25, డిసెంబర్ 2010, శనివారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు

కొత్త ఆశయాలకు కొత్త భావాలకు
పరికల్పనలు బంగారు కలలకు
కొన్ని సత్యాలకు, స్నేహ బంధాలకు
త్యాగాలకు రాగాలకు
ఆత్మీయానుబంధాలకు స్వాగతం! సుస్వాగతం!!
2011 నీకు ఘన స్వాగతం
పరిగెడుతున్న కాలం పురివిప్పింది నెమలిలా
వేయి వీణలను మీటి నవ వసంత, సలలిత రాగసుధా గానాన్ని
వినిపించి వీనుల విందు చేసింది
నవ జ్యోతులను వెలిగించింది
ప్రతి అణువు పులకించింది
ప్రతి గుండె ఆనందంతో పరవశించింది
జగతిన క్రొత్త సంవత్సరం మెరిసింది
విశ్వవేధికపై మధువసంతం మురిసింది
జీవితాలకు క్రొత్త ఊపిరి పోసింది
2011లోనైనా మానవతకు విలువ ఉంటుందని ఆశిద్దాం
జాతి, మత, భాషా ప్రాంతీయ భేదాలు విడనాడి
విశ్వశాంతికై ఐక్యతాగీతాన్ని పాడుకుందాం.

సంతోషకరమైన క్రిస్ఠ్మస్ !

ఏమండీ
మీరు ఏలా ఉన్నారు ?
చాలా కాలమైంది మిమ్మల్ని చూసి !
మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది
మీకు సంతోషకరమైన క్రిస్ఠ్మస్
ధన్యవాదములు

8, డిసెంబర్ 2010, బుధవారం

నా తొలి బుల్లి కవిత్వం – ఓ మనసు తత్వం !

మదిలొ మెదిలే ఆలొచనలకు మనసుని మాటలుగా, భావాన్ని అక్షరాలుగా మార్చాలనే పోరాట పటిమతొ “కవిత్వం” అనే సాగరం లొ ఒక చినుకుగా ప్రవహించాలని ఆశతొ ఈ నా తొలి బుల్లి కవిత్వం(?)

పెదవి పలకని మాటలెన్నో, మాటకు అందని మౌనాలెన్నో

ఊహకు అందని ఊసులెన్నో,బాషకు అందని భావాలెన్నో

సమయం సరిపోని స్వప్నాలెన్నో, తనువు గుర్తించని స్పర్శలెన్నో

చూపులకు తెలియని అందాలెన్నో, మంతనాలు సాగని రోజులెన్నో

గుండె దాటని తలపులెన్నొ,గుప్పిట్లొ దాచలేని వన్నెలెన్నో

వయసుకు అందని కోరికలెన్నొ, వర్ణనకు అందని సొగసులెన్నో

దాచకుండ ఉంచని తీపి గుర్తులెన్నో, పాటకు అందని రాగాలెన్నో

కలుపు ఎరుగని వలపులెన్నొ, పంచుకోలేని అనుభవాలెన్నో

వ్యక్తపరచని అనుభూతులెన్నో, ఎన్నెన్నో.. మరెన్నో…!!!

శ్రమజీవికి ఉన్న ప్రాధాన్యత

ఎవడు ఇక్కడ రైతు
ఎవడు ఇక్కడ రాజు
కష్టించు వారొకరు
కాజేయు వారొకరు

నారపరెడ్డి రామిరెడ్డి

ప్రతి చేయి నమస్కరిస్తుంది
అయితే ఆ మనస్సులలో
మనస్సులేదు
ఆ చేతులకది
అలవాటయిందీ
సిగ్నల్‌ రెక్కల వలె”