21, జనవరి 2011, శుక్రవారం

ఇన్నాళ్ళకు భిన్నత్వంలో ఏకత్వం

ఉల్లి పాయలు అత్యవసర వస్తువు
పెట్రోలు సౌఖర్యార్ధం వాడే వస్తువు
బీరు విలాస వస్తువు
మూడు విభిన్న వస్తువుల ఏకత్వం ఎక్కడ ఉందంటే
దాని ధరల్లో ………..
ఏదైనా మన దేశంలో 65 రూపాయలే.

భిన్నత్వంలో ఏకత్వం కోసం
రాజకీయ నాయకుల కృషి ఫలించిన వేళ
జాతి యావత్తు పండుగ చేసుకొనే వేళ

ఇదే నిజమైతే ఇక ఎడతెగని ఓదార్పే

ఆశించి భంగపడితే
భరించలేను అని బాధపడడం కన్నా
పక్కింటోడికి కూడా
కరెంటు పోతే కలిగే ఆనందంలా
మనకన్నా ఓ మెట్టు కింద ఉన్న వారితో పోల్చుకొని
స్వాంతన పొందుతుంటాం

అలా జనం డబ్బు
రాజ మార్గంలో కొట్టేసే
వారసత్వపు కుర్చీ దూరమయితే
ఆ బాధకు అంతుండదు
అది అనుభవించే వారికే తెలుస్తుంది

అందుకే స్వాంతనకోసం సచ్చినింట
మళ్ళీ కన్నీళ్లు తెప్పించి
సచ్చినోళ్ళు మన అయ్యలా సంపాదించి ఇవ్వక
పోయారు అని దగ్గరనుండి పోల్చుకొని
స్వాంతన పొందడానికే
మళ్ళీ మళ్ళీ ఓదార్పు చెయ్యాలనిపిస్తోందేమో
ఇదే నిజమైతే ఇక ఎడతెగని ఓదార్పే.

అణుమోహన్ జీ గురువును గుర్తుకు తెచ్చుకో

పంతం పట్టి నెగ్గించుకొన్న పని
అణు బిల్లు తప్ప
తతిమా విషయాలలో
దేశం యావత్తూ
నీ వ్యక్తిత్వాన్నే శంకించే
పరిస్థితుల్లోకి నెట్టబడుతోంటే కూడా
ఆ పదవి పట్టుకొని
125 ఏళ్ల కాంగ్రెస్స్ ను కాపాడుతున్నావు
ఎందుకు?
నీ గురుగు నరసింహుని పేరును
ఏ మురికి వచ్చినా వదిలించుకోడానికి వాడుతూ
ప్రపంచీకరణ ఫలాల గురించి చెప్పేప్పుడు ప్రక్కన బెడుతున్నారు
అది తెలిసి కూడా
ఏమన్నా ఎందుకోసం పడుతున్నావు
ఎన్నాళ్ళు పడతావు?
నువ్వు ఏమి చేసినా
అధినేత్రి భట్రాజులు ఆమె కొడుకు భజన చేస్తుంటే కూడా
ఎందుకు సహిస్తున్నావు?

మహా ప్రస్థానం- శ్రీ శ్రీ

మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం పైపైకి!

కదం త్రొక్కుతూ,
పదం పాడుతూ,
హ్రుదంత రాళం గర్జిస్తూ-
పదండి పోదాం,
వినబడలేదా
మరో ప్రపంచం జలపాతం?

దారి పొడుగునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు!
బాటలు నడిచీ,
పేటలు కడచీ,
కోట లన్నిటిని దాటండి!
నదీ నదాలు,
అడవులు, కొండలు,
ఎడారులా మన కడ్డంకి?
పదండి ముందుకు!
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!

ఎముకుల కుళ్ళిన,
వయస్సు మళ్ళిన
సోమరులారా! చావండి!
నెత్తురు మండే,
శక్తులు నిండే
సైనికులారా! రారండి!
"హరోం! హరోం హర!
హర! హర! హర! హర!
హరోం హరా!" అని కదలండి!

మరో ప్రపంచం,
మహా ప్రపంచం
దరిత్రినిండా నిండింది!
పదండి ముందుకు!
పదండి త్రోసుకు!
ప్రభంజనంవలె హోరెత్తండీ!
భావ వేగమున ప్రసరించండీ!
వర్షుకాభ్రముల ప్రళయఘోషవలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!
పదండి,
పదండి,
పదండి ముందుకు!
కనబడ లేదా మరో ప్రపంచపు
కణకణ మండే త్రేతాగ్ని?

ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవి
ఎనభై లక్షల మేరుపులు!
తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్
జలప్రళయ నాట్యం చేస్తున్నవి!
సల సల క్రాగే చమురా? కాదిది,
ఉష్ణరక్త కాసారం!
శివసముద్రమూ,
నయాగరావలె,
ఉరకండీ! ఉరకండీ ముందుకు!
పదండీ ముందుకు!
పదండీ త్రోసుకు!
మరో ప్రపంచపు కంచు నగారా
విరామ మెరుగక మ్రోగింది!

త్రాచులవలెనూ,
రేచులవలెనూ,
ధనంజయునిలా సాగండి!
కనబడ లేదా మరో ప్రపంచపు
అగ్ని కిరీటపు ధగధగలు,
ఎర్రబావుటా నిగనిగలు,
హోమజ్వాలల భుగ భుగలు ?

శ్రీ శ్రీ - ఏప్రిల్ 12, 1994
శ్రీ శ్రీ 'మహా ప్రస్తానం' నుంచి సంగ్రహితం

కవితా! ఓ కవితా! - 'మహా ప్రస్థానం'

కవితా! ఓ కవితా!
నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో
నిను నే నొక సుముహూర్తంలో,
అతి సుందర సుస్యందనమందున
దూరంగా వినువీధుల్లో విహరించే
అందని అందానివిగా
భావించిన రోజులలో,
నీకై బ్రతుకే ఒక తపమై
వెదుకాడే నిమిషాలందు నిషాలందున,
ఎటు నే చూచిన చటులాలంకారపు
మటుమాయల నటనలలో
నీ రూపం కనరానందున,
నా గుహలో, కుటిలో, చీకటిలో
ఒక్కడనై స్రుక్కిన రోజులు లేవా?

నీ ప్రాబల్యంలో,
చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో,
నిశ్చల సమాధిలో,
స్వర్గద్వారపు తోరణమై వ్రేలిన నా
మస్తిక్షంలో
ఏయే ఘోషలు, భాషలు, ద్~రుశ్యాల్ తోచాయో ?
నే నేయే చిత్ర విచిత్ర శ్యమంత
రోచిర్ని వహం చూశానో!
నా గీతం ఏయే శక్తులలో
ప్రాణస్పందన పొందిందో ?
నీకై నే నేరిన వేయే ధ్వనులలో,
ఏయే మూలల వెదికిన ప్రోవుల
ప్రోవుల రణన్ని నాదాలో!
నడిరే యాకస మావర్తించిన,
మేఘా లావర్షించిన,
ప్రచండ ఝుంఝూ ప్రభంజనం
గజగజ లాడించిన
నడి సంద్రపు కెరటాల్లో, మ్రోగిన
శంఖారావం, ఢంకాధ్వానం;

ఆ రాత్రే,
కారడవులలో లయాతీతమై
విరుతించిన నానాజంతుధ్వనులలో?
నక్షత్రాంతర్నిబడ నిఖలగానం,
భూకంపాలు, ప్రభుత్వ పతనాలు,
విప్లవం, యుధ్ద్ధం,
అన్నీ, నీ చైతన్యం!
నీ విశ్వరూప సాక్షాత్కారం

మరి నిన్ను స్మరిస్తే
నా కగుపించే ద్రుశ్యాలా?
వినిపించే భాష్యాలా ?
అగ్ని సరస్సున వికసించిన వజ్రం!
ఎగిరే లోహశ్యేనం!
ఫిరంగిలో జ్వరం ద్వనించే మ్రుదంగ నాదం

ఇంకా నే నేం విన్నానా?
నడిరే నిద్దురలో
అపుడే ప్రసవించిన శిశువు నెడద నిడుకొని
రుచిర స్వప్నాలను కాంచే
జవరాలి మనఃప్రపంచపు టావర్తాలు!

శిశువు చిత్ర నిద్రలో
ప్రాచీన స్మ్రుతు లూచే చప్పుడు!
వైద్యశాలలో,
శస్త్రకారుని మహేంద్రజాలంలో,
చావు బ్రదుకుల సంధ్యాకాలంలో
కన్నులుమూసిన రోగార్తుని
రక్తనాళ సంస్పందన!
కాలువ నీళులలో జారిపడి
కదలగ నైనా చాలని
త్రాగుబోతు వ్యక్తావ్యక్తాలాపన!
ప్రేలాపన!

కడుపు దహించుకుపోయే
పడుపుకత్తె రాక్షసరతిలో
అర్ధ నిమీలత నేత్రాల
భయంకర భాధల పాటల పల్లవి!
ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం!
ఉన్మాది మనస్సినీవాలిలో
ఝాకంకేకా, భేకంబాకా!
సమ్మెకట్టిన కూలీల,
సమ్మెకట్టిన కూలీల భార్యల, బిడ్డల
ఆకటి చీకటి చిచ్చుల

హాహాకారం! ఆర్తారావం!
ఒక లక్ష నక్షత్రాల మాటలు,
ఒక కోటి జలపాతాల పాటలు,
శతకోటి సముద్రతరంగాల మ్రోతలు!
విన్నానమ్మా! విన్నా, నెన్నో విన్నాను.
నా విన్నని కన్నని విన్నవించగా
మాటలకై వెదుకాడగపోతే
అవి,
పుంఖానుపుంఖంగా
శ్మశానాలవంటి నిఘంటువుల దాటి,
వ్యాకరణాల సంకెళ్ళు విడిచి,
చంధస్సుల సర్వపరిష్వంగం వదలి----
వడిగా, వడివడిగా
వెలువడినై, పరుగుడినై, నా యెదనడుగిడినై!
ఆ చెలరేగిన కలగాపులగపు
విలయావర్తపు
బలవత్ ఝరవత్ పరివర్తనలో,
నే నేయే వీధులలో
చంక్రమణం చేశానో,
నా స్~రుష్టించిన గానంలో
ప్రక్షుళిత మామక పాపపరంపర
లానంద వశంవద హ్~రుదయుని జేస్తే-

నీకై మేలుకొనిన
సకలేంద్రియములతో
ఏది రచిస్తున్నానో, చూస్తున్నానో,
ఊపిరి తీస్తున్నానో
నిర్వికల్ప సమాధిలో
నా ప్రాణం నిర్వాణం పొందిందో,
అటు నను మంత్రించిన,
సమ్ముగ్ధంగావించిన ఆ గాంధర్వానికి,
తారానివహపు ప్రేమసమాగమంలో
జన్మించిన సంగీతానికి...
నా నాడుల తీగలపై సాగిన
నాద బ్రహ్మ్మపు పరిచుంబనలో,
ప్రాణావసానవేళాజనితం,
నానాగాననూనస్వానావళితం,
బ్రతుకును ప్రచండభేరుండ గరు
త్పరిరంభంలో పట్టిన గానం,
సుఖదుఃఖాదిక ద్వంద్వాతీతం.
అమోఘ, మఘాధ, మచింత్య, మమేయం,
ఏకాంతం, ఏకైకం,
క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం,
బ్రహ్మానుభవం కలిగించిన,
నను కరిగించిన కవనఘ్రుణీ!
రమణీ!
కవితా! ఓ కవితా!

నా జనని గర్భంలో,
ఆకారం లేకుండా నిద్రిస్తూన్న,
నా అహంకారానికి
ఆకలి గొల్పించిన నాడో!
నా బహిరంత రింద్రియాలలో
ప్రాణం ప్రసరించగ, నే నీ భూలోకంలో పడి
సుఖదుఃఖా లేవేవో
వస్తూంటే తలదాలిచి
ప్రపంచ పరిణాహంలో
ప్రయాణికుడనై,
పరివ్రాజకుడినై,
విహ్వలంగా వర్తించేవేళ
అభయహస్త ముద్రతో ననుదరిసిన
నన్ను పునీతుని కావించిన కవితా!
లలిత లలిత కరుణామహితా
అనుపమితా!
అపరిమితా!
కవితా! ఓ కవితా
నేడో నా ఊహంచల
సాహసికాంసం కప్పిన నా
నిట్టూర్పులు వినిపిస్తాయా?
నే నేదో విరచిస్తానని,
నా రచనలలో లోకం ప్రతిఫలించి,
నా తపస్సు ఫలించి,
నా గీతం గుండెలలో ఘార్ణిల్లగ
నా జాతి జనులు పాడుకొనే
మంత్రంగా మ్రోగించాలని
నా ఆకాశాలను
లోకానికి చేరువగా,
నా ఆదర్శాలను
సోదరులంతా పంచుకునే
వెలుగుల రవ్వల జడిగా,
అందీ అందకపోయే
నీ చేలాంచముల విసరుల
కొసగాలులతో నిర్మించిన
నా నుడి నీ గుడిగా,
నా గీతం నైవేద్యంగా, హ్~రుద్యంగా,
అర్పిస్తానో
నా విసరిన రస విన్~రుమర
కుసుమ పరాగం!
ఓహో! ఓ రసధుని! మణిఖని! జననీ! ఓ కవితా!
కవితా! ఓ కవితా! ఓ కవితా!

-శ్రీ శ్రీ,1937

శ్రీ శ్రీ 'మహా ప్రస్తానం' నుంచి సంగ్రహితం