10, మార్చి 2012, శనివారం

షడ్రషోపేతమైన బోజనంగా

అవినీతి ఆకలేసిన వాడికి
మా ఆయన లేదనకుండా పెట్టేవాడు
ఆ పుణ్యం ఊరికే పోలేదు
మా బాబుకి
షడ్రషోపేతమైన బోజనంగా
ప్రవాహంలా వచ్చేది
ప్రజల సొత్తు
ఆశీర్వాదపు అల్లుడికి కూడా
లోటు రానివ్వలేదు
మా ఆయన పధకాలు కొనసాగించండి
అడ్డు అనిపించినా వారి మంగళ సూత్రాలు తెంచండి
ఎలా భొంచేస్తున్నారో చూడండి అని దిష్టి పెట్టిన వారి పై దాడి చెయ్యండి
మా భోజనాలకు లోటు రాకుండా చూసిన వారిని
చంచల్ గూడ జైలు లో చూస్తుంటే గుండె చెరువవుతోంది
వాళ్ళు లేక బోజన వేళలు తెలియడం లేదు
వాళ్ళను విడిపించి మా బాబు ను
ప్రపంచ వాణిజ్య వేత్తల సరసన చేర్చండి

ఆయన సేవకు ఓ ద్వీపాన్ని రాసిచ్చేసారు

బ్రాందీ దుకాణాలు వున్నా
గాంధీ భవన్ రాజైన
సత్తి కూడా ఓ సిండి’కేటు’
అని ఆరోపణ వస్తూనే
దర్యాప్తు జరపండి అని
దబాయించాడు

అబ్కారీ శాఖామాత్యుడికే
సిండి’కేట్ల’ తరపున
ఆమ్యామ్యాలు ఇచ్చానని
వినిపించిన సాక్ష్యం పై
బడుగు జీవులకే ఈ బాధలన్నీ అంటూ
అయినా నిరూపించండి అని
ఆ అమాత్యుని దబాయింపు

సేవకుడుగా అవతారమెత్తినా
మొత్తిన జనానికి జలక్ ఇచ్చి
జంప్ చేసి తనతో పాటు పార్టీని
ముంచేసిన ఆయన సేవకు
వెండి దీపం కానుకగా ఇచ్చినట్టు
ఓ ద్వీపాన్ని రాసిచ్చేసారు
అని వినవచ్చిన ఆరోపణలకు
తేలుకుట్టిన దొంగకు మల్లే వుండడం
ఆరోపణలు నిజమనా లేక
అనవసరంగా సభా సమయంలో
సమస్యలు తెచ్చుకోవడం ఎందుకని
ప్రజా సంపదల ‘సేవకుడు’ అనుకొన్నాడో
అర్ధం కావడం లేదు