశాయి.

చెర్నోబిల్ ఘటన దృష్ట్యా తాము ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అక్కడి అధికారులు తెలిపారు. రేడియోషన్ తమ దేశాలకు విస్తరించి ప్రజలకు ముప్పుగా పరిణమించే అవకాశాలకు చెక్ పెట్టేందుకు అన్ని చర్యలు చేపట్టామని వివరించారు.

బుద్ధుని విగ్రహాలని నాశనం చేసిన తాలిబాన్ల

శాంతి స్వరూపుడైన బుద్ధుని విగ్రహాలని నాశనం చేసిన తాలిబాన్ల లాగ తెలుగు జాతి ఘన చరిత్రకి సంకేతాలైన టాంక్ బండ్ మీది విగ్రహాలని ద్వంసం చేసిన తెలబాన్లని జగన్ కించిత్తు విమర్శించక పోవటం ఆశ్చర్యకరం. కాంగ్రెస్ పార్టీలో వున్నప్పుడు పార్లమెంటు సాక్షిగా రాష్ట్ర విభజనకి తాను వ్యతిరేకమని స్పష్టం చేసిన జగన్ ఇప్పుడు సొంత పార్టీ పెట్టాక తన విధానం ప్రకటించక పోవటం శోచనీయం.కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే అవకాశాన్ని పార్టీనుండి బయటకి వచ్చాక జగన్ ఎందుకు సద్వినియోగం చేసుకోవట్లేదు? సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రం తగలబడి పోతున్నా నిమ్మకి నీరెత్తినట్లున్న కాంగ్రెస్, టీడీపీ ల కి పోటీగా తాను కూడా వ్యూహాత్మక మౌనం పాటించటం నేరమే. వైఎస్ పధకాలన్నీ అమలు చేస్తానని డబ్బా కొడుతున్న జగన్, తండ్రి విశ్వసించిన సమైక్య వాదాన్ని ఎందుకు పాటిన్చట్లేదు? రాజ శేఖర రెడ్డి తరచుగా వాడిన పదం "విశ్వసనీయత". కేవలం పదవి కోసమే రాజకీయాలు చేసి ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన నాడు జగన్ రాజకీయ భవిష్యత్తు అంధకారమే అవక తప్పదు.

18, మార్చి 2011, శుక్రవారం

ధైర్యంతొ కట్టుకున్న ఆశల సౌదాలును నేలకూలుస్తూన్నాయి..

నేను జేబులలో అదృష్టాన్ని వేసుకుని రాలేదు.....

గుండెల్లొ సంకల్పాన్ని నింపుకొని వచ్చాను......


నా శరీరానికి సుఖాన్ని అత్తరుగా పూసుకొని రాలేదు....

కష్టాలా శిలువను స్వేదబిందువులతొ తెంచుకొని వచ్చాను....


గతాన్ని నా పిడికిళ్లలొ దాచుకొని....

గుర్రంలా పరుగు తీస్తున్న అలుపెరుగని ఆ కాలాని చూస్తున్నా....

రేపటి నా పయనం ఎటువైపని....


వెలుగు... విధితొ స్నేహమాడుతున్నట్లుంది ... అందుకే

నా జీవిత మార్గానికి దారి చూపలేకపొతుంది....


చీకటి... శూన్యాన్ని ప్రేమిస్తున్నట్లుంది... అందుకే

అసమర్ధుడిగా ఈ సమాజం ముందు నిలబెడుతుంది...


పదే పదే ఓటమి హొయలొలుకుతూ నేరజాణై నన్నుహత్తుకుంటుంది....

గెలుపు అస్వతంత్ర్యయుడిని చేస్తూ అంటరానివాడినని నిందిస్తుంది....


స్వర్గం... నరకంతొ సంధి చేసుకున్నట్లుంది.... అందుకే

సమస్యల సుడిగుండానికి పగలు ఏంటి... రాత్రి ఏంటని... చర్చించుకుంటున్నాయి...


ధైర్యంతొ కట్టుకున్న ఆశల సౌదాలును నేలకూలుస్తూన్నాయి...

మదిలొ ఆశయాలు నిశ్మబ్ధంగా నల్లబారిపొతున్నాయి....


ఎన్ని రాత్రులు గడిచినా ... ఎన్ని పొద్దులు పొడిచినా....

కాంతీ హీనుడిని చేస్తూ ఆనందాని నిక్కచ్చిగా దొచుకొవాలని ....

ఆకలి రాణి నాపై దండాయాత్ర చేస్తూనే ఉంది....

వర్షిస్తున్న చూపుతొ మరొ ప్రపంచం కొసం నా అన్వేషణ....

17, మార్చి 2011, గురువారం

చేదు జ్ఞాపకాలు చెరసాలై బంధిస్తేంటి...?

కదలని పగళ్ళూ..... కలత నిదురలు...

నిట్టూర్పు సెగలు... ఓదార్పులేని దిగుళ్ళూ...

ఎన్నాళ్ళిలా....?

జీవితం అంతా పొరాటం అయిన పర్వాలేదు.... ఓటమి అనుభవానిచ్చే ఆస్ధులని గుర్తుంచుకొ...

నీరాశ ఆకాశంలా కమ్ముకునా చింతలేదు.... ఆత్మసైర్ధ్యమే నీకున్న అంతస్తులని చెప్పుకొ...

వేదనలు చుట్టుముట్టినా బాధపడకు....నమ్మకముంటే నరకం కూడ స్వర్గంగా స్వాగతిస్తుంది...

ఆశయ సాధనలొ స్వార్ధం సరసమాడినా భయపడకు....ఆత్మవిశ్వాసముంటే అపజేయం కూడ ఆవిరవుతుంది...

గేలి చేస్తున్న కాలన్ని చూసి కన్నీరు కార్చకు....వేదిస్తున్న విధిపై పట్టుదలని పణంగా పెట్టు...

మనశాంతి కరువైందని విచారించకు... అది నీ మనస్తతత్వంలొనే దాగుంటుందని గ్రహించు...

ఎదలొ కష్టాలూ... ఎడారులై సేగలురేపితే ఏంటి...?

చేదు జ్ఞాపకాలు చెరసాలై బంధిస్తేంటి...?

సమస్యా వలయాన్ని థైర్యంతొ చేదించాలి...

అవమానాలను చీల్చుతూ... చిరునవ్వుల సౌగంధాలను మదిలొ నింపాలి...

తల్లడిల్లే గుండెపై గెలుపు జెండా ఎగరాలి... మీ నాని...

ఇదేనా మన దేశం

దక్షిణ భారతదేశంలో నోటుకు ఓటు పద్ధతి బాగా ఉందని చెప్పిన వికీలీక్స్ మరో సంచలనాన్ని బయటకు తెచ్చింది.
గత సాధారణ ఎన్నికలకు ముందు 2008వ సంవత్సరంలో అమెరికాతో అణు ఒప్పందం నేపథ్యంలో యూపిఏ ప్రభుత్వంతో కమ్యూనిస్టు పార్టీలు తెగతెంపులు చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం మైనారటీలో పడిపోయింది. అప్పుడు విశ్వాస పరీక్షలో నెగ్గడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్ఎల్‌డి పార్లమెంటు సభ్యులకు ఒక్కొక్కరికి రూ.10 కోట్లు ముట్టజెప్పినట్టు వికీలీక్స్ తాజాగా బయట పెట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత సతీష్ శర్మ నేతృత్వంలో ఈ డబ్బులు పంచినట్టుగా బయట పెట్టింది.

కాగా రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి చెందిన అసదుద్దీన్ ఓవైసీ కూడా ఓటును నోటు పద్ధని అనుసరించారని చెప్పింది. ఎన్నికలలో తమ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాడనికి ఎలా ప్రలోభ పెట్టారో అసదుద్దీన్ బాహాటంగానే ఎలాంటి సంకోచం లేకుండా చెప్పారన్నది. వికిలీక్స్ వెల్లడించిన విషయాలు.

ఉన్నారుగా.... అమాయక ప్రజలు. వాళ్ల జీవితాలు తాకట్టు పెట్టేస్తారు !

అఖిలాంధ్ర ప్రజలకు అభివాదాలు !

అన్నట్లు అఖిలాంధ్ర, సమైక్యాంధ్ర అనొచ్చా ? ఏమో ! ఏమంటే ఏ తంటానో కదా ! అయినా నేను ఆత్మనే కదా ! ఏమన్నా ఫర్వాలేదు. నన్నేమీ చెయ్యలేరు కదా !
ఎలా ఉన్నారు అని కుశల ప్రశ్నలు అడుగలేను. ఆంధ్ర దేశ పరిస్థితి నాకు ఎప్పటికప్పుడు తెలుస్తోంది.

ఏమని చెప్పను నా బాధ ? తెలుగు ప్రజలు పరాయి భాష పాలకుల చేతిలో అవమానింపబడుతున్నారని అప్పట్లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. అసఫ్ జాహీలు, నిజాం నవాబుల కాలంలో తెలుగు భాషకు, తెలుగు వారికి జరిగే పరాభవాలు తట్టుకోలేక తెలంగాణా ప్రాంతంలో విముక్తి కోసం ఉద్యమాలు చేశారు. 1937 లో కుదిరిన ' శ్రీబాగ్ ' ఒప్పందం ప్రకారం మరుసటి సంవత్సరమే ఆంధ్ర రాష్ట్రం వస్తుందనుకుంటే రాజధానిగా మద్రాస్ నగరాన్ని కోరుకోవడంతో వాయిదా పడింది. నిజానికి రాజధాని రాష్ట్రానికి మధ్యన ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మరి మద్రాస్ ( అదే ఇప్పుడు చెన్నై అంటున్నారట కదా ! ) తమిళనాడు రాష్ట్రానికి మధ్యలో ఉందా ! లేదే !

సరే... 1947 లో భాషా రాష్ట్రాల సమస్యను పరిష్కరించడానికి వేసిన థార్ కమీషన్ భాషల పరంగా విభజించడం కుదరదని చెప్పేసింది. నీలం సంజీవరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికవడంతో 1952 లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్ర మహా సభ నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి హాజరుకావద్దని సభ్యులందర్నీ ఆదేశించడం, 21 మంది కాంగ్రెస్, స్వతంత్ర సభ్యుల సంతకాలతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వాయిదా వెయ్యాలని విజ్ఞాపన ప్రధాని నెహ్రు గారికి అందజెయ్యడం చేసాడు. ఇది నెహ్రుకు బాగా అనుకూలించింది. మీరు విడదియ్యమంటున్నారు కానీ వాళ్ళేమో విడదియ్యోద్దంటున్నారు. ముందు మీలో మీరు తేల్చుకుని ఏకాభిప్రాయానికి రండి అని చెప్పి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వాయిదా వేసి తమాషా చూస్తూ ఉండిపోయాడు. ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పులేదనుకుంటాను.
దీంతో అసంతృప్తికి లోనైన స్వామి సీతారాం 36 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి వినోభాభావే జోక్యంతో విరమించాడు. నేను ఊరుకోలేకపోయాను. ఇంకా ఎన్నాళ్ళు తాత్సారం చేసి తమాషా చూస్తారు అని బాధతో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాను. మొదట్లో ఎవ్వరూ సరిగా పట్టించుకోలేదు. అప్పట్లో ఇన్నేసి ఎడిషన్లున్న వార్తాపత్రికలు లేవు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. లైవ్ టెలికాస్ట్లు లేవు. అందుకని నిరాహార దీక్ష మొదలు పెట్టగానే అరెస్టు చెయ్యడానికి, ఆస్పత్రిలో పడేసి సెలైన్లు పెట్టెయ్యడానికి అప్పుడు అవకాశం లేకపోయింది. ఇప్పుడనిపిస్తోంది ఈ రోజుల్లో పుట్టి ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉంటే బాగుండేదేమోనని ! ప్చ్ ! ఏం చేస్తాం ? తొందరపడి ప్రచార సాధనాలు అంతగా అభివృద్ది చెందని రోజుల్లో పుట్టేసానే ! ఆంధ్ర దేశమంతా నా పరిస్థితి పూర్తిగా తెలియడానికి 50 రోజులు పట్టింది. అప్పటికి నా పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించుకోండి. నేను నీరసించాను. ఉద్యమం బలపడింది. నాకు ఆ నిరాహార దీక్ష నుంచి విముక్తి కలగడానికి మరో ఎనిమిది రోజులు పట్టింది. అంటే ప్రత్యేక రాష్ట్రమిచ్చేసి దీక్ష విరమింప జేసారనుకుంటున్నారా ? అబ్బే ! నాలోని జీవుడు ఎగిరిపోయాడు. తర్వాత నెహ్రు మద్రాస్ లేకుండానే ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించాడు. ఏం చేస్తాం దక్కిందే మహాభాగ్యమని తెలుగువారు సర్దుకున్నారు.

నిజాం నవాబు పరిపాలనలో హైదరాబాద్ రాష్ట్రం చీకటిలో మ్రగ్గి పోయింది. నిజాం బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా ఉంటే, జాగీర్దార్లు- భూకామందులు నిజాంకు బంటులుగా ఉండి సామాన్య ప్రజల్ని వెట్టి చాకిరితో పీడించుకుని తిన్నారు. ప్లేగు. కలరా మొదలైన వ్యాధులు ప్రబలితే పట్టించుకునే నాథుడే లేడు. ఇటువంటి దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొన్న తెలంగాణావాసులు నుండి విముక్తితో ఊపిరి పీల్చుకున్నారు. తర తరాలుగా తెలుగుకు పట్టిన దురవస్థను జీర్ణించుకోలేక తెలుగు వాళ్లందరమూ కలిసి ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. సహజంగానే మర్రి చెన్నారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి లాంటి వాళ్లు వ్యతిరేకించినా, బూర్గుల రామకృష్ణారావు లాంటి కొంతమంది రాజకీయ ప్రయోజనాలకోసం తర్వాత సమర్థించడంతో దేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం గా ఏర్పాటయిందని తెలిసి చాలా ఆనందపడ్డాను. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం ఇరు ప్రాంతాల మధ్యా ద్వేషాలను రగిలించడం, అవి తీరాక ఉద్యమాలను చల్లార్చడం లాంటి చర్యలతో ప్రజల అమాయకత్వాన్ని, ఆవేశాన్ని ఉపయోగించుకున్నారని తెలిసి చాలా బాధపడ్డాను. బతికుంటే వారి నుంచి ప్రజల్ని విముక్తి చెయ్యడానికి మళ్ళీ సత్యాగ్రహం చేపట్టేవాడినేమో ! ఏం చేస్తాం ! ఆ అవకాశం లేదుగా !
గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలనే మాట వినబడుతోంది. అప్పుడప్పుడూ అసమ్మతి వాదం తెర మీదకు రావడం మామూలే కదా అనుకున్నాను. కానీ క్రిందటి నెలలో నా విగ్రహాల మీద దాడి జరగడంతో ఉద్యమం ప్రారంభమయిందని తెలిసింది. నా సత్యాగ్రహబాటను కూడా అనుసరిస్తున్నారని తెలిసింది. అయితే తర్వాత గానీ తెలియలేదు నిరాహార దీక్ష చెయ్యడం ఈ రోజుల్లో ఇంత సుళువని. దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించగానే ప్రజలు తిరగబడడం చూస్తే ప్రజల్లో మార్పు వచ్చిందని అర్థమయింది. కానీ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఆదిస్థానం చేసిన ప్రకటన చూస్తే నాకు నెహ్రు రాజకీయమే గుర్తుకు వచ్చింది. పాలకులు మాత్రం మారలేదు. ప్రస్తుతం ఇరు ప్రాంతాల వారిని బలాబలాలు తేల్చుకోమన్నట్లే అనిపిస్తోంది. దాన్ని నాయకులు బాగానే ఉపయోగించుకుంటున్నట్లున్నారు. ఏమైనా 1969 ఉద్యమ ద్రోహాన్ని తెలంగాణా అమాయక ప్రజలు మరిచిపోయినా, ఆంధ్ర ప్రాంత ప్రజలు బాగా గుర్తు పెట్టుకుని 1972 నాటి ప్రత్యేకాంధ్ర నినాదాన్ని సమైక్యాంధ్ర నినాదంగా మార్చేశారు. నా చెవులకింపుగా ఉంది.

అయితే కొంతమంది తెలంగాణా నాయకులు చేస్తున్న వాదనలే కొరుకుడు పడడంలేదు. మాటి మాటికీ ఆంధ్రవాళ్లు, ఆంధ్రవాళ్లు అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టిన, నివసిస్తున్న వారందరూ ఆంధ్రా వాళ్ళే కదా ! అసలు తెలంగాణా అన్నా, ఆంధ్రా అన్నా అర్థం దాదాపుగా ఒకటేనని మా రోజుల్లో అనుకునేవాళ్ళమే ! ఈ మథ్య భాషలో అర్థాలేమైనా మారిపోయాయా ? ఎవరైనా నా సందేహం తీరిస్తే బాగుండును. మరో విషయం. రాష్ట్రమన్నాక రాజధాని అవసరం. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్నపుడు రాయలసీమ, కోస్తాంధ్ర వాసులు అప్పుడు రాజధానిగా ఉన్న మద్రాస్ నగరాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. ఆ నగరం తెలుగు వారికి చెందుతుందని ఎన్ని దృష్టాంతాలు చూపించినా దక్కించుకోలేకపోయారు. విశాలాంధ్ర ఏర్పడ్డాక అందరి ఆమోదంతో కర్నూలు నుంచి రాజధాని హైదరాబాద్ మార్చారు కదా ! ఒక రాజధాని... అది రాష్ట్రానిదైనా, దేశానిదైనా ప్రజలందరి భాగస్వామ్యంతోనే కదా అభివృద్ది చెందేది. అలా కాకుండా కొంతమంది వ్యాపారాలు, పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టారు తప్ప హైదరాబాద్ అభివృద్ధిలో ఆంధ్రా వాళ్ల పాత్ర ఏమీ లేదంటారే ! అంటే వాళ్ల దృష్టిలో కోట్లకు పడగలెత్తిన వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, నాయకులు తప్ప సామాన్యులు మనుష్యులు కాదా ! వాళ్లు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కట్టిన పన్నుల్లో కొంత భాగంతోనే కదా రాజధాని అభివృద్ది జరిగేది. అందుకని దాంట్లో రాష్ట్ర ప్రజలందరికీ భాగస్వామ్యం ఉంటుంది కదా ! ఏమో నాకేమీ అర్థం కావడం లేదు. అసలు ఆ వ్యాపార వేత్తలు వగైరాలు కట్టే పన్నుల శాతం కంటే సామాన్య ప్రజలు కట్టే పన్నుల శాతమే ఎక్కువగా ఉంటుందేమో ! ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సమస్య రాజధాని చుట్టూ తిరుగుతున్నట్లనిపిస్తోంది. అసలే హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ది చెందుతోంది. అన్నదమ్ముల మధ్య పరిష్కారంగా హైదరాబాద్ అభివృద్ది ఖర్చుని వాటాలేస్తే హైదరాబాద్ నగరం తమ రాజధానిగా ఉంచుకున్నవాళ్లు విడిపోయిన వాళ్లకు చెల్లించాల్సిన వాటా మాట ! ఆ... ఇదో పెద్ద విషయమా.... ఉన్నారుగా.... అమాయక ప్రజలు. వాళ్ల జీవితాలు తాకట్టు పెట్టేస్తారు ! ఇలాంటి సందర్భాల్లో నాయకులకు పండగేగా ! ప్రజలకు దండగ గానీ ! మా కాలంలో కంటే ఈ కాలంలో ప్రజలకు కొంత తెలివి వచ్చినట్లు అనిపిస్తోంది. చూద్దాం. వాళ్లు నాయకుల మెడలు వంచి తామంటే భయపడేటట్లు చేస్తారో , నాయకులే ప్రజల్ని ఎప్పటిలాగే వెర్రి గొర్రెల్ని చేస్తారో ! ఏమైనా ఈ నష్టాన్ని భరించాల్సింది సామాన్య ప్రజలే కానీ నాయకులూ కాదు వారిని వెనకనుండి నడిపిస్తున్న వ్యాపార, పారిశ్రామిక వేత్తలూ కాదు.

అప్పుడే...అమరజీవి పొట్టి శ్రీరాములు అమరరహే ! అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. పాలబిందేలు వస్తున్నాయి. నా విగ్రహాలకు అభిషేకాలు చెయ్యడానికి కాబోలు. ప్చ్ ! ఎప్పుడు, ఎందుకు, ఎవరు మా విగ్రహాలు పగలగోడతారో, ....పూజిస్తారో బ్రహ్మ దేవుడికైనా అర్థమవుతుందా ! ఆయనకెందుకు అర్థమవుతుందిలే ! ఆయన అసలు తనకు గుడులు, విగ్రహాలు లేకుండా జాగ్రత్త పడ్డాడుగా ! ఉన్నా విష్ణు మహేశ్వరుల చాటున దాక్కుంటాడు. ' దేముడికేం ! హాయిగా ఉన్నాడు. ఈ మానవుడే... కాదు కాదు....విగ్రహాలే బాధలు పడుతున్నాయి '. అన్నట్లు మీకు చెప్పలేదు కదా ! ఈ రోజుతో నా ప్రాణ త్యాగానికి 60 సంవత్సరాలు నిండుతున్నాయి. అందుకే మిమ్మల్ని ఒకసారి పలుకరిద్దామని వచ్చా ! సెలవు.

తనను తాను పొగుడుకొనే మీడియా

పదో పరకో
ఉంటుందో లేదో
ప్రయత్నించి
పట్టుబడి
ఊచల మాటున పెట్టబడి
కొట్టబడి
ఉన్నవి లేనివి ఆపాదించబడి
అన్యాయంగా
జైలు పక్షి గా గడిపే జన్మకన్నా

కుర్చీలో వున్న నాన్నకు కొడుకై
కోరికైతే
తనను తాను పొగుడుకొనే మీడియా వచ్చేలా
జనాల సొమ్మును ఇనాముగా రాసిచ్చి రాజ సౌధాలు వచ్చిపడేలా
జనం సొమ్మునే ఖర్చుపెట్టి పోయిన నాన్నే సొంతంగా పెట్టినట్లు
దాన కర్ణుడి కొడుకైనట్లు
తనకు తప్ప వేరెవరికీ ఆ సింహాసనం దక్క కూడదన్నట్టు
దబాయించి కొత్త పార్టీ పెట్టే దొరలా మంచి బతుకు ఇవ్వు దేవుడా.

16, మార్చి 2011, బుధవారం

కాలచక్రంలో శూన్యం నేర్చిన అక్షరం నక్షత్రాల

పలకబట్టి బయలుదేరితే
కలుపు తీసిన పొలంలా
అమ్మ ముఖం విప్పారి మెరిసేది.
అ ఆ లు రాసిన పలక
అమ్మ వేళ్ళకు అందిస్తే
ఏరుకున్న అక్షరాల్ని వొళ్ళో దాచి మురిసేది
అమ్మ రూపం నా రూపానికి అద్ది మాసిపోయాక
పలకా బలపం లేని నా బాల్యం
బడికి స్వస్తి పలికింది.
పసివాడి నగ్నరూపం మొలతాడు కట్టి వేధికెళితే
మొలతాడు లేని మొలల మధ్య మొలతాడే మిన్న
అవయవాల్ని కప్పుతూ గోచి పెట్టినపుడు
గోచీలు లేని గోలీలాటలో గోచీదే ఆధిపత్యం
ఆరు తర్వాత ఎంతకూ గుర్తురాని అంకె కోసం
మోరెత్తిన బడిపిల్లవాడ్ని చూసి
ఇరవై గొడ్లను ఏకధాటిగా లెక్కించడం నా విజయగర్వం.
పుల్లతో పంటకాల్వ లోతు కొలిచి
పారబోయే పొలం లెక్కలు ఆశువుగా నా నోట దొర్లేవి
సూర్యగమనం చూసి గంటలు నిర్ధారించినపుడు
గతి తప్పిన గడియారం విస్మయ ద్రుశ్టులు పరిచేది.
కాళ్ళకు తగిలిన రాళ్ళను సమగ్రంగా పరిశీలించి
ఏ ఖనిజ సంపద నిక్షిప్తమో ఏకరువు పెట్టేవాడిని
కమ్మిన మబ్బు సాంద్రత బట్టి వర్షపాతపు అంచనాకు
కురవబోయే మేఘం అబ్బురపడేది.
రాతి మేద సుద్దగీతలు రాతలు కానేరవు
కాళ్ళూచేతుల వేళ్ళు లెక్కించడం లెక్కలు కానేకావు.
ఎక్కాల్సిన బస్సు చిరునామా ఎంతకూ చదవలేక
జార్చుకున్న కాలచక్రంలో శూన్యం
నేర్చిన అక్షరం నక్షత్రాల్ని కోసి తెస్తుందని
మరణించే వరకు మనిషి విద్యార్ధేనని
అఙ్ణాన తిమిరాన వెలుగు జల్లుతూ
అక్షరాస్యత శాస్త్రీయ ప్రతిమ అంటూంది.

ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి మన పాలకుల మీద ఒత్తిడి తేవాలి

మన దేశంలో అవినీతి రాజ్యమేలుతుందని అందరికి తెలుసు. కుంభకోణాలు, అక్రమాలు, విలువల్లేని రాజకీయాలు తప్ప ఇంకేమి లేని పరిస్థితిని ప్రస్తుతం చూస్తున్నాం. మరోవైపు ట్యునీషియాలో, ఈజిప్టులో , యెమెన్లో ప్రజలు అవినీతి ప్రభుత్వాల మీద సమరశంఖం పూరించి ప్రభుత్వాలనే కూలదోస్తున్నారు. కొత్త చరిత్రను లిఖిస్తున్నారు. నియంతలను తమ దేశాలనుండి తరిమి తరిమి కొడుతున్నారు. కాని మనం మాత్రం మన ఇళ్లకో కార్యాలయాలకో పరిమితమై ఏమీ పట్టనట్లుగా మన మానాన మనం రోజులు వెళ్ళదీస్తున్నాం. ఎందుకీ నిర్లిప్తత? లక్షల రూపాయల అవినీతికే కేంద్ర మంత్రుల రాజీనామా చేసే పరిస్థితినుండి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నా ఏమీ పట్టని స్థితికి చేరుకున్నాం. ఎక్కడ చూసినా నల్ల డబ్బు గురించే చర్చ.. కాని ఇంకా ఎన్నాళ్ళు చర్చిస్తాం? మన నోళ్ళు విప్పనంతకాలం , కాళ్ళు కదపనంతకాలం ఈ కుళ్ళు రాజకీయం, ఈ అవినీతి సాగుతూనే ఉంటుంది. దేశం కోసం వీధుల్లోకి వచ్చి సత్యాగ్రహం చేసిన ప్రజలు, దేశం కోసం ఆయుధం పట్టి ఉరికంబానికేక్కిన ప్రజలు ఇప్పుడు ఇళ్ళలో టీవీలలో నేరాలు ఘోరాలు చూస్తూ కాలం వెల్లబోస్తున్నారు. ప్రపంచ స్వాతంత్ర్య పోరాటాలకే స్ఫూర్తినిచ్చే ఉద్యమాన్ని నిర్మించిన మనం, ప్రపంచ దేశాలలో సాగుతున్న ఉద్యమాలను చూసి కొంచెమైన చలించట్లేదు. ఎవరు ఏమైపోయినా అక్కర్లేదు, ఎక్కడ ఎం జరిగిన మనకి అవసరం లేదు.. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడో లేక ఉల్లి ధరలు మండినప్పుడు మాత్రమే మనకు ఈ ప్రభుత్వం గుర్తొస్తుంది. ఇంకెన్నాళ్ళు ఇలా బ్రతుకుతాం? ఛీ.. ఇదీ ఒక బ్రతుకేనా!

రాష్ట్రాన్ని, దేశాన్ని కొల్లగొట్టి వేలు లక్షల కోట్లు సంపాదించిన వారి కొడుకులు మనవళ్లు కొత్త పార్టీలు పెట్టి రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తుంటే.. మనకేం పట్టదు. మన దేశం ఎటు పోతుందో ఒక్కసారైనా ఆలోచించారా? 23 ఏళ్లకే ఉరికంబం ఎక్కిన, ఆంగ్లేయుల బుల్లెట్లకి నేలకొరిగిన భగత్ సింగ్, అల్లూరి సీతారామారాజుల ఉద్యమ స్ఫూర్తి ఎక్కడుంది? పరాయి పాలనని త్రిప్పికొట్టడానికి ఒక సైన్యాన్నే నెలకొల్పిన సుభాష్ చంద్ర బోస్ జాతీయ స్ఫూర్తి ఇంకా ఎంతమందిలో మిగిలుంది? కులం, మతం, ప్రాంతం అని వేలాడే దుష్ట రాజకీయనాయకుల తొత్తులుగా మారి వాళ్ళు విదిల్చే నోట్లు, సారా పాకెట్లు తప్ప జనం పాట్లు అవసరం లేనంత హీనంగా మారుతున్నామా!?

ప్రజలు రూపొందించిన లోక్ పాల్ బిల్లుకి ప్రభుత్వం తూట్లు పొడిచి దాన్ని సమూలంగా మార్చి వేసింది. లోక్పాల్ బిల్లు యధాతధంగా అమలైతే అవినీతిని దాదాపు అంతమొందించడం సాధ్యపడుతుంది. ఇప్పటికే దేశంలో పేరుకుపోయిన నల్లడబ్బును పెద్ద నోట్లను నిషేదించడం ద్వారా వెలికి తీయవచ్చు. కేవలం రూ.500 మరియు ౧౦౦౦ నోట్లను నిషేదించడం ద్వారా దాదాపు సగానికి పైగానే నల్లడబ్బును బయటికి తీయగలం. కేంద్రం వద్ద స్విస్ బ్యాంకులలో నల్ల డబ్బు దాచిన వారి వివరాలు ఉన్నా బయటపెట్టలేని బలహీన హీన స్థితిలో ఉంది. ఇప్పటికైనా ఆయా దేశాలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుని నల్లడబ్బుని వెలికితీయాలి. ఈ రెండు పనులను చేయడం ద్వారా మన దేశం ప్రస్తుతం ఎదుర్కుంటున్న మౌలిక సదుపాయాలూ, నిరక్షరాస్యత , పేదరికం, సాంఘిక రక్షణ, నిరుద్యోగం లాంటి సమస్యలను దాదాపు రూపు మాపోచ్చు.

ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి మన పాలకుల మీద ఒత్తిడి తేవాలి, ప్రజలు పూనుకుంటే ప్రభుత్వాలు కూలుతోన్న రోజులివి. మన ప్రభుత్వం కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ప్రజలలో చైతన్యం తీసుకురాగలిగితే ఇది అసాధ్యం కాకపోవచ్చు. దీనికి మనవంతుగా ప్రయత్నిద్దాం.

జై హింద్.

చాలించడి మీ దొంగనాటకాలు?

సోదరభావంతో తెలంగాణ కోసం శాంతియుతంగా పోరాడుతున్న గద్దర్ లాంటి వాళ్ళకి ఈ వ్యాసం వర్తించదు.ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ తెలంగాణ పేరుతో అనేక అరాచకాలకు తెగబడుతున్న మూర్ఖశిఖామణుల కోసమే ఈ వ్యాసం .

చాలించడి మీ దొంగ ఏడుపులు పెడబొబ్బలు.
ఎన్నాళ్ళీ దొంగనాటకాలు?
అడిగేవాడు లేక మీ ఆగడాలకు అంతులేకుండా పోతోంది.

తెలుగుభాషా వికాసానికి, సంస్కృతికి ఎనలేని సేవ చేసిన ప్రముఖుల విగ్రహాలు కూల్చెయ్యటానికి మీకు మనస్సెలా వచ్చింది? శాంతియుత ప్రదర్శన అంటూ మోసపూరిత వాగ్దానాలు చేసి మీరు సాధించిన ఘనకార్యం ఇదా? ఇలా చేస్తే తెలంగాణ వచ్చేస్తుందని ఏ అజ్ఞాని మీకు చెప్పింది.ప్రజల అంగీకారం ఉంటేనే ఏ ఉద్యమమైనా ఫలప్రదమవుతుంది.మీరు చేసిన పనికి తెలంగాణలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోందే.దీన్ని ఎలా సమర్ధించుకుంటారు? మీరు చేసేది ఉద్యమమా దౌర్జన్యమా? అన్నమయ్య మిమ్మల్ని ఏం చేశాడు? మిమ్మల్ని పురుగుల కంటే హీనంగా చూసి,మీ మానప్రాణాలతో ఆట్లాడుకొని,మిమ్మల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చిచంపిన నైజాం నవాబు మీకు దైవ సమానుడా? మీ రక్త మాంసాలను పీల్చిపిప్పి చేసిన పటేల్‌ పట్వారి వ్యవస్థను ఒక్క కలంపోటుతో రద్దు చేసిన ఆంధ్రుడు NTR మీకు ఆగర్భశత్రువా? విగ్రహాలతో మాకు సమస్య లేదు,విగ్రహాలను పెట్టించినవాడితోనే సమస్య అని ఒక బ్లాగరు అన్నాడు.అదే NTR పెట్టించిన తెలంగాణా ప్రముఖుల విగ్రహాలు ఎందుకు వదిలేశారు ? అప్పుడు మీకు NTR ఆంధ్రత్వం గుర్తురాలేదా? మీకు చేతనైతే తెలంగాణ ఉద్యమాన్ని అమ్ముకొని సొమ్ముచేసుకున్న మర్రి చెన్నారెడ్డి విగ్రహాలని బ్రద్దలుకొట్టుకోండి కానీ తెలుగుజాతికి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన అమరజీవి పోట్టీశ్రీరాములు విగ్రహాలని కాదు. మీది తెలుగు భాష కాదా? ఈ మాటలనడానికి మీరు ఏ మాత్రం సిగ్గుపడటం లేదా? నిన్న మొన్న వచ్చిన నవాబుగిరీలు, ముల్కీలు మీకు ప్రియమైపోయాయి కానీ ఏనాడో శాతవాహనులు స్థాపించి, రుద్రమ్మదేవి ఏలిన అచ్చమైన తెలుగు భాష మీకు చేదైపోయిందా? అందుకేనా మూలాలు మరచిపోయి తెలుగుతల్లి విగ్రహాన్ని ధ్వంసం చేసారు? ఆఖరికి దేవుళ్ళకు కూడా ప్రాంతీయ తత్వాన్ని(భధ్రాచలం,తిరుమల) ఆపాదించిన ఒక మూర్ఖుడి మాటలు మీకు శిరోధార్యమవుతున్నాయంటే మిమ్మల్ని చూసి మీరే జాలిపడాలి.

ఎవరయ్యా మీకు పాఠాలు చెప్పింది ?
ఏ విశ్వవిద్యాలయం మీకు పట్టాలిచ్చింది ?


మాట్లాడితే రెచ్చగోడుతున్నారు అంటున్నారు
ఎవరిని ఎవరిని రెచ్చగొడుతున్నారు ?

* పార్టీ పెట్టింది మొదలు అంధ్రులు దొంగలు దోపిడీదారులని ఆడిపోసుకున్నది కేసీయార్ కాదా ?
* ఆంధ్రావాళ్ళను తరిమికొడతాం అని చిందులు తొక్కింది కేసీయార్‌కాదా ?
* సీమాంధ్ర కళాశాలలు,వాణిజ్య సముదాయాల పై దాడులకు తెగబడింది మీరు కాదా?
* వాల్యూయేషన్‌కి వచ్చిన సీమాంధ్ర ఉపాధ్యాయులపై భౌతిక దాడులకి తెగబడింది మీ విద్యార్థులు కాదా? ఈ
సంఘటన జరిగిన తర్వాత సీమాంధ్ర విద్యార్థులు తెలంగాణ ఉపాధ్యాయులుకు శాలువాలతో సన్మానం చేసింది వాస్తవం
కాదా ?
* సీమాంధ్ర కళాకారుల మూవీ షూటింగ్స్ సెట్స్ ధ్వంసం చేసింది మీరు కాదా?
* సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఇళ్ళపై దాడికి దిగింది మీరు కాదా ?
* సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలు ధ్వంసం చేసింది మీరు కాదా ?
* సీమాంధ్ర నేతలు కేవలం తెలంగాణ రాదంటే రెచ్చగొడుతున్నారు అంటారు మరి మీరు చేసిన నిర్వాకాలని ఏమని అనాలి ?


సీమాంధ్రులు మిమ్మల్ని దోచుకుతిన్నారు అంటారు. శ్రీకృష్ణ కమిటీ ప్రకారం తెలంగాణ కంటే అన్ని రకాలుగా వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ.కానీ మీరు దాన్ని విశ్వసించరు.కోదండరాం,కేసియార్ మాటలు మీకు వేదమంత్రాలతో సమానం. ఇంతకాలం మేం మిమ్మల్ని దోచుకుతిన్న మాట నిజమే అయితే మీరు ముందుగా తిరగబడాల్సింది ఇన్నేళ్ళుగా మీరెన్నుకున్న ప్రజాప్రతినిధుల పైన. వాళ్ళేమీ నోరూ వాయి లేని వాజమ్మలు కాదే.నోట్లో వేలు పెడితే చప్పరించడం కూడా రాని చంటి పిల్లలు కారే ? వేలు పెడితే వెన్నమూక వరకూ దిగమింగే రకం. సుబ్బరంగా సంపాదించుకుని కోట్లు గడించుకొన్నారు కదా? మీరెన్నుకున్న ఎంపీలు కేసియార్,విజయశాంతి నిన్న మొన్నటిదాకా ఎనాడైనా పార్లమెంటు మొహం చుశారా? రాత్రంతా తాగి, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయ్యటం తప్ప కేసియార్ ఎమైనా వెలగబెట్టాడా? ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడ్డాడా? రాజీనామా డ్రామాలు మొదలుపెట్టి ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకొని మళ్ళీ ఎన్నికైతే 'తెలంగాణా వాదం యొక్క తీవ్రత ' అంటూ మీరు మురిసిపోయారు కానీ ఎప్పుడైనా ఇందులో మర్మం గ్రహించారా? ఎంతసేపూ విద్యార్థులే ఎందుకు త్యాగాలు చేసి తన్నులు తినాలి, మీరెందుకు ఉద్యోగానికి రాజీనామా చేసి మీ నైతికత నిరూపించుకోరు అని ఎప్పుడైనా కోదండరాంను నిలదీశారా? ఆయన, ఆయనతో పాటు విద్యార్థులను రెచ్చగొడుతూ నెల తిరిగేసరికి సీమాంధ్రులు కూడా సక్రమంగా పన్నులు కడితే తప్ప విడుదలవ్వని జీతాలను పుచ్చుకుంటున్న ఇతర మేధావులు త్యాగాలకు అతీతులా ? క్లాసులు సక్రమంగా జరక్క విద్యార్థులు,వ్యాపారం జరక్క వ్యాపారస్తులు ,రోజు గడవక బడుగుజీవులు నాశనమైపోవచ్చు కానీ వీళ్ళు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలను వదలరా? నల్గొండ ఫ్లోరైడ్ సమస్య కావచ్చు,పాలమూరు సమస్య కావచ్చు, సమస్య ఏదైనా పోరాడి సాధించుకోవల్సింది మీరు మీ ప్రజాప్రతినిధులు.ఇంతకాలం ఈ మేధావులు, సంఘసంస్కర్తలు ఏం చేసారు? చోద్యం చూశారా లేక చేతకాక మిన్నకున్నారా? జయప్రకాష్ నారాయణ లాంటి బలహీనుల్ని కోట్టారు కాబట్టి సరిపోయింది కానీ అదే ఏ బలవంతుడైన నేత మీదో చెయ్యిపడుంటే ఆరోజే మీ సామర్థ్యం బయటపడేది. మీకు చేతనైతే, చిత్తశుద్ధి ఉంటే మీ దివాళాకోరు నాయాకులపై తిరగబడండి. ఆడలేనమ్మ మద్దెల మీద పడి ఏడ్చినట్లు మీలో ఇన్ని లోపాలు పెట్టుకొని సీమాంధ్రుల మీద ఏడిస్తే ఏమిటి ప్రయోజనం ?

15, మార్చి 2011, మంగళవారం

ఎదుటివాడి అజ్ఞానం మనకి నవ్వునిస్తోందా ?

నా నవ్వుని ఎక్కడో పారేసుకున్నాను .నిజమేనండీ , అచ్చంగా ,అక్షరాలా నా సొంత నవ్వుని
ఎక్కడో పారేసుకున్నాను .రకరకాల నవ్వులని జేబులో పెట్టుకొని తిరుగుతున్నాను .శతకోటి
బంధాలకు , అనంతకోటి నవ్వులు . ఆ కోటిలో "నాకోటి " ఉందా ?. ఏమో , పక్క వీధిలో
పోగొట్టుకున్న కాసు,వెలుగున్న ఈ వీధిలో దొరుకుతుందా?.ఇంతకీ నా నవ్వు ఏమైంది ?.
తెలియని వెతుకులాట , తెలివిడి కోసం సాగుతోంది . నాకో అనుమానం .తెలివిడి వల్ల ఆనందం
పెరుగుతుందా ? లేక అజ్ఞానం ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందా ? లేక ఎదుటివాడి అజ్ఞానం
మనకి నవ్వునిస్తోందా ? రసాభాస (అనుకున్నది జరుగక చతికిలపడితే జరిగేది ) నవ్వుకి
కారణమా ? . ఏం జరుగుతోంది ఇక్కడ , నవ్వు గురించి ఆలోచిస్తూ నన్ను నేను మరిచాను.
ఇంతకీ నా నవ్వు ఎక్కడ , ఇప్పుడే తెలియాలి . ముగ్గు వేసి అంజనం వేయించనా ? ,చిలక
ప్రశ్న అడగనా ? ,వత్తులు వేసిన కళ్లు కాచేలా ఎదురు చూడనా ? .స్వామీజీ ఎవరైనా
దొరుకుతారా ?, నెట్ బదులిస్తుందా ?

ఏదో వెలుగు దగ్గరౌతోంది .వెలుగుతో పాటు ఓ మధుర స్వరం వినిపిస్తోంది
"తనని వదిలి అందరిని లెక్కించే పరమానందయ్య శిష్యులలా ఉన్నవే .కస్తూరి మృగానికి
బంధువువా? నిన్నునీవు మరిచావే.అద్దె నవ్వుల సవ్వడిలో తానున్న నీ సొంతనవ్వుని చూడవే?
బంధాలన్నీ నీవేగా .నీవు కాదంటే లేవుగా .అది మరచి, నీవు స్తంభాన్ని పట్టుకొని ,నన్ను
విడిపించండి అన్నట్టు ఉంది .అన్నీ నీవే .ప్రతి నవ్వు నీదే .పొద్దుతిరుగుడు పువ్వంత
కళ్లు చేసుకొని చూడు . నవ్వుల తోట నీదే అవుతుంది

నల్లేరుపై బండి నడక

రాష్ట్ర రాజకీయ తెర మీదికి ఉప్పెనలా వస్తుందని భావించిన మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చడీచప్పుడు లేకుండా, సాదాసీదాగా వచ్చేసింది. అనూహ్యంగా వైయస్ జగన్ హంగామా లేకుండా కడప జిల్లా పులివెందులలోని వైయస్సార్ సమాధి వద్ద తన పార్టీ జెండాను తల్లి విజయమ్మ చేత ఆవిష్కరింపజేసి పార్టీకి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున కోడ్ ఉల్లంఘన జరగకుండా జెండా ఆవిష్కరణ చేయాల్సిన సందర్భాన్ని జగన్ ఎంచుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.


నిజానికి, ఆయన అత్యంత సన్నిహితులను కూడా ఆశ్చర్యపరిచినట్లు చెబుతున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సభలో ప్రకటించి, మర్నాడే పార్టీ జెండాను ఆవిష్కరింపజేశారు. పార్టీ అవతరణ సభ విడిగా మరోసారి ఉంటుందని చెప్పడానికి కూడా వీలు లేని పరిస్థితి. కాగా, పార్టీ జెండా ఆవిష్కరణ తేదీ ఖరారుకు ఆయన తన సన్నిహితులను కూడా సంప్రదించలేదని చెబుతున్నారు. పార్టీ అవతరణ సభ కోసం ఆయన పులివెందులలో భారీ సెట్టింగుతో వేదికను కూడా ఏర్పాటు చేశారు. సినిమా రంగానికి చెందిన తోట తరణితో వేదికను ఏర్పాటు చేయించారు. దాన్ని బట్టి జగన్ పార్టీ అవతరణ సభ భారీ యెత్తున ఉంటుందని అందరూ భావించారు.

అలాంటిదేమీ లేకుండా కుటుంబ కార్యక్రమంగానే జెండా ఆవిష్కరణ సభ జరిపించారు. ఇలా ఎందుకు చేశారనేది తెలియక ఆయన అనుచరులు కూడా ముక్కు మీద వేలేసుకున్నారు. ఈ సభకు చాలా మంది ముఖం చాటేసినట్లు చెబుతున్నారు. జెండా ఆవిష్కరణ సభకు కేవలం 11 మంది శాసనసభ్యులు మాత్రమే హాజరయ్యారు. నాయకులు కూడా కొద్ది మందే ఉన్నారు. జగన్ వెంట 23 మంది శాసనసభ్యులున్నారనేది గత కొంత కాలంగా గట్టిగా ప్రచారం జరుగుతూ వచ్చింది. మిగతా 12 మంది శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదనేది ప్రశ్న. జగన్ అంచనాలను తలకిందులు చేస్తూ నాయకులు కూడా తక్కువ మందే వచ్చినట్లు చెబుతున్నారు. అభిమానుల సందడి కనిపించినప్పటికీ అది కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని అంటున్నారు.

వైయస్సార్ అకాల మరణానికి దిగ్భ్రాంతికి గురై మృత్యువాత పడిన కుటుంబాలను పరామర్శించడానికి తలపెట్టిన ఓదార్పు యాత్రను ఆయన తిరిగి చేపడతారా, మిగతా జిల్లాల్లో దాన్ని నిర్వహిస్తారా అనేది కూడా అనుమానంగానే ఉంది. ఓదార్పు యాత్ర పూర్తికాకుండానే ఆయన కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించడానికి సిద్ధపడ్డారు. వివిధ సమస్యలపై దీక్షలకు పూనుకుంటూ వచ్చారు.


శ్రీకాకుళం కాకర్లపల్లి ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టు బాధితులను పరామర్శించడానికి వెళ్లిన జగన్‌కు చేదు అనుభవమే ఎదురైంది. దీన్ని బట్టి, వైయస్సార్ సంక్షేమ పథకాలు తనకు ఎంతగా ఉపకరిస్తాయో, ఆయన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అంతగా వ్యతిరేకంగా పనిచేస్తాయని మొదటిసారి జగన్‌కు తెలిసి వచ్చింది. అందువల్ల జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీది నల్లేరుపై బండి నడక ఏమీ కాదని అంటున్నారు.

14, మార్చి 2011, సోమవారం

తెలుగుతల్లి ఆంధ్రా ఏరియాకి పరిమితమా?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండుని ఆంధ్రరాష్ట్ర డిమాండుతో పోలుస్తూ చేస్తున్న ఈ అనవసరమైన పోలిక గుఱించి గత కొద్దికాలంగా వింటున్నాం. పూర్వ మద్రాసు రాష్ట్రం ఏకజాతిరాష్ట్రం కాదు. అది ప్రజాభీష్టంతో, ప్రజాస్వామికంగా ఏర్పడ్డది కాదు. వలసపాలకుల సౌలభ్యార్థం నానాజాతుల కిచిడీగా సృష్టించబడింది. ఆ కిచిడీ నుంచి బయటపడి ఏకజాతిరాష్ట్రాల్ని ఏర్పఱచాలనే ఉద్దేశంతో ప్రారంభమైనవి భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం మొదలైన ఆందోళనలు. భాషాజాతులూ, భాషారాష్ట్రాలూ ఇంగ్లీషువారీ దేశంలో అడుగుపెట్టక ముందునుంచి ఉన్నాయి. ఇండియన్ యూనియన్ ఏర్పడక ముందునుంచి ఉన్నాయి. అవే నిఖార్సైన నిజమైన సహజమైన యూనిట్లు. పరిపాలనలో ఆ సహజత్వం, ఆ సమగ్రత్వం కోసమే భాషారాష్ట్రాలు. అంతే తప్ప ఒకే జాతికి, ఒకే మతానికీ, ఒకే భాషకూ, ఒకే సాంస్కృతిక వారసత్వానికీ చెందిన, రెండు ఆనుకుని ఉన్న ప్రాంతాలలో ఒకఱిని దోపిడీదారులుగా, ఇంకొకఱిని బానిసలుగా వర్ణించడం, వివాదాల పరిష్కారానికి ఉన్న అన్ని శాంతియుత మార్గాల్నీ వర్జించడం నిజంగా జాతిద్రోహమే అవుతుంది. misleading అవుతుంది. రాజకీయప్రయోజనాల కోసం – శాంతియుతంగా అన్నదమ్ముల్లా దశాబ్దాల తరబడి పక్కపక్కనే కలిసి జీవిస్తున్న ప్రజల మధ్య లేని శత్రుత్వాల్ని పనిగట్టుకొని సృష్టించడం అవుతుంది. అదే జాతిద్రోహం. ఇతరులపై ఒకప్పుడు మనం ప్రయోగించిన ఈ “దోపిడీ” ఎట్సెటరా కమ్యూనిస్టు పదజాలాన్ని మనలో మనం మనవాళ్ళ మీద, మన స్వదేశీయుల మీద, మన స్వరాష్ట్రీయుల మీద ప్రయోగించడం పూర్తి అసహజం, అసమంజసం. ఉద్యమం వేడిలో మీకిది అర్థం కాకపోవచ్చు.


ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని ప్రాంతాల ప్రజల స్వచ్ఛంద అంగీకారంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడింది. ఇందుకు చరిత్రగ్రంథాలే సాక్షి. ఈనాడు కొందఱు బయల్దేఱి “ఈ సెటప్పు మాకు నచ్చలేదు, మార్చండి” అంటే అది సాధ్యపడదు. సాధ్యపడ్డానికి ఇదేమీ మన వ్యక్తిగత జీవితం కాదు. కోట్లాదిమంది జీవితాలకు సంబంధించిన విషయం. ఇది ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం జాతిద్రోహం కాకపోవచ్చు. కానీ ఇది జాతిద్రోహంగా నెమ్మదిగా పరిణమిస్తుంది. ఇప్పటికే పరిణమిస్తున్నది. ఈ ఉద్యమంలో భావి-జాతిద్రోహ బీజాలు ఉన్నాయి. తెలుగుతల్లి విగ్రహాల్ని ధ్వంసం చేయడం జాతిద్రోహం కాక మఱేంటి ? తెలంగాణలో మాట్లాడేది తెలుగు కాదా ? తెలుగుతల్లి ఆంధ్రా ఏరియాకి పరిమితమా? అంటే ఇక్కడ వేర్పాటువాదులు కోరుతున్నది కేవలం ఒక కొత్త పరిపాలనా విభాగం కాదనీ పక్కనున్న తెలుగు ఏరియాతో శాశ్వత శత్రుత్వమనీ ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. కనుక ఈ డిమాండుని జాతిద్రోహంగా అభివర్ణించడంలో అతిశయోక్తీ లేదు, అసత్యమూ లేదు

చిన్న మాట

ఒ చిన్నమాట ఎదుటిమనిషిలో ఎంత ఆనందాన్నిస్తుందో తెల్సా..
ఒకే ప్రాణంగా బ్రతికిన ఇద్దరు స్నేహితులు విడిపోవాల్సి వచ్చింది..
మనుషులు దూరం అయ్యారు..మనసుల్లో ఇద్దరిమద్యాగ్యాప్..
ఒకేప్రాణంగా ఉన్న ఇద్దరు దూరంఅయినా..ఓ చిన్నమాట..
గుండెల్లో మంటకు ఊరటనిస్తుంది... "బాగున్నావా " అన్న పలకరింపు
.....ఆ మాటలో ఎంత బలముంటుందో తెల్స్తా.........
ఎందుకలా మనసు విప్పి "బాగున్నావా అని " పలకరించుకోరు..
మౌనంలో ఎంత వేదనుంటుందో తెల్సా..అనుబవించేవాళ్ళకే తెలుస్తుంది..
మౌనంగా ఉండి మనం సాదించేదేమిటి..ఎదుటి మనస్సును భాదపెట్టడం తప్ప..
ఎందుకో ఇలా ఆలోచించరు...విడిపోయిన మనసులకు ఇదో ఊరట..
" బాగున్నావా " అని అడిగితే మన ఆస్తులు కరిగి పోతాయా..
ఒక్కచిన్నమాట మనసుకు ఎంతా హానిస్తుందో అని ఎందుకు అనుకోరు..
ఓ సినీ గేయ రచయిత చెప్పాడు " ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏదారెటుపోతుందో ఎవరికి ఎరుక అని "..
ఇలా ఎప్పుడు బద్ద శత్రువుల్లా ఉండి పోవల్సిందేనా..మౌనంగా ఎన్నాళ్ళిలా ఏన్నేళ్ళిలా...

ఆ చిన్న మాట కోసం ఎదురు చూస్తున్నా నీకు ఏమి కాని "స్నేహితుడు "

పదహారణాల తెలుగు అమ్మాయి

పదహారణాల తెలుగమ్మాయి....
కలువల్లాంటి కళ్ళు,
దొండపండులాంటి పెదవులు,
చేమంతుల్లాంటి చెక్కిలూ,
తుమ్మెద రెక్కల హోయల్లాంటి కురులు,
కళ్ళలో మెరిసే వెలుగు ఇంకా చురుకుదనం,
కొంచం సరదాగా,
మరికొంచెం సాంప్రదాయంగా,
కొంచం లక్షణంగా,
చాల గడుసుగా,
చిలిపిగా.
అందంగా, ఆనందం మోమంత విరబూసి,
చెంగు చెంగున తుళ్ళుతూ , లంగావోని వేసుకుని వచ్చే ,
తెలుగింటి అమ్మాయిని చూసి చందమామ కూడా మొహం తిప్పుకోక పోతుందా......?
చెప్పండి మీరే............ ......... .......!
లక్షణంగా నుదుటిన బొట్టు…
కళ్ళకు కాటుక….
వాలు జడ…
గల గల గాజులు….
పదహారణాల చీర కట్టూ….
కాళ్ళకు పట్టాలు….
గోరింటాకు, పూలు..
పెద్ద పెద్ద కళ్లు…
ఆ కళ్ళలో కూసింత పొగరు…
అన్ని కలగలిపి ఉండే
16 అణాల తెలుగు అమ్మాయిని ఇష్టపడని
వారు ఉండరేమో

చేయని తప్పులకు బలికావడం...

తిరగ బడుతున్న కాలం...ఉండలేనంటున్న ఊపిరి..
కొన్ని ఘటనలు జరగబోయే విషయాన్ని చెప్పకనే చెబుతాయి..
ప్రతివిషయంలో ఎదురు దెబ్బలే..అన్ని విషయాలు ఎదురు తిరగడం..
చేయని తప్పులకు బలికావడం...ఇక నీవు ఉండి వేష్టు అని చెప్పకనే చెబుతున్నాయి
ఎంత అలోచించినా ...ఆ నిర్నమే కరెక్టు అనిపిస్తుంది..
కాలం అలా నిర్నయంతిసుకున్నప్పుడు ...మనం ఎంచేసినా జరిగేది అదే..
కనీసం నా అనుకున్నవారు అర్దంచేసుకునే పరిస్థితిలేదు మరి..
నన్ను పూర్తిగా అర్దం చేసుకున్నవారు అర్దాతరంగా దూరం అయ్యారు..
. నీవు దూరం అయిన నాటినుంచే నాకిలా జరుగుతోంది..
ఒక్కోసారి అనిపిస్తుంది నాకిలా జరగాల్సిందే..అవును కదా...?..
..... సరే ఇకనాచేతుల్లో ఏమిలేదు..

12, మార్చి 2011, శనివారం

తెలుగుకి మంచి కీర్తి అన్నగారి చిత్రాలే ఒక్క చక్కని ఉదాహరణ

ఓరోరీ మాయాజూదవిజయమధమధోన్మత్త ! దుర్యోధనా !
నీ దురహంకారానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటాను
ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంబోరు నిజోరు దేశమ్ముననున్దగబిల్చిన,
ఇద్దురాత్ము దుర్వార మదీయ భాహుపరివర్తిత చ్చండగధావిఘాత భగ్నోరుతరోరు జేయుదు
సుయోధనున్ ఉగ్ర రణాన్తరంబునన్

ఒరిరి కురుకుల దార్తా దుశ్శాసనా!
కురువృద్ధుల్ వృద్ధభాన్ధవులనేకుల్ జూచుచుండ ద్రౌపదినిట్లుచేసిన ఖలున్ దుశ్శాసనున్
లోకభీకరలీలన్ వధియిన్చి, తద్విపులవక్షస్తలరక్తౌగ నిర్ఝరి ఉర్వీపతుల్ జూచుచుండ అని
ఆస్వాదిన్తును ఉగ్రాకృతిన్

మాయలతో జనియించి మటుమాయల వృత్తిగానెంచు నీవు,
అహొ ! మాయలనిందసేతువే ?
అమాయకులైన పృధాకుమారులన్ మాయలుపన్ని నాడు అవమానము సేయగలేదే ?
ఆ గతిన్ మాయలతోనే నీ దురభిమానము మాపెదన్ సుయోధనా !

చల్లని మమా ఓ చందమమా నీకు ఇది తగునా?

జపాన్‌ను శుక్రవారం భారీ భూకంపం తాకింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.8గా నమోదైంది. ప్రమాదకరమైన సునామీ కూడా తాకే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. భూకంప తాకిడికి పలువురు గాయపడినట్లు సమాచారం అందింది. అయితే మరణాలు సంభవించినట్లు సమాచారం అందలేదు. పసిఫిక్ కోస్తా ప్రాంతంలోని మియాగి భూకంపానికి గురైంది. ఆ ప్రాంతాన్ని వరదలు ముంచేస్తున్న దృశ్యాలు టీవీ చానెళ్లలో ప్రసారమవుతున్నాయి. భూకంప తీవ్రతకు టోక్యోలోని భవనాలు కూడా కదిలిపోయాయి. టోక్యోలో ప్రకంపనాలకు ఆరు అగ్నిప్రమాదాలు సంభవించాయి.


ఇది చిన్న శాంపిల్ మాత్రమే.. వచ్చే వారం ఇంకా ఓ భయంకరమైన విధ్వంసం జరగనుందని లండన్‌లో ఉన్నటువంటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు దీనికి అంతటికి కారణం 'సూపర్ మూన్' అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సూపర్ మూన్ అంటే ఏమి లేదండీ..20 సంవత్సరాల క్రితం మూన్ భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని, ఇది మాత్రమే కాకుండా భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలై లావా భూమిమీద పారుతుందని అభిప్రాయపడుతున్నారు.

సాధారణంగా నాచురల్ శాటిలైట్ అయినటువంటి భూమికి దగ్గరగా ఈ సూపర్ మూన్ రావడమే ఇందుకు కారణం అంటున్నారు. మార్చి 19వ తారీఖున సూపర్ మూన్ భూమికి అత్యంత సమీపం అంటే దాదాపు 221, 556 మైళ్శ దూరంలో వస్తుందని అంటున్నారు. గత 20 సంవత్సరాలలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదని అన్నారు. గతంలో ఇలాగే సూపర్ మూన్ భూమికి దగ్గరగా 1955, 1974, 1992, 2005లో రావడం జరిగింది. దాంతో ఆయా సంవత్సరాలలో ఇలాంటి విపత్తులు సంభవించాయి.

ఇది ఇలా ఉండగా ప్రముఖ టివి వాతావరణ నిపుణలు జాన్ కెట్ట్‌లీ మాత్రం భూకంపాలు, సునామీ లాంటివి జరగడానికి సూపర్ మూన్ ఏమి కారణం కాదని తన వాదనని వినిపిస్తున్నారు. ఐతే భూమికి సూపర్ మూన్ ఇలా దగ్గరకి వస్తే మాత్రం సముద్రంలో అలలు పోంగుతాయని అన్నారు. ఇలాంటి సందర్బాలలో ముఖ్యంగా తీర ప్రాంతాలలో ఉన్నటువంటి వారు మాత్రం కొంచెం ఇబ్బందులకు గురి కావాల్సివస్తుందని అన్నారు. జపాన్ భూకంపం కారణంగా న్యూజిల్యాండ్, ఇండోనేషియా, ఫిలిప్పేన్స్, న్యూ గునియా, హావాయి తదితర ప్రాంతాలలో మరి కొద్ది గంటలపాటు అలలు ఎగసిపడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించారు

శవాలు శిథిలాల కింద చిక్కుకుపోయారు

జపాన్ సునామీకి 1300 మందికి పైగా బలయ్యారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మంటలు లేస్తున్నాయి. భూకంపం, సునామీ తర్వాత జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో నీరు ప్రవహిస్తోంది. సునామీ, భూకంపాల వల్ల జపాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. శవాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. ప్రజలు సహాయం కోసం అంగలారుస్తున్నారు. తిండి కావాలంటూ, సహాయం చేయండంటూ దీనంగా వేడుకుంటున్నారు. టోక్యోలో సబ్ వేలను మూసేశారు. ఇళ్లు కోల్పోయినవారు రోడ్ల మీదనే జీవితాలను వెళ్లదీస్తున్నారు. బ్రీఫ్ కేసులను దిండ్లుగా చేసుకుని వార్తాపత్రికలు వేసుకుని పడుకున్నారు.

భూకంపం వల్ల అణు రియాక్టర్ కూలింగ్ వ్యవస్థపై ప్రభావం పడడంతో రేడియేషన్ ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ప్లాంట్ చుట్టుపక్కల ఉన్నవారిని ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్రధాని నావోటా కాన్ ఆదేశించారు. ఫుకుషమా ప్లాంట్ ప్రమాదం ప్రజలపై పడకుండా తగిన చర్యల కోసం జపాన్ అమెరికా సహాయం కోరింది.

ఏడుపో... బాధో.....కసోఏమీ చేయలేని అస్సహాయతో.. ఏమీ అర్థం కాని ఓ ఆవేదన!!!

""తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"".

కొందరి దూషణలతో,మరికొందరి భాషణలతో,కొందరి చేష్టలతో,మరికొందరి నిశ్చేష్టలతో,కొందరి ఉద్యమాలతో,మరికొందరి మాధ్యమాలతో
కొందరి విధ్వంసంతో,మరి కొందరి ఉత్సాహం తో విసిగి వేసారి పోయాను,మార్పంటే ఏమిటో మర్చిపోయాను.నాకు నేనే మారిపోయాను.ఇన్నాళ్ళుగా అడ్డొచ్చిన సహనం నిన్నటితో చచ్చిపోయింది,ఎవరు తనో,ఎవరు పరో నిన్నటి తో తెలిసిపోయింది.
ఉందనుకున్న సౌభ్రాతృత్వం లేదని తేలిపోయింది.మనుషులే పోయాకా విగ్రహాలెందుకట,ఉద్యమాల పేరుతో పసి పిల్లల్ని పొట్టన పెట్టుకున్నప్పుడే అడగనోల్లు, బోడి బొమ్మలు నేలకూలితే లొల్లి చేస్తరేమంటుండ్రు.

"ఆ విగ్రహాలకు ప్రాణముంటదా? పోతే మళ్ళీ పెట్టుకోవచ్చు" వింటానికి సిగ్గుగా ఉంది మనకి!!!!

నడి వీధిలో మీ సంస్కృతిని మీరు నగ్నంగా నిలబెట్టి నిర్వచించారు!
మీరేమిటో ప్రపంచానికి చాటారు !
మీ సంస్కారాన్ని బట్టలు విప్పి టాంక్ బండ్ మీద ఊరేగించారు. !
మీ అంతిమ లక్ష్యమేమిటో చూపించారు.మీరు హుసేన్ సాగర్లో వేసింది కేవలం విగ్రహాలను కాదు, తెలుగు ప్రజల ఆత్మని!
తెలుగు వెలుగులారా..! క్షమించండి!
తన ముద్దు బిడ్డలకు పట్టిన గతి చూసి అల్లంత దూరాన ప్రభుత్వ భవనం ముందు.... నోట్లో చెంగు కుక్కుకుని గోలుగోలున ఏడుస్తున్న తెలుగు తల్లి సాక్షిగా
మేము...చచ్చిపోయాం!
మా రక్తంలో వేడి చల్లారిపోయింది.
మిమ్మల్ని కాపాడుకోలేక ఇళ్ళలో టీవీల ముందు కూచుని కళ్ళు తుడుచుకున్నాం!
NTR.... క్షమించు మమ్మల్ని!
తెలుగు ఆత్మగౌరవం నినాదాన్ని నువ్వు వినిపించినా, దాన్ని ఇవాళ మేము నినదించలేకపోయాం! ........
ఆత్మలు చచ్చిన వాళ్లకు గౌరవం ఎందుకని!
పోలీసుల సాక్షిగా సాగిన దమనకాండ ని చూస్తూ కృష్ణ దేవరాయలకు,బ్రహ్మనాయుడికి హుసేన్ సాగర్ నీళ్లతో తర్పణాలు విడిచాం!
మహనీయులను సదా స్మరించుకునే అవకాశం నువ్విచ్చినా మేము నిలుపుకోలేకపోయాం!
ఎముకలు కుళ్ళి,శక్తులు చచ్చిన వాళ్ళం...క్షమించు....

పదవీ వ్యామోహాలు-కులమత భేదాలు,
భాషాద్వేషాలు చెలరేగె నేడు !
ప్రతి మనిషి మరి యొకరిని దోచుకొనేవాడే,
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకొనే వాడే!
స్వార్ధమే అనర్ధదాయకం !
అది చంపుకొనుటే క్షేమదాయకం !

నేను తెలుగువాడినన్న అహంకారం పటాపంచలైతే నిద్రెలా పడుతుంది?

ట్యాంక్ బండ్ మీద ఎక్కువగా సీమాంధ్రకు చెందిన వ్యక్తుల విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించారని, తెలంగాణలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తుల విగ్రహాలు తక్కువగా ఉన్నాయని తెలంగాణావాదులు చాలా కాలంగా వాదిస్తూ వస్తున్నారు. విగ్రహాలను ధ్వంసం చేస్తామని కూడా హెచ్చరికలు చేస్తూ వచ్చారు. ఈ హెచ్చరికల మేరకు ట్యాంక్ బండ్‌పై ఉన్న వ్యక్తుల విగ్రహాలను ధ్వంసం చేశారని భావించాల్సి ఉంటుంది. అయితే, ఒక పథకం ప్రకారం జరిగినట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. ఉదయం పూట పోలీసులు, మీడియా ప్రతినిధులతో మాత్రమే నిండిపోయిన ట్యాంక్ బండ్ మధ్యాహ్నం తర్వాత తెలంగాణవాదులతో అట్టుడికిపోయింది. గుంపులు గుంపులుగా వచ్చిన తెలంగాణ వాదుల దాటికి పోలీసులు బిత్తరపోయారు. వారిని కట్టడి చేయడం పోలీసుల వల్ల కాలేదు. తీవ్ర ఉద్రిక్తత మధ్య తెలంగాణవాదులు విగ్రహాలను ధ్వంసం చేశారు.

ధ్వంసమైన విగ్రహాలను చూస్తే ఏరికోరి విధ్వంసానికి దిగినట్లు కనిపిస్తోంది. సీమాంధ్ర ప్రాంతంలో గణుతికెక్కిన అన్నమయ్య, ఎర్రాప్రగడ, శ్రీకృష్ణ దేవరాయలు, సిద్ధేంద్ర యోగి, పల్నాటి బ్రహ్మనాయుడు ,ముట్నూరి కృష్ణారావు, కందుకూరి వీరేశలింగం, త్రిపురనేని రామస్వామి చౌదరి, ఆర్థర్ కాటన్, బళ్లారి రాఘవ, గురజాడ అప్పారావు, రఘుపతి వెంకయ్య విగ్రహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తెలంగాణకు చెందిన సురవరం ప్రతాప రెడ్డి, రామదాసు, మగ్దూం మొహియుద్దీన్ విగ్రహాల జోలికి ఆందోళనకారులు వెళ్లలేదు. సీఆర్ రెడ్డి విగ్రహాన్ని ఎందుకు వదిలేశారో తెలియదు గానీ నన్నయను తొలి తెలుగు కావ్యాన్ని సృష్టించిన కవి కావడం వల్ల వదిలేసి ఉంటారు. పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఆయన జాతీయ జెండాను రూపొందించిన మహా వ్యక్తి కావడం వల్ల ముట్టుకుని ఉండరు. శ్రీశ్రీ విప్లవ కవి కావడం వల్ల, గుర్రం జాషువా దళిత కవి కావడం వల్ల వదిలేసి ఉండవచ్చు. అయితే, తిక్కన, క్షేత్రయ్య, అల్లూరి సీతారామా రాజు విగ్రహాలను ఎందుకు వదిలేశారనేది హేతువుకు అందడం లేదు. అయితే, విగ్రహాల ధ్వంసంలో తెలంగాణవాదులు స్పష్టమైన హేతువును అనసరించి ఉంటారని భావిస్తున్నారు

నిన్న రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. ఒక్కసారిగా నేను తెలుగువాడినన్న అహంకారం పటాపంచలైతే నిద్రెలా పడుతుంది?“ఆఁ! ఇందులో ఏముంది? విగ్రహాలే కదా! మళ్ళీ తయారుచేసుకోవచ్చులే” అని తాపీగా వినిపిస్తున్న సమాధాన స్వరాలు పుండు మీద కారం చల్లినట్లున్నాయి.ధ్వంశం కాబడిన ప్రతీ విగ్రహం గురించి పుటలు పుటలుగా వ్రాయవచ్చును. కానీ శ్రీకృష్ణదేవరాయలు, అన్నమయల విగ్రహాల ధ్వంశం ఎంతకీ మింగుడు పడటంలేదు. అసలు ఉద్యమానికి వీళ్ళకి ఏమన్నా సంబందం ఉందా?

పక్కనే కొండ మీద ఉన్న బిర్లా మందిర్ బహుశః తదుపరి లక్ష్యం కాబోలు. ఎంతైనా వేంకటేశ్వరస్వామి రాయలసీమ దేవుడు కదా? కొండ క్రింద ఆయన భక్తులలో తలమానికమైన అన్నమయ్యకే దిక్కు లేదు. తిరుమల క్షేత్రంతో దగ్గిర సంబంధం ఉన్న గొప్ప చారిత్రిక చక్రవర్తి అయిన కృష్ణదేవరాయల విగ్రహానికే విలువలేదు. అటువంటప్పుడు, రాయలసీమలో వేలసిన వేంకటేశ్వరస్వామి వారికి మాత్రం విలువేముంది; ఇక్కడ అస్థిత్వం ఎలా అనుమతించబడుతుంది?

11, మార్చి 2011, శుక్రవారం

మాసిపోని అపచారం ట్యాంకు బండు విధ్వంసం

తెలుగు జాతి ఔన్నత్యానికి బాటలు వేసి, సాహిత్యం, కళలు సహా వివిధ రంగాల్లో విశేష కృషి చేసి, తెలుగువారికి అంతర్జాతీయ ఖ్యాతినార్జించి పెట్టిన మహనీయుల విగ్రహాలు ధ్వంసమయ్యాయి. హైదరాబాదులో గురువారం నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌లో ఆందోళనకారులు 12 విగ్రహాలను ధ్వంసం చేయడంతో కొన్నేళ్లుగా ప్రజలను అలరిస్తున్న ట్యాంక్‌ బండ్‌ తీరం కళ తప్పింది.
ప్రాంతీయ వివాదాలతో పాలక పక్షాలు సాగిస్తున్న కుటిల వ్యూహాలు రాష్ట్రాన్ని ఏ స్తితికి చేర్చాయో గురువారం నాడు ట్యాంకుబండ్‌పై బుద్ధవిగ్రహం సాక్షిగా సాగిన విధ్వంస కాండ వెల్లడించింది. ఈ అనాగరిక అరాచక చర్యలు తెలబాన్ ప్రజల ప్రజాస్వామిక సంసృతికే కళంకం తెచ్చి పెట్టాయి.తెలుగు వైతాళికుల విగ్రహాలని తెలుగు వారే ధ్వంసం చేస్తుంటే ఏడుపో... బాధో.....కసోఏమీ చేయలేని అస్సహాయతో.. ఏమీ అర్థం కాని ఓ ఆవేదన!!!

మిలియన్‌ మార్చ్‌ జయాపజయాలు పంతాలు పట్టింపులు పక్కన పెట్టి తెలుగు ప్రజల మహత్తర వారసత్వాన్ని వీర తత్వాన్ని తూట్లు పొడిచే ప్రక్రియ విజయవంతంగా సాగింది.చాపకూటితో సమతను నేర్పిన నాటి పలనాటి బ్రహ్మన్న, విశ్వ నరుడ నేను అని సగర్వంగా చాటుకున్న దళిత కోకిల జాషవా, బ్రహ్మమొక్కటేనని మానవులు ఏకత్వాన్ని ఏనాడో చాటిన అన్నమయ్య ,విప్లవ కవితా ప్రవక్త శ్రీశ్రీ చెప్పాలంటే ప్రాత:స్మరణీయులైన మహనీయులందరి ప్రతిమలను తుత్తునియలు చేసి అనాగరికతను చాటుకున్న అరాచకం తాండవించింది. ఈ విగ్రహాలకు విలువ ఇవ్వడం కాదు విగ్రహాల వెనకనున్న విలువల విధ్వంసం ఇక్కడ సమస్య.నాలుగు డబ్బులు ఖర్చు చేస్తే రేపే వాటిని పునరుద్దరించవచ్చన్న మాటలు జరిగిన విధ్వంసం కన్నా తీవ్రమైనవి.దీనికి నాయకులైన వారు పునరాలోచించుకోకపోతే రేపు ఇదే వారికీ జరగొచ్చు.

“ఎవరు ఎలా తగలడితే మాకేంటి?” అని ఇటువంటి ఇక్కట్లకు అలవాటుపడ్డ భాగ్యనగర వాసులు(అయోమయంలో), నిత్య జీవితాన్ని ఎలాగోలా నెట్టుకొద్దామనే ప్రయత్నించాలని నిర్ణయించుకున్నట్టు రహదారులమీది ట్రాఫిక్ చూస్తే అర్థమవుతోంది.ఇదా పద్దతి? ఖర్మ కాలి గోడవలు రగులుకునుంటే, ఆ పిల్లల సంగతేంటి? ఇంతటి నీఛానికి దిగాల్సిన అవసరముందా? అసలే పరీక్షల సమయం. అందులో మిట్ట మధ్యాహ్నం. చిచ్చుపెడితే రగిలిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు.

ప్రతిరోజు సాయంత్రం ట్యాంక్‌బండ్‌కు వచ్చే సందర్శకులు ఆ విగ్రహాల వద్ద సేదతీరుతూ తమ పిల్లలకు ఆ మహనీయుల గురించి వివరించే హక్కు మనము పొగుట్టుకున్నము.ఇదేనా!!ఇదేనా!!ఇదేనా!!రేపటి మన పిల్లలకు మనము ఇచే కానుక. ఇకనైనా మనము కళ్ళు తేరవండి.

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని

ఏమున్నది ఏమున్నది ఈ ఉద్యమాల ఔచిత్యం
దుందుడుకు చర్యలకు ఎక్కడిది ఔనత్య౦
తెలుగు వాడు సిగ్గుపడే దుర్దినం
స్పృహ లేని దిశగా నిర్దేసనం లేని ఈ ఉద్యమం

వెర్రి ముదిరితే తలకు రోలు చుట్టమన్నాడొకడు
చుట్టుకున్నోడూరుకోక పది మందిని పోగు చేసి
భలే భలే బావుందంటూ వీధిన పడి వెర్రి తలలు వేస్తున్న ఈ వైనం
పది కాస్త వందలై ట్యాంక్‌బండ్ విగ్రహాల మీద దుశ్చర్య సాగించిన ఈ కుత్సితం

వార్తని చూశాను టీవీ 9 లో వార్తను చూశాను
దుర్మదాంధ బుద్ధిహీన శూన్యుల దుశ్చర్యలను
వికృతమైన చేష్టలను
బుద్ధిమాంద్యుల ఉనికిని
నా దేశం నా రాష్ట్రము నా జిల్లాలో ఉందని
తెలుసుకొని అభివృద్ధి పధాన సాగుతున్న తీరుని..
హే రామా మాటలు ఆగిపోయి స్థాణువునై నే మిగిలిపోని

ఇన్నాళ్ళు తెలబాన్లు అంటూ బ్లాగర్లు సంభోదిస్తున్న తీరు కరెక్ట్ కాదేమో అన్న ఒక మీమాంసలో ఉన్న జనాలకు ఈనాడు సాగించిన ఈ దుర్మార్గపు దుశ్చర్య వాళ్ళకు ఎంత గౌరవం అర్హమో అంతే లభిస్తుందని నిరూపించుకున్నారు. పరమ భక్తాగ్రేసరుడు పద కవిత పితామహుడు అన్నమయ్య విగ్రహాన్ని కూడా వదల్లేదంటే పిచ్చి ముదిరి రోకలి తలకు కట్టించుకొని తిరుగుతున్నారు.
బుద్దుని బమియాన్ విగ్రహాలు ద్వంసం చేసి ఆనాడు వాళ్ళ ఉనికిని ప్రపంచానికి చాటారు ఆ తాలిబన్లు. మన వాళ్ళు అంతకు రెండు ఆకులు ఎక్కువే చదివి మన సంస్కృతికి చిహ్నాలైన మహనీయుల జ్ఞాపికల ఫై పడి మరెంతో ఘన కీర్తిని సంపాయించారు. శబ్భాష్ !! ఉన్మత్త తాండవం చేసే బుద్ధి హీనుడికి పరతమ బేధాలు మంచి చెడు విచక్షణ కోల్పోయి ఈ విధంగానే ప్రవర్తిస్తారు.

రోజు చేయండి మిలియన్ మార్చులు. రాత్రి పగలు తేడ లేక మరీ చేయండి. మనకెలా పనికి మాలిన పరీక్షలు .అవి కూడు పెడుతాయా గుడ్డ పెడుతాయా. భూమి ఏర్పడక ముందే ఏర్పడింది ఈ తెలంగాణా ఆకాంక్ష. యుగాలు మారినా మనువులు మారినా ఈ బ్రహ్మాండం అంతా వ్యతిరేకంగా కుట్రలు చేసి మా కలలు సాకారం కానికుండా మేము దోపిడీకి గురయ్యాము ఈ రాత్రికి రాత్రే తెలిపోవాలె, ఏమి ఎందుకు తేలరాదు రాత్రి పోయి తెలవారట్లే? యుగాల ఆకాంక్ష ఈ రాత్రికి రాత్రి తీరే వరకు ట్యాంక్ బండ్ మీద నిరసన సాగాలి.

10, మార్చి 2011, గురువారం

హమయ్య మా నాన్న ఇల్లు నాకు వచ్చింది

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి కి మంగళవారం హైకోర్టులో చుక్కెదురైంది. ప్రస్తుతం ఆమె నివాసం ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి వెంటనే ఎన్టీఆర్ చిన్న కూతురుకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. రెండు నెలల్లో ఇంటిని ఖాళీ చేయాలని చెప్పింది. లక్ష్మీపార్వతి నివాసం ఉంటున్న ఇంటిని ఆయన చిన్న కుమార్తె అయిన ఉమా మహేశ్వరికి రాసిచ్చారని ఖాళీ చేయాలని చెప్పింది. లక్ష్మీపార్వతి ఉంటున్న బంజారాహిల్స్‌లోని రోడ్డు నెం.13లో ఉంటుంది. న్యాయమూర్తులు జస్టిస్ బి. ప్రకాశరావు, జస్టిస్ రెడ్డి కాంతారావులతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది.ప్రస్తుతం లక్ష్మీపార్వతి ఉంటున్న ఇంటిపై హక్కులు తమకే ఉన్నాయని ఉమా మహేశ్వరి నుంచి జీపీఏ పొందిన ఎన్.రామకృష్ణ పన్నెండేళ్ల క్రితం సిటీ సివిల్ కోర్టులో దావా వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సిటీ సివిల్ కోర్టు 2005 ఉమా మహేశ్వరికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అయితే దీనిపై లక్ష్మీపార్వతి హైకోర్టును వెళ్లగా సిటీ సివిల్ కోర్టు ఆదేశాలపై గతంలో స్టే ఇచ్చింది. ఈ స్టే ఎత్తి వేయాలని, ఇంటికి హక్కుదారులను నిర్ణయించాలని రామకృష్ణ అఫిడవిట్ వేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ లక్ష్మీపార్వతి ఉంటున్న ఇంటిపై హక్కులు ఉమామహేశ్వరికే చెందుతాయని స్పష్టం చేసింది.

9, మార్చి 2011, బుధవారం

కొన్ని ఆలోచనలు.. కాదు కాదు.. అనుభూతులు..

ఈ రోజు ఉదయం నుంచి నా మదిలో మెదిలిన కొన్ని ఆలోచనలు..

ప్రేమంటే.. స్వార్థం కంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది..
ప్రేమంటే.. నన్ను నేనే అర్పించుకున్నా.. నీకోసం ఇంకా ఏదో చేయ్యాలనిపించేది..
ప్రేమంటే.. అందని ఆకాశాన్ని కాదు.. ఎదిరించే పక్షి రెక్కలను చూసి ముచ్చట పడేది..
ప్రేమంటే.. ఆశకీ .. జ్ఞాపకానికి.. ముడిపెట్టేది.. మురిసి పోయేది..
ప్రేమంటే.. కాలం కన్నా చాలా చిన్నది.. జీవితం కంటే చాలా పెద్దగా మిగిలిపోయేది..
ప్రేమంటే.. నన్ను నేను కోల్పోయినా .. నీకు మాత్రం చేరువవ్వాలని అనిపించేది..
ప్రేమంటే.. నీలోనూ ఉన్నది నేనే అని ఒప్పుకునేది.. నేనూ నీవే అని ఒప్పించేది..
ప్రేమంటే.. ఆ అనంతం.. అంతలోనే నాలో కరిగే ఈ క్షణం..

ప్రేమంటే.. అంతకంటే ముఖ్యమైంది ,, ఉన్నతమైనది.. ఒకటుంటే..
అదికూడా ప్రేమే.. అనిపించేది

ఇదీ మన శాసన సభ పరిస్థితి

అసెంబ్లీ వార్తలకు "A" సర్టిఫికేట్ ఇవ్వచ్చు..

హింస, దౌర్జన్యం, బూతులు, కోతి చేష్టలు, జుగుప్స కలిగించే ప్రవర్తన.. ఇదీ మన శాసన సభ పరిస్థితి. ఈ దరిద్రానికి సంభందించిన వార్తలు రాత్రి పదకొండు తరువాతే ప్రసారం చెయ్యాలని ఓ రూల్ పెడితే బావుణ్ణు.

ప్రజాస్వామ్యం అసలు స్వరూపమిదా ? రాజ్యాంగానికి మనం ఇచ్చే విలువ ఇంతేనా ? మనల్ని మనం పాలించుకునే అర్హత అసలు మనకు ఉందా ? నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను.

*****ఉద్యమం ముసుగులో ఎలాంటి వ్యక్తులు నాయకులు గా మారి రేపు మనల్ని ఉద్ధరించబోతున్నారో తేటతెల్లమైంది*****


నిజంగానే, ఎవరైనా ప్రజలకు మంచి చెయ్యడానికి రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఇప్పుడు ఉందా ?
ఐదేళ్లకోసారి వచ్చే బూటకపు ఎన్నికలు - అస్థిపంజరాలకు అందాల పోటీలేనా ?

ఈ నాలుగు మాటలూ రాసి సాధించేదేమీ లేదు.. ఎందుకంటే, మన కర్మ భూమిలో అందరూ కరక్టే. కాని నా బాధని వెళ్ళగక్కకుండా ఉండలేకపోయాను. దేవుడు కూడా మనల్ని కాపాడలేడేమో..

కాంగ్రెస్ నాయకుల పంచలు ఊడదీసి కొట్టమన్నాడు అప్పటి యువ రాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.

తెలంగాణా వల్లా ?
కాదు, ఎందుకంటే ఆ విషయం లో ఇప్పుడు వచ్చిన కొత్త క్లారిటీ ఏమీ లేదు గా..
సామాజిక న్యాయమా ?
రాష్ట్రం లో, ఒకటే కులాన్ని పట్టుకుని వేళ్ళాడుతున్న కాంగ్రెస్ ఇప్పుడు కొత్తగా ఇచ్చే న్యాయమేంటి..
మరి జగనా.. లేక స్థానిక ఎన్నికలా.. ?

నాకైతే, వీటన్నటికంటే, YSR , రోశయ్య పంచ కట్టుకోవడం వల్లే ఇన్నాళ్ళూ లేట్ అయిందని అనిపిస్తోంది. ఎందుకంటే, కాంగ్రెస్ నాయకుల పంచలు ఊడదీసి కొట్టమన్నాడు అప్పటి యువ రాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈ ఒక్క భయం/కారణం చాలదూ ఈ ఆలస్యానికి. అంటే, ఇప్పుడు స్టైల్ గా ప్యాంటు వేసుకునే కిరణ్ కి పర్వాలేదనే కదా అర్థం. (డి శ్రీనివాస్ సంగతంటారా.. ఆయన ఉన్నా లేనట్టే..)

ఈ విలీనం తో రాష్ట్రానికి కొత్తగా వచ్చేది.. పోయేది ఏమీ లేదు అని నా గట్టి అభిప్రాయం. కానీ "యూజ్ అండ్ త్రో" టైపు కాంగ్రెస్, చిరంజీవికి ఇచ్చిన రహస్య హామీలను నిలబెట్టుకుంటుందా ?

నగదు బదిలీ లా, అంత సులువుగా చిరూకి పడ్డ ఓట్లు (ముఖ్యంగా ఆయన సామాజిక వర్గానివి) కాంగ్రెస్ కి బదిలీ అవుతాయా ?
వేచి చూడాల్సిందే.

కానీ ఈ మొత్తం ఎపిసోడ్, ఏదో స్టార్ట్ అప్ కంపెనీ పెట్టి, కాస్త లాభాలో/నష్టాలో ఒచ్చిన వెంటనే ఓ బడా MNC కి అమ్మేసినట్టు అనిపిస్తోంది. మన రాష్ట్ర రాజకీయాల్లో ఇదో కొత్త ఒరవడి. దీన్ని "చిరు మార్గం" అని పిలుచుకోవచ్చు. మార్పో.. మార్పు అన్నాడు.. ఇప్పుడు ఏ చానెల్ చూసిన ఆయన అమ్మిన మార్పే కనిపిస్తోంది. పర్లేదు లెండి, మన జనాలు ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోరు.
అయినా రిమోట్ కి టీవీ ఎప్పుడూ లోకువే మరి.. (ఫ్లో లో వచ్చింది ఫాలో అయిపోవడమే .. )

8, మార్చి 2011, మంగళవారం

తెలుగు వాళ్ళ మందరమూ కలసి కట్టుగా వుంటే చక్కగా జీవిస్తామను సంగతి నేనెరిగిందే

తొలి నుంచి నాకుందొక
దురలవాటో సదలవాటో
అనుకున్నది అనుకున్న
ట్లనేయడం , రాయడమూ
అదే నేరమయితే నే
నందుకొప్పుకొంటున్నా

తెలుగు వాళ్ళ మందరమూ
కలసి కట్టుగా వుంటే చక్కగా
జీవిజీవిస్తామను సంగతిస్తామను సంగతి
నేనెరిగిందే

మీ దారిన మీరు పొండి
నా దారిని నాకు వదిలి
మీరట ప్రజలంటారు
నేనూ ప్రజలంటాను
మీ ప్రజకూ నా ప్రజకూ
పొంతన కుదరదు లెండి

చస్తున్న వ్యవస్త మీది
వస్తున్న చరిత్ర నాది
శవాదరణ మీ ధ్యేయం
శిశూదయం నా న్యాయం

విప్లవ ఝుంఝూనిలాలు
వీస్తున్న సంవత్సరాది నేడు
విప్లవ రణదుంధుభులు ధ్వ
నిస్తున్న శుభాళి నేడు

విగతాశులు ప్రగతిమార్గ
విరోధులకు సమాధి
విప్లవజన వాహినులు జ
యిస్తున్న ఉగాది
తెలుగువారి ధీశక్తి
తెలుగువారి క్రియా శక్తి
నలుదెసలా రహించాలి
తెలుగుతనం జయించాలి

ఐదు కోట్ల తెలుగు జాతి
హర్షించాలి
ఆనందం తెలుగునాట
వర్షించాలి
తెలుగువాడి తెలుగు ‘వాడి’
దీపించాలి
తెలుగునాట తెలుగుపాట
వ్యాపించాలి
తమ గమ్యం తెలుగువాళ్లు
చేరాలంతే
ఈ సంవత్సరవేళ నేను కోరేదింతే

మహిళా బ్లాగ్మిత్రులందరికీ నూరవ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ....

ఈరోజు నూరవ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
అసలు ఇప్పటికైనా మహిళా దినోత్సవ ఉద్దేశ్యం నెరవేరిందా ?
మహిళా సమస్యలకు సరైన పరిష్కారాలు దొరికాయా ?
మహిళాభ్యుదయం నిజంగా జరిగిందా ?


మహిళలు చాలా రంగాల్లో పురోగమించిన మాట నిజమే ! అంత మాత్రం చేత తరతరాలుగా వున్న వారి సమస్యలు తీరిపోలేదు. వివక్షత సమసిపోలేదు. పైగా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి.

ప్రకృతిలో స్త్రీకి, పురుషుడికి భౌతికంగా భేదం చాలా స్వల్పం. అది కూడా వారి కర్తవ్య నిర్వహణ కోసం ఆ మాత్రం భేధమైనా వుంది. కానీ మనం ఒప్పుకోవాల్సింది మానవజాతి మనుగడలో ఇద్దరికీ సరి సమానమైన బాధ్యత వుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ అసలు మానవజాతి పుట్టుకలో మాత్రం స్త్రీ కొంచెం ఎక్కువ బాధ్యతనే మోస్తోంది. ఆ విషయంలో స్త్రీ ఏమాత్రం అలక్ష్యం, అశ్రద్ధ చూపినా అసలు మనిషి పుట్టుక సందేహమే !

అందుకే మనం స్త్రీని జగజ్జననిగా ఉన్నత స్థానాన్ని ఇచ్చి కొలుస్తాం. త్రిమూర్తులకంటే శక్తివంతమైనది ఆమె. అందుకే ఆమె మహాశక్తి స్వరూపిణి అయింది. ఆదిశక్తి అయింది. మూలపుటమ్మ అయింది.

దేవతగా స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలుస్తున్నాం. కానీ నిజ జీవితంలో ఆమెకు ఆ స్థానం ఇస్తున్నామా ?
పురాణాల్లోని మహిళలకు తమ భర్తల్ని తామే ఎంచుకునే హక్కు వుంది. కానీ నాగరికంగా ఇంతగా అభివృద్ధి చెందిందనుకుంటున్న ఈరోజుల్లో కూడా ఎంతమంది స్త్రీలు ఆ హక్కును అనుభవిస్తున్నారు ? ఒకవేళ ఎవరినైనా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్నా అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల అడ్డంకులు. ఇవన్నీ కష్టపడి దాటి ఎలాగో పెళ్ళిచేసుకున్నా తర్వాత వారి జీవితం సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతున్నదనుకోవడానికి వీలు లేదు.

అసలు స్త్రీల సమస్యలకు, వివక్షతకు పురుషులే కారణమా ? అని ఆలోచిస్తే నాణేనికి బొమ్మా బొరుసూ వున్నట్లు ఆడైనా, మగైనా మనుషులందరిలోనూ మంచి చెడూ వుంటాయి. భార్యను వేధించే మగవారున్నట్లే వారికి సహకరించే అత్తలు, ఆడపడచులు వున్నారు. అసహాయ స్త్రీలను చేరబట్టే పురుషులున్నట్లే వారిని వక్రమార్గాలు పట్టించే స్త్రీలున్నారు. నేరాలు ఘోరాలు కేవలం పురుషులకు మాత్రమే పరిమితం కాదు. స్త్రీలలో కూడా ఆ ప్రవృత్తి కలిగిన వారు వున్నారు. తమ కొడుకునో, సోదరుడినో తమకు కాకుండా చేస్తుందనే అబధ్రతా భావం మొదటి రకం వారి ప్రవర్తనకు కారణమైతే, డబ్బు వ్యామోహం రెండో రకం వారి, మానసిక బలహీనతలు, పుట్టి పెరిగిన నేపథ్యం మూడో రకానికి కారణమవుతాయి. ఇవన్నీ కాకుండా నిష్టూరమైనా ఒప్పుకోవాల్సిన విషయం ఆడవారిలో అసూయ ఎక్కువ అని. కారణాలేమైనా ఇవన్నీ ఆడవారిపట్ల శాపాలుగా మారాయి. కనుక ఈరకమైన స్త్రీలు తమ ఆలోచనలను, ప్రవర్తనను మార్చుకొని, సంఘటితమైతే వారిని ఏరకమైన వివక్షతా దరిచేరదు. ఎవరూ వారిని అణచలేరు.

మహిళా బ్లాగ్మిత్రులందరికీ నూరవ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ....

7, మార్చి 2011, సోమవారం

నిజాన్ని గ్రహించు

తెలంగాణ ఉద్యమం అనేది తెలుగుదేశం పార్టీని డౌన్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ నుంచీ తెఱ వెనక ఉండి డబ్బులిచ్చి మఱీ కృత్రిమంగా నడిపిస్తున్న వ్యూహాత్మక ఉద్యమమని తెలంగాణ అమాయకులకు తెలియదు. తెలియక, అదేదో తమవాళ్ళ ప్రతిభ, సృజనాత్మకత, పౌరుషం అనుకుని ఇంకా ఎక్కువెక్కువ లొల్లి చేస్తే భయపడి రాష్ట్రం ఇచ్చేస్తారనుకొని తెలంగాణకి అక్షరాలా నిప్పెట్టేస్తున్నారు. కేసీయార్ గర్జనలన్నీ నిజమనుకుంటున్నారు. మిహతా రాష్ట్రమంతా ఆనందంగా గడిపేస్తూండగా తెలంగాణ ఒక్కటీ ఒక తప్పుడు మిథ్యా ఉద్యమం పేరుతో నిలువునా తగలబడిపోతోంది. అందఱూ కలిసి దీన్ని ఎలాగైనా ఆపాలి !


తెలంగాణ సోదరులారా !

మీరు వట్ఠి అమాయకులు

కాంగ్రెస్ రాజకీయం తెలియని పిచ్చోళ్ళు

ఉద్యమం రేపెట్టింది వాళ్ళు

తాము వెనకుండి కేసీయార్ ని ముందుకు తోసింది వాళ్ళు

కేసీయార్ కి తెలంగాణ భవన్ ఇచ్చింది వాళ్ళు

అతన్ని గెలిపించింది వాళ్ళు

ఎవళ్ళు ? బాబూ ! ఇంకెవళ్ళు మన కాంగ్రేసోళ్ళు

కేసీయార్ కి డబ్బులు దొబ్బబెట్టింది వాళ్ళు

అతని చేత నిరాహారదీక్ష చేయించింది వాళ్ళు

విరమింపజేసింది వాళ్ళు

ఉద్యమం చేయించింది వాళ్ళు

ఎవళ్ళు ? బాబూ ! ఇంకెవళ్ళు మన కాంగ్రేసోళ్ళు

సహాయనిరాకరణ చేయించింది వాళ్ళు

నిరాకరణ విరమణ చేయించింది వాళ్ళు

మిలియన్ మార్చ్ చేయిస్తున్నది వాళ్ళు

ఇస్తామన్నది వాళ్ళు, వెనక్కు తీసుకున్నది వాళ్ళు

ఎవళ్ళు ? బాబూ ! ఇంకెవళ్ళు మన కాంగ్రేసోళ్ళు

ఇహనైనా కళ్ళు తెఱవండి ! విషయాలు గ్రహించండి !

రాని రాష్ట్రం కోసం అన్నదమ్ముల్లాంటి

ఆంధ్రావాళ్ళతో అనవసరంగా గొడవపడకండి !

ఢిల్లీ కాంగ్రెస్ కుటిల రాజకీయాలకు

కరాళంగా బలికాకండి !

ఇతరులని బలి చేయకండి !



మీరు సమైక్యవాదుల్ని అమ్మనా బూతులు తిట్టినా ఫర్వాలేదు గానీ మీ నిజాన్ని గ్రహించి మీ యీ ప్రవర్తనకు సిగ్గుపడే రోజు తప్పకుండా వస్తుంది. చాలా తొందఱగానే రాబోతోంది

6, మార్చి 2011, ఆదివారం

ప్రభుత్వం తక్షణం అలసత్వాన్ని వీడి పాలనా యంత్రాంగాన్ని పట్టాలెక్కించాలి.

పని చేయని ప్రభుత్వోద్యోగులు + పరీక్షలు రాయని విద్యార్ధులు + స్వార్ధ రాజకీయాల కోసం దొంగ ఉద్యమాలు చేసే తెలబాన్ గుంపులు + చేత గాక చోద్యం చూసే ప్రభుత్వం ..... వీరందరి మధ్య సామాన్య మధ్య తరగతి /బడుగు జీవుల సమస్యల గురించి ఆలోచించే వాడెవడైనా వున్నాడా? అసలు ప్రత్యెక రాష్ట్రం వచ్చినంత మాత్రాన ఉద్యోగులకి, విద్యార్ధులకి ఒరిగేదేమిటి? పరీక్షలు బహిష్కరించమని రెచ్చగొడుతున్న ప్రొఫెసర్ కి జీతంలో ఒక్క రూపాయి కూడా నష్టం వుండదు. కానీ నష్ట పోతున్న విద్యా సంవత్సరం గురించిన ఆలోచన రోడ్డెక్కుతున్న విద్యార్ధులకి ఉండద్దా? వుద్యోగులైనా అంతే! ప్రత్యెక రాష్ట్రం వస్తే స్పెషల్ ఇంక్రిమెంట్ అని తెలబాన్ దొర చెప్పగానే పనులు మానేసి రోడ్ల మీదకి వచ్చేయటమే! డ్యూటీ చేయని ఉద్యోగుల పై శాఖా పరమైన చర్యలు ప్రభుత్వం మొదటి రోజే తీసుకొని వుంటే విషయం ఇంత ముదిరేది కాదు. పని చేయని వారి పై చర్య తీసుకోవటం వేధింపు చర్య కానే కాదు. ప్రభుత్వం తక్షణం అలసత్వాన్ని వీడి పాలనా యంత్రాంగాన్ని పట్టాలెక్కించాలి. అలాగే రైల్ రోకో పేరు మీద పట్టాలెక్కటానికి సిద్ధమవుతున్న వారిని అదుపు చేయాల్సింది పోయి రైల్వే శాఖ ముందుగానే రైళ్ళని రద్దు చేయటం చాల దారుణం. ఏతా వాతా తేలేదేమంటే సామాన్య ప్రజల ఇక్కట్లనేవి ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టట్లేదని.... ప్రశాంత జీవన పరిస్థితులకి పాడె కట్టి వూరేగిస్తున్న తెలబాన్ గుంపుల అక్రుత్యాలని అడ్డుకోలేని పక్షంలో తక్షణం ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలి.

మానసిక వేదనతో వారి తల్లి దండ్రులని వేధిస్తున్న మిలియన్ మార్చ్

మిలియన్ మార్చ్ పేరుతొ పదవ తేదీన తెలబాన్ గుంపులు తల పెట్టింది భాగ్య నగర దిగ్బంధనం కాదు..వేలాది మంది విద్యార్ధుల భవిష్యత్ దిగ్బంధనం. ఇంటర్ పరీక్షలతో పాటు విద్యార్ధి భవిష్యత్తుకి కీలకమైన పదవ తరగతి పరీక్షలు జరుగనున్న పదవ తేదీన తల పెట్టిన మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే నిషేధించాలి. తెలంగాణా ఆకాంక్షని తెలియ చేయడానికన్న వంకతో టెన్త్ క్లాస్ విద్యార్ధుల భవిష్యత్తుతో ఆటలాడటం క్షమించరాని నేరం. పైగా తాము ఉద్యమం తల పెట్టామని పరీక్షలు వాయిదా వేయాలంటూ ప్రభుత్వానికి హుకుం జారీ చేయటం తెలబాన్ల దురహంకారానికి నిలువెత్తు నిదర్శనం. జాతీయ స్థాయిలో జరుగుతున్న సి.బీ.ఎస్.ఈ. పదవ తరగతి పరీక్షలు కేవలం ఒక రాష్ట్రంలోని కొంత ప్రాంతంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల వాయిదా వేయరన్న ఇంగిత జ్ఞానంకూడా లేకుండా విద్యా రంగంలోనే ఉన్న ఒక మూర్ఖ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో తల పెట్టిన ఈ కార్యక్రమం జరగడానికి వీల్లేదు. ఏడాది అంతా కష్ట పడి చదివి ఈ రోజు పరీక్ష రాయ గలమో లేదో అన్న టెన్షన్ లో విద్యార్దులనీ, పిల్లల భవిష్యత్ గురించిన మానసిక వేదనతో వారి తల్లి దండ్రులని వేధిస్తున్న మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని అడ్డుకొనే తెగువ ప్రభుత్వానికి లేక పొతే తక్షణం రాష్ట్రపతి పాలన విధించి ప్రశాంత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి వుంది.

మిలియన్ మార్చి పేరుతొ విద్యార్ధుల జీవితాలతో చెలగాటాలు!

"తెలంగాణా కి ఒకే అంటే సోనియా కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిన జల్లుకుంటా..- 26 డిసెంబర్,2010 న కే.సి.ఆర్."== ఇటలీ దేవత ముందు ఇంతలా సాగిల పడ్డా ఉపయోగం లేదు.
మహా గర్జన పేరుతొ వింత మొరుగుళ్ళు మొరిగినా లెక్క చేయలేదు.
తాము తెర వెనుక ఉంటూ తెర ముందుకు జై బోలో తెలంగాణా తెచ్చినా వర్కవుట్ అవలేదు.
సహాయ నిరాకరణ అంటూ ఉద్యోగులని ఎగ దోసినా ఉపయోగం లేదు.

"పల్లె పట్టాల పైకి" అంటూ రైలు పట్టాల మీద కాపురం చేయించినా పట్టించుకోనేలేదు.
నోటికి నల్ల బెండేజీలు కట్టుకొని పార్లమెంటులో తిరిగినా,అదే పార్లమెంటులో తెలబాన్ చెల్లి వల వలా ఏడ్చినా కూడా చలించలేదు.
ఇటువంటి టక్కు టమార గారడీ విద్యలు ఎన్ని ప్రదర్శించినా కూడా తెలంగాణా ఇచ్చేది లేదని కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పింది. పార్టీ కేంద్ర కార్యవర్గం నుండి తెలంగాణా వాదుల్ని సాగనంపి వారంటే లెక్కే లేదన్న విధంగా నియామకాలు చేసింది. పదవుల్ని వదిలి గంట కూడా వుండలేరన్న కావూరి మాటల్లోని సత్యం కాంగ్రెస్ అధిష్టానానికి స్పష్టమయింది. అందుకే డోంట్ కేర్ అన్నట్లు తెలంగాణా వాదుల్నీ, వాదనల్నీ పక్కన పెట్టేసి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఏర్పాట్లలో మునిగి పోయింది. మరి ఇంకా ఎందుకు అనవసర ఆందోళనలూ,విధ్వంసాలు, మిలియన్ మార్చి పేరుతొ విద్యార్ధుల జీవితాలతో చెలగాటాలు! ఇక ఎంత మాత్రం సాగనివ్వకూడదు. అనవసర ఆందోళనల కోసం విద్యార్ధుల పరీక్షలు బలి కాకూడదు.

5, మార్చి 2011, శనివారం

సొమ్ము వెదజల్లుతున్నాడు

తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని మంది సొమ్మును అడ్డంగా దోచేసిన వైఎస్‌ తనయుడు జగన్మోహనరెడ్డి తానే గద్దెనెక్కేందుకు అన్ని మార్గాల్లోనూ వేటాడుతున్నాడు. ప్రధానంగా మీడియాను గుప్పిట్లో పెట్టుకునేందుకు శతవిధాలా సొమ్ము వెదజల్లుతున్నాడు. తన సాక్షి పత్రికనూ, టీవీని జగన్మోహకరించిందిగాక, పాక్షికంగా అమ్ముడుపోయేందుకు సిద్ధంగా ఉన్న ప్రసార మాధ్యమాలను కొనుగోలు చేస్తున్నాడు. ఇప్పుడు మూడు వార్తా ఛానళ్లను 50 శాతానికి కొద్దిగా అటూఇటూగా బినామీ పేర్లతో కొనుగోలు చేసేశాడు. ఖమ్మం జిల్లాకు చెందిన నరేంద్రనాథ్‌ చౌదరి సంస్థాపిత ఎన్‌ టీలో 49 శాతాన్నీ, కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం అన్న ఐదు అత్యవసరాలు అందరికీ అందించే ధ్యేయం తమదంటూ పురుడుపోసుకున్న టీవీ-5లో 42 శాతం, టీవీ-9 పాత్రికేయులతో చిన్నపాటి సమరభేరి మోగించిన ఓ విద్యా వ్యాపారి రాజు భావోద్వేగ ఫలితంగా ఉద్భవించిన ఐ న్యూస్‌లో 51 శాతాన్ని యువనేత కొనుగోలు చేసినట్లు జగన్మోహనరెడ్డి శిబిరంలో పనిచేస్తోన్న ఒకరు ఉప్పందించాడు.ఈ మూడు ఛానళ్లు ఇక సాక్షి స్థాయిలో ఏకపక్షంగా జగన్మోహన చాలీసాలను అదే పనిగా భజనచేయకపోవచ్చేమోగానీ వ్యతిరేకంగా మాత్రం నోరు విప్పబోవు. అయితే ఈ ఛానళ్ల ద్వారా ప్రత్యర్థులను దొంగ దెబ్బ తీసేందుకు జగన్మోహనుడి శిబిరం ప్రణాళిక రూపొందించుకున్నట్లు మీడియా నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి జగన్మోహనుడి శిబిరంలోకి చేరిపోయిన మూడు ఛానళ్లూ తొలి నుంచీ అంతో ఇంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి దొడ్డిలోనే ఉండేవి. కాకపోతే ఇప్పుడు పూర్తిగా జగన్మోహన రాగాన్ని ఆలపించేందుకుగాను సొమ్ముల్ని దక్కించుకుని నీకో సగం – నాకో సగం అంటూ పాడబోతున్నాయి. అంటే ఈ ఛానళ్లు ఇక సోనియా వ్యతిరేక, నకికురె వ్యతిరేక, తెదేపా వ్యతిరేక ఆలాపనలకు వేదికలు అవనున్నాయి. ఇక ఆ తరహా ఆలాపాలు వినాలో? వినకూడదో? నిర్ణయించుకోవలసింది మాత్రం వీక్షకులే.

మహిళా సిగిరెట్ నీ అలవాట సరదాన?

‘ఆమె’ పొగబారుతోంది. అవును. పురుషపుంగవులతో పోలిస్తే అంతోఇంతో పొగకు దూరంగా ఉండే మహిళలను కూడా సిగిరెట్‌ ఉత్పత్తి సంస్థలు నెమ్మదిగా లోబరచుకుంటున్నాయి. తద్వారా లాభాలను మూటగట్టుకునేందుకు దశాబ్దాల క్రితం నుంచే వ్యూహం ప్రకారం వ్యవహరించటం ప్రారంభించాయని అధ్యయనంలో వెల్లడయింది. అవును అక్షరాలా నమ్మలేని నిజం! పొగాకు పరిశ్రమకు చెందిన 1991 నాటి అంతర్గత వ్యవహారాల నివేదిక ఒకటి దీనిని నిర్ధారించింది కూడా. చార్మినార్‌ సిగిరెట్ల తయారీ సంస్థ ఫిలిఫ్స్‌ మోరిస్‌ 1968లో తన వర్జీనియా స్లిమ్స్‌ సిగిరెట్‌ అమ్మకాలను పెంచుకొనేందుకు ఓ ప్రకటనను రూపొందించింది. దానిలో ”అమ్మాయీ, చాలా కాలానికి నువ్వు సాధించావు” అనే నినాదం. దాని కింద అమెరికాలో మహిళా ఉద్యమాలు సాధించిన విజయాలను పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసంతోనూ, స్వతంత్రంగానూ వ్యవహరించే యువతులు వర్జీనియా స్లిమ్స్‌ సిగిరెట్లు తాగటం ద్వారా తమ స్వాతంత్య్రాన్ని స్పష్టంగానూ సమర్ధవంతంగా వ్యక్తీకరించవచ్చని ఒప్పించే వ్యూహం ఈ ప్రకటనలో దాగి ఉందని 1991లో వెలువడిన ఓ నివేదికలో విశ్లేషకులు పేర్కొన్నారు. ఆ ప్రకటన అమెరికాలో ఆశించిన ఫలితాలనివ్వటంతో మిగతా దేశాలలోనూ అదే తరహా వ్యూహాన్ని అమలు జరిపారు. జపాన్‌లో 1994లో ఇదే వర్జీనియా స్లిమ్స్‌ కోసం ఓ ప్రకటనను రూపొందించారు. ‘సామాజిక నియమాలకు అనుగుణంగా నేను సరైన దారిలోనే ప్రయాణిస్తున్నా, అయితే అదే సమయంలో, నా సొంత భావాలపట్ల నిజాయితీగా ఉంటా. అందువలన నా కోరికను తీర్చుకునేందుకు సామాజిక నియమాలు ఆటంకంగా మారితే నేను లెక్కచేయను’ అంటూ ఓ యువతితో చెప్పించారు ఆ ప్రకటనలో. అంటే సిగిరెట్లు తాగాలనుకొంటే దేన్నీ లెక్కచేయనని చెప్పటమన్నమాట.
ఏడాదికి 50 లక్షల మంది పొట్టనబెట్టుకుంటున్న పొగ
పొగాకు సంబంధించి దృష్టిసారించాల్సిన పలు విషయాలు కెనడాకు చెందిన వాటర్లూ, వేవెస్ట్‌ విశ్వవిద్యాలయాలు ‘మహిళా సాధికారత – స్త్రీపురుషులలో పొగ తాగే నిష్పత్తి’ అంశంపై జరిపిన అధ్యయనంలో వెల్లడయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా సంచిక ఈ వివరాలను ప్రకటించింది. ప్రపంచవ్యాపితంగా ప్రస్తుతం ఏడాదికి 50 లక్షల మంది పొగ తాగి మరణిస్తున్నారని ఆ నివేదిక విదితం చేసింది. 2030 నాటికి పొగ వలన 80 లక్షల మంది మరణించవచ్చని అంచనా వేశారు. అదే ఈ శతాబ్ది అంతానికి మొత్తం వంద కోట్ల మంది పొగ తాగిన కారణంగా మరణించవచ్చని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాపితంగా మహిళలకంటే పురుషులు ఐదురెట్లు అధికంగా పొగ తాగుతున్నారు. అయితే స్త్రీ-పురుష నిష్పత్తి దేశదేశానికీ తేడా ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, పశ్చిమ ఐరోపాలోని అధిక దేశాలలో పురుషులతో సమంగా స్త్రీలూ పొగ తాగుతున్నారు. స్వల్ప, మధ్య ఆదాయ దేశాలలో ఈ నిష్పత్తి తక్కువగా ఉంది. చైనాలో పొగతాగే పురుషులు 61 శాతం ఉండగా, మహిళలు కేవలం 4.2 శాతమే ఉండటం విశేషం. అర్జెంటీనాలో 34 శాతం పురుషులు, 23 శాతం మహిళలు పొగ తాగుతున్నారట. ఇప్పుడు పొగతాగే స్త్రీల శాతం తక్కువగానే ఉన్నప్పటికీ వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వయస్సువారీగా చూస్తే 13-15 ఏళ్ల యువతీ యువకులలో నిష్పత్తి వ్యత్యాసం 2-3 రెట్ల మధ్యనే ూండగా, మిగతా అన్ని వయస్సుల వారిలోనూ ఐదు శాతానికి పైనే ఉండటం ఆలోచించాల్సిన విషయం.
సంప్రదాయం చట్టుబండలు
సాధారణంగా ఏ దేశంలోనూ మహిళలు పొగతాగటాన్ని సమాజం అంగీకరించదు. ఆ కారణంగానే స్త్రీలలో పొగ తాగేవారు తక్కువ. అమెరికాలో 1920 దశకంలో మహిళలు పొగతాగటం గౌరవప్రదం కాదని భావించేవారు. ఇప్పుడు ఆ పరిస్ధితి మారింది. పురుషులతో సమంగా మహిళలూ అక్కడ పొగ తాగుతున్నారు. సిగిరెట్‌ ఉత్పత్తిదారుల ప్రకటనల వ్యూహం కూడా దీనికి కారణమేనని పరిశీలనలలో తేలింది. సిగిరెట్‌ ఉత్పత్తి సంస్థలు పెరుగుతున్న మహిళా సాధికారతను ఉపయోగించుకుని వారికి పొగతాగుడును అలవాటు చేయిస్తున్నాయి. ఇలా సామాజిక మార్పులను సొమ్ము చేసుకొనేందుకు సిగిరెట్‌ ఉత్పత్తి సంస్థలు వేస్తోన్న ఎత్తుగడల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాజా అధ్యయనం హెచ్చరించింది.

దే’వాదాయ’ ఆమాత్యుడిగా వెలగబెట్టిన జూపల్లి కృష్ణారావు పుణ్యమా అని ఇక ఆ బాధలు తప్పాయి.

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఆ శాఖ మంత్రిత్వానికి లాల్‌బహదూర్‌శాస్త్రి రాజీనామా చేసిన విషయాన్ని ఆరు దశాబ్దాలపాటు చెప్పుకుని చెప్పుకుని తుత్తిపడ్డాం. వినీ, వినీ విన్నవారి చెవులు తుప్పు పట్టిపోయాయంటే నమ్మి తీరాలి మరి. నల్లారి కిరణ్‌కుమార్‌ మంత్రివర్గంలో దే’వాదాయ’ ఆమాత్యుడిగా వెలగబెట్టిన జూపల్లి కృష్ణారావు పుణ్యమా అని ఇక ఆ బాధలు తప్పాయి. రాష్ట్ర మంత్రి పదవికి మార్చి మూడో తేదీన జూపల్లి కృష్ణారావు రాజీనామా చేసి త్యాగమూర్తుల సరసన చేరిపోయారు. తాను నమ్మిన విలువలకు వలువలు కట్టబూనుకున్న శాస్త్రి కంటే ప్రజల మనోభావాలకు స్పందించిన జూపూడి మిన్న అని నేను అంటే ఎవ్వరూ కాదనబోరనుకుంటాను. అయితే గియితే అంతగా ఆదాయం లేని దేవాదాయ శాఖ అంటే జూపల్లికి ఇష్టం లేకనే అధిష్టానాన్ని బెదిరించేందుకు రాజీనామా చేశాడని గిట్టనివాళ్లు, ప్రత్యేకించి సీమాంధ్రులు వాగితే వాగొచ్చుగాక. జూపల్లి పదవీ త్యాగం మామూలు వ్యవహారం కానేకాదు. అందుకనే అయన రాజ్యాంగాన్ని సైతం ధిక్కరించారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రస్ధాయి మంత్రులెవరయినా రాజీనామా చేయదలిస్తే ముఖ్యంత్రి ద్వారా గవర్నరుకు సమర్పించుకోవాలి. కానీ జూపల్లి ఏకంగా తన అధిష్టాన దేవత సోనియమ్మకు రాజీనామా పత్రాన్ని పంపేసి తన అంతరంగాన్ని చెప్పకనే చెప్పేశారు. అదేమని అడిగిన పాత్రికేయులతో తాను ఏడాది క్రితమే ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే తన త్యాగపూరిత ప్రణాళికను ప్రకటించానని గుర్తుచేశారాయన. మరి ఏడాది కాలంగా ఎందుకు త్యాగాలు చేయలేదేమని అడగ్గా … ”సోనియమ్మ తెలంగాణ ఇస్తుందని నేను ఇప్పటికీ నమ్ముతున్నా” అంటూ జూపల్లి రాజీనామా వెనకున్న రహస్యాన్ని పరోక్షంగా విప్పకనే విప్పేశారనుకోండి. ”సోనియమ్మ తెలంగాణ ఇస్తుందని ఇప్పుడూ నమ్ముతుంటే రాజీనామా ఎందుకు చేసినట్లో?” అని ఏ పాత్రికేయుడూ నోరు విప్పకపోవటం జూపల్లి తప్పుకాదుగదా! పాపం శమించుగాక! అంటే అయిపోయిందనుకోకండి. ఇంకా కొద్దిగా ఉంది. తెలంగాణ ప్రజల మనోభావాలను మన్నించి తాను పదవీ త్యాగానికి పాల్పడినట్లు ఆయన తెగచెప్పేసుకున్నారు. చెప్పేసుకున్నారంటే… చెప్పులు వేసుకున్నారనుకునేరు. ఆయన చెప్పులు వేసుకున్నాడో, బూట్లే వేసుకున్నాడో, అవి ఏ సంస్థవో తేల్చి చెప్పటానికి నేనెవర్ని? ఆ మాటకొస్తే అసలు వాటినయినా, వీటినయినా వేసుకున్నాడో? లేదో? కూడా చూడకుండా చెప్పటం కుదరదుగాక కుదరదుగదా! సరే చెప్పుల సంగతి అట్లా పెడదాం. ‘ప్రజల మనోభావాలు’ అన్న మాట ఉంది చూశారూ! ఎంతటి గొప్పదనుకుంటున్నారు. ఈ శతాబ్దానికి ముందు ఆ మాట ఎప్పుడూ విన్నట్లు నాకు గుర్తులేదు. ఆ ఎనిమిది అక్షరాల అద్భుత పదం ముందు అన్నీ దిగదుడుపేనని ఘంటాపదంగా చెప్పొచ్చు. అసలు దీన్ని ఈ శతాబ్దం పదంగా గుర్తించటమే కాకుండా, ఇటు దేశీయ లింకా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ, అటు ప్రపంచస్ధాయి గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ నమోదు చేయాలని నేను నొక్కి ఒక్కాణించదలచుకున్నాను. ఎవరికి ఏది ఇష్టమో, దాన్ని ప్రజల మనోభావంగా ప్రకటించేయవచ్చు. ఎవరికి ఏది కష్టమో దాన్ని ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని తెగనాడనూ వచ్చు. అంటే ఈ పదం రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. అదే బాటలో జూపల్లి పయనించి ప్రజల మనోభావాలకు అనుగుణంగా తన పదవిని త్యాగం చేసేసి త్యాగయ్య అయ్యారు. ఇక్కడే నా పాడు మనస్సు కీడు శంకిస్తోంది. అదేమంటే… ఇతరేతర పదవుల్ని అట్లా ూంచుదాం. ఆయన వైఎస్‌ పాలనలో పౌరసరఫరాల మంత్రిగా పనిచేశారు. దానికి సంబంధించి ఒక చిన్న ప్రశ్నతో నా కు’శంక’ను తీర్చుకునేందుకు అంగీకరించండి. నా కుశంకను రాష్ట్రానికంతా వర్తింపజేయనులెండి. పేదలకు రేషను కార్డుల జారీ, వాటి ద్వారా చౌక దుకాణాల నిర్వహణ, వాటి ద్వారా దరిద్ర నారాయణులకు సరుకుల పంపిణీ తదితర జనోద్ధరణ కార్యక్రమాలన్నీ పౌరసరఫరాశాఖ ద్వారా జరగాల్సిన పనులు. మరి తెలంగాణ పేదలు తమకు రేషను కార్డులు వద్దనీ, ఎంత ధర పెట్టయినా తిండి గింజల్ని కొనుక్కుంటానమని మన జూపూడివారికి విన్నవించుకున్నారా? తెలంగాణలో చౌక దుకాణ యజమానులు సరుకుల్ని ప్రజల మనోభావాలకు అనుగుణంగానే దారి మళ్లించారా? అవునని జూపూడి అంటే పేచీ లేదు. అయితే రేషను కార్డు కావాలి మహాప్రభో అంటూ లక్షలాది మంది చేసుకున్న దరఖాస్తులు తెలంగాణ ప్రాంత తహశీలుదారుల కార్యాలయాల్లో మూలుగుతున్నందున జూపూడి ధైర్యం చేసి ఆ మాట అనగల వీలులేదు. చౌక సరుకుల్లో 60 శాతానికి తక్కువ కాకుండా దారి మళ్లుతున్న వైనం పుంఖానుపుంఖాలుగా పత్రికల్లో వార్తల రూపాన కన్పిస్తుంటే రెండో ప్రశ్నకూ జూపూడి లేదని చెప్పలేదడనుకుంటాను. మరి పౌరసరఫరాలశాఖకు సంబంధించి ప్రజల మనోభావాలను మన్నించేందుకు పూనుకోని జూపూడి అనే పెద్దమనిషి దేవాదాయశాఖ మంత్రిగా మాత్రం ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించటం వెనుక ఏమయినా మతలబు ఉందా? అన్నదే నా కుశంక. నా కుశంకను ఎవరు తీరుస్తారు? చెప్మా!

గంటకు పది కోట్ల రూపాయలు నల్లధనం దేశం సరిహద్దులు దాటుతుంది ?

నిత్యావరాల ధరలు పెరిగాయని ఆందోళన చేసే సామాన్య జనంపై లాఠీలతోనూ, తూటాలతోనూ విరుచుకుపడే ప్రభుత్వం నల్లధనం మదుపుదారుల పట్ల ముద్దుముద్దుగా వ్యవహరిస్తోంది.1948 నుంచీ ఇప్పటి వరకూ రూ.20 లక్షల కోట్ల నల్లధనం దేశం సరిహద్దులు దాటి ఉంటుందని అంచనా.రోజుకు రూ. 240 కోట్లు నల్లధనం దేశ సరిహద్దులు దాటుతోంది, అంటే గంటకు పది కోట్ల రూపాయలు.కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్టు ధనబలానికి ఓ నకలు.రాజకీయ ధనబలం ముందు ప్రజాస్వామ్య విలువలు నానాటికీ కుంచించుకుపోతున్నాయి.2011-2012 బడ్జెట్టు మొత్తం కార్పొరేట్‌ శక్తులకు దోచిపెట్టేదిగా ఉంది.బడ్జెట్టులో వ్యవసాయ రంగానికి గతం కంటే రూ.5800 కోట్లు కోతపెట్టిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు మాత్రం ఐదు లక్షల కోట్ల రూపాయలను రాయితీగా ఇచ్చింది.ఆదాయపు పన్ను మినహాయింపు ద్వారా రూ.88 వేల కోట్లు, ఎక్సైజ్‌ సుంకం మినహాయింపు ద్వారా రూ.1.76 లక్షల కోట్లు, కస్టమ్స్‌ సుంకం తగ్గింపు ద్వారా రూ.2.24 లక్షల కోట్లు రాయితీలిచ్చింది.ఈ సొమ్ము 2జి స్పెక్ట్రం కుంభకోణంలో దారిమళ్లిన దానికన్నా మూడు రెట్లు అధికమని లెక్క.వ్యవసాయం, ఆహారభద్రత నిధుల కేటాయింపుల్లోనూ కోతలు పెట్టింది.దీనికితోడు వ్యవసాయరంగానికి ఇచ్చిన అరకొర రాయితీలు కూడా అటుఇటు తిరిగి కార్పొరేట్‌ సంస్థలకే చేరతాయి.వ్యవసాయ రంగానికి లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలిస్తున్నట్టు ప్రభుత్వం లెక్కలు చూపుతున్నప్పటికీ వాస్తవానికి అవి కూడా పెద్దలకే దక్కుతున్నాయి.చిన్న- సన్నకారు రైతులకు బ్యాంకు రుణాలు నానాటికీ సన్నబడుతున్నాయి.ఇప్పుడు ఎన్నికలంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయటమని భాష్యం.కోటీశ్వరులు మాత్రమే ఎన్నికయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.తద్వారా రాజకీయ అవినీతి పెరిగిపోతోంది.ధనబలం పెరుగుతోన్న కొద్దీ ప్రజల సమస్యలను చట్టసభల్లో ప్రతిబింబింపజేసే వారు కనుమరుగవుతున్న విషయాన్ని అందరూ ఆలోచించాలని నేను కోరుతునాను.