30, నవంబర్ 2011, బుధవారం

అసలైన ఐడియల్ లైఫ్ స్టైల్

ఓ పెద్ద ఊర్లో ఒక సమావేశం జరుగుతోంది. దానికి దేశదేశాలనుంచి ఓ వంద మంది గొప్ప గొప్ప వ్యక్తులు, పేరు ప్రఖ్యాతులున్న పెద్దమనుష్యులు, అధ్యాపకులు, రాజకీయవేత్తలు, శాస్త్రవేత్తలు, పండితులు, మతాధిపతులు, పీఠాధిపతులు, వేంచేసి యున్నారు. ఇంతకీ అక్కడ సమావేశంలో చర్చించే విషయం అత్యున్నత జీవనశైలి (ఐడియల్ లైఫ్ స్టైల్) గురించి.ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, వారి వారి జీవితానుభవాలనుంచీ, వారు చదివిన పుస్తకాలు, మత గ్రంధాలు, శాస్త్ర గ్రంధాలనుండీ ఉదాహరణలు ఉటంకిస్తూ వారివారి అభిప్రాయాలను వెలి బుచ్చుతున్నారు. ఇష్టమున్నవాళ్ళు, ఆ అభిప్రాయలతో ఏకీభవించిన వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తూంటే, నచ్చనివాళ్ళూ, ఇష్టం లేనివాళ్ళూ వ్యతిరేకిస్తూ అడ్డుపడుతున్నారు.కొందరు ధనముంటే చాలంటే, మరికొందరు జ్ఞానవంతమైన జీవనానికి అనుకూలంగా వున్నారు. ఇంకొందరు దైవభక్తి, పాపభీతికి తలొగ్గితే, మరికొందరు అంగబలమూ, అధికారానికి పెద్దపీఠవేశారు. సాంకేతికంగా వృద్ధి చెందిన జీవనశైలే పరమావధిగా కొందరు భావిస్తే, ప్రశాంత మైన పల్లెజీవనానికి మించినదిలేదనేవారింకొందరు. ఈవిధంగా చాలా వేడి వేడిగా చర్చలు ఆరు రోజులుగా నడుస్తున్నా, ఇంతవరకూ ఒక ఏకాభిప్రాయానికి రాలేదు. ఏకాభిప్రాయానికి రావటానికి ఇంకొక్కరోజు మాత్రమే గడువుండటంతో చివరకు నిర్వాహకులు ఓటింగ్ పద్ధతిని అనుసరించడానికి నిర్ణయించారు. ఓటింగ్ ప్రక్రియ మొదలయ్యింది. ఒక్కొక్కళ్ళు వేడివేడిగా ప్రక్కవాళ్ళతో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలలోని పసను ప్రక్కవాళ్ళకు వినిపిస్తున్నారు. ఏదో ఒక విధంగా ప్రక్క వాళ్ళను ప్రభావితం చేసి ఇంకొన్ని ఓట్లను పొందుదామని తాపత్రయం. ఇలా అందరూ హడావుడిగా వుంటే, సాదా సీదాగా వున్న ఓ మధ్యవయసు వ్యక్తి ఎటువంటి హడావుడీ లేకుండా ప్రశాతంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఓటింగ్ కార్యక్రమం పూర్తయ్యింది. లెక్కించేందుకు ముందు చివరిసారిగా నిర్వాహకులు అందరూ ఓటువేశారా అని కనుక్కుంటున్నారు. నిర్వాహకుల్లో కొద్దిగా ఆలోచన కలిగిన ఓ చురుకైన వ్యక్తి, ముఖ్య నిర్వాహకుడు - మొదలునుంచీ ఎటువంటి హడావుడీ లేకుండా ప్రశాంతంగా వున్న మధ్య వయసు వ్యక్తిని గమనిస్తూవున్నాడు. అతనెప్పుడూ ఏ వ్యక్తితోనూ, ఎవరి అభిప్రాయంతోనూ ఏకీభవించడంగానీ, వ్యతిరేకించడంగానీ చేయలేదు. అసలు అతను అతని అభిప్రాయాన్ని కూడా ఎవరితోనూ పంచుకున్నట్లు కనబడనూలేదు. ఇప్పుడూ అలానే ప్రశాతంగా ఓ మూల కూర్చొని ఉన్నాడు. ఇదంతా చూసిన ఆ నిర్వాహకుడికి అతనికి కూడా ఓ అవకాశం ఇస్తే బాగుంటుందనిపించింది. ఇంతలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. అందరూ ఎవరికి వారే తమ అభిప్రాయమే గెలుస్తున్న అభిప్రాయంలో వున్నారు. ఫలితం ప్రకటించేందుకు ఆ చురుకైన నిర్వాహకుడు ఫలితాల కాగితంతో మైకు ముందుకు వచ్చాడు. అందరికీ ఉత్సాహంగా పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. వచ్చిన అందరికీ తమతమ అభిప్రాయాలను వెలిబుచ్చే అవకాశం వచ్చినా, ఒకవ్యక్తి మాత్రం తన అభిప్రాయాలను చెప్పలేకపోయాడనీ, చివరిగా అతనికీ ఓ అవకాశం ఇస్తున్నామనీ, దయచేసి అందర్నీ నిశ్శబ్ధంగా వుండమని ప్రార్థించాడు. మధ్యవయసు వ్యక్తి దగ్గరకు వచ్చి అతన్ని స్టేజ్ మీదకు మాట్లాడడానికి ఆహ్వానించాడు. ఆ మధ్యవయసు వ్యక్తి తన గురించి పరిచయం చేసుకుంటూ ఇలా అన్నాడు. "నేను భారత దేశం లోని ఓ సాధారణమైన చిన్న పట్టణం నుంచి వచ్చాను. నాకు ముగ్గురు పిల్లలు. నాలుగెకరాలు కూరగాయలు పండించే పొలం, గ్రామ సభలో అకౌంటెంటు ఉద్యోగం." ఈ మాటలు పూర్తయ్యీ కాకమునుపే సభలో మిగిలిన వారి ముఖాల్లో తేలికభావం, అసలెవరతన్ని ఈ సభకాహ్వానించారని గుసగుసలూ మొదలయ్యాయి. నిర్వాహకుడు వారించాక కొద్దిగా సద్దుమణిగారు. తిరిగి అతను మొదలు పెట్టాడు. "నేనేమీ ఈ సమావేశానికి వెళతాననలేదు, కానీ మా పట్టణ ప్రజలు, పెద్దల బలవంతం మీద వచ్చాను. కానీ ఇక్కడ మీలాంటి పెద్దల్నీ, పండితులనీ చూశాక నాలాంటి వాడు చెప్పేదేముంటుందని వూరకున్నాను." ఇంతలో సభలోంచి ఎవరో నీ వెవరి అభిప్రాయానికి ఓటేసావన్నారు. "మీ రెవరి అభిప్రాయంతోనూ నేనేకీభవించలేక పోయాను కనుక ఓటే వెయ్యలేదు" అన్నాడతను."మీరెవరి అభిప్రాయంతోనూ ఏకీభవించలేక పోయానన్నారు. బాగుంది. అయితే మీ అభిప్రాయంకూడా చెప్పండి" అన్నాడు నిర్వాహకుడు."మీరింతవరకూ చెప్పిన అభిప్రాయాలన్నీ మనిషి సుఖజీవితానికి తోడ్పడతాయి తప్ప అర్థవంతమైన జీవనానికి కాదు. అర్థవంతమైన జీవితమంటే ఏమిటో మీకు తెలియనిదేమీ కాదు. ఏ శ్రమా, కష్టం లేకుండా గడిపే సుఖవంతమైన జీవితానికీ, భూమిలోపల ఆరడుగుల గోతిలోని జీవితానికీ తేడా ఏముంది? ఇబ్బందులనధిగమిస్తూ, కష్టాలనెదుర్కొంటూ, అసహాయులకు ఆసరా అందిస్తూ సాగే జీవనమే సామాజిక, దేశ పురోభివృద్ధికి మూలం. అదే అసలైన ఐడియల్ లైఫ్ స్టైల్" అంటూ ముగించాడు. సభలో ఏ ఒక్కరూ ఏమీ మాట్లాడలేదు. నిర్వాహకుడు మైకు ముందుకు వచ్చి ఈ వ్యక్తి వెలిబుచ్చిన అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం ఎవరికైనా వుంటే మాట్లాడవలసిందిగా ఆహ్వానించాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. తన చేతిలోని ఫలితాల కాగితాన్ని తెరవకుండానే చించేసి, ఆ మధ్య వయసు వ్యక్తికి ధన్యవాదాలతో సభను ముగించాడు.

ఎప్పుడైనా ఆలోచించారా !!!!!!!!!!!!!!!!!!!!!!

మనం కొంపలు మునిగిపోయినట్లుగా అర్జంటుగా ఆపకుండానే కారు తోలుతూనో లేదా బైక్ నడుపుతూనో మొబైల్ లో మాట్లాడుతుండటం సహజం. కానీ దీని వల్ల ఇతరులు ఏవిధంగా ఇబ్బంది పడతారో ఎప్పుడైనా ఆలోచించారా. పోనీ మీరెప్పుడైనా అటువంటి ఇబ్బందులకు గురైయ్యారా. నావరకు రెండూ అయ్యాయి.

మాట్లాడుతూ వాహనం నడిపితే ఎంత హాని కలుగుతుందో అని గవర్నమెంటు - ట్రాఫిక్ వాళ్లు ఎంత ప్రయత్నించినా ఎవరూ అర్థం చేసుకోవటంలేదట. చివరకి ఫైన్లు వడ్డించినా పట్టించు కోవడం లేదట - ఎంత రుచిగా వుందో పాపం.

మిగిలిన వాహనాలు వెళ్ళే వేగంతో కాకుండా, నెమ్మదిగానో, లేకపోతే ఆగి ఆగి వెళ్ళడమో చేస్తాం. మన ఏకాగ్రత సరిగా వుండదు. చూపులు రోడ్డుమీదున్నా, చెవులు ఫోన్లోని మాటలమీద, మనసు ఆ మాటల గురించి ఆలోచిస్తూంటూంది.

మనం ట్రాఫిక్ నడిచే వేగం కన్నా మెల్లగా వెళడంతో వెనక వచ్చే వాహనాల కెంత చిరాకు కలిగింస్తుందో చెప్పనవసరంలేదు - హారన్లతో మోతెక్కిపోతుంటూంది
అంటే ఎదుటి వాహనం అకస్మాత్తుగా ఆగితే, దానికి ప్రతిస్పందించడం ఆలస్యం అవుతుంది - ఫలితం - ఢాం

ప్రక్కనో, వెనుకో హారన్ మోగినా వినటానికి చెవులు ఖాళీగా లేకపోవడంతో ఎవణ్ణో ఒకణ్ణి రుద్దో, గుద్దో తిట్లు లేదా తన్నులు తింటాం - హీనపక్షం గీతలూ, సొట్టలూనూ

కనిపించనిదింకొకటుంది - వేగంమీద కంట్రోలు లేకపోవటంతో, మూడునాలుగు గేర్ల బదులు రెండూమూడు గేర్లు వాడతాం - అంటే చమురు వదిలించుకోవడంతో పాటూ ఇంజను పెర్ఫార్మెన్సూ మందగిస్తుంది

ముఖ్యమైంది - ప్రక్కన కుర్చునేవారికి ఎంత ఇర్రిటేటింగా వుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా

మోహం, చపలత్వాల భ్రమ, భ్రాంతి

ఓ గురుకులంలో శిష్య పరమాణువు లందరూ విశ్రాంతి సమయంలో గుమిగూడి వాడి వేడిగా చర్చించుకుంటూ, తర్కించుకుంటూ, వాదించుకుంటూవున్నారు. ఆ వాదించుకునే విషయమేమిటంటే ప్రపంచంలోని ఈతి బాధలకు కారణమేమిటా అని.

కొందరు మనిషిలో స్వార్థం అన్నారు.
ఇంకొందరు భ్రమ, భ్రాంతి అంటున్నారు.
వేరొకరు మోహం, చపలత్వాల గురించి చెబుతున్నారు.
మరికొందరు సత్తుకీ అసత్తుకీ తేడా తెలియకుండా పోవడమే అని వివరిస్తున్నారు.

వారిలో వారు గుంపులుగా తయారయ్యి ఎవరికి నచ్చిన వాదనను బలపరుస్తూ మాట్లాడుతున్నారు.

చివరికి ఎటూ తేలక, ఏకాభిప్రాయానికి రాలేక గురువుగారికి విన్నవించారు. అందరి వాదనలూ ప్రశాంతంగా విన్న గురువు గారు ఇలా తేల్చారు.

" అన్ని బాధలకు మూల కారణం మనిషి కదలకుండా ప్రశాంతంగా మౌనంగా వుండలేకపోవడమే "

హద్దులు ఉంటాయి

జీవితం చిన్న చిన్న విషయాలలోనే వికసిస్తుంది, ఆదమరిస్తే హరిస్తుంది కూడా...
చిన్నవి అనేవాటికి హద్దులు ఉంటాయి. ఉండాలి! అందుకే అవి చిన్నవి. ఆ హద్దులు మనం గ్రహించం. అంతే!
పొరపాటున ఎవరైనా గుర్తు చేసినా ఒప్పుకోం, నచ్చదు. మాయ అందించే ఆనందం అలాంటిది మరి!,

నా చావుకు నన్నొదిలేసి, నా గొయ్యి లోతును కొలిచే పనికి రోజు పూనుకుంటుంది.

నన్ను నాకు నగ్నంగా చూపే పగటి వెలుగుకంటే
నన్ను నాలా ఉండనిస్తూ భద్రతనిచ్చే చిక్కటి చీకటి నాకు నచ్చుతుంది.

నాలో ఘోషని నిర్లక్ష్యం చేసే వెలుగుకు ఏ కొసైనా నా చింత లేదు.
తన నిశ్శబ్దంలో నన్ను ఐక్యం చేసుకునే చీకటి నిశ్చింతలో నాకు స్వాంతన దొరుకుతుంది.

తన కపట మాటలతో చేతలతో మభ్యపెట్టే, రోజు ఆడంబరంకంటే
చంటిపాపలా నన్ను లాలించే రేయిలోని ఆప్యాయత నన్ను నెగ్గుతుంది.

రెండు నిమిషాలు కూడా కుదురుండనివ్వని పగటి ఆర్భాటంకంటే
శాంతం కూర్చుని నా గాధలన్నీ ఓపికగా వినే యామిని స్నేహం ఆహ్లాదంగా ఉంది.

కాదని, కుదరదని, జరగదని అపహాస్యం చేసే వెలుగు రంగులకంటే
'నీకు నచ్చిన రంగులతో నన్ను నింపుకో' అని చీకటిచ్చే చనువు నన్ను కదిలిస్తుంది.

నా చావుకు నన్నొదిలేసి, నా గొయ్యి లోతును కొలిచే పనికి రోజు పూనుకుంటుంది.
జారిపోతున్న నాకు ఊతం అందించి, ఒడి పరిచి బడలిక తీరుస్తుంది రాత్రి.

పగటి వెలుగులో చీకట్లు ముసిరేస్తున్నాయి. చీకట్లో వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయి.
రేయి పాడిన పాటలలోని రాగాలు, ఉషోదయంతో కూనిరాగలై మాయమైపోతున్నాయి.

రణగొణగా అట్టహాసంగా సాగుతూ, ఎన్ని అపహాస్యాలు చేసి ఎంత కౄరంగా హింసించినా
ఎదిగే ప్రతి పొద్దును ఊపిరి బిగపట్టి ఓర్పుతో దాటేస్తున్నది ఎందుకంటే......
నిరాడంబరమైన నిశి పరిచే చల్లని ఒడిలో వెచ్చని ఊహలతో
నిశ్చింతగా నిదురించే సమయం తిరిగి నాదౌతుందన్న నమ్మకంతో......

29, నవంబర్ 2011, మంగళవారం

గాడిదను... గుర్రాన్ని ఒకే గాటన కడుతున్నారన్నదే నా బాధ

నేను ప్రతిపక్షంలోకి వచ్చి ఎనిమిదేళ్ళు కావొస్తోంది. ఇన్నాళ్ల తర్వాత కూడా ఇంకా కేసులు, విచారణల పేరుతో వేధించడం న్యాయమేనా? నేను అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు పాతికకు పైగా కేసులు వేశారు. వాటిన్నింటినీ కోర్టులు కొట్టివేశాయి. అనేక విచారణలు చేయించారు. ఎక్కడా తప్పులు పట్టుకోలేకపోయారు. ఇదంతా అయ్యాక మళ్ళీ బురద చల్లుతున్నారు. ఇలా వేధించడం ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా?' అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
బాబు మీడియా తో మాట్లాడుతూ తనపై విచారణ విషయం ప్రస్తావనకు రాగా, ఒకింత ఆవేదనతో- కేసులు, విచారణల పేరుతో తనను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ పరిణామాలన్నింటి వెనుకా కాంగ్రెస్ హస్తం ఉందని, భవిష్యత్తులో అన్నీ బయటకువస్తాయని పేర్కొన్నారు. 'అన్ని పార్టీలు కాంగ్రెస్కు లొంగిపోతున్నా మేం మాత్రమే పోరాడుతున్నాం. అందుకే ఈ వేధింపులు. కిరణ్బేడీ, రాందేవ్బాబా వంటివారిపై ఏనాటివో సాంకేతిక అంశాలను తోడి కేసులు పెడుతున్నారు. నేరుగా పోరాడటం చేతకాక దొంగ దెబ్బకు యత్నిస్తున్నారు' అని చెప్పారు.
'రాష్ట్రంకోసం గొడ్డు చాకిరీ చేశాను. చివరకు కుటుంబాన్ని కూడా విస్మరించాను. నేను అధికారంలో ఉండగా నా భార్య, కొడుకు ఏనాడైనా బయటకు వచ్చారా? నా అధికారాన్ని దుర్వినియోగం చేశారా? వారిపైనా కేసులు పెట్టారు. ఇదేం న్యాయం?' అని ప్రశ్నించారు. ఇరవై ఏళ్ళుగా తన భార్య ఇల్లు...కంపెనీ పని తప్ప మరోదానిలో తలదూర్చలేదని ఆయన పేర్కొన్నారు.
'నా కొడుకు లోకేశ్ అమెరికాలో చదువుకుంటే ఆ ఖర్చు రామలింగరాజు భరించారని పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు. స్టాన్ఫోర్డ్ వంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు విక్రయించరు. ఆరోపణలు చేసినవారికి అది కూడా తెలియదు. ఆ ఖర్చు కూడా భరించే స్థితిలో మేం లేమా?' అని విస్మయం వ్యక్తం చేశారు.
తాను స్కూల్లో చదువుతున్నప్పుడే వ్యాపారం చేస్తున్న రామోజీరావు తన బినామీ అంటే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదన్నారు. 'హైటెక్సిటీ పక్కన భూమి ఉంది కాబట్టి సినీనటుడు మురళీమోహన్ నా బినామీ అంటున్నారు. అంటే మాదాపూర్, శంషాబాద్ల్లో భూములున్నవారంతా నా బినామీలేనా? సింగపూర్లో నాకు హోటల్ ఉందని ఫొటో పెట్టారు. అదెవరిదో తెలపాలని సింగపూర్ హైకమిషనర్కు లేఖ రాశాను. దాని యాజమాన్యం బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్లో ఉందని జవాబు వచ్చింది.
అక్కడ పన్ను చట్టాలు లేవు కనుక వివరాలు బయటకు రావు. అందువల్ల నాపై బురద చల్లుతూనే ఉండవచ్చన్నది ప్రయత్నం' అన్నారు. డబ్బు పిచ్చితో వేల కోట్లు అక్రమంగా గడించినవారితో నన్ను పోల్చి గాడిదను... గుర్రాన్ని ఒకే గాటన కడుతున్నారన్నదే నా బాధ' అని వాపోయారు. కాగా.. తనకు సీబీఐ నుంచిగానీ, మరే దర్యాప్తు సంస్థ నుంచి గానీ ఎలాంటి నోటీసులూ అందలేదని చంద్రబాబు చెప్పారు. అయితే.. తన కుమారుడు లోకేశ్కు మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు వచ్చాయని తెలిపారు.
ఇదిలా వుంటే వైఎస్ విజయ వేసిన పిటిషన్ మేరకు తనతోపాటు మరికొందరి ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సోమవారం వెకేట్ పిటిషన్ దాఖలు చేశారు. "నాపై విజయ వేసిన పిటిషన్లో.. మా వాదనలు వినకుండా హైకోర్టు డివిజన్ బెంచ్ ఏకపక్షంగా (ఎక్స్పార్టీ) ఆదేశాలు ఇచ్చింది. వాటికి మీడియా విస్తృత ప్రచారం కల్పించింది. ఫలితంగా నా పరువుప్రతిష్ఠలకు తీవ్రనష్టం కలిగింది. ఇటువంటి ఆదేశాలు సహజ న్యాయసూత్రాలకు విరు ద్ధం. అంతేకాదు... రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగకరం'' అని ఆ పిటిషన్లో చంద్రబాబు పేర్కొన్నారు.

28, నవంబర్ 2011, సోమవారం

దేవుడి బిడ్డ అడ్డాలు బహిర్గతం కావడం

ఇడుపలేసుని మహిమలతో
ఈశాన్య రాష్ట్రాలలో కూడా
దేవుడి బిడ్డ అడ్డాలు బహిర్గతం కావడం
దేవుడి బిడ్డకే కాదు
ఆంధ్రులందరికీ గర్వకారణం.

సోమాలియా దొంగల కథ

ఒక డాక్టర్ గారు
తీరిక లేకుండా
రాష్ట్రానికి ఆపరేషను చేసి
సహజవనరులను వెలికి తీసి
కొడుకును కొండెక్కిస్తుంటే
ఎరువులు కావాలని రోడ్డెక్కిన రైతులకు
సోమాలియా దొంగల కథ చెప్పి
సమాధాన పరిచి
రైతు శాస్త్రవేత్తలుగా
పార్టీ కార్య కర్తలను పెట్టించి
మేఘమధనం పేరు చెప్పి ధన మధనం చేసి
రైతులకు ఆదాయం ఎక్కువజేసి
పంట విరామం చేయించిలా కృషి సల్పి
డాక్టర్ గారు చెప్పినట్లు
వ్యవసాయాన్ని పండగజేసినందుకు
ప్రక్క రాష్ట్రపు విద్యాలయం
పట్టండి మహా ప్రభో అని డాక్టరేట్ ఇస్తుంటే
పట్టరాని ఆనందం వచ్చింది
తీసుకొన్నందుకు మీకు లేని సిగ్గు
అభినందించడానికి మాకు ఎందుకు
అందుకే అందుకోండి శుభాకాంక్షలు.

ప్రతిపక్షానికి ప్రతిపక్షమై ప్రభుత్వం దగ్గరికి తమ ప్రతినిధులకు దారిచూపి

ప్రభుత్వం మైనార్టీలో పడింది
రక్షిస్తోంది ప్రతిపక్షమే అని
అవిశ్వాసం పెడితే
మేము పడగొట్టేస్తామని
ప్రగర్భాలు పలికి
ప్రతిపక్షానికి ప్రతిపక్షమై
ప్రభుత్వం దగ్గరికి
తమ ప్రతినిధులకు దారిచూపి

రైతు సమస్యలపై
అవిశ్వాసం పెడతాము
అని చెబుతున్న ప్రతిపక్షపు పల్లవిపై
పలుకే బంగారం చేసి బాబాయితో
రాయభారాలు నడుపుతున్నది ఎవరు?

వెంగలప్పలా పచ్చి వెలక్కాయ మింగి....................

సామాజిక న్యాయం అని
పడగొడితే నిలబెడతా అని
తనకు న్యాయం చేసుకోడానికి
అమ్మగారి దర్శనం చేసుకొంటూ
పార్టీ పెట్టినప్పటి నుండి అయోమయాన్ని దూరం చేసుకోకున్నా
అమాత్య పదవన్నా వస్తుంది అని
ఆశల పల్లకిలో ఒకరు

నాన్న అధికార మంత్రదండంతో
వాయు వేగాన వ్యాపారి అయి
అయ్య స్థానం కోసం అంగలార్చి
అలిగి
తోసేస్తానని
తోక జాడించి
ముసురుకొన్న కేసులతో
మద్దతు దారులు ‘దారులు’ వెతుక్కొంటుంటే
వెంగలప్పలా పచ్చి వెలక్కాయ మింగి
అమాత్య పదవన్నా వచ్చి వుండేదని
అంతులేని ఓదార్పు లో నిర్వేదపడుతూ
ఆటలో అరటి పండైనా ఓ అర్ధం వుండేది
అడ్డంగా కేసుల్లో ఇరుక్కొన్నామే అని ఇంకొకరు

నాన్నది తప్పా? అమ్మది తప్పా?

ఏభై శాతం మార్కులతో
అమెరికాలోని యూనివర్సిటీలలో
కొడిక్కి ఇరవై ఐదు కోట్ల డొనేషనుకట్టి
చదివించి అది చూపించుకోని
నాన్నది తప్పా?

ప్రజా సంపదను
పరుల దోసిట పట్టించి
కొడికి కంపెనీలలోకి
పెట్టుబడులు రప్పించి
కొడుకును పెద్ద వ్యాపార వేత్తగా
చూపించిన
నాన్నది తప్పా?

కొడుక్కోసం పాల వ్యాపారం చేస్తున్న
అమ్మది తప్పా?

కొడుకు రాజకీయ పదవి కోసం
అన్ని ఆరోపణలకు వెనకేసుకొని వస్తూ
రాజకీయ ప్రత్యర్ధులను వేధించడం మొదలెట్టిన
అమ్మది తప్పా?

21, నవంబర్ 2011, సోమవారం

ఆంధ్రాలో అయోధ్య లేని లోటును తీర్చాడు

సత్తు పళ్ళెం లో చప్పిడి తిండెట్టుకొని
ఏలగట్టిన కోడిని చూస్తూ
లొట్టలు వేసుకొని తినే
పింజారీ లు పైరసీలో చూసి
ఆనందిస్తాము అంటే
ఆడి బ్రతుకులో
ఆనందించడం
తెలుగు వాడిగా గర్వపడడం లాంటి పదాలు తెలియక
బురదలో బతికేసే రకం అని వదిలేయండి.
ఆ రాముడు
తారక రాముని దేహం లో
ఆవాహనం అయ్యి
ఆంధ్రాలో అయోధ్య లేని లోటును తీర్చాడు

చందాలతో భద్రాచల గుడి నిర్మించిన రామదాసు
నడయాడిన ఆంధ్రాలో
సయోధ్య కరువవ్వడం చూసి
ఆ రాముడు మరో సారి
బాలయ్య లో ఆవాహనం అయ్యి
ఆనంద భరితులను చేయ సంకల్పించాడు.

చరిత్ర సృస్టించాలన్నా .........అలా అనడం తప్పా????

గతంలో బాలయ్య గర్జిస్తే
ఆవేశం తో అంటున్నాడని ఆడిపోసుకొన్న వాళ్ళు
శ్రీ రామ రాజ్యంలో బాలయ్య విశ్వరూపం చూసి
సమాధాన పడ్డారా లేదా?
మొదట సింహమై గర్జిస్తూ
చరిత్ర సృస్టించాలన్నా .........అన్నప్పుడు
అవివేకంతో ఆడిపోసుకొన్న వారికి
దశాబ్దాల తరువాత
తెలుగు వాడికి మళ్ళీ రమ్యమైన రాముడి రూపం
చూపింది ఆ వంశమే కదా?
అలా అనడం తప్పా????
ఇక దర్శకుల గురించి
ఎవడినో ఉదహరిస్తూ
పళ్ళు రాలగొడతాను మన పరిశ్రమలో లేదంటే
అని ఆవేశ పడితే
అదును చూసి ఊదరగొట్టి
ఆ ఆవేశాన్ని పదే పదే ప్రశ్నించిన వాళ్లకు
అలనాటి లవ కుశ మాయా బజార్
సరసన నిలిపే
ఈనాటి శ్రీ రామ రాజ్యం దృశ్య కావ్యం
చూస్తే కనువిప్పు కలుగదూ??

11, నవంబర్ 2011, శుక్రవారం

మన పూర్వ జన్మ సుకృతం.

తన మన ను కూడా దూరం చేసుకొంటూ
రోజు రోజు కూ స్వార్థం పెంచుకొంటూ
సద్గుణాల గురించి తెలుసుకోలేనంత
కంగారు జీవితాలు వెలగబెడుతూ
జనం సొమ్ము తిన్నోల్లను
కథానాయకులుగా తాత్కాలిక బ్రాంతి చెందుతూ
ఆదర్శంగా చేసుకొని
అడ్డగోలు సంపాదనకు ఆత్రపడుతున్న
మన జీవితాలకు
అడపా దడపా అడ్డేసి
కామ క్రోధ మధ మాత్సర్యాలు
కట్టలు తెగితే ఏమవుతోందో తెలిపి
తప్పులను తెలుసుకొనే
తెప్పలు మన ఒడ్డుకు
అడపా దడపా వస్తాయి
అందులోనూ ఆంద్రులను మురిపించ
నందమూరి అందగాల్లనుండే వస్తాయి
మనలను మెప్పించే అభినయం
వారికి మాత్రమే అబ్భిన అదృష్టం
ఆ అదృష్ట వంతులకు అభిమానులుగా వుండడం
మన పూర్వ జన్మ సుకృతం.

గమనిక:

ఇక్కడ పూర్వ జన్మ సుకృతం అని వాడడం
మీరు అతిశయోక్తిగా అనుకోకండి
సంస్కృతి సంస్కారం నేర్చుకొనే
సినీ సాంగత్యం
అభిమానం రూపం లో మనలను
కట్టి పడేయడం ఖశ్చితంగా మన పూర్వ జన్మ సుకృతమే.

10, నవంబర్ 2011, గురువారం

ఇప్పుడు సత్యం డొల్ల సాక్షికి బల్లెం అయ్యింది

నాణేనికి రెండో ప్రక్క అంటూ
జనాలకు సాక్ష్యం చెప్పడానికి వస్తే
పుట్టుకనే ప్రశ్నించాయి
పత్రికలు ప్రతిపక్షం

అంతే అధికారం మత్తుతో
నేనే ఆణిముత్యం అంటూ
ప్రభువు ప్రార్ధనలు చేస్తూ
అంతెత్తున ఎగిరి
అందరినీ పచ్చ పత్రికలు అంటూ
ఎదురు దాడి మొదలెట్టింది

పాపం పండి కోతలు మొదలయ్యే సరికి
అధికారం అప్పుడు అంటకాగిన వాళ్ళు
అడ్డం తిరగగా
వెలక్కాయ పడి
శాపనార్ధాలు పెడుతూ
కామెర్ల రోగికి లోకం అంతా పచ్చగా కనిపించినట్టు
ప్రపంచం లో శానా మంది ఇంతకంటే ఘోరం అంటూ
గిల గిల లాడుతూ
అమ్మగారితో గిల్లీ కాజాలు ఆడిస్తూ
ప్రత్యారోపణలతో ఆరున్నరొక్క రాగం వినిపిస్తోండగా

ఇన్నాళ్ళూ స్వాతి ముత్యం అంటూ మురిపించినా
ఇప్పుడు సత్యం డొల్ల సాక్షికి బల్లెం అయ్యింది
విలువ కట్టిన వాడితోనే
కటకటాల వెనుక పంపే పని చేయిస్తుండగా
చేష్టలుడిగింది సాక్షికి

9, నవంబర్ 2011, బుధవారం

మానవ జన్మ దుర్లభమని అర్ధము

ఈ సృష్టి ఒక్క సమయము అను మహా కాల ప్రవాహమునకు పోల్చి చూచినచో మానవ జీవితము ఒక్క నిమిషము మాత్రమే అగును. అనగా 100 సంవత్సరములు బ్రతికిన వాడు ఒక్క నిమిషము బ్రతికిన కీటకముతో సమానము. 50 సంవత్సరముల వయస్సులో పోయినవాడు అర నిమిషము బ్రతికినవాడు. 25 సంవత్సరముల వయస్సులో పోయినవాడు పావు నిమిషము బ్రతికినవాడు. మనము చూచు చుండగనే మన కంటి ఎదుట ఒక కీటకము ఒక నిమిష కాలము బ్రతికినది. మరియొక కీటకము పావు నిమిషమే బ్రతికినది. మొదటి కీటకము ఎట్టి వేదనయు లేక మరణించినది. రెండవ కీటకము పావు నిమిషము బ్రతికి చివరిలో ఒక క్షణకాలము హింసను అనుభవించి మరణించినది. మొదటి కీటకము నిమిషము బ్రతికినను ఎట్టి హింసయు లేక మరణించినను మరణానంతరము కోట్ల సంవత్సరములు హింసకు గురియైనది. రెండవ కీటకము పావు నిమిషమే బ్రతికినను ఒక క్షణకాలము హింసననుభవించినను, మరణానంతరము కోట్ల సంవత్సరములు ఆనందముతో తేలియాడినది. ఈ రెండు కీటకములలో ఏ కీటకమును గురించి నీవు దుఃఖించవలెను? మొదటి కీటకము గురించియే "అయ్యో! పాపము" అనవలెను. రెండవ కీటకమును గురించి కాదు. కావున 32 సంవత్సరములు మాత్రమే బ్రతికి చిట్ట చివరిలో 4 రోజులు భగందర వ్యాధితో బాధపడి మరణించి, తరువాత సృష్టి ఉన్నంతకాలము శివ సాయుజ్యమును పొందిన ఆది శంకరుల యొక్క అల్పాయుర్ధాయమును గురించికాని, ఆయన అనుభవించిన రోగబాధను కాని చింతించి సానుభూతి చూపనవసరము లేదు. మరియొకడు కాకి వలె నూరేండ్లు జీవించి పెద్ద వైద్యాలయములో మరణించి తరువాత సృష్టి ఉన్నంతకాలము నరకమున పడినాడు. ఈ రెండవ వాని గురించియే ఏడ్చి సానుభూతి చూపవలెను. భగవంతుని దృష్టిలో మొదటివాడు 100 క్షణములు, జీవించినాడు. రెండవ వాడు 32 క్షణములే జీవించినాడు. ఈ క్షణకాలములో ఒకనికి ఓరిగినది లేదు మరియొకడు నష్టపడినది లేదు. ఈ క్షణకాలము తరువాత జీవుడు పొందు నిత్య శాశ్వత ఫలమును గురించిన ప్రయత్నము చేసుకొనుట ఎంతో వివేకమైయున్నది. ఈ క్షణకాల సుఖములలోపడి ఈ క్షణకాలము మాత్రమే ఉండు పతి, పుత్ర, ధన, దారా బంధముల వ్యామోహములలోపడి నిత్య ఫలమును నాశము చేసుకున్నవాడు ఎంతో అవివేకి. ఈ అవివేకమునకు కారణము కాలము యొక్క జ్ఞానము లేకపోవుటయే కావున కాలజ్ఞానము గల యోగి శాశ్వత ఆనందమును సంపాదించు కొనుటకై ఈ క్షణకాలమును సాధనతో సద్వినియోగము చేసుకొనును. కావున ఈ జీవుడు మరణమును గురించి కాని, మరణవేదనను గురించికాని, ఈ క్షణ జీవితకాలములో జరుగు కష్టనష్టముల గురించి కాని ఆలోచింప పనిలేదు. ఒకరి జీవితము బాగున్నది. నా జీవితము బాగా లేదని చింతింప పనిలేదు. అట్లే ఒకడు అల్పాయుర్దాయుడు, మరియొకడు పూర్ణాయుర్దాయుడని పలుక పనిలేదు. ఇవి యన్నియును ఒక్క క్షణకాలము లోని బేధములే. మరణానంతరము పొందు ఫలము అనంత కాలము ఉండునది. అట్టి నిత్య ఫలమును గురించి భగవంతుని ప్రార్ధించవలయునే కాని, అసత్యములు క్షణికములైన వాటిని గురించి, వారిని గురించి పరమాత్మను అర్ధింపనేల? అంతే కాదు ఈ ఒక్క క్షణకాలము ముగియగనే నీ శరీరము కూడ నశించి పంచభూతములలో కలసిపోవుచున్నది. అట్టి క్షణికమైన నీ శరీరము యొక్క రోగబాధలను గురించి భగవంతుని యాచింపనేల? నీవు అడగ తలచుకున్నచో మరణానంతరము సిద్ధించు ఆ నిత్య ఫలమును గురించియే అర్ధించవలెను. కావున కాలజ్ఞానము తెలిసిన వారు ఎంతో వివేకముతో ఈ క్షణకాల జీవితములో చేసిన సాధన ద్వారా శాశ్వతమైన బ్రహ్మ సాయుజ్యమను అమృతఫలమును పొందుచున్నారు. ఇదియే నిజమైన కాలజ్ఞానము. అంతే కాని భవిష్యత్కాలములో జరగబోవు లౌకిక విషయముల గురించి తెలుసుకొనుట కానేకాదు.

ఇప్పుడున్న లౌకిక విషయములే నిన్ను సర్వనాశనము చేయుటకు చాలును. నిన్ను ఒక్క క్షణకాలములో భస్మము చేయుగల హాలాహల విషము నీ చేతిలో ఉండగా, అది చాలక ఇరుగుపొరుగు వారి ముచ్చట్లు, టి.వి, సినిమాలు, నవలలు, కధలు ఇంకనూ భవిష్యత్పురాణము, కాలజ్ఞానము అను కుండలు కుండలు విషము కొరకు పరుగిడు చున్నావు. నీ యొక్క అవివేకమును చూచి పరమాత్మ కన్నీరు కార్చుచున్నాడు. అట్టి నీవు అల్పాయుష్కులైన శంకరుల గురించి ఆయన పడిన నాలుగు రోజుల బాధను గురించి "అయ్యో పాపము " అనుచున్నావు. కాని నిత్య నరకములో పడిన నీ వెనుకటి తరముల వారి గురించియు, మరియు నీ గురించియు, మరియు నీ యొక్క రాబోవు తరముల గురించియు "అయ్యో! పాపము" అని పరమాత్మ కోటిసార్లు పలుకుచున్నాడు. క్రీస్తు మహాత్ముడు 34 సంవత్సరములు బ్రతికినాడు. నాలుగు గంటలు హింసను అనుభవించినాడు. ఆయన శిలువను మోసుకొని పోవుచుండగా చూచు చున్నవారు ఆయనకు వచ్చిన కష్టమును చూచి సానుభూతితో ఏడ్చినారు. లక్ష కొరడా దెబ్బలు తినబోవు వాడు నాలుగు కొరడా దెబ్బలు తినువాని చూచి ఏడ్చినట్లున్నది. వెంటనే ఆ మహాత్ముడు ఆగి వారి వైపు చూచి "మీరు నా కోసము ఏడవ వద్దు. మీ కొరకును మీ పిల్లల కొరకును ఏడవండి" అని చెప్పి ముందుకు సాగినాడు. కావున ఈ క్షణ జీవిత కాలములో క్షణికములగు ఐహికముల కొరకు గాని, ఆయురారోగ్యముల కొరకు గాని, మృత్యువును గురించి కాని చింతించు మూర్ఖుడు మరియొకడు ఉండడు. క్షణకాలములోని బాధలను అవివేకముతో చింతించుచున్నాడే తప్ప, తర్వాత వచ్చు శాశ్వత బాధల గురించి తెలుసుకొనుట లేదు. క్రైస్తవ మతము ప్రకారముగా జీవునకు మరల మానవ జన్మ ముగియగనే తుది తీర్పు ఉండును. ముక్తులు శాశ్వతముగ పరమాత్మ వద్దకు చేరుదురు. బద్ధులు శాశ్వతముగ నరకమున పడుదురు. హిందుమత సిద్ధాంతము కూడా ఇదే చెప్పుచున్నది. "జంతూనాం నర జన్మ దుర్లభమిదమ్" అని హిందూమత సంప్రదాయము చెప్పుచున్నది. అనగా మానవ జన్మ దుర్లభమని అర్ధము. ఎడారిలో మంచినీరు దుర్లభమనగా అర్ధమేమి? ఎడారిలో మంచి నీరు లభించదు అనియే గదా. కావున ఇదం నరజన్మ= ఈ మనుష్య జన్మ, జంతూనాం = జంతువులకు, దుర్లభం = మరల లభించదు. కావున ఏ మతము చెప్పినను, సత్యము సత్యమే. అమెరికాలో దొరికినను, ఇండియాలో దొరికినను వజ్రము వజ్రమే. గులక రాయి గులకరాయే. ఐతే ఇచ్చట మరియొక సత్యమున్నది. ఈ సత్యము ముందు చెప్పిన సత్యమునకు విరుద్ధము కాదు. అది ఏమనగా పరమాత్మ వద్దకు చేరిన ముక్త జీవులు మానవులను ఉద్ధరించుటకు, పరమాత్మతో పాటు మానవ జన్మలను పొందుదురు. అంతే కాని నిత్య నరకమున పడిన బద్ధ జీవులకు మరల మనుష్య జన్మలేదు

ఆ యాదవులు సామాన్య జీవులు

శ్రీ కృష్ణ భగవానుని ఒక్క స్వరూపమే భగవద్గీత. కృష్ణుడు అనగా ఆకర్షించు వాడు అని అర్ధము. ఆయన యొక్క అంత: స్వరూపమే నారాయణుడు. నారాయణుడు అనగా జ్ఞానమునకు ఆధారమైన వాడు అని అర్ధము. కావున ఆయన యొక్క నిజమైన ఆకర్షణ ఆయన ఎత్తిన భగవద్గీత మూలమునే యున్నది. ఆయన గోకులములో పుట్టి పామరులకు సైతము వ్రజ భాషలో ఎంతో విలువ గల జ్ఞానవాక్యములను చెప్పుచుండెడివాడు. ఆయన చెప్పిన వాక్యములే గీతలో శ్లోకములుగా వచ్చినవి. కృష్ణుడు ఎల్లప్పుడును తక్కువ వాక్యములనే పలుకు చుండెడివాడు. అయితే గోకులమున పుట్టిన గోపికలు పూర్వజన్మమున బ్రహ్మర్షులు కావున ఆయన చెప్పు తత్త్వ వాక్యములకు ఎంతో ఆకర్షించబడి స్వామి వద్దకు వచ్చెడివారు. గోపికలకు ఉన్న శ్రద్ధ మిగిలిన యాదవులకు అంతగా ఉండెడిదికాదు. ఏలననగా ఆ యాదవులు సామాన్య జీవులు. కృష్ణుడు ఎప్పుడును హృదయాంతరముల స్పందిపజేయు మధురాతి మధుర గీతములను పాడుచు వాటిని మురళితో వాయించెడివాడు. ఆ గీతము లన్నియును పరమాత్మనే లక్ష్యముగా చేసుకొని సత్యమైన భక్తిని బోధించెడి అమృతధారలుగా ఉండెడివి. ఆ గీతములన్నియును భగవత్ ప్రేమతో నిండియుండుట వలన వాటిని విని స్వామితో వంత పాడుచు గోపికలు మైమరచెడివారు. ఆ భక్తి గీతములతో గోపికల బ్రహ్మానంద సముద్రమున మునిగిపోయెడివారు. ఇదియే బృందావనములోని రాసకేళి. రాసకేళి అనగా ఒక దివ్యమైన మధురాతి మధురమైన భజన. కాని నేడు రాసకేళి గురించి అవి ఏవో సినిమా జ్యూయట్ సాంగ్లని అపార్ధము చేసుకొనుచున్నారు. అక్కడ ఉన్న కృష్ణుడు సాక్షాత్ పరమాత్మ. ఆ గోపికలు యుగ యుగములు తపస్సు గావించిన బ్రహ్మర్షులు. అదియే వారి చివరి జన్మ. కృష్ణుడు ఆనాడు తాను వచించిన జ్ఞాన వాక్యములనే పాటల రూపములలో రాసకేళిలో పాడెడివాడు. అదియే జ్ఞానము మరియు ప్రేమ అను భగవంతుని రెండు కల్యాణ గుణముల కలయిక. ఆ గోపికలు మహా పండితులైన ఋషులు. వారు జ్ఞానమును కఠినములైన వాక్య శాస్త్రముల ద్వారా అప్పటి వరకు చర్చించి వచ్చినవారు. వారు అప్పటి వరకు జ్ఞానమును వాక్యములలో మరియు శ్లోకములలో చర్చించెడివారు. ఆ వాక్యములే యజుర్వేదములు. శ్లోకములే ఋగ్వేదము. అదే జ్ఞానము మధురమైన గీతముల ద్వార ఉన్నపుడు సామవేదమగును. అందుకే కృష్ణుడు "వేదానాం సామవేదోస్మి" అన్నాడు. ఆయనకు జ్ఞానము మధురమైన ప్రేమయు చాల ఇష్టముగ నుండును. కురుక్షేత్రములో ఆయన అర్జునునకు వినిపించినవి కూడా పాటలే. కావుననే దానిని భగవద్గీత అన్నారు. భగవద్గీత అనగా భగవంతునిచే పాడబడిన గీతలు లేక పాటలు అని అర్ధము. ఈ పాటలను ప్రతి దినము బృందావనము నందు గోపికలకు వినిపించినాడు. ఈ పాటలనే యమునా తటమున తమాల (గానుగ) వృక్షశాఖపై ఆశీనుడై ఏకాంతముగా మురళితో పాడెడివాడు. కావున ఆయన యొక్క వేణుగీత గాని రాసకేళిలో పాడిన పాటలు గాని భగవద్గీతా శ్లోకములే. భగవద్గీత రజోగుణముతో కూడిన అహంకారముతో నున్న క్షత్రియుడైన అర్జునుడికి చెప్పబడినవి. అర్జనుడు కూడ పూర్వజన్మమున నరుడు అను ఋషియే. కాని క్షత్రియ కులమున పురుషునిగా పుట్టినాడు. పార్ధునికి కుల అహంకారము, లింగాహంకారము ఉన్నది. అంతే కాదు తాను మహా వీరుడన్న అహంకారము కూడ ఉన్నది. కావున పార్ధునికి చెప్పిన భగవద్గీతలో కొంచము కాఠిన్యము ఎక్కువగా కనిపించుచు మిరపకాయ బజ్జీ వలె ఉన్నది. కాని గోపికలు స్త్రీ జన్మనెత్తి గొల్లలను శూద్ర కులమున పుట్టి లింగాహంకారము కులాహంకారము లేక సంపూర్ణ శరణాగతి చేసినారు వారు. కావున గోపికలకు చెప్పిన జ్ఞానగీతలు పంచదార రసగుల్లాల వలెనున్నవి. ఆ గీతల యొక్క నామధేయమే రాసకేళి. రాసము అనగా మధుర ప్రేమ రసముతో నిండిన సముద్రము. కేళి అనగా దాని యందు ఈదులాడుచూ స్నానము చేయుట. ఆ సమయము స్వామి ఆపాదమస్తకము మధుర ప్రేమ స్వరూపమున ఉండెడివాడు.

ఆ స్వరూపము గురించియే "మధురాతి పతియే అఖిలం మధురం". సాత్వికులైన బ్రహ్మర్షుల యొక్క జ్ఞానముతో కూడిన గోపికల మధుర ప్రేమ వాతావరణమే బృందావనము. జీవుని యొక్క గుణముల బట్టియే వాతావరణము మరియు స్వామి స్వరూపము కూడ ఉండును. పార్ధుని యొక్క గుణముల బట్టియే కురుక్షేత్ర వాతావరణమున గీతను చెప్పవలసి వచ్చినది. రజోగుణము అహంకారమయమైన యుద్ధ వాతావరణమున స్వామి కూడ పాంచ జన్య శంఖమును పూరించుచు రణోత్సాహముతో వరావృశముతో పరుష స్వభావముగానున్నారు. గుణమును బట్టియే మనస్సు మరియు వాతావరణము మరియు దానికి అనుగుణముగా వాక్కు ఉండును. మరి ఆనాటి రాసకేళి గ్రంధమును వ్యాసుడు ఏల గ్రంధస్ధముగావించలేదు. అది ద్వాపరయుగాంతము. అతి స్వల్పకాలములోనే కలియుగము రాబోవుచున్నది. ఆ రాసకేళి గీతముల శ్రవణము చేయు అర్హత గల జీవులు లేరు. అందరును రజోగుణముతో అర్జునుని తాత ముత్తాతల వంటి జీవులు ఉన్నారు. కావున ఈ జీవులకు యోగ్యమైనది పార్ధునికి చెప్పిన ఈ భగవద్గీతయే. ముందు భగవద్గీత యను ఉట్టికి ఎక్కినచో తరువాత మాట రాసకేళి యను స్వర్గమునకు ఎక్కుట. మరియు అయోగ్యులగు ఈ జీవులు ఆ రాసకేళి గీతలను అపార్ధము చేసుకొనెదరు. విమర్శంతురు. అర్జునుడే విమర్శంచినాడు కృష్ణపరమాత్మను. గయోపాఖ్యాన సందర్భమున "సతులయే మార్చి గొల్లభామల మరుగుట కాదు" అన్నాడు. ఆ రాసకేళి గీతములను అర్జునుడు వినలేదు. పరమ భక్తుడగు నారాయణుని వెంట నీడ వలెనున్న నరుడు అనబడు ఋషియగు అర్జునుడే తన ఉపాధి అగు క్షత్రియ వీర పురుషజన్మ ప్రభావము చేత ఇట్లు పలికినపుడు ఇక మిగిలిన శిశుపాల దుర్యోధన జరాసంధాది రాజుల సంగతి చెప్పనేల? ఆనాడు రాసకేళి గీతములలో చెప్పిన అనేకానేక అద్భుత జ్ఞాన రహస్యములను కరుణామయుడగు స్వామి ఈనాడు జ్ఞాన సరస్వతి ద్వారా జీవులకు అందించుచున్నాడు. ఇవి అన్నియును వేదములలో కలవు. కావున ఆ వేదములు ఖిలమై పోయినవి. "అనంతావై వేదా హః" అనగా వేదములకు అంతము లేదు. భరద్వాజుడను ముని 300 సంవత్సరములు వేదములను చదివినాడు. ఆయనకు స్వామి సాక్షాత్కరించి మూడు మహా పర్వతములను చూపినాడు. ఒక్కొక్క పర్వతము నుండి ఒక్కొక్క పిడికిలి మట్టి తీయమన్నాడు. స్వామి ఇట్లు చెప్పినాడు. ఓ భరద్వాజ! నీవు చదివిన వేదము ఈ మూడు పిడికిళ్ళ మట్టి మాత్రమే ఇంకనూ చదవవలసిన వేదము ఆ మహా పర్వతములు అన్నాడు. ఈ కధ వేదము నందే కలదు. "భరద్వాజో హవైః" అను మంత్ర పాఠమున కలదు. భరద్వాజుడు 300 సంవత్సరములలో చదివిన వేదములలో ఒక సంవత్సరము మాత్రమే చదివిన వేదము మనకు ఈనాడు మిగిలియున్నది. మిగిలిన 299 సంవత్సరముల వేదము ధారణ చేయలేక మరచిపోయినారు. దీనిని "ఖిల వేదము" అందురు. ఖిలము అనగా అంతరించినది అని అర్ధము. కావున స్వామి యొక్క జ్ఞానము అనంతమైనది. గోపికల రూపములో ఋషులు ఎందుకు అంతగా ఆకర్షించబడినారు. స్వామి గీతలలో చెప్పెడి జ్ఞానము వారు అధ్యయనము చేసెడి వేదములలోఉండెడిది కాదు. అది అంతవరకు శ్రవణము చేయని విజ్ఞానము. కావున వారికి ఎంతో శ్రద్ధ ఉండెడిది. ఆ శ్రద్ధయే కృష్ణునిపై ఏర్పడిన ఆకర్షణ. ఆ శ్రద్ధ ముందు అన్నపానీయములు కాని, నిద్ర కాని, అత్తమామలు కాని, పతిపుత్రులు కాని, గృహ, పశు, క్షేత్ర బంధములు కాని నిలువలేక పోయినవి. కావున రాసకేళి అనగా మహా పవిత్రమైన వేదాధ్యయనము. అది ఈశ్వర జీవుల గురు శిష్యులు కావుననే భాగవతము ఏడు దినములలో మోక్షమునీయ గల మహా పవిత్ర గ్రంధమైనది.

కృష్ణుడు ధర్మమును సైతము అతిక్రమించి రుక్మిణిని వివాహమాడెను

లోకములో కష్టములకు కుంగరాదు. సుఖములకు పొంగరాదు. సుఖములు పైకి లేచిన తరంగాలు కష్టములు క్రిందకు వచ్చిన తరంగములు. తరంగముల యొక్క బరువును తీసుకున్నపుడు ప్రతి తరంగమునకు శృంగము, ద్రోణి రెండు వుండును. శృంగమే సుఖము. ద్రోణియే కష్టము. ఒకదాని వెనుక రెండవది ఉండును. కాలచక్రము తిరుగుచుండగా చక్రములోని క్రింది అరలు పైకి, పై అరలు క్రిందికి వచ్చుచుండును. కావున కష్టము గానీ, సుఖము గానీ నిత్యము ఉండదు. అవి ఎండ నీడల వంటివి. నిరంతరము ఎండలో ఉండలేము. ఎండలో కష్టపడి పనిచేసి నేడకు వచ్చిన వాడు ఎంతో సుఖమును పొందును. అలానే కష్టములను అనుభవించిన తరువాత సుఖమును అనుభవించినచో, ఆ సుఖము ఎంతో రుచిగా యుండును. ఈ కష్టసుఝములు మనస్సులోకి ప్రవేశించరాదు. నీటి అలలో పడవ ఊగుచున్ననూ, ఆ పడవలో ఊయలలో ఊగు వినోదము పొందుచూ ప్రయాణించ వచ్చును. కానీ పడవకు చిల్లిపడి ఆనీరు పడవ లోనికి వచ్చినచో పడవ మునిగిపోవును. అట్లే కష్ట సుఖములు మనస్సులోనికి ప్రవేశించరాదు. కష్టములు వచ్చినపుడు కఠినముగను, సుఖములు వచ్చినపుడు సున్నితముగను ఉండవలెను. "వజ్రాదపి కఠోరణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణాం చేతాంసి కోహిని జ్ఞాతు మర్హతి" అని భవభూతి వర్ణించినాడు. "నప్రహృ ష్వేత్ ప్రియం ప్రాస్యా నోద్విజేత్ పాప్య్రాచా అప్రియం" కష్ట సుఖములకు కుంగక, పొంగక ఉన్నవాడే స్ధిత ప్రజ్ఞుడు అని గీత చెప్పుచున్నది. పొంగుట, కుంగుట వలన మన నుండి శక్తి విపరీతముగా ఖర్చు అగుచున్నది. శక్తి ప్రవర్ధమైన వాడు ఇహము నందును ఏమియూ సాధించలేడు. మరియు శక్తిహీనుడు సాధన చేయలేక పరమును కూడ కోల్పోవును. అట్టివాడు ఇహపరములందు చెడి ఉభయ భ్రష్టుత్వము చెందును. సీతాపహరణము జరిగిన తరువాత రాముడు దారుణముగా విలపించు చున్నాడు. ఆదిశేషుని అవతారము కావున లక్ష్మణుడు రామునితో "అన్నయ్యా! ముందు ఏడ్చుట మానుకొనుము. ఏడ్చినందు వలన సీత కనపడదు. మరియు ఏడుపు వలనన శక్తి నశించి, సీతను వెదుకుటకు కావలసిన శక్తి లేకపోవుట వలన సీత ఎన్నటికినీ లభించదు. యోగము అను శబ్ధము "యుజ్" అను ధాతువు నుండి వచ్చినది. "యుజ్" ఏకీకరణ అని అర్ధము. అనగా అన్నింటిని కలుపుట అని యోగ శబ్ధమునకు అర్ధము. ఒక నీటి గొట్టము ఉన్నది. దానికి చిల్లులు పడి నీరు ధారలుగా బయిటకు కారుపోవుచున్నవి. అట్లే మన శక్తి అనేక లౌకిక చింతల ఉద్రేకములలో వ్యర్ధముగా బయిటకు చిందిపోవు నీటిధారలను అన్నింటినీ కలిపి గొట్టములో ఒకధారగా ప్రవహింపచేయుట ఉపయోగము. కావున లౌకికములకు చిన్నాభిన్నము చెంది పోవుచున్న ఈ శక్తిధారలను కలిపి ఒకేధారగా చేయుట యోగము.

యుద్ధములో భేరులు మ్రోగుచూ, శంఖములు మ్రోగుచుండ, అందరనను ఎంతో ఉద్రేకముతో నుండగా శ్రీ కృష్ణుడు శాంతసముద్రునిగా మందహాముతో రధమును నడుపుచున్నాడు. ఆయన జీవితములో ఎప్పుడునూ ఉద్రేకము చెందలేదు. కావుననే ఆయనలో శక్తి అంతయు ఆశీభూతమై లీనమై యున్నది. ఆయన విశ్వరూపమును ప్రదర్శించినపుడు బయిటకు వచ్చిన వేల సూర్యుల కాంతి ఆశక్తియే. అయితే ఈ సృష్టిలో ఈ ఉద్రేకము అను దానిని ఏల సృష్టించినాడు? ఆయన సృష్టిలో ప్రతి వస్తువు మంగళకరమే! కావున ఉద్రేకము కూడా ఒక మంచి పనికే సృష్టించబడి యున్నది. ఆ మంచి పనని ఏమనగా భగవంతుని విషయములో ఉద్రేకము చెందవలయును అని భావము. భగవంతుని కొరకు తపించి ఉద్రేకము పొందుటయే తపస్సు. ఇట్లు భగవంతుని విషయములో సద్వినియోగము చేసినచో ఈ సృష్టిలో చెడు అనేది లేదు. చెడు గుణములు కూడ భగవంతుని వైపునకు త్రిప్పినచో అగ్గిలో పడిన పిచ్చిముళ్ళ కట్టెలు కూడ, నుదుట ధరించు పవిత్రభస్మముగా మారునట్లు, ఆ గుణములు పవిత్రమే అగుచున్నవి. గోపికలు తమలో ఉన్న కామము అను గుణము పరమాత్మ వైపుకు త్రిప్పినారు. ఆ కామమే మోక్షమార్గమై వారిని గోలోకమునకు చేర్చినది. భగవంతుని పరముచేయక భగవంతుని వ్యతిరేకముగా జీవుల పరము చేసినపుడు సర్గుణములు కూడా బురదలో పడిన పంచదార వలె వ్యర్ధము అగుచున్నవి. ఎవరి ఉప్పు తిన్నామో వారికి కృతజ్ఞతగా వుండుట సద్గుణము. భీష్ముడు ఈ సద్గుణమును కౌరవుల పరము చేసినాడు. కౌరవుల ఉప్పు తిన్నందున వారివైపు యుద్ధము చేయుట ధర్మమని, ఆ సద్గుణమును జీవుల పరము చేసి పరమాత్మపై బాణములను విసరినాడు. దాని ఫలమే అంపశయ్య పైబడి జీవన మరణమగు మరణ వేదన పడినాడు. ఈ లోకముననే ప్రత్యక్ష నరకమును అనుభవించినాడు. కావున భగవంతుని వియోగము దుఃఖములో ఉద్రేకము చెందినపుడు అచ్చట శక్తి ఖర్చు అగుట సార్ధకమే కాని వ్యర్ధము కాదు. రుక్మిణి కృష్ణుని కొరకు ఎంతో తపనపడి, పెండ్లి రోజు క్షణక్షణము ఉద్రేకమును చెందినది. అదియే మహా తపస్సుగా మారి, కృష్ణుడు ధర్మమును సైతము అతిక్రమించి రుక్మిణిని వివాహమాడెను. రుక్మిణిని శిశుపాలునికి ఇచ్చుటకు నిశ్చయ తాంబూలములు ఇచ్చుకొనుటయు జరిగినది. మను శ్రుతి యొక్క వాచాదత్త అను శ్లోకము ఆధారముగా నిశ్చయ తాంబూలము జరిగిన కన్యకు పెండ్లి అయినట్లే. బ్రాహ్మణుడు రుక్మిణి వ్రాసిన ప్రణయ పత్రము తెచ్చిన తరువాత, కృష్ణుడు కొంతసేపు తర్జన భర్జన పడినాడు. కానీ ఆమె క్షణ క్షణము పడిన ఉద్రేకము చూచి ధర్మమును సైతము అతిక్రమించి కుండిన నగరమునకు వెడలినాడు. కావున లోక చింతలలో ఉద్రేకము విడనాడవలెనే తప్ప, భగవంతుని విషయములో కాదు. పిల్లపెండ్లికి ధనము దాచమని చెప్పినామే తప్ప, పెండ్లినాడు కూడ ధనమును తీయని ఎడల ఆ ధనము దొంగల పాలో, రాజు పాలో అగును. కావున భగవంతుని విషయములో కూడ ఉద్రేకము పొందక శాంతిగా ఉన్నచో వాడు దాచిన శక్తి మృత్యువు పాలగును. మరణానంతరము శరీరము పంచభూతముల పాలగుచున్నది. వాని శరీరములో దాచబడిన శక్తి అంతయు అగ్నిపాలగును. కావున యోగము అనగా లోకమునకు సంబంధించిన ఉద్రేకములలో శక్తిని ఖర్చుకానీయక దాచి, భగవద్భక్తిలో ఖర్చు చేయుట అనగా శక్తి దుర్వినియోగము అరికట్టి సద్వినియోగము చేయుటయే యోగము.

ఎల్లో మీడియా ఏడుపు అనే జె గ్యాంగు

ఏ ఆరోపణలు వచ్చినా
ఎల్లో మీడియా ఏడుపు అనే జె గ్యాంగు
ఇప్పుడు తీస్తా అంటూ సిక్కిం లో తీస్తున్న పవరు గురించి
వ్రాసిన అస్సాం ట్రిబూన్ ఆన్ లైన్ ని కూడా
ఎల్లో మీడియా అంటుందేమో మరి.

8, నవంబర్ 2011, మంగళవారం

ధనం కోసం ధర్మ యుద్ధం చేస్తున్న ధర్మ ప్రభువులు

మా తాతల కాలం నుండి దొరలము
పన్నులు కట్టిన సంపన్నులము అని
సంకలు గుద్దుకుంటూ
చోర కళ తో సంపాదించిన
కరపత్రాలతో
రాష్ట్రంలో రాద్దాంతం చేస్తూ

కోటల్లోకి
వ్యాపార సామ్రాజ్యాల్లోకి
న్యాయ దేవత వడి వడి గా వస్తుంటే
ఆపడానికి

ఓ ప్రక్క ధర్మ యుద్ధం పేరుతో
బెదిరించ చూసి భంగపడి

మరో ప్రక్క అవినీతి ధనంతో
అత్యంత ఖరీదైన న్యాయ వాదులతో
సుప్రీం లో వాదించి
న్యాయ దేవత అడుగులను నిలువరించ చూస్తే

ఆ దేవత కూడా ‘దేవుడి’ బిడ్డను చిన్న చూపే చూసింది

ధనం కోసం ధర్మ యుద్ధం చేస్తున్న
ధర్మ ప్రభువులు

తమను ఎన్నుకొన్న ప్రజలు
తమ రాజకీయ జీవితాలకు
పాతరలు వేయక ముందే
మేల్కోండి

ప్రాణం అంటే పూచిక పుల్లలా తీసేస్తూ
అవినీతి పై ప్రభువులను
పరుగులు పెట్టిస్తున్న
పండుటాకులను చూసైనా
ప్రజల సొమ్ము కాపాడ
కలసి రండి

ధర్మ యుద్ధమని చేస్తున్న
ధన యుద్ధంలో
గెలుపు దక్కదని తెలుసుకోండి.

ఎలా పోయినా ఆర్థికంగా ఆదుకొంటారు.

అయితే నిత్య ఓదార్పు సభ్యులకు
నిమిషాల్లో సమాచారాన్ని చేరవేయండి.

మీ వాళ్ళు వాళ్ళపై జరుగుతున్న దాడులకు
గుండె పగిలి పోయారని
వాళ్ళు మీడియా కవరేజి ఇచ్చి
ఏదో ఓ రోజు మళ్ళీ
మందీ మార్బలంతో మీవాళ్ళ ఇంటికి వచ్చి
ఓదార్చి పోతారు.

ఎలా పోయినా
పోయిన దేవుడి భక్తులని
ఆర్థికంగా ఆదుకొంటారు.

సత్యం రాజు లా నిజాయితీ చూపారు......................

దొరికే వరకు దొంగ కూడా దొరే
చిక్కాక
చికాకు ప్రశ్నలకు
పట్టుబడుతారు

ఇవన్నీ జరగక ముందే
అనుమానపు చూపులు నిలిచినపుడు
ఎవరూ నేను దోషి అని
సత్యం రాజు లా నిజాయితీ చూపారు

ప్రతి వాడు ఇంకోడు జాతీ గా లేదు
అని జారుకోవాలనే చూస్తారు
తను జాతీ గా లేను అని
జన్మలో ఒప్పుకోరు
ప్రశ్నల జడివానతో జడిపిస్తే తప్ప

దొర దొంగయ్యే సమయం దరిదాపుల్లోకి వచ్చింది
అందుకే దడ మొదలయ్యింది
రాజకీయాలు విరక్తిగా కనిపిస్తోంది
ఒప్పుకోవడంలో నిజాయితీ చూపిస్తే
కనీస సానుభూతి దొరుకుతుంది

ఎవడూ జాతీగా లేదు
నన్ను మాత్రం జప్తెందుకు చేస్తారు అని
ఎదురు ప్రశ్నలతో జవాబును సానుభూతి రూపంలో
పొందాలని చూస్తే
చూసే వాళ్లకు చులకనవ్వడం తప్ప
చస్తే సానుభూతి దక్కదు.

7, నవంబర్ 2011, సోమవారం

ఒకరకంగా నక్సలైట్లే మేలు.............

వేరు పడితే మళ్ళీ
నక్సలిజం పెరుగుతుంది అని
కలిసి వుండాలని కోరుకునే వాళ్ళు చేసే
ఆరోపణలలో నిజం లేదని
మొత్తుకొంటున్న
వేర్పాటు వాదులూ….

వేరుపడకనే
ప్రజాస్వామ్య బద్దంగా ఉద్యమం
నడపడం చేతగాక
రైల్వే ట్రాకుల క్లిప్పులు తొలగించడం
బస్సుల పై దాడులు
లాంటి చర్యలను ఏమంటారు?

ఒకరకంగా నక్సలైట్లే మేలు
బలవంతంగా బడులు మూయించడం
విద్యుత్తు కొరతతో పంటలు ఎండబెట్టడం
లాంటి చర్యలకు పాల్పడేవారు కారు.

బక్క గాడిద ఎక్కడ బావురు మంటుందో ..............

గాడిదలకు గడ్డి పెట్టి
పశువుల దగ్గర పాలు పితికే
అమాయకులు కాబట్టే

అమాత్య పదవి దొరకనంత వరకు
ఓండ్ర పెట్టకుండా
దక్కదని తెలిసిన క్షణం నుంచి
ఓండ్ర మొదలెట్టిన
గాడిద నాయకత్వంలో
విడిపోతామని పగటి కలలు కంటూ
పనులు ఎగ్గొట్టమంటే
ఎగ్గొట్టి గాడిద వెనుక వెళుతున్నారు

మొరాయించే గాడిదలకు
మోయించే చాకలి దొరికితే
ఓండ్ర పెట్టినా వదలకుండా
కొట్టుకొంటూ రేవు దగ్గరకి తోలుతాడు

ఇప్పటి పరిస్థితులలో
ఆ చాకలి పదవి
తీసుకొనే సాహసం ఎవరూ చేయరు
కలిసి ఉండాలనే వారి సహనం
నశించిన రోజు
అందరూ తలో చెయ్యి వేస్తారు
బక్క గాడిద ఎక్కడ బావురు మంటుందో అనే
సంకోచమే ఇప్పుడు ఆ గాడిదకు రక్ష.

మన రాష్ట్రం లో దేవుడని చెప్పుకొని ..........

రామదాసులా చంద్రబాబు
ఎవడబ్బ సొమ్ముతో
పట్టణాలలో ప్యాలస్ లు
లోటస్ ప్యాండ్ లు
అని ప్రశ్నిస్తున్నారు?

రాముడి భక్తుడు రామదాసు
కృష్ణ దేవరాయలు లాంటి వాళ్ళు
అనంత పద్మనాభ స్వామీ కి
కేరళ రాజులు
సత్య సాయి బాబా కు
వారి వారి భక్తులు

తమ దేవుళ్ళకు
గుళ్ళూ గోపురాలు
నగా నట్రా వజ్ర వైడూర్యాలు లాంటి
అనంత సంపదను
ఆయా దేవుళ్ళు
అడగ కుండా
భక్తులు ఇచ్చారు

మన రాష్ట్రం లో
దేవుడని చెప్పుకొని
కొడుకు ప్రచార మాధ్యమాలతో
వాన రాక పోక లతో సహా
దేవుడే అని నిరూపిస్తూ
చెవినిల్లు కట్టుకొని చెప్పినా

ఒక్క భక్తుడైనా
గుడి గోపురం
అడగకుండా అనంత పద్మనాభ స్వామికి ఇచ్చినట్టు
సంపదలు సమర్పించారా

అందుకే కలియుగ దైవం
కన్నుమూయక ముందే
కన్న కొడిక్కి
తనకు ఇష్టం వచ్చినట్లు
కావాల్సినంత కానుకలు
ఇచ్చి వెళ్ళాడు

కానుకల స్వీకారం మొదలెట్టి
పోగేసే సమయం నుండి
పోయే దాక
పోయినాక కూడా
చంద్రబాబుది ఒకటే పోరు
ఈయనది ఏదో పోయినట్టు

కడుపు మంట కాక పోతే
రామదాసులా చంద్రబాబు
ఎవడబ్బ సొమ్మని అడగడం
ఎబ్బెట్టుగా లేదూ.

మతం వారిగా మడతపేచీలు పెట్టి ప్రాంతాల వారిగా పాడెలు కట్టి శవాల మీద ఓట్ల చిల్లర వేరుకొంటాము.

తెలుగు తల్లి ఒడిలో
బురద పద్మాన్ని
పెట్టనివ్వని
తెలుగోడు
మొట్ట మొదట
అదే పద్మాన్ని
హస్తిన కుర్చీ ఎక్కించి
ఏమి కావాలన్నది
ఇక్కడ నుండే
శాసించి మరీ రాబట్టుకొన్నాడు

అటువంటి ఆంద్ర ప్రదేశ్ లో
ఎన్నేళ్ళు పడిగాపులు గాసినా
పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి
అక్కడే ఉన్నట్టు వుంది

అందుకే ఆంగ్లేయులకు మల్లే
ఆంధ్రులను విడదీసి
సందులో దూరి సడేమియా అంటాము
తరువాత పాగా వేసి పాలిస్తాము

అలనాడు ఆంగ్లే యులను
ఆదరించిన దేశ ద్రోహులకు మల్లే
ఆంధ్రా లో ఉన్న అంధులు కొందరు
దగ్గరికి రానిస్తున్నారు

హస్తిన కుర్చీ ఎక్కిన క్షణం
చీల్చడానికి వెరవం
మీరు ఛీ కొట్టినా సరే

మతం వారిగా మడతపేచీలు పెట్టి
ప్రాంతాల వారిగా పాడెలు కట్టి
శవాల మీద ఓట్ల చిల్లర వేరుకొంటాము.

అన్నను చూసి తనే దేవుడని డప్పేసుకొన్నాయనను

గజన్ పై ఆరోపణల గురించి
గంటల కొద్దీ సోదించి
రక్షించినానన్న కిరణ్
కుర్చీ ఎక్కినప్పటి నుండి
ఎవరూ పట్టించుకోవడం లేదు
దించేస్తామనే గజన్ తప్ప.

సభాద్యక్షుడుగా
పాలకుల పాపాలను
కడగనీకుండా
కష్టపడ్డ వ్యక్తి
కొత్తగా మనకు
ఏమి ఒరగబెడుతాడులే అని
నిరూపితమైన నిజం చవిచూసిన
జనం ఒకింత నిరుత్సాహం చూపారు.

పాడెక్కిన పావలాను మరిచిన జనాలకు
పావలా వడ్డీకి కోట్ల కేటాయింపు అన్నాడు
చీమ కుట్టినట్టు కూడా లేదు

లక్షల కొలువులన్నాడు
కొంపదీసి ఇచ్చేస్తాడా ఏమిటి అని
వ్యంగంగా అన్నోడు కూడా
ఆంధ్రా లో కనిపించలేదు

ఆరు నెలలకో పధకం అన్నాడు
ఆరు నెలలైనా కుర్చీలో
ప్రశాంతంగా కూర్చోలేని వాడనుకొని
ప్రజలు పట్టించుకోలేదు

అన్నను చూసి
తనే దేవుడని కొడికి చేత
డప్పేసుకొన్నాయనను
అధిగమించేద్దామని
ఏకంగా
పాడెక్కిన పావలా
అర ప్రాణంతో ఉన్న అర్ధ రూపాయి ని విడిచి
కొనడానికి చెల్లుబాటు కాక
కోమాలో ఉన్న రూపాయికి
కిలో బియ్యం ఇస్తామని
తన ఓట్ల బొచ్చతో
తన బుద్ది చూపాడు.

4, నవంబర్ 2011, శుక్రవారం

చరిత్రను పునరావృత్తం చేయవచ్చు

చైతన్యం వస్తోంది
చదువు సంధ్యలు ఎక్కువ అయ్యాయి
కలిసి ఉంటే కష్టం
మిగిలిన ప్రదేశాల్లో లా
మన దగ్గర ఎందుకు అభివృద్ధి జరగలేదని
నిలదీస్తారు

విడదీస్తే
మళ్ళీ మనమే బాంచన్ దొర అని చెప్పించుకొంటూ క్రింది చరిత్రను పునరావృత్తం చేయవచ్చు.

“చెరువుల్లో నీరు మొదట భూస్వాముల పొలాలు సాగు అయిన తరువాతనే ఇతర రైతులు తీసుకోవాలి. వ్యవసాయ కూలీలు మొదట భూ స్వాముల నాట్లు వేసిన తరువాతే ఇతరులవి వేయాలి. విసునూరు దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి గడీ ముందు చాకలి వారు నిత్యం నూరు బిందెల సానిపి చల్లాలి. వారి దున్నపోతులకు క్షురకులు క్షవరాలు చేయాలి. కచ్చడాల ముందు ఉరకాలి. మూటలు మోయాలి. పక్కలు వేయాలి. పచ్చి బాలింతలను కూడా పాలు పిండి చూపితే తప్ప పనుల నుండి వదిలేవారు కాదు. గ్రామాలకు ప్రభుత్వ ఉద్యోగులు, జాగీరు ఉద్యోగులు వచ్చినప్పుడు ఆ గ్రామంలోని చిల్లర దుకాణదారులు అధికారులకు కావలిసిన సన్న బియ్యం, మాలు, మసాలా, నెయ్యి, నూనె, పప్పు, చింతపండు, బీడీలు, సిగరెట్లు, సబ్బులు తదితర వస్తు సామాగ్రినంతా ఉచితంగా సరఫరా చేయాలి. గొర్రెలు, మేకలు, కల్లు, కోళ్ళు, పందులు, చేతివృత్తుల ఉత్పత్తులతో సహా బలవంతంగా అధికారులు గుంజుకునేవాళ్ళు. ఈ విధంగా జనాన్ని బానిసల కన్నా హీనంగా చూసేవారు. ఈ బాధలు భరించలేక ఎవరైనా ఎదిరించినా, నిలదీసినా సహించేవారు కాదు. వారిని నిర్బంధించి క్రూరంగా హింసించేవారు. హత్య చేసి తమ గడీలలోనే పాతిపెట్టేసేవారు”.

చచ్చే వరకు ఎదురు చూస్తున్నా కొడుకు

చచ్చే వరకు
సంపాదనపై చర్చ పెట్టక
ఎదుటోళ్ళ పై రచ్చ చేస్తూ
కొడుక్కోసం మడమ తిప్పలేదు
నాన్న

ప్రతిపక్షానికి ప్రతిపక్షమై
నాన్న కోసం బొంతపడిన వారంటూ
అంతులేని ఓదార్పు
మడమ తిప్పకుండా చేస్తూ
‘చెయ్యి’ ఎప్పుడు కలుగులోకి తోసి
బొచ్చ చేతికి ఇస్తుందో నని
ఎదురు చూస్తున్నాడు
కొడుకు

ఈ రోజు దొడ్డి దారిలో సాక్షిగా ఎందుకు పోవాల్సి వచ్చింది?

నాన్న జమానాలో
వాయు వేగంతో వ్యాపారవేత్త అయిపోయి
నాన్న పోతూనే
అదే వేగంతో పాలక పగ్గాలు కావాలని
వేసిన పాచికలు పారక
తిరగబడితే

పరిస్థితులు ఎదురు తిరగబడి
వాయు వేగపు సంపాదనలో
ముద్దాయిగా ఆరోపణలు ముసురుకొని
దానిపై విచారణ ఒకింత నెమ్మదిగా పోతోంది

ఇంకో ఘనుల గాలి వాటపు సంపాదనలోని
వాటా లు
ఈ వాయు వేగపు సంపాదనకు
తోడయ్యాయేమో
అనే అనుమానంతో పిలిపిస్తే
లేదు నన్ను పిలిచింది సాక్షిగా నే
అని సంబరపడిపోవడం చూస్తుంటే
చిన్నపిల్లాడి మనస్తత్వం గోచరిస్తోంది

అక్కడ అడిగిన ప్రశ్నలు ఏవో చెప్పక
నాన్న ఇచ్చిన సహకారంతో
రెచ్చిపోయి మరో కేసు విషయమై బోనులో ఉన్న
కోనేరు కు మొదటి స్నేహితుడు
బాబే ఆయననూ పిలవండి పేరంటానికి అని
పెంకి దాడులు మొదలెట్టడం విచిత్రమే

ఒక వేళ బాబు తన జమానాలో పిలిచినా
తరువాత ప్రభువుగా ఉన్న నాన్న
నానా గడ్డి కరుస్తున్న కోనేరు ను ఆపక
ఆయన వేసిన గడ్డిని తిన్నాడా?
అనే విషయం పై సాక్షికి నోరు పెగలదు ఎందుకో?
ఎదుటోడికి నైతిక విలువలు చెప్పే ముందు
తను ఏ తానులో ఉన్నాడో రుజువు చేసుకోవాలి కదా?

మాట్టాడితే మడమ తిప్పను అని
మతిలేని మాటలు చెబుతారు
ఈ రోజు దొడ్డి దారిలో
సాక్షిగా ఎందుకు పోవాల్సి వచ్చింది?

3, నవంబర్ 2011, గురువారం

కాంగ్రెసు నిరీక్షణలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి

కాంగ్రెసు పార్టీలో చేరిన తర్వాత ఏం చేయాలో తెలియక చిరంజీవి దిగి వస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తిరుపతిలో ఆయన బుధవారం మాట్లాడిన మాటలు ఆ అనుమానాలకు తావిస్తున్నాయి. తనకు ఎప్పుడు పదవి ఇస్తారో, ఎంత వరకు తాను వేచి ఉండాలో తెలియక చిరంజీవి సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. తనకు కేంద్రంలో గానీ రాష్ట్రంలో గానీ మంత్రి పదవి ఇస్తే చాలునని, పదవి ఏదైనా ఉంటే సేవ చేయడానికి ఓ ఆదరవు దొరుకుతుందని ఆయన అన్నారు. దీన్ని బట్టి తనను ఇలా నిరీక్షణలో పెట్టకుండా ఏదైనా పదవి ఇవ్వాలనే విజ్ఞప్తి ఆ ప్రకటనలో ఉందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిని ఆశించి రాజకీయాల్లోకి దిగి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి కాంగ్రెసులో చేరిన తర్వాత రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చినా సంతృప్తి పడే స్థితికి వచ్చారని అంటున్నారు.

కాగా, అనూహ్యంగా పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను కాంగ్రెసు అధిష్టానం తెర మీదికి తేవడంతో చిరంజీవిలో ఆందోళన ప్రారంభమైనట్లు చెబుతున్నారు. తనకు దక్కాల్సిన హోదా, పదవి శ్రీనివాస్ ఎగరేసుకు పోతారని చిరంజీవి ఆందోళనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. దీంతో తనకు ఏ పదవి ఇచ్చిన ప్రస్తుతానికి సంతృప్తి చెందాలనే స్థితికి వచ్చినట్లు చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు తీవ్రమైన అనిశ్చితికి చేరుకోవడంతో కూడా చిరంజీవికి బాధ్యతలు అప్పగించే విషయంలో అధిష్టానం జాప్యం చేస్తోందనే మాట వినిపిస్తోంది.

అగ్ర సింహాసనం వేసేది.

తెరమీద మీసం మెలిపెట్టేసి
నిజ జీవితం లో
మీడియా తో లౌక్యంగా మాట్టాడ్డం
పౌరుషం కాదు
తెలుగు వాడిని కించ పరిచి మాట్టాడితే
పళ్ళు రాల గొడతాననడం
పౌరషం అంటే
అందుకే తానా లాంటి సంఘాలు
ఈ తెలుగు సింహానికి
ఆహ్వానితుల జాబితాలో
అగ్ర సింహాసనం వేసేది.

2, నవంబర్ 2011, బుధవారం

అన్నదాతల గుండెకోత ఎవరికి తెలుసు ????

ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకృత విధానాల ప్రభావాన్ని మన రైతు చవిచూస్తున్నాడు. వీటివల్ల దేశంలో సంపద అనూహ్యంగా పెరిగింది. ఉత్పత్తులు కూడా పెరిగాయి. వాటికి మార్కెటింగ్‌ సౌలభ్యం వృద్ధిచెందింది. అదే సమయంలో ఈ దేశంలో రైతు మాత్రం నీరుగారిపోయాడు. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతాంగం అప్పులపాలైంది. వ్యవసాయం నష్టదాయకంగా మారింది. అప్పులు తీర్చలేక ఆర్థిక ఇబ్బందులకు గురైన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనంతటికీ కారణం ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల ఆదేశాలే. వీటిమేరకు భారత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సబ్సిడీల్ని తగ్గించింది. అంచెలంచెలుగా మొత్తం తొలగిస్తోంది

ఒక్క మాటలో చెప్పగలనా !!!!!

విల్లు పట్టి నిలుచున్నది
అన్నా
లేక
రాముడు గా మారిన బాల కృష్ణుడా
అని అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే

నందమూరి నుండి
మరొకరు రాముడు గా
వచ్చి
విల్లు పట్టిన విధం చూసి
నిలువెల్లా పులకరిస్తూ

ఆ రౌద్రం చూసి
రోమాంచిత ఉద్వేగం కలగగా

అన్నగారి తరం లో
తెలుగు వాడిగా పుట్టినందుకు
మరో సారి వారి వారసుల తరంలో
రాముడిని చూసి తరిస్తున్నందుకు
నా జన్మే అదృష్టం
అని ఒక్క మాటలో చెప్పగలను

అరకొర జ్ఞానంతో

అరకొర జ్ఞానంతో
తెలుగు గడ్డపై
దర్శకుల కొదవ అన్న వారు
అప్పుడప్పుడూ తాము
మద్రాసులో ఉండగా
అబ్భిన అరవ పాండిత్యాన్ని కూడా
పదే పదే చెప్పుకొనే వారు
తాము పుట్టక ముందు
అదే అరవ మద్రాసులో
తెలుగు శంకరాభరణం
సంవత్సరం పైగా ఆడింది అని తెలుసుకోవాలి
ప్రేమాభిషేకం కూడా
సంవత్సరం పైగా ఆడింది అని తెలుసుకోవాలి
వాటి దర్శకులు కూడా
మన తెలుగు వారే అని గర్వపడండి
జాతి ని తక్కువ చేసి మాట్టాడే ముందు
ముందూ వెనుకా చూసుకొని మాట్టాడండి

స్వాతి ముత్యం అనుకొని ఇన్నాల్లో మురిసిన వారు

ఇడుపలేసుని పైన
ఈగ వాలినా
వారసుల గురించి
వివాదస్పద వాక్యాలు
ఎక్కడ వినిపించినా
ఇడుపలేసుని ఇచ్చ బంటులా
తక్షణం అక్కడ వాలి
అలా మాట్టాడే వారిని
బంతాడుతుంటే
ఇడుపలేసుని భక్తుల ఆనందం
అంబరాన్ని అంటేది.

ఇడుపలేసుని బంటుగా
భరితెగించి ప్రజల ఆస్తులు
స్వామికి సమర్పిస్తున్నా
ఎదురు దాడితో
అదే బంటుతో
దడ దడ లాడించే వారు.

ఓ ప్రక్క ఇడుపలేసుని వారసుడు
అక్కా చెల్లీ తల్లీ అంటూ
చెంతకు వచ్చిన వారి
చెక్కిళ్ళు నిమిరి
ఓదార్చుతుంటే
ఇక్కడ బంటు
“చెప్పు సంజనా టెల్ మీ ” అంటూ
ఆడవారి వారి పైన చూపిన
గౌరవ మర్యాదల
గుట్టు రట్టు అయిన వేళ
ఇడుపలేసుని భక్తుల గొంతులో
పచ్చి వెలక్కాయ పడింది.

బంటు గారి బరితెగింపు
హాస్కీ వాయిస్ తో
అలరిస్తుంటే అవాక్కాయి
ఎలా ఎదురు దాడి చేస్తారా అనే
ఆసక్తి అందరిలోనూ ప్రభలుతోంది.

ఇడుపలేసుని వారసుని
స్వాతి ముత్యం అనుకొని
ఇన్నాల్లో మురిసిన వారు
ఆ ముత్యం పై ముసురుకొంటున్న
ఆస్తుల కేసులతో
అసలు రంగు ఇప్పుడిప్పుడే అవగతం చేసుకొంటుంటే
ఇన్నాళ్ళూ ఆణిముత్యం లాంటి వాడనుకొన్న
బంటు లీలలు బయటపడడం
తప్పక మరింత బాధిస్తాయి.

ప్రక్కనోడిని ఎప్పుడు తినేద్దామా అని ఎదురు చూసే సముద్ర నాయకులకు అర్థం అవుతుందంటారా?

చేతిలో సెయ్యిట్టిన సన్నివేష సంబడాన్ని
అంబరాన్ని అంటేలా చేద్దామనుకొంటే
సముద్రం లోని నాయక తిమింగలాలు తీరనివ్వలేదు
సరే సర్దుకు పోదాం అని
దిగమింగుకొని సర్దుకు పోతున్నా
కరేపాకుకు ఇచ్చిన విలువ కూడా ఇవ్వకుండా
ఆటలో అరటిపండు అనే మాటలకు తెరదించకుండా
ఇంకో సినిమాకు కథలు వింటూ భారంగా కాలం వెళ్లదీసే వేళ
అవిశ్వాస తీర్మానం అనే పదం
‘ఆటలో అరటిపండు’లో ఆశను రేపింది

అరటిపండు అవసరం వచ్చే రోజు
ఆసన్నమయ్యింది అని గుర్తుకు తెచ్చేలా
సముద్రం లోని తిమింగల నాయకులకు
ఓ విందు పెట్టి గుర్తు పెట్టుకోమనింది

ప్రక్కనోడిని ఎప్పుడు తినేద్దామా అని
ఎదురు చూసే సముద్ర నాయకులకు
ఈ అరటి పండు పడే ఆరాటం
అర్థం అవుతుందంటారా?
లేదా ఇదీ ఒక ‘ఆటలో అరటిపండు’ ఆర్భాటమే అని
అపార్థం చేసుకొంటారా?

ప్రచార కర్త వారసులు (రక్త & రాజకీయ వారసులు)

వ్యవసాయం దండగని అని
అన్నావో లేదో తెలియదు కాని
తేల్చమని నువ్వు చెప్పినా
ఎవరూ రాకున్నా

ప్రచార కర్త వారసులు (రక్త & రాజకీయ వారసులు)
మాత్రం నిన్ను వదలడం లేదు
వారి పెద్ద వ్యవసాయానికి చేసిన పండగ గురించి
నోరు పెగల్చడం లేదు

అయినా వ్యవసాయం పండగో దండగో
అది ప్రక్కన బెడితే
మీ వృత్తి
అదే రాజకీయాలు
భ్రస్టుపట్టి పోతూ
దండగ అయిపోయే సమయం
ఆసన్నమయ్యిందని
వేర్పాటు వాదులు
ఓదార్పు వీరులు
ఒకింత ముందుగానే గ్రహించినట్టు ఉంది

అందుకే రాజకీయాలు పండగ చెయ్యాలని
ప్రబుత్వాన్ని పడగొట్టండి
అవిశ్వాసం పెట్టండి అని
ఆత్రం గా అడుగుతున్నారు

ఆలకించండి మరి
ప్రభుత్వం పడినా పడక పోయినా
పాలకుల బేరసారాలతో
రాజకీయాలు పండగ చెయ్యాలని
ఉవ్వీళ్ళూరే వీరి
బేరసారాలకు
బేషజాలకు పోకుండా
బేరాలు చేసుకోనివ్వండి.

గో ధూళిని లేపే వారు లేరు

వృద్దుల చే సుద్దులు చెప్పించుకోవాల్సిన
భావి తరం ఎండమావుల వెంట వెళ్ళిపోగా
పండిన వృద్దులే ఇప్పుడు దాని సంతోషం

గో ధూళిని లేపే వారు లేరు
పాలిచ్చే ఆవులను మాత్రం ఆశగా చూసుకొనే వారు మాత్రం
అక్కడక్కడా అగుపిస్తుంటే

కూలీలు దొరక్క
కరెంటు తో దాగుడు మూతలు ఆడలేక
గిట్టు బాటు గాక
ప్రతిసారి అదృష్టం పరీక్షించుకోలేక
సరైన పోషకాహారం దొరక్క
నీరసపడి
బీడుల చూస్తూ

అందులో పూర్వం పండించిన బంగారాన్ని తలచుకొని
నెమరేసుకొంటూ
ఇవి ఇలాగే ఉంటే
భావి తరాలు ఏమి తిని బతుకుతారో
అని బాధ పడుతూ

ఆశలు రేపిన
జల యజ్ఞం
జనాల స్వేదం
ధనంగా
పాలకుల పంటలు పండిస్తుంటే
పల్లె లో మొలకెత్తే ఆశలు కూడా
అక్కడే అడుగంటి పోతున్నాయి.

కాకి పిల్ల కాకికి ముద్దు

అవినీతో
అధికార దుర్వినియోగామో
నాన్న అన్నీ ఇచ్చి వెళ్ళాడు
కూర్చునే కుర్చీ తప్ప

ఆ కుర్చీ వుంటే తప్ప
వెనకేసిన కుప్పను కప్పలేము

దానికి దిష్టిబొమ్మ లా కుర్చీ కావాల్సిందే
నలుగురి దిష్టి పడితే కుప్ప వెనకాల ఉన్న
అవినీతి కృషి బయటపడుతుంది

ఇప్పుడు అదే జరిగింది
కుర్చీ లేని సమయం చూసి
ఆ అవినీతి కుప్ప రగులుకుంది
చూస్తుంటే ఆ కుప్ప బొచ్చె ఇచ్చి కారాగారంలో గాలితో కూడా కూర్చోపెట్టేట్టు వుంది

అందుకే అమ్మా
గుడ్డు మీద నాన్న పీకలేని ఈకలు
నీ బాబు కోసం
బాబు జుట్టు మళ్ళీ పట్టుకో

జుట్టు రాకపోయినా పరవాలేదు పాత జట్టు నాయకురాలిని ప్రాధేయపడి
మన పట్టు గురించి పసందుగా చెప్పి
జైలులో మంచి భోజనాలు పెట్టించమని చెప్పొచ్చు
అలాగే బరితెగించిన మన బంటు నిర్వాకం బూడిద అవుతుంది

కాకి పిల్ల కాకికి ముద్దు అనే సామెత ఒకటి మరో సారి సమైక్యాంధ్రకు సాటి
ఎట్టన్నా నాన్న మంత్రదండంతో మదించి వచ్చిన
అవినీతి సాక్షులతో సహా అన్నీ
పదికాలాల పాటు
పదిలంగా వుండేలా చూడమ్మా
అత్యవసరంగా ఆ అవినీతి కుప్పను ఆర్పమ్మా.

ఆ సంపాదన సాక్షిగా చెరపట్టే దుశ్శాసనులు

ప్రకృతికి చెందిన పంచభూతాలను వంచనతో ద్రుతరాస్ట్రుడికి మల్లే దురాశపడిన కొడిక్కి దోచి ఇచ్చిన దొర పై ఓపిక నశించిన ప్రకృతే పగబట్టి విజయం సాధిస్తే ఇంకా ఆ సంపాదన సాక్షిగా చెరపట్టే దుశ్శాసనులు వీక్షకుల ముందు వచ్చి విశ్లేషణలు గావిస్తుంటే శకుని శత్రు శిబిరం నుండి సంకేతాలు పంపుతుంటే సమరంలో నిలిచిన కొడికి పక్షాన ప్రజల కళ్లకు గంతలు గడుతూ స్వయంగా తల్లే తలపడుతోంది పంచభూతాల పగకు పతి ప్రాణాలు పణంగా పెట్టినా పసి వాడి పాడు బుద్ధికి సుద్దులు చెప్పడం మరిచి మళ్ళీ తలపడడం మనందరికీ ఆశ్చర్యం కలిగించి నాది అక్షర సత్యం మహా భారతం మళ్ళీ నడుస్తోంది

ఆ పిల్లోడోల అమ్మ ఊరుకోదు

ఆ పిల్లోడిని చూడు
వాడికి ఏం కావాలన్నా ఇవ్వడానికి
వాళ్ళ అమ్మ దగ్గర అన్నీ వున్నాయి
అయినా వాడు నీలా
యాగీ చెయ్యడు చూసి నేర్చుకో
వాళ్ళ అమ్మ మన తాతకు ఇచ్చిన
కుర్చీనే కావాలని
ఏడుస్తావెందుకు
మాటి మాటికీ
వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి
మన తాత కుర్చీలో కూర్చుంటానని
మారాం చేస్తున్నావంట
నీకు బుద్ది రావాలనే
ఆ పిల్లోడిని వాళ్ళ అమ్మ
మన ఇంటికో సారి పంపి
నన్ను ఎక్కువ మర్యాద చెయ్యకండి
నేను మా ఇంట్లో గెడ్డం తాత కూర్చొనే కుర్చీ అడగడం లేదు
అని సెప్పి పంపింది వాడు అలాగే సేత్తున్నాడు
ఇంకైనా కొంచెం ఇజ్జత్ తెచ్చుకో
భాగ్యనగర పండక్కు
నువ్వేమీ ఎగేసుకొని ఎల్లకున్నా
ఎదురుచూసే వాళ్ళు లేరు
వెళ్లాలనుకొంటే వెళ్లి ఏడువు
నువ్వు అడిగే కుర్చీలో నుండి తాత లేవలేదని
తాతను ఎవన్నా అన్నావో
ఆ పిల్లోడోల అమ్మ ఊరుకోదు
నీకు నీ డోలుకు వీపు విమానం మోతే
దాంతో పాటు నిన్ను పాలేరు చేసి
సిన్మాల్లో నటించే ఆ మొద్దబ్బాయిని
దత్తత చేసుకోమంటోంది, జాగ్రత్త.