నా నవ్వుని ఎక్కడో పారేసుకున్నాను .నిజమేనండీ , అచ్చంగా ,అక్షరాలా నా సొంత నవ్వుని
ఎక్కడో పారేసుకున్నాను .రకరకాల నవ్వులని జేబులో పెట్టుకొని తిరుగుతున్నాను .శతకోటి
బంధాలకు , అనంతకోటి నవ్వులు . ఆ కోటిలో "నాకోటి " ఉందా ?. ఏమో , పక్క వీధిలో
పోగొట్టుకున్న కాసు,వెలుగున్న ఈ వీధిలో దొరుకుతుందా?.ఇంతకీ నా నవ్వు ఏమైంది ?.
తెలియని వెతుకులాట , తెలివిడి కోసం సాగుతోంది . నాకో అనుమానం .తెలివిడి వల్ల ఆనందం
పెరుగుతుందా ? లేక అజ్ఞానం ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందా ? లేక ఎదుటివాడి అజ్ఞానం
మనకి నవ్వునిస్తోందా ? రసాభాస (అనుకున్నది జరుగక చతికిలపడితే జరిగేది ) నవ్వుకి
కారణమా ? . ఏం జరుగుతోంది ఇక్కడ , నవ్వు గురించి ఆలోచిస్తూ నన్ను నేను మరిచాను.
ఇంతకీ నా నవ్వు ఎక్కడ , ఇప్పుడే తెలియాలి . ముగ్గు వేసి అంజనం వేయించనా ? ,చిలక
ప్రశ్న అడగనా ? ,వత్తులు వేసిన కళ్లు కాచేలా ఎదురు చూడనా ? .స్వామీజీ ఎవరైనా
దొరుకుతారా ?, నెట్ బదులిస్తుందా ?
ఏదో వెలుగు దగ్గరౌతోంది .వెలుగుతో పాటు ఓ మధుర స్వరం వినిపిస్తోంది
"తనని వదిలి అందరిని లెక్కించే పరమానందయ్య శిష్యులలా ఉన్నవే .కస్తూరి మృగానికి
బంధువువా? నిన్నునీవు మరిచావే.అద్దె నవ్వుల సవ్వడిలో తానున్న నీ సొంతనవ్వుని చూడవే?
బంధాలన్నీ నీవేగా .నీవు కాదంటే లేవుగా .అది మరచి, నీవు స్తంభాన్ని పట్టుకొని ,నన్ను
విడిపించండి అన్నట్టు ఉంది .అన్నీ నీవే .ప్రతి నవ్వు నీదే .పొద్దుతిరుగుడు పువ్వంత
కళ్లు చేసుకొని చూడు . నవ్వుల తోట నీదే అవుతుంది
15, మార్చి 2011, మంగళవారం
నల్లేరుపై బండి నడక
రాష్ట్ర రాజకీయ తెర మీదికి ఉప్పెనలా వస్తుందని భావించిన మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చడీచప్పుడు లేకుండా, సాదాసీదాగా వచ్చేసింది. అనూహ్యంగా వైయస్ జగన్ హంగామా లేకుండా కడప జిల్లా పులివెందులలోని వైయస్సార్ సమాధి వద్ద తన పార్టీ జెండాను తల్లి విజయమ్మ చేత ఆవిష్కరింపజేసి పార్టీకి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున కోడ్ ఉల్లంఘన జరగకుండా జెండా ఆవిష్కరణ చేయాల్సిన సందర్భాన్ని జగన్ ఎంచుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.
నిజానికి, ఆయన అత్యంత సన్నిహితులను కూడా ఆశ్చర్యపరిచినట్లు చెబుతున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సభలో ప్రకటించి, మర్నాడే పార్టీ జెండాను ఆవిష్కరింపజేశారు. పార్టీ అవతరణ సభ విడిగా మరోసారి ఉంటుందని చెప్పడానికి కూడా వీలు లేని పరిస్థితి. కాగా, పార్టీ జెండా ఆవిష్కరణ తేదీ ఖరారుకు ఆయన తన సన్నిహితులను కూడా సంప్రదించలేదని చెబుతున్నారు. పార్టీ అవతరణ సభ కోసం ఆయన పులివెందులలో భారీ సెట్టింగుతో వేదికను కూడా ఏర్పాటు చేశారు. సినిమా రంగానికి చెందిన తోట తరణితో వేదికను ఏర్పాటు చేయించారు. దాన్ని బట్టి జగన్ పార్టీ అవతరణ సభ భారీ యెత్తున ఉంటుందని అందరూ భావించారు.
అలాంటిదేమీ లేకుండా కుటుంబ కార్యక్రమంగానే జెండా ఆవిష్కరణ సభ జరిపించారు. ఇలా ఎందుకు చేశారనేది తెలియక ఆయన అనుచరులు కూడా ముక్కు మీద వేలేసుకున్నారు. ఈ సభకు చాలా మంది ముఖం చాటేసినట్లు చెబుతున్నారు. జెండా ఆవిష్కరణ సభకు కేవలం 11 మంది శాసనసభ్యులు మాత్రమే హాజరయ్యారు. నాయకులు కూడా కొద్ది మందే ఉన్నారు. జగన్ వెంట 23 మంది శాసనసభ్యులున్నారనేది గత కొంత కాలంగా గట్టిగా ప్రచారం జరుగుతూ వచ్చింది. మిగతా 12 మంది శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదనేది ప్రశ్న. జగన్ అంచనాలను తలకిందులు చేస్తూ నాయకులు కూడా తక్కువ మందే వచ్చినట్లు చెబుతున్నారు. అభిమానుల సందడి కనిపించినప్పటికీ అది కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని అంటున్నారు.
వైయస్సార్ అకాల మరణానికి దిగ్భ్రాంతికి గురై మృత్యువాత పడిన కుటుంబాలను పరామర్శించడానికి తలపెట్టిన ఓదార్పు యాత్రను ఆయన తిరిగి చేపడతారా, మిగతా జిల్లాల్లో దాన్ని నిర్వహిస్తారా అనేది కూడా అనుమానంగానే ఉంది. ఓదార్పు యాత్ర పూర్తికాకుండానే ఆయన కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించడానికి సిద్ధపడ్డారు. వివిధ సమస్యలపై దీక్షలకు పూనుకుంటూ వచ్చారు.
శ్రీకాకుళం కాకర్లపల్లి ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టు బాధితులను పరామర్శించడానికి వెళ్లిన జగన్‌కు చేదు అనుభవమే ఎదురైంది. దీన్ని బట్టి, వైయస్సార్ సంక్షేమ పథకాలు తనకు ఎంతగా ఉపకరిస్తాయో, ఆయన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అంతగా వ్యతిరేకంగా పనిచేస్తాయని మొదటిసారి జగన్‌కు తెలిసి వచ్చింది. అందువల్ల జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీది నల్లేరుపై బండి నడక ఏమీ కాదని అంటున్నారు.

14, మార్చి 2011, సోమవారం
తెలుగుతల్లి ఆంధ్రా ఏరియాకి పరిమితమా?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండుని ఆంధ్రరాష్ట్ర డిమాండుతో పోలుస్తూ చేస్తున్న ఈ అనవసరమైన పోలిక గుఱించి గత కొద్దికాలంగా వింటున్నాం. పూర్వ మద్రాసు రాష్ట్రం ఏకజాతిరాష్ట్రం కాదు. అది ప్రజాభీష్టంతో, ప్రజాస్వామికంగా ఏర్పడ్డది కాదు. వలసపాలకుల సౌలభ్యార్థం నానాజాతుల కిచిడీగా సృష్టించబడింది. ఆ కిచిడీ నుంచి బయటపడి ఏకజాతిరాష్ట్రాల్ని ఏర్పఱచాలనే ఉద్దేశంతో ప్రారంభమైనవి భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం మొదలైన ఆందోళనలు. భాషాజాతులూ, భాషారాష్ట్రాలూ ఇంగ్లీషువారీ దేశంలో అడుగుపెట్టక ముందునుంచి ఉన్నాయి. ఇండియన్ యూనియన్ ఏర్పడక ముందునుంచి ఉన్నాయి. అవే నిఖార్సైన నిజమైన సహజమైన యూనిట్లు. పరిపాలనలో ఆ సహజత్వం, ఆ సమగ్రత్వం కోసమే భాషారాష్ట్రాలు. అంతే తప్ప ఒకే జాతికి, ఒకే మతానికీ, ఒకే భాషకూ, ఒకే సాంస్కృతిక వారసత్వానికీ చెందిన, రెండు ఆనుకుని ఉన్న ప్రాంతాలలో ఒకఱిని దోపిడీదారులుగా, ఇంకొకఱిని బానిసలుగా వర్ణించడం, వివాదాల పరిష్కారానికి ఉన్న అన్ని శాంతియుత మార్గాల్నీ వర్జించడం నిజంగా జాతిద్రోహమే అవుతుంది. misleading అవుతుంది. రాజకీయప్రయోజనాల కోసం – శాంతియుతంగా అన్నదమ్ముల్లా దశాబ్దాల తరబడి పక్కపక్కనే కలిసి జీవిస్తున్న ప్రజల మధ్య లేని శత్రుత్వాల్ని పనిగట్టుకొని సృష్టించడం అవుతుంది. అదే జాతిద్రోహం. ఇతరులపై ఒకప్పుడు మనం ప్రయోగించిన ఈ “దోపిడీ” ఎట్సెటరా కమ్యూనిస్టు పదజాలాన్ని మనలో మనం మనవాళ్ళ మీద, మన స్వదేశీయుల మీద, మన స్వరాష్ట్రీయుల మీద ప్రయోగించడం పూర్తి అసహజం, అసమంజసం. ఉద్యమం వేడిలో మీకిది అర్థం కాకపోవచ్చు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని ప్రాంతాల ప్రజల స్వచ్ఛంద అంగీకారంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడింది. ఇందుకు చరిత్రగ్రంథాలే సాక్షి. ఈనాడు కొందఱు బయల్దేఱి “ఈ సెటప్పు మాకు నచ్చలేదు, మార్చండి” అంటే అది సాధ్యపడదు. సాధ్యపడ్డానికి ఇదేమీ మన వ్యక్తిగత జీవితం కాదు. కోట్లాదిమంది జీవితాలకు సంబంధించిన విషయం. ఇది ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం జాతిద్రోహం కాకపోవచ్చు. కానీ ఇది జాతిద్రోహంగా నెమ్మదిగా పరిణమిస్తుంది. ఇప్పటికే పరిణమిస్తున్నది. ఈ ఉద్యమంలో భావి-జాతిద్రోహ బీజాలు ఉన్నాయి. తెలుగుతల్లి విగ్రహాల్ని ధ్వంసం చేయడం జాతిద్రోహం కాక మఱేంటి ? తెలంగాణలో మాట్లాడేది తెలుగు కాదా ? తెలుగుతల్లి ఆంధ్రా ఏరియాకి పరిమితమా? అంటే ఇక్కడ వేర్పాటువాదులు కోరుతున్నది కేవలం ఒక కొత్త పరిపాలనా విభాగం కాదనీ పక్కనున్న తెలుగు ఏరియాతో శాశ్వత శత్రుత్వమనీ ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. కనుక ఈ డిమాండుని జాతిద్రోహంగా అభివర్ణించడంలో అతిశయోక్తీ లేదు, అసత్యమూ లేదు

చిన్న మాట
ఒ చిన్నమాట ఎదుటిమనిషిలో ఎంత ఆనందాన్నిస్తుందో తెల్సా..
ఒకే ప్రాణంగా బ్రతికిన ఇద్దరు స్నేహితులు విడిపోవాల్సి వచ్చింది..
మనుషులు దూరం అయ్యారు..మనసుల్లో ఇద్దరిమద్యాగ్యాప్..
ఒకేప్రాణంగా ఉన్న ఇద్దరు దూరంఅయినా..ఓ చిన్నమాట..
గుండెల్లో మంటకు ఊరటనిస్తుంది... "బాగున్నావా " అన్న పలకరింపు
.....ఆ మాటలో ఎంత బలముంటుందో తెల్స్తా.........
ఎందుకలా మనసు విప్పి "బాగున్నావా అని " పలకరించుకోరు..
మౌనంలో ఎంత వేదనుంటుందో తెల్సా..అనుబవించేవాళ్ళకే తెలుస్తుంది..
మౌనంగా ఉండి మనం సాదించేదేమిటి..ఎదుటి మనస్సును భాదపెట్టడం తప్ప..
ఎందుకో ఇలా ఆలోచించరు...విడిపోయిన మనసులకు ఇదో ఊరట..
" బాగున్నావా " అని అడిగితే మన ఆస్తులు కరిగి పోతాయా..
ఒక్కచిన్నమాట మనసుకు ఎంతా హానిస్తుందో అని ఎందుకు అనుకోరు..
ఓ సినీ గేయ రచయిత చెప్పాడు " ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏదారెటుపోతుందో ఎవరికి ఎరుక అని "..
ఇలా ఎప్పుడు బద్ద శత్రువుల్లా ఉండి పోవల్సిందేనా..మౌనంగా ఎన్నాళ్ళిలా ఏన్నేళ్ళిలా...
ఆ చిన్న మాట కోసం ఎదురు చూస్తున్నా నీకు ఏమి కాని "స్నేహితుడు "

పదహారణాల తెలుగు అమ్మాయి
పదహారణాల తెలుగమ్మాయి....
కలువల్లాంటి కళ్ళు,
దొండపండులాంటి పెదవులు,
చేమంతుల్లాంటి చెక్కిలూ,
తుమ్మెద రెక్కల హోయల్లాంటి కురులు,
కళ్ళలో మెరిసే వెలుగు ఇంకా చురుకుదనం,
కొంచం సరదాగా,
మరికొంచెం సాంప్రదాయంగా,
కొంచం లక్షణంగా,
చాల గడుసుగా,
చిలిపిగా.
అందంగా, ఆనందం మోమంత విరబూసి,
చెంగు చెంగున తుళ్ళుతూ , లంగావోని వేసుకుని వచ్చే ,
తెలుగింటి అమ్మాయిని చూసి చందమామ కూడా మొహం తిప్పుకోక పోతుందా......?
చెప్పండి మీరే............ ......... .......!
లక్షణంగా నుదుటిన బొట్టు…
కళ్ళకు కాటుక….
వాలు జడ…
గల గల గాజులు….
పదహారణాల చీర కట్టూ….
కాళ్ళకు పట్టాలు….
గోరింటాకు, పూలు..
పెద్ద పెద్ద కళ్లు…
ఆ కళ్ళలో కూసింత పొగరు…
అన్ని కలగలిపి ఉండే
16 అణాల తెలుగు అమ్మాయిని ఇష్టపడని
వారు ఉండరేమో

చేయని తప్పులకు బలికావడం...
తిరగ బడుతున్న కాలం...ఉండలేనంటున్న ఊపిరి..
కొన్ని ఘటనలు జరగబోయే విషయాన్ని చెప్పకనే చెబుతాయి..
ప్రతివిషయంలో ఎదురు దెబ్బలే..అన్ని విషయాలు ఎదురు తిరగడం..
చేయని తప్పులకు బలికావడం...ఇక నీవు ఉండి వేష్టు అని చెప్పకనే చెబుతున్నాయి
ఎంత అలోచించినా ...ఆ నిర్నమే కరెక్టు అనిపిస్తుంది..
కాలం అలా నిర్నయంతిసుకున్నప్పుడు ...మనం ఎంచేసినా జరిగేది అదే..
కనీసం నా అనుకున్నవారు అర్దంచేసుకునే పరిస్థితిలేదు మరి..
నన్ను పూర్తిగా అర్దం చేసుకున్నవారు అర్దాతరంగా దూరం అయ్యారు..
. నీవు దూరం అయిన నాటినుంచే నాకిలా జరుగుతోంది..
ఒక్కోసారి అనిపిస్తుంది నాకిలా జరగాల్సిందే..అవును కదా...?..
..... సరే ఇకనాచేతుల్లో ఏమిలేదు..

12, మార్చి 2011, శనివారం
తెలుగుకి మంచి కీర్తి అన్నగారి చిత్రాలే ఒక్క చక్కని ఉదాహరణ
ఓరోరీ మాయాజూదవిజయమధమధోన్మత్త ! దుర్యోధనా !
నీ దురహంకారానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటాను
ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంబోరు నిజోరు దేశమ్ముననున్దగబిల్చిన,
ఇద్దురాత్ము దుర్వార మదీయ భాహుపరివర్తిత చ్చండగధావిఘాత భగ్నోరుతరోరు జేయుదు
సుయోధనున్ ఉగ్ర రణాన్తరంబునన్
ఒరిరి కురుకుల దార్తా దుశ్శాసనా!
కురువృద్ధుల్ వృద్ధభాన్ధవులనేకుల్ జూచుచుండ ద్రౌపదినిట్లుచేసిన ఖలున్ దుశ్శాసనున్
లోకభీకరలీలన్ వధియిన్చి, తద్విపులవక్షస్తలరక్తౌగ నిర్ఝరి ఉర్వీపతుల్ జూచుచుండ అని
ఆస్వాదిన్తును ఉగ్రాకృతిన్
మాయలతో జనియించి మటుమాయల వృత్తిగానెంచు నీవు,
అహొ ! మాయలనిందసేతువే ?
అమాయకులైన పృధాకుమారులన్ మాయలుపన్ని నాడు అవమానము సేయగలేదే ?
ఆ గతిన్ మాయలతోనే నీ దురభిమానము మాపెదన్ సుయోధనా !

చల్లని మమా ఓ చందమమా నీకు ఇది తగునా?
జపాన్‌ను శుక్రవారం భారీ భూకంపం తాకింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.8గా నమోదైంది. ప్రమాదకరమైన సునామీ కూడా తాకే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. భూకంప తాకిడికి పలువురు గాయపడినట్లు సమాచారం అందింది. అయితే మరణాలు సంభవించినట్లు సమాచారం అందలేదు. పసిఫిక్ కోస్తా ప్రాంతంలోని మియాగి భూకంపానికి గురైంది. ఆ ప్రాంతాన్ని వరదలు ముంచేస్తున్న దృశ్యాలు టీవీ చానెళ్లలో ప్రసారమవుతున్నాయి. భూకంప తీవ్రతకు టోక్యోలోని భవనాలు కూడా కదిలిపోయాయి. టోక్యోలో ప్రకంపనాలకు ఆరు అగ్నిప్రమాదాలు సంభవించాయి.
ఇది చిన్న శాంపిల్ మాత్రమే.. వచ్చే వారం ఇంకా ఓ భయంకరమైన విధ్వంసం జరగనుందని లండన్‌లో ఉన్నటువంటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు దీనికి అంతటికి కారణం 'సూపర్ మూన్' అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సూపర్ మూన్ అంటే ఏమి లేదండీ..20 సంవత్సరాల క్రితం మూన్ భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని, ఇది మాత్రమే కాకుండా భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలై లావా భూమిమీద పారుతుందని అభిప్రాయపడుతున్నారు.
సాధారణంగా నాచురల్ శాటిలైట్ అయినటువంటి భూమికి దగ్గరగా ఈ సూపర్ మూన్ రావడమే ఇందుకు కారణం అంటున్నారు. మార్చి 19వ తారీఖున సూపర్ మూన్ భూమికి అత్యంత సమీపం అంటే దాదాపు 221, 556 మైళ్శ దూరంలో వస్తుందని అంటున్నారు. గత 20 సంవత్సరాలలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదని అన్నారు. గతంలో ఇలాగే సూపర్ మూన్ భూమికి దగ్గరగా 1955, 1974, 1992, 2005లో రావడం జరిగింది. దాంతో ఆయా సంవత్సరాలలో ఇలాంటి విపత్తులు సంభవించాయి.
ఇది ఇలా ఉండగా ప్రముఖ టివి వాతావరణ నిపుణలు జాన్ కెట్ట్‌లీ మాత్రం భూకంపాలు, సునామీ లాంటివి జరగడానికి సూపర్ మూన్ ఏమి కారణం కాదని తన వాదనని వినిపిస్తున్నారు. ఐతే భూమికి సూపర్ మూన్ ఇలా దగ్గరకి వస్తే మాత్రం సముద్రంలో అలలు పోంగుతాయని అన్నారు. ఇలాంటి సందర్బాలలో ముఖ్యంగా తీర ప్రాంతాలలో ఉన్నటువంటి వారు మాత్రం కొంచెం ఇబ్బందులకు గురి కావాల్సివస్తుందని అన్నారు. జపాన్ భూకంపం కారణంగా న్యూజిల్యాండ్, ఇండోనేషియా, ఫిలిప్పేన్స్, న్యూ గునియా, హావాయి తదితర ప్రాంతాలలో మరి కొద్ది గంటలపాటు అలలు ఎగసిపడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించారు

శవాలు శిథిలాల కింద చిక్కుకుపోయారు
జపాన్ సునామీకి 1300 మందికి పైగా బలయ్యారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మంటలు లేస్తున్నాయి. భూకంపం, సునామీ తర్వాత జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో నీరు ప్రవహిస్తోంది. సునామీ, భూకంపాల వల్ల జపాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. శవాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. ప్రజలు సహాయం కోసం అంగలారుస్తున్నారు. తిండి కావాలంటూ, సహాయం చేయండంటూ దీనంగా వేడుకుంటున్నారు. టోక్యోలో సబ్ వేలను మూసేశారు. ఇళ్లు కోల్పోయినవారు రోడ్ల మీదనే జీవితాలను వెళ్లదీస్తున్నారు. బ్రీఫ్ కేసులను దిండ్లుగా చేసుకుని వార్తాపత్రికలు వేసుకుని పడుకున్నారు.
భూకంపం వల్ల అణు రియాక్టర్ కూలింగ్ వ్యవస్థపై ప్రభావం పడడంతో రేడియేషన్ ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ప్లాంట్ చుట్టుపక్కల ఉన్నవారిని ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్రధాని నావోటా కాన్ ఆదేశించారు. ఫుకుషమా ప్లాంట్ ప్రమాదం ప్రజలపై పడకుండా తగిన చర్యల కోసం జపాన్ అమెరికా సహాయం కోరింది.

ఏడుపో... బాధో.....కసోఏమీ చేయలేని అస్సహాయతో.. ఏమీ అర్థం కాని ఓ ఆవేదన!!!
""తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,తెలుగు వల్లభుండ తెలుగొకండ,యెల్ల నృపులు గొలువ యెఱుగ వే బాసాడి,దేశ భాషలందు తెలుగు లెస్స"".
కొందరి దూషణలతో,మరికొందరి భాషణలతో,కొందరి చేష్టలతో,మరికొందరి నిశ్చేష్టలతో,కొందరి ఉద్యమాలతో,మరికొందరి మాధ్యమాలతో
కొందరి విధ్వంసంతో,మరి కొందరి ఉత్సాహం తో విసిగి వేసారి పోయాను,మార్పంటే ఏమిటో మర్చిపోయాను.నాకు నేనే మారిపోయాను.ఇన్నాళ్ళుగా అడ్డొచ్చిన సహనం నిన్నటితో చచ్చిపోయింది,ఎవరు తనో,ఎవరు పరో నిన్నటి తో తెలిసిపోయింది.
ఉందనుకున్న సౌభ్రాతృత్వం లేదని తేలిపోయింది.మనుషులే పోయాకా విగ్రహాలెందుకట,ఉద్యమాల పేరుతో పసి పిల్లల్ని పొట్టన పెట్టుకున్నప్పుడే అడగనోల్లు, బోడి బొమ్మలు నేలకూలితే లొల్లి చేస్తరేమంటుండ్రు.

"ఆ విగ్రహాలకు ప్రాణముంటదా? పోతే మళ్ళీ పెట్టుకోవచ్చు" వింటానికి సిగ్గుగా ఉంది మనకి!!!!
నడి వీధిలో మీ సంస్కృతిని మీరు నగ్నంగా నిలబెట్టి నిర్వచించారు!
మీరేమిటో ప్రపంచానికి చాటారు !
మీ సంస్కారాన్ని బట్టలు విప్పి టాంక్ బండ్ మీద ఊరేగించారు. !
మీ అంతిమ లక్ష్యమేమిటో చూపించారు.మీరు హుసేన్ సాగర్లో వేసింది కేవలం విగ్రహాలను కాదు, తెలుగు ప్రజల ఆత్మని!
తెలుగు వెలుగులారా..! క్షమించండి!
తన ముద్దు బిడ్డలకు పట్టిన గతి చూసి అల్లంత దూరాన ప్రభుత్వ భవనం ముందు.... నోట్లో చెంగు కుక్కుకుని గోలుగోలున ఏడుస్తున్న తెలుగు తల్లి సాక్షిగా
మేము...చచ్చిపోయాం!
మా రక్తంలో వేడి చల్లారిపోయింది.
మిమ్మల్ని కాపాడుకోలేక ఇళ్ళలో టీవీల ముందు కూచుని కళ్ళు తుడుచుకున్నాం!
NTR.... క్షమించు మమ్మల్ని!
తెలుగు ఆత్మగౌరవం నినాదాన్ని నువ్వు వినిపించినా, దాన్ని ఇవాళ మేము నినదించలేకపోయాం! ........
ఆత్మలు చచ్చిన వాళ్లకు గౌరవం ఎందుకని!
పోలీసుల సాక్షిగా సాగిన దమనకాండ ని చూస్తూ కృష్ణ దేవరాయలకు,బ్రహ్మనాయుడికి హుసేన్ సాగర్ నీళ్లతో తర్పణాలు విడిచాం!
మహనీయులను సదా స్మరించుకునే అవకాశం నువ్విచ్చినా మేము నిలుపుకోలేకపోయాం!
ఎముకలు కుళ్ళి,శక్తులు చచ్చిన వాళ్ళం...క్షమించు....
పదవీ వ్యామోహాలు-కులమత భేదాలు,
భాషాద్వేషాలు చెలరేగె నేడు !
ప్రతి మనిషి మరి యొకరిని దోచుకొనేవాడే,
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకొనే వాడే!
స్వార్ధమే అనర్ధదాయకం !
అది చంపుకొనుటే క్షేమదాయకం !

నేను తెలుగువాడినన్న అహంకారం పటాపంచలైతే నిద్రెలా పడుతుంది?
ట్యాంక్ బండ్ మీద ఎక్కువగా సీమాంధ్రకు చెందిన వ్యక్తుల విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించారని, తెలంగాణలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తుల విగ్రహాలు తక్కువగా ఉన్నాయని తెలంగాణావాదులు చాలా కాలంగా వాదిస్తూ వస్తున్నారు. విగ్రహాలను ధ్వంసం చేస్తామని కూడా హెచ్చరికలు చేస్తూ వచ్చారు. ఈ హెచ్చరికల మేరకు ట్యాంక్ బండ్‌పై ఉన్న వ్యక్తుల విగ్రహాలను ధ్వంసం చేశారని భావించాల్సి ఉంటుంది. అయితే, ఒక పథకం ప్రకారం జరిగినట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. ఉదయం పూట పోలీసులు, మీడియా ప్రతినిధులతో మాత్రమే నిండిపోయిన ట్యాంక్ బండ్ మధ్యాహ్నం తర్వాత తెలంగాణవాదులతో అట్టుడికిపోయింది. గుంపులు గుంపులుగా వచ్చిన తెలంగాణ వాదుల దాటికి పోలీసులు బిత్తరపోయారు. వారిని కట్టడి చేయడం పోలీసుల వల్ల కాలేదు. తీవ్ర ఉద్రిక్తత మధ్య తెలంగాణవాదులు విగ్రహాలను ధ్వంసం చేశారు.
ధ్వంసమైన విగ్రహాలను చూస్తే ఏరికోరి విధ్వంసానికి దిగినట్లు కనిపిస్తోంది. సీమాంధ్ర ప్రాంతంలో గణుతికెక్కిన అన్నమయ్య, ఎర్రాప్రగడ, శ్రీకృష్ణ దేవరాయలు, సిద్ధేంద్ర యోగి, పల్నాటి బ్రహ్మనాయుడు ,ముట్నూరి కృష్ణారావు, కందుకూరి వీరేశలింగం, త్రిపురనేని రామస్వామి చౌదరి, ఆర్థర్ కాటన్, బళ్లారి రాఘవ, గురజాడ అప్పారావు, రఘుపతి వెంకయ్య విగ్రహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తెలంగాణకు చెందిన సురవరం ప్రతాప రెడ్డి, రామదాసు, మగ్దూం మొహియుద్దీన్ విగ్రహాల జోలికి ఆందోళనకారులు వెళ్లలేదు. సీఆర్ రెడ్డి విగ్రహాన్ని ఎందుకు వదిలేశారో తెలియదు గానీ నన్నయను తొలి తెలుగు కావ్యాన్ని సృష్టించిన కవి కావడం వల్ల వదిలేసి ఉంటారు. పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఆయన జాతీయ జెండాను రూపొందించిన మహా వ్యక్తి కావడం వల్ల ముట్టుకుని ఉండరు. శ్రీశ్రీ విప్లవ కవి కావడం వల్ల, గుర్రం జాషువా దళిత కవి కావడం వల్ల వదిలేసి ఉండవచ్చు. అయితే, తిక్కన, క్షేత్రయ్య, అల్లూరి సీతారామా రాజు విగ్రహాలను ఎందుకు వదిలేశారనేది హేతువుకు అందడం లేదు. అయితే, విగ్రహాల ధ్వంసంలో తెలంగాణవాదులు స్పష్టమైన హేతువును అనసరించి ఉంటారని భావిస్తున్నారు
నిన్న రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. ఒక్కసారిగా నేను తెలుగువాడినన్న అహంకారం పటాపంచలైతే నిద్రెలా పడుతుంది?“ఆఁ! ఇందులో ఏముంది? విగ్రహాలే కదా! మళ్ళీ తయారుచేసుకోవచ్చులే” అని తాపీగా వినిపిస్తున్న సమాధాన స్వరాలు పుండు మీద కారం చల్లినట్లున్నాయి.ధ్వంశం కాబడిన ప్రతీ విగ్రహం గురించి పుటలు పుటలుగా వ్రాయవచ్చును. కానీ శ్రీకృష్ణదేవరాయలు, అన్నమయల విగ్రహాల ధ్వంశం ఎంతకీ మింగుడు పడటంలేదు. అసలు ఉద్యమానికి వీళ్ళకి ఏమన్నా సంబందం ఉందా?
పక్కనే కొండ మీద ఉన్న బిర్లా మందిర్ బహుశః తదుపరి లక్ష్యం కాబోలు. ఎంతైనా వేంకటేశ్వరస్వామి రాయలసీమ దేవుడు కదా? కొండ క్రింద ఆయన భక్తులలో తలమానికమైన అన్నమయ్యకే దిక్కు లేదు. తిరుమల క్షేత్రంతో దగ్గిర సంబంధం ఉన్న గొప్ప చారిత్రిక చక్రవర్తి అయిన కృష్ణదేవరాయల విగ్రహానికే విలువలేదు. అటువంటప్పుడు, రాయలసీమలో వేలసిన వేంకటేశ్వరస్వామి వారికి మాత్రం విలువేముంది; ఇక్కడ అస్థిత్వం ఎలా అనుమతించబడుతుంది?

11, మార్చి 2011, శుక్రవారం
మాసిపోని అపచారం ట్యాంకు బండు విధ్వంసం
తెలుగు జాతి ఔన్నత్యానికి బాటలు వేసి, సాహిత్యం, కళలు సహా వివిధ రంగాల్లో విశేష కృషి చేసి, తెలుగువారికి అంతర్జాతీయ ఖ్యాతినార్జించి పెట్టిన మహనీయుల విగ్రహాలు ధ్వంసమయ్యాయి. హైదరాబాదులో గురువారం నిర్వహించిన మిలియన్ మార్చ్‌లో ఆందోళనకారులు 12 విగ్రహాలను ధ్వంసం చేయడంతో కొన్నేళ్లుగా ప్రజలను అలరిస్తున్న ట్యాంక్ బండ్ తీరం కళ తప్పింది.
ప్రాంతీయ వివాదాలతో పాలక పక్షాలు సాగిస్తున్న కుటిల వ్యూహాలు రాష్ట్రాన్ని ఏ స్తితికి చేర్చాయో గురువారం నాడు ట్యాంకుబండ్‌పై బుద్ధవిగ్రహం సాక్షిగా సాగిన విధ్వంస కాండ వెల్లడించింది. ఈ అనాగరిక అరాచక చర్యలు తెలబాన్ ప్రజల ప్రజాస్వామిక సంసృతికే కళంకం తెచ్చి పెట్టాయి.తెలుగు వైతాళికుల విగ్రహాలని తెలుగు వారే ధ్వంసం చేస్తుంటే ఏడుపో... బాధో.....కసోఏమీ చేయలేని అస్సహాయతో.. ఏమీ అర్థం కాని ఓ ఆవేదన!!!
మిలియన్ మార్చ్ జయాపజయాలు పంతాలు పట్టింపులు పక్కన పెట్టి తెలుగు ప్రజల మహత్తర వారసత్వాన్ని వీర తత్వాన్ని తూట్లు పొడిచే ప్రక్రియ విజయవంతంగా సాగింది.చాపకూటితో సమతను నేర్పిన నాటి పలనాటి బ్రహ్మన్న, విశ్వ నరుడ నేను అని సగర్వంగా చాటుకున్న దళిత కోకిల జాషవా, బ్రహ్మమొక్కటేనని మానవులు ఏకత్వాన్ని ఏనాడో చాటిన అన్నమయ్య ,విప్లవ కవితా ప్రవక్త శ్రీశ్రీ చెప్పాలంటే ప్రాత:స్మరణీయులైన మహనీయులందరి ప్రతిమలను తుత్తునియలు చేసి అనాగరికతను చాటుకున్న అరాచకం తాండవించింది. ఈ విగ్రహాలకు విలువ ఇవ్వడం కాదు విగ్రహాల వెనకనున్న విలువల విధ్వంసం ఇక్కడ సమస్య.నాలుగు డబ్బులు ఖర్చు చేస్తే రేపే వాటిని పునరుద్దరించవచ్చన్న మాటలు జరిగిన విధ్వంసం కన్నా తీవ్రమైనవి.దీనికి నాయకులైన వారు పునరాలోచించుకోకపోతే రేపు ఇదే వారికీ జరగొచ్చు.
“ఎవరు ఎలా తగలడితే మాకేంటి?” అని ఇటువంటి ఇక్కట్లకు అలవాటుపడ్డ భాగ్యనగర వాసులు(అయోమయంలో), నిత్య జీవితాన్ని ఎలాగోలా నెట్టుకొద్దామనే ప్రయత్నించాలని నిర్ణయించుకున్నట్టు రహదారులమీది ట్రాఫిక్ చూస్తే అర్థమవుతోంది.ఇదా పద్దతి? ఖర్మ కాలి గోడవలు రగులుకునుంటే, ఆ పిల్లల సంగతేంటి? ఇంతటి నీఛానికి దిగాల్సిన అవసరముందా? అసలే పరీక్షల సమయం. అందులో మిట్ట మధ్యాహ్నం. చిచ్చుపెడితే రగిలిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు.
ప్రతిరోజు సాయంత్రం ట్యాంక్‌బండ్‌కు వచ్చే సందర్శకులు ఆ విగ్రహాల వద్ద సేదతీరుతూ తమ పిల్లలకు ఆ మహనీయుల గురించి వివరించే హక్కు మనము పొగుట్టుకున్నము.ఇదేనా!!ఇదేనా!!ఇదేనా!!రేపటి మన పిల్లలకు మనము ఇచే కానుక. ఇకనైనా మనము కళ్ళు తేరవండి.

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని
ఏమున్నది ఏమున్నది ఈ ఉద్యమాల ఔచిత్యం
దుందుడుకు చర్యలకు ఎక్కడిది ఔనత్య౦
తెలుగు వాడు సిగ్గుపడే దుర్దినం
స్పృహ లేని దిశగా నిర్దేసనం లేని ఈ ఉద్యమం
వెర్రి ముదిరితే తలకు రోలు చుట్టమన్నాడొకడు
చుట్టుకున్నోడూరుకోక పది మందిని పోగు చేసి
భలే భలే బావుందంటూ వీధిన పడి వెర్రి తలలు వేస్తున్న ఈ వైనం
పది కాస్త వందలై ట్యాంక్‌బండ్ విగ్రహాల మీద దుశ్చర్య సాగించిన ఈ కుత్సితం
వార్తని చూశాను టీవీ 9 లో వార్తను చూశాను
దుర్మదాంధ బుద్ధిహీన శూన్యుల దుశ్చర్యలను
వికృతమైన చేష్టలను
బుద్ధిమాంద్యుల ఉనికిని
నా దేశం నా రాష్ట్రము నా జిల్లాలో ఉందని
తెలుసుకొని అభివృద్ధి పధాన సాగుతున్న తీరుని..
హే రామా మాటలు ఆగిపోయి స్థాణువునై నే మిగిలిపోని
ఇన్నాళ్ళు తెలబాన్లు అంటూ బ్లాగర్లు సంభోదిస్తున్న తీరు కరెక్ట్ కాదేమో అన్న ఒక మీమాంసలో ఉన్న జనాలకు ఈనాడు సాగించిన ఈ దుర్మార్గపు దుశ్చర్య వాళ్ళకు ఎంత గౌరవం అర్హమో అంతే లభిస్తుందని నిరూపించుకున్నారు. పరమ భక్తాగ్రేసరుడు పద కవిత పితామహుడు అన్నమయ్య విగ్రహాన్ని కూడా వదల్లేదంటే పిచ్చి ముదిరి రోకలి తలకు కట్టించుకొని తిరుగుతున్నారు.
బుద్దుని బమియాన్ విగ్రహాలు ద్వంసం చేసి ఆనాడు వాళ్ళ ఉనికిని ప్రపంచానికి చాటారు ఆ తాలిబన్లు. మన వాళ్ళు అంతకు రెండు ఆకులు ఎక్కువే చదివి మన సంస్కృతికి చిహ్నాలైన మహనీయుల జ్ఞాపికల ఫై పడి మరెంతో ఘన కీర్తిని సంపాయించారు. శబ్భాష్ !! ఉన్మత్త తాండవం చేసే బుద్ధి హీనుడికి పరతమ బేధాలు మంచి చెడు విచక్షణ కోల్పోయి ఈ విధంగానే ప్రవర్తిస్తారు.
రోజు చేయండి మిలియన్ మార్చులు. రాత్రి పగలు తేడ లేక మరీ చేయండి. మనకెలా పనికి మాలిన పరీక్షలు .అవి కూడు పెడుతాయా గుడ్డ పెడుతాయా. భూమి ఏర్పడక ముందే ఏర్పడింది ఈ తెలంగాణా ఆకాంక్ష. యుగాలు మారినా మనువులు మారినా ఈ బ్రహ్మాండం అంతా వ్యతిరేకంగా కుట్రలు చేసి మా కలలు సాకారం కానికుండా మేము దోపిడీకి గురయ్యాము ఈ రాత్రికి రాత్రే తెలిపోవాలె, ఏమి ఎందుకు తేలరాదు రాత్రి పోయి తెలవారట్లే? యుగాల ఆకాంక్ష ఈ రాత్రికి రాత్రి తీరే వరకు ట్యాంక్ బండ్ మీద నిరసన సాగాలి.

10, మార్చి 2011, గురువారం
హమయ్య మా నాన్న ఇల్లు నాకు వచ్చింది
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి కి మంగళవారం హైకోర్టులో చుక్కెదురైంది. ప్రస్తుతం ఆమె నివాసం ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి వెంటనే ఎన్టీఆర్ చిన్న కూతురుకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. రెండు నెలల్లో ఇంటిని ఖాళీ చేయాలని చెప్పింది. లక్ష్మీపార్వతి నివాసం ఉంటున్న ఇంటిని ఆయన చిన్న కుమార్తె అయిన ఉమా మహేశ్వరికి రాసిచ్చారని ఖాళీ చేయాలని చెప్పింది. లక్ష్మీపార్వతి ఉంటున్న బంజారాహిల్స్‌లోని రోడ్డు నెం.13లో ఉంటుంది. న్యాయమూర్తులు జస్టిస్ బి. ప్రకాశరావు, జస్టిస్ రెడ్డి కాంతారావులతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది.ప్రస్తుతం లక్ష్మీపార్వతి ఉంటున్న ఇంటిపై హక్కులు తమకే ఉన్నాయని ఉమా మహేశ్వరి నుంచి జీపీఏ పొందిన ఎన్.రామకృష్ణ పన్నెండేళ్ల క్రితం సిటీ సివిల్ కోర్టులో దావా వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సిటీ సివిల్ కోర్టు 2005 ఉమా మహేశ్వరికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అయితే దీనిపై లక్ష్మీపార్వతి హైకోర్టును వెళ్లగా సిటీ సివిల్ కోర్టు ఆదేశాలపై గతంలో స్టే ఇచ్చింది. ఈ స్టే ఎత్తి వేయాలని, ఇంటికి హక్కుదారులను నిర్ణయించాలని రామకృష్ణ అఫిడవిట్ వేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ లక్ష్మీపార్వతి ఉంటున్న ఇంటిపై హక్కులు ఉమామహేశ్వరికే చెందుతాయని స్పష్టం చేసింది.
9, మార్చి 2011, బుధవారం
కొన్ని ఆలోచనలు.. కాదు కాదు.. అనుభూతులు..
ఈ రోజు ఉదయం నుంచి నా మదిలో మెదిలిన కొన్ని ఆలోచనలు..
ప్రేమంటే.. స్వార్థం కంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది..
ప్రేమంటే.. నన్ను నేనే అర్పించుకున్నా.. నీకోసం ఇంకా ఏదో చేయ్యాలనిపించేది..
ప్రేమంటే.. అందని ఆకాశాన్ని కాదు.. ఎదిరించే పక్షి రెక్కలను చూసి ముచ్చట పడేది..
ప్రేమంటే.. ఆశకీ .. జ్ఞాపకానికి.. ముడిపెట్టేది.. మురిసి పోయేది..
ప్రేమంటే.. కాలం కన్నా చాలా చిన్నది.. జీవితం కంటే చాలా పెద్దగా మిగిలిపోయేది..
ప్రేమంటే.. నన్ను నేను కోల్పోయినా .. నీకు మాత్రం చేరువవ్వాలని అనిపించేది..
ప్రేమంటే.. నీలోనూ ఉన్నది నేనే అని ఒప్పుకునేది.. నేనూ నీవే అని ఒప్పించేది..
ప్రేమంటే.. ఆ అనంతం.. అంతలోనే నాలో కరిగే ఈ క్షణం..
ప్రేమంటే.. అంతకంటే ముఖ్యమైంది ,, ఉన్నతమైనది.. ఒకటుంటే..
అదికూడా ప్రేమే.. అనిపించేది

ఇదీ మన శాసన సభ పరిస్థితి
అసెంబ్లీ వార్తలకు "A" సర్టిఫికేట్ ఇవ్వచ్చు..
హింస, దౌర్జన్యం, బూతులు, కోతి చేష్టలు, జుగుప్స కలిగించే ప్రవర్తన.. ఇదీ మన శాసన సభ పరిస్థితి. ఈ దరిద్రానికి సంభందించిన వార్తలు రాత్రి పదకొండు తరువాతే ప్రసారం చెయ్యాలని ఓ రూల్ పెడితే బావుణ్ణు.
ప్రజాస్వామ్యం అసలు స్వరూపమిదా ? రాజ్యాంగానికి మనం ఇచ్చే విలువ ఇంతేనా ? మనల్ని మనం పాలించుకునే అర్హత అసలు మనకు ఉందా ? నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను.
*****ఉద్యమం ముసుగులో ఎలాంటి వ్యక్తులు నాయకులు గా మారి రేపు మనల్ని ఉద్ధరించబోతున్నారో తేటతెల్లమైంది*****
నిజంగానే, ఎవరైనా ప్రజలకు మంచి చెయ్యడానికి రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఇప్పుడు ఉందా ?
ఐదేళ్లకోసారి వచ్చే బూటకపు ఎన్నికలు - అస్థిపంజరాలకు అందాల పోటీలేనా ?
ఈ నాలుగు మాటలూ రాసి సాధించేదేమీ లేదు.. ఎందుకంటే, మన కర్మ భూమిలో అందరూ కరక్టే. కాని నా బాధని వెళ్ళగక్కకుండా ఉండలేకపోయాను. దేవుడు కూడా మనల్ని కాపాడలేడేమో..

కాంగ్రెస్ నాయకుల పంచలు ఊడదీసి కొట్టమన్నాడు అప్పటి యువ రాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.
తెలంగాణా వల్లా ?
కాదు, ఎందుకంటే ఆ విషయం లో ఇప్పుడు వచ్చిన కొత్త క్లారిటీ ఏమీ లేదు గా..
సామాజిక న్యాయమా ?
రాష్ట్రం లో, ఒకటే కులాన్ని పట్టుకుని వేళ్ళాడుతున్న కాంగ్రెస్ ఇప్పుడు కొత్తగా ఇచ్చే న్యాయమేంటి..
మరి జగనా.. లేక స్థానిక ఎన్నికలా.. ?
నాకైతే, వీటన్నటికంటే, YSR , రోశయ్య పంచ కట్టుకోవడం వల్లే ఇన్నాళ్ళూ లేట్ అయిందని అనిపిస్తోంది. ఎందుకంటే, కాంగ్రెస్ నాయకుల పంచలు ఊడదీసి కొట్టమన్నాడు అప్పటి యువ రాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈ ఒక్క భయం/కారణం చాలదూ ఈ ఆలస్యానికి. అంటే, ఇప్పుడు స్టైల్ గా ప్యాంటు వేసుకునే కిరణ్ కి పర్వాలేదనే కదా అర్థం. (డి శ్రీనివాస్ సంగతంటారా.. ఆయన ఉన్నా లేనట్టే..)
ఈ విలీనం తో రాష్ట్రానికి కొత్తగా వచ్చేది.. పోయేది ఏమీ లేదు అని నా గట్టి అభిప్రాయం. కానీ "యూజ్ అండ్ త్రో" టైపు కాంగ్రెస్, చిరంజీవికి ఇచ్చిన రహస్య హామీలను నిలబెట్టుకుంటుందా ?
నగదు బదిలీ లా, అంత సులువుగా చిరూకి పడ్డ ఓట్లు (ముఖ్యంగా ఆయన సామాజిక వర్గానివి) కాంగ్రెస్ కి బదిలీ అవుతాయా ?
వేచి చూడాల్సిందే.
కానీ ఈ మొత్తం ఎపిసోడ్, ఏదో స్టార్ట్ అప్ కంపెనీ పెట్టి, కాస్త లాభాలో/నష్టాలో ఒచ్చిన వెంటనే ఓ బడా MNC కి అమ్మేసినట్టు అనిపిస్తోంది. మన రాష్ట్ర రాజకీయాల్లో ఇదో కొత్త ఒరవడి. దీన్ని "చిరు మార్గం" అని పిలుచుకోవచ్చు. మార్పో.. మార్పు అన్నాడు.. ఇప్పుడు ఏ చానెల్ చూసిన ఆయన అమ్మిన మార్పే కనిపిస్తోంది. పర్లేదు లెండి, మన జనాలు ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోరు.
అయినా రిమోట్ కి టీవీ ఎప్పుడూ లోకువే మరి.. (ఫ్లో లో వచ్చింది ఫాలో అయిపోవడమే .. )

8, మార్చి 2011, మంగళవారం
తెలుగు వాళ్ళ మందరమూ కలసి కట్టుగా వుంటే చక్కగా జీవిస్తామను సంగతి నేనెరిగిందే
తొలి నుంచి నాకుందొక
దురలవాటో సదలవాటో
అనుకున్నది అనుకున్న
ట్లనేయడం , రాయడమూ
అదే నేరమయితే నే
నందుకొప్పుకొంటున్నా
తెలుగు వాళ్ళ మందరమూ
కలసి కట్టుగా వుంటే చక్కగా
జీవిజీవిస్తామను సంగతిస్తామను సంగతి
నేనెరిగిందే
మీ దారిన మీరు పొండి
నా దారిని నాకు వదిలి
మీరట ప్రజలంటారు
నేనూ ప్రజలంటాను
మీ ప్రజకూ నా ప్రజకూ
పొంతన కుదరదు లెండి
చస్తున్న వ్యవస్త మీది
వస్తున్న చరిత్ర నాది
శవాదరణ మీ ధ్యేయం
శిశూదయం నా న్యాయం
విప్లవ ఝుంఝూనిలాలు
వీస్తున్న సంవత్సరాది నేడు
విప్లవ రణదుంధుభులు ధ్వ
నిస్తున్న శుభాళి నేడు
విగతాశులు ప్రగతిమార్గ
విరోధులకు సమాధి
విప్లవజన వాహినులు జ
యిస్తున్న ఉగాది
తెలుగువారి ధీశక్తి
తెలుగువారి క్రియా శక్తి
నలుదెసలా రహించాలి
తెలుగుతనం జయించాలి
ఐదు కోట్ల తెలుగు జాతి
హర్షించాలి
ఆనందం తెలుగునాట
వర్షించాలి
తెలుగువాడి తెలుగు ‘వాడి’
దీపించాలి
తెలుగునాట తెలుగుపాట
వ్యాపించాలి
తమ గమ్యం తెలుగువాళ్లు
చేరాలంతే
ఈ సంవత్సరవేళ నేను కోరేదింతే
దురలవాటో సదలవాటో
అనుకున్నది అనుకున్న
ట్లనేయడం , రాయడమూ
అదే నేరమయితే నే
నందుకొప్పుకొంటున్నా
తెలుగు వాళ్ళ మందరమూ
కలసి కట్టుగా వుంటే చక్కగా
జీవిజీవిస్తామను సంగతిస్తామను సంగతి
నేనెరిగిందే
మీ దారిన మీరు పొండి
నా దారిని నాకు వదిలి
మీరట ప్రజలంటారు
నేనూ ప్రజలంటాను
మీ ప్రజకూ నా ప్రజకూ
పొంతన కుదరదు లెండి
చస్తున్న వ్యవస్త మీది
వస్తున్న చరిత్ర నాది
శవాదరణ మీ ధ్యేయం
శిశూదయం నా న్యాయం
విప్లవ ఝుంఝూనిలాలు
వీస్తున్న సంవత్సరాది నేడు
విప్లవ రణదుంధుభులు ధ్వ
నిస్తున్న శుభాళి నేడు
విగతాశులు ప్రగతిమార్గ
విరోధులకు సమాధి
విప్లవజన వాహినులు జ
యిస్తున్న ఉగాది
తెలుగువారి ధీశక్తి
తెలుగువారి క్రియా శక్తి
నలుదెసలా రహించాలి
తెలుగుతనం జయించాలి
ఐదు కోట్ల తెలుగు జాతి
హర్షించాలి
ఆనందం తెలుగునాట
వర్షించాలి
తెలుగువాడి తెలుగు ‘వాడి’
దీపించాలి
తెలుగునాట తెలుగుపాట
వ్యాపించాలి
తమ గమ్యం తెలుగువాళ్లు
చేరాలంతే
ఈ సంవత్సరవేళ నేను కోరేదింతే
మహిళా బ్లాగ్మిత్రులందరికీ నూరవ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ....
ఈరోజు నూరవ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
అసలు ఇప్పటికైనా మహిళా దినోత్సవ ఉద్దేశ్యం నెరవేరిందా ?
మహిళా సమస్యలకు సరైన పరిష్కారాలు దొరికాయా ?
మహిళాభ్యుదయం నిజంగా జరిగిందా ?
మహిళలు చాలా రంగాల్లో పురోగమించిన మాట నిజమే ! అంత మాత్రం చేత తరతరాలుగా వున్న వారి సమస్యలు తీరిపోలేదు. వివక్షత సమసిపోలేదు. పైగా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి.
ప్రకృతిలో స్త్రీకి, పురుషుడికి భౌతికంగా భేదం చాలా స్వల్పం. అది కూడా వారి కర్తవ్య నిర్వహణ కోసం ఆ మాత్రం భేధమైనా వుంది. కానీ మనం ఒప్పుకోవాల్సింది మానవజాతి మనుగడలో ఇద్దరికీ సరి సమానమైన బాధ్యత వుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ అసలు మానవజాతి పుట్టుకలో మాత్రం స్త్రీ కొంచెం ఎక్కువ బాధ్యతనే మోస్తోంది. ఆ విషయంలో స్త్రీ ఏమాత్రం అలక్ష్యం, అశ్రద్ధ చూపినా అసలు మనిషి పుట్టుక సందేహమే !
అందుకే మనం స్త్రీని జగజ్జననిగా ఉన్నత స్థానాన్ని ఇచ్చి కొలుస్తాం. త్రిమూర్తులకంటే శక్తివంతమైనది ఆమె. అందుకే ఆమె మహాశక్తి స్వరూపిణి అయింది. ఆదిశక్తి అయింది. మూలపుటమ్మ అయింది.
దేవతగా స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలుస్తున్నాం. కానీ నిజ జీవితంలో ఆమెకు ఆ స్థానం ఇస్తున్నామా ?
పురాణాల్లోని మహిళలకు తమ భర్తల్ని తామే ఎంచుకునే హక్కు వుంది. కానీ నాగరికంగా ఇంతగా అభివృద్ధి చెందిందనుకుంటున్న ఈరోజుల్లో కూడా ఎంతమంది స్త్రీలు ఆ హక్కును అనుభవిస్తున్నారు ? ఒకవేళ ఎవరినైనా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్నా అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల అడ్డంకులు. ఇవన్నీ కష్టపడి దాటి ఎలాగో పెళ్ళిచేసుకున్నా తర్వాత వారి జీవితం సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతున్నదనుకోవడానికి వీలు లేదు.
అసలు స్త్రీల సమస్యలకు, వివక్షతకు పురుషులే కారణమా ? అని ఆలోచిస్తే నాణేనికి బొమ్మా బొరుసూ వున్నట్లు ఆడైనా, మగైనా మనుషులందరిలోనూ మంచి చెడూ వుంటాయి. భార్యను వేధించే మగవారున్నట్లే వారికి సహకరించే అత్తలు, ఆడపడచులు వున్నారు. అసహాయ స్త్రీలను చేరబట్టే పురుషులున్నట్లే వారిని వక్రమార్గాలు పట్టించే స్త్రీలున్నారు. నేరాలు ఘోరాలు కేవలం పురుషులకు మాత్రమే పరిమితం కాదు. స్త్రీలలో కూడా ఆ ప్రవృత్తి కలిగిన వారు వున్నారు. తమ కొడుకునో, సోదరుడినో తమకు కాకుండా చేస్తుందనే అబధ్రతా భావం మొదటి రకం వారి ప్రవర్తనకు కారణమైతే, డబ్బు వ్యామోహం రెండో రకం వారి, మానసిక బలహీనతలు, పుట్టి పెరిగిన నేపథ్యం మూడో రకానికి కారణమవుతాయి. ఇవన్నీ కాకుండా నిష్టూరమైనా ఒప్పుకోవాల్సిన విషయం ఆడవారిలో అసూయ ఎక్కువ అని. కారణాలేమైనా ఇవన్నీ ఆడవారిపట్ల శాపాలుగా మారాయి. కనుక ఈరకమైన స్త్రీలు తమ ఆలోచనలను, ప్రవర్తనను మార్చుకొని, సంఘటితమైతే వారిని ఏరకమైన వివక్షతా దరిచేరదు. ఎవరూ వారిని అణచలేరు.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)