17, మే 2011, మంగళవారం

వైయస్ జగన్‌ను ఎదుర్కోగలరా?

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోగలరా అనే అనుమానం కలుగుతోంది. వైయస్ జగన్ కాంగ్రెసుపైనా తెలుగుదేశం పైనా ప్రతీకారం తీర్చుకుని, తాను అధికారంలోకి రావడానికి ఎంత శ్రమకైనా ఓర్చుకునేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. ప్రజల్లోకి వివిధ రూపాల్లో విస్తృతంగా వెళ్లడానికి ఆయన సిద్ధపడ్డారు. కడప ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన దాదాపు నెల రోజుల పాటు తెంపు లేకుండా తిరిగారు. తాను ఎలాగూ గెలుస్తాననే అతి విశ్వాసంతో గానీ ఇతర పార్టీల బలహీనత తనను గెలిపిస్తుందనే నమ్మకంతో గానీ నిర్లక్ష్యం చేయకుండా తిరిగారు.

ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన రైతు సమస్యలపై గుంటూరులో 48 గంటల పాటు దీక్షకు దిగారు. వైయస్ జగన్ తన దీక్ష విషయాన్ని ప్రకటించగానే చంద్రబాబు గుంటూరు జిల్లాలో రైతు సమస్యలపై పర్యటించారు. జగన్ దీక్ష ముందు అది పని చేసే పరిస్థితి లేదని అర్థమవుతోంది. శారీరక శక్తితో పాటు లక్ష్య సాధన పట్ల దీక్ష ఆయనను ముందుకు నడిపిస్తోంది. ఆ శక్తి అటు కిరణ్ కుమార్ రెడ్డికి గానీ ఇటు చంద్రబాబుకి గానీ ఉన్నట్లు లేదు. జగన్‌లాంటి పట్టుదల, వయస్సు గల నాయకుడు మాత్రమే అయనకు దీటు రాగలడని అనిపిస్తోంది.

గుంటూరు రైతు దీక్ష తర్వాత జగన్ విజయనగరం జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. ప్రజల్లోకి వెళ్లే విషయంలో జగన్ ఎక్కడా విరామం ఇవ్వడం లేదు. అలా విరామం లేకండా చేపడుతున్న కార్యక్రమాల వల్ల కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కంగు తినే పరిస్థితే ఉంది. జగన్ ప్రాబల్యం క్రమక్రమంగా తగ్గుతుందనే నమ్మకంతో తెలుగుదేశం, కాంగ్రెసు నాయకులు ఉన్నట్లున్నారు. కానీ, ఆ ప్రాబల్యం, ఆదరణ తగ్గకుండా ఆయన కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు.

బాబాయ్ బాలయ్యను కాదని జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ వ్యూహం

బాబాయ్ బాలకృష్ణకు, అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య సంబంధాలు బెడిసికొట్టినట్లే భావిస్తున్నాయి. సోదరుడు నందమూరి హరికృష్ణ కూడా బాలయ్యకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెబుతున్నారు. బాలయ్యను పక్కన పెట్టి ఆయన తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌తో రాజకీయ వ్యూహ రచనకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వ పగ్గాలు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్‌కు దక్కకుండా అడ్డు పడడమే ప్రస్తుతం నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అనుసరిస్తున్న వ్యూహమని అంటున్నారు.

నారా చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించే స్థితిలో బాలకృష్ణ లేరనే విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ గుర్తించారు. గతంలో బాలకృష్ణ చేసిన ఓ వ్యాఖ్యపై కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఓ సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రలో కనిపించాల్సి ఉంది. అయితే, ఆ పాత్ర నుంచి బాలయ్యను తప్పించి హరికృష్ణ నటించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ వారసత్వ పోరులో నందమూరి కుటుంబ సభ్యులు రెండుగా చీలిపోయినట్లు సమాచారం. ఈ చీలికలో బాలకృష్ణ చంద్రబాబు వైపు ఉండగా, చంద్రబాబుపై పోరుకు జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ సిద్దపడినట్లు చెబుతున్నారు.

పాపం రెడ్డి గారి అబ్బాయి రైతు కోసం దీక్షలు

గతించిన రెడ్డి గారు ఇచ్చిన ఉచిత కరెంటుతో
కాయ కష్టం చేసుకొంటూ
సుఖంగా ఉన్నారు కదూ?
లేదు మీరు సుఖంగా లేరు
ఉంటే రెడ్డి గారు కొడుకు దీక్ష ల మీద దీక్ష లు చేసి
కడుపు మాడ్చుకొంటాడా?
మీ కోసం కేవలం మీ కోసం
రెడ్డి గారి శవం ఇల్లు చేరకముందు నుండే
స్వయంగా తనే రెడ్డిగారిలా
మీ మంచి చెడ్డలు చూసుకోవడం కోసం
కుర్చీ గురించి బెంగపడి సంతకాలు పెట్టిస్తే
అర్థం చేసుకోక అపార్థం చేసుకొని
అయ్యో నాన్న శవం రాకనే
పదవి కోసం పాకులాడెనే అనే ప్రచారం చేసారు.
పాపం రెడ్డి గారి అబ్బాయి అసుమంటోడంటే
నమ్మేస్తారా నమ్మకండి?
వాళ్ళ నాన్న జమానాలో కూడా మీ కష్టాలు చూడలేకే
తీరం వెంబడి ప్రభుత్వ ఆధ్వర్యాన స్వాధీనం చేసుకొంది.
లేదంటే మీరు సేద్యం సేద్యం అంటూ స్వేదం చిందిస్తారనే
సెజ్జులు పెద్ద పెద్ద స్టీలు ఫ్యాక్టరీలు అని అబద్దం చెప్పి
ప్రభుత్వ పరిహారాలు ఇప్పించి స్వాదీనాలు చేయించింది.
వారసత్వంగా రావాల్సి తప్పి పోయిన కుర్చీ మీద
కూర్చేబెట్టే వరకు తన బెట్టు వదలడు
మీ కోసం కేవలం మీసం రైతుగారు
వచ్చి పరామర్శించి పదవి వచ్చే లా చేయండి.

లబ లబ లాడుతారో ??

ఎప్పటి నుండో అట్టిపెట్టుకొన్న కానుక
ఫలితాలు ప్రకటించే వేళ
ప్రజలందరికీ సమర్పించారు.
అదే ‘చమురు ధరలు’
ఛీ ఛీ అనుకొంటారో
లబ లబ లాడుతారో
మీ ఇష్టం అంటూ
ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత
తమ తలకు చమురంటిన చందం మాత్రం
మీకు కోపం తెప్పించినా ఎవరూ ఏమీ చేయలేరు?
ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో చేతి నుండి పవరు పోయినా
కేంద్రంలో విశ్వాస పాత్రమైన దర్యాప్తు సంస్థలను
చెప్పు చేతల బట్టి
చెయ్యి ప్రధాన కుర్చీని పట్టి ఉంచుకొంటుంది.
ఊసురో మనే ప్రతిపక్షాలు ఉన్నంత కాలం
వాళ్ళు తమ కర్తవ్యమ్ చెయ్యలేదని విమర్శించే మన లాంటి వాళ్ళు
ఉన్నంత కాలం ఈ కాలం ఇలా చేతికి కలిసి పోతూ ఉంటుంది