20, జనవరి 2011, గురువారం

నాకు పదవే ముఖ్యం

48 గంటల తరువాత దీక్ష చేస్తే
శరీరంలో ఏ అవయమూ తిప్పలేము
అందుకోసం దీక్ష ఎందుకు దండగ
మడమ తిప్పేది లేదు అనే పదాన్ని
పద్దతిగా అర్థం చేసుకొంటే సరి

ఎన్ని రోజులు బతికామని కాదు
ఎలా బతికామన్నది ముఖ్యం
అందుకోసమే ముఖ్యమంత్రి సీటును
బతికి సాధించాలి
దీక్షలు పొగిడించి టపా కట్టి కాదు.

డబ్బెవడికి చేదు అన్నదే
నా ఆశయానికి ఆయువు పట్టు
అది మా నాన్న జమానా నుండి
ఒడిసిపట్టినాను కాబట్టే
ఈ రోజు పెట్టుబడి పెట్టగలుగుతున్నా
నా కోసం జనాలను రప్పించగలుగుతున్నా
జన నాయకులచే
నాకు దక్కని కుర్చీ నాయకుణ్ణి
నిద్రలేకుండా చేయగలుగుతున్నా
అర్థం చేసుకొంటే మంచిది
ఆలస్యం చేసే కొద్దీ నా అసహనం పెరుగుతుంది
ఆ తదుపరి అధిష్టానం కూడా ఆపలేందు.

నిజంగా రైతులకోసం ఎవరు పోరాడినా మద్దతివ్వాలి
కానీ ఆ పోరాటంలో ఎవడు కుర్చీకి దగ్గర అయినా నేను సహించ
ఆ పోరాటాన్ని పొట్టనింపు కొంటూ చేస్తున్నారని ప్రాపగాండా చేస్తా
దీనితో రైతు సమస్యలు పలుచనైనా పరవాలేదు
నాకు పదవే ముఖ్యం.

నాది 2 రోజుల దీక్షే – 2

లక్ష మందితో చేపట్టే నా దీక్ష లక్ష్యం
ఒక ధపా పార్టీ అధికారం లోకి వస్తే
ఒక ఏడాది సరిపోయే రాష్ట్ర బడ్జెట్ సంపద
నా కుటుంబ పరం అవ్వాలి
నా చెయ్యి నొప్పెట్టే వరకు చెయ్యి ఊపుకోనివ్వాలి
ట్రాఫిక్ జాం అయ్యి నిదానంగా మా నాన్న విగ్రహాలు
చూస్తూ వెళ్ళేన్ని విగ్రహాలు పెట్టనివ్వాలి
మా మావయ్యకు మిక్సేసెంత ఎరువు కేటాయించాలి
మతపరంగా వచ్చే డబ్బులు మా బావకే రావాలి
ప్రస్తుతానికి ఈ 48 గంటలకు ఇవే
ఇవీ కాదని మొండికేస్తే
పవరును దూరం చేస్తా
నా మీడియాతో పరువు తీసేస్తా
నాకు సిగ్గు పడే అలావాటు లేకున్నా సిగ్గు పడి
నేను సిగ్గుపడుతున్నానని ప్రజలకు చెబుతా
ప్రక్క రాష్ట్రం లో నా కోట ఉన్నా
ఈ రాష్ట్రం లో ఉన్నందుకు బాధపడుతున్నా అని చెబుతా

అయ్య హయాంలో

అయ్య హయాంలో
హలంతో దున్నేవాడు
ఆత్మ హత్యలు చేసుకొంటుంటే
లక్ష కోట్ల దీక్షలో ఉన్నందువల్ల
లక్ష దీక్ష కు నదీ తీరాన గుడారం వేయలేదు

హస్తిన వారి అభయ హస్తపు హవాతో
జల యజ్ఞపు ధనాన్ని జలగలా పీల్చే దీక్ష లో ఉన్నందువల్ల
హస్తినలో జల దీక్ష చెయ్యాలనిపించలేదు

నాన్న హయాములో పెట్రోలు ధరలు పెంచినప్పుడు
ప్రజా ధనం కోసం పెట్రేగిపోయ్యే దీక్షలో ఉన్నందువల్ల
విశాఖ తీరాన జన దీక్ష చెయ్యాలనిపించలేదు

జనం డబ్బు సాక్షిగా
హస్తిన జేజమ్మ భయపడి
రాష్ట్రంలో కుర్చీ పై కూర్చో పెట్టే వరకు
లేదంటే జనం అయ్యకు ఏమారినట్టు ఏమారే వరకు
అదీ కాదంటే కాంగ్రెస్ కు కుర్చీ దూరమయ్యే వరకు
ఇక ఒకటే దీక్షలు

మొండి చేయి

ఆత్మ హత్యలు చేసుకొనే రైతుల శవాలపై చల్లడానికి
అత్తరును కూడా అధిష్టానాన్ని అడగలేరు
రైల్వే కేటాయింపులు గురించి
కేంద్రాన్ని అడుగుతారనే ఆశలేదు
ప్రాజెక్టులకు జాతీయ హోదా తెచ్చేంత హోదా లేదు
విపత్తులు వస్తే నిధుల గురించి వీరు చెబితే
వినే నాధుడు కూడా ఉండడని తెలుసు
సాటి ప్రజా ప్రతినిధులని కూడా చూడకుండా
సన్నాసులు దద్దమ్మలు అని అంటుంటే కూడా
ఉలుకూ పలుకు ఉండదు
అటువంటి వారు ఓ రెండు వారాలుగా
ఒకోడి ఇంట్లో ఒకో రోజు పకోడీ సమావేశం పెట్టుకొని
ఆవేశాల హడావిడి చేసి
అమ్మ దయ తలచితే
మేము చెయ్యి చాపి అందుకొంటామని
నోరు కూడా జారారు
ఇప్పుడు తీరా కేంద్ర మంత్రి వర్గ కేటాయింపుల్లో
బోర్లా పడి ‘మొండి చేయి’ చూసారు.