""తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"".
కొందరి దూషణలతో,మరికొందరి భాషణలతో,కొందరి చేష్టలతో,మరికొందరి నిశ్చేష్టలతో,కొందరి ఉద్యమాలతో,మరికొందరి మాధ్యమాలతో
కొందరి విధ్వంసంతో,మరి కొందరి ఉత్సాహం తో విసిగి వేసారి పోయాను,మార్పంటే ఏమిటో మర్చిపోయాను.నాకు నేనే మారిపోయాను.ఇన్నాళ్ళుగా అడ్డొచ్చిన సహనం నిన్నటితో చచ్చిపోయింది,ఎవరు తనో,ఎవరు పరో నిన్నటి తో తెలిసిపోయింది.
ఉందనుకున్న సౌభ్రాతృత్వం లేదని తేలిపోయింది.మనుషులే పోయాకా విగ్రహాలెందుకట,ఉద్యమాల పేరుతో పసి పిల్లల్ని పొట్టన పెట్టుకున్నప్పుడే అడగనోల్లు, బోడి బొమ్మలు నేలకూలితే లొల్లి చేస్తరేమంటుండ్రు.
12, మార్చి 2011, శనివారం
"ఆ విగ్రహాలకు ప్రాణముంటదా? పోతే మళ్ళీ పెట్టుకోవచ్చు" వింటానికి సిగ్గుగా ఉంది మనకి!!!!
నడి వీధిలో మీ సంస్కృతిని మీరు నగ్నంగా నిలబెట్టి నిర్వచించారు!
మీరేమిటో ప్రపంచానికి చాటారు !
మీ సంస్కారాన్ని బట్టలు విప్పి టాంక్ బండ్ మీద ఊరేగించారు. !
మీ అంతిమ లక్ష్యమేమిటో చూపించారు.మీరు హుసేన్ సాగర్‌లో వేసింది కేవలం విగ్రహాలను కాదు, తెలుగు ప్రజల ఆత్మని!
తెలుగు వెలుగులారా..! క్షమించండి!
తన ముద్దు బిడ్డలకు పట్టిన గతి చూసి అల్లంత దూరాన ప్రభుత్వ భవనం ముందు.... నోట్లో చెంగు కుక్కుకుని గోలుగోలున ఏడుస్తున్న తెలుగు తల్లి సాక్షిగా
మేము...చచ్చిపోయాం!
మా రక్తంలో వేడి చల్లారిపోయింది.
మిమ్మల్ని కాపాడుకోలేక ఇళ్ళలో టీవీల ముందు కూచుని కళ్ళు తుడుచుకున్నాం!
NTR.... క్షమించు మమ్మల్ని!
తెలుగు ఆత్మగౌరవం నినాదాన్ని నువ్వు వినిపించినా, దాన్ని ఇవాళ మేము నినదించలేకపోయాం! ........
ఆత్మలు చచ్చిన వాళ్లకు గౌరవం ఎందుకని!
పోలీసుల సాక్షిగా సాగిన దమనకాండ ని చూస్తూ కృష్ణ దేవరాయలకు,బ్రహ్మనాయుడికి హుసేన్ సాగర్ నీళ్లతో తర్పణాలు విడిచాం!
మహనీయులను సదా స్మరించుకునే అవకాశం నువ్విచ్చినా మేము నిలుపుకోలేకపోయాం!
ఎముకలు కుళ్ళి,శక్తులు చచ్చిన వాళ్ళం...క్షమించు....
పదవీ వ్యామోహాలు-కులమత భేదాలు,
భాషాద్వేషాలు చెలరేగె నేడు !
ప్రతి మనిషి మరి యొకరిని దోచుకొనేవాడే,
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకొనే వాడే!
స్వార్ధమే అనర్ధదాయకం !
అది చంపుకొనుటే క్షేమదాయకం !

నేను తెలుగువాడినన్న అహంకారం పటాపంచలైతే నిద్రెలా పడుతుంది?
ట్యాంక్ బండ్ మీద ఎక్కువగా సీమాంధ్రకు చెందిన వ్యక్తుల విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించారని, తెలంగాణలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తుల విగ్రహాలు తక్కువగా ఉన్నాయని తెలంగాణావాదులు చాలా కాలంగా వాదిస్తూ వస్తున్నారు. విగ్రహాలను ధ్వంసం చేస్తామని కూడా హెచ్చరికలు చేస్తూ వచ్చారు. ఈ హెచ్చరికల మేరకు ట్యాంక్ బండ్‌పై ఉన్న వ్యక్తుల విగ్రహాలను ధ్వంసం చేశారని భావించాల్సి ఉంటుంది. అయితే, ఒక పథకం ప్రకారం జరిగినట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. ఉదయం పూట పోలీసులు, మీడియా ప్రతినిధులతో మాత్రమే నిండిపోయిన ట్యాంక్ బండ్ మధ్యాహ్నం తర్వాత తెలంగాణవాదులతో అట్టుడికిపోయింది. గుంపులు గుంపులుగా వచ్చిన తెలంగాణ వాదుల దాటికి పోలీసులు బిత్తరపోయారు. వారిని కట్టడి చేయడం పోలీసుల వల్ల కాలేదు. తీవ్ర ఉద్రిక్తత మధ్య తెలంగాణవాదులు విగ్రహాలను ధ్వంసం చేశారు.
ధ్వంసమైన విగ్రహాలను చూస్తే ఏరికోరి విధ్వంసానికి దిగినట్లు కనిపిస్తోంది. సీమాంధ్ర ప్రాంతంలో గణుతికెక్కిన అన్నమయ్య, ఎర్రాప్రగడ, శ్రీకృష్ణ దేవరాయలు, సిద్ధేంద్ర యోగి, పల్నాటి బ్రహ్మనాయుడు ,ముట్నూరి కృష్ణారావు, కందుకూరి వీరేశలింగం, త్రిపురనేని రామస్వామి చౌదరి, ఆర్థర్ కాటన్, బళ్లారి రాఘవ, గురజాడ అప్పారావు, రఘుపతి వెంకయ్య విగ్రహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తెలంగాణకు చెందిన సురవరం ప్రతాప రెడ్డి, రామదాసు, మగ్దూం మొహియుద్దీన్ విగ్రహాల జోలికి ఆందోళనకారులు వెళ్లలేదు. సీఆర్ రెడ్డి విగ్రహాన్ని ఎందుకు వదిలేశారో తెలియదు గానీ నన్నయను తొలి తెలుగు కావ్యాన్ని సృష్టించిన కవి కావడం వల్ల వదిలేసి ఉంటారు. పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఆయన జాతీయ జెండాను రూపొందించిన మహా వ్యక్తి కావడం వల్ల ముట్టుకుని ఉండరు. శ్రీశ్రీ విప్లవ కవి కావడం వల్ల, గుర్రం జాషువా దళిత కవి కావడం వల్ల వదిలేసి ఉండవచ్చు. అయితే, తిక్కన, క్షేత్రయ్య, అల్లూరి సీతారామా రాజు విగ్రహాలను ఎందుకు వదిలేశారనేది హేతువుకు అందడం లేదు. అయితే, విగ్రహాల ధ్వంసంలో తెలంగాణవాదులు స్పష్టమైన హేతువును అనసరించి ఉంటారని భావిస్తున్నారు
నిన్న రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. ఒక్కసారిగా నేను తెలుగువాడినన్న అహంకారం పటాపంచలైతే నిద్రెలా పడుతుంది?“ఆఁ! ఇందులో ఏముంది? విగ్రహాలే కదా! మళ్ళీ తయారుచేసుకోవచ్చులే” అని తాపీగా వినిపిస్తున్న సమాధాన స్వరాలు పుండు మీద కారం చల్లినట్లున్నాయి.ధ్వంశం కాబడిన ప్రతీ విగ్రహం గురించి పుటలు పుటలుగా వ్రాయవచ్చును. కానీ శ్రీకృష్ణదేవరాయలు, అన్నమయల విగ్రహాల ధ్వంశం ఎంతకీ మింగుడు పడటంలేదు. అసలు ఉద్యమానికి వీళ్ళకి ఏమన్నా సంబందం ఉందా?
పక్కనే కొండ మీద ఉన్న బిర్లా మందిర్ బహుశః తదుపరి లక్ష్యం కాబోలు. ఎంతైనా వేంకటేశ్వరస్వామి రాయలసీమ దేవుడు కదా? కొండ క్రింద ఆయన భక్తులలో తలమానికమైన అన్నమయ్యకే దిక్కు లేదు. తిరుమల క్షేత్రంతో దగ్గిర సంబంధం ఉన్న గొప్ప చారిత్రిక చక్రవర్తి అయిన కృష్ణదేవరాయల విగ్రహానికే విలువలేదు. అటువంటప్పుడు, రాయలసీమలో వేలసిన వేంకటేశ్వరస్వామి వారికి మాత్రం విలువేముంది; ఇక్కడ అస్థిత్వం ఎలా అనుమతించబడుతుంది?

11, మార్చి 2011, శుక్రవారం
మాసిపోని అపచారం ట్యాంకు బండు విధ్వంసం
తెలుగు జాతి ఔన్నత్యానికి బాటలు వేసి, సాహిత్యం, కళలు సహా వివిధ రంగాల్లో విశేష కృషి చేసి, తెలుగువారికి అంతర్జాతీయ ఖ్యాతినార్జించి పెట్టిన మహనీయుల విగ్రహాలు ధ్వంసమయ్యాయి. హైదరాబాదులో గురువారం నిర్వహించిన మిలియన్ మార్చ్‌లో ఆందోళనకారులు 12 విగ్రహాలను ధ్వంసం చేయడంతో కొన్నేళ్లుగా ప్రజలను అలరిస్తున్న ట్యాంక్ బండ్ తీరం కళ తప్పింది.
ప్రాంతీయ వివాదాలతో పాలక పక్షాలు సాగిస్తున్న కుటిల వ్యూహాలు రాష్ట్రాన్ని ఏ స్తితికి చేర్చాయో గురువారం నాడు ట్యాంకుబండ్‌పై బుద్ధవిగ్రహం సాక్షిగా సాగిన విధ్వంస కాండ వెల్లడించింది. ఈ అనాగరిక అరాచక చర్యలు తెలబాన్ ప్రజల ప్రజాస్వామిక సంసృతికే కళంకం తెచ్చి పెట్టాయి.తెలుగు వైతాళికుల విగ్రహాలని తెలుగు వారే ధ్వంసం చేస్తుంటే ఏడుపో... బాధో.....కసోఏమీ చేయలేని అస్సహాయతో.. ఏమీ అర్థం కాని ఓ ఆవేదన!!!
మిలియన్ మార్చ్ జయాపజయాలు పంతాలు పట్టింపులు పక్కన పెట్టి తెలుగు ప్రజల మహత్తర వారసత్వాన్ని వీర తత్వాన్ని తూట్లు పొడిచే ప్రక్రియ విజయవంతంగా సాగింది.చాపకూటితో సమతను నేర్పిన నాటి పలనాటి బ్రహ్మన్న, విశ్వ నరుడ నేను అని సగర్వంగా చాటుకున్న దళిత కోకిల జాషవా, బ్రహ్మమొక్కటేనని మానవులు ఏకత్వాన్ని ఏనాడో చాటిన అన్నమయ్య ,విప్లవ కవితా ప్రవక్త శ్రీశ్రీ చెప్పాలంటే ప్రాత:స్మరణీయులైన మహనీయులందరి ప్రతిమలను తుత్తునియలు చేసి అనాగరికతను చాటుకున్న అరాచకం తాండవించింది. ఈ విగ్రహాలకు విలువ ఇవ్వడం కాదు విగ్రహాల వెనకనున్న విలువల విధ్వంసం ఇక్కడ సమస్య.నాలుగు డబ్బులు ఖర్చు చేస్తే రేపే వాటిని పునరుద్దరించవచ్చన్న మాటలు జరిగిన విధ్వంసం కన్నా తీవ్రమైనవి.దీనికి నాయకులైన వారు పునరాలోచించుకోకపోతే రేపు ఇదే వారికీ జరగొచ్చు.
“ఎవరు ఎలా తగలడితే మాకేంటి?” అని ఇటువంటి ఇక్కట్లకు అలవాటుపడ్డ భాగ్యనగర వాసులు(అయోమయంలో), నిత్య జీవితాన్ని ఎలాగోలా నెట్టుకొద్దామనే ప్రయత్నించాలని నిర్ణయించుకున్నట్టు రహదారులమీది ట్రాఫిక్ చూస్తే అర్థమవుతోంది.ఇదా పద్దతి? ఖర్మ కాలి గోడవలు రగులుకునుంటే, ఆ పిల్లల సంగతేంటి? ఇంతటి నీఛానికి దిగాల్సిన అవసరముందా? అసలే పరీక్షల సమయం. అందులో మిట్ట మధ్యాహ్నం. చిచ్చుపెడితే రగిలిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు.
ప్రతిరోజు సాయంత్రం ట్యాంక్‌బండ్‌కు వచ్చే సందర్శకులు ఆ విగ్రహాల వద్ద సేదతీరుతూ తమ పిల్లలకు ఆ మహనీయుల గురించి వివరించే హక్కు మనము పొగుట్టుకున్నము.ఇదేనా!!ఇదేనా!!ఇదేనా!!రేపటి మన పిల్లలకు మనము ఇచే కానుక. ఇకనైనా మనము కళ్ళు తేరవండి.

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని
ఏమున్నది ఏమున్నది ఈ ఉద్యమాల ఔచిత్యం
దుందుడుకు చర్యలకు ఎక్కడిది ఔనత్య౦
తెలుగు వాడు సిగ్గుపడే దుర్దినం
స్పృహ లేని దిశగా నిర్దేసనం లేని ఈ ఉద్యమం
వెర్రి ముదిరితే తలకు రోలు చుట్టమన్నాడొకడు
చుట్టుకున్నోడూరుకోక పది మందిని పోగు చేసి
భలే భలే బావుందంటూ వీధిన పడి వెర్రి తలలు వేస్తున్న ఈ వైనం
పది కాస్త వందలై ట్యాంక్‌బండ్ విగ్రహాల మీద దుశ్చర్య సాగించిన ఈ కుత్సితం
వార్తని చూశాను టీవీ 9 లో వార్తను చూశాను
దుర్మదాంధ బుద్ధిహీన శూన్యుల దుశ్చర్యలను
వికృతమైన చేష్టలను
బుద్ధిమాంద్యుల ఉనికిని
నా దేశం నా రాష్ట్రము నా జిల్లాలో ఉందని
తెలుసుకొని అభివృద్ధి పధాన సాగుతున్న తీరుని..
హే రామా మాటలు ఆగిపోయి స్థాణువునై నే మిగిలిపోని
ఇన్నాళ్ళు తెలబాన్లు అంటూ బ్లాగర్లు సంభోదిస్తున్న తీరు కరెక్ట్ కాదేమో అన్న ఒక మీమాంసలో ఉన్న జనాలకు ఈనాడు సాగించిన ఈ దుర్మార్గపు దుశ్చర్య వాళ్ళకు ఎంత గౌరవం అర్హమో అంతే లభిస్తుందని నిరూపించుకున్నారు. పరమ భక్తాగ్రేసరుడు పద కవిత పితామహుడు అన్నమయ్య విగ్రహాన్ని కూడా వదల్లేదంటే పిచ్చి ముదిరి రోకలి తలకు కట్టించుకొని తిరుగుతున్నారు.
బుద్దుని బమియాన్ విగ్రహాలు ద్వంసం చేసి ఆనాడు వాళ్ళ ఉనికిని ప్రపంచానికి చాటారు ఆ తాలిబన్లు. మన వాళ్ళు అంతకు రెండు ఆకులు ఎక్కువే చదివి మన సంస్కృతికి చిహ్నాలైన మహనీయుల జ్ఞాపికల ఫై పడి మరెంతో ఘన కీర్తిని సంపాయించారు. శబ్భాష్ !! ఉన్మత్త తాండవం చేసే బుద్ధి హీనుడికి పరతమ బేధాలు మంచి చెడు విచక్షణ కోల్పోయి ఈ విధంగానే ప్రవర్తిస్తారు.
రోజు చేయండి మిలియన్ మార్చులు. రాత్రి పగలు తేడ లేక మరీ చేయండి. మనకెలా పనికి మాలిన పరీక్షలు .అవి కూడు పెడుతాయా గుడ్డ పెడుతాయా. భూమి ఏర్పడక ముందే ఏర్పడింది ఈ తెలంగాణా ఆకాంక్ష. యుగాలు మారినా మనువులు మారినా ఈ బ్రహ్మాండం అంతా వ్యతిరేకంగా కుట్రలు చేసి మా కలలు సాకారం కానికుండా మేము దోపిడీకి గురయ్యాము ఈ రాత్రికి రాత్రే తెలిపోవాలె, ఏమి ఎందుకు తేలరాదు రాత్రి పోయి తెలవారట్లే? యుగాల ఆకాంక్ష ఈ రాత్రికి రాత్రి తీరే వరకు ట్యాంక్ బండ్ మీద నిరసన సాగాలి.

10, మార్చి 2011, గురువారం
హమయ్య మా నాన్న ఇల్లు నాకు వచ్చింది
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి కి మంగళవారం హైకోర్టులో చుక్కెదురైంది. ప్రస్తుతం ఆమె నివాసం ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి వెంటనే ఎన్టీఆర్ చిన్న కూతురుకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. రెండు నెలల్లో ఇంటిని ఖాళీ చేయాలని చెప్పింది. లక్ష్మీపార్వతి నివాసం ఉంటున్న ఇంటిని ఆయన చిన్న కుమార్తె అయిన ఉమా మహేశ్వరికి రాసిచ్చారని ఖాళీ చేయాలని చెప్పింది. లక్ష్మీపార్వతి ఉంటున్న బంజారాహిల్స్‌లోని రోడ్డు నెం.13లో ఉంటుంది. న్యాయమూర్తులు జస్టిస్ బి. ప్రకాశరావు, జస్టిస్ రెడ్డి కాంతారావులతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది.ప్రస్తుతం లక్ష్మీపార్వతి ఉంటున్న ఇంటిపై హక్కులు తమకే ఉన్నాయని ఉమా మహేశ్వరి నుంచి జీపీఏ పొందిన ఎన్.రామకృష్ణ పన్నెండేళ్ల క్రితం సిటీ సివిల్ కోర్టులో దావా వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సిటీ సివిల్ కోర్టు 2005 ఉమా మహేశ్వరికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అయితే దీనిపై లక్ష్మీపార్వతి హైకోర్టును వెళ్లగా సిటీ సివిల్ కోర్టు ఆదేశాలపై గతంలో స్టే ఇచ్చింది. ఈ స్టే ఎత్తి వేయాలని, ఇంటికి హక్కుదారులను నిర్ణయించాలని రామకృష్ణ అఫిడవిట్ వేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ లక్ష్మీపార్వతి ఉంటున్న ఇంటిపై హక్కులు ఉమామహేశ్వరికే చెందుతాయని స్పష్టం చేసింది.
9, మార్చి 2011, బుధవారం
కొన్ని ఆలోచనలు.. కాదు కాదు.. అనుభూతులు..
ఈ రోజు ఉదయం నుంచి నా మదిలో మెదిలిన కొన్ని ఆలోచనలు..
ప్రేమంటే.. స్వార్థం కంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది..
ప్రేమంటే.. నన్ను నేనే అర్పించుకున్నా.. నీకోసం ఇంకా ఏదో చేయ్యాలనిపించేది..
ప్రేమంటే.. అందని ఆకాశాన్ని కాదు.. ఎదిరించే పక్షి రెక్కలను చూసి ముచ్చట పడేది..
ప్రేమంటే.. ఆశకీ .. జ్ఞాపకానికి.. ముడిపెట్టేది.. మురిసి పోయేది..
ప్రేమంటే.. కాలం కన్నా చాలా చిన్నది.. జీవితం కంటే చాలా పెద్దగా మిగిలిపోయేది..
ప్రేమంటే.. నన్ను నేను కోల్పోయినా .. నీకు మాత్రం చేరువవ్వాలని అనిపించేది..
ప్రేమంటే.. నీలోనూ ఉన్నది నేనే అని ఒప్పుకునేది.. నేనూ నీవే అని ఒప్పించేది..
ప్రేమంటే.. ఆ అనంతం.. అంతలోనే నాలో కరిగే ఈ క్షణం..
ప్రేమంటే.. అంతకంటే ముఖ్యమైంది ,, ఉన్నతమైనది.. ఒకటుంటే..
అదికూడా ప్రేమే.. అనిపించేది

ఇదీ మన శాసన సభ పరిస్థితి
అసెంబ్లీ వార్తలకు "A" సర్టిఫికేట్ ఇవ్వచ్చు..
హింస, దౌర్జన్యం, బూతులు, కోతి చేష్టలు, జుగుప్స కలిగించే ప్రవర్తన.. ఇదీ మన శాసన సభ పరిస్థితి. ఈ దరిద్రానికి సంభందించిన వార్తలు రాత్రి పదకొండు తరువాతే ప్రసారం చెయ్యాలని ఓ రూల్ పెడితే బావుణ్ణు.
ప్రజాస్వామ్యం అసలు స్వరూపమిదా ? రాజ్యాంగానికి మనం ఇచ్చే విలువ ఇంతేనా ? మనల్ని మనం పాలించుకునే అర్హత అసలు మనకు ఉందా ? నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను.
*****ఉద్యమం ముసుగులో ఎలాంటి వ్యక్తులు నాయకులు గా మారి రేపు మనల్ని ఉద్ధరించబోతున్నారో తేటతెల్లమైంది*****
నిజంగానే, ఎవరైనా ప్రజలకు మంచి చెయ్యడానికి రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఇప్పుడు ఉందా ?
ఐదేళ్లకోసారి వచ్చే బూటకపు ఎన్నికలు - అస్థిపంజరాలకు అందాల పోటీలేనా ?
ఈ నాలుగు మాటలూ రాసి సాధించేదేమీ లేదు.. ఎందుకంటే, మన కర్మ భూమిలో అందరూ కరక్టే. కాని నా బాధని వెళ్ళగక్కకుండా ఉండలేకపోయాను. దేవుడు కూడా మనల్ని కాపాడలేడేమో..

కాంగ్రెస్ నాయకుల పంచలు ఊడదీసి కొట్టమన్నాడు అప్పటి యువ రాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.
తెలంగాణా వల్లా ?
కాదు, ఎందుకంటే ఆ విషయం లో ఇప్పుడు వచ్చిన కొత్త క్లారిటీ ఏమీ లేదు గా..
సామాజిక న్యాయమా ?
రాష్ట్రం లో, ఒకటే కులాన్ని పట్టుకుని వేళ్ళాడుతున్న కాంగ్రెస్ ఇప్పుడు కొత్తగా ఇచ్చే న్యాయమేంటి..
మరి జగనా.. లేక స్థానిక ఎన్నికలా.. ?
నాకైతే, వీటన్నటికంటే, YSR , రోశయ్య పంచ కట్టుకోవడం వల్లే ఇన్నాళ్ళూ లేట్ అయిందని అనిపిస్తోంది. ఎందుకంటే, కాంగ్రెస్ నాయకుల పంచలు ఊడదీసి కొట్టమన్నాడు అప్పటి యువ రాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈ ఒక్క భయం/కారణం చాలదూ ఈ ఆలస్యానికి. అంటే, ఇప్పుడు స్టైల్ గా ప్యాంటు వేసుకునే కిరణ్ కి పర్వాలేదనే కదా అర్థం. (డి శ్రీనివాస్ సంగతంటారా.. ఆయన ఉన్నా లేనట్టే..)
ఈ విలీనం తో రాష్ట్రానికి కొత్తగా వచ్చేది.. పోయేది ఏమీ లేదు అని నా గట్టి అభిప్రాయం. కానీ "యూజ్ అండ్ త్రో" టైపు కాంగ్రెస్, చిరంజీవికి ఇచ్చిన రహస్య హామీలను నిలబెట్టుకుంటుందా ?
నగదు బదిలీ లా, అంత సులువుగా చిరూకి పడ్డ ఓట్లు (ముఖ్యంగా ఆయన సామాజిక వర్గానివి) కాంగ్రెస్ కి బదిలీ అవుతాయా ?
వేచి చూడాల్సిందే.
కానీ ఈ మొత్తం ఎపిసోడ్, ఏదో స్టార్ట్ అప్ కంపెనీ పెట్టి, కాస్త లాభాలో/నష్టాలో ఒచ్చిన వెంటనే ఓ బడా MNC కి అమ్మేసినట్టు అనిపిస్తోంది. మన రాష్ట్ర రాజకీయాల్లో ఇదో కొత్త ఒరవడి. దీన్ని "చిరు మార్గం" అని పిలుచుకోవచ్చు. మార్పో.. మార్పు అన్నాడు.. ఇప్పుడు ఏ చానెల్ చూసిన ఆయన అమ్మిన మార్పే కనిపిస్తోంది. పర్లేదు లెండి, మన జనాలు ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోరు.
అయినా రిమోట్ కి టీవీ ఎప్పుడూ లోకువే మరి.. (ఫ్లో లో వచ్చింది ఫాలో అయిపోవడమే .. )

8, మార్చి 2011, మంగళవారం
తెలుగు వాళ్ళ మందరమూ కలసి కట్టుగా వుంటే చక్కగా జీవిస్తామను సంగతి నేనెరిగిందే
తొలి నుంచి నాకుందొక
దురలవాటో సదలవాటో
అనుకున్నది అనుకున్న
ట్లనేయడం , రాయడమూ
అదే నేరమయితే నే
నందుకొప్పుకొంటున్నా
తెలుగు వాళ్ళ మందరమూ
కలసి కట్టుగా వుంటే చక్కగా
జీవిజీవిస్తామను సంగతిస్తామను సంగతి
నేనెరిగిందే
మీ దారిన మీరు పొండి
నా దారిని నాకు వదిలి
మీరట ప్రజలంటారు
నేనూ ప్రజలంటాను
మీ ప్రజకూ నా ప్రజకూ
పొంతన కుదరదు లెండి
చస్తున్న వ్యవస్త మీది
వస్తున్న చరిత్ర నాది
శవాదరణ మీ ధ్యేయం
శిశూదయం నా న్యాయం
విప్లవ ఝుంఝూనిలాలు
వీస్తున్న సంవత్సరాది నేడు
విప్లవ రణదుంధుభులు ధ్వ
నిస్తున్న శుభాళి నేడు
విగతాశులు ప్రగతిమార్గ
విరోధులకు సమాధి
విప్లవజన వాహినులు జ
యిస్తున్న ఉగాది
తెలుగువారి ధీశక్తి
తెలుగువారి క్రియా శక్తి
నలుదెసలా రహించాలి
తెలుగుతనం జయించాలి
ఐదు కోట్ల తెలుగు జాతి
హర్షించాలి
ఆనందం తెలుగునాట
వర్షించాలి
తెలుగువాడి తెలుగు ‘వాడి’
దీపించాలి
తెలుగునాట తెలుగుపాట
వ్యాపించాలి
తమ గమ్యం తెలుగువాళ్లు
చేరాలంతే
ఈ సంవత్సరవేళ నేను కోరేదింతే
దురలవాటో సదలవాటో
అనుకున్నది అనుకున్న
ట్లనేయడం , రాయడమూ
అదే నేరమయితే నే
నందుకొప్పుకొంటున్నా
తెలుగు వాళ్ళ మందరమూ
కలసి కట్టుగా వుంటే చక్కగా
జీవిజీవిస్తామను సంగతిస్తామను సంగతి
నేనెరిగిందే
మీ దారిన మీరు పొండి
నా దారిని నాకు వదిలి
మీరట ప్రజలంటారు
నేనూ ప్రజలంటాను
మీ ప్రజకూ నా ప్రజకూ
పొంతన కుదరదు లెండి
చస్తున్న వ్యవస్త మీది
వస్తున్న చరిత్ర నాది
శవాదరణ మీ ధ్యేయం
శిశూదయం నా న్యాయం
విప్లవ ఝుంఝూనిలాలు
వీస్తున్న సంవత్సరాది నేడు
విప్లవ రణదుంధుభులు ధ్వ
నిస్తున్న శుభాళి నేడు
విగతాశులు ప్రగతిమార్గ
విరోధులకు సమాధి
విప్లవజన వాహినులు జ
యిస్తున్న ఉగాది
తెలుగువారి ధీశక్తి
తెలుగువారి క్రియా శక్తి
నలుదెసలా రహించాలి
తెలుగుతనం జయించాలి
ఐదు కోట్ల తెలుగు జాతి
హర్షించాలి
ఆనందం తెలుగునాట
వర్షించాలి
తెలుగువాడి తెలుగు ‘వాడి’
దీపించాలి
తెలుగునాట తెలుగుపాట
వ్యాపించాలి
తమ గమ్యం తెలుగువాళ్లు
చేరాలంతే
ఈ సంవత్సరవేళ నేను కోరేదింతే
మహిళా బ్లాగ్మిత్రులందరికీ నూరవ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ....
ఈరోజు నూరవ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
అసలు ఇప్పటికైనా మహిళా దినోత్సవ ఉద్దేశ్యం నెరవేరిందా ?
మహిళా సమస్యలకు సరైన పరిష్కారాలు దొరికాయా ?
మహిళాభ్యుదయం నిజంగా జరిగిందా ?
మహిళలు చాలా రంగాల్లో పురోగమించిన మాట నిజమే ! అంత మాత్రం చేత తరతరాలుగా వున్న వారి సమస్యలు తీరిపోలేదు. వివక్షత సమసిపోలేదు. పైగా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి.
ప్రకృతిలో స్త్రీకి, పురుషుడికి భౌతికంగా భేదం చాలా స్వల్పం. అది కూడా వారి కర్తవ్య నిర్వహణ కోసం ఆ మాత్రం భేధమైనా వుంది. కానీ మనం ఒప్పుకోవాల్సింది మానవజాతి మనుగడలో ఇద్దరికీ సరి సమానమైన బాధ్యత వుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ అసలు మానవజాతి పుట్టుకలో మాత్రం స్త్రీ కొంచెం ఎక్కువ బాధ్యతనే మోస్తోంది. ఆ విషయంలో స్త్రీ ఏమాత్రం అలక్ష్యం, అశ్రద్ధ చూపినా అసలు మనిషి పుట్టుక సందేహమే !
అందుకే మనం స్త్రీని జగజ్జననిగా ఉన్నత స్థానాన్ని ఇచ్చి కొలుస్తాం. త్రిమూర్తులకంటే శక్తివంతమైనది ఆమె. అందుకే ఆమె మహాశక్తి స్వరూపిణి అయింది. ఆదిశక్తి అయింది. మూలపుటమ్మ అయింది.
దేవతగా స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలుస్తున్నాం. కానీ నిజ జీవితంలో ఆమెకు ఆ స్థానం ఇస్తున్నామా ?
పురాణాల్లోని మహిళలకు తమ భర్తల్ని తామే ఎంచుకునే హక్కు వుంది. కానీ నాగరికంగా ఇంతగా అభివృద్ధి చెందిందనుకుంటున్న ఈరోజుల్లో కూడా ఎంతమంది స్త్రీలు ఆ హక్కును అనుభవిస్తున్నారు ? ఒకవేళ ఎవరినైనా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్నా అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల అడ్డంకులు. ఇవన్నీ కష్టపడి దాటి ఎలాగో పెళ్ళిచేసుకున్నా తర్వాత వారి జీవితం సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతున్నదనుకోవడానికి వీలు లేదు.
అసలు స్త్రీల సమస్యలకు, వివక్షతకు పురుషులే కారణమా ? అని ఆలోచిస్తే నాణేనికి బొమ్మా బొరుసూ వున్నట్లు ఆడైనా, మగైనా మనుషులందరిలోనూ మంచి చెడూ వుంటాయి. భార్యను వేధించే మగవారున్నట్లే వారికి సహకరించే అత్తలు, ఆడపడచులు వున్నారు. అసహాయ స్త్రీలను చేరబట్టే పురుషులున్నట్లే వారిని వక్రమార్గాలు పట్టించే స్త్రీలున్నారు. నేరాలు ఘోరాలు కేవలం పురుషులకు మాత్రమే పరిమితం కాదు. స్త్రీలలో కూడా ఆ ప్రవృత్తి కలిగిన వారు వున్నారు. తమ కొడుకునో, సోదరుడినో తమకు కాకుండా చేస్తుందనే అబధ్రతా భావం మొదటి రకం వారి ప్రవర్తనకు కారణమైతే, డబ్బు వ్యామోహం రెండో రకం వారి, మానసిక బలహీనతలు, పుట్టి పెరిగిన నేపథ్యం మూడో రకానికి కారణమవుతాయి. ఇవన్నీ కాకుండా నిష్టూరమైనా ఒప్పుకోవాల్సిన విషయం ఆడవారిలో అసూయ ఎక్కువ అని. కారణాలేమైనా ఇవన్నీ ఆడవారిపట్ల శాపాలుగా మారాయి. కనుక ఈరకమైన స్త్రీలు తమ ఆలోచనలను, ప్రవర్తనను మార్చుకొని, సంఘటితమైతే వారిని ఏరకమైన వివక్షతా దరిచేరదు. ఎవరూ వారిని అణచలేరు.

7, మార్చి 2011, సోమవారం
నిజాన్ని గ్రహించు
తెలంగాణ ఉద్యమం అనేది తెలుగుదేశం పార్టీని డౌన్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ నుంచీ తెఱ వెనక ఉండి డబ్బులిచ్చి మఱీ కృత్రిమంగా నడిపిస్తున్న వ్యూహాత్మక ఉద్యమమని తెలంగాణ అమాయకులకు తెలియదు. తెలియక, అదేదో తమవాళ్ళ ప్రతిభ, సృజనాత్మకత, పౌరుషం అనుకుని ఇంకా ఎక్కువెక్కువ లొల్లి చేస్తే భయపడి రాష్ట్రం ఇచ్చేస్తారనుకొని తెలంగాణకి అక్షరాలా నిప్పెట్టేస్తున్నారు. కేసీయార్ గర్జనలన్నీ నిజమనుకుంటున్నారు. మిహతా రాష్ట్రమంతా ఆనందంగా గడిపేస్తూండగా తెలంగాణ ఒక్కటీ ఒక తప్పుడు మిథ్యా ఉద్యమం పేరుతో నిలువునా తగలబడిపోతోంది. అందఱూ కలిసి దీన్ని ఎలాగైనా ఆపాలి !
తెలంగాణ సోదరులారా !
మీరు వట్ఠి అమాయకులు
కాంగ్రెస్ రాజకీయం తెలియని పిచ్చోళ్ళు
ఉద్యమం రేపెట్టింది వాళ్ళు
తాము వెనకుండి కేసీయార్ ని ముందుకు తోసింది వాళ్ళు
కేసీయార్ కి తెలంగాణ భవన్ ఇచ్చింది వాళ్ళు
అతన్ని గెలిపించింది వాళ్ళు
ఎవళ్ళు ? బాబూ ! ఇంకెవళ్ళు మన కాంగ్రేసోళ్ళు
కేసీయార్ కి డబ్బులు దొబ్బబెట్టింది వాళ్ళు
అతని చేత నిరాహారదీక్ష చేయించింది వాళ్ళు
విరమింపజేసింది వాళ్ళు
ఉద్యమం చేయించింది వాళ్ళు

సహాయనిరాకరణ చేయించింది వాళ్ళు
నిరాకరణ విరమణ చేయించింది వాళ్ళు
మిలియన్ మార్చ్ చేయిస్తున్నది వాళ్ళు
ఇస్తామన్నది వాళ్ళు, వెనక్కు తీసుకున్నది వాళ్ళు

ఇహనైనా కళ్ళు తెఱవండి ! విషయాలు గ్రహించండి !
రాని రాష్ట్రం కోసం అన్నదమ్ముల్లాంటి
ఆంధ్రావాళ్ళతో అనవసరంగా గొడవపడకండి !
ఢిల్లీ కాంగ్రెస్ కుటిల రాజకీయాలకు
కరాళంగా బలికాకండి !
ఇతరులని బలి చేయకండి !
మీరు సమైక్యవాదుల్ని అమ్మనా బూతులు తిట్టినా ఫర్వాలేదు గానీ మీ నిజాన్ని గ్రహించి మీ యీ ప్రవర్తనకు సిగ్గుపడే రోజు తప్పకుండా వస్తుంది. చాలా తొందఱగానే రాబోతోంది

6, మార్చి 2011, ఆదివారం
ప్రభుత్వం తక్షణం అలసత్వాన్ని వీడి పాలనా యంత్రాంగాన్ని పట్టాలెక్కించాలి.
పని చేయని ప్రభుత్వోద్యోగులు + పరీక్షలు రాయని విద్యార్ధులు + స్వార్ధ రాజకీయాల కోసం దొంగ ఉద్యమాలు చేసే తెలబాన్ గుంపులు + చేత గాక చోద్యం చూసే ప్రభుత్వం ..... వీరందరి మధ్య సామాన్య మధ్య తరగతి /బడుగు జీవుల సమస్యల గురించి ఆలోచించే వాడెవడైనా వున్నాడా? అసలు ప్రత్యెక రాష్ట్రం వచ్చినంత మాత్రాన ఉద్యోగులకి, విద్యార్ధులకి ఒరిగేదేమిటి? పరీక్షలు బహిష్కరించమని రెచ్చగొడుతున్న ప్రొఫెసర్ కి జీతంలో ఒక్క రూపాయి కూడా నష్టం వుండదు. కానీ నష్ట పోతున్న విద్యా సంవత్సరం గురించిన ఆలోచన రోడ్డెక్కుతున్న విద్యార్ధులకి ఉండద్దా? వుద్యోగులైనా అంతే! ప్రత్యెక రాష్ట్రం వస్తే స్పెషల్ ఇంక్రిమెంట్ అని తెలబాన్ దొర చెప్పగానే పనులు మానేసి రోడ్ల మీదకి వచ్చేయటమే! డ్యూటీ చేయని ఉద్యోగుల పై శాఖా పరమైన చర్యలు ప్రభుత్వం మొదటి రోజే తీసుకొని వుంటే విషయం ఇంత ముదిరేది కాదు. పని చేయని వారి పై చర్య తీసుకోవటం వేధింపు చర్య కానే కాదు. ప్రభుత్వం తక్షణం అలసత్వాన్ని వీడి పాలనా యంత్రాంగాన్ని పట్టాలెక్కించాలి. అలాగే రైల్ రోకో పేరు మీద పట్టాలెక్కటానికి సిద్ధమవుతున్న వారిని అదుపు చేయాల్సింది పోయి రైల్వే శాఖ ముందుగానే రైళ్ళని రద్దు చేయటం చాల దారుణం. ఏతా వాతా తేలేదేమంటే సామాన్య ప్రజల ఇక్కట్లనేవి ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టట్లేదని.... ప్రశాంత జీవన పరిస్థితులకి పాడె కట్టి వూరేగిస్తున్న తెలబాన్ గుంపుల అక్రుత్యాలని అడ్డుకోలేని పక్షంలో తక్షణం ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలి.
మానసిక వేదనతో వారి తల్లి దండ్రులని వేధిస్తున్న మిలియన్ మార్చ్
మిలియన్ మార్చ్ పేరుతొ పదవ తేదీన తెలబాన్ గుంపులు తల పెట్టింది భాగ్య నగర దిగ్బంధనం కాదు..వేలాది మంది విద్యార్ధుల భవిష్యత్ దిగ్బంధనం. ఇంటర్ పరీక్షలతో పాటు విద్యార్ధి భవిష్యత్తుకి కీలకమైన పదవ తరగతి పరీక్షలు జరుగనున్న పదవ తేదీన తల పెట్టిన మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే నిషేధించాలి. తెలంగాణా ఆకాంక్షని తెలియ చేయడానికన్న వంకతో టెన్త్ క్లాస్ విద్యార్ధుల భవిష్యత్తుతో ఆటలాడటం క్షమించరాని నేరం. పైగా తాము ఉద్యమం తల పెట్టామని పరీక్షలు వాయిదా వేయాలంటూ ప్రభుత్వానికి హుకుం జారీ చేయటం తెలబాన్ల దురహంకారానికి నిలువెత్తు నిదర్శనం. జాతీయ స్థాయిలో జరుగుతున్న సి.బీ.ఎస్.ఈ. పదవ తరగతి పరీక్షలు కేవలం ఒక రాష్ట్రంలోని కొంత ప్రాంతంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల వాయిదా వేయరన్న ఇంగిత జ్ఞానంకూడా లేకుండా విద్యా రంగంలోనే ఉన్న ఒక మూర్ఖ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో తల పెట్టిన ఈ కార్యక్రమం జరగడానికి వీల్లేదు. ఏడాది అంతా కష్ట పడి చదివి ఈ రోజు పరీక్ష రాయ గలమో లేదో అన్న టెన్షన్ లో విద్యార్దులనీ, పిల్లల భవిష్యత్ గురించిన మానసిక వేదనతో వారి తల్లి దండ్రులని వేధిస్తున్న మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని అడ్డుకొనే తెగువ ప్రభుత్వానికి లేక పొతే తక్షణం రాష్ట్రపతి పాలన విధించి ప్రశాంత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి వుంది.
మిలియన్ మార్చి పేరుతొ విద్యార్ధుల జీవితాలతో చెలగాటాలు!
"తెలంగాణా కి ఒకే అంటే సోనియా కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిన జల్లుకుంటా..- 26 డిసెంబర్,2010 న కే.సి.ఆర్."== ఇటలీ దేవత ముందు ఇంతలా సాగిల పడ్డా ఉపయోగం లేదు.
మహా గర్జన పేరుతొ వింత మొరుగుళ్ళు మొరిగినా లెక్క చేయలేదు.
తాము తెర వెనుక ఉంటూ తెర ముందుకు జై బోలో తెలంగాణా తెచ్చినా వర్కవుట్ అవలేదు.
సహాయ నిరాకరణ అంటూ ఉద్యోగులని ఎగ దోసినా ఉపయోగం లేదు.
"పల్లె పట్టాల పైకి" అంటూ రైలు పట్టాల మీద కాపురం చేయించినా పట్టించుకోనేలేదు.
నోటికి నల్ల బెండేజీలు కట్టుకొని పార్లమెంటులో తిరిగినా,అదే పార్లమెంటులో తెలబాన్ చెల్లి వల వలా ఏడ్చినా కూడా చలించలేదు.
ఇటువంటి టక్కు టమార గారడీ విద్యలు ఎన్ని ప్రదర్శించినా కూడా తెలంగాణా ఇచ్చేది లేదని కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పింది. పార్టీ కేంద్ర కార్యవర్గం నుండి తెలంగాణా వాదుల్ని సాగనంపి వారంటే లెక్కే లేదన్న విధంగా నియామకాలు చేసింది. పదవుల్ని వదిలి గంట కూడా వుండలేరన్న కావూరి మాటల్లోని సత్యం కాంగ్రెస్ అధిష్టానానికి స్పష్టమయింది. అందుకే డోంట్ కేర్ అన్నట్లు తెలంగాణా వాదుల్నీ, వాదనల్నీ పక్కన పెట్టేసి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఏర్పాట్లలో మునిగి పోయింది. మరి ఇంకా ఎందుకు అనవసర ఆందోళనలూ,విధ్వంసాలు, మిలియన్ మార్చి పేరుతొ విద్యార్ధుల జీవితాలతో చెలగాటాలు! ఇక ఎంత మాత్రం సాగనివ్వకూడదు. అనవసర ఆందోళనల కోసం విద్యార్ధుల పరీక్షలు బలి కాకూడదు.

5, మార్చి 2011, శనివారం
సొమ్ము వెదజల్లుతున్నాడు
తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని మంది సొమ్మును అడ్డంగా దోచేసిన వైఎస్ తనయుడు జగన్మోహనరెడ్డి తానే గద్దెనెక్కేందుకు అన్ని మార్గాల్లోనూ వేటాడుతున్నాడు. ప్రధానంగా మీడియాను గుప్పిట్లో పెట్టుకునేందుకు శతవిధాలా సొమ్ము వెదజల్లుతున్నాడు. తన సాక్షి పత్రికనూ, టీవీని జగన్మోహకరించిందిగాక, పాక్షికంగా అమ్ముడుపోయేందుకు సిద్ధంగా ఉన్న ప్రసార మాధ్యమాలను కొనుగోలు చేస్తున్నాడు. ఇప్పుడు మూడు వార్తా ఛానళ్లను 50 శాతానికి కొద్దిగా అటూఇటూగా బినామీ పేర్లతో కొనుగోలు చేసేశాడు. ఖమ్మం జిల్లాకు చెందిన నరేంద్రనాథ్ చౌదరి సంస్థాపిత ఎన్ టీలో 49 శాతాన్నీ, కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం అన్న ఐదు అత్యవసరాలు అందరికీ అందించే ధ్యేయం తమదంటూ పురుడుపోసుకున్న టీవీ-5లో 42 శాతం, టీవీ-9 పాత్రికేయులతో చిన్నపాటి సమరభేరి మోగించిన ఓ విద్యా వ్యాపారి రాజు భావోద్వేగ ఫలితంగా ఉద్భవించిన ఐ న్యూస్‌లో 51 శాతాన్ని యువనేత కొనుగోలు చేసినట్లు జగన్మోహనరెడ్డి శిబిరంలో పనిచేస్తోన్న ఒకరు ఉప్పందించాడు.ఈ మూడు ఛానళ్లు ఇక సాక్షి స్థాయిలో ఏకపక్షంగా జగన్మోహన చాలీసాలను అదే పనిగా భజనచేయకపోవచ్చేమోగానీ వ్యతిరేకంగా మాత్రం నోరు విప్పబోవు. అయితే ఈ ఛానళ్ల ద్వారా ప్రత్యర్థులను దొంగ దెబ్బ తీసేందుకు జగన్మోహనుడి శిబిరం ప్రణాళిక రూపొందించుకున్నట్లు మీడియా నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి జగన్మోహనుడి శిబిరంలోకి చేరిపోయిన మూడు ఛానళ్లూ తొలి నుంచీ అంతో ఇంతో వైఎస్ రాజశేఖరరెడ్డి దొడ్డిలోనే ఉండేవి. కాకపోతే ఇప్పుడు పూర్తిగా జగన్మోహన రాగాన్ని ఆలపించేందుకుగాను సొమ్ముల్ని దక్కించుకుని నీకో సగం – నాకో సగం అంటూ పాడబోతున్నాయి. అంటే ఈ ఛానళ్లు ఇక సోనియా వ్యతిరేక, నకికురె వ్యతిరేక, తెదేపా వ్యతిరేక ఆలాపనలకు వేదికలు అవనున్నాయి. ఇక ఆ తరహా ఆలాపాలు వినాలో? వినకూడదో? నిర్ణయించుకోవలసింది మాత్రం వీక్షకులే.
మహిళా సిగిరెట్ నీ అలవాట సరదాన?
‘ఆమె’ పొగబారుతోంది. అవును. పురుషపుంగవులతో పోలిస్తే అంతోఇంతో పొగకు దూరంగా ఉండే మహిళలను కూడా సిగిరెట్ ఉత్పత్తి సంస్థలు నెమ్మదిగా లోబరచుకుంటున్నాయి. తద్వారా లాభాలను మూటగట్టుకునేందుకు దశాబ్దాల క్రితం నుంచే వ్యూహం ప్రకారం వ్యవహరించటం ప్రారంభించాయని అధ్యయనంలో వెల్లడయింది. అవును అక్షరాలా నమ్మలేని నిజం! పొగాకు పరిశ్రమకు చెందిన 1991 నాటి అంతర్గత వ్యవహారాల నివేదిక ఒకటి దీనిని నిర్ధారించింది కూడా. చార్మినార్ సిగిరెట్ల తయారీ సంస్థ ఫిలిఫ్స్ మోరిస్ 1968లో తన వర్జీనియా స్లిమ్స్ సిగిరెట్ అమ్మకాలను పెంచుకొనేందుకు ఓ ప్రకటనను రూపొందించింది. దానిలో ”అమ్మాయీ, చాలా కాలానికి నువ్వు సాధించావు” అనే నినాదం. దాని కింద అమెరికాలో మహిళా ఉద్యమాలు సాధించిన విజయాలను పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసంతోనూ, స్వతంత్రంగానూ వ్యవహరించే యువతులు వర్జీనియా స్లిమ్స్ సిగిరెట్లు తాగటం ద్వారా తమ స్వాతంత్య్రాన్ని స్పష్టంగానూ సమర్ధవంతంగా వ్యక్తీకరించవచ్చని ఒప్పించే వ్యూహం ఈ ప్రకటనలో దాగి ఉందని 1991లో వెలువడిన ఓ నివేదికలో విశ్లేషకులు పేర్కొన్నారు. ఆ ప్రకటన అమెరికాలో ఆశించిన ఫలితాలనివ్వటంతో మిగతా దేశాలలోనూ అదే తరహా వ్యూహాన్ని అమలు జరిపారు. జపాన్‌లో 1994లో ఇదే వర్జీనియా స్లిమ్స్ కోసం ఓ ప్రకటనను రూపొందించారు. ‘సామాజిక నియమాలకు అనుగుణంగా నేను సరైన దారిలోనే ప్రయాణిస్తున్నా, అయితే అదే సమయంలో, నా సొంత భావాలపట్ల నిజాయితీగా ఉంటా. అందువలన నా కోరికను తీర్చుకునేందుకు సామాజిక నియమాలు ఆటంకంగా మారితే నేను లెక్కచేయను’ అంటూ ఓ యువతితో చెప్పించారు ఆ ప్రకటనలో. అంటే సిగిరెట్లు తాగాలనుకొంటే దేన్నీ లెక్కచేయనని చెప్పటమన్నమాట.
ఏడాదికి 50 లక్షల మంది పొట్టనబెట్టుకుంటున్న పొగ
పొగాకు సంబంధించి దృష్టిసారించాల్సిన పలు విషయాలు కెనడాకు చెందిన వాటర్లూ, వేవెస్ట్ విశ్వవిద్యాలయాలు ‘మహిళా సాధికారత – స్త్రీపురుషులలో పొగ తాగే నిష్పత్తి’ అంశంపై జరిపిన అధ్యయనంలో వెల్లడయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా సంచిక ఈ వివరాలను ప్రకటించింది. ప్రపంచవ్యాపితంగా ప్రస్తుతం ఏడాదికి 50 లక్షల మంది పొగ తాగి మరణిస్తున్నారని ఆ నివేదిక విదితం చేసింది. 2030 నాటికి పొగ వలన 80 లక్షల మంది మరణించవచ్చని అంచనా వేశారు. అదే ఈ శతాబ్ది అంతానికి మొత్తం వంద కోట్ల మంది పొగ తాగిన కారణంగా మరణించవచ్చని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాపితంగా మహిళలకంటే పురుషులు ఐదురెట్లు అధికంగా పొగ తాగుతున్నారు. అయితే స్త్రీ-పురుష నిష్పత్తి దేశదేశానికీ తేడా ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, పశ్చిమ ఐరోపాలోని అధిక దేశాలలో పురుషులతో సమంగా స్త్రీలూ పొగ తాగుతున్నారు. స్వల్ప, మధ్య ఆదాయ దేశాలలో ఈ నిష్పత్తి తక్కువగా ఉంది. చైనాలో పొగతాగే పురుషులు 61 శాతం ఉండగా, మహిళలు కేవలం 4.2 శాతమే ఉండటం విశేషం. అర్జెంటీనాలో 34 శాతం పురుషులు, 23 శాతం మహిళలు పొగ తాగుతున్నారట. ఇప్పుడు పొగతాగే స్త్రీల శాతం తక్కువగానే ఉన్నప్పటికీ వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వయస్సువారీగా చూస్తే 13-15 ఏళ్ల యువతీ యువకులలో నిష్పత్తి వ్యత్యాసం 2-3 రెట్ల మధ్యనే ూండగా, మిగతా అన్ని వయస్సుల వారిలోనూ ఐదు శాతానికి పైనే ఉండటం ఆలోచించాల్సిన విషయం.
సంప్రదాయం చట్టుబండలు
సాధారణంగా ఏ దేశంలోనూ మహిళలు పొగతాగటాన్ని సమాజం అంగీకరించదు. ఆ కారణంగానే స్త్రీలలో పొగ తాగేవారు తక్కువ. అమెరికాలో 1920 దశకంలో మహిళలు పొగతాగటం గౌరవప్రదం కాదని భావించేవారు. ఇప్పుడు ఆ పరిస్ధితి మారింది. పురుషులతో సమంగా మహిళలూ అక్కడ పొగ తాగుతున్నారు. సిగిరెట్ ఉత్పత్తిదారుల ప్రకటనల వ్యూహం కూడా దీనికి కారణమేనని పరిశీలనలలో తేలింది. సిగిరెట్ ఉత్పత్తి సంస్థలు పెరుగుతున్న మహిళా సాధికారతను ఉపయోగించుకుని వారికి పొగతాగుడును అలవాటు చేయిస్తున్నాయి. ఇలా సామాజిక మార్పులను సొమ్ము చేసుకొనేందుకు సిగిరెట్ ఉత్పత్తి సంస్థలు వేస్తోన్న ఎత్తుగడల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాజా అధ్యయనం హెచ్చరించింది.

దే’వాదాయ’ ఆమాత్యుడిగా వెలగబెట్టిన జూపల్లి కృష్ణారావు పుణ్యమా అని ఇక ఆ బాధలు తప్పాయి.
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఆ శాఖ మంత్రిత్వానికి లాల్‌బహదూర్‌శాస్త్రి రాజీనామా చేసిన విషయాన్ని ఆరు దశాబ్దాలపాటు చెప్పుకుని చెప్పుకుని తుత్తిపడ్డాం. వినీ, వినీ విన్నవారి చెవులు తుప్పు పట్టిపోయాయంటే నమ్మి తీరాలి మరి. నల్లారి కిరణ్‌కుమార్ మంత్రివర్గంలో దే’వాదాయ’ ఆమాత్యుడిగా వెలగబెట్టిన జూపల్లి కృష్ణారావు పుణ్యమా అని ఇక ఆ బాధలు తప్పాయి. రాష్ట్ర మంత్రి పదవికి మార్చి మూడో తేదీన జూపల్లి కృష్ణారావు రాజీనామా చేసి త్యాగమూర్తుల సరసన చేరిపోయారు. తాను నమ్మిన విలువలకు వలువలు కట్టబూనుకున్న శాస్త్రి కంటే ప్రజల మనోభావాలకు స్పందించిన జూపూడి మిన్న అని నేను అంటే ఎవ్వరూ కాదనబోరనుకుంటాను. అయితే గియితే అంతగా ఆదాయం లేని దేవాదాయ శాఖ అంటే జూపల్లికి ఇష్టం లేకనే అధిష్టానాన్ని బెదిరించేందుకు రాజీనామా చేశాడని గిట్టనివాళ్లు, ప్రత్యేకించి సీమాంధ్రులు వాగితే వాగొచ్చుగాక. జూపల్లి పదవీ త్యాగం మామూలు వ్యవహారం కానేకాదు. అందుకనే అయన రాజ్యాంగాన్ని సైతం ధిక్కరించారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రస్ధాయి మంత్రులెవరయినా రాజీనామా చేయదలిస్తే ముఖ్యంత్రి ద్వారా గవర్నరుకు సమర్పించుకోవాలి. కానీ జూపల్లి ఏకంగా తన అధిష్టాన దేవత సోనియమ్మకు రాజీనామా పత్రాన్ని పంపేసి తన అంతరంగాన్ని చెప్పకనే చెప్పేశారు. అదేమని అడిగిన పాత్రికేయులతో తాను ఏడాది క్రితమే ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే తన త్యాగపూరిత ప్రణాళికను ప్రకటించానని గుర్తుచేశారాయన. మరి ఏడాది కాలంగా ఎందుకు త్యాగాలు చేయలేదేమని అడగ్గా … ”సోనియమ్మ తెలంగాణ ఇస్తుందని నేను ఇప్పటికీ నమ్ముతున్నా” అంటూ జూపల్లి రాజీనామా వెనకున్న రహస్యాన్ని పరోక్షంగా విప్పకనే విప్పేశారనుకోండి. ”సోనియమ్మ తెలంగాణ ఇస్తుందని ఇప్పుడూ నమ్ముతుంటే రాజీనామా ఎందుకు చేసినట్లో?” అని ఏ పాత్రికేయుడూ నోరు విప్పకపోవటం జూపల్లి తప్పుకాదుగదా! పాపం శమించుగాక! అంటే అయిపోయిందనుకోకండి. ఇంకా కొద్దిగా ఉంది. తెలంగాణ ప్రజల మనోభావాలను మన్నించి తాను పదవీ త్యాగానికి పాల్పడినట్లు ఆయన తెగచెప్పేసుకున్నారు. చెప్పేసుకున్నారంటే… చెప్పులు వేసుకున్నారనుకునేరు. ఆయన చెప్పులు వేసుకున్నాడో, బూట్లే వేసుకున్నాడో, అవి ఏ సంస్థవో తేల్చి చెప్పటానికి నేనెవర్ని? ఆ మాటకొస్తే అసలు వాటినయినా, వీటినయినా వేసుకున్నాడో? లేదో? కూడా చూడకుండా చెప్పటం కుదరదుగాక కుదరదుగదా! సరే చెప్పుల సంగతి అట్లా పెడదాం. ‘ప్రజల మనోభావాలు’ అన్న మాట ఉంది చూశారూ! ఎంతటి గొప్పదనుకుంటున్నారు. ఈ శతాబ్దానికి ముందు ఆ మాట ఎప్పుడూ విన్నట్లు నాకు గుర్తులేదు. ఆ ఎనిమిది అక్షరాల అద్భుత పదం ముందు అన్నీ దిగదుడుపేనని ఘంటాపదంగా చెప్పొచ్చు. అసలు దీన్ని ఈ శతాబ్దం పదంగా గుర్తించటమే కాకుండా, ఇటు దేశీయ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ, అటు ప్రపంచస్ధాయి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ నమోదు చేయాలని నేను నొక్కి ఒక్కాణించదలచుకున్నాను. ఎవరికి ఏది ఇష్టమో, దాన్ని ప్రజల మనోభావంగా ప్రకటించేయవచ్చు. ఎవరికి ఏది కష్టమో దాన్ని ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని తెగనాడనూ వచ్చు. అంటే ఈ పదం రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. అదే బాటలో జూపల్లి పయనించి ప్రజల మనోభావాలకు అనుగుణంగా తన పదవిని త్యాగం చేసేసి త్యాగయ్య అయ్యారు. ఇక్కడే నా పాడు మనస్సు కీడు శంకిస్తోంది. అదేమంటే… ఇతరేతర పదవుల్ని అట్లా ూంచుదాం. ఆయన వైఎస్ పాలనలో పౌరసరఫరాల మంత్రిగా పనిచేశారు. దానికి సంబంధించి ఒక చిన్న ప్రశ్నతో నా కు’శంక’ను తీర్చుకునేందుకు అంగీకరించండి. నా కుశంకను రాష్ట్రానికంతా వర్తింపజేయనులెండి. పేదలకు రేషను కార్డుల జారీ, వాటి ద్వారా చౌక దుకాణాల నిర్వహణ, వాటి ద్వారా దరిద్ర నారాయణులకు సరుకుల పంపిణీ తదితర జనోద్ధరణ కార్యక్రమాలన్నీ పౌరసరఫరాశాఖ ద్వారా జరగాల్సిన పనులు. మరి తెలంగాణ పేదలు తమకు రేషను కార్డులు వద్దనీ, ఎంత ధర పెట్టయినా తిండి గింజల్ని కొనుక్కుంటానమని మన జూపూడివారికి విన్నవించుకున్నారా? తెలంగాణలో చౌక దుకాణ యజమానులు సరుకుల్ని ప్రజల మనోభావాలకు అనుగుణంగానే దారి మళ్లించారా? అవునని జూపూడి అంటే పేచీ లేదు. అయితే రేషను కార్డు కావాలి మహాప్రభో అంటూ లక్షలాది మంది చేసుకున్న దరఖాస్తులు తెలంగాణ ప్రాంత తహశీలుదారుల కార్యాలయాల్లో మూలుగుతున్నందున జూపూడి ధైర్యం చేసి ఆ మాట అనగల వీలులేదు. చౌక సరుకుల్లో 60 శాతానికి తక్కువ కాకుండా దారి మళ్లుతున్న వైనం పుంఖానుపుంఖాలుగా పత్రికల్లో వార్తల రూపాన కన్పిస్తుంటే రెండో ప్రశ్నకూ జూపూడి లేదని చెప్పలేదడనుకుంటాను. మరి పౌరసరఫరాలశాఖకు సంబంధించి ప్రజల మనోభావాలను మన్నించేందుకు పూనుకోని జూపూడి అనే పెద్దమనిషి దేవాదాయశాఖ మంత్రిగా మాత్రం ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించటం వెనుక ఏమయినా మతలబు ఉందా? అన్నదే నా కుశంక. నా కుశంకను ఎవరు తీరుస్తారు? చెప్మా!
గంటకు పది కోట్ల రూపాయలు నల్లధనం దేశం సరిహద్దులు దాటుతుంది ?
నిత్యావరాల ధరలు పెరిగాయని ఆందోళన చేసే సామాన్య జనంపై లాఠీలతోనూ, తూటాలతోనూ విరుచుకుపడే ప్రభుత్వం నల్లధనం మదుపుదారుల పట్ల ముద్దుముద్దుగా వ్యవహరిస్తోంది.1948 నుంచీ ఇప్పటి వరకూ రూ.20 లక్షల కోట్ల నల్లధనం దేశం సరిహద్దులు దాటి ఉంటుందని అంచనా.రోజుకు రూ. 240 కోట్లు నల్లధనం దేశ సరిహద్దులు దాటుతోంది, అంటే గంటకు పది కోట్ల రూపాయలు.కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్టు ధనబలానికి ఓ నకలు.రాజకీయ ధనబలం ముందు ప్రజాస్వామ్య విలువలు నానాటికీ కుంచించుకుపోతున్నాయి.2011-2012 బడ్జెట్టు మొత్తం కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేదిగా ఉంది.బడ్జెట్టులో వ్యవసాయ రంగానికి గతం కంటే రూ.5800 కోట్లు కోతపెట్టిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు మాత్రం ఐదు లక్షల కోట్ల రూపాయలను రాయితీగా ఇచ్చింది.ఆదాయపు పన్ను మినహాయింపు ద్వారా రూ.88 వేల కోట్లు, ఎక్సైజ్ సుంకం మినహాయింపు ద్వారా రూ.1.76 లక్షల కోట్లు, కస్టమ్స్ సుంకం తగ్గింపు ద్వారా రూ.2.24 లక్షల కోట్లు రాయితీలిచ్చింది.ఈ సొమ్ము 2జి స్పెక్ట్రం కుంభకోణంలో దారిమళ్లిన దానికన్నా మూడు రెట్లు అధికమని లెక్క.వ్యవసాయం, ఆహారభద్రత నిధుల కేటాయింపుల్లోనూ కోతలు పెట్టింది.దీనికితోడు వ్యవసాయరంగానికి ఇచ్చిన అరకొర రాయితీలు కూడా అటుఇటు తిరిగి కార్పొరేట్ సంస్థలకే చేరతాయి.వ్యవసాయ రంగానికి లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలిస్తున్నట్టు ప్రభుత్వం లెక్కలు చూపుతున్నప్పటికీ వాస్తవానికి అవి కూడా పెద్దలకే దక్కుతున్నాయి.చిన్న- సన్నకారు రైతులకు బ్యాంకు రుణాలు నానాటికీ సన్నబడుతున్నాయి.ఇప్పుడు ఎన్నికలంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయటమని భాష్యం.కోటీశ్వరులు మాత్రమే ఎన్నికయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.తద్వారా రాజకీయ అవినీతి పెరిగిపోతోంది.ధనబలం పెరుగుతోన్న కొద్దీ ప్రజల సమస్యలను చట్టసభల్లో ప్రతిబింబింపజేసే వారు కనుమరుగవుతున్న విషయాన్ని అందరూ ఆలోచించాలని నేను కోరుతునాను.
4, మార్చి 2011, శుక్రవారం
సమాజంలో విష బీజాలు నాటడం మొదలుపెట్టిన రియాల్టీ షోలు
ప్రస్తుతం టెలివిజన్ ఛానెళ్లు తమ టిఆర్పి రేట్లను పెంచుకోవడానికి రకాల రకాల రియాల్టీ షోలపై దృష్టి సారిస్తున్నారు. కొన్ని ఛానెల్‌లు చిన్న పిల్లలతో ఆట పాటలు చేయిస్తుంటే.. మరికొందరు పెద్దవారితో చేయిస్తున్నారు. ఇలా ఆట పాటల వరకూ అయితే ఫర్వాలేదు కానీ.. కొన్ని రియాల్టీ షోలయితే అత్యంత ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. అలాగే కొన్ని అసభ్యకరమైనవి కూడా ఉన్నాయి. అసలు ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నామంటే... ఇటీవల ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానెల్ 'జీ తెలుగు' ఓ వినూత్న రియాల్టీ షో "కొండవీటి రాజా.. కోటలో రాణి"ను ప్రారంభించింది.
ఈ రియాల్టీ షో కాన్సెప్ట్ ఏంటంటే... అడవిలో హాయిగా తమ పనులు తాము చేసుకునే గిరిజనులును పట్నం తీసుకు వచ్చి వారికి పట్నం అమ్మాయిలను పార్ట్నర్గా చేసి వివిధ రకాల పరీక్షలు పెట్టడం. చివరిగా ఎవరు నెగ్గుతారో... వారే కొండవీటి రాజా... కోటలో రాణి. కాన్సెప్ట్ వినడానికి బాగానే ఉంది కానీ.. నైతిక విలువల ప్రకారం చూస్తే.. ఏమీ తెలియని గిరిజనుల అమాయకత్వాన్ని మరో కోణంలో చూపించి నవ్వుకునేలా చేయడం ఇందులో దాగున్న రహస్యం.
లుంగీ, చొక్కా తప్పా జీన్స్, టీ-షర్ట్ల గురించి తెలియని వారికి ఆ దుస్తులు వేయించడం, అసలు చదువు అంటే తెలియని గిరిజనుల చేత ఇంగ్లీషు పద్యాలు చెప్పించడం. వారు తప్పులు చేస్తుంటే చూసి పకా పకా నవ్వుకోవడం ఇది దీని అసలు కాన్సెప్ట్. అంతటితో ఆగిపోయితే సరి, హవ్వ... ఈ షోలో పాల్గొన్న యువతులు మాట్లాడే అసభ్య పదజాలాన్ని వింటుంటే.. హరి హరీ.. చెప్పడానికి తెలుగు భాషలో మాటలే ఉండవని చెప్పాలి. స్పోర్టివ్‌గా తీసుకోవాల్సిన ఆటల్లో ద్వేషంతో వ్యవహరించండమేంటి..? సిగ్గు.. సిగ్గు.. ఇలాంటి షోలు సమాజంలో విష బీజాలను నాటడం ఖచ్చితమని మానవ హక్కుల సంఘాలు ఘోషిస్తున్నా.. మనం మాత్రం వీటని చూసి ఎంజాయ్ చేస్తుంటాం...!
ఇలాంటిదే "ప్యాటి హుడిగిరో.. హల్లీ లైఫు" (సిటీ అమ్మాయిలి... పల్లె జీవనం) అనే మరో రియాల్టీ షో "సువర్ణ కర్ణాటక" అనే ఓ కన్నడ టెలివిజన్ ఛానెల్లో ప్రాసారం అవుతుంది. అయితే దీని కాన్సెప్ట్ మన కొండవీటి రాజా కోటలో రాణికి పూర్తిగా రివర్స్. ఇక్కడ పట్నం నుంచి వచ్చిన 12 మంది అమ్మాయిలతో ఉత్తర కర్ణాటకలో మారుమూల కుగ్రామంలో గొడ్డు చాకిరి చేయించడం ఈ రియాల్టీ షో అసలు కాన్సెప్ట్. అక్కడ ఎదురయ్యే కష్టనష్టాలను తట్టుకొని ఎవరు నిలబడుతారో వాల్లే విన్నర్స్ అన్నమాట. అమ్మాయిలతో పని చేయించే మాట అలా ఉంచితే పల్లె జీవనం ఎంత కష్టంగా ఉంటుందో.. అలాగే ఎంత అందంగా ఉంటుందో చూపించడం ఈ రియాల్టీ షో ప్రత్యేకత.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)