19, మార్చి 2011, శనివారం

అందరికీ హొలీ శుభాకాంక్షలు!

ఈ రోజు హొలీ పండుగ. మన భారతదేశం వివిధరకాల ఆచారాలు,
సాంప్రదాయాలకు విలువ నిచ్చే దేశం. మన దేశంలో జరుపుకొనే
సరదా పండుగల్లో హొలీ ముఖ్యమైన పండుగ. ప్రధానంగా ఉత్తర
భారతదేశంలో ఈ పండుగని ఆనందోత్సహాలతో అన్ని వయసుల
వారు జరుపుకుంటారు వసంతకాలం రాకకు గుర్తుగా పకృతి అంతా
పచ్చపచ్చగా అగుపిస్తూ సుందరంగా కనులవిందు చేస్తుంది.
ఒకరిపై ఒకరు పిచికారీలతో రంగులు చిమ్ముకుంటూ సరదాగా
ఆడి పాడుకుంటారుమధుర,బృందావనంలలో
శ్రీకృష్ణుడు గోపికలతో రాసకేళి గడిపిన చోట శ్రీ కృష్ణుని విగ్రహాలపై రంగులు
పూసి హొలీ జరుపుకుంటారు.
అందరికీ హొలీ శుభాకాంక్షలు!

మరో చెర్నోబిల్ ఘటన!!!!!!!!!!!!!!!!!

* పుట్టిన , పుట్టబోయే పిల్లలకు కొత్త రోగాలు
* అణు ధార్మికతతో పలు రకాల కాన్సర్ లు
* జపాన్ లో పుట్టబోయే పిల్లలకు ఇక అంగవైల్యమేనా?
* తుడిచి పెట్టుకుపోనున్న జపాన్ ?
* హిరోషిమా ఘటనకంటే తీవ్రంగా రేడియోషన్ ?

జపాన్ లో భూకంపం అనంతరం..అణు విద్యుత్ ప్లాంట్ ల నుంచి వెలువడే రేడియో యాక్టివేషన్ వల్ల కొత్త సమస్యలు తలెత్తున్నాయి. రేడియో యాక్టివేషన్ కు గురైన ఆహారం, పదార్ధాలు తీసుకోవటం వల్ల పుట్టిన , పుట్టబోయే పిల్లలకు కొత్త రోగాలు వచ్చి ..మొత్తం దేశం తుడిచి పెట్టుకు పోనుందా? ఈ ఆందోళన తో అక్కడి సైంటిస్టులు, డాక్టర్లు కొట్టుమిట్టాడుతున్నారు.

టెక్నాలజీ లో అందరి కంటే ముందుండే ..జపాన్ ఈ కొత్త సమస్యను ఏవిధంగా ఎదుర్కొంటుందో అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. జపాన్ లో సంభవించిన భూకంపం తాలూకు ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్ధతో సహా అక్కడి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

భూకంపం వల్ల అణు విద్యుత్ ప్లాంట్ లకు ముప్పు ఏర్పడి ద్వారా అణు ధార్మికత వెలువడటంతో అక్కడి ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దీనిప్రభావంతో నీరు ,ఆహారం కలుషితమవటం ద్వారా పుట్టిన , పుట్టబోయే పిల్లలకు బోన్, లంగ్, లుకేమియా, ధైరాయిడ్ రావచ్చని , ప్రమాదకర స్ధాయిలో కాన్సర్ సంక్రమించే ప్రమాదం వుందని భయపడి చస్తున్నారు.

సముద్రంలో చోటు చేసుకునే రేడియోషన్ గుర్తించటానికి తగిన కొలమానాలు లేవని చైనాలోని పాధాలాజిస్టులు చెపుతున్నారు. గాలిలో కలిసిపోయే రేడియోషన్ వల్ల పంటలు , సముద్ర ఉత్పత్తులు ,తాగునీరు కలుషితం అవుతోందన్న భయం జపాన్ వాసులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. దీని ప్రభావం వల్ల మహిళలకు గర్భవిచ్ఛితి జరిగే ప్రమాదం వుందని డాక్టర్లు వర్రీగా వున్నారు. పురుషులైతే .పునరుత్పత్తి సామర్ధ్యం కోల్పోతారని .. డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

హిరోషిమా ఘటనను తీసుకుంటే నాటి బాధితుల్లో ఎక్కువమంది రేడియోషన్ ప్రభావం వల్ల ఇప్పటికీ అంగవైకల్యంతో బాధపడుతున్నారని చికిత్స చేసిన డాక్టర్లు గుర్తుచేసుకుంటున్నారు. అణు ధార్మికతను ..కొలవటానికి తగిన ప్రామాణికత లేదని జపాన్ సైంటిస్టులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఆసియాదేశాలైన ధాయ్ లాండ్, దక్షిణ కొరియా, తదితర దేశాలు జపాన్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై ఓ కన్నేశాయి.

చెర్నోబిల్ ఘటన దృష్ట్యా తాము ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అక్కడి అధికారులు తెలిపారు. రేడియోషన్ తమ దేశాలకు విస్తరించి ప్రజలకు ముప్పుగా పరిణమించే అవకాశాలకు చెక్ పెట్టేందుకు అన్ని చర్యలు చేపట్టామని వివరించారు.

బుద్ధుని విగ్రహాలని నాశనం చేసిన తాలిబాన్ల

శాంతి స్వరూపుడైన బుద్ధుని విగ్రహాలని నాశనం చేసిన తాలిబాన్ల లాగ తెలుగు జాతి ఘన చరిత్రకి సంకేతాలైన టాంక్ బండ్ మీది విగ్రహాలని ద్వంసం చేసిన తెలబాన్లని జగన్ కించిత్తు విమర్శించక పోవటం ఆశ్చర్యకరం. కాంగ్రెస్ పార్టీలో వున్నప్పుడు పార్లమెంటు సాక్షిగా రాష్ట్ర విభజనకి తాను వ్యతిరేకమని స్పష్టం చేసిన జగన్ ఇప్పుడు సొంత పార్టీ పెట్టాక తన విధానం ప్రకటించక పోవటం శోచనీయం.కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే అవకాశాన్ని పార్టీనుండి బయటకి వచ్చాక జగన్ ఎందుకు సద్వినియోగం చేసుకోవట్లేదు? సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రం తగలబడి పోతున్నా నిమ్మకి నీరెత్తినట్లున్న కాంగ్రెస్, టీడీపీ ల కి పోటీగా తాను కూడా వ్యూహాత్మక మౌనం పాటించటం నేరమే. వైఎస్ పధకాలన్నీ అమలు చేస్తానని డబ్బా కొడుతున్న జగన్, తండ్రి విశ్వసించిన సమైక్య వాదాన్ని ఎందుకు పాటిన్చట్లేదు? రాజ శేఖర రెడ్డి తరచుగా వాడిన పదం "విశ్వసనీయత". కేవలం పదవి కోసమే రాజకీయాలు చేసి ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన నాడు జగన్ రాజకీయ భవిష్యత్తు అంధకారమే అవక తప్పదు.

18, మార్చి 2011, శుక్రవారం

ధైర్యంతొ కట్టుకున్న ఆశల సౌదాలును నేలకూలుస్తూన్నాయి..

నేను జేబులలో అదృష్టాన్ని వేసుకుని రాలేదు.....

గుండెల్లొ సంకల్పాన్ని నింపుకొని వచ్చాను......


నా శరీరానికి సుఖాన్ని అత్తరుగా పూసుకొని రాలేదు....

కష్టాలా శిలువను స్వేదబిందువులతొ తెంచుకొని వచ్చాను....


గతాన్ని నా పిడికిళ్లలొ దాచుకొని....

గుర్రంలా పరుగు తీస్తున్న అలుపెరుగని ఆ కాలాని చూస్తున్నా....

రేపటి నా పయనం ఎటువైపని....


వెలుగు... విధితొ స్నేహమాడుతున్నట్లుంది ... అందుకే

నా జీవిత మార్గానికి దారి చూపలేకపొతుంది....


చీకటి... శూన్యాన్ని ప్రేమిస్తున్నట్లుంది... అందుకే

అసమర్ధుడిగా ఈ సమాజం ముందు నిలబెడుతుంది...


పదే పదే ఓటమి హొయలొలుకుతూ నేరజాణై నన్నుహత్తుకుంటుంది....

గెలుపు అస్వతంత్ర్యయుడిని చేస్తూ అంటరానివాడినని నిందిస్తుంది....


స్వర్గం... నరకంతొ సంధి చేసుకున్నట్లుంది.... అందుకే

సమస్యల సుడిగుండానికి పగలు ఏంటి... రాత్రి ఏంటని... చర్చించుకుంటున్నాయి...


ధైర్యంతొ కట్టుకున్న ఆశల సౌదాలును నేలకూలుస్తూన్నాయి...

మదిలొ ఆశయాలు నిశ్మబ్ధంగా నల్లబారిపొతున్నాయి....


ఎన్ని రాత్రులు గడిచినా ... ఎన్ని పొద్దులు పొడిచినా....

కాంతీ హీనుడిని చేస్తూ ఆనందాని నిక్కచ్చిగా దొచుకొవాలని ....

ఆకలి రాణి నాపై దండాయాత్ర చేస్తూనే ఉంది....

వర్షిస్తున్న చూపుతొ మరొ ప్రపంచం కొసం నా అన్వేషణ....

17, మార్చి 2011, గురువారం

చేదు జ్ఞాపకాలు చెరసాలై బంధిస్తేంటి...?

కదలని పగళ్ళూ..... కలత నిదురలు...

నిట్టూర్పు సెగలు... ఓదార్పులేని దిగుళ్ళూ...

ఎన్నాళ్ళిలా....?

జీవితం అంతా పొరాటం అయిన పర్వాలేదు.... ఓటమి అనుభవానిచ్చే ఆస్ధులని గుర్తుంచుకొ...

నీరాశ ఆకాశంలా కమ్ముకునా చింతలేదు.... ఆత్మసైర్ధ్యమే నీకున్న అంతస్తులని చెప్పుకొ...

వేదనలు చుట్టుముట్టినా బాధపడకు....నమ్మకముంటే నరకం కూడ స్వర్గంగా స్వాగతిస్తుంది...

ఆశయ సాధనలొ స్వార్ధం సరసమాడినా భయపడకు....ఆత్మవిశ్వాసముంటే అపజేయం కూడ ఆవిరవుతుంది...

గేలి చేస్తున్న కాలన్ని చూసి కన్నీరు కార్చకు....వేదిస్తున్న విధిపై పట్టుదలని పణంగా పెట్టు...

మనశాంతి కరువైందని విచారించకు... అది నీ మనస్తతత్వంలొనే దాగుంటుందని గ్రహించు...

ఎదలొ కష్టాలూ... ఎడారులై సేగలురేపితే ఏంటి...?

చేదు జ్ఞాపకాలు చెరసాలై బంధిస్తేంటి...?

సమస్యా వలయాన్ని థైర్యంతొ చేదించాలి...

అవమానాలను చీల్చుతూ... చిరునవ్వుల సౌగంధాలను మదిలొ నింపాలి...

తల్లడిల్లే గుండెపై గెలుపు జెండా ఎగరాలి... మీ నాని...

ఇదేనా మన దేశం

దక్షిణ భారతదేశంలో నోటుకు ఓటు పద్ధతి బాగా ఉందని చెప్పిన వికీలీక్స్ మరో సంచలనాన్ని బయటకు తెచ్చింది.
గత సాధారణ ఎన్నికలకు ముందు 2008వ సంవత్సరంలో అమెరికాతో అణు ఒప్పందం నేపథ్యంలో యూపిఏ ప్రభుత్వంతో కమ్యూనిస్టు పార్టీలు తెగతెంపులు చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం మైనారటీలో పడిపోయింది. అప్పుడు విశ్వాస పరీక్షలో నెగ్గడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్ఎల్‌డి పార్లమెంటు సభ్యులకు ఒక్కొక్కరికి రూ.10 కోట్లు ముట్టజెప్పినట్టు వికీలీక్స్ తాజాగా బయట పెట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత సతీష్ శర్మ నేతృత్వంలో ఈ డబ్బులు పంచినట్టుగా బయట పెట్టింది.

కాగా రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి చెందిన అసదుద్దీన్ ఓవైసీ కూడా ఓటును నోటు పద్ధని అనుసరించారని చెప్పింది. ఎన్నికలలో తమ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాడనికి ఎలా ప్రలోభ పెట్టారో అసదుద్దీన్ బాహాటంగానే ఎలాంటి సంకోచం లేకుండా చెప్పారన్నది. వికిలీక్స్ వెల్లడించిన విషయాలు.

ఉన్నారుగా.... అమాయక ప్రజలు. వాళ్ల జీవితాలు తాకట్టు పెట్టేస్తారు !

అఖిలాంధ్ర ప్రజలకు అభివాదాలు !

అన్నట్లు అఖిలాంధ్ర, సమైక్యాంధ్ర అనొచ్చా ? ఏమో ! ఏమంటే ఏ తంటానో కదా ! అయినా నేను ఆత్మనే కదా ! ఏమన్నా ఫర్వాలేదు. నన్నేమీ చెయ్యలేరు కదా !
ఎలా ఉన్నారు అని కుశల ప్రశ్నలు అడుగలేను. ఆంధ్ర దేశ పరిస్థితి నాకు ఎప్పటికప్పుడు తెలుస్తోంది.

ఏమని చెప్పను నా బాధ ? తెలుగు ప్రజలు పరాయి భాష పాలకుల చేతిలో అవమానింపబడుతున్నారని అప్పట్లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. అసఫ్ జాహీలు, నిజాం నవాబుల కాలంలో తెలుగు భాషకు, తెలుగు వారికి జరిగే పరాభవాలు తట్టుకోలేక తెలంగాణా ప్రాంతంలో విముక్తి కోసం ఉద్యమాలు చేశారు. 1937 లో కుదిరిన ' శ్రీబాగ్ ' ఒప్పందం ప్రకారం మరుసటి సంవత్సరమే ఆంధ్ర రాష్ట్రం వస్తుందనుకుంటే రాజధానిగా మద్రాస్ నగరాన్ని కోరుకోవడంతో వాయిదా పడింది. నిజానికి రాజధాని రాష్ట్రానికి మధ్యన ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మరి మద్రాస్ ( అదే ఇప్పుడు చెన్నై అంటున్నారట కదా ! ) తమిళనాడు రాష్ట్రానికి మధ్యలో ఉందా ! లేదే !

సరే... 1947 లో భాషా రాష్ట్రాల సమస్యను పరిష్కరించడానికి వేసిన థార్ కమీషన్ భాషల పరంగా విభజించడం కుదరదని చెప్పేసింది. నీలం సంజీవరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికవడంతో 1952 లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్ర మహా సభ నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి హాజరుకావద్దని సభ్యులందర్నీ ఆదేశించడం, 21 మంది కాంగ్రెస్, స్వతంత్ర సభ్యుల సంతకాలతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వాయిదా వెయ్యాలని విజ్ఞాపన ప్రధాని నెహ్రు గారికి అందజెయ్యడం చేసాడు. ఇది నెహ్రుకు బాగా అనుకూలించింది. మీరు విడదియ్యమంటున్నారు కానీ వాళ్ళేమో విడదియ్యోద్దంటున్నారు. ముందు మీలో మీరు తేల్చుకుని ఏకాభిప్రాయానికి రండి అని చెప్పి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వాయిదా వేసి తమాషా చూస్తూ ఉండిపోయాడు. ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పులేదనుకుంటాను.
దీంతో అసంతృప్తికి లోనైన స్వామి సీతారాం 36 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి వినోభాభావే జోక్యంతో విరమించాడు. నేను ఊరుకోలేకపోయాను. ఇంకా ఎన్నాళ్ళు తాత్సారం చేసి తమాషా చూస్తారు అని బాధతో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాను. మొదట్లో ఎవ్వరూ సరిగా పట్టించుకోలేదు. అప్పట్లో ఇన్నేసి ఎడిషన్లున్న వార్తాపత్రికలు లేవు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. లైవ్ టెలికాస్ట్లు లేవు. అందుకని నిరాహార దీక్ష మొదలు పెట్టగానే అరెస్టు చెయ్యడానికి, ఆస్పత్రిలో పడేసి సెలైన్లు పెట్టెయ్యడానికి అప్పుడు అవకాశం లేకపోయింది. ఇప్పుడనిపిస్తోంది ఈ రోజుల్లో పుట్టి ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉంటే బాగుండేదేమోనని ! ప్చ్ ! ఏం చేస్తాం ? తొందరపడి ప్రచార సాధనాలు అంతగా అభివృద్ది చెందని రోజుల్లో పుట్టేసానే ! ఆంధ్ర దేశమంతా నా పరిస్థితి పూర్తిగా తెలియడానికి 50 రోజులు పట్టింది. అప్పటికి నా పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించుకోండి. నేను నీరసించాను. ఉద్యమం బలపడింది. నాకు ఆ నిరాహార దీక్ష నుంచి విముక్తి కలగడానికి మరో ఎనిమిది రోజులు పట్టింది. అంటే ప్రత్యేక రాష్ట్రమిచ్చేసి దీక్ష విరమింప జేసారనుకుంటున్నారా ? అబ్బే ! నాలోని జీవుడు ఎగిరిపోయాడు. తర్వాత నెహ్రు మద్రాస్ లేకుండానే ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించాడు. ఏం చేస్తాం దక్కిందే మహాభాగ్యమని తెలుగువారు సర్దుకున్నారు.

నిజాం నవాబు పరిపాలనలో హైదరాబాద్ రాష్ట్రం చీకటిలో మ్రగ్గి పోయింది. నిజాం బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా ఉంటే, జాగీర్దార్లు- భూకామందులు నిజాంకు బంటులుగా ఉండి సామాన్య ప్రజల్ని వెట్టి చాకిరితో పీడించుకుని తిన్నారు. ప్లేగు. కలరా మొదలైన వ్యాధులు ప్రబలితే పట్టించుకునే నాథుడే లేడు. ఇటువంటి దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొన్న తెలంగాణావాసులు నుండి విముక్తితో ఊపిరి పీల్చుకున్నారు. తర తరాలుగా తెలుగుకు పట్టిన దురవస్థను జీర్ణించుకోలేక తెలుగు వాళ్లందరమూ కలిసి ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. సహజంగానే మర్రి చెన్నారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి లాంటి వాళ్లు వ్యతిరేకించినా, బూర్గుల రామకృష్ణారావు లాంటి కొంతమంది రాజకీయ ప్రయోజనాలకోసం తర్వాత సమర్థించడంతో దేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం గా ఏర్పాటయిందని తెలిసి చాలా ఆనందపడ్డాను. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం ఇరు ప్రాంతాల మధ్యా ద్వేషాలను రగిలించడం, అవి తీరాక ఉద్యమాలను చల్లార్చడం లాంటి చర్యలతో ప్రజల అమాయకత్వాన్ని, ఆవేశాన్ని ఉపయోగించుకున్నారని తెలిసి చాలా బాధపడ్డాను. బతికుంటే వారి నుంచి ప్రజల్ని విముక్తి చెయ్యడానికి మళ్ళీ సత్యాగ్రహం చేపట్టేవాడినేమో ! ఏం చేస్తాం ! ఆ అవకాశం లేదుగా !
గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలనే మాట వినబడుతోంది. అప్పుడప్పుడూ అసమ్మతి వాదం తెర మీదకు రావడం మామూలే కదా అనుకున్నాను. కానీ క్రిందటి నెలలో నా విగ్రహాల మీద దాడి జరగడంతో ఉద్యమం ప్రారంభమయిందని తెలిసింది. నా సత్యాగ్రహబాటను కూడా అనుసరిస్తున్నారని తెలిసింది. అయితే తర్వాత గానీ తెలియలేదు నిరాహార దీక్ష చెయ్యడం ఈ రోజుల్లో ఇంత సుళువని. దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించగానే ప్రజలు తిరగబడడం చూస్తే ప్రజల్లో మార్పు వచ్చిందని అర్థమయింది. కానీ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఆదిస్థానం చేసిన ప్రకటన చూస్తే నాకు నెహ్రు రాజకీయమే గుర్తుకు వచ్చింది. పాలకులు మాత్రం మారలేదు. ప్రస్తుతం ఇరు ప్రాంతాల వారిని బలాబలాలు తేల్చుకోమన్నట్లే అనిపిస్తోంది. దాన్ని నాయకులు బాగానే ఉపయోగించుకుంటున్నట్లున్నారు. ఏమైనా 1969 ఉద్యమ ద్రోహాన్ని తెలంగాణా అమాయక ప్రజలు మరిచిపోయినా, ఆంధ్ర ప్రాంత ప్రజలు బాగా గుర్తు పెట్టుకుని 1972 నాటి ప్రత్యేకాంధ్ర నినాదాన్ని సమైక్యాంధ్ర నినాదంగా మార్చేశారు. నా చెవులకింపుగా ఉంది.

అయితే కొంతమంది తెలంగాణా నాయకులు చేస్తున్న వాదనలే కొరుకుడు పడడంలేదు. మాటి మాటికీ ఆంధ్రవాళ్లు, ఆంధ్రవాళ్లు అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టిన, నివసిస్తున్న వారందరూ ఆంధ్రా వాళ్ళే కదా ! అసలు తెలంగాణా అన్నా, ఆంధ్రా అన్నా అర్థం దాదాపుగా ఒకటేనని మా రోజుల్లో అనుకునేవాళ్ళమే ! ఈ మథ్య భాషలో అర్థాలేమైనా మారిపోయాయా ? ఎవరైనా నా సందేహం తీరిస్తే బాగుండును. మరో విషయం. రాష్ట్రమన్నాక రాజధాని అవసరం. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్నపుడు రాయలసీమ, కోస్తాంధ్ర వాసులు అప్పుడు రాజధానిగా ఉన్న మద్రాస్ నగరాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. ఆ నగరం తెలుగు వారికి చెందుతుందని ఎన్ని దృష్టాంతాలు చూపించినా దక్కించుకోలేకపోయారు. విశాలాంధ్ర ఏర్పడ్డాక అందరి ఆమోదంతో కర్నూలు నుంచి రాజధాని హైదరాబాద్ మార్చారు కదా ! ఒక రాజధాని... అది రాష్ట్రానిదైనా, దేశానిదైనా ప్రజలందరి భాగస్వామ్యంతోనే కదా అభివృద్ది చెందేది. అలా కాకుండా కొంతమంది వ్యాపారాలు, పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టారు తప్ప హైదరాబాద్ అభివృద్ధిలో ఆంధ్రా వాళ్ల పాత్ర ఏమీ లేదంటారే ! అంటే వాళ్ల దృష్టిలో కోట్లకు పడగలెత్తిన వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, నాయకులు తప్ప సామాన్యులు మనుష్యులు కాదా ! వాళ్లు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కట్టిన పన్నుల్లో కొంత భాగంతోనే కదా రాజధాని అభివృద్ది జరిగేది. అందుకని దాంట్లో రాష్ట్ర ప్రజలందరికీ భాగస్వామ్యం ఉంటుంది కదా ! ఏమో నాకేమీ అర్థం కావడం లేదు. అసలు ఆ వ్యాపార వేత్తలు వగైరాలు కట్టే పన్నుల శాతం కంటే సామాన్య ప్రజలు కట్టే పన్నుల శాతమే ఎక్కువగా ఉంటుందేమో ! ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సమస్య రాజధాని చుట్టూ తిరుగుతున్నట్లనిపిస్తోంది. అసలే హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ది చెందుతోంది. అన్నదమ్ముల మధ్య పరిష్కారంగా హైదరాబాద్ అభివృద్ది ఖర్చుని వాటాలేస్తే హైదరాబాద్ నగరం తమ రాజధానిగా ఉంచుకున్నవాళ్లు విడిపోయిన వాళ్లకు చెల్లించాల్సిన వాటా మాట ! ఆ... ఇదో పెద్ద విషయమా.... ఉన్నారుగా.... అమాయక ప్రజలు. వాళ్ల జీవితాలు తాకట్టు పెట్టేస్తారు ! ఇలాంటి సందర్భాల్లో నాయకులకు పండగేగా ! ప్రజలకు దండగ గానీ ! మా కాలంలో కంటే ఈ కాలంలో ప్రజలకు కొంత తెలివి వచ్చినట్లు అనిపిస్తోంది. చూద్దాం. వాళ్లు నాయకుల మెడలు వంచి తామంటే భయపడేటట్లు చేస్తారో , నాయకులే ప్రజల్ని ఎప్పటిలాగే వెర్రి గొర్రెల్ని చేస్తారో ! ఏమైనా ఈ నష్టాన్ని భరించాల్సింది సామాన్య ప్రజలే కానీ నాయకులూ కాదు వారిని వెనకనుండి నడిపిస్తున్న వ్యాపార, పారిశ్రామిక వేత్తలూ కాదు.

అప్పుడే...అమరజీవి పొట్టి శ్రీరాములు అమరరహే ! అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. పాలబిందేలు వస్తున్నాయి. నా విగ్రహాలకు అభిషేకాలు చెయ్యడానికి కాబోలు. ప్చ్ ! ఎప్పుడు, ఎందుకు, ఎవరు మా విగ్రహాలు పగలగోడతారో, ....పూజిస్తారో బ్రహ్మ దేవుడికైనా అర్థమవుతుందా ! ఆయనకెందుకు అర్థమవుతుందిలే ! ఆయన అసలు తనకు గుడులు, విగ్రహాలు లేకుండా జాగ్రత్త పడ్డాడుగా ! ఉన్నా విష్ణు మహేశ్వరుల చాటున దాక్కుంటాడు. ' దేముడికేం ! హాయిగా ఉన్నాడు. ఈ మానవుడే... కాదు కాదు....విగ్రహాలే బాధలు పడుతున్నాయి '. అన్నట్లు మీకు చెప్పలేదు కదా ! ఈ రోజుతో నా ప్రాణ త్యాగానికి 60 సంవత్సరాలు నిండుతున్నాయి. అందుకే మిమ్మల్ని ఒకసారి పలుకరిద్దామని వచ్చా ! సెలవు.

తనను తాను పొగుడుకొనే మీడియా

పదో పరకో
ఉంటుందో లేదో
ప్రయత్నించి
పట్టుబడి
ఊచల మాటున పెట్టబడి
కొట్టబడి
ఉన్నవి లేనివి ఆపాదించబడి
అన్యాయంగా
జైలు పక్షి గా గడిపే జన్మకన్నా

కుర్చీలో వున్న నాన్నకు కొడుకై
కోరికైతే
తనను తాను పొగుడుకొనే మీడియా వచ్చేలా
జనాల సొమ్మును ఇనాముగా రాసిచ్చి రాజ సౌధాలు వచ్చిపడేలా
జనం సొమ్మునే ఖర్చుపెట్టి పోయిన నాన్నే సొంతంగా పెట్టినట్లు
దాన కర్ణుడి కొడుకైనట్లు
తనకు తప్ప వేరెవరికీ ఆ సింహాసనం దక్క కూడదన్నట్టు
దబాయించి కొత్త పార్టీ పెట్టే దొరలా మంచి బతుకు ఇవ్వు దేవుడా.

16, మార్చి 2011, బుధవారం

కాలచక్రంలో శూన్యం నేర్చిన అక్షరం నక్షత్రాల

పలకబట్టి బయలుదేరితే
కలుపు తీసిన పొలంలా
అమ్మ ముఖం విప్పారి మెరిసేది.
అ ఆ లు రాసిన పలక
అమ్మ వేళ్ళకు అందిస్తే
ఏరుకున్న అక్షరాల్ని వొళ్ళో దాచి మురిసేది
అమ్మ రూపం నా రూపానికి అద్ది మాసిపోయాక
పలకా బలపం లేని నా బాల్యం
బడికి స్వస్తి పలికింది.
పసివాడి నగ్నరూపం మొలతాడు కట్టి వేధికెళితే
మొలతాడు లేని మొలల మధ్య మొలతాడే మిన్న
అవయవాల్ని కప్పుతూ గోచి పెట్టినపుడు
గోచీలు లేని గోలీలాటలో గోచీదే ఆధిపత్యం
ఆరు తర్వాత ఎంతకూ గుర్తురాని అంకె కోసం
మోరెత్తిన బడిపిల్లవాడ్ని చూసి
ఇరవై గొడ్లను ఏకధాటిగా లెక్కించడం నా విజయగర్వం.
పుల్లతో పంటకాల్వ లోతు కొలిచి
పారబోయే పొలం లెక్కలు ఆశువుగా నా నోట దొర్లేవి
సూర్యగమనం చూసి గంటలు నిర్ధారించినపుడు
గతి తప్పిన గడియారం విస్మయ ద్రుశ్టులు పరిచేది.
కాళ్ళకు తగిలిన రాళ్ళను సమగ్రంగా పరిశీలించి
ఏ ఖనిజ సంపద నిక్షిప్తమో ఏకరువు పెట్టేవాడిని
కమ్మిన మబ్బు సాంద్రత బట్టి వర్షపాతపు అంచనాకు
కురవబోయే మేఘం అబ్బురపడేది.
రాతి మేద సుద్దగీతలు రాతలు కానేరవు
కాళ్ళూచేతుల వేళ్ళు లెక్కించడం లెక్కలు కానేకావు.
ఎక్కాల్సిన బస్సు చిరునామా ఎంతకూ చదవలేక
జార్చుకున్న కాలచక్రంలో శూన్యం
నేర్చిన అక్షరం నక్షత్రాల్ని కోసి తెస్తుందని
మరణించే వరకు మనిషి విద్యార్ధేనని
అఙ్ణాన తిమిరాన వెలుగు జల్లుతూ
అక్షరాస్యత శాస్త్రీయ ప్రతిమ అంటూంది.

ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి మన పాలకుల మీద ఒత్తిడి తేవాలి

మన దేశంలో అవినీతి రాజ్యమేలుతుందని అందరికి తెలుసు. కుంభకోణాలు, అక్రమాలు, విలువల్లేని రాజకీయాలు తప్ప ఇంకేమి లేని పరిస్థితిని ప్రస్తుతం చూస్తున్నాం. మరోవైపు ట్యునీషియాలో, ఈజిప్టులో , యెమెన్లో ప్రజలు అవినీతి ప్రభుత్వాల మీద సమరశంఖం పూరించి ప్రభుత్వాలనే కూలదోస్తున్నారు. కొత్త చరిత్రను లిఖిస్తున్నారు. నియంతలను తమ దేశాలనుండి తరిమి తరిమి కొడుతున్నారు. కాని మనం మాత్రం మన ఇళ్లకో కార్యాలయాలకో పరిమితమై ఏమీ పట్టనట్లుగా మన మానాన మనం రోజులు వెళ్ళదీస్తున్నాం. ఎందుకీ నిర్లిప్తత? లక్షల రూపాయల అవినీతికే కేంద్ర మంత్రుల రాజీనామా చేసే పరిస్థితినుండి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నా ఏమీ పట్టని స్థితికి చేరుకున్నాం. ఎక్కడ చూసినా నల్ల డబ్బు గురించే చర్చ.. కాని ఇంకా ఎన్నాళ్ళు చర్చిస్తాం? మన నోళ్ళు విప్పనంతకాలం , కాళ్ళు కదపనంతకాలం ఈ కుళ్ళు రాజకీయం, ఈ అవినీతి సాగుతూనే ఉంటుంది. దేశం కోసం వీధుల్లోకి వచ్చి సత్యాగ్రహం చేసిన ప్రజలు, దేశం కోసం ఆయుధం పట్టి ఉరికంబానికేక్కిన ప్రజలు ఇప్పుడు ఇళ్ళలో టీవీలలో నేరాలు ఘోరాలు చూస్తూ కాలం వెల్లబోస్తున్నారు. ప్రపంచ స్వాతంత్ర్య పోరాటాలకే స్ఫూర్తినిచ్చే ఉద్యమాన్ని నిర్మించిన మనం, ప్రపంచ దేశాలలో సాగుతున్న ఉద్యమాలను చూసి కొంచెమైన చలించట్లేదు. ఎవరు ఏమైపోయినా అక్కర్లేదు, ఎక్కడ ఎం జరిగిన మనకి అవసరం లేదు.. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడో లేక ఉల్లి ధరలు మండినప్పుడు మాత్రమే మనకు ఈ ప్రభుత్వం గుర్తొస్తుంది. ఇంకెన్నాళ్ళు ఇలా బ్రతుకుతాం? ఛీ.. ఇదీ ఒక బ్రతుకేనా!

రాష్ట్రాన్ని, దేశాన్ని కొల్లగొట్టి వేలు లక్షల కోట్లు సంపాదించిన వారి కొడుకులు మనవళ్లు కొత్త పార్టీలు పెట్టి రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తుంటే.. మనకేం పట్టదు. మన దేశం ఎటు పోతుందో ఒక్కసారైనా ఆలోచించారా? 23 ఏళ్లకే ఉరికంబం ఎక్కిన, ఆంగ్లేయుల బుల్లెట్లకి నేలకొరిగిన భగత్ సింగ్, అల్లూరి సీతారామారాజుల ఉద్యమ స్ఫూర్తి ఎక్కడుంది? పరాయి పాలనని త్రిప్పికొట్టడానికి ఒక సైన్యాన్నే నెలకొల్పిన సుభాష్ చంద్ర బోస్ జాతీయ స్ఫూర్తి ఇంకా ఎంతమందిలో మిగిలుంది? కులం, మతం, ప్రాంతం అని వేలాడే దుష్ట రాజకీయనాయకుల తొత్తులుగా మారి వాళ్ళు విదిల్చే నోట్లు, సారా పాకెట్లు తప్ప జనం పాట్లు అవసరం లేనంత హీనంగా మారుతున్నామా!?

ప్రజలు రూపొందించిన లోక్ పాల్ బిల్లుకి ప్రభుత్వం తూట్లు పొడిచి దాన్ని సమూలంగా మార్చి వేసింది. లోక్పాల్ బిల్లు యధాతధంగా అమలైతే అవినీతిని దాదాపు అంతమొందించడం సాధ్యపడుతుంది. ఇప్పటికే దేశంలో పేరుకుపోయిన నల్లడబ్బును పెద్ద నోట్లను నిషేదించడం ద్వారా వెలికి తీయవచ్చు. కేవలం రూ.500 మరియు ౧౦౦౦ నోట్లను నిషేదించడం ద్వారా దాదాపు సగానికి పైగానే నల్లడబ్బును బయటికి తీయగలం. కేంద్రం వద్ద స్విస్ బ్యాంకులలో నల్ల డబ్బు దాచిన వారి వివరాలు ఉన్నా బయటపెట్టలేని బలహీన హీన స్థితిలో ఉంది. ఇప్పటికైనా ఆయా దేశాలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుని నల్లడబ్బుని వెలికితీయాలి. ఈ రెండు పనులను చేయడం ద్వారా మన దేశం ప్రస్తుతం ఎదుర్కుంటున్న మౌలిక సదుపాయాలూ, నిరక్షరాస్యత , పేదరికం, సాంఘిక రక్షణ, నిరుద్యోగం లాంటి సమస్యలను దాదాపు రూపు మాపోచ్చు.

ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి మన పాలకుల మీద ఒత్తిడి తేవాలి, ప్రజలు పూనుకుంటే ప్రభుత్వాలు కూలుతోన్న రోజులివి. మన ప్రభుత్వం కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ప్రజలలో చైతన్యం తీసుకురాగలిగితే ఇది అసాధ్యం కాకపోవచ్చు. దీనికి మనవంతుగా ప్రయత్నిద్దాం.

జై హింద్.

చాలించడి మీ దొంగనాటకాలు?

సోదరభావంతో తెలంగాణ కోసం శాంతియుతంగా పోరాడుతున్న గద్దర్ లాంటి వాళ్ళకి ఈ వ్యాసం వర్తించదు.ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ తెలంగాణ పేరుతో అనేక అరాచకాలకు తెగబడుతున్న మూర్ఖశిఖామణుల కోసమే ఈ వ్యాసం .

చాలించడి మీ దొంగ ఏడుపులు పెడబొబ్బలు.
ఎన్నాళ్ళీ దొంగనాటకాలు?
అడిగేవాడు లేక మీ ఆగడాలకు అంతులేకుండా పోతోంది.

తెలుగుభాషా వికాసానికి, సంస్కృతికి ఎనలేని సేవ చేసిన ప్రముఖుల విగ్రహాలు కూల్చెయ్యటానికి మీకు మనస్సెలా వచ్చింది? శాంతియుత ప్రదర్శన అంటూ మోసపూరిత వాగ్దానాలు చేసి మీరు సాధించిన ఘనకార్యం ఇదా? ఇలా చేస్తే తెలంగాణ వచ్చేస్తుందని ఏ అజ్ఞాని మీకు చెప్పింది.ప్రజల అంగీకారం ఉంటేనే ఏ ఉద్యమమైనా ఫలప్రదమవుతుంది.మీరు చేసిన పనికి తెలంగాణలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోందే.దీన్ని ఎలా సమర్ధించుకుంటారు? మీరు చేసేది ఉద్యమమా దౌర్జన్యమా? అన్నమయ్య మిమ్మల్ని ఏం చేశాడు? మిమ్మల్ని పురుగుల కంటే హీనంగా చూసి,మీ మానప్రాణాలతో ఆట్లాడుకొని,మిమ్మల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చిచంపిన నైజాం నవాబు మీకు దైవ సమానుడా? మీ రక్త మాంసాలను పీల్చిపిప్పి చేసిన పటేల్‌ పట్వారి వ్యవస్థను ఒక్క కలంపోటుతో రద్దు చేసిన ఆంధ్రుడు NTR మీకు ఆగర్భశత్రువా? విగ్రహాలతో మాకు సమస్య లేదు,విగ్రహాలను పెట్టించినవాడితోనే సమస్య అని ఒక బ్లాగరు అన్నాడు.అదే NTR పెట్టించిన తెలంగాణా ప్రముఖుల విగ్రహాలు ఎందుకు వదిలేశారు ? అప్పుడు మీకు NTR ఆంధ్రత్వం గుర్తురాలేదా? మీకు చేతనైతే తెలంగాణ ఉద్యమాన్ని అమ్ముకొని సొమ్ముచేసుకున్న మర్రి చెన్నారెడ్డి విగ్రహాలని బ్రద్దలుకొట్టుకోండి కానీ తెలుగుజాతికి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన అమరజీవి పోట్టీశ్రీరాములు విగ్రహాలని కాదు. మీది తెలుగు భాష కాదా? ఈ మాటలనడానికి మీరు ఏ మాత్రం సిగ్గుపడటం లేదా? నిన్న మొన్న వచ్చిన నవాబుగిరీలు, ముల్కీలు మీకు ప్రియమైపోయాయి కానీ ఏనాడో శాతవాహనులు స్థాపించి, రుద్రమ్మదేవి ఏలిన అచ్చమైన తెలుగు భాష మీకు చేదైపోయిందా? అందుకేనా మూలాలు మరచిపోయి తెలుగుతల్లి విగ్రహాన్ని ధ్వంసం చేసారు? ఆఖరికి దేవుళ్ళకు కూడా ప్రాంతీయ తత్వాన్ని(భధ్రాచలం,తిరుమల) ఆపాదించిన ఒక మూర్ఖుడి మాటలు మీకు శిరోధార్యమవుతున్నాయంటే మిమ్మల్ని చూసి మీరే జాలిపడాలి.

ఎవరయ్యా మీకు పాఠాలు చెప్పింది ?
ఏ విశ్వవిద్యాలయం మీకు పట్టాలిచ్చింది ?


మాట్లాడితే రెచ్చగోడుతున్నారు అంటున్నారు
ఎవరిని ఎవరిని రెచ్చగొడుతున్నారు ?

* పార్టీ పెట్టింది మొదలు అంధ్రులు దొంగలు దోపిడీదారులని ఆడిపోసుకున్నది కేసీయార్ కాదా ?
* ఆంధ్రావాళ్ళను తరిమికొడతాం అని చిందులు తొక్కింది కేసీయార్‌కాదా ?
* సీమాంధ్ర కళాశాలలు,వాణిజ్య సముదాయాల పై దాడులకు తెగబడింది మీరు కాదా?
* వాల్యూయేషన్‌కి వచ్చిన సీమాంధ్ర ఉపాధ్యాయులపై భౌతిక దాడులకి తెగబడింది మీ విద్యార్థులు కాదా? ఈ
సంఘటన జరిగిన తర్వాత సీమాంధ్ర విద్యార్థులు తెలంగాణ ఉపాధ్యాయులుకు శాలువాలతో సన్మానం చేసింది వాస్తవం
కాదా ?
* సీమాంధ్ర కళాకారుల మూవీ షూటింగ్స్ సెట్స్ ధ్వంసం చేసింది మీరు కాదా?
* సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఇళ్ళపై దాడికి దిగింది మీరు కాదా ?
* సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలు ధ్వంసం చేసింది మీరు కాదా ?
* సీమాంధ్ర నేతలు కేవలం తెలంగాణ రాదంటే రెచ్చగొడుతున్నారు అంటారు మరి మీరు చేసిన నిర్వాకాలని ఏమని అనాలి ?


సీమాంధ్రులు మిమ్మల్ని దోచుకుతిన్నారు అంటారు. శ్రీకృష్ణ కమిటీ ప్రకారం తెలంగాణ కంటే అన్ని రకాలుగా వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ.కానీ మీరు దాన్ని విశ్వసించరు.కోదండరాం,కేసియార్ మాటలు మీకు వేదమంత్రాలతో సమానం. ఇంతకాలం మేం మిమ్మల్ని దోచుకుతిన్న మాట నిజమే అయితే మీరు ముందుగా తిరగబడాల్సింది ఇన్నేళ్ళుగా మీరెన్నుకున్న ప్రజాప్రతినిధుల పైన. వాళ్ళేమీ నోరూ వాయి లేని వాజమ్మలు కాదే.నోట్లో వేలు పెడితే చప్పరించడం కూడా రాని చంటి పిల్లలు కారే ? వేలు పెడితే వెన్నమూక వరకూ దిగమింగే రకం. సుబ్బరంగా సంపాదించుకుని కోట్లు గడించుకొన్నారు కదా? మీరెన్నుకున్న ఎంపీలు కేసియార్,విజయశాంతి నిన్న మొన్నటిదాకా ఎనాడైనా పార్లమెంటు మొహం చుశారా? రాత్రంతా తాగి, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయ్యటం తప్ప కేసియార్ ఎమైనా వెలగబెట్టాడా? ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడ్డాడా? రాజీనామా డ్రామాలు మొదలుపెట్టి ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకొని మళ్ళీ ఎన్నికైతే 'తెలంగాణా వాదం యొక్క తీవ్రత ' అంటూ మీరు మురిసిపోయారు కానీ ఎప్పుడైనా ఇందులో మర్మం గ్రహించారా? ఎంతసేపూ విద్యార్థులే ఎందుకు త్యాగాలు చేసి తన్నులు తినాలి, మీరెందుకు ఉద్యోగానికి రాజీనామా చేసి మీ నైతికత నిరూపించుకోరు అని ఎప్పుడైనా కోదండరాంను నిలదీశారా? ఆయన, ఆయనతో పాటు విద్యార్థులను రెచ్చగొడుతూ నెల తిరిగేసరికి సీమాంధ్రులు కూడా సక్రమంగా పన్నులు కడితే తప్ప విడుదలవ్వని జీతాలను పుచ్చుకుంటున్న ఇతర మేధావులు త్యాగాలకు అతీతులా ? క్లాసులు సక్రమంగా జరక్క విద్యార్థులు,వ్యాపారం జరక్క వ్యాపారస్తులు ,రోజు గడవక బడుగుజీవులు నాశనమైపోవచ్చు కానీ వీళ్ళు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలను వదలరా? నల్గొండ ఫ్లోరైడ్ సమస్య కావచ్చు,పాలమూరు సమస్య కావచ్చు, సమస్య ఏదైనా పోరాడి సాధించుకోవల్సింది మీరు మీ ప్రజాప్రతినిధులు.ఇంతకాలం ఈ మేధావులు, సంఘసంస్కర్తలు ఏం చేసారు? చోద్యం చూశారా లేక చేతకాక మిన్నకున్నారా? జయప్రకాష్ నారాయణ లాంటి బలహీనుల్ని కోట్టారు కాబట్టి సరిపోయింది కానీ అదే ఏ బలవంతుడైన నేత మీదో చెయ్యిపడుంటే ఆరోజే మీ సామర్థ్యం బయటపడేది. మీకు చేతనైతే, చిత్తశుద్ధి ఉంటే మీ దివాళాకోరు నాయాకులపై తిరగబడండి. ఆడలేనమ్మ మద్దెల మీద పడి ఏడ్చినట్లు మీలో ఇన్ని లోపాలు పెట్టుకొని సీమాంధ్రుల మీద ఏడిస్తే ఏమిటి ప్రయోజనం ?

15, మార్చి 2011, మంగళవారం

ఎదుటివాడి అజ్ఞానం మనకి నవ్వునిస్తోందా ?

నా నవ్వుని ఎక్కడో పారేసుకున్నాను .నిజమేనండీ , అచ్చంగా ,అక్షరాలా నా సొంత నవ్వుని
ఎక్కడో పారేసుకున్నాను .రకరకాల నవ్వులని జేబులో పెట్టుకొని తిరుగుతున్నాను .శతకోటి
బంధాలకు , అనంతకోటి నవ్వులు . ఆ కోటిలో "నాకోటి " ఉందా ?. ఏమో , పక్క వీధిలో
పోగొట్టుకున్న కాసు,వెలుగున్న ఈ వీధిలో దొరుకుతుందా?.ఇంతకీ నా నవ్వు ఏమైంది ?.
తెలియని వెతుకులాట , తెలివిడి కోసం సాగుతోంది . నాకో అనుమానం .తెలివిడి వల్ల ఆనందం
పెరుగుతుందా ? లేక అజ్ఞానం ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందా ? లేక ఎదుటివాడి అజ్ఞానం
మనకి నవ్వునిస్తోందా ? రసాభాస (అనుకున్నది జరుగక చతికిలపడితే జరిగేది ) నవ్వుకి
కారణమా ? . ఏం జరుగుతోంది ఇక్కడ , నవ్వు గురించి ఆలోచిస్తూ నన్ను నేను మరిచాను.
ఇంతకీ నా నవ్వు ఎక్కడ , ఇప్పుడే తెలియాలి . ముగ్గు వేసి అంజనం వేయించనా ? ,చిలక
ప్రశ్న అడగనా ? ,వత్తులు వేసిన కళ్లు కాచేలా ఎదురు చూడనా ? .స్వామీజీ ఎవరైనా
దొరుకుతారా ?, నెట్ బదులిస్తుందా ?

ఏదో వెలుగు దగ్గరౌతోంది .వెలుగుతో పాటు ఓ మధుర స్వరం వినిపిస్తోంది
"తనని వదిలి అందరిని లెక్కించే పరమానందయ్య శిష్యులలా ఉన్నవే .కస్తూరి మృగానికి
బంధువువా? నిన్నునీవు మరిచావే.అద్దె నవ్వుల సవ్వడిలో తానున్న నీ సొంతనవ్వుని చూడవే?
బంధాలన్నీ నీవేగా .నీవు కాదంటే లేవుగా .అది మరచి, నీవు స్తంభాన్ని పట్టుకొని ,నన్ను
విడిపించండి అన్నట్టు ఉంది .అన్నీ నీవే .ప్రతి నవ్వు నీదే .పొద్దుతిరుగుడు పువ్వంత
కళ్లు చేసుకొని చూడు . నవ్వుల తోట నీదే అవుతుంది

నల్లేరుపై బండి నడక

రాష్ట్ర రాజకీయ తెర మీదికి ఉప్పెనలా వస్తుందని భావించిన మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చడీచప్పుడు లేకుండా, సాదాసీదాగా వచ్చేసింది. అనూహ్యంగా వైయస్ జగన్ హంగామా లేకుండా కడప జిల్లా పులివెందులలోని వైయస్సార్ సమాధి వద్ద తన పార్టీ జెండాను తల్లి విజయమ్మ చేత ఆవిష్కరింపజేసి పార్టీకి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున కోడ్ ఉల్లంఘన జరగకుండా జెండా ఆవిష్కరణ చేయాల్సిన సందర్భాన్ని జగన్ ఎంచుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.


నిజానికి, ఆయన అత్యంత సన్నిహితులను కూడా ఆశ్చర్యపరిచినట్లు చెబుతున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సభలో ప్రకటించి, మర్నాడే పార్టీ జెండాను ఆవిష్కరింపజేశారు. పార్టీ అవతరణ సభ విడిగా మరోసారి ఉంటుందని చెప్పడానికి కూడా వీలు లేని పరిస్థితి. కాగా, పార్టీ జెండా ఆవిష్కరణ తేదీ ఖరారుకు ఆయన తన సన్నిహితులను కూడా సంప్రదించలేదని చెబుతున్నారు. పార్టీ అవతరణ సభ కోసం ఆయన పులివెందులలో భారీ సెట్టింగుతో వేదికను కూడా ఏర్పాటు చేశారు. సినిమా రంగానికి చెందిన తోట తరణితో వేదికను ఏర్పాటు చేయించారు. దాన్ని బట్టి జగన్ పార్టీ అవతరణ సభ భారీ యెత్తున ఉంటుందని అందరూ భావించారు.

అలాంటిదేమీ లేకుండా కుటుంబ కార్యక్రమంగానే జెండా ఆవిష్కరణ సభ జరిపించారు. ఇలా ఎందుకు చేశారనేది తెలియక ఆయన అనుచరులు కూడా ముక్కు మీద వేలేసుకున్నారు. ఈ సభకు చాలా మంది ముఖం చాటేసినట్లు చెబుతున్నారు. జెండా ఆవిష్కరణ సభకు కేవలం 11 మంది శాసనసభ్యులు మాత్రమే హాజరయ్యారు. నాయకులు కూడా కొద్ది మందే ఉన్నారు. జగన్ వెంట 23 మంది శాసనసభ్యులున్నారనేది గత కొంత కాలంగా గట్టిగా ప్రచారం జరుగుతూ వచ్చింది. మిగతా 12 మంది శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదనేది ప్రశ్న. జగన్ అంచనాలను తలకిందులు చేస్తూ నాయకులు కూడా తక్కువ మందే వచ్చినట్లు చెబుతున్నారు. అభిమానుల సందడి కనిపించినప్పటికీ అది కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని అంటున్నారు.

వైయస్సార్ అకాల మరణానికి దిగ్భ్రాంతికి గురై మృత్యువాత పడిన కుటుంబాలను పరామర్శించడానికి తలపెట్టిన ఓదార్పు యాత్రను ఆయన తిరిగి చేపడతారా, మిగతా జిల్లాల్లో దాన్ని నిర్వహిస్తారా అనేది కూడా అనుమానంగానే ఉంది. ఓదార్పు యాత్ర పూర్తికాకుండానే ఆయన కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించడానికి సిద్ధపడ్డారు. వివిధ సమస్యలపై దీక్షలకు పూనుకుంటూ వచ్చారు.


శ్రీకాకుళం కాకర్లపల్లి ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టు బాధితులను పరామర్శించడానికి వెళ్లిన జగన్‌కు చేదు అనుభవమే ఎదురైంది. దీన్ని బట్టి, వైయస్సార్ సంక్షేమ పథకాలు తనకు ఎంతగా ఉపకరిస్తాయో, ఆయన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అంతగా వ్యతిరేకంగా పనిచేస్తాయని మొదటిసారి జగన్‌కు తెలిసి వచ్చింది. అందువల్ల జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీది నల్లేరుపై బండి నడక ఏమీ కాదని అంటున్నారు.

14, మార్చి 2011, సోమవారం

తెలుగుతల్లి ఆంధ్రా ఏరియాకి పరిమితమా?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండుని ఆంధ్రరాష్ట్ర డిమాండుతో పోలుస్తూ చేస్తున్న ఈ అనవసరమైన పోలిక గుఱించి గత కొద్దికాలంగా వింటున్నాం. పూర్వ మద్రాసు రాష్ట్రం ఏకజాతిరాష్ట్రం కాదు. అది ప్రజాభీష్టంతో, ప్రజాస్వామికంగా ఏర్పడ్డది కాదు. వలసపాలకుల సౌలభ్యార్థం నానాజాతుల కిచిడీగా సృష్టించబడింది. ఆ కిచిడీ నుంచి బయటపడి ఏకజాతిరాష్ట్రాల్ని ఏర్పఱచాలనే ఉద్దేశంతో ప్రారంభమైనవి భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం మొదలైన ఆందోళనలు. భాషాజాతులూ, భాషారాష్ట్రాలూ ఇంగ్లీషువారీ దేశంలో అడుగుపెట్టక ముందునుంచి ఉన్నాయి. ఇండియన్ యూనియన్ ఏర్పడక ముందునుంచి ఉన్నాయి. అవే నిఖార్సైన నిజమైన సహజమైన యూనిట్లు. పరిపాలనలో ఆ సహజత్వం, ఆ సమగ్రత్వం కోసమే భాషారాష్ట్రాలు. అంతే తప్ప ఒకే జాతికి, ఒకే మతానికీ, ఒకే భాషకూ, ఒకే సాంస్కృతిక వారసత్వానికీ చెందిన, రెండు ఆనుకుని ఉన్న ప్రాంతాలలో ఒకఱిని దోపిడీదారులుగా, ఇంకొకఱిని బానిసలుగా వర్ణించడం, వివాదాల పరిష్కారానికి ఉన్న అన్ని శాంతియుత మార్గాల్నీ వర్జించడం నిజంగా జాతిద్రోహమే అవుతుంది. misleading అవుతుంది. రాజకీయప్రయోజనాల కోసం – శాంతియుతంగా అన్నదమ్ముల్లా దశాబ్దాల తరబడి పక్కపక్కనే కలిసి జీవిస్తున్న ప్రజల మధ్య లేని శత్రుత్వాల్ని పనిగట్టుకొని సృష్టించడం అవుతుంది. అదే జాతిద్రోహం. ఇతరులపై ఒకప్పుడు మనం ప్రయోగించిన ఈ “దోపిడీ” ఎట్సెటరా కమ్యూనిస్టు పదజాలాన్ని మనలో మనం మనవాళ్ళ మీద, మన స్వదేశీయుల మీద, మన స్వరాష్ట్రీయుల మీద ప్రయోగించడం పూర్తి అసహజం, అసమంజసం. ఉద్యమం వేడిలో మీకిది అర్థం కాకపోవచ్చు.


ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని ప్రాంతాల ప్రజల స్వచ్ఛంద అంగీకారంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడింది. ఇందుకు చరిత్రగ్రంథాలే సాక్షి. ఈనాడు కొందఱు బయల్దేఱి “ఈ సెటప్పు మాకు నచ్చలేదు, మార్చండి” అంటే అది సాధ్యపడదు. సాధ్యపడ్డానికి ఇదేమీ మన వ్యక్తిగత జీవితం కాదు. కోట్లాదిమంది జీవితాలకు సంబంధించిన విషయం. ఇది ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం జాతిద్రోహం కాకపోవచ్చు. కానీ ఇది జాతిద్రోహంగా నెమ్మదిగా పరిణమిస్తుంది. ఇప్పటికే పరిణమిస్తున్నది. ఈ ఉద్యమంలో భావి-జాతిద్రోహ బీజాలు ఉన్నాయి. తెలుగుతల్లి విగ్రహాల్ని ధ్వంసం చేయడం జాతిద్రోహం కాక మఱేంటి ? తెలంగాణలో మాట్లాడేది తెలుగు కాదా ? తెలుగుతల్లి ఆంధ్రా ఏరియాకి పరిమితమా? అంటే ఇక్కడ వేర్పాటువాదులు కోరుతున్నది కేవలం ఒక కొత్త పరిపాలనా విభాగం కాదనీ పక్కనున్న తెలుగు ఏరియాతో శాశ్వత శత్రుత్వమనీ ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. కనుక ఈ డిమాండుని జాతిద్రోహంగా అభివర్ణించడంలో అతిశయోక్తీ లేదు, అసత్యమూ లేదు

చిన్న మాట

ఒ చిన్నమాట ఎదుటిమనిషిలో ఎంత ఆనందాన్నిస్తుందో తెల్సా..
ఒకే ప్రాణంగా బ్రతికిన ఇద్దరు స్నేహితులు విడిపోవాల్సి వచ్చింది..
మనుషులు దూరం అయ్యారు..మనసుల్లో ఇద్దరిమద్యాగ్యాప్..
ఒకేప్రాణంగా ఉన్న ఇద్దరు దూరంఅయినా..ఓ చిన్నమాట..
గుండెల్లో మంటకు ఊరటనిస్తుంది... "బాగున్నావా " అన్న పలకరింపు
.....ఆ మాటలో ఎంత బలముంటుందో తెల్స్తా.........
ఎందుకలా మనసు విప్పి "బాగున్నావా అని " పలకరించుకోరు..
మౌనంలో ఎంత వేదనుంటుందో తెల్సా..అనుబవించేవాళ్ళకే తెలుస్తుంది..
మౌనంగా ఉండి మనం సాదించేదేమిటి..ఎదుటి మనస్సును భాదపెట్టడం తప్ప..
ఎందుకో ఇలా ఆలోచించరు...విడిపోయిన మనసులకు ఇదో ఊరట..
" బాగున్నావా " అని అడిగితే మన ఆస్తులు కరిగి పోతాయా..
ఒక్కచిన్నమాట మనసుకు ఎంతా హానిస్తుందో అని ఎందుకు అనుకోరు..
ఓ సినీ గేయ రచయిత చెప్పాడు " ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏదారెటుపోతుందో ఎవరికి ఎరుక అని "..
ఇలా ఎప్పుడు బద్ద శత్రువుల్లా ఉండి పోవల్సిందేనా..మౌనంగా ఎన్నాళ్ళిలా ఏన్నేళ్ళిలా...

ఆ చిన్న మాట కోసం ఎదురు చూస్తున్నా నీకు ఏమి కాని "స్నేహితుడు "

పదహారణాల తెలుగు అమ్మాయి

పదహారణాల తెలుగమ్మాయి....
కలువల్లాంటి కళ్ళు,
దొండపండులాంటి పెదవులు,
చేమంతుల్లాంటి చెక్కిలూ,
తుమ్మెద రెక్కల హోయల్లాంటి కురులు,
కళ్ళలో మెరిసే వెలుగు ఇంకా చురుకుదనం,
కొంచం సరదాగా,
మరికొంచెం సాంప్రదాయంగా,
కొంచం లక్షణంగా,
చాల గడుసుగా,
చిలిపిగా.
అందంగా, ఆనందం మోమంత విరబూసి,
చెంగు చెంగున తుళ్ళుతూ , లంగావోని వేసుకుని వచ్చే ,
తెలుగింటి అమ్మాయిని చూసి చందమామ కూడా మొహం తిప్పుకోక పోతుందా......?
చెప్పండి మీరే............ ......... .......!
లక్షణంగా నుదుటిన బొట్టు…
కళ్ళకు కాటుక….
వాలు జడ…
గల గల గాజులు….
పదహారణాల చీర కట్టూ….
కాళ్ళకు పట్టాలు….
గోరింటాకు, పూలు..
పెద్ద పెద్ద కళ్లు…
ఆ కళ్ళలో కూసింత పొగరు…
అన్ని కలగలిపి ఉండే
16 అణాల తెలుగు అమ్మాయిని ఇష్టపడని
వారు ఉండరేమో

చేయని తప్పులకు బలికావడం...

తిరగ బడుతున్న కాలం...ఉండలేనంటున్న ఊపిరి..
కొన్ని ఘటనలు జరగబోయే విషయాన్ని చెప్పకనే చెబుతాయి..
ప్రతివిషయంలో ఎదురు దెబ్బలే..అన్ని విషయాలు ఎదురు తిరగడం..
చేయని తప్పులకు బలికావడం...ఇక నీవు ఉండి వేష్టు అని చెప్పకనే చెబుతున్నాయి
ఎంత అలోచించినా ...ఆ నిర్నమే కరెక్టు అనిపిస్తుంది..
కాలం అలా నిర్నయంతిసుకున్నప్పుడు ...మనం ఎంచేసినా జరిగేది అదే..
కనీసం నా అనుకున్నవారు అర్దంచేసుకునే పరిస్థితిలేదు మరి..
నన్ను పూర్తిగా అర్దం చేసుకున్నవారు అర్దాతరంగా దూరం అయ్యారు..
. నీవు దూరం అయిన నాటినుంచే నాకిలా జరుగుతోంది..
ఒక్కోసారి అనిపిస్తుంది నాకిలా జరగాల్సిందే..అవును కదా...?..
..... సరే ఇకనాచేతుల్లో ఏమిలేదు..

12, మార్చి 2011, శనివారం

తెలుగుకి మంచి కీర్తి అన్నగారి చిత్రాలే ఒక్క చక్కని ఉదాహరణ

ఓరోరీ మాయాజూదవిజయమధమధోన్మత్త ! దుర్యోధనా !
నీ దురహంకారానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటాను
ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంబోరు నిజోరు దేశమ్ముననున్దగబిల్చిన,
ఇద్దురాత్ము దుర్వార మదీయ భాహుపరివర్తిత చ్చండగధావిఘాత భగ్నోరుతరోరు జేయుదు
సుయోధనున్ ఉగ్ర రణాన్తరంబునన్

ఒరిరి కురుకుల దార్తా దుశ్శాసనా!
కురువృద్ధుల్ వృద్ధభాన్ధవులనేకుల్ జూచుచుండ ద్రౌపదినిట్లుచేసిన ఖలున్ దుశ్శాసనున్
లోకభీకరలీలన్ వధియిన్చి, తద్విపులవక్షస్తలరక్తౌగ నిర్ఝరి ఉర్వీపతుల్ జూచుచుండ అని
ఆస్వాదిన్తును ఉగ్రాకృతిన్

మాయలతో జనియించి మటుమాయల వృత్తిగానెంచు నీవు,
అహొ ! మాయలనిందసేతువే ?
అమాయకులైన పృధాకుమారులన్ మాయలుపన్ని నాడు అవమానము సేయగలేదే ?
ఆ గతిన్ మాయలతోనే నీ దురభిమానము మాపెదన్ సుయోధనా !

చల్లని మమా ఓ చందమమా నీకు ఇది తగునా?

జపాన్‌ను శుక్రవారం భారీ భూకంపం తాకింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.8గా నమోదైంది. ప్రమాదకరమైన సునామీ కూడా తాకే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. భూకంప తాకిడికి పలువురు గాయపడినట్లు సమాచారం అందింది. అయితే మరణాలు సంభవించినట్లు సమాచారం అందలేదు. పసిఫిక్ కోస్తా ప్రాంతంలోని మియాగి భూకంపానికి గురైంది. ఆ ప్రాంతాన్ని వరదలు ముంచేస్తున్న దృశ్యాలు టీవీ చానెళ్లలో ప్రసారమవుతున్నాయి. భూకంప తీవ్రతకు టోక్యోలోని భవనాలు కూడా కదిలిపోయాయి. టోక్యోలో ప్రకంపనాలకు ఆరు అగ్నిప్రమాదాలు సంభవించాయి.


ఇది చిన్న శాంపిల్ మాత్రమే.. వచ్చే వారం ఇంకా ఓ భయంకరమైన విధ్వంసం జరగనుందని లండన్‌లో ఉన్నటువంటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు దీనికి అంతటికి కారణం 'సూపర్ మూన్' అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సూపర్ మూన్ అంటే ఏమి లేదండీ..20 సంవత్సరాల క్రితం మూన్ భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని, ఇది మాత్రమే కాకుండా భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలై లావా భూమిమీద పారుతుందని అభిప్రాయపడుతున్నారు.

సాధారణంగా నాచురల్ శాటిలైట్ అయినటువంటి భూమికి దగ్గరగా ఈ సూపర్ మూన్ రావడమే ఇందుకు కారణం అంటున్నారు. మార్చి 19వ తారీఖున సూపర్ మూన్ భూమికి అత్యంత సమీపం అంటే దాదాపు 221, 556 మైళ్శ దూరంలో వస్తుందని అంటున్నారు. గత 20 సంవత్సరాలలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదని అన్నారు. గతంలో ఇలాగే సూపర్ మూన్ భూమికి దగ్గరగా 1955, 1974, 1992, 2005లో రావడం జరిగింది. దాంతో ఆయా సంవత్సరాలలో ఇలాంటి విపత్తులు సంభవించాయి.

ఇది ఇలా ఉండగా ప్రముఖ టివి వాతావరణ నిపుణలు జాన్ కెట్ట్‌లీ మాత్రం భూకంపాలు, సునామీ లాంటివి జరగడానికి సూపర్ మూన్ ఏమి కారణం కాదని తన వాదనని వినిపిస్తున్నారు. ఐతే భూమికి సూపర్ మూన్ ఇలా దగ్గరకి వస్తే మాత్రం సముద్రంలో అలలు పోంగుతాయని అన్నారు. ఇలాంటి సందర్బాలలో ముఖ్యంగా తీర ప్రాంతాలలో ఉన్నటువంటి వారు మాత్రం కొంచెం ఇబ్బందులకు గురి కావాల్సివస్తుందని అన్నారు. జపాన్ భూకంపం కారణంగా న్యూజిల్యాండ్, ఇండోనేషియా, ఫిలిప్పేన్స్, న్యూ గునియా, హావాయి తదితర ప్రాంతాలలో మరి కొద్ది గంటలపాటు అలలు ఎగసిపడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించారు

శవాలు శిథిలాల కింద చిక్కుకుపోయారు

జపాన్ సునామీకి 1300 మందికి పైగా బలయ్యారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మంటలు లేస్తున్నాయి. భూకంపం, సునామీ తర్వాత జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో నీరు ప్రవహిస్తోంది. సునామీ, భూకంపాల వల్ల జపాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. శవాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. ప్రజలు సహాయం కోసం అంగలారుస్తున్నారు. తిండి కావాలంటూ, సహాయం చేయండంటూ దీనంగా వేడుకుంటున్నారు. టోక్యోలో సబ్ వేలను మూసేశారు. ఇళ్లు కోల్పోయినవారు రోడ్ల మీదనే జీవితాలను వెళ్లదీస్తున్నారు. బ్రీఫ్ కేసులను దిండ్లుగా చేసుకుని వార్తాపత్రికలు వేసుకుని పడుకున్నారు.

భూకంపం వల్ల అణు రియాక్టర్ కూలింగ్ వ్యవస్థపై ప్రభావం పడడంతో రేడియేషన్ ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ప్లాంట్ చుట్టుపక్కల ఉన్నవారిని ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్రధాని నావోటా కాన్ ఆదేశించారు. ఫుకుషమా ప్లాంట్ ప్రమాదం ప్రజలపై పడకుండా తగిన చర్యల కోసం జపాన్ అమెరికా సహాయం కోరింది.