మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికలలో కడప పార్లమెంటు స్థానం నుండి గెలిస్తే దేశంలోనే అత్యంత ధనవంతుడైన ఎంపీల జాబితాలో మొదటి స్థానంలో ఉంటారు. శుక్రవారం కడపలో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సమయంలో ఆయన తన ఆస్తుల వివరాలను తన అఫిడవిట్‌లో వెల్లడించారు. అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం జగన్ పేరు మీద ఉన్న ఆస్తి రూ.365 కోట్లుగా ఉంది. ఇక ఆయన భార్య భారతి పేరు మీద మరో 41.33 కోట్లు ఉన్నట్టుగా పేర్కొన్నారు. తనకు సొంత వాహనం లేదంటూ జగన్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
తన ఆస్తి వివిధ రూపాలలో ఉందని అందులో పేర్కొన్నారు. షేర్ల రూపంలోనే 359 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మిగిలినది అంతా గోల్డు, అగ్రికల్చర్ లాండ్, నాన్ అగ్రికల్చర్ లాండ్ తదితర రూపాలలో ఉందని ఆయా విలువలు పేర్కొన్నారు. జగన్ పేరు మీదు ఉన్న ఆస్తులు 365 కోట్లు 68 లక్షల 58వేల రూపాయలు. కాగా అఫిడవిట్ సమర్పించిన సమయంలో ఎన్నికల గుర్తుగా తనకు సీలింగ్ ఫ్యాన్, బ్రెష్, మంచంలలో ఏదైనా కేటాయించాలని జగన్ కోరారు.
తనకు ఎన్నికలలో కాగా దివంగత ముఖ్యమంత్రి వైjavascript:void(0)యస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాకముందు అంటే 2004కు ముందు జగన్ ఆస్తుల విలువ కేవలం 9.18 లక్షలు. ఆ తర్వాత 2009 ఎన్నికల వరకు జగన్ ఆస్తులు రూ.77.40 కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు తన అఫిడవిట్‌లో ఏకంగా కు పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు జగన్ ఉప పోరులో కడప నుండి గెలిస్తే దేశంలోనే అత్యంత కుబేరుడు అయిన ఎంపీలలో జగన్ మొదటి వాడు. రెండో స్థానంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు రెండో స్థానంలో ఉంటారు. ఆయన ఆస్తుల విలువ రూ. 173 కోట్లుగా ఉంది.
కాగా జగన్ ఆస్తులు వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అమాంతంగా పెరగడంపై విపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెసు పార్టీలోని వారు కూడా పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. వైయస్ ముఖ్యమంత్రి కాక ముందు ఇంటిని అమ్మకానికి పెట్టిన వైయస్ కుటుంబం ఇప్పుడు కోట్ల కొలది రూపాయలు ఎలా సంపాదించిందనే ఆరోపణలు చేశారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి