బాలీవుడ్ ప్రముఖ గాయకుడు అద్నన్ సమీకు చేjavascript:void(0)దు అనుభవం ఎదురైంది. తాజాగా భారత్‌లోకి ప్రవేశించిన బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ కంపెనీ భారత అధికారిక దిగమతిదారు అయిన ఇన్ఫినిటీ కార్స్ కంపెనీ సమీను అవమానించింది. భారత్‌లో ఆస్టన్ మార్టిన్ కార్లను విడుదల చేసేందుకు ఇన్ఫినిటీ కార్స్ అద్నన్ సమీను ఆహ్వానించింది. అందుకు సమీకు రూ. 13.5 లక్షల రూపాయల చెక్‌ను అందజేసింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ.. అద్నన్ సమీతో ఒప్పందాన్ని ఇన్ఫినిటీ కార్స్ రద్దు చేసుకుంది. అంతేకాకుండా... చెక్‌ను స్టాప్ పేమెంట్ చేసింది. ఇలా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ఇన్ఫినిటీ కార్స్ సమీ ఓ మాట కూడ చెప్పలేదట.
ఇదిలా ఉంటే జేమ్స్ బాండ్ సినిమాల ద్వారా ప్రసిద్ధి చెందిన ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కార్లు నేడు భారత మార్కెట్లోకి విడుదలయ్యాయి. భారత్‌లో మొత్తం 10 బ్రాండ్‌లను కంపెనీ అందిస్తుంది. ప్రారంభ దశలో భాగంగా ప్రస్తుతం భారత మార్కెట్లో ఆస్టన్ మార్టిన్ కార్లు పూర్తిగా దిగమతి చేసుకున్న రూపంలో లభిస్తాయి. దేశీయ మార్కెట్లో వీటి ధరలు రూ. 1.35 కోట్ల నుంచి రూ. 20 వరకూ ఉన్నాయి. భారత్‌లో సిగ్నంట్ మినహా బేసిక్ మోడల్ అయిన వీ వ్యాంటేజ్ నుంటి ఆల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ కారు వన్-77 (రూ. 20 కోట్లు) మోడళ్లు లభిస్తాయని కంపెనీ వివరించింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి