10, మార్చి 2011, గురువారం

హమయ్య మా నాన్న ఇల్లు నాకు వచ్చింది

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి కి మంగళవారం హైకోర్టులో చుక్కెదురైంది. ప్రస్తుతం ఆమె నివాసం ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి వెంటనే ఎన్టీఆర్ చిన్న కూతురుకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. రెండు నెలల్లో ఇంటిని ఖాళీ చేయాలని చెప్పింది. లక్ష్మీపార్వతి నివాసం ఉంటున్న ఇంటిని ఆయన చిన్న కుమార్తె అయిన ఉమా మహేశ్వరికి రాసిచ్చారని ఖాళీ చేయాలని చెప్పింది. లక్ష్మీపార్వతి ఉంటున్న బంజారాహిల్స్‌లోని రోడ్డు నెం.13లో ఉంటుంది. న్యాయమూర్తులు జస్టిస్ బి. ప్రకాశరావు, జస్టిస్ రెడ్డి కాంతారావులతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది.ప్రస్తుతం లక్ష్మీపార్వతి ఉంటున్న ఇంటిపై హక్కులు తమకే ఉన్నాయని ఉమా మహేశ్వరి నుంచి జీపీఏ పొందిన ఎన్.రామకృష్ణ పన్నెండేళ్ల క్రితం సిటీ సివిల్ కోర్టులో దావా వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సిటీ సివిల్ కోర్టు 2005 ఉమా మహేశ్వరికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అయితే దీనిపై లక్ష్మీపార్వతి హైకోర్టును వెళ్లగా సిటీ సివిల్ కోర్టు ఆదేశాలపై గతంలో స్టే ఇచ్చింది. ఈ స్టే ఎత్తి వేయాలని, ఇంటికి హక్కుదారులను నిర్ణయించాలని రామకృష్ణ అఫిడవిట్ వేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ లక్ష్మీపార్వతి ఉంటున్న ఇంటిపై హక్కులు ఉమామహేశ్వరికే చెందుతాయని స్పష్టం చేసింది.