2, మార్చి 2011, బుధవారం

అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.---- మీ నాని

పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం.పరమ మంగళకరమైనది శివ స్వరూపం.ఆ పరమశివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహా శివరాత్రి.లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివరాత్రి వస్తుంది. రూపరహితుడైన శివుడు,జ్యోతి రూపంలో,లింగాకారంగా అవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అంటారు.


పరమశివుడు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా ఆలంకరింపబడతాడు. ఆ స్వరూపాలలో విభూతిధారణ ఒకటి. విభూతి అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలిన శు ద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు. రెండ వది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను. అందరు దేవతలలో ఫాల భాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే.

మూడవది పంచాక్షరి జపం. పంచాక్షరీ మంత్రోపదేశం లేని వారు శివ నామాం జపిస్తే చాలు. నాలుగవది మారేడు దళాలతో శివున్ని పూజించడం. శివునికి మూడు దళాలుంటాయి. అయిదవది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు.త్రయోదశి వాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష సమ యంలో శివస్మరణ, శివదర్శనం విధిగా చెయ్యాలి. వేదాలన్నింటకీి తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వ రుడు. ‘శివ’ శబ్దాన్ని దీర్ఘంతీస్తే ‘శివా’ ఆవుతుంది. అది అమ్మవారి పేరు ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. పార్వతీపరమేశ్వరులు, సూర్యుడు, అగ్ని ఈ మూడిం టిలోను శివుడుంటాడు. పరమ శాంతినిచ్చే ది శివనామస్మరణమే. శివస్మరణకు అందరూ అర్హలే. పరమ శివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిధి నక్షత్రాలలో ఏకాదశి. ఈ తిధి నెలలో రెండుసార్లు వస్తుంది.
ప్రతిమాసము ఏకాదశినాడు, శివుడు ఉపవాసాలతో వుండేవాడని, వేద పురాణాలలో చెప్పడం జరిగింది.అలాంటి ఏకాదశినాడు ప్రతి మానవుడు ఉపవాసము ఉండుటం వలన మహాశివరాత్రి రోజున కలిగేటటువంటి ఫలితాన్ని పొందు తారని, విభూతి, రుద్రాక్ష మహిమవలన మనకు సకల కోరికలు నెరవేరుతాయని పార్వతీదేశి కఠోరమైన తపస్సు ద్వారా తెలిపింది.ఆసమయంలోనే రాజమందిరంలో ిహమవంతుని కల్పిన సప్తఋషూలు పార్వతీపరమేశ్వరుల వివాహం లోక శుభకరమవుతుంద ని, వారి దాంపత్యం ముల్లోకాలకు ఆదర్శప్రాయమవుతుందని పలికి సం బంధం నిశ్చయించిన హిమవంతుని ప్రార్థన మేరకు వివాహ ముహూ ర్తాన్ని కూడా నిర్ణయించారు. ఆ సమయములో మొదటి మఘమాసంలో బహుళ చతుర్థశినాడు తొలిసారిగా లింగోద్భవం జరిగింది.

దానినే మహా శివరాత్రిగా లోకులు భావించారు.