30, ఏప్రిల్ 2011, శనివారం

చిరంజీవి వైయస్ జగన్ పై దూకుడు

కాంగ్రెసులో తన పార్టీని విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిలో ఆత్మ విశ్వాసం పెరిగినట్లు కనిపిస్తోంది. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో అపజయం పాలైన తర్వాత అంతగా ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించలేకపోయారు. అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆయనలో ఆత్మవిశ్వాసం కొరవడినట్లు కనిపిస్తూ వచ్చారు. పార్టీని స్థాపించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడానికి వెనకాడారు. కాంగ్రెసులో పార్టీని విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన కడప, పులివెందుల ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెసు పార్టీకి స్టార్ కాంపెయినర్ అయ్యారు.


ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన దూకుడును ప్రదర్శించారు. తన సహజశైలికి భిన్నంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్‌పై, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజానికి, ఇప్పటి వరకు ఇతర పార్టీల నాయకులు చేసే విమర్శలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో చిరంజీవి ఉండేవారు. ఇప్పుడు ఆయన ఎదురు దాడికి దిగారు. ఆ ఎదురు దాడిని చూస్తుంటే ఆయనకు కాంగ్రెసు నాయకత్వం బలమైన విశ్వాసాన్నే కల్పించినట్లు చెప్పవచ్చు.

వైయస్ జగన్ అక్రమాస్తుల గురించి ఆయన తన ప్రచారంలో ప్రశ్నించారు. జగన్ అహంకారం వల్ల, అధికార దాహం వల్లనే ఈ ఉప ఎన్నికలు వచ్చాయని విమర్సించారు. చంద్రబాబుపై గతంలో ఎన్నడూ లేని విధంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు కాంగ్రెసు పార్టీలోకి రావాల్సి వస్తుందని, తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ఆధిపత్యం పెరిగితే అది చంద్రబాబుకు తప్పదని, చంద్రబాబు కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చిరంజీవికి పడని విషయం. కానీ, ఆయన ప్రత్యర్థులను ఎదుర్కుని, కాంగ్రెసులో తానే సరైన నాయకుడిని అని చాటుకోవడానికి అది తప్పడం లేదని అంటున్నారు.

పనిలో పనిగా ఆయన తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలని నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి తాము మద్దతు ఇవ్వాలని అనుకున్నామని, అది విలీనం దాకా సాగిందని ఆయన చెప్పుకున్నారు. చిరంజీవి చుట్టూ కాంగ్రెసు నాయకులు దడి కట్టడం కూడా ప్రచారంలో గమనించవచ్చు. అంత మంది తన వెంట వస్తున్నారనే భావన కూడా ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఉంటుంది

సాలార్ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ కోటలో సంచలన సంఘటన జరిగింది.

సాలార్ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ కోటలో సంచలన సంఘటన జరిగింది. హైదరాబాద్ పాతబస్తీలో ఓవైసీ కుటుంబానికి ఎదురు లేదని భావిస్తూ వస్తున్న నేపథ్యంలో శానససభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీపై దాడి జరిగింది. ఇది మామూలు దాడి కాదు. దాడిలో అక్బరుద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు. సాలార్ సుల్తాన్ సలావుద్దీన్‌కు పాతబస్తీ పెట్టని కోటగా ఉంటూ వస్తోంది. ఆయనను ఎదుర్కోవడానికి ప్రత్యర్థులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. సలావుద్దీన్ వరుసగా ఆరు సార్లు హైదరాబాద్ లోకసభ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. సాలార్ మజ్లీస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం)కు నాయకత్వం వహిస్తూ వచ్చారు. దాన్నే మజ్లీస్ పార్టీగా వ్యవహరిస్తారు.


సాలార్ మరణం తర్వాత మజ్లీస్‌కు ఆయన ఇద్దరు కుమారులు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వం వహిస్తూ వస్తున్నారు. తండ్రికి దీటుగా పాతబస్తీలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. అక్బరుద్దీన్ చాంద్రాయణగుట్ట నుంచి శాసనసభకు ఎన్నికై మజ్లీస్ శాసనసభా పక్ష నేతగా వ్యవహరిస్తుండగా, అసదుద్దీన్ హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సాలార్ - ఎ - మిలెట్‌ (సామాజిక వర్గం కమాండర్)గా సలావుద్దీన్‌ను వ్యవహరించేవారు. చిన్నగా ఆయనను సాలార్‌గా వ్యవహరించేవారు. సాలార్ పేరు చెప్తే ప్రత్యర్థులకు గుండె దడ. ఆయన 2008 సెప్టెంబర్ 29వ తేదీన మరణించారు.

నిజానికి, అఖిల భారత మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నైజాం జమానాలో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న హైదరాబాద్ రాజ్యంవారిని ఎదుర్కోవడానికి ముందుకు వచ్చింది. దాని కార్యకర్తలను రజాకార్లుగా పిలిచే వారు. దానికి కాశిం రజ్వీ నాయకత్వం వహించేవాడు. తెలంగాణ పల్లెల్లో కాశిం రజ్వీ ఆగడాలకు అంతులేదు. హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైన తర్వాత ఆ పార్టీకి సాలార్ నాయకత్వం వహిస్తూ వచ్చారు. దాన్ని ఎన్నికల బరిలోకి దింపి నైజాం రాజధాని హైదరాబాద్ పాతబస్తీలో పట్టు సాధించారు. ముస్లింలకు ఏకైక ప్రతినిధిగా చెలామణి అవుతూ వచ్చారు.

సాలార్‌ను ఎదుర్కోవడానికి అప్పటి బిజెపి నాయకుడు ఎ. నరేంద్ర తీవ్రంగా ప్రయత్నించారు. ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. నరేంద్ర అందుకు గాను టైగర్‌గా పేరు సంపాదించుకున్నాడు. సిపిఎం కూడా పాతబస్తీలో పాగా వేయడానికి ప్రయత్నించింది. బిజెపి ఒక్కప్పుడు పాతబస్తీలో బలంగా ఉండేది. బద్దం బాల్ రెడ్డి వంటి బిజెపి నాయకులు ఎప్పటికప్పుడు సాలార్‌కు సవాల్ విసురుతూ వచ్చారు. కానీ క్రమంగా బిజెపి వెనక్కి తగ్గుతూ వచ్చింది. పాతబస్తీ నుంచి దాని మద్దతుదారులు కొత్త నగరానికి వలసలు పెరగడం కూడా అందుకు ఓ కారణం. కాగా, సాలార్‌కు అత్యంత సన్నిహితుడైన అమానుల్లా ఖాన్ ఆ తర్వాత విభేదించి ఎంబిటిని స్థాపించాడు. మజ్లీస్‌కు దీటుగా దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ, ఫలితం అంతంత మాత్రంగానే సాధించాడు. ఇప్పటికీ ఆ పార్టీ కొనసాగుతోంది. మజ్లీస్‌ను వ్యతిరేకించేవారు పాతబస్తీలో ఎంబిటి వైపు ఉండడం సాధారణ విషయంగా మారింది.

సాలార్ మృతి తర్వాత ఆయన కుమారులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ పాలక పార్టీకి దగ్గరగా ఉంటూ తమ పనులు చేయించుకుంటూ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నారు. పాలక పార్టీలకు దగ్గరగా ఉంటూ మరో పార్టీ పాతబస్తీలో పట్టు సాధించకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. ఇదే సమయంలో విద్యా సంస్థలను, ఆస్పత్రులను, ఇతర సంస్థలను స్థాపించి ఓవైసీ కుటుంబం ఆర్థికంగా కూడా పటిష్టంగా మారుతూ వచ్చింది. ఈ స్థితిలో అక్బరుద్దీన్‌పై దాడి జరగడం ఓవైసీ కుటుంబానికి రాజకీయంగా సవాల్ లాంటిదే.

29, ఏప్రిల్ 2011, శుక్రవారం

జగన్ ఆధిక్యతపై బెట్టింగులు ఐపిఎల్‌ను కూడా మించి పోయేలా ఉన్నాయంట.

కడప, పులివెందుల ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులపై భారీగా బెట్టింగులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కడప బరిలో జగనే పందెం కోడిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కడప నుండి పోటీ చేస్తున్న జగన్, డిఎల్ రవీంద్రారెడ్డి, మైసూరారెడ్డి, పులివెందుల నుండి పోటీ చేస్తున్న విజయమ్మ, వైయస్ వివేకానందరెడ్డి, బిటెక్ రవిలపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కడప బరి నుండి జగన్ గెలిస్తాడనే దానికంటే ఆయన ఆధిక్యత(మెజార్టీ) పైనే జోరుగా బెట్టింగులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.


జగన్ ఆధిక్యతపై బెట్టింగులు ఐపిఎల్‌ను కూడా మించి పోయేలా ఉన్నాయంట. ఐపిఎల్ మ్యాచ్‌లపై కూడా ఇంతలా బెట్టింగులు జరగడం లేదంట! బెట్టింగులు కేవలం రాయలసీమ ప్రాంతానికే పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశంలో కూడా జగన్ ఆధిక్యతపై జోరుగానే బెట్టింగులు సాగుతున్నాయంట. జగన్ 2 లక్షల ఆధిక్యం సాధిస్తే, ఇంత, మూడు లక్షల ఆధిక్యం సాధిస్తే ఇంత అని బెట్టింగులు కాస్తున్నారంట.

జగన్ లక్ష మెజార్టీతో గెలిస్తే లక్షకు రెండు లక్షల రూపాయలు, కోటికి రెండు కోట్ల రూపాయల తీరులో బెట్టింగులు సాగుతున్నాయని తెలుస్తోంది. జగన్‌పై బెట్టింగులు ఇలా ఉంటే ఇక తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ పైన కూడా బెట్టింగులు జరుగుతున్నాయంట. అయితే ఈ రెండు పార్టీలలో ఏది రెండవ ప్లేసులో ఉంటుందనే విషయంపై బెట్టింగులు జరుగుతున్నాయంట. దీంతో బెట్టింగకు పాల్పడుతున్న వారికి జగన్ గెలుపుపై గట్టి ధీమా ఉండటంతో పాటు, కాంగ్రెసు, టిడిపిలు గెలవడం కష్టమనే భావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

జగన్ బిజెపి ??

మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డికి భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా మద్దతు ఇస్తుందనే వాదనలు ఇటీవల బలంగా వినిపిస్తున్నాయి. ఇటు జగన్, అటు బిజెపి తమ అంతర్గత మద్దతు విషయంపై ఖండించినప్పటికీ దానిని ఎవరూ నమ్మె స్థితిలో కనిపించడం లేదు. అందుకు పలు కారణాలు మనకు కనిపిస్తున్నాయి. అదే సమయంలో జగన్ పార్టీ నేతలు చేస్తున్న కాంగ్రెసు, టిడిపి కలిసి పోయాయన్న మాటలు కూడా ఎవరూ నమ్మినట్లుగా కనిపించడం లేదు. కేవలం ఉప ఎన్నికలలో ఆ రెండు పార్టీలు కలిసి పోయాయని చెప్పి ప్రజల సానుభూతి పొందాలని జగన్ చూస్తున్నట్టుగా పలువురు భావిస్తున్నారు. ఇటు తండ్రి మరణించడం, కాంగ్రెసు పార్టీ నుండి బయటకు రావడం వంటి పలు సానుభూతిలతో పాటు కాంగ్రెసు, టిడిపి కలిసి పోయాయని చెబితే తనకు మరింత సానుభూతి వస్తుందని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన ఆ పార్టీలపై ఆరోపణలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో జగన్, బిజెపి అంతర్గత మద్దతు తెరపైకి రావడంతో ఆయన గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.


రెండు నెలల క్రితమే జగన్ బిజెపి జాతీయ నేతలను కలిసినట్లుగా పలువురు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెసు, టిడిపి పార్టీ నేతలే కాకుండా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కూడా బిజెపి జాతీయ నాయకులను జగన్ రెండు నెలల క్రితం కలిశారని శుక్రవారం కడపలో చెప్పారు. బిజెపి నేతలతో కలిసినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని జగన్ సమర్థవంతంగా తిప్పి కొట్టలేక పోతున్నారు. దీంతో జగన్ ఆ నాయకులను కలిసినట్లుగా స్పష్టమవుతోందని కొందరు భావిస్తున్నారు. బిజెపితో కలవడం అనే విషయంపై జగన్ మరో తప్పిదం చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. బిజెపితో కలవనే కలవనని చెబుతూ ఒకవేళ కలిస్తే కనుక ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్‌లు కోరతానని చెప్పారు. దానిపై వెంటనే వివాదం చెలరేగడంతో సాయంత్రానికి మాట మార్చారు. తాను అలాంటి వ్యాఖ్యలే చేయలేదని చెప్పారు. ఆ తర్వాత శుక్రవారం జగన్‌కు చెందిన సాక్షి పత్రికలోనే జగన్ తాను బిజెపితో కలవనని చెప్పడానికే ఆ వ్యాఖ్యల చేశారంటూ వార్తను ప్రచురించారు. అంటే ఏది నిజం. ఇలాంటి అస్పష్ట వ్యాఖ్యల ద్వారా బిజెపితో అంతర్గతంగా పొత్తు కుదిరిందని చెప్పకనే చెప్పారు.

ఇక కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డితో జగన్ సంబంధాలు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. పార్టీలు వేరైనప్పటికీ గతంలో కూడా ఇరువురు కలిసి పని చేసిన సందర్భాలు ఉన్నాయనే వార్తలు కూడా వచ్చాయి. సాక్షాత్తూ కాంగ్రెసు నేత అయిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కర్ణాటకలో గాలి తరఫున బిజెపికి ఓటు వేయాలని ప్రచారం చేసినట్టు అప్పట్లో వివాదం చెలరేగింది. ఇప్పుడు కూడా జగన్ ఉప ఎన్నికలలో ఖచ్చితంగా భారీ ఆధిక్యంతో గెలుస్తాడని గాలి ఇటీవల అన్నట్లుగా తెలుస్తోంది. ఇక జగన్ సంగతి ఇలా ఉంటే బిజెపి కూడా జగన్‌కు మద్దతు పలుకుతుందని చెప్పడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఇటీవల బిజెపి - జగన్ మద్దతుపై పిసిసి చీఫ్ డిఎస్ వ్యాఖ్యలు చేస్తే జగన్ కంటే ముందుగానే బిజెపి స్పందించడం గమనార్హం. తమ మధ్య అవగాహన లేదని చెప్పడం కంటే ముందుగా తమను మైనార్టీ వ్యతిరేకులుగా పేర్కొన్న దానికి సమాధానం చెప్పాలి. కానీ బిజెపి తమను మైనార్టీ వ్యతిరేకులుగా చూపిస్తున్నారనే వ్యాఖ్యలపై స్పందించకుండా జగన్‌తో సంబంధాలు లేవని చెప్పడానికే ప్రాధాన్యత ఇవ్వడం ఎంత విడ్డూరం. తమను మైనార్టీ వ్యతిరేకులుకు సృష్టిస్తున్న వారిపై విరుచుకు పడకుండా జగన్‌తో సంబంధాలు లేవని చెప్పి ఆయనకు అంతర్గత మద్దతు ఉందని చెప్పకనే చెప్పినట్టుగా పలువురు భావిస్తున్నారు.

ఇక మరో విషయం ఉప ఎన్నికలలో అభ్యర్థిని బరిలో నిలపక పోవడం, అందుకు బలం లేదని కారణం చెప్పడం మరింత విచారకరం. గత సాధారణ ఎన్నికల్లో తమకు బలం లేదనే విషయం బిజెపికి తెలియదా. మరి అప్పుడు కడప పార్లమెంటు నుండి ఎందుకు పోటీ చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కడపలో వైయస్‌ను తట్టుకోవడానికి హేమాహేమీలైన పార్టీలో ఆలోచిస్తున్న సమయంలో బిజెపి 2009లో కడప నుండి అభ్యర్థిగా బరిలో దింపిందని సమాచారం. అంతేకాదు గతంలో నంద్యాల నుండి పోటీ చేసిన పివి నరసింహారావుపై ఏ పార్టీ పోటీ చేయనప్పటికీ బిజెపి బరిలోకి దించింది. అప్పటికి బిజెపికి రాష్ట్రంలో అసలు ఇప్పుడున్న ప్రాధాన్యత కూడా లేదంట. మరి ఎందుకు బరిలోకి దింపింది. అంటే సమాధానం గెలవకున్నా ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి తద్వారా పార్టీని బలోపేతం చేయడానికి. మరి ఇప్పుడు కడపలో తమ ఓటు బ్యాంకును కాపాడుకొని పార్టీని బలోపేతం చేసే ఉద్దేశ్యం బిజెపికి ఎందుకు లేదు. జగన్‌తో కలిసినందుకేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉప ఎన్నికలలో పోటీ చేయడానికి స్థానిక బిజెపి నేత కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర కమిటీ ఒప్పుకోలేదని తెలుస్తోంది. మరి ఆ నాయకున్ని పోటీ చేయకుండా ఎందుకు నిలువరించింది. ఇవన్నీ చూస్తుంటే జగన్, బిజెపి మద్దతు అంతర్గంతంగా కనిపిస్తున్నందునే అనే సమాధానం రాజకీయ విశ్లేషకుల నుండి వస్తుంది.

వైయస్ జగన్‌పై తన ఈనాడు దినపత్రికను అస్త్రంగా ప్రయోగిస్తున్నారు

కడప ఉప ఎన్నికల సందర్భంగా రామోజీ రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై తన ఈనాడు దినపత్రికను అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. కడప లోకసభ స్థానంలో వైయస్ జగన్ వ్యవహారాలను వెలికి తీసే పని పెట్టుకున్నారు. వైయస్ జగన్ పేరు ప్రస్తావించకుండా ఈనాడు దినపత్రికలో బుధవారం ప్రచురితమైన ఓ వార్తా కథనాన్ని అందుకు ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామనే శీర్షిక కింద ఎవరి పేరు పెట్టకుండా ఓ వార్తాకథనాన్ని ప్రచురించారు. చదివినవారికి ఆ వార్తాకథనం ఎవరిని ఉద్దేశించి రాశారో వెంటనే అర్థమైపోతుంది. అది తప్పకుండా వైయస్ జగన్‌ను ఉద్దేశించి రాశారనేది వేరుగా చెప్పనక్కర్లేదు.

కడప జిల్లాలో పార్టీ నాయకులను జగన్ వర్గీయులు బెదిరిస్తున్నారని ఈనాడు దినపత్రిక వార్తాకథనం చెప్పకనే చెబుతోంది. వస్తే మా పార్టీలోకి రండి, వేరే పార్టీల్లోకి వెళ్లొద్దని బెదిరిస్తున్నట్లు ఈనాడు దినపత్రిక రాసింది. ఏజెంట్లుగా కూర్చుంటే మీ సంగతి చూస్తామంటూ హెచ్చరిస్తున్నారని ఆరోపించింది. కడపలో ఓ పార్టీ నేతలు హల్‌చల్ చేస్తున్నారని రాసింది. దీన్ని బట్టి, రామోజీ రావు పద్ధతి ప్రకారం ఇటువంటి వార్తాకథనాలను కడప ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు తన పత్రికలో రాస్తూ పోతారనేది అర్థమవుతూనే ఉన్నది.

చిన్నతనం నుంచీ కుటుంబ విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు పిల్లలకు తెలిసేలా చేయడం తల్లిదండ్రుల బాధ్యత

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో 2011 సంవత్సరానికి గాను మొట్టమొదటి వనితా వేదిక కార్యక్రమం ఈ శనివారం డల్లాస్‌లోని రుచి ప్యాలెస్ రెస్టారెంట్‌లో జరిగింది. వనితా వేదిక కమిటీ చైర్ శిరీష బావిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో చర్చా వేదిక, పాటలు, వీణా వాదన కార్యక్రమాలు సభికులను అలరించాయి. మధుమతి, దేవి ఆలపించిన మా తెలుగు తల్లికి మల్లె పూదండ పాటతో సభ ప్రారంభమైంది. సుష్మ ముగడ వీణాగానం, అపర్ణ వేదుల లలిత సంగీతం వీనుల విందుగా సాగాయి.


ఆ తర్వాత కమిటీ సభ్యులు మంజులత కన్నెగంటి, హిమ రెడ్డి, నీరజ పడిగెల, శారద పడాల, శ్రీదేవి అరవపల్లి చర్చా వేదికను నిర్వహించవలసిందిగా ప్యానల్ సభ్యులను ఆహ్వానించారు. మాతృత్వపు మధురిమలు, - టీనేజ్ పిల్లల పెంపకం అనే అంశంపై జరిగిన చర్చలో ఉష షేరి, సీత ములుకుట్ల, సురేఖ గంగసాని, సునీత కోసూరి, సంధ్య గవ్వా, రమా కాసెట్టి, మాధవీ రెడ్డి, సుగాత్రీశర్మ, లీల పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.

చిన్నతనం నుంచీ కుటుంబ విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు పిల్లలకు తెలిసేలా చేయడం తల్లిదండ్రుల బాధ్యత అని, బారతదేశంలో పెరిగే పిల్లలకు సహజంగా తెలిసే కుటుంబ విలువలు విదేశాలలో నివసించే పిల్లలకు తెలియజేయాలంటే తల్లదండ్రులు మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని పలువురు సభ్యులు వ్యక్తీకరించారు. పరిమితులు పాటిస్తూ చక్కని మార్గాన్ని పిల్లలకు నిర్దేశించాల్సిన ఆవశ్యకతను అందరూ గుర్తించాలని అన్నారు. సుమారు గంటకు పైగా వాడిగా, వేడిగా సాగిన ఈ చర్చలో పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడపడం చక్కటి నడవడికతో పిల్లలు పెరగడానికి గట్టి పునాది అనే అభిప్రాయంతో అందరూ ఏకీభవించారు. సుజన పాలూరి, సుష్మీ కోసూరి ఈ చర్చను ఆద్యంతం ఆసక్తికరంగా, సభికులందరినీ అనుసంధానం చేస్తూ నిర్వహించారు.

వైయస్ జగన్ తన ప్రకటనతో ఆత్మరక్షణలో పడ్డారని చెప్పవచ్చు

అనాలోచితంగా అన్నారో, మనసులో మాటను బయట పెట్టారో గానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప లోకసభ అభ్యర్థి వైయస్ జగన్ చిక్కుల్లో పడ్డారు. ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తే తాను బిజెపితో పొత్తు పెట్టుకుంటానని చెప్పి ఆయన ఇరకాటంలో పడ్డారు. దాంతో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు అవకాశంగా తీసుకుని వైయస్ జగన్‌ను లక్ష్యం చేసుకున్నాయి. దీని నుంచి బయటపడడానికి వైయస్ జగన్ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. బిజెపితో పొత్తు పెట్టుకోబోమంటూ తాను చేసిన ప్రకటనను పట్టించుకోకుండా, ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తే పొత్తు పెట్టుకుంటామని చెప్పిన మాటకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలనే కాకుండా రామోజీ రావును కూడా తప్పు పడుతూ సాక్షి దినపత్రికలో శుక్రవారం ఓ వార్తాకథనం ప్రచురితమైంది.

బిజెపితో పొత్తు ఎంత అసాధ్యమో చెప్పడానికి వైయస్ జగన్ ఆ మాట అన్నారని, ఒక్క వ్యాఖ్యకు తెలుగుదేశం, కాంగ్రెసు, ఎల్లో మీడియా (ఈనాడు) వక్రభాష్యాలు అల్లుతున్నాయని సాక్షి ఆడిపోసుకుంది. దశాబ్దం పాటు బిజెపితో అంట కాగిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్‌పై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. జగన్‌పై విమర్శలు చేయడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించింది. బిజెపి అగ్రనేత అద్వానీతో చంద్రబాబు, రామోజీ రావు ఉన్న ఫొటోను వార్తాకథనంలో ప్రచురించింది. బిజెపి మతతత్వాన్ని పక్కన పెట్టి ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమా అని సాక్షి ప్రశ్నించింది. మొత్తం మీద, సాక్షి మీడియా వార్తాకథనాన్ని బట్టి వైయస్ జగన్ తన ప్రకటనతో ఆత్మరక్షణలో పడ్డారని చెప్పవచ్చు

27, ఏప్రిల్ 2011, బుధవారం

బాబా పార్థివ శరీరాన్ని బాబా ప్రసంగించే కుల్వంత్ హాలులోనే సమాధి చేయాలని నిర్ణయించారు.

ఈనెల 24వ తేదీన నిర్యాణం చెందిన భగవాన్ శ్రీ సత్యసాయి అంతిమ సంస్కారాలకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, బాబా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు ప్రారంభించారు. కోట్లాది మందికి తన ప్రసంగం ద్వారా ఆధ్యాత్మిక ప్రసంగాలతో ఉత్తేరజపరిచిన చోటే సమాధికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ద్రాక్షారామం నుంచి వేద పండితులు ప్రత్యేక విమానంలో రకరకాల పుష్పాలు, పుణ్య నదీజలాలు, పవిత్రమట్టితో పుట్టపర్తికి వస్తున్నారు.
ఇదిలావుండగా, అంతిమ సంస్కారాల నిర్వహణపై సత్యసాయి ట్రస్టు కీలక భేటీ నిర్వహించింది. మంగళవారం 11.30 గంటల నుంచి 12.30 గంటల వరకు గంటపాటు ఈ భేటీ జరిగింది. బుధవారం నిర్వహించే అంతిమ సంస్కారం ఎలా చేపట్టాలి, వేదపండితులను ఎక్కడి నుంచి పిలిపించాలి, ఎలాంటి పూజలు నిర్వహించాలి, ఖననంలో ఎలాంటి నిబంధనలు పాటించాలి అన్న అంశాలపై చర్చించారు.

బాబా పార్థివ శరీరాన్ని బాబా ప్రసంగించే కుల్వంత్ హాలులోనే సమాధి చేయాలని నిర్ణయించారు. చివరి దర్శనానికి వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మంత్రులు గీతారెడ్డి, రఘువీరారెడ్డి ట్రస్టు సభ్యులతో కలిసి చర్చించిన పిమ్మట మీడియాకు వివరాలు వెల్లడించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా దాక్షారామం నుంచి ప్రముఖ వేద పండితులను బాబా అంతిమ సంస్కారానికి పిలిపించాలని నిర్ణయించారు. సన్యాసం, బ్రహ్మచర్యం, సర్వమత సమానత్వాన్ని పాటించిన సత్యసాయికి ఏ తరహా అంతిమ సంస్కారాలు నిర్వహించాలో వేద పండితులతో ట్రస్టు వర్గాలు చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నాయి. ఈ క్రియను నిర్వహించడానికి మూడు పద్దతులు ఉన్నట్లు కూడా వేద పండితులు సూచించినట్లుగా సమాచారం.

సాయిబాబా జీవితంలో ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినప్పటికీ ఆయన చేస్తున్న సేవలను మాత్రం ఎవరూ వేలెత్తి చూపించలేక పోయారు.

కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 1926 నవంబర్‌లో 23న జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణ రాజు. బాబా జన్మించింది గోవర్ధనపల్లిలో అదే ఇప్పుడు పుట్టపర్తిగా మారింది. భక్తులకు షిరిడి సాయిబాబా అవతార పురుషుడిగా తనను తాను చెప్పుకున్నారు. షిరిడీ సాయిబాబా మరణించిన తర్వాత ఎనిమిదేళ్లకు బాబా జన్మించారు. సాయిబాబా జీవితంలో ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినప్పటికీ ఆయన చేస్తున్న సేవలను మాత్రం ఎవరూ వేలెత్తి చూపించలేక పోయారు. బాబా గోల్డు రింగ్స్, విబూది సృష్టించి భక్తులకు కానుకలుగా ఇచ్చేవారు.


కోట్లాది భక్తులకు ఆయన ఆధ్యాత్మిక గురువు. ఆయన కులాలకు, మతాలకు అతీతంగా నిలిచారు. ఆయన భక్తులలో హిందువులతో పాటు ముస్లింలు, క్రిస్టియన్లు కూడా చాలామంది ఉన్నారు. సత్యసాయి బాబా తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, పెద్దవెంకమ రాజు రత్నాకరమ్. బాబాకు నలుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. బాబా చిన్న వయసులోనే చాలా అద్బుతాలు చేశాడని చెబుతారు. చిన్న వయసులోనే బాబా అపర మేధావి, సేవాభావం గల వ్యక్తిగా ముద్ర పడ్డారు. అపర మేథావి అయిన బాబాకు నాట్యంలో, సంగీతంలో, రచనలలో మంచి పట్టు ఉంది. బాబా స్వయంగా పాటలు, పద్యాలు రాసి భక్తులను వినిపించాడు.

1940వ సంవత్సరం మార్చి 8వ తేదిన తన సోదరుడు శేషమ రాజుతో కలిసి ఉరవకొండలో ఉన్న సమయంలో బాబాను ఓ తేలు కుట్టిందంట. ఆ సమయంలో బాబా తన స్పృహను కోల్పోయారంట. తేలు కుట్టిన కొద్ది రోజులకు బాబా బిహేవియర్‌లో మార్పు వచ్చింది. తనకు తాను నవ్వుకోవడం, ఏడ్వటం, అప్పటికప్పుడే నిశ్శబ్దంగా మారి పోవడం చేసేవారు. ఆ సమయంలో ఇతను తనకు ఇంతకుముందు ఏ మాత్రం పరిజ్ఞానం లేని సంస్కృతంలో పాటలు పాడేవారు. బాబా పరిస్థితి చూసి వైద్యులు హిస్టేరియా అని నమ్మేవారు. దీంతో చేసేది లేక బాబా తల్లిదండ్రులు బాబాను పుట్టపర్తికి తీసుకు వచ్చారు. వారు బాబాను అనేకమంది వైద్యుల వద్దకు, ఆధ్యాత్మిక గురువుల వద్దకు తీసుకు వెళ్లారు.

మే 23 1940లో బాబా చేసిన ఓ చర్య వల్ల బాబా తండ్రి బాబాను ఓ అద్వితీయ మహోన్నతుడుగా భావించాడు. బాబా తండ్రి ఓ కర్ర తీసుకొని నీవెవరు అని అడిగాడు. అప్పుడు బాబా తాను షిరిడీ సాయిబాబా ప్రతిరూపాన్ని అని చెప్పాడు. ఆ తర్వాత బాబా తనకు ఎవరితోనూ సంబంధం లేదని చెప్పారు. తాను షిర్డీ సాయికి ప్రతిరూపం అని చెప్పడం, తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని చెప్పడంతో ఆయనకు భక్తులు తయారవడం ప్రారంభం అయింది. పద్నాలుగేళ్లకే బాబా ఆధ్యాత్మిక మార్గం పట్టారు. ఆ తర్వాత సత్యసాయి మద్రాసుకు, దక్షిణ భారతంలో పర్యటనలు ప్రారంభించారు. దీంతో తొందరగానే ఆయనకు భారీ సంఖ్యలో భక్తులు తయారయ్యారు.

1944వ సంవత్సరంలో భక్తులు బాబా స్వగ్రామం పుట్టపర్తిలో ఓ మందిరాన్ని నిర్మించారు. ఆ తర్వాత 1948లో ప్రారంభం అయిన ప్రశాంతి నిలయం 1950కి పూర్తయింది. 1957వ సంవత్సర కాలంలో బాబా ఉత్తర భారత దేశ దేవాలయాల సందర్శనకు వెళ్లారు. 1954లోనే బాబా చిన్న పాటి గ్రీన్ హాస్పిటల్‌ను పుట్టపర్తిలో నిర్మించారు. 1963లో బాబాకు నాలుగుసార్లు గుండెనొప్పి వచ్చింది. ఆ సమయంలో బాబా తాను మరణించాకు కర్ణాటకలో ప్రేమసాయి అవతారం ఎత్తుతానని చెప్పారు.

ఆ తర్వాత 1968 జూన్ 29న బాబా మొదటిసారి విదేశాలకు వెళ్లారు. ఉగండా, నైరోబీ తదితర దేశాలకు వెళ్లారు. ఆయా దేశాలకు వెళ్లిన బాబా తాను ఏ మతపరంగా రాలేదని ప్రేమను పంచడానికే వచ్చానని చెప్పారు. తనవైపు ఎవరినీ తిప్పుకోవడానికి, ప్రలోభ పెట్టడానికి రాలేదని, కేవలం ప్రేమ పంచి, ఎవరిపై వారికి నమ్మకం కలిగించడానికే వచ్చానని ఆయా దేశాలలో చెప్పేవారు.

మన రాష్ట్రం రాజధానిలో ప్రసిద్ధి పొందిన శివం మందిరాన్ని 1973లో ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే 1981 జనవరి 19న చెన్నైలో సుందరం మందిరాన్ని ప్రారంభించారు. 1995లో రాయలసీమ ప్రాంతంలో బాబా నీటి ప్రాజెక్టు పనులు చేపట్టారు. 2001లో పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించారు. బాబా 2005వ సంవత్సరం నుండి వీల్ చైర్‌కే పరిమితం అయ్యారు. తాను దేహం కలవాడిని కాదని, దేహిని అని చెప్పారు. తాను నిర్మాణం చెందినప్పటికీ మళ్లీ పుడతానని పలు సందర్భాలలో చెప్పారు. అయితే భక్తుల ప్రార్థనలే తనకు ప్రాణం అని కూడా చెప్పారు. ప్రతి దేహం గిట్టక తప్పదని చెప్పారు.

బాబా తన భజనల సీడీలను చాలా విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తులను, వేల సేవాకేంద్రాలు, ప్రజలకు నీటి సౌకర్యం కల్పించిన శ్రీ భగవాన్ సత్యసాయి బాబతాను స్థాపించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే గత నెల 28న మంచాన పడ్డారు. 28 రోజుల అనంతరం బాబా ఆదివారం ఏప్రిల్ 24న ఉదయం 7.40 నిమిషాలకు నిర్యాణం చెంది బాబా భక్తులలో విషాదం నింపారు

కర్ణాటక స్ఫూర్తిగా అనంతపురం జిల్లానుండి పార్టీ బలోపేతం మాత్రం చేయాలని భావిస్తోంది.

కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ సత్యసాయిబాబా మరణాన్ని భారతీయ జనతా పార్టీ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో, దేశంలోనే కాకుండా సత్యసాయికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. రాష్ట్రంలో ఏమాత్రం ప్రభావం చూపించలేని బిజెపి ఎప్పటి నుండో రాష్ట్రంలో ఓ వెలుగు వెలగాలనే ఆశతో ఉంది. అయితే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేతికి పగ్గాలు వచ్చిన తర్వాత బిజెపి బలోపేతానికి బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి రెండంకెల అసెంబ్లీ సీట్లను గెలవాలనే ఉద్దేశ్యంతో ఆయన ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగానే కిషన్‌రెడ్డి అధ్యక్షుడు అయ్యాక జిల్లాల పర్యటనకు వెళుతూ ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. పుట్టపర్తిలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బిజెపి రాష్ట్రంలో పట్టు సాధించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.


సత్యసాయి సేవలు, ఆధ్యాత్మికత ద్వారా పుట్టపర్తి ప్రపంచ వ్యాప్తమైందని, అలాంటి పుట్టపర్తి ఉన్న జిల్లాను సత్యసాయి జిల్లాగా పేరు మార్చాలనే డిమాండును ప్రభుత్వం ముందు ఉంచాలని బిజెపి రాష్ట్ర స్థాయి నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులను ఆకర్షించవచ్చునని బిజెపి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సత్యసాయి మతాలకతీతంగా ఆధ్యాత్మికతను నెలకొల్పారు. కాబట్టి సత్యసాయి జిల్లాకోసం డిమాండు తీసుకు వస్తే అందరూ తమకు మద్దతు పలికే అవకాశం ఉందని వారు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాహార్తిని తీర్చిన ప్రదాతగా సాయిని అందరూ ప్రశంసిస్తారు. ఇప్పుడ అక్కడకు వచ్చే లక్షలాది భక్తుల దృష్టిని బిజెపి వైపు మరల్చేందుకు పార్టీ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

సాయి మరణంతో వెనుక పడ్డ పుట్టపర్తి నుండి రాష్ట్రంలో తమ ప్రస్తానం ప్రారంభించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. బాబా పార్థివ శరీరాన్ని దర్శించుకోవడానికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, మాజీ ఉప ప్రధాని అద్వానీలు వచ్చారు, వస్తున్నారు. ఇక రాష్ట్రం అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయలతో పాటు పలువురు నేతలు పుట్టపర్తిలో బస చేయనున్నారు. దక్షిణాదిన కర్ణాటకలో మొదటిసారి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కర్ణాటక స్ఫూర్తిగా రాష్ట్రంలో కూడా ఆ దిశగా పయనించేందుకు బిజెపి ఉత్సాహ పడుతోంది. బిజెపి ఉత్సాహానికి మరో కారణం కూడా ఉంది. అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి అనంతపురం జిల్లా అనుకొని ఉంటుంది. దీంతో మొదట జిల్లాలో పాగా వేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

కర్ణాటక మంత్రి గాలి జనార్థన్ రెడ్డికి అనంతపురంలో గనుల వ్యాపారం కూడా ఉంది. ఇక గాలి జనార్థన్ రెడ్డికి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్న కారణంగా జగన్‌ను పార్టీలోకి తీసుకు వచ్చి బలోపేతం కావాలని భావిస్తోంది. అయితే జగన్ వచ్చినా రాకున్నా కర్ణాటక స్ఫూర్తిగా అనంతపురం జిల్లానుండి పార్టీ బలోపేతం మాత్రం చేయాలని భావిస్తోంది.

1971వ కాలానికి చెందిన రోల్స్ రాయిస్ శాలూన్ కారు తొలి యజమాని మరెవరో కాదు సాక్షాత్తు సత్య సాయి బాబానే.

ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అద్భుతాలకు ఈ సంఘటన ఓ నిలువెత్తు నిదర్శనం.


చూడటానికి అదో పాత కారే కావచ్చు, కానీ ఆ కారు యజమాని మాత్రం ప్రత్యకమైన వారు. 1971వ కాలానికి చెందిన రోల్స్ రాయిస్ శాలూన్ కారు రిజిస్ట్రేన్ నంబర్ కూడా విశిష్టమైనదే - ‘DNA 8888’. ఈ కారు తొలి యజమాని మరెవరో కాదు సాక్షాత్తు సత్య సాయి బాబానే. బాబా సర్గస్తులైన తర్వాత అతనితో తమకు ఉన్న అనుంబంధాలను, అనుభవాలను కోట్లాది మంది అభిమానులు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని బాంద్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సత్య సాయి బాబాతో తనకున్న అనుబంధాన్ని వివరించారు.

నెమలి వర్ణంలో ఉండే ఈ రాయల్ కారు బాంద్రాకు చెందిన ఇర్ఫాన్ మొఘల్ గ్యారేజ్‌లో కొలువుదీరి ఉంది. టొయోటా టెక్ (ఓ హై-ప్రొఫైల్ కార్ మెకానిక్) యజమాని అయిన ఇర్ఫాన్ ఈ సందర్భంగా ఓ ఆంగ్ల వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఈ కారు తొలి యజమాని సత్య సాయి బాబా, 1972లో బాబా ఈ కారును కౌలాలంపూర్ నుంచి తెప్పించారు. ఈ కారును ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ జిల్లా, ప్రశాంతి నిలయానిక చెందిన అతని స్కూల్ పేరు "శ్రీ సత్య సాయి ఇన్సిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్"తో రిజిస్టర్ అయ్యింది. తర్వాతి కాలంలో ఆ కారును ఢిల్లీకు చెందిన ఓ వ్యాపారవేత్త వివేక్ బర్మన్‌కు 1984లో అమ్మేశారు. ఆ తర్వాత 1996లో మా నాన్నగారు అమన్ మొఘల్ ఈ కారును కొనుగోలు చేశారు. అప్పటి నుండి అది మాతోనే ఉంది" అని చెప్పారు.

ఇంకా.. "ఈ కారును మేం కొనేటప్పుడు వాళ్లు చెప్పిన ధరకు కొనేందుకు అంగీకరించలేదు. కానీ ఈ కారు తొలి యజమాని సత్య సాయి బాబా అని తెలియడంతో తర్వాత ఆయన అంగీకరించారు. కొన్ని సంవత్సరాలుగా ఆయన సత్య సాయి బాబాకు భక్తుడు" అని ఇర్ఫాన్ చెప్పారు. మొట్టమొదటిసారి ఈ కారును తెచ్చినపుడు దీని రిజిస్ట్రేషన్ నంబర్ వేరుగా ఉన్నది. "ఈ కారు మొదటి నంబర్ ADA 9, కానీ తర్వాత ఈ కారు సత్య సాయి ఇన్సిట్యూట్‌ నుంచి న్యూఢిల్లీకి వెళ్లిన తర్వాత ‘DNA 8888’గా మారిపోయింది.

అయితే.. ఈ కారు గురించి చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇది మా వ్యాపారానికి ఎంతో కలిసి వచ్చింది. దీని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మా వ్యాపారం అంచెలంచెలు ఎదిగింది. బాబా రోజూ కూర్చుని తిరిగే ఈ రోల్స్ రాయిస్ శాలూన్ యజమానిగా ఉండటం నాకెంతో గర్వంగా ఉంది" అని ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు. బాబా జ్ఞాపకంగా ఈ కారు ఎప్పటికీ తమతోనే ఉంటుందని ఇర్ఫాన్ చెప్పారు. బాబా మృతి పట్ల ఇర్ఫాన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రేమ సాయిగా జన్మిస్తారని భక్తులు నమ్ముతున్నారు.

సత్య సాయిబాబాను షిర్డీ సాయిబాబా వారసుడిగా షిర్డీ సంస్థాన్ అంగీకరిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. తాను షిర్డీ సాయిబాబా వారసుడినని సత్య సాయి బాబు చెప్పుకున్నారు. సత్య సాయి బాబా భక్తులు కూడా అలాగే భావిస్తారు. కానీ షిర్డీ సంస్థాన్ ఆలోచన మరో విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సత్య సాయిబాబాను షిర్డీ సాయి బాబా వారసుడిగా అంగీకరించేందుకు షిర్డీ సంస్థాన్ సిద్ధంగా లేనట్లు అర్థమవుతూనే ఉన్నది.


నిజానికి, షిర్డీ సాయిబాబా అశేష భక్త జనానికి ఆకర్షణగా నిలిచింది. షిర్డీ సాయి బోధనలు విశేష ప్రచారం పొందాయి. సత్య సాయిబాబాకు కూడా భక్తజన సందోహానికి తక్కువేమీ లేదు. ప్రపంచ వ్యాప్తంగా సత్యసాయి బాబా విశేష జనాదరణ పొందారు. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దారు. పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారు.

సత్య సాయి ఎంతగా జనాదరణ పొందినప్పటికీ, భక్తులు ఆశిస్తున్నప్పటికీ షిర్డీ సంస్థాన్ సత్య సాయి బాబాను షిర్డీ సాయిబాబా వారసుడిగా ప్రకటించేందుకు సిద్ధంగా లేదు. రెండు ఆధ్యాత్మిక కేంద్రాలను అనుసంధానం చేసే ఆలోచన కూడా ఆ సంస్థాన్‌కు ఉన్నట్లు లేదు. జీవించి ఉన్న కాలంలో సత్య సాయిబాబా షిర్డీకి వెళ్లిన దాఖలాలు కూడా లేవంటారు. పైగా, షిర్డీ సంస్థాన్ షిర్డీ సాయిబాబాకు వారసులు ఎవరూ లేరంటూ బోర్డు కూడా పెట్టుకుంది.

తనకు మూడు జన్మలున్నాయని, మొదటి జన్మ షిర్డీ సాయిబాబా కాగా రెండో జన్మ సత్య సాయి బాబా అని సత్య సాయి బాబు చెప్పుకున్నారు. మూడో జన్మలో ప్రేమ సాయిగా కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో పుడుతానని ఆయన చెప్పారు. మాండ్యా జిల్లాలోని గుణవర్తి లేదా గుణపర్తిలో సత్య సాయి బాబా ప్రేమ సాయిగా జన్మిస్తారని భక్తులు నమ్ముతున్నారు.

22, ఏప్రిల్ 2011, శుక్రవారం

అందరూ శ్రీరాముడి జన్మ దినాన్ని ఘనంగా జరుకొంటారు గాని, ఎవరు ఆయన ఎప్పుడు పోయాడో ఎందుకు మాట్లాడరు?

ఎవరి వెర్రి వాళ్ళ కానందం అని పెద్దలు ఉరికే అనలేదు. ఆ రోజుల్లో కూడా మన రామ్ గోపాల్ వర్మ వంటి వాళ్ళు ఉండనే ఉంటారు గనుక, అలా తీర్మానించేసి ఉంటారు. నేనసలే కొంచెం మెంటల్ అని గర్వంగా చెప్పుకొంటూ బోర విరుచుకు తిరిగే రామ్ గోపాల్ వర్మ, ఆ సంగతిని మనమెక్కడ మరిచిపోతామోనని బెంగ పెట్టుకొని తరచూ తన ట్వీటార్ ద్వారా ఏదో రూపంగా మనందరికీ గుర్తు చేస్తూనే ఉంటాడు.

తనను తను మహా మేధావిగా భావించుకొంటూ ఎల్లపుడూ భ్రమలో బ్రతికే మన చెడ్డరాముడు, మొన్న మొన్నతన ట్వీటార్లో "అసలీ అన్నాహజారే ఎవరో, అతనెందుకు ఉపవాసాలు చేస్తున్నాడో" తనకసలు తెలీనే తెలీదని తన లోక జ్ఞాన్నాన్ని చాటుకోవడమే గాక, తను అండర్ వరల్డ్ గూండాల పట్ల, తన సినిమా ప్రపంచం పట్ల తప్ప మరేది ఆసక్తి చూపనని సెలవిచ్చాడు. అసలు తానెప్పుడు తిండి మానె ప్రసక్తే లేదని కూడా సెలవిచ్చాడు. తిండి మానక పోయిన ఈ దేశానికి కోత్తగా వచ్చే నష్టం ఏమి లేదుగాని, అలా పిచ్చి సినిమాలు తీయడం మానుకొంటే మాత్రం దేశానికి చాల మేలు చేసినవాడవవుతవని నా వంటి పామరులు చాల మంది అభిప్రాయ పడుతున్నట్లు వినికిడి.

ఇక అసలు విషయంలోకి వస్తే, ఈ రోజు ఆయనకీ కొన్ని ధర్మ సందేహాలు కలిగాయి. అది కూడా శ్రీ రామ నవమి నాడే అంతే!వెంటనే, తన సెల్ ఎత్తి నాలుగు ట్వీట్లు ట్వీటేసాడు. మీలోఎవరికయినా ఆయన సందేహాలకి సమాధానాలు చెప్పగలిగే జ్ఞానం ఉందని అనిపిస్తే వెంటనే ఈ క్రింద ఇచ్చిన ఆయన గారి ట్వీట్ పేజీలోకి దూరి సరయిన సమాధానాలు వ్రాసి అయన మెప్పు పొందగలరని నా విజ్ఞప్తి.
ఆయన సందేహాలివే:
1 అందరూ శ్రీరాముడి జన్మ దినాన్ని ఘనంగా జరుకొంటారు గాని, ఎవరు ఆయన ఎప్పుడు పోయాడో ఎందుకు మాట్లాడరు?
2. అసలు శ్రీ రాముడు తన స్వంత పని మీద అంటే తన భార్య సీతకోసం లంకకి వెళ్లి రావణుడితో యుద్ధం చేసి రావడం తప్ప, అతను అయోధ్య వాసులకోసం అసలేమి చేసాడు?
3. దశరధుడు తన ప్రజలని గాలికొదిలి, తన భార్య కైకేయి కోసం రాముడిని అడవికి పంపినందుకి స్వర్గంలో ఎలా స్థానం సంపాదించెడో? అందుకు ఎలా అర్హత పొంద గలిగేడో?
4. రాముడి వెంట వనవాసానికి వెళ్ళిన పతివ్రత సీత ఒకవేళ స్వర్గానికి వెళ్ళినట్లయితే మరి లక్ష్మణుడి భార్య నరకానికి వెళ్లి ఉంటుందా?
5. బహుశః స్వర్గం లోదొరికే అమృతం మంచి నిషానిచ్చే మందు అయి ఉంటుందనుకొంట, అంతే గాని అదేదో గొప్ప ఫ్రూట్ జ్యుసు కాదనుకొంటా.
6. స్వర్గంలో దొరికే అమృతం, రంభ, ఊర్వశి, తిలోత్తమ వంటి అందగత్తెలు అన్నీకూడా మగవాళ్ళకోసమే అయితే, మరి ఆడవాళ్ళకి వేరే ప్రత్యేకమయిన ఏర్పాట్లు లేక పోవడం చాల అన్యాయం. ఈ విషయంలో మన మహిళా సంస్థలు దేముడితో సంప్రదింపులు మొదలు పెట్టలిసిన అవసరముంది.
7. ఆ రోజుల్లో అసలు బాణాలు గాని లేకపోయి ఉంటే రాముడు తన తొలియుద్ధం ఎలా చేయగలిగేవాడో మరి?
8. సీతారామ లక్ష్మణులు 14 ఏళ్ళ వనవాసానికి వెళ్ళేపుడు, దశరధుడు వాళ్లకి అన్నేళ్ళకి సరిపోయే బట్టలు మూట కట్టి ఇచ్చేడా, ఇస్తే వాటన్నిటిని ఆ ముగ్గురిలో ఎవరు మోసి ఉంటారు? ఇవ్వక పోతే, 14 ఏళ్ళ పాటు వాళ్ళు ముగ్గురు కూడా ఒకే బట్టలు ధరించి వనవాసం చేసేసారా?

వ్రాయవలసినదంత వ్రాసేసిన తరువాత, తన పనికి మాలిన సస్పెన్స్ సినిమాలాగ, చివరన ఇదంతా ముప్పాళ్ళ రంగ నాయకమ్మ వ్రాసిన రామాయణ విష వృక్షంలోని సందేహాలే తప్ప నా స్వంతవి గావని ఓ ట్విస్టు కూడా ఇచ్చి ముగించేడు. తన జీవితంలో చదివిన అతి గొప్ప పుస్తకం కూడా అదేనని సెలవిచ్చేడు కూడా.
ఇప్పుడు మీకు అతని గురించి మంచి అవగాహన ఏర్పడి ఉంటుంది గనుక, మరి ఆయన వంటి మేధావిని కలవాలని తహ తహ కూడా మీలో ఏర్పడి ఉండాలి కదా? మరెందుకు ఆలస్యం వెంటనే త్వీటర్ సైటు లోకి వెళ్లి

@RGVzoomin అనే హ్యండిల్నిఅందుకొంటే మీకు మీ రాముడు ప్రత్యక్షమవుతాడు. మరింకెందుకు ఆలస్యం

తెగ ఖర్చు చేస్తున్నారు ..ఎవడబ్బ సొమ్మని

డబ్బు ..డబ్బు ..కడపలో ఎక్కడ చూసిన డబ్బే ......ప్రజలు (ఓటర్లు ) ఎంత అందుకుంటూ న్నారో తెలియదు కాని కట్టలుకట్టాలే అట ....కొన్ని చోట్ల డబ్బును కూడా కాల్చెయ్య దాన్ని బట్టి ఎంత డబ్బు విర్జిమ్ముతున్నారో అర్ధమవుతుంది . ఈపార్టి ..ఆ పార్టి అని లేదు ..అన్ని తమకు అందినంత .....తెగ ఖర్చు చేస్తున్నారు ..ఎవడబ్బ సొమ్మని ..ప్రజల సొమ్మేకదా..""పాపం సొమ్ము ""మళ్ళి ప్రజలకే ...ఎన్నికైన తర్వాత ఎలాగు చెయ్యరని కాబోలు ఓటర్లు కూడా చెయ్య చాపుతున్నారుఅంత డబ్బు మాయం ..ఎంత ఖర్చు పెట్టిన ఎవరి ఎన్ని ఓట్లు వస్తాయి ?ఏమో ఆ దేవుడికే తెలియాలి .

నారా లోకేష్‌ రాజకీయ ప్రవేశానికి లైన్ క్లియర్

తన కుమారుడు నారా లోకేష్‌ రాజకీయ ప్రవేశానికి లైన్ క్లియర్ చేయడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తన జన్మదిన వేడుకల సందర్భంగా బుధవారం చంద్రబాబు చెప్పిన మాటలే ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. తన రాజకీయ వారసత్వం గురించి మీడియా ఊహాగానాలు చేస్తుందని ఆయన అన్నప్పటికీ లోకేష్ రాజకీయ రంగ ప్రవేశాన్ని మాత్రం కొట్టి పారేయలేదు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని తాను లోకేష్‌కు చెప్పినట్లు ఆయన తెలిపారు. ఆస్తులు పోగు చేయాలనే ఆలోచన ఉండకూడదని చెప్పినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం నారా లోకేష్ తమ కుటుంబ వ్యాపారాలను చూస్తున్నాడని, అప్పుడప్పుడు తనకు సలహాలు ఇస్తుంటాడని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు నగదు బదిలీ పథకం గురించి చెప్పింది నారా లోకేషేనని అంటారు.


ఇదిలా పుంటే, స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబమంతా తనతోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కుటుంబంతో తన బంధం మరింత పటిష్టమవుతోందని ఆయన చెప్పారు. నందమూరి బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిని తన కుమారుడు లోకేష్‌కు చేసుకోవడం ద్వారా, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కు తమ సమీప బంధువుల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తుండడం ద్వారా ఆ బంధం మరింత గట్టి పడుతోందని ఆయన అన్నారు. దీన్ని బట్టి నందమూరి కుటుంబ సభ్యులు తన మాట జవదాటకుండా, తనకు అనుకూలంగా ఉండే విధంగా పెళ్లిళ్లతో చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారని చెప్పవచ్చు.

నారా లోకేష్‌ను తన వారసుడిగా నిలబెట్టేందుకు వీలుగానే చంద్రబాబు పెళ్లిళ్ల వ్యవహారాలు నడుపుతున్నారని ఆంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో స్వర్గీయ ఎన్టీఆర్ వారసుడిగా ముందుకు రాకుండా ఉండడానికి తన సమీప బంధువు నార్నే శ్రీనివాస రావు కూతురు లక్ష్మీప్రణతిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారని అనుకోవచ్చు. ఇప్పటికే బాలకృష్ణ చంద్రబాబును వ్యతిరేకించే స్థితిలో లేరు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తనను వ్యతిరేకించకుండా చూసుకోగలితే నారా లోకేష్ రాజకీయ ఆరంగేట్రానికి ముప్పు ఉండదనేది చంద్రబాబుకు తెలుసు

ఎన్నో మానవాతీత శక్తులు వున్నాయని చెప్పుకునే బాబా, తన రోగాన్ని తాను ఎందుకు తగ్గించుకోలేక పోయాడు.

అరచేతుల నుండి బూడిద, నోటి నుండి లింగాలు, గాలి నుండి గొలుసులు తీసే సత్యసాయి బాబా, మాములు మనిషా లేక అతీతశక్తులు కలిగిన దేముడా? బాబా కి రోగం వస్తే వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్ళారు. ప్రాణం కాడికి వచ్చే సరికి వైద్యవిజ్ఞానం పైన ఆధారపడ్డారు. ఎన్నో మానవాతీత శక్తులు వున్నాయని చెప్పుకునే బాబా, తన రోగాన్ని తాను ఎందుకు తగ్గించుకోలేక పోయాడు. ఒక వైపు కిడ్నీలు, కాలేయం పాడైపోయి, ఊపిరి పీల్చుకోలేక వెంటిలేటర్ పైన బాబా మనుగడ సాగిస్తుంటే, కొన్ని టీవీ ఛానళ్లు ‘‘బాబా మళ్ళీ దర్శనం” ఇస్తారని’ ప్రచారం చేయటంలో మతలబు ఏమిటి? సత్యసాయి ట్రస్టు నడిపే ఆసుపత్రిలో పనిచేసే డా. సఫయా, బాబా ఆరోగ్య పరిస్థితిపైన తప్పుడు ప్రకటనలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. యీ ప్రకటనల విశ్వసనీయత పరీక్షించకుండా, కొంత మంది మీడియా, ఛానెళ్లు ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసం.


ఇరవైయి ఒకటవ శతాబ్దంలో మనిషి ఎంత పురోగతి సాధించినా, శాస్త్రీయ విజ్ఞానం ఎంత ప్రగతి చెందినా,అరచేతి లో స్వర్గం చూపించే బాబాలను నమ్మటం ఎంత శోచనీయం. జనం, ఆధ్యాత్మిక బాబాల మాయజాలం లో చిక్కుకుపోతున్నారు. మనిషి తన మీద తాను నమ్మకం కోల్పోయినప్పుడు, తన శక్తి సామర్ధ్యాల పైన విశ్వాసం కోల్పోయినప్పుడు, రాతి దేవుళ్ళని, అరచేతి స్వర్గం చూపే బాబాలను నమ్మడం మొదలుపెడతాడు. జనం బలహీనతలమీద బాబా గారు కోట్లాది రూపాయల ఆస్థి పోగేసుకున్నారు.

“చేతికి అంటుకున్న ఎంగిలి మెతుకులు కాకులకీ బిచ్చం వేసినట్లు” గా కొంత డబ్బును ఆసుపత్రులు, కాలేజీలపైన ఖర్చుపెట్టారు. బాబా కోటరీ లక్షలాది కోట్ల ఆస్తులతో రాజ భోగాలను అనుభవిస్తుంది. నడవలేని, మాట్లాడ లేని, ఆఖరి కి ఊపిరి తీసుకోలేని బాబాను, ఒక బొమ్మగా చేసి జగన్నాటకం ఆడుతున్నారు. ప్రముఖ తెలుగు దిన పత్రిక-టీవీ ఛానల్ పరిశోధనాత్మక రిపోర్టు ప్రకారం సత్యజిత్, డాక్టరు అయ్యర్ మరికొన్ని అదృశ్య శక్తులు బాబాను మత్తులో ముంచెత్తి, ఒక జీవచ్ఛవంగా మార్చారు. వీళ్ళ చుట్టూ బడా రాజకీయనాయకులు, గద్దె నెక్కిన మంత్రులు, పోలీసులు కాపలా కాస్తున్నారు.

కొంతమంది సత్యసాయి ట్రస్టు సభ్యులు, బాబా పైన మత్తుమందులు, డ్రగ్స్ ప్రయోగించారని ఆరోపణలు వున్నాయి. ఏబిన్ – ఆంధ్రజ్యోతి కొంత సాహసం చేసి బాబా బండారాన్ని, సత్యసాయి మందిరం చొరబడిన దొంగల కుట్రలను బయటపెట్టింది కేంద్ర ప్రభుత్వానికి చెందిన బడా నాయకులు, హోమ్-మంత్రి చిదంబరం, రాజకీయ దళారులు, పోలీసు అధికారులకు సత్యసాయి ట్రస్టు కుంభకోణం తో సంబంధం వుందని తీవ్రమైన ఆరోపణలున్నాయి.

సాయిబాబా పేరున జరుగుతున్న తతంగం లోగడ ప్రేమానంద్, ఇన్నయ్య, అబ్రహాం కోవూర్, బయట పెట్టి విచారణ జరపమని కోరారు. ఎన్.టి.రామారావు అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేయమని ఉత్తరువులు ఇస్తే, చంద్రబాబు నాయుడు , పోలీసు అధికారి దొర లోపాయికారి వ్యవహారంతో ఆపారు. బెంగుళూరు వైస్ ఛాన్సలర్ నరసింహయ్య చాలెంజ్ చేసారు. పి.వి. నరసింహరావు, వాజపేయి, చివరకు అబ్దుల్ కలాం కూడా బాబా కాళ్ళు మొక్కి సెక్యులర్ సూత్రానికి ద్రోహం చేశారు. ఇప్పుడు బాబా విషయంలో జరుగుతున్న దానిని బట్టి అతను సామాన్య వ్యక్తి అని, మహత్తులు బూటకమనీ తేలింది. టి.వి. చానళ్ళు ఆధారాలు లేని ప్రసారాలు ఆపాలి .బాబా చుట్టూ మంత్రుల ప్రదక్షిణ అనుమానాలకు తావిస్తుంది గనుక వారు ప్రజలకు సంజాయిషి చెప్పాలి. తక్షణమే బాబా ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని , గూడు పుఠాణి జరగకుండా చూడాలి.

బాబా ఆరోగ్య పరిస్థితి పైన రాష్ట్రప్రభుత్వం వాస్తవ పరిస్థితిని వెల్లడించాలి. సత్యసాయి ట్రస్టులోని లక్షలాది కోట్ల ఆస్తులను ప్రభుత్వం జాతీయం చేసి, ప్రజల ఆరోగ్య, విద్య అవసరాల కోసం వినియోగించాలి. టీవీ ప్రసారసాధనాలు బాబాలకు గుడ్డిగా భజన చేయకుండా, జర్నలిస్టు విలువలను కాపాడుతూ, వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలి. బాబాలు చెప్పే కట్టుకథలను నమ్మకుండా, శాస్త్రీయ దృక్పథం తో ఆలోచించి, విచక్షణా జ్ఞానం తో వాస్తవాలను తెలుసుకోవాలి. మానవతా విలువలతో, శాస్త్రీయ ఆలోచన విధానం తో వికసించే సమాజం కోసం కృషిచేయాలి

సత్య సాయిబాబా సజీవ సమాధి

ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో సత్య సాయిబాబా సజీవ సమాధి పొందారని ట్రస్టు ప్రకటించే అవకాశాలున్నాయని పుకార్లు పుడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు నడిచే దేవుడిగా కొలిచే సత్య సాయిబాబా గత నెల 28 తేదీ నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన చికిత్స పొందుతున్న సత్యసాయిబ ఉన్నత వైద్య శాస్త్ర సంస్థ వద్దకు పెద్ద యెత్తున భక్తులు చేరుకున్నారు. ఆయనకిప్పుడు 86 ఏళ్లు.


జీవించి ఉండగానే చైతన్యం పొందిన ఆత్మలు సమాధిలోకి వెళ్లిపోవడాన్ని సజీవ సమాధి చెందడం అంటారు. ట్రస్టు వ్యవహారాలపై చర్చించడానికి సత్యసాయి కేంద్ర ట్రస్టు సభ్యులు గురువారం అత్యవసరంగా సమావేశమైన నేపథ్యంలో సత్య సాయిబాబా సజీవ సమాధి పొందుతారనే ప్రచారం ఊపందుకుంటోంది. సత్యసాయిబాబా సోదరుడి కుమారుడు, ట్రస్టు సభ్యుడు రత్నాకర్‌కూ ఇతర సభ్యులకు మధ్య విభేదాల కారణంగా కూడా ఆ ప్రచారం జరుగుతున్నట్లు చెబుతున్నారు.

సత్య సాయిబాబా ఆరోగ్యం క్షీణిస్తుండడంపై, బాబాకు అందిస్తున్న వైద్యంపై శ్రీసత్య సాయిబాబా భక్తుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ట్రస్టు సభ్యుల వ్యవహార శైలిపై సంఘం అధ్యక్షుడు ధనంజయ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, పుట్టపర్తిలో ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది. పెద్ద యెత్తున బలగాలను దింపింది.

21, ఏప్రిల్ 2011, గురువారం

సయోధ్య వార్తలు నిజం కాదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావుకు, విజయవాడ నగర అధ్యక్షుడు వల్లభనేని వంశీ మధ్య సయోధ్య వార్తలు నిజం కాదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కలిసి పని చేస్తామని ఇరువురు నాయకులూ ప్రకటించారు. కానీ అలాంటి పరిస్థితి ఏదీ లేదని అంటున్నారు. దేవినేని ఉమా మహేశ్వరరావుపై తీవ్రంగా ధ్వజమెత్తిన వంశీ ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కలిసి క్షమాపణలు చెప్పారు. అయితే, పరిస్థితి తనకు అనుకూలంగా లేకపోవడంతో వంశీ కాస్తా వెనకడుగు వేసినట్లు భావిస్తున్నారు.

చంద్రబాబు 62వ జన్మదిన వేడుకల వేదికపై వంశీ, ఉమ కలిసి కనిపిస్తారని అందరూ భావించారు. కానీ ఆ పరిస్థితి రాకుండా వంశీ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. చంద్రబాబు జన్మదిన వేడుకలకు వంశీ డుమ్మా కొట్టారు. తీరిక లేని పనుల వల్ల తాను చంద్రబాబు చెంతకు వచ్చి శుభాకాంక్షలు చెప్పలేకపోతున్నానని వంశీ చెప్పారు. కానీ, అంత తీరిక లేని పనులు వంశీకి ఏమున్నాయనే ప్రశ్న ఉదయిస్తోంది. చంద్రబాబుతో కూడా వంశీ నామమాత్రంగానే సయోధ్యకు అంగీకరించినట్లు భావిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, హీరో జూనియర్ ఎన్టీఆర్ సూచన మేరకు తాత్కాలికంగా పార్టీలో పోరుకు వంశీ తెర దించినట్లు కనిపిస్తోంది.

బిజెపిలోకి పవన్ కళ్యాణ్?

అన్నయ్యకు తమ్ముడు దూరం అవుతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అల్లు అరవింద్ బాటలో నడుస్తున్న చిరంజీవి నిర్ణయాలతో విసిగి పోయిన తమ్ముళ్లు పవన్ కల్యాన్, నాగబాబు ప్రస్తుతం అన్నయ్య పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. అభిమానుల అండదండల కారణంగా ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో కలపడాన్ని పవన్, నాగబాబు జీర్ణించుకోలేక పోతున్నట్లుగా సమాచారం. ప్రజారాజ్యం పార్టీ కోసం నాగబాబు, పవన్ ఎంతగా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. పార్టీ స్థాపనకు ముందు నాగబాబు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తిరిగి చిరు అభిమానులతో రహస్య మంతనాలు చేశారు. అందరినీ ఏకం చేశారు. పార్టీ పెట్టాక కూడా నాగబాబు ప్రముఖ పాత్ర పోషించారు. ఇక ఎన్నికల సమయంలో పవన్, నాగబాబు సోదరులు పూర్తి సమయాన్ని ప్రచారానికే కేటాయించారు. సామాజిక న్యాయం పిఆర్పీ ద్వారానే సాధ్యమని చెపుతూ బలమైన కాంగ్రెసు, టిడిపిలపై విరుచుకు పడ్డారు. పవన్ అయితే మరో ముందడుగు వేసి షబ్బీర్ అలీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు, కాంగ్రెసు నేతల పంచెలూడదీసి కొట్టాలి అని ధ్వజమెత్తారు. ఒకవిధంగా చెప్పాలంటే గత సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లు గెలుచుకోవడంలో చిరు మీద అభిమానానికి తోడు నాగబాబు, పవన్ ప్రచారం ప్రభావం చూపిందనడం ఎవరూ కాదనలేని నిజం. పిఆర్పీ నిలబడటానికి చిరంజీవి కన్నా పవన్, నాగబాబులే ఎక్కువ కృషి చేశారనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు.


అలాంటి నాగబాబు, పవన్ నిర్ణయంతో సంబంధం లేకుండానే చిరంజీవి తన బావమరిది అల్లు అరవింద్‌తో కలిసి పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేని చిరంజీవి బావమరిది, తమ్ముళ్ల ప్రోత్సాహంతోనే వచ్చినట్టు వార్తలు వచ్చాయి. పార్టీ పెట్టాక అల్లు అరవింద్ అజమాయిషీ ఎక్కువైందన్న ఆరోపణలు వచ్చాయి. చిరుకు తెలియకుండా అల్లు టిక్కెట్లు అమ్ముకున్నాడన్న ఆరోపణలు కూడా వచ్చాయి. పార్టీ పెట్టిన కొద్ది రోజులలోనే మంచి మంచి నాయకులు అల్లు అరవింద్‌తో వేగలేక బయటకు వెళ్లిపోయారు. బయటకు వెళ్లిన వారు చిరంజీవిని అల్లు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గత కొన్నాళ్లుగా తమ్ముళ్లు కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అభిమానులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, కాంగ్రెసు, టిడిపిలకు ప్రత్యామ్నాయంగా సామాజిక న్యాయం దిశగా దూసుకు వెళతామని చెప్పిన తాము ఇప్పుడు అభిమానులకు ఏం చెప్పాలని నాగబాబు, పవన్ అంతర్మథనంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో 18 సీట్లు కొత్తగా వచ్చిన పార్టీ గెలుచుకోవడం సాధారణ విషయం ఏమీ కాదని, ఇలాంటి సమయంలో కాంగ్రెసు, టిడిపిలో ఉన్న సంక్షోభాలను క్యాష్ చేసుకొని 2014 వరకు అధికారంలోకి ఎలా రావాలా అనే విషయంపై దృష్టి సారించకుండా కాంగ్రెసులో పిఆర్పీ విలీనం చేయడంపట్ల తమ్ముళ్లు తీవ్ర నిరాశలో మునిగినట్లుగా తెలుస్తోంది. బావమరిది అల్లు అరవింద్ చిరంజీవిని పార్టీ పెట్టినప్పటినుండి తప్పుదారి పట్టిస్తున్నాడనే యోచనలో వారు ఉండిపోయినట్లుగా సమాచారం. అన్నను తప్పుదారి పట్టిస్తుండటంతో అల్లు అరవింద్‌తో వేగలేక వారు ప్రస్తుతం తమ తమ సొంత వ్యాపకాల్లో మునిగి పోతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే గత కొన్నాళ్లుగా వారు రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెసుతో విలీనం ప్రకటన తర్వాత పవన్ సినిమాలపై దృష్టి సారించినట్టుగా సమాచారం. నాగబాబు కూడా తన భవిష్యత్తుపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం తమ తమ వ్యాపకాల్లో దృష్టి సారించిన పవన్, నాగబాబు తర్వాత అయినా అన్న బాటలో కాంగ్రెసు వైపు పయనిస్తారా అంటే ఖచ్చితంగా చెప్పలేమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చిరు కాంగ్రెసు వైపు వెళ్లడమే ఇష్టం లేని పవన్ కాంగ్రెసులో చేరి అన్నకు మద్దతుగా నిలిచే అవకాశాలు తక్కువగానే ఉంటాయని తెలుస్తోంది. రాజకీయాల్లోకి రాకుండా ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. ఒకవేళ వస్తే కనుక భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా వాదనలు వినిపిస్తున్నాయి. పవన్‌కు బిజెపి నేతలతో మంచి సంబంధాలు ఉండటమే ఇందుకు కారణం. అయితే బిఎస్పీతో వెళ్లే అవకాశాలను కూడా కొట్టి పారేయలేక పోతున్నారు

ఎన్టీఆర్ తోక కత్తిరించడానికి ఆయన ఏ మాత్రం వెనకాడరు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు, తన అల్లుడు నారా లోకేష్‌కు సినీ హీరో బాలకృష్ణ పూర్తి మద్దతు లభిస్తోందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలను లోకేష్‌కు అప్పగించాలనే చంద్రబాబు ఆలోచనను బాలకృష్ణ సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం బాలకృష్ణ చెప్పిన మాటలు దాన్ని బలపరుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు లేదని, చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ఇప్పటికిప్పుడు సర్దుబాటు కోసమే ఆయన ఆ మాటలు అన్నా చాప కింద నీరులా లోకేష్‌కు పట్టం కట్టడానికి చంద్రబాబు చేస్తున్న ఏర్పాట్లకు బాలయ్య మద్దతు ఉందని అంటున్నారు.


నారా లోకేష్‌ను తన వారసుడిగా నిలబెట్టాలనే చంద్రబాబు వ్యూహాన్ని దెబ్బ తీయడానికి నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ముందుకు దూకి, కృష్ణా జిల్లా పార్టీలో ముసలం పుట్టించారని అంటారు. ఆ తర్వాత సమయం, సందర్భం కలిసి రాకపోవడంతో వారు తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. లోలోపల మాత్రం హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తమ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు చెబుతున్నారు. కేంద్ర మంత్రి, ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా చంద్రబాబు ప్లాన్‌ను దెబ్బ కొట్టే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, బాలకృష్ణ మాత్రం చంద్రబాబు వెంట ఉండడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

నందమూరి కుటుంబ సభ్యులను చీల్చడంలో చంద్రబాబు విజయం సాధించారనే చెప్పాలి. తన కుమారుడు లోకేష్‌తో బాలయ్య కూతురు బ్రాహ్మణికి పెళ్లి చేయడంలోని చంద్రబాబు ముందు చూపు అదేనని అంటున్నారు. భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ పని చేసినట్లు చెబుతున్నారు. తన అల్లుడు లోకేష్‌కు వ్యతిరేకంగా పని చేసి జూనియర్ ఎన్టీఆర్‌ను బాలయ్య బలపరచడమనేది కలలోని మాటనే. నిజానికి, బాలయ్యకు, ఎన్టీఆర్‌కు మధ్య సంబంధాలను కలిపింది కూడా చంద్రబాబు నాయుడే. ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకోవడానికి ఆయన ఆ పని చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు అంత మేరకే చూస్తారు. అంతకు మించి పార్టీలో ఎదగాలని ప్రయత్నాలు చేస్తే జూనియర్ ఎన్టీఆర్ తోక కత్తిరించడానికి ఆయన ఏ మాత్రం వెనకాడరు. ప్రస్తుతం బాలయ్యతో కలిసి చంద్రబాబు నడుపుతున్న రాజకీయం అదేనని అంటున్నారు.

20, ఏప్రిల్ 2011, బుధవారం

కడప లోకసభకు, పులివెందుల శాసనసభకు జరుగుతున్న ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తప్పదా? ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుందని, ఈ ఉప ఎన్నికలు మార్పునకు నాంది అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప అభ్యర్థి వైయస్ జగన్ తన ఎన్నికల ప్రచారం పదే పదే చెబుతున్నారు. ఆ మార్పు కాంగ్రెసును కూలదోసి తాను అధికారంలోకి రావడానికి అనువైందనేది ఆయన చెప్పకున్నా అర్థం చేసుకోవచ్చు. వైయస్సార్ సువర్ణ పాలనకు తన రాజకీయాలు పాదులు వేస్తాయని ఆయన అంటున్నారు. అయితే, కడప ఉప ఎన్నికల ఫలితాలకు అంత చేవ ఉందా అనేది ప్రశ్న.


నిజానికి కడప, పులివెందుల ఉప ఎన్నికలు వైయస్ జగన్‌కు మాత్రమే జీవన్మరణ సమస్య. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిస్తే జగన్ రాజకీయాలు ఊపందుకునే అవకాశాలు ఉంటాయి. ఓడిపోతే మాత్రం జగన్ రాజకీయాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. ఈ విషయం వైయస్ జగన్‌కు తెలుసు. ఈ ఎన్నికల్లో కాంగ్రెసు ఓడిపోతే మరింత మంది శాసనసభ్యులు తన వెంట వస్తారని జగన్ భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి అవసరమైనంత బలం తనకు సమకూరుతుందని జగన్ భావిస్తూ ఉండవచ్చు. బహుశా పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి అందుకే రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తప్పవని మంగళవారంనాడు వ్యాఖ్యానించి ఉంటారు.

కానీ, ఉప ఎన్నికల తర్వాత జగన్‌కు అంత సీన్ ఉంటుందా అనేది అనుమానమే. ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి గానీ కాంగ్రెసు పార్టీకి గానీ జరిగే నష్టం ఏమీ లేదు. గెలిస్తే మాత్రం జాక్‌పాట్ కొట్టినట్లే. అయితే, గెలిచే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు రెండవ స్థానం కోసమే పోటీ పడవచ్చు. రెండో స్థానం సాధించే పార్టీలు కాస్తా ఆనందించడానికి, మూడో స్థానం లభిస్తే కాస్తా కుండిపోవడానికి మాత్రమే ఈ రెండు పార్టీలకు ఉప ఎన్నికలు ఉపయోగపడుతాయి. కాంగ్రెసు మూడో స్థానంలో ఉంటే మాత్రం నష్టపోయే ప్రమాదం ఉంది. తెలుగుదేశం పార్టీపై కూడా అటువంటి ప్రభావమే పడుతుంది. ఏమైనా, ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలను మార్చే సీన్ జగన్‌కు లేదని చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం రెడ్డి వర్సెస్ వెలమగా మారింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం రెడ్డి వర్సెస్ వెలమగా మారింది. మరో వైపు ఈ రెండు అగ్రకులాల ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టడానికి బిసిలు ఏకమవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆధిపత్యంలో తెలంగాణ ఉద్యమం సాగుతుండడం పట్ల రెడ్డి నాయకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. పైగా, కెసిఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణ ఉద్యమ నేతలుగా ముందుకు వచ్చారు. కెసిఆర్ కుమారుడు కెటి రామారావు, కూతురు కవిత, మేనల్లుడు హరీష్ రావు తెలంగాణ ఉద్యమాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బిజెపి నాయకుడు సిహెచ్ విద్యాసాగర రావు కూడా వారితోనే ఉంటున్నారు. ఈ స్థితిలో తెలంగాణ ఉద్యమాన్ని తమ నాయత్వంలోకి తీసుకోవడానికి రెడ్లు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ని ముందుకు తేవాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి.


ఆదివారంనాడు రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన జైపాల్ రెడ్డిపై, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై తెరాస కార్యకర్తలు కోడి గుడ్లు విసిరారు. తెలంగాణ ఉద్యమం పెరిగితే కెసిఆర్ కుటుంబ సభ్యులు, వెలమ కులానికి చెందిన వారే లబ్ధి పొందుతారనే ప్రచారాన్ని రెడ్లు చాప కింద నీరులా సాగిస్తున్నారు. తెలంగాణలో వెలమల జనాభా చాలా తక్కువ. రెడ్ల జనాభా వారికన్నా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఆధిపత్యంలో కూడా వారిదే పైచేయి. అయితే, తెలంగాణ ఉద్యమం విషయంలో మాత్రం కెసిఆర్ హవా సాగుతోంది. రాజకీయంగా బలోపేతం కావడానికి కెసిఆర్ కోదండరామ్ నాయకత్వంలోని రాజకీయ జెఎసిని బాగా వాడుకున్నారు. అయితే, మిలియన్ మార్చ్ విషయంలో కోదండరామ్‌కు, కెసిఆర్‌కు మధ్య విభేదాలు పొడసూపాయి. ఈ నేపథ్యంలో కోదండరామ్ జెఎసి స్థానంలో మరో వేదికను ఏర్పాటు చేయాలనే యోచనలో కెసిఆర్ ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

కెసిఆర్‌కు, కోదండరామ్‌కు మధ్య పొడసూపిన విభేదాల నేపథ్యంలో ఎస్ జైపాల్ రెడ్డి ముందుకు వచ్చినట్లు సమాచారం. కోదండరామ్ నాయకత్వంలో రెడ్డి నాయకులు పనిచేయడానికి సిద్ధపడాలనే సందేశాన్ని ఆయన ఇస్తున్నట్లు భావిస్తున్నారు. పైగా, జైపాల్ రెడ్డి కోదండరామ్‌ను ప్రశంసిస్తున్నారు కూడా. మిలియన్ మార్చ్ విజయవంతమైందని జైపాల్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అందువల్లనే తెరాస ఆ ఇద్దరిని లక్ష్యంగా చేసుకున్నట్లు భావిస్తున్నారు. కోదండరామ్ నాయకత్వంలోని జెఎసిని బలోపేతం చేయాలని జైపాల్ రెడ్డి భావిస్తున్నారట. కోదండరామ్‌ను ముందు పెట్టి రెడ్డి నాయకులను ఏకం చేయడంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగం జనార్దన్ రెడ్డి ఎప్పటికప్పుడు తిరుగుబాటు వ్యాఖ్యలు చేయడం ఇందులో భాగమేనని అంటున్నారు. జెఎసిలో కీలక పాత్ర వహించేందుకు తగిన రంగాన్ని జైపాల్ రెడ్డి సహకారంతో నాగం జనార్దన్ రెడ్డి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే, రెడ్డి, వెలమ నాయకుల ఆధిపత్యాన్ని దెబ్బ తీయడానికి బిసి నాయకులు మరో వైపు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కోదండరామ్ నాయకత్వంలో అన్ని పార్టీలకు చెందిన రెడ్డి నాయకులు పని చేయడానికి సిద్ధపడుతున్నారు. నాగం జనార్దన్ రెడ్డితో పాటు సిపిఐ నాయకుడు సురవరం సుధాకర రెడ్డి, బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి వంటి నాయకులకు కోదండరామ్‌తో కలిసి పనిచేయడానికి ఏ విధమైన అభ్యంతరాలు లేవని చెబుతున్నారు. ఈ స్థితిలో తెలంగాణ ఉద్యమం మే నెల నాటికి కీలక మలుపు తిరుగవచ్చునని అనుకుంటున్నారు.

అపర చాణక్యుడు ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయారు.

రాష్ట్ర రాజకీయాల్లో అపర చాణక్యుడు పేరుగాంచిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయారు. రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు నిరాఘటంగా పాలించిన చంద్రబాబు తన పాలనా కాలంలో అడ్మినిస్ట్రేషన్‌ను పరుగులు పెట్టించారు. రాష్ట్రంలో భారీ సంస్కరణలు చేశారు. రాష్ట్రం వరకే పరిమితం అయిన హైదరాబాదు నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లారు. ఐటితో యువతకు భారీగా ఉపాది కల్పించారు. రాజకీయ ఎత్తుగడల్లో తనను మించిన వారు లేరని విపక్షాలు, విమర్శకుల చేత సైతం పొగడ్తలు అందుకున్నవాడు. ఇలా తనదైన శైలిలో రాష్ట్ర రాజకీయాల్లో, దివంగత నందమూరి తారక రామారావు తర్వాత అంత పేరు సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు పరిస్థితి చూసి సొంత పార్టీ మాత్రమే కాకుండా ఆయన వైరి పార్టీలు కూడా సైతం జాలిపడే స్థితికి దిగజారడం శోచనీయం.


ప్రస్తుత చంద్రబాబునాయుడు పరిస్థితి చూసిన వారు నాటి రాజకీయ చాతుర్యం ఎక్కడకు పోయిందని ప్రశ్నించుకుంటున్నారు. ఓ వైపు తెలంగాణ, మరో వైపు జగన్, ఇంకోవైపు కుటుంబ కలహాల మధ్య బాబు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ఏర్పడిన టిఆర్ఎస్ పార్టీ నేతలు తెలంగాణ తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అని చెప్పుకుంటున్న అధికార కాంగ్రెసు పార్టీని వదిలి టిడిపిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. నిత్యం చంద్రబాబునే టార్గెట్ చేసుకుంటూ రెండు కళ్ల సిద్దాంతంపై ప్రశ్నిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీని మరింత బలపర్చాలంటే కాంగ్రెసు కన్నా టిడిపిని ముందుగా దెబ్బతీయాలనే యోచనలో కెసిఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకే ఆయన టిడిపిని టార్గెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పలువురి మాటల్లో చెప్పాలంటే కెసిఆర్‌కు ప్రత్యేక తెలంగాణ కన్నా టిడిపి దెబ్బతీయడంపైనే ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా కెసిఆర్ టిడిపి ఎమ్మెల్యేలను ఒక్కరొక్కరిని బయటకు తీసుకు వస్తున్నారు.

ఇప్పటికే బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డిని టిఆర్ఎస్‌లో లాగారు. ఉప ఎన్నికల కోసం రాజీనామా చేసిన చెన్నమనేని రమేష్‌కు టిక్కెట్ ఇచ్చి గెలిపించారు. అంతకుముందు రమేష్ టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక తదుపరి లక్ష్యంగా పాల్వాయి రాజ్యలక్ష్మిని చేసుకున్నారు. ఆమెను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో బాబుకు తెలంగాణలో ఎమ్మెల్యేలను రక్షించుకోవడం కష్టతరంగా మారింది. అందుకే పోచారం రాజీనామా ఆమోదానికి టిడిపి కూడా ఆసక్తి కనబర్చడం లేదు. ఇక టిఆర్ఎస్ సంగతి అలా ఉంటే పార్టీలో ఉంటూ నాగం జనార్ధన్ రెడ్డి బాబుకు ముచ్చెమటలు పోయిస్తున్నారు. పార్టీ వీడకుండానే పార్టీని ముప్పుతిప్పలు పెడుతూ కంటిలో నలుసులా మారారు. ఇక టిడిపికి గట్టి పట్టు ఉన్న కోస్తా జిల్లాల్లో జగన్ దెబ్బ కొడుతున్నారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బాబును విమర్శిస్తూ జగన్ వెంట వెళుతున్నారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి పార్టీ పెట్టి బాబును అధికారంలోకి రాకుండా చేశారు. 2014లో అధికారంలోకి వద్దామనుకుంటున్న బాబుకు ఇప్పుడు జగన్ అడ్డు పడేలా కనిపిస్తున్నారు.

ఇవన్నీ సమస్యలు ఇలా ఉంటే బాబుకు ఇటీవలే మరో సమస్య పట్టుకుంది. అది వారసత్వ సమస్య. బాబు తనయుడు లోకేష్ కుమార్‌ను చంద్రబాబు హైప్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఉద్దేశ్యంతో హరికృష్ణ రంగంలోకి దిగినట్లుగా వార్తలు వచ్చాయి. హరికృష్ణ ప్రత్యక్ష యుద్దానికి దిగకుండా విజయవాడ గలాటాకు తలుపులు తెరిచారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ సమస్య చల్లబడింది. అయితే సహజంగా ఆవేశ పరుడు అయిన హరికృష్ణ తన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం ఎప్పుడు ఎలా ఆగ్రహం వ్యక్తం చేస్తారో తెలియని పరిస్థితి. ఈ స్థితిలో త్వరలో జరగనున్న మహానాడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మహానాడుకు హరికృష్ణ రాకుంటే దూరం పెరిగిందని, వస్తే ఎప్పుడు ఏం మాట్లాడుతారో అనే భయం పచ్చదళంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వారసత్వ పోరు సద్దుమణిగినప్పటికీ తెలంగాణ, జగన్, నాగం తదితర సమస్యలు హైటెక్ సిఎంను పట్టి పీడిస్తున్నాయి. అయితే సహజంగా చాణక్య తెలివిగల చంద్రబాబు వీటన్నింటిని అధిగమించగలడని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు జూ.ఎన్టీఆర్‌ను నందమూరి కుటుంబానికి దగ్గర చేసిన సందర్భాన్ని కూడా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణపై బాబు రెండు కళ్ల సిద్ధాంతం ప్రస్తుతం కాకపోయినా భవిష్యత్తులో ప్రయోజం ఉంటుందని కూడా బావిస్తున్నారు.

19, ఏప్రిల్ 2011, మంగళవారం

శ్రీ భగవాన్ సత్యసాయి అధ్యక్షుడిగా ఉన్న సత్యసాయి ట్రస్టు ఆస్తులు రూ.1.30 లక్షల కోట్లు అని ఆ ఆస్తుల కోసం ఆయన చుట్టూ చేరిన వారు పలువురు దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలకు సేవ చేయడం కోసం బాబా నిర్మించిన భక్తి సామ్రాజ్యంలో దొంగలు పడి నిలువుగా దోచుకుంటునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తు ఆంధ్రజ్యోతి దిన పత్రిక ఆదివారం ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. పుట్టపర్తి అంటే భగవాన్ సత్యసాయి బాబా, ఆయన భక్తులు మాత్రమే కాదు! ఇదో విశాల సామ్రాజ్యం! దేశ దేశాల్లో ఉన్న ట్రస్టు స్థిరాస్తులతోపాటు ప్రశాంతి నిలయంలో ఉన్న కోట్లలో నగదు, టన్నుల్లో బంగారం, వజ్ర వైఢూర్యాల విలువ లక్షా ముప్పైవేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఒక అంచనా! ఇది సాయిబాబాను సాక్షాత్ భగవత్ స్వరూపుడిగా నమ్మి, నివేదించుకున్న భక్తి సంపద. ఇలా భక్తులు సమర్పించుకున్న దానిలో కొంతమాత్రమే ట్రస్టు ఖాతాలో పడుతోంది! మిగిలింది, ట్రస్టులోని కొందరు సభ్యుల సొంత ఖాతాల్లో జమ అవుతోంది. బాబా ఆస్పత్రిలో చేరిన తర్వాత ఈ డబ్బును అత్యంత రహస్యంగా, పకడ్బందీ భద్రత మధ్య తరలించే కార్యక్రమం మొదలైంది.


ప్రశాంతి నిలయానికి సమీపంలో ఉండే ఐటీ కోర్ బిల్డింగ్ నుంచే ఈ వ్యవహారం నడుస్తోంది. ఒకవైపు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వేదికగా భగవాన్ సత్యసాయి ఆరోగ్యంతో ఆడుకుంటూ... మరోవైపు ఐటీకోర్ బిల్డింగ్ కేంద్రంగా దోపిడీపర్వం కొనసాగిస్తున్నారు. ఇక్కడ కొద్ది రోజులుగా హడావుడి పెరిగింది. కంప్యూటర్ల కీ బోర్డులు టకటకలాడుతున్నాయి. సుమారు 165 దేశాల్లోని పలువురు వ్యక్తుల ఖాతాల్లో ఆన్‌లైన్ మార్గంలో డబ్బులు పడిపోతున్నాయి. ఈ బిల్డింగ్ శత్రు దుర్బేధ్యం. నల్లధనమైనా, తెల్లధనమైనా, హవాలా అయినా, ఏ దేశ కరెన్సీ అయినా ఇక్కడి నుంచి క్షణాల్లో ఆన్‌లైన్‌లో సర్దుబాట్లు జరిగిపోతుంటాయి. గత నెల 28న బాబా ఆస్పత్రి పాలయ్యాక ఐటీ కోర్ బిల్డింగ్‌ను దోపిడీ సూత్రధారులు పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. నమ్మిన బంట్ల ద్వారా వాటాలు సెటిల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు దోపిడీకి గురవుతున్నది, సెటిల్‌మెంట్లు జరుగుతున్నది భక్తులు కానుకగా సమర్పించుకున్న సంపదే కాదు! ఎందరో ప్రముఖులు దాచుకున్న నల్ల డబ్బు కూడా!

ఇది దిగ్భ్రాంతికరమైన విషయం. పోలీసులు, ఆదాయపు పన్ను, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల అధికారులెవరూ ప్రశాంతి నిలయం వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేరు. దీంతో ట్రస్టులోని కొందరు వ్యక్తులు ప్రశాంతి నిలయాన్ని ఒక హవాలా కేంద్రంగా మార్చారనే ఆరోపణలున్నాయి. బడా బడా వ్యక్తులు, ప్రముఖులు తమ నల్లధనాన్ని దాచుకునేందుకు పుట్టపర్తిని అత్యంత సురక్షితమైన స్థలంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయల నగదు దాచుకోవడం... అవసరమైనప్పుడు తీసుకోవడం... ఇదో హవాలా బజార్! పుట్టపర్తి వ్యవహారాలను చాలా ఏళ్లపాటు దగ్గరుండి పరిశీలించిన ఒక పోలీసు అధికారి మాటల్లో చెప్పాలంటే... 'ఇది ఒక మినీ స్విస్ బ్యాంక్'. కేంద్ర మాజీ మంత్రులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు, అనేక మంది మంత్రులు ఇక్కడ 'ఖాతాలు' తెరిచినట్లు విశ్వసనీయ సమాచారం. మహారాష్ట్రకు చెందిన ఓ మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ 2 వేల కోట్లు దాచుకున్నట్లు సమాచారం.

బాబా అస్వస్థతకు గురి కాగానే ఆ నాయకుడు పరిగెత్తుకుంటూ పుట్టపర్తికి వచ్చారు. అలాగే... మహారాష్ట్రకే చెందిన ఓ మాజీ మంత్రి పుట్టపర్తిలో మరో వెయ్యి కోట్లు పెట్టినట్లు చెబుతున్నారు. సత్యసాయికి సంబంధించిన ధార్మిక వ్యవహారాలు చూడాల్సిన ట్రస్టులోని కొందరు సభ్యులే... ఈ 'నల్ల' కార్యక్రమాలకు తెరలేపినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఈ రహస్య లావాదేవీలన్నింటినీ చక్కదిద్దేందుకు ప్రణాళికలు రచించి, దానిని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వంలోని పెద్దల్ని, కొందరు అధికారుల్ని ముందుగానే మచ్చిక చేసుకున్నారు. ఇప్పుడు నడుస్తున్నది... సూత్రధారుల మధ్య పంపకం!

జగన్నాయకుడు ఓ చిత్రం

మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం త్వరలో రానుందని సమాచారం. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మృతి అనంతరం కాంగ్రెసులో ఆయన ఎదుర్కొన్న సమస్యలు, అనంతరం ఆయన పార్టీ వీడటం, ఆ తర్వాత పార్టీ పెట్టడం తదితర విషయాలు పొందు పరుస్తూ శ్రీరామ్ అనే దర్శకుడు చిత్రం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి జగన్నాయకుడు అనే పేరును కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.


శ్రీరామ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి మంచి అభిమాని. ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ప్రవేశ పెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు మరింత ఆకర్షితుడయ్యాడంట. ఆయనను వైయస్ మృతి తీవ్రంగా కలిచి వేసింది. అయితే వైయస్ మృతి తర్వాత జగన్‌ను ఆయన బాగా ఆరాధించాడు. అయితే అలాంటి జగన్ ఎంపీగా కాంగ్రెసు పార్టీని విభేదించి బయటకు వచ్చి వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీని పెట్టాడు.

ఇడుపుల పాయ వద్ద ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చేపట్టిన ఓదార్పు యాత్ర, కాంగ్రెసులో ఉన్నప్పుడు పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టిన ఓదార్పు, తండ్రి ఆశయాలు సాధించే వ్యక్తిగా ఇలా ఈ సంవత్సరంన్నరగా జగన్ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన జగన్నాయకుడులో పొందు పర్చనున్నారని సమాచారం.

జగన్ వర్గం నేతలపై యాక్షన్ ప్లాన్‌కు పార్టీ సిద్ధపడుతోంది.

మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం నేతలపై యాక్షన్ ప్లాన్‌కు పార్టీ సిద్ధపడుతోంది. పార్టీ అభ్యర్థిగా గెలిచి జగన్ వెంట నడుస్తున్న తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే ఉద్దేశ్యంతో పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. కడప ఉప ఎన్నికలకు ముందే వారిపై అనర్హత వేటు వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ఆదివారం ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలు బాలనాగి రెడ్డి , ప్రసన్నకుమార్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అనర్హత వేటు ప్రకటించే అవకాశం ఉంది.


అయితే తాను శాసన సభ్వత్వానికి రాజీనామా చేసినందున దాన్ని ఆమోదించాలని పోచారం పట్టుబడుతున్నారు. ముందుగానే తాము అనర్హత పిటిషన్‌ వేసినందున దాన్ని తేల్చాలని తెదేపా కోరుతోంది. దీనిపై డిప్యూటీ స్పీకర్‌ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. సోమవారం దీనికి సంబంధించి ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఆదివారం ఏజితో కూడా కలిసి చర్చించారు. కాంగ్రెస్‌ శాసనసభా పక్షం కూడా ఫిర్యాదుకు సిద్ధం కావడంతో పెండింగ్‌ పిటిషన్లపై తుది నిర్ణయానికి డిప్యూటీ స్పీకర్‌ సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. అనంతరం జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటుకు రంగం సిద్ధం చేసుకునే చర్యలు ప్రారంభించేందుకు ఉదయుక్తమయినట్టుగా సమాచారం.

ఇందులో భాగంగా తొలిదశలో నలుగురిపై చర్యలు తీసుకోవడానికి పార్టీ అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండు, మూడురోజుల్లో కాంగ్రెస్‌ శాసనసభా పక్షం ఈ మేరకు నాదెండ్లకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. కడప జిల్లా ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అమరనాథ్‌రెడ్డి, వరంగల్‌ జిల్లాకు చెందిన కొండా సురేఖపై తొలిసారి ఫిర్యాదు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నలుగురు ఎమ్మెల్యేలు కడప ఉప ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వై.ఎస్‌.ఆర్‌ కాంగ్రెస్‌కు బహిరంగంగా పనిచేస్తున్నారని కాంగ్రెస్‌ భావిస్తోంది. వీరితోపాటు కోస్తాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు కూడా అనర్హత వేటు జాబితాలో చేరవచ్చునని పార్టీ వర్గాలంటున్నాయి.

దివంగత వైఎస్ మరణానంతరం రోశయ్య మంత్రివర్గంలో తాను కొనసాగలేనంటూ కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పట్లోనే ఆమె పార్టీపై, రోశయ్యపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత నేరుగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి నేరుగా లేఖ రాసి కలకలం సృష్టించారు. వీలైనప్పుడల్లా కాంగ్రెసుపై ధ్వజమెత్తింది. అధిష్టాన్ని ప్రశ్నించింది. వీరితో పాటు జగన్‌తో వెళుతున్న మరికొందరు ఎమ్మెల్యేలపై పార్టీ నేతలంతా చాలా కాలంగా సీరియస్‌గా ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు గట్టిగా పార్టీని డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే కాంగ్రెస్‌కు అసెంబ్లీలో స్వల్ప ఆధిక్యం ఉండడం కారణంగా ఇన్నాళ్లు వేచి చూసే ధోరణిలో వెళ్లింది. 18 మంది ఎమ్మెల్యేలున్న ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు పలకడం, ఆ తరువాత కాంగ్రెస్‌లోనే విలీనమయ్యేందుకు సిద్ధం కావడంతో కాంగ్రెస్‌ వైఖరిలో మార్పు వచ్చింది. కడప ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేల తీరును పరిశీలించాక ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావించారు. అధిష్ఠానం నాలుగురోజుల కిత్రం ఢిల్లీలో ఈ విషయంపైనే కీలక చర్చలు జరిపింది. ఆ మేరకే ఇప్పుడు అనర్హత ఫిర్యాదుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు డిప్యూటీ స్పీకర్‌ వద్ద విచారణలో ఉన్నాయి.

ఇక కాంగ్రెసు పార్టీ కూడా పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం ప్రకారం అనర్హత వేటుకు తమ వద్ద సాక్ష్యాలున్నాయని భావిస్తోంది. ఎన్నికైన పార్టీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు కార్యకలాపాలు సాగిస్తే స్వచ్ఛందంగా తమ పదవిని వదులకున్నట్లుగా భావించవచ్చనే విధంగా చట్టంలో ఉందని పార్టీ నేతలంటున్నారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికైన పార్టీని విమర్శిస్తూ, వేరే పార్టీ వేదికపై మాట్లాడిన ఎమ్మెల్యేలను స్పీకర్లు అనర్హత వేటు వేసిన సందర్భాలను ఉదహరిస్తున్నారు

జగన్‌కు ఆ హీరో దూరమే

దివంగత వైయస్ రాజశేఖరరెడ్డికి చాలా దగ్గరగా ఉన్న యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ - జీవిత దంపతులు వైయస్ తనయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి క్రమంగా దూరం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా రాజశేఖర్ - జీవిత జాడే లేదు. మొదట తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఆ తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి దరి చేరి రాజశేఖర్ దంపతులు వైయస్ మృతి తర్వాత మాత్రం జగన్‌కు మద్దతుగా మాట్లాడింది ఎప్పుడూ లేదు. ప్రజల కోసం దివంగత వైయస్ చేపట్టిన పలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తాను కాంగ్రెసు పార్టీలో చేరామని చెప్పిన రాజశేఖర్ దంపతులు ఆ తర్వాత పార్టీలో ప్రముఖంగా కనిపించారు. 2007లో చిరంజీవి అభిమానులుగా పేర్కొన్న పలువురు రాజశేఖర్ కారుపై దాడి చేయడంతో వైయస్ - రాజశేఖర్ దంపతుల ఆత్మీయ బంధం మరింత ఎక్కువయింది.


వారు కాంగ్రెసు పార్టీలో చేరిన తర్వాత వైయస్‌ను గానీ, జగన్‌ను గానీ, కాంగ్రెసు పార్టీని కానీ ఎవరైనా విమర్శించినా తిప్పి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. వైయస్‌పై ఈగ కూడా వాలనీయలేదు. చిరంజీవిపై ఉన్న కోపంతో గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరఫున భారీగానే ప్రచారం చేశారు. కాంగ్రెసు పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు. చిరంజీవిని లక్ష్యంగా చేసుకొని చాలా ఆరోపణలు చేశారు. ఓ సమయంలో కాంగ్రెసు పార్టీలో జీవితకు ఓ ముఖ్యమైన పదవి వస్తుందనే వాదనలు కూడా వినిపించాయి. అయితే ఆ సమయంలో వైయస్ దుర్మరణం చెందారు. అప్పటి నుండి రాజశేఖర్ దంపతుల నుండి ఎలాంటి సందడి లేదు. వైయస్ ఉన్నన్నాళ్లూ చిరంజీవిపై విరుచుకు పడిన, వైయస్‌కు అండగా ఉన్న రాజశేఖర్ దంపతులు ఆయన మరణం తర్వాత మాత్రం జగన్‌కు అంతగా మద్దతు పలికిన దాఖలాలు లేవు.

గతంలో విజయవాడలో జగన్ చేపట్టిన జలదీక్షలో మాత్రమే రాజశేఖర్ దంపతులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఓ నాయకుడి ఇంట్లో జరిగిన విందులో కూడా తాము జగన్ వెంటే ఉంటామని కూడా ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఎక్కడా ఓదార్పులో పాల్గొన్న సందర్భం గానీ, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీని సమర్థించినట్టుగా కానీ, కడప ఉప ఎన్నికల ప్రచారంలో కానీ కనిపించింది లేదు. జగన్‌తో ఉంటే ఫలితం లేదనే పునరాలోచనలో వారు పడినట్లుగా తెలుస్తోంది. వైయస్ ఉన్నప్పుడు వీరికి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే జగన్ వద్ద తమకు అంతగా ప్రాధాన్యం ఉండదనే ఉద్దేశ్యంతోనే వారు జగన్‌కు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తోంది. జగన్ పార్టీలో ఇప్పటికే వరంగల్ జిల్లా శాసనసభ్యురాలు కొండా సురేఖ, సినీ నటి రోజా, వాసిరెడ్డి పద్మ, శోభానాగిరెడ్డి తదితరులు ఉన్నారు. అలాంటి ప్రధాన నాయకురాళ్లు ఉన్నప్పుడు జగన్ వెంట వెళ్లినా లాభం లేదనే ఉద్దేశ్యంలో రాజశేఖర్ దంపతులు ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరోవైపు వైయస్ బాటలో ఉంటూ కాంగ్రెసు పార్టీలో ఉండాలని ఉన్నప్పుటికి తాను ప్రధానంగా వ్యతిరేకించే చిరంజీవి కాంగ్రెసు పార్టీలో చేరటం వారికి మింగుడు పడని విషయం. ఇటు చిరంజీవి రాక కారణంగా ఇటు ఇన్నాళ్లు ఉన్న కాంగ్రెసు పార్టీతో ఉండలేక, అటు పలువురు ఫైర్ బ్రాండ్‌లు వైయస్ తనయుడు జగన్ చుట్టూ ఉండటంతో వారు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. దీంతో వారు తాము మొదట అడుగిడిగిన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. టిడిపికి బద్ద శత్రువు అయిన కాంగ్రెసులో చిరు ఉండటంతో ఆయనపై నిప్పులు కక్కే అవకాశం వీరికి ఉంటుంది. అంతేకాదు టిడిపిలో అంతగా పేరు బడ్డ మహిళా నేతలు లేక పోవడం కూడా జీవితకు కలిసి వస్తుందని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారు త్వరలో రాజకీయ నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.

కెవిపి రామచందర్ రావు రాజీనామాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆమోదిస్తుందా ?

రాష్ట్ర భద్రతా సలహాదారు పదవికి రాజ్యసభ సభ్యుడు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియ మిత్రుడు కెవిపి రామచందర్ రావు రాజీనామాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆమోదిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐటి సలహాదారు సిఎస్ రావు, పారిశ్రామిక సలహాదారు సిసి రెడ్డి చేసిన రాజీనామాలను ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. వీరిద్దరు కూడా వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులు. ఈ నేపథ్యంలో కెవిపి రామచందర్ రావు రాజీనామాను కూడా ప్రభుత్వం ఆమోదించవచ్చుననే ప్రచారం జరుగుతోంది.

కెవిపి రామచందర్ రావు రాజీనామాతో పాటు సలహాదారుల పదవులకు పీటర్ హసన్, సోమయాజులు చేసిన రాజీనామాలు కూడా పెండింగులో ఉన్నాయి. వైయస్ మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కెవిపి రామచందర్ రావు పదవిలో కొనసాగారు. రోశయ్యతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. అయితే, తాను ముఖ్యమంత్రి కాగానే ప్రభుత్వ సలహాదారులను తొలగిస్తామని కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కెవిపి రామచందర్ రావుతో పాటు మిగతా ప్రభుత్వ సలహాదారులు పదవులకు రాజీనామాలు చేశారు. నెలల క్రితం చేసిన రాజీనామాలు ఇప్పటికీ పెండింగులో ఉన్నాయి.

అవినీతి సమస్య పైన యువతరం స్పందించటం ఆహ్వానించ తగ్గ విషయమే.

అవినీతి సమస్య పైన యువతరం స్పందించటం ఆహ్వానించ తగ్గ విషయమే. ఒక న్యాయమైన సమాజాన్ని కోరుకోవటం సమంజసమే. కానీ ఆచరణలో అవినీతిని ఎలా నిర్మూలిస్తాం? సత్యాగ్రహాలు, దండియాత్రలు, వినతి పత్రాలతో యీ లక్ష్యం నెరవేరుతోందా? లోక్ పాల్ బిల్లు అవినీతికి అడ్డుకట్ట వేస్తుందా? మనం ఒకసారి ఆలోచించాలి. ఏ రాజకీయ వ్యవస్థలోనైనా అధికార వర్గమే చట్టాలు చేస్తుంది. పార్లమెంటు, అసెంబ్లీలు అవినీతిపరులు, నేరస్థులు, దళారీలతో నిండినప్పుడు, ప్రజల ఆకాంక్షలు ఎలా నెరవేరుతాయి? సామాన్యులకు న్యాయం ఎలా జరుగుతుంది? అధికారంలో, ప్రతిపక్షం లో వున్న అవినీతిపరులు, వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్లే చట్టాన్ని రాసుకుంటారా? ఒకవేళ రాసిన, ఆ చట్టాన్ని ఆచరణలో నిజంగా అమలు చేస్తారా?


అన్నా హజారే నిజాయితీ కలిగిన సామాజిక నాయకుడే, నిబద్దత గలిగిన పెద్ద మనిషే. కానీ నిరాహార దీక్షలు, సంస్కరణ వాదం ద్వారా సమాజం లో మౌలికమైన మార్పు వస్తుందా? అవినీతి అంతం అవుతుందా? కాగితాల మీద ఎంత మంచి చట్టాలు వున్నా, అసమర్ధ నాయకులు వున్నంత కాలం, ఆచరణలో అవి విఫలమవుతునే వుంటాయి. భూసంస్కరణ, ఎన్నికల సంస్కరణలు, రిజర్వరు ఫారెస్టు చట్టాలన్నీ ఆచరణలో విఫలమైనాయి. సమాచార చట్టం వల్ల యిప్పటిదాకా, ఒక వ్యక్తి కూడా శిక్షింపబడలేదు. కానీ సమాచార చట్టం కోసం దరఖాస్తు చేసిన దత్తా పాటిల్ , అమిత్ జత్వా, రామదాస్ గోడ్వాకర్ హత్యకు గురయ్యారు. ఒకవైపు 45 సంవత్సరాలుగా అన్నా హజారే అవినీతి వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడుతున్నాడు. కానీ దేశంలో అవినీతి వైయ్యి రెట్లు పెరిగింది. 2జీ టెలికాం కుంభకోణంలో కోట్లు దోచుకున్నారని ఆరోపణలు ఎదుర్కుంటున్న మన్ మోహన్, కరుణానిధి, రతన్ టాటా, అనిల్ అంబనీల పైన ఒక కేసు పెట్టలేదు. విచారణ జరపలేదు.

అవినీతి ఆరోపణ ఎదుర్కుంటున్న జగన్ మద్దతుదారుడు గోనె ప్రకాశరావు, చంద్రబాబు ఆస్తులకు బినామీ మురళీమోహన్ లు, ఐయంజీ-భారత్ భూమి కుంభకోణం నిందితుడు చంద్రబాబు, వెయ్యి కోట్లు ఆస్తి వున్న రామ్-దేవ్ బాబా, కోట్లు కొల్లగొట్టిన గాలి జనార్థనరెడ్డి నెత్తికి ఎక్కించుకున్నబిజేపీ-ఏబివీపీ నాయకులు అన్నా హజారే కు జైకొడుతూ, అవినీతి పైన ఉపన్యాసాలు ఇస్తున్నారు. అంటే ఉద్యమం ఎలా వక్రమార్గాలు పడుతుందో అర్ధం చేసుకోవచ్చు. దొంగ ఓట్లు, దొంగ సారా, దొంగ నోట్ల తో రాజకీయ దళారులు రాజ్యం మేలుతున్నంత కాలం, ప్రజాస్వామ్యం పతనం అవుతునే వుంటుంది.

క్యాన్సర్ రోగానికి సరైన వైద్యం కావాలి కదా! కుళ్ళిపోయిన వ్యవస్థను కూకటివేళ్ళ తో పెకిలించి, ప్రజాస్వామిక విలువలతో ప్రతిఫలించే నూతన సమాజ నిర్మాణానికి ఉద్యమించాలి. రాజకీయ, ఆర్ధిక, సామాజికమైన మౌళిక మార్పుల కోసం పోరాడాలి. గ్రామాలనుండి పట్టణాల దాకా, ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా నిర్వచించుకొని, ఆచరణ లో పెట్టాలి. అన్నా హజారే ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూనే, అవినీతి లేని వ్యవస్థ కోసం, సామాజిక న్యాయం కోసం, రాజీలేని పోరాటానికి సిద్ధం కావాలి. అవినీతి నాయకులు, రాజకీయ దళారులను సామాజిక బహిష్కరణ చేయాలి. యీ వ్యవస్థను ఓట్ల రాజకీయాలతో మార్చగలుగుతామా? శాంతియుత మార్గంలో అవినీతి ముష్కరుల మనస్సు కరిగించగలుగుతామా? లేకపోతే ప్రజా పోరాటాలతో సాధ్యమవుతుందా అనేది ఆలోచించాలి

18, ఏప్రిల్ 2011, సోమవారం

నాలుగేళ్ల పాటు నా సుత్తి భరాయించినందుకు ధన్యవాదములు

నాలుగు సంవత్సరం క్రితం నలుగురు స్నేహితులతో((గోపి,సురేంద్ర(లవంగం),ప్రదీప్(గురుగారు),నరేష్)) సాయం తో మొదలైన ఈ ప్రయాణం లో ఇంకోక సంవత్సరం అయింది.... ఇంత కాలం నా బ్లాగ్ చూసి కామెంట్లు కొట్టిన అందరికీ పేరు పేరు నా హృదయ పూర్వక ధన్యవాదములు ....

సుత్తి కవిత మీకుఒక్కటి

నా కవిత

ఇప్పుడు మీ చెంత

కొందరికిది కవ్వింత

మరి కొందరికి వింత

మరి కొందరికి పులకింత

ఇంకొందరికి నవ్వింత

ఇంకొందరికి తుళ్ళింత

మీరు పాడితే వంత

తప్పదు మీకు చింత

నా సుత్తి లో ఇది కొంత (మాత్రమే

ఎలా ఉంది సుత్తి గారి కలం పోటు

చేద్దామనుకున్నా ఈ రోజు సాపాటు

చేశాను కావాల్సిన ఏర్పాటు

అంతలోనే ఒక చిన్న ఏమరపాటు

దానివల్ల జరిగింది పొరపాటు

ఏంటో అది నా గ్రహపాటు

తిన్నాక వచ్చింది తలపోటు

ఈ రోజుకిక మీరే నా సాపాటు

ఎలా ఉంది సుత్తి గారి కలం పోటు

మీకూ మొదలై ఉంటుంది కలవరపాటు

తప్పదు జీవితం లో ఆటు పోటు
( ఇవీ నా పాట్లు .......నాకు తెలిసీ మీకు కూడా వచ్చి ఉంటుంది తలపోటు .........నిజమేనా ? మీకు

తలపోటు వచ్చినా రాకపోయినా చెప్పాలి ఎలా ఉన్నాయో నా పాట్లు )

నేను ఒక వేళ కవిత రాస్తే ........

నేను ఒక వేళ కవిత రాస్తే ........
కవిత లంటే నాకు చాల ఇష్టం ..కానీ రాయడం రాదు కదా ! అందుకని ఒక వేళ రాస్తే ఎలా ఉంటుందో చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటో అని ఎదో ఒక సుత్తి రాస్తున్నా !
నేను రాస్తే కవిత
చదివేటప్పుడు కలత
ఆపై కొంచెం నలత
ఇక ఆపై ఉండదు భవిత
ఇదంతా వారి తలరాత
వారికి దిక్కు విధాత

************************** ఇంకొక సుత్తి ************************
నా కవిత కి ఉండదు అర్ధం
తెలుసుకోవాలనుకోవడం వ్యర్ధం
తెలుసుకుంటే అనర్ధం
చదువుతారనుకోవడం నా స్వార్ధం
మొత్తానికి అది సుత్తి పదార్ధం


******************* మరి దీన్ని ఎమంటారో నాకు తెలీదు ****************
కల కాలం నిలిచే కవితలు రాయాలని
ఆకట్టు కొనే కధలతో కనికట్టు చేయాలనీ
................నా కల .....కానీ
కలత చెందిన నా మది కవిత రాయలేనన్నది....
కదలలేని నా కలం కధలు రాయనన్నది
బీడు భూమి లో హలం పట్టిననేమి ?
మోడు వారిన హృదయంతో కలం పట్టిననేమి ? వృధా కదా !
కాలం లో కలిసిపొతుందా నా కలం
కల గా మిగిలిపొతుందా నా కలం ...మీరే చెప్పాలి మరి .

పుట్టపర్తి సత్యసాయిబాబాకు వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవహారాలకు. . . . .. . . . .

బాబాగారి శరీరం ఇప్పుడు కష్టంలో వుందా?
భగవంతుడికి కష్టం అని వుండదు. ఈ చొక్క మాసిపోయి వుండవచ్చు. శరీరం ఒక చొక్క లాంటిది భగవంతుడికి. అది మాసిపోయిన తరువాత వారు విడిచి ఉంకో చొక్కా వేసుకోవచ్చు.

లేక శిష్య బృందం చెపుతున్నట్లు డాక్టర్ల పరిజ్ఞాణాన్ని పరీక్షీంచుతున్నారా?
భగవంతుడే, డాక్టర్, పేషంట్, జబ్బు, పరీక్షా. ఎవరు ఎవరిని పరిక్షించటలేదు.

బాబాగారు పెట్టిన ఈ పరక్షలో (జగన్నాటక సూత్రదారి కదా) డాక్టర్లు నెగ్గుతారా? నెగ్గరా? నెగ్గితే ఏమవుతుంది? నెగ్గగపోతే ఏమవుతుంది?

బాబా నెగ్గిన, డాక్టర్ నెగ్గిన, భగవంతుడే నెగ్గుతాడు. భగవంతుడు సర్వాంతర్యామి. ఎవరు నెగ్గిన నెగ్గక పోయినా భగవంతుడే నెగ్గుతాడు. ఎందుకంటే నెగ్గటం కుడా భగవంతుడే. ఓడిపోవటం కుడా భగవంతుడే.

17, ఏప్రిల్ 2011, ఆదివారం

పుట్టపర్తి సత్యసాయిబాబా బందీ?!@#?

పుట్టపర్తి సత్యసాయిబాబాకు వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవహారాలకు ఇద్దరు మంత్రులను బాధ్యులను చేస్తూ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ శుక్రవారం ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. బాబా బందీ అంటూ గురువారం ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసిన టీవీ చానెల్ సత్య సాయిబాబా వ్యవహారాల్లో కుట్ర చేస్తున్నవారి విషయంలో ఇద్దరు మంత్రులు భారీగా డబ్బులు తీసుకున్నారని, అందుకే వారు మాట్లాడడం లేదని టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. ఆ ఇద్దరు మంత్రులు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవాలను దాచి పెడుతూ కోట్లాది రూపాయల వ్యవహారాలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించింది.


సత్య సాయిబాబా ఆస్పత్రిలో చేరిన తర్వాత మంత్రి జె. గీతా రెడ్డి ప్రశాంతి నిలయానికి వెళ్లారు. సత్య సాయిబాబా ఆరోగ్యంపై సమీక్ష చేశారు. సత్య సాయిబాబా ఆరోగ్యంపై ఆమె ఎడతెరిపి లేకుండా ప్రకటనలు చేస్తూ వచ్చారు. మంత్రి రఘువీరా రెడ్డి కూడా హడావిడి చేశారు. సత్య సాయిబాబా ట్రస్టుపై, సత్య సాయిబాబా వ్యవహారాలపై వస్తున్న వార్తాకథనాలకు వివరణ ఇవ్వడంలో ఆయన బిజీగా గడిపారు. ఆ తర్వాత ఈ ఇద్దరు మంత్రులు కూడా మాట్లాడడం మానేశారు. మంత్రుల పేర్లను మాత్రం ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ వెల్లడించలేదు. గీతా రెడ్డి, రఘువీరా రెడ్డి సత్య సాయిబాబా ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వచ్చారు.

సత్య సాయిబాబా స్థితిపై నోరు విప్పకుండా ఉండడానికి ఓ ఐపియస్ అధికారికి కూడా భారీగా డబ్బులు ముట్టినట్లు చానెల్ ఆరోపించింది. ఆ అధికారికి 200 కోట్ల రూపాయలు ముట్టాయని, వాటిని అతను హవాలా మార్గంలో విదేశాల్లో తన కుమారుడికి తరలించాడని ఆరోపించింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని కూడా చెప్పుకుంది. కాగా, బాబా ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్య సేవలకు స్పందిస్తున్నారని సత్యసాయి బాబా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ సఫాయా శుక్రవారం సాయంత్రం కూడా ప్రకటించారు

కిరణ్ కుమార్ రెడ్డికి కడప ఉప ఎన్నిక పరీక్షలాంటిదే.

కడప ఉప ఎన్నిక ఫలితంపైనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కడప లోకసభ స్థానం ఉప ఎన్నికపై కాంగ్రెసు అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డికి లక్ష్యాన్ని నిర్దేశించినట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ జగన్‌ను ఓడించేందుకు ఏ విధమైన అవకాశాన్ని కూడా వదిలి పెట్టకూడదని ఆయనకు సూచించినట్లు సమాచారం. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి కడప లోకసభ స్థానంలో పావులు కదుపుతూ వస్తున్నారు. వైయస్ జగన్‌కు బలం ఉన్న జమ్మలమడుగు, బద్వేలు వంటి శాసనసభా స్థానాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే బద్వేలు శాసనసభ్యురాలు కమలమ్మను తమ వైపు తిప్పుకోవడంలో ఆయన విజయం సాధించారు.


కాగా, కడపలో వైయస్ జగన్‌ను ఓడించలేకపోయినా కనీసం రెండో స్థానంలోనైనా నిలబడేలా చూసుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్‌కు విజయం నల్లేరు మీద బండి నడక కాకూడాదని, భారీగా మెజారిటీ తగ్గించే విధంగా కృషి చేయాలని అధిష్టానం ముఖ్యమంత్రికి సూచించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ, వైయస్ జగన్‌కు మధ్య పోటీ జరిగి, తమ పార్టీ మూడో స్థానానికి పడిపోతే దాని ప్రభావం తీవ్రంగా పడుతుందని అంటున్నారు. భవిష్యత్తులో దాని వల్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాట అటుంచితే తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని అనుకుంటున్నారు. దానివల్ల తెలుగుదేశం పార్టీ పోటీలోనే ఉండకూడదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

జగన్‌ను ముప్పు తిప్పలు పెట్టేందుకు కిరణ్ కుమార్ రెడ్డికి తగిన లక్ష్యాలు నిర్దేశిస్తూనే కాంగ్రెసు అధిష్టానం తన వంతు వ్యూహాన్ని తాను రూపొందించి అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి అనుచరులుగా ఉండి, ఆయనకు సన్నిహితులుగా మెలిగిన ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్ వంటి నాయకులను రంగంలోకి దింపింది. ఉప ఎన్నికల్లో తగిన ప్రభావం చూపలేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి కూడా తిప్పలు తప్పవని అంటున్నారు. ఏమైనా, కిరణ్ కుమార్ రెడ్డికి కడప ఉప ఎన్నిక పరీక్షలాంటిదే.

శ్రీరాముడిని విలన్‌గా, మహిళా వ్యతిరేకిగా చూపిస్తూ రామాయణ విషవృక్షం - రామ్‌గోపాల్ వర్మ

భార్య కోసం రావణుడిపై వ్యక్తిగత యుద్ధం చేసిన శ్రీరాముడు దేవుడెలా అవుతాడని ప్రశ్నించిన ప్రముఖ దర్శక నిర్మాత రామ్‌గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశారు. హిందువులు తమ ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీరాముడిని విలన్‌గా చూపిస్తూ ఆయన సినిమా తీయడానికి ఇష్టపడుతున్నారు. రామాయణ విషవృక్షం అనే కథను ఆధారం చేసుకుని ఆయన సినిమా తీయాలని అనుకుంటున్నారు. రామాయణ విషవృక్షం హక్కులు లభిస్తే సినిమా తీస్తానని ఆయన అంటున్నారు. శ్రీరాముడిని విలన్‌గా, మహిళా వ్యతిరేకిగా చూపిస్తూ రామాయణ విషవృక్షం రచన వచ్చింది. అప్పట్లో ఈ పుస్తకం తీవ్ర దుమారం రేపింది.


ప్రముఖ సాహితీవేత్త విశ్వనాథ సత్యనారాయణ వాల్మీకి రామాయణాన్ని రామాయణ కల్పవృక్షం పేర తెలుగులో కావ్యం రాశారు. రాముడి కథలు తెలుగు సాహిత్యంలో చాలానే వచ్చాయి. శ్రీరాముడిని మానవోత్తముడిగా, దైవంగా కీర్తిస్తూ రచనలు వచ్చాయి. అయితే, రంగనాయకమ్మ అనే రచయిత్రి రాముడిని విలన్‌గా చూపిస్తూ రామాయణ విషవృక్షం అనే రచన చేశారు. ఈ రామాయణ విషవృక్షం హక్కులు తనకు ఇస్తే సినిమా తీస్తానని రామ్‌గోపాల్ వర్మ అంటున్నారు.

వాల్మీకి రామాయణం కథను తలకిందులు చేస్తూ రంగనాయకమ్మ తెలుగులో రామాయణ విషవృక్షం రచన చేశారు. రావణుడిని రాక్షసుడిగా కాకుండా సాధారణ మానవుడిగానే భావిస్తూ ఆమె రచన చేశారు. లక్ష్మణుడి చేతిలో ముక్కు చెపులను కోల్పోయిన రావణుడి సోదరి శూర్పణఖను అత్యంత సౌందర్యవతిగా చిత్రించారు. ఆ సౌందర్యానికి సీత అసూయ పడడం వల్లనే శూర్పణఖ ముక్కుచెపులను లక్ష్మణుడు కోసేశాడని ఆమె రాశారు. మొత్తంగా, రావణుడు ఉత్తమ పురుషుడిగా, రాముడు స్వార్థపరుడిగానూ మహిళా వ్యతిరేకిగానూ రామాయణ విషవృక్షం రచనలో కనిపిస్తారు.

ఓ వైపు తన బావమరిది, మరోవైపు తెలంగాణ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి నుంచి ఆయన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఎప్పటికప్పుడు చిక్కులు ఎదురవుతూనే ఉన్నాయి. ఓ వైపు తన బావమరిది, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ నుంచి, మరోవైపు తెలంగాణ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి నుంచి ఆయన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అటు కోస్తాంధ్రలో, ఇటు తెలంగాణలో ఆయన తీవ్రమైన ఇబ్బందుల్లో పడే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు హరికృష్ణ పెట్టిన కుంపటి చల్లారినట్లు కనిపించినా, మళ్లీ ఎప్పుడు ఎగసిపడుతుందో అది ఎంత దూరం పోతుందో తెలియని పరిస్థితి ఉంది. హరికృష్ణను అడ్డం పెట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ తన వర్గం నాయకులను ఎగదోస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరికి కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకురాలు పురంధేశ్వరి సహాయ సహకారాలు అందుతున్నట్లు తెలుగుదేశం నాయకులే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీలో చీలికకు కూడా ఇది దారి తీయవచ్చుననే వార్తలు వస్తున్నాయి.


కాగా, తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి చిచ్చుబుడ్డిలా ఎగిసిపడుతున్నారు. ఉండి, ఉండి ఆయన సంచలన ప్రకటనలు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యలు చేయడానికి ఆయన వెనకాడడం లేదు. నాగం జనార్దన్ రెడ్డి వ్యూహం ఏమిటనేది ఎవరికీ అంతు పట్టడం లేదు. నాగం జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణకు చెందిన ఒక వర్గాన్ని చంద్రబాబు ఎగదోస్తున్నా ఫలితం కనిపించడం లేదు. అంతకంతకు నాగం జనార్దన్ రెడ్డి రెచ్చిపోతున్నారు. తెలంగాణపై చంద్రబాబును ప్రశ్నించే దాకా ఆయన వచ్చారు.

నాగం జనార్దన్ రెడ్డి వైఖరిపై చంద్రబాబు తీవ్ర అసహనంతో, ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. నాగం జనార్దన్ రెడ్డిని పార్టీ నుంచి పంపిస్తారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏదో విధంగా చంద్రబాబు సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు. ఈసారి సహించకూడదనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, నాగంపై చర్యలు తీసుకుంటే తెలంగాణ ప్రాంతంలో తనపై వ్యతిరేకత పెరుగుతుందనే ఆందోళనతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, నాగం జనార్దన్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం పార్టీ సమావేశంలో చర్చించి నాగం జనార్దన్ రెడ్డికి షోకాజ్ ఇచ్చే అవాకశాలున్నాయని అంటున్నారు.

16, ఏప్రిల్ 2011, శనివారం

జగన్ ఆస్తుల విలువ కేవలం రూ.365 కోట్ల??!!@@##$$%%??

మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికలలో కడప పార్లమెంటు స్థానం నుండి గెలిస్తే దేశంలోనే అత్యంత ధనవంతుడైన ఎంపీల జాబితాలో మొదటి స్థానంలో ఉంటారు. శుక్రవారం కడపలో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సమయంలో ఆయన తన ఆస్తుల వివరాలను తన అఫిడవిట్‌లో వెల్లడించారు. అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం జగన్ పేరు మీద ఉన్న ఆస్తి రూ.365 కోట్లుగా ఉంది. ఇక ఆయన భార్య భారతి పేరు మీద మరో 41.33 కోట్లు ఉన్నట్టుగా పేర్కొన్నారు. తనకు సొంత వాహనం లేదంటూ జగన్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.


తన ఆస్తి వివిధ రూపాలలో ఉందని అందులో పేర్కొన్నారు. షేర్ల రూపంలోనే 359 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మిగిలినది అంతా గోల్డు, అగ్రికల్చర్ లాండ్, నాన్ అగ్రికల్చర్ లాండ్ తదితర రూపాలలో ఉందని ఆయా విలువలు పేర్కొన్నారు. జగన్ పేరు మీదు ఉన్న ఆస్తులు 365 కోట్లు 68 లక్షల 58వేల రూపాయలు. కాగా అఫిడవిట్ సమర్పించిన సమయంలో ఎన్నికల గుర్తుగా తనకు సీలింగ్ ఫ్యాన్, బ్రెష్, మంచంలలో ఏదైనా కేటాయించాలని జగన్ కోరారు.

తనకు ఎన్నికలలో కాగా దివంగత ముఖ్యమంత్రి వైjavascript:void(0)యస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాకముందు అంటే 2004కు ముందు జగన్ ఆస్తుల విలువ కేవలం 9.18 లక్షలు. ఆ తర్వాత 2009 ఎన్నికల వరకు జగన్ ఆస్తులు రూ.77.40 కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు తన అఫిడవిట్‌లో ఏకంగా కు పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు జగన్ ఉప పోరులో కడప నుండి గెలిస్తే దేశంలోనే అత్యంత కుబేరుడు అయిన ఎంపీలలో జగన్ మొదటి వాడు. రెండో స్థానంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు రెండో స్థానంలో ఉంటారు. ఆయన ఆస్తుల విలువ రూ. 173 కోట్లుగా ఉంది.

కాగా జగన్ ఆస్తులు వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అమాంతంగా పెరగడంపై విపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెసు పార్టీలోని వారు కూడా పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. వైయస్ ముఖ్యమంత్రి కాక ముందు ఇంటిని అమ్మకానికి పెట్టిన వైయస్ కుటుంబం ఇప్పుడు కోట్ల కొలది రూపాయలు ఎలా సంపాదించిందనే ఆరోపణలు చేశారు

అద్నన్ సమీకు చేదు అనుభవం ఎదురైంది కాదు అవమానించిన ఆస్టన్ మార్టిన్ డీలర్

బాలీవుడ్ ప్రముఖ గాయకుడు అద్నన్ సమీకు చేjavascript:void(0)దు అనుభవం ఎదురైంది. తాజాగా భారత్‌లోకి ప్రవేశించిన బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ కంపెనీ భారత అధికారిక దిగమతిదారు అయిన ఇన్ఫినిటీ కార్స్ కంపెనీ సమీను అవమానించింది. భారత్‌లో ఆస్టన్ మార్టిన్ కార్లను విడుదల చేసేందుకు ఇన్ఫినిటీ కార్స్ అద్నన్ సమీను ఆహ్వానించింది. అందుకు సమీకు రూ. 13.5 లక్షల రూపాయల చెక్‌ను అందజేసింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ.. అద్నన్ సమీతో ఒప్పందాన్ని ఇన్ఫినిటీ కార్స్ రద్దు చేసుకుంది. అంతేకాకుండా... చెక్‌ను స్టాప్ పేమెంట్ చేసింది. ఇలా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ఇన్ఫినిటీ కార్స్ సమీ ఓ మాట కూడ చెప్పలేదట.

ఇదిలా ఉంటే జేమ్స్ బాండ్ సినిమాల ద్వారా ప్రసిద్ధి చెందిన ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కార్లు నేడు భారత మార్కెట్లోకి విడుదలయ్యాయి. భారత్‌లో మొత్తం 10 బ్రాండ్‌లను కంపెనీ అందిస్తుంది. ప్రారంభ దశలో భాగంగా ప్రస్తుతం భారత మార్కెట్లో ఆస్టన్ మార్టిన్ కార్లు పూర్తిగా దిగమతి చేసుకున్న రూపంలో లభిస్తాయి. దేశీయ మార్కెట్లో వీటి ధరలు రూ. 1.35 కోట్ల నుంచి రూ. 20 వరకూ ఉన్నాయి. భారత్‌లో సిగ్నంట్ మినహా బేసిక్ మోడల్ అయిన వీ వ్యాంటేజ్ నుంటి ఆల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ కారు వన్-77 (రూ. 20 కోట్లు) మోడళ్లు లభిస్తాయని కంపెనీ వివరించింది.

అదేదో ఐఎస్ఐ బ్రాండ్ అన్నట్టు ఫీలైపోతున్నాడు..

మెగాస్టార్ అనేవాడే లేకపోతే ఇప్పుడు కేవలం ఒక కమెడియన్ కి మనవడిగా ఉండిపోయేవాడినన్న సంగతి మర్చిపోయి అల్లు శరిష్ రెచ్చిపోతున్నాడు. అక్కడికి తనేదో గీత ఆర్ట్స్ సంస్థకే తప్పమెగా హీరోలకీ, వారి సినిమాలకీ సంబంధంలేని వాడినన్నట్టు కలవరిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ సినిమా అంటే ఖచ్చితంగా హిట్ అయి తీరుతుందన్నట్టు, అదేదో ఐఎస్ఐ బ్రాండ్ అన్నట్టు ఫీలైపోతున్నాడు..నిన్న విడుదలైన తీన్ మార్ పై ట్విట్టర్ లో అభిమానులేసే ప్రశ్నలకు తీన్ మార్ గురించి తనకేమీ తెలియదన్నట్టు మిస్టర్ ఫర్ ఫెక్ట్ డ్రామాలేస్తున్నాడు

బహుశా జల్సాకి ముందు కొన్నేళ్ల పాటు గీతా ఆర్ట్స్ ప్లాప్ గీత దాటి బయటికి రాలేక గిలగిల కొట్టుకుందని పాపం శిరిష్ కి తెలియదేమో. తమ కుంటుంబానికి చెందిన హీరోలు వేరే బ్యానర్లపై సినిమాలు చేస్తే వాటితో తనకేమీ సంబంధం లేనట్టు ఇతను తెగ రెచ్చిపోతున్నాడు. మొదటి రోజు నాలుగు వేల షోలు తీన్ మార్ కి పడుతున్నాయటఅని ఎవరో అభిమాని అడిగితే, గీతా ఆర్ట్స్ లో చేసి ఉంటే ఆరికార్డు ని బీట్ చేసుండేవాళ్లమంటూ ఇతని జవాబు. తీన్ మార్ గురించి ఒక్కమాటైనా చెప్పలేదంటని మరొకొక అభిమాని అడిగితే గణేష్ బాబు రిక్వెస్ట్ చేసుంటే హెల్ప్ చేసుండేవాళ్లమని అంటున్నాడు. హీరోలో లేకుండా గీతా ఆర్ట్స్ ఇంత దూరం వచ్చిందా?అసలు మెగా హీరోలు చేతిలో లేకపోతే ఈ సంస్థకి ఈ మాత్రం పేరైనా వచ్చుండేదా?చూస్తుంటే మెగాస్టార్ ని చేసిందే గీతా ఆర్ట్స్ అనే భ్రమలో బ్రతికేసేలా ఉన్నాడు

15, ఏప్రిల్ 2011, శుక్రవారం

జూనియర్ ఎన్టీఆర్‌కు ఎక్కువ మార్కులు పడ్డాయి.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి రాజకీయ వారసుడిగా సినీ హీరో, స్వర్గీయ ఎన్టీ రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్‌కే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు సాగుతోందని, నారా లోకేష్‌కూ జూనియర్ ఎన్టీఆర్‌కూ మధ్య పోటీ జరుగుతోందని, ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీలో సంక్షోభం నెలకొందని ప్రచారం జరిగిన నేపథ్యంలో దట్స్ తెలుగు ఓ ఆన్‌లైన్ పోల్ నిర్వహించింది. చంద్రబాబు రాజకీయ వారసుడు ఎవరు అనే ప్రశ్న వేసి జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్, బాలకృష్ణ, హరికృష్ణ పేర్లు ఇవ్వడం జరిగింది. వీరిలో చంద్రబాబు రాజకీయ వారసుడు ఎవరో చెప్పాలని దట్స్ తెలుగు పాఠకులను అడిగింది. ఈ పోల్ సర్వేలో విచిత్రమైన ఫలితాలు వచ్చాయి.


చంద్రబాబు రాజకీయ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్‌కు ఎక్కువ మార్కులు పడ్డాయి. చంద్రబాబు రాజకీయ వారసుడు ఎన్టీఆర్ అంటూ 51 శాతం మంది అభిప్రాయపడ్డారు. విచిత్రమేమిటంటే, నందమూరి బాలకృష్ణ మూడో స్థానంలో నిలిచారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ రెండో స్థానంలో నిలువడం గమనార్హం. చంద్రబాబు రాజకీయ వారసుడిగా నారా లోకేష్ పేరును సూచిస్తూ 28 శాతం మంది ఓటేశారు. బాలకృష్ణకు 17.2 శాతం ఓట్లు వచ్చాయి. నందమూరి హరికృష్ణ నాలుగో స్థానంలో నిలిచారు. ఆయనకు కేవలం 3.8 శాతం ఓట్లే వచ్చాయి.

అయితే, ఈ ఆన్‌లైన్ పోల్‌కు ఓ పరిమితి ఉందనే విషయాన్ని గ్రహించాలి. ఆన్‌లైన్ సౌకర్యం చాలా తక్కువ మందికి మాత్రమే అందుబాటులో ఉంది. నగర, పట్టణ ప్రజలకు, చదువుకున్నవారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంది. వైట్ కాలర్ ఉద్యోగస్థులకు, సంపన్నులకు, మధ్య తరగతి వారికి మాత్రమే ఆన్‌లైన్ సౌకర్యం ఉంది. గ్రామీణ ప్రజలకు, నిరక్షరాస్యులకు ఇది అందుబాటులో లేదు. అందువల్ల గ్రామీణ, నిరక్షరాస్యులైన ప్రజల మనోగతం ఈ పోల్‌లో ప్రతిబింబించలేదని చెప్పాల్సి ఉంటుంది

మమత ప్రభంజంలో స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరుక్కుపోయారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెసు-కాంగ్రెసు కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలు తెలుపుతున్నాయి. రెండు ప్రసిద్ధ సంస్థలు వేరు వేరుగా చేసిన సర్వేలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసి అధికారంలోకి వస్తుందని తేలింది. హెడ్ లైన్స్ టుడే ఛానల్ కోసం ఓఆర్‌జి చేసిన సర్వేలో టిఎంసి 182 స్థానాలను, లెఫ్ట్ కూటమి 101 స్థానాలను గెలుచుకుంటుందని తేల్చింది. స్టార్ ఆనంద ఛానల్ కోసం నీల్సన్ చేసిన సర్వేలో టిఎంసి 215, లెఫ్ట్ కూటమి 74 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. బుద్దదేవ్ కంటే మమతా బెనర్జీవైపై బెంగాళీలు మొగ్గు చూపుతున్నారని సర్వేలు తేల్చాయి.


ముఖ్యమంత్రిగా మమతను 56 శాతం మద్దతు ఇస్తే, బుద్దేవ్‌కు 20 శాతం మాత్రమే ఇవ్వడం విశేషం. అయితే ఇప్పటి వరకు జ్యోతిబసు మెరుగైన ముఖ్యమంత్రిగా బెంగాళీలు చెబుతున్నారు. టిఎంసి గద్దెనెక్కితే ముప్పయి అయిదేళ్ల లెఫ్ట్ అధికారానికి బెంగాళీలు గండి కొట్టినట్లే. దశాబ్దాల పాటు అధికారం కోసం వేచి చూస్తున్న మమత ఈసారి తనకు అధికారం తప్పకుండా వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. గత పార్లమెంటు ఎన్నికల సమయం నుండే లెఫ్ట్ కూటమి ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. భారీగా పార్లమెంటు సీట్లను టిఎంసికి కోల్పోయింది. ఇప్పుడు కూడా సర్వే ఫలితాలు నిజం అయితే 227 స్థానాలున్న లెఫ్ట్ సగానికి పైగా తగ్గుతాయి.

మమత ప్రభంజంలో స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరుక్కుపోయారు. ఆయన తన సొంత నియోజకవర్గం జాదవ్‌పూర్ నుండి పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థులుగా ఆయన ప్రభుత్వం హయాంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి రిటైర్ అయిన మనీష్ గుప్తా టిఎంసి నుంచి, సిపిఎం నుండి బయటకు వచ్చిన శమీర్ పార్టీ ఫర్ డెమక్రటిక్ సోషలిజం నుండి బుద్దదేవ్‌పై పోటీకి దిగుతున్నారు. దీంతో ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో పలువురిని గెలిపించాల్సిన బాధ్యతలో ఉన్న బుద్దదేవ్ తన గెలుపుకోసం తన నియోజకవర్గంలోనే ఎక్కువ సమయాన్ని కేటాయించడం విశేషం. గత పార్లమెంటు ఎన్నికలలో సిపిఎం ఎపీ అభ్యర్థి చాలా తక్కువ ఆధిక్యంతో గెలుపొందడం బుద్దదేవ్‌కు చెమటలు పట్టిస్తున్నాయి. అయితే బుద్దదేవ్‌పై ఓటర్లకు వ్యతిరేకత లేకున్నప్పటికీ పార్టీపైన మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొంది

14, ఏప్రిల్ 2011, గురువారం

తమిళనాడులో కరుణానిధి జయలలిత ఎవరికి వారే విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

దక్షిణ భారతంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఉప ఎన్నికలు బుధవారం జరుగుతున్నాయి. ఇన్ని రోజులు తమ తమ గెలుపు కోసం ప్రచారంలో మునిగి తేలిన ఆయా పార్టీల భవితవ్యం నేడు ఈవిఎంలలో నిక్షిప్తమై ఉంది. తమిళనాడులో కరుణానిధి నేతృత్వంలోని డిఎంకే, జయలలిత నేతృత్వంలో అన్నాడిఎంకే కూటమి ఎవరికి వారే విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు ఈవిఎంలలో నిక్షిప్తమవుతున్న సమయంలోనే ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. బుధవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం జయలలిత, విజయ్‌కాంత్‌లు తమ కూటమి విజయం ఖాయమని ప్రకటించాయి. కాంగ్రెసు, డిఎంకె అవినీతిలో కూరుకు పోయినందని, పాలనలో డిఎంకే విఫలం అయినందున ప్రజలు తమకే పట్టం కడతారని చెప్పింది.


కాగా ఎన్నికల సంఘం తీరును ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ తప్పు పట్టారు. ప్రతి పక్ష పార్టీకి లాభం చేకూర్చేలా ఐసి వ్యవహరించిందని నిందించారు. అయినా విజయం తమదే అని చెప్పారు. ఓటమి భయంతోనే జయలలిత తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుందని ముఖ్యమంత్రి కరుణానిధి అంటున్నారు. డిఎంకే ప్రభుత్వం మూడోసారి గద్దెనెక్కడం ఖాయమని చెబుతున్నారు. అయితే ఏది ఏమైనా ఈసారి సర్వే ఫలితాలు మాత్రం డిఎంకెకు అనుకూలంగా లేవు. అన్నాడిఎంకెకే విజయావకాశాలు ఉన్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి. 2జి స్పెక్ట్రం కుంభకోణంలో డిఎంకెకు ప్రత్యక్ష పాత్ర ఉండటాన్ని తమిళ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని సర్వేలు వెల్లడి చేస్తున్నాయి.

అన్నాడిఎంకె పదేళ్లుగా అధికారం కోసం వేచి చూస్తోంది. అయితే సర్వేలను బట్టి ఇప్పుడు జయలలిత కోరిక నెరవేరనున్నట్టుగా తెలుస్తోంది. సర్వే ఫలితాలలో సుమారు 51 శాతం మంది ఓటర్లు మార్పు కోరుకుంటుండగా, 36 శాతం మంది ఓటర్లు మాత్రమే కరుణానిధికి మద్దతు పలికారు. సర్వే ఫలితాల ప్రకారం డిఎంకె కూటమికి ఈసారి 60 - 70 సీట్లకు మధ్యగా ఉండవచ్చని తెలుపుతున్నాయి. అయితే తమిళ ఓటర్ల తీర్పు గతంలో ఎప్పుడూ సర్వేలకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. గతంలో సర్వేలు గెలుస్తాయని చెప్పిన పార్టీ ఓటమి చవి చూడటం విశేషం.

ఇక కేరళ విషయానికి వస్తే ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్ కూటమిలలో ఏ కూటమికి గత ముప్పయి అయిదేళ్లుగా కేరళ ఓటర్లు వరుసగా పట్టం కట్టలేదు. ఎల్‌డిఎఫ్‌కు ఆ భయం పట్టుకోగా, యుడిఎఫ్‌కు అది కలిసి వస్తున్న అంశం. అయినప్పటికీ జాతీయస్థాయిలో యుపిఏ తీవ్ర అవినీతిలో కూరుకు పోయిన ఈ సమయంలో కేరళ ఓటర్ల తీర్పులో మార్పు ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. కేరళ ఓటర్లలో 25 శాతం మంది క్రిస్టియన్లు, 22 శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. కాబట్టి వారిని మచ్చిక చేసుకోవడానికి అభ్యర్థులు ప్రయాస పడ్డారు. 30 స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో కూడా మార్పు దిశగా ఓటర్లు ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది.

కాగా ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి 404 నియోజకవర్గాలు ఉండగా, 3932 మంది అభ్యర్థులు రంగంలోకి దిగారు. మూడు రాష్ట్రాలలో జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు కూడా లేక పోవడం విశేషం. కాగా ఈ ఎన్నికల సందర్భంగా ఈసీ భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న డబ్బును స్వాధీనం చేసుకుంది. ఆ డబ్బు సుమారు 60 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. కేరళ ప్రవాస భరతీయులకు కూడా ఓటు హక్కు కల్పించింది. మూడు రాష్ట్రాల్లో కలిపి ఏడు కోట్ల వరకు ఓటర్లు ఉంటారు. తమిళనాడు అయినా, కేరళ అయినా, పుదుచ్చేరి అయినా ప్రతి పార్టీకి గెలుపు ముఖ్యమే కావడం విశేషం. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న జయలలిత పీఠం ఎక్కాలని, కుంభకోణాల్లో కూరుకు పోయిన కరుణానిధి తమిళ ప్రజలు తమ వెంటే ఉన్నారని నిరూపించుకోవడానికి, కేరళలో ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్‌లు తమ తమ విజయం కోసం చేసిన కృషి ఈ రోజు ఈవిఎంలలో నిక్షిప్తమై ఉంది. దాని ఫలితం కోసం మాత్రం వచ్చే నెల 13వ తారీఖు వరకు ఆగాల్సింది.

తెలంగాణ ఉద్యమానికి చెక్??

తెలంగాణ ఉద్యమానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. తాజా, నో వర్క్ - నో పే జీవోను విడుదల చేసింది. గతంలో తెలంగాణకు చెందిన ప్రభుత్వోద్యోగులు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా, వారు అటువంటి ఆందోళనను తిరిగి చేపట్టకుండా ప్రభుత్వం ఆ జీవోను జారీ చేసినట్లు కనిపిస్తోంది.

పని చేయకపోతే జీతం చెల్లించేది లేదంటూ ప్రభుత్వం బుధవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుంచి ప్రభుత్వ కార్యాలయాలలో పని ఎగగొట్టి ఉద్యమాలు చేస్తామంటే కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలా జరిగితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం పేర్కొన్నది. కొంతమంది ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి సంతకాలుచేసి బయటకు వెళ్లిపోతున్నారని, అటువంటివారికి పని చేయకపోతే జీతాలు చెల్లించడం కుదరదని ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఎవరైనా ప్రభుత్వానికి సహాయ నిరాకరణ అంటే ఊరుకునేది లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.

గో గ్రీన్...

వేసవికాలం వచ్చిందంటే చాలు వేడిపై యుద్ధం ప్రకటించాల్సిందే. అందుకు ఎయిర్ కండిషనర్లు, కూలర్లు, వట్టివేళ్లు అంటూ ఎన్నో పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఇవి మరింత చల్లదనం ఇవ్వాలంటే ఇంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి మీ కోసం...

వేసవిలో ఇంటి పై కప్పుకు వైట్ పెయింట్ వేయించుకోవాలి. తెలుపు రంగు పెయింట్‌కి ఉన్న పరావర్తన గుణం వల్ల గదులు చల్లగా ఉంటాయి. ఈ ఇంట్లోకి నేరుగా సూర్యకిరణాలు పడే సమయంలో కిటికీ తలుపులు మూసేసి... సాయంత్రం వాతావరణం కాస్త చల్లపడిన తరువాత కిటికీలు తెరిచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల గదుల్లో వేడి బయటకు పోయి ఇల్లు చల్లగా ఉంటుంది.



తెలుపు రంగు వేడిని పరావర్తనం చేస్తుంది కనుక అదే రంగు విండో షేడ్లు, కర్టెన్లు, బ్లైండ్స్ కిటికీలకు పెడితే వేడి లోపలికి రాకుండా నిరోధించొచ్చు. బ్లైండ్స్, షేడ్స్, కర్టెన్లను అమర్చిన తూర్పు వైపు కిటికీలను ఉదయం, పడమర వైపు కిటికీలను సాయంత్రం మూసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల వేడి బయటనే ఉండి ఫ్యాన్లు, ఎయిర్ కండీషనర్లు తక్కువ శక్తిని వినియోగించుకుని ఎక్కువ చల్లదనాన్ని ఇస్తాయి.


ఇంటి లోపలి ఉష్ణోగ్రతను తగ్గించాలి

ఎలక్ట్రిక్ గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, లైట్లు ఇంటి లోపల వేడిని జనింపచేస్తాయి. అందుకని ల్యాంప్స్, టెలివిజన్ వంటి ఉష్ణాన్ని జనించే పరికరాలను ఎయిర్ కండిషనింగ్ థర్మోస్టాట్ పక్కన లేకుండా చూసుకోవాలి.

ఎక్కువ కాంతిని ఇచ్చే లైట్లు వాడకపోవడం మంచిది. అలాగే ఉష్ణాన్ని జనింపచేసే పరికరాలను కూడా వాడకూడదు. ఎక్కువ వెలుగు కోసం ఫ్లోరోసెంట్ బల్బులు వాడొచ్చు. ఇవి ఐదో వంతు శక్తిని వినియోగించుకుని తక్కువ ఉష్ణాన్ని విడుదల చేస్తాయి.

వేసవిలో వంట విషయంలో కూడా జాగ్రత్తవహించాలి. వాతావరణం వేడెక్కకముందే వంట పూర్తిచేసుకోవాలి. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో వేడిని తగ్గించుకోగలిగితే అప్పుడు తక్కువ ఎనర్జీతో ఇంటిని చల్ల పరుచుకునే అవకాశం ఉంటుంది.

మొక్కలతో మ్యాజిక్ చేయొచ్చు

దక్షిణ, పడమర దిశల్లో మొక్కలు నాటితే ఇల్లు చల్లగా ఉంటుంది.

చిన్న చిన్న కుండీల్లో పెంచుకునే మొక్కలు కంటికి హాయినిస్తాయి. చూపును మెరుగుపరుస్తాయి. పచ్చదనం మనసుకు ఉల్లాసాన్నిస్తుంది కూడా.

మొక్కల వల్ల స్వచ్ఛమైన గాలిని పీల్చే అవకాశం ఉంటుంది. ఇంటిలోపల స్థలం ఉంటే డెకరేటివ్ పాట్స్ లేదా స్టాండుల్లో ఇండోర్ ప్లాంట్స్ అమర్చుకోవచ్చు.

ఇండోర్‌ప్లాంట్స్ వేరు భాగాల్ని శుభ్రం చేసి నీళ్లు నింపిన వేజుల్లో కూడా ఉంచొచ్చు.

మొక్కలు ఉన్న దగ్గర పగటి ఉష్ణోగ్రతలు మొక్కలు లేని ప్రాంతంతో పోలిస్తే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా ఉంటాయి. అందుకని గో గ్రీన్...

13, ఏప్రిల్ 2011, బుధవారం

ప్రజలే తప్పులు చేసు ప్రభుత్వం ని నిందించటము ఎంత వరుకు న్యాయము

అన్నిటికన్నా పెద్ద అవినీతి ప్రజల దగ్గరే ఉన్నది అదేమిటి అంటే ఓటు వెయ్యకపోవటం. ఒకవేళ వేసినా కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన , అంతకంటే ఘోరం డబ్బులు తీసుకునో ఓటు వెయ్యటం. ఈ అవినీతి నుండి ప్రజలు బయటపడనంత వరకూ ఏ లోక్ పాల్ బిల్లూ మనను రక్షించలేదు.
సరే సవ్యంగా ఓటు వెయ్యటం అనేది పెద్ద విషయం. అతి చిన్న విషయం ఎక్కడన్నానలుగురికి ఒకే చోట పని ఉంటే, ఎవరూ చెప్పకుండా లైన్లో నుంచుని పని చేసుకోవటం మనకు తెలుసా!! కనీసం గొర్రెలు ఒకదాని తరువాత ఒకటి సోలుపుగా వెళ్తాయి. కాని మనం, పెద్ద పెద్ద ఇనప కచ్చడాలు పెట్టి, ఇరుకు సొరంగాలు కడితే కాని వరుసలో నుంచోము. అక్కడకూడ ఔత్సాహికులైన, దృఢకాయులు, కొండకోచో సామాన్యంగా కనపడేవారు కూడా మన భుజాల మీదగా, నెత్తి మీదుగా నడిచి వెళ్లి వరుసలో ముందుకు వెళ్ళిపోవటం కద్దు.
బస్సు కాని రైలు కాని రావటం ఆలస్యం, ఎగబడి ఒకరికొకరు అడ్డం వస్తూ, తోసుకుంటూ ఎక్కకపోతే తృప్తి లేదు. హాయిగా ఒకరి తరువాత ఒకరు ఎక్కటం అనే క్రమశిక్షణ ఎప్పటికి నేర్చుకుంటాం. ఈ తోసుకు ఎక్కే వాళ్ళ కంటే రెండాకులు ఎక్కువ తిన్న వాళ్ళు అలా ఆ పక్కకివెళ్లి, చేతిలో పత్రికో, జేబు గుడ్డో, నెత్తిన ఉన్న కాపో లేదా గొడుగో, చేతిలో బాగ్గో, కిటికీలోంచి ఆ సీట్లోపడేసి, అందరూ భుజబలం చూపి లోపలి తోసుకు వెళ్ళినాక "ఆ చోటు నాదండీ" అంటూఅమాయకంగా వస్తారు.
ఒకవేళ కొండవీటి చాంతాడు అంత వరుస ఉంటే, ఆ మొదట్లో కిటికీ దగ్గర తచ్చాట్లాడి మెల్లిగా దూరటం లేకపోతె ఆ ముందుగా ఉన్నవాణ్ణి తన టిక్కెట్టు కూడ తీసుకోమని దేబిరించటం గొప్ప ప్రావీణ్యంగా చలామణీ అవుతున్నది. ఈ మొత్తాన్ని ఏమనాలి, ఏ బిల్లు తెచ్చి ఈ చండాలపు పని ఆపాలి. క్రమశిక్షణ కావాలి. క్రమశిక్షణ లేని సమాజం అవినీతిని ఆపలేదు. పెంచి పోషిస్తుంది.
ట్రాఫిక్ లైట్ దగ్గర పోలీసు లేకుంటే ఎంతమంది ఆగుతారు! ఆగుతున్నారు? పోలీసు చుట్టుపక్కల లేకపోతె ఒక్క ఆటో వాళ్ళే కాదు, ఏ సి కారు వాళ్ళు కూడ లైటు పట్టనట్టు వెళ్ళిపోతారు. ప్రతి ట్రాఫిక్ లైటు దగ్గరా పోలీసును పెట్టి ట్రాఫిక్ నియంత్రించాల్సి వస్తున్నది . దానివల్ల పోలీసు బలగాల్లో ఎక్కువ భాగం ఈ పనికే సరిపోయే. వాళ్ళు ఇక దొంగల్ని పట్టుకునేది ఎప్పుడు, నేరనిరోధం ఎలాగూ చెయ్యలేకున్నారు, నేర పరిశోధన ఎప్పుడు చేసేట్టు. అందరి దగ్గరా క్రమశిక్షణ ఉండి , కనీసం ట్రాఫిక్ నియమాలు సవ్యంగా, పోలీసు లేకపోయినా పాటించ గలిగితే ఎంతమంది పోలీసులు నేర నియంత్రణ చెయ్యటానికి మిగులుతారు. ఆలోచించాలి, తప్పదు. ఈ విషయంలో అన్నా హజారే గారు ఏమీ చెయ్యలేరు. మనమే, మనం అందరం పూనుకోవాలి.
నియమాలు ఉన్నాయి, అవి పాటించాలి అన్న నీతి మనలో ఉండాలి. ఆ ఆఫీసులో తెలిసినవాడు ఎవడు? మనకు అర్హత లేకపోయినా మనకు పని ఎలా అవుతుంది, ఎవడిని పట్టుకుంటే పని సులువుగా చేయించుకోవచ్చు. ఎవడికి ఇంత పెడితే ఈ పని చులాగ్గా ఇవ్వాళే చేయించుకోగలం , ఇదే ఆలోచన.
సవ్యంగా ఉన్న నియమాల ప్రకారం ప్రజలందరూ పని చేసుకు పోతుంటే, అవినీతి ఎక్కడ నుంచి వస్తుంది. మనకు అర్హత లేనిదికావాలి, ఉన్న నియమాలు పాటించ కుండా పనులు అయిపోవాలి, అవినీతి ఉండకూడదు. ఎలా? ఈ రెండూ పరస్పర విరుద్ధమైన విషయాలే!
నియమాలు పాటించని ప్రజలు ఎక్కువగాఉన్న సమాజంలో అవినీతి ఎప్పటికీ పోదు. కలకాలం నిలిచే ఉంటుంది.
అవినీతి పోగొట్టాలంటే కొంత పని ఆలస్యం అవ్వటానికి, కొన్ని పనులు కాకపోవటానికి, ఆవిధంగా జరిగే నష్టాన్ని భారిమ్చాతానికి సిద్దపడి ఉండాలి. ఇవేమీ లేకుండా, టి వి కెమెరాల ముందు ఆవేశపడితే అవినీతి పోదు, మరింత పెరుగుతుంది. కారణం శిక్షలు ఎక్కువ అవ్వటం వల్ల తీసుకునే వాడు మరింత ఎక్కువ తీసుకుంటాడు. వాడికి రిస్కు ఎక్కువ అయ్యింది కదా మరి.
బంధువుల్లో ఉన్న అవినీతి అధికారులు, దొంగ వ్యాపారులని ఎవరన్నా బహిష్కరించి వాళ్ళఇళ్ళకు వెళ్ళకుండా ఉంటున్నారా. అలాంటి వాళ్ళ పిల్లలను సంబంధాలు చేసుకోకుండా ఉంటున్నారా? "అబ్బ మావాడా, భలే తెలివిగల వాడండీ, రెండుచేతులా సంపాదన" అనిచెప్పుకునే వాళ్ళను ఏమనాలి.
ఈ ఆలోచనా రీతి ఏ చట్టం మార్చగలదు. ఇది చట్టం చెయ్యలేనిపని. ఎవరికి వారు ఆలోచించుకుని చెయ్యాలి.
ఒక సామాన్యమైన కుటుంబంలో పెళ్ళికి ఎదిగిన కూతురు, రెండు సంబంధాలు వచ్చాయి, ఒకటి కుర్రాడు పి జి చేసి జనాభా లెక్కల కార్యాలయంలో పని చేస్తున్నాడు, మరొకడు పట్టభద్రుడు, చెక్ పోస్టులో పని. ఎవరైనా ఏది మంచి సంబంధం అని చేప్పు కుంటారు. ఆ రెండోదే కదా. అక్కడే ఉన్నది అవినీతికి మూలం.
ఎక్కడన్నా ఎర్ర లైటు దాటో, వన్-వేలో ఎదురు వెళ్ళో పోలీసు పట్టుకుంటే, సరే నాది తప్పు, ఫైన్ ఎంతో చెప్పండి కట్టేస్తాను రశీదు ఇవ్వండి అనే నీతి ఎంతమందిలో ఉన్నది. తృణమో ప్రణమో ఆ పోలీసుకు ఇచ్చేసి బయటపడదామనే తాపత్రయమే ఎక్కువ.
ఇక మన కళ్ళ ముందు జరిగే అవినీతి, మనం పనిచేసే చోట జరిగే అవినీతి "విజిల్ బ్లోయర్" చేసి అన్నా ఆపగలిగే ధైర్యం ఎంత మందిలో ఉన్నది. గుంపులో గోవిందగా ఎవరికో జైకొట్టుకుంటూ తిరిగేయ్యగలం, కాని మన ఒక్కళ్ళమే కనీసం అజ్ఞాతంగానన్నా జరిగే అవినీతిబయట పెట్టటంలో మనవంతు కృషి చెయ్యగలమా! ఆలోచించుకోవాలి.
ఆఫీసుల్లో పని చెయ్యకుండా బాతాఖానీతో కాలం గడపటం . ఉద్యోగం వచ్చేవరకూ ఒక గోల. ఉద్యోగం వచ్చిన తరువాత ప్రమోషన్ రాలేదని. పనిచేసేప్పుడు మనసు పెట్టి ఇచ్చిన పని సవ్యంగా చేసే వాళ్ళు ఎంతమంది? ఉద్యోగంలో "కరీర్ ఓరియంటేషన్" పేరుతొ సకల గడ్డీ కరవటం, చెయ్యకూడని పనులు చెయ్యటం అవినీతి కాదూ. వీటితో వచ్చే ఒత్తిడికి బి పిలు షుగర్లు తెచ్చుకోవటం. ఇదేనా మనకు మన పూర్వీకులు నేర్పినది!
చేసే వ్యాపారాల్లో కల్తీ, నాణ్యం లేని వస్తువులను అంటగట్టటం ఎటువంటి నీతి? ప్రతి వాడి దగ్గరకూ వెళ్లి తనిఖీ చేసి ఎవరు ఆపగలరు. ఆ వచ్చినవాడికి "ఆమ్యామ్యా" ఇచ్చేసి పంపటం, వాడు తీసుకోకుండా కేసు వ్రాస్తే, వాడి పైవాడి మరికొంత ఎక్కువ పారేసి కేసు మాఫీ చేయించుకోవటం, ఇదంతా నీతేనా. కాదు నాణానికి మరో పక్కన ఉన్న దృశ్యం. అది కూడ చూడాలి, తప్పదు.
నిజాయితీ లేని వ్యాపార ప్రకటనలు గుప్పించి ప్రజలను బ్రెయిన్ వాష్ చేసేయ్యటం, వాళ్ళను తోచుకో నివ్వకుండా, తమ వస్తువే కోనేట్టుగా చేసే వ్యాపార ప్రకటనలూ ఈ అవినీతిలో భాగమే.
ఇక ఇంకా అనేకం:- మన దొడ్లో చెత్త వేరే వాళ్ళ వాకిట్లోకి తోయ్యటం, నో పార్కింగ్ అన్న చోట నిర్భీతిగా వాహనాన్ని సైడు స్టాండు వేసి మరీ పార్కింగ్ చేసేయ్యటం, ఏమిరా అంటే అడ్డంగా వాదించటం, ఎట్టాపడితే అలా వాహన చోదకం, సమయ పాలన చెయ్యకపోవటం, వద్దన్న పనులే చెయ్యటం (బాహాటంగా పొగ తాగటం, మద్యం సేవించటం, వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడటం), ఎవరన్న గౌరవం లేకుండా దురుసుగా ప్రవర్తించటం, నలుగురిలో లేకితనపు మాటలు మాట్లాడటం ఇలా చెప్పుకుంటూ పొతే సవాలక్ష.
లంచం ఇచ్చేవాడు లేకపోతె అవినీతి ఎక్కడ నుంచి వస్తుంది. పది రూపాయలు ఒకడు లంచం ఇచ్చాడు అంటే, వాడికి ఆ పదిరూపాయల కంటే వెయ్యి రెట్లు లాభం లేకుండా ఇవ్వడు. ఆ లాభం పాటించవలసిన నియమాలు పాటిస్తే రాదు. అందుకని లంచంతో ఆ నియమాలను పాటించకుండా అధిగమించటం. ఇది తగ్గాలి ముందు. అవినీతి నిరోధక శాఖ వారు లంచాలు ఇవ్వచూపే ప్రభుద్దుల్ని కూడ వల పన్ని పట్టుకుని జైళ్ళల్లో పారెయ్యటం మొదలు పెట్టాలి.

మొత్తం మొత్తం మీద, మనిషిలో దురాశే అవినీతికి మూలం. మనకు అర్హత లేనివి సంపాయించాలన్న తపన, అవినీతికి పునాది. ఈ పునాదులను పగలగొట్టాలి. ప్రజలందరిలోనూమార్పు రావాలి. అది చట్టాలతోనూ, బిల్లులతోనూ రాదనీ నా అభిప్రాయం.

అన్నా హజారే ఆ వయస్సులో ఇచ్చిన స్పూర్తితో మన ఆలోచనా విధానం లో మార్పు రావాలి. ఊరికే ఇంకెవరో అవినీతిపరులన్నట్టుగా ఆవేశపడటం తగ్గించి మనలోనే పొంచి ఉన్న అవినీతిని గుర్తించి (ముందు గుర్తించటం ఎంతో ముఖ్యం, అది లేనట్టుగా ఉండటం కల్తీ లేని నటన) అటువంటిఆలోచనలు పోగొట్టుకోవటానికి కృషి చెయ్యాలి. అప్పుడే మనం అన్నా హజారేకి జై కొట్టటానికి అర్హులం. అటువంటి ఇంగితం లేనప్పుడు ఇప్పుడు టివిల ముందు జరిగేదంతా ఇచ్చకాలే తప్ప మరేమీ కాదు.


అవినీతి నిర్మూలించాలంటే వేలు మరోకరివంక చూపిస్తూ ఆవేశపడినంత మాత్రాన అది పోదు. ప్రజలందరం ఆత్మ విమర్శ నిజాయితీగా చేసుకోవాలి. ప్రతిరోజూ అవినీతి ఆలోచన కూడ దరి చేరనివ్వకుండా జీవించగలగాలి.

"యధాప్రజ తధారాజా"

"యధారాజా తధాప్రజ" అన్నది రాచరికపు రొజుల నాటి నానుడి. "యధాప్రజ తధారాజా" అన్నది ఇప్పటి నిజం. మనమే ప్రతీ విషయం లో ఇంత స్వార్ధం తో నిజాయితీ లేకుండా అలొచిస్తుంటే ఇక మనల్ని రిప్రజెంట్ చేసే , మనం ఎన్నుకున్న నాయకులు ఇంకెంత స్వార్ధం తొ ఆలోచిస్తారు. డబ్బు, మద్యం, గిఫ్ట్లు లంచం తీసుకుని అవినీతి పరుల్ని ఎన్నుకునేది సామాన్య జనమే (మనమే). బోల్డు డబ్బులు ఖర్చుపెట్టి, లంచం ఇచ్చి ఓట్లు కొన్న నాయకులు నిజాయితీ గా పనిచెయ్యాలని కొరుకొవడం చాలా అత్యాశ , అన్యాయం కూడా. మరి ఆ లంచం తీసుకునేవాళ్ళకన్నా ఆ లంచం ఆశ చూపించేవారిదే తప్పు అనుకుంటే , మరి లంచం తీసుకునే ప్రభుత్వ అధికారులకన్నా లంచం ఇచ్చే మనది తప్పు అన్నమాట. ఇదొక కరేప్షన్ సైకిల్ అన్నమాట... ఈరోజు లంచం ఇచ్చినవాడు రేపు వాళ్ళదగ్గరే తీసుకుంటాడు..ఆ మర్నాడు మళ్ళీ వాళ్ళకే లంచం ఇవ్వాల్సి రావచ్చు... ఆ సైకిల్ అలానే అనంతం గా సాగిపోతుంది. ఒక రకంగా ఈ సైకిల్ మన కల్చర్ లో భాగం అయిపొయింది. కొత్త సాఫ్ట్వేర్ మార్కెట్ లోకి రాగానే పాస్వర్డ్ బ్రేక్ చేసేవారిని మహా తెలివైన వాళ్ళగా పోగుడుతాం, డబ్బులిచ్చి ఒరిజినల్ డివిడి కొన్నవాడిని తింగరొడిని చూసినట్టు చూస్తాం. అది ఇప్పటి కల్చర్ ..

ఒక్కడు లక్ష రూపాయిలు ప్రబుత్వ సొమ్ము దోచేస్తే ఎంత నస్టమో, లక్ష మంది ఒక్కొకరు ఒక్కో రూపాయి చొప్పున దొచినా అంతే నస్టం. అయితే రూపాయి ఎవరికీ కనిపించదు.... అది తప్పు లా అనిపించదు....


నేను మారను కానీ నా పక్క ఉన్నవాళ్ళు అందరు మారిపోవాలి అన్న ఆలోచనలో ఉన్నంతకాలం ..ఎంతమంది అన్నా హాజారా లు వచ్చినా ఉపయోగం లేదు... ఏదో కొన్నాళ్ళు హడావుడి తప్పించి....
మనం చేసే అవినీతి గురించి ఆలోచన లేకుండా , సమాజం మాత్రం అవినీతి రహితం గా ఉండాలనుకోవడం , దానికి పాదయాత్రలు చెయ్యడం, నిరాహార దీక్షలు చెయ్యడం, లెక్చర్లు దంచడం కన్నా అత్మ వంచన ఇంకేమీ లేదు. అన్నా హాజారే కి లక్షకోట్లు తిన్న జగన్, రెండువేల ఎకరాలు ప్రబుత్వ రేట్ కి జాక్ పాట్ కొట్టిన రామోజీ రావు మద్దతు ప్రకటిస్తుంటే ఎంత కామెడీ గా ఉందొ ... మనం మద్దతు ప్రకటించినా అలానే ఉంటుంది....

ఈ రొజు సమాజానికి కావాల్సింది మన నిరాహారదీక్షలు, ఊరేగింపులు కాదు.... ప్రతీ మనిషిలో ఒక చిన్న రిజల్యూషన్. ఈ రొజు నుండి ఈ పర్టిక్యులర్ అవినీతి నేను త్యజిస్తున్నా ... ఈ తప్పు నేను మళ్ళీ చెయ్యను అని.... సంఘానికి పూర్తి వ్యతిరేకంగా ఎదురీదుతూ అపర నిజాయితి పరుడిగా ఒక్కరొజే మారిపొనక్కర్లేదు....మారలేం కూడా... అయితే మనకి చేతనయినంతలొ... మనం కొంచెం కస్టం తొ చెయ్యగలిగినవి చెయ్యగలిగితే చాలు.... మార్పు చాలా స్లొగా వస్తుంది. అయితే ఆ మార్పు ముందు ఎదుటివాడి నుండి ప్రారంభం అవ్వాలనుకోకుండా... మననుండి ప్రారంభం అవ్వాలని నిర్ణయించుకొవడమే నిజమయిన దేశభక్తి...

ఏ రకం గా చూసిన ముందు మారాల్సినది మనం. ఇది ఒక అవకాశం ... ఈ రోజే చిన్న నిర్ణయం తీసుకుందాం. వీలయినప్పుడల్లా ఒక్కో అవినీతి మార్గం వదిలేస్తూ పోదాం. కొన్నాళ్ళకి అంటే కనీసం ఒకటి రెండు తరాల తరువాతివారికయినా నిజాయితీ విలువ పూర్తిగా అర్ధం అవుతుంది.

ఎన్టీఆర్‌ రే హరికృష్ణను రెచ్చగొట్టాడా!!??

పార్టీలో నిప్పు పెట్టింది సినీ హీరో జూనియర్ ఎన్టీఆరే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావుపై తిరుగుబాటు ద్వారా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై పరోక్షంగా తిరుగుబాటు చేసిన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వల్లభనేని వంశీ, శాసనసభ్యుడు కొడాలి నానీ జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి చెందినవారే. వారిద్దరికీ గత ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టికెట్లు ఇప్పించుకున్నారు. అందువల్ల వారి ద్వారా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేయించారనే మాట వినిపిస్తోంది.


పార్టీలో సంక్షోభానికి తెర తీసేందుకు తన తండ్రి నందమూరి హరికృష్ణను రెచ్చగొట్టింది కూడా జూనియర్ ఎన్టీఆరేనని అంటున్నారు. పార్టీ నాయకత్వ బాధ్యతలను చంద్రబాబు నారా లోకేష్‌కు అప్పగించేందుకు, తన తదనంతరం లోకేష్‌ను పార్టీ అధినేతగా ప్రకటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, దానివల్ల పార్టీ పూర్తిగా స్వర్గీయ ఎన్టీఆర్ వారసత్వానికి దూరమైపోతుందని జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణతో అన్నట్లు తెలుస్తోంది. దాంతో నారా లోకేష్‌ను అడ్డగించేందుకు హరికృష్ణ తిరుగుబాటుకు పాదులు వేసినట్లు చెబుతున్నారు.

నారా లోకేష్ వాస్తవానికి వాణిజ్యవేత్త. ఆయన క్రమంగా తన వ్యాపార కార్యకలాపాలను పెంచుకుంటున్నారు. పార్లమెంటు సభ్యులు సుజనా చౌదరి, నామా నాగేశ్వర రావులతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. ఈ వ్యాపార సంబంధాల వల్లనే సుజనా చౌదరికి చంద్రబాబు రాజ్యసభ టికెట్ ఇచ్చారనే విమర్శలు కూడా అప్పుడు వెల్లువెత్తాయి. హరికృష్ణ కూడా తన నిరసనను వ్యక్తం చేశారు. వ్యాపార సంబంధాలను, పార్టీ కార్యకలాపాలను కలగలిపి మెల్లగా లోకేష్ పార్టీ వ్యవహారాల్లో ఆధిపత్య స్థానానికి చేరుకుంటారనే అనుమానాలే హరికృష్ణ తిరుగుబాటుకు కారణమని అంటున్నారు.

నారా లోకేష్‌కు పోటీగా జూనియర్ ఎన్టీఆర్‌ను నిలబెట్టాలనేది హరికృష్ణ ఉద్దేశంగా చెబుతారు. నారా లోకేష్‌కు ప్రజాకర్షణ లేకపోవడం పెద్ద లోటు. ఆ ప్రజాకర్షణ జూనియర్ ఎన్టీఆర్‌కు ఉంది. తాత ఎన్టీ రామారావు వారసుడిగా నిలబడాలనే బలమైన ఆకాంక్ష కూడా జూనియర్ ఎన్టీఆర్‌ను ముందుకు నడిపిస్తోంది. తెలుగుదేశం పార్టీని స్వర్గీయ ఎన్టీ రామరావు ఆశయాలకు అనుగుణంగా నడపాలనే హరికృష్ణ ఆకాంక్షకు జూనియర్ ఎన్టీఆర్ కోరిక తోడైనట్లు భావిస్తారు. అయితే, ఇప్పటికిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీని నడిపించగలిగే సత్తా సంతరించుకుంటారా అనేది అనుమానమే. అనుభవరాహిత్యం జూనియర్ ఎన్టీఆర్‌ను పీడిస్తోంది. అయితే, ఇప్పటికిప్పుడు చంద్రబాబును కాదనే ఉద్దేశం హరికృష్ణకు గానీ జూనియర్ ఎన్టీఆర్‌కు గానీ లేదని అంటారు. భవిష్యత్తులో పార్టీ నారా లోకేష్ చేతిలోకి వెళ్లకుండా చూసుకోవడమే వారి ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని చెబుతున్నారు. దానివల్లనే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సంక్షోభం చోటు చేసుకుందని భావిస్తున్నారు

హరి'కథ' ప్రస్తుతానికి కంచికి

తెలుగుదేశం పార్టీలో నెలకొన్న సంక్షోభం ముగిసినట్లేనని భావిస్తున్నారు. అయితే, ఇది తాత్కాలికమా, శాశ్వతమా అనేది చెప్పలేని పరిస్థితే ఉంది. హరికృష్ణ కథ ప్రస్తుతానికి కంచికి చేరినట్లు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి వ్యూహానికి హరికృష్ణ తలవంచక తప్పలేదని అంటున్నారు. సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ తొందరపడ్డారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ విజయవాడ నగర అధ్యక్ష పదవికి చేసిన వల్లభనేని వంశీ మంగళవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కలిశారు. చంద్రబాబుకు ఆయన క్షమాపణలు చెప్పినట్లు కూడా సమాచారం.


జూనియర్ ఎన్టీఆర్‌ను, హరికృష్ణను కలిసిన తర్వాతనే వంశీ చంద్రబాబును కలిసినట్లు చెబుతున్నారు. తన రాజీనామాను ఉపసంహరించుకుంటానని కూడా వంశీ చంద్రబాబుతో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, రాజీనామా ఉపసంహరణపై స్పష్టమైన ప్రకటనేది వంశీ నుంచి రాలేదు. ఈ విషయాలన్నీ చంద్రబాబుకు సన్నిహితులైన పార్టీ వర్గాల నుంచే బయటకు వస్తున్నాయి. తాను రాజీనామా చేయడానికి దారి తీసిన పరిస్థితులపై వంశీ చంద్రబాబుకు వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు.

నేను మీ నాయకత్వంలోనే పనిచేస్తానని వంశీ చంద్రబాబుతో చెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పార్టీని వీడేది లేదని వంశీ చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు సూచన మేరకు వంశీ రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది