28, నవంబర్ 2011, సోమవారం

దేవుడి బిడ్డ అడ్డాలు బహిర్గతం కావడం

ఇడుపలేసుని మహిమలతో
ఈశాన్య రాష్ట్రాలలో కూడా
దేవుడి బిడ్డ అడ్డాలు బహిర్గతం కావడం
దేవుడి బిడ్డకే కాదు
ఆంధ్రులందరికీ గర్వకారణం.

సోమాలియా దొంగల కథ

ఒక డాక్టర్ గారు
తీరిక లేకుండా
రాష్ట్రానికి ఆపరేషను చేసి
సహజవనరులను వెలికి తీసి
కొడుకును కొండెక్కిస్తుంటే
ఎరువులు కావాలని రోడ్డెక్కిన రైతులకు
సోమాలియా దొంగల కథ చెప్పి
సమాధాన పరిచి
రైతు శాస్త్రవేత్తలుగా
పార్టీ కార్య కర్తలను పెట్టించి
మేఘమధనం పేరు చెప్పి ధన మధనం చేసి
రైతులకు ఆదాయం ఎక్కువజేసి
పంట విరామం చేయించిలా కృషి సల్పి
డాక్టర్ గారు చెప్పినట్లు
వ్యవసాయాన్ని పండగజేసినందుకు
ప్రక్క రాష్ట్రపు విద్యాలయం
పట్టండి మహా ప్రభో అని డాక్టరేట్ ఇస్తుంటే
పట్టరాని ఆనందం వచ్చింది
తీసుకొన్నందుకు మీకు లేని సిగ్గు
అభినందించడానికి మాకు ఎందుకు
అందుకే అందుకోండి శుభాకాంక్షలు.

ప్రతిపక్షానికి ప్రతిపక్షమై ప్రభుత్వం దగ్గరికి తమ ప్రతినిధులకు దారిచూపి

ప్రభుత్వం మైనార్టీలో పడింది
రక్షిస్తోంది ప్రతిపక్షమే అని
అవిశ్వాసం పెడితే
మేము పడగొట్టేస్తామని
ప్రగర్భాలు పలికి
ప్రతిపక్షానికి ప్రతిపక్షమై
ప్రభుత్వం దగ్గరికి
తమ ప్రతినిధులకు దారిచూపి

రైతు సమస్యలపై
అవిశ్వాసం పెడతాము
అని చెబుతున్న ప్రతిపక్షపు పల్లవిపై
పలుకే బంగారం చేసి బాబాయితో
రాయభారాలు నడుపుతున్నది ఎవరు?

వెంగలప్పలా పచ్చి వెలక్కాయ మింగి....................

సామాజిక న్యాయం అని
పడగొడితే నిలబెడతా అని
తనకు న్యాయం చేసుకోడానికి
అమ్మగారి దర్శనం చేసుకొంటూ
పార్టీ పెట్టినప్పటి నుండి అయోమయాన్ని దూరం చేసుకోకున్నా
అమాత్య పదవన్నా వస్తుంది అని
ఆశల పల్లకిలో ఒకరు

నాన్న అధికార మంత్రదండంతో
వాయు వేగాన వ్యాపారి అయి
అయ్య స్థానం కోసం అంగలార్చి
అలిగి
తోసేస్తానని
తోక జాడించి
ముసురుకొన్న కేసులతో
మద్దతు దారులు ‘దారులు’ వెతుక్కొంటుంటే
వెంగలప్పలా పచ్చి వెలక్కాయ మింగి
అమాత్య పదవన్నా వచ్చి వుండేదని
అంతులేని ఓదార్పు లో నిర్వేదపడుతూ
ఆటలో అరటి పండైనా ఓ అర్ధం వుండేది
అడ్డంగా కేసుల్లో ఇరుక్కొన్నామే అని ఇంకొకరు

నాన్నది తప్పా? అమ్మది తప్పా?

ఏభై శాతం మార్కులతో
అమెరికాలోని యూనివర్సిటీలలో
కొడిక్కి ఇరవై ఐదు కోట్ల డొనేషనుకట్టి
చదివించి అది చూపించుకోని
నాన్నది తప్పా?

ప్రజా సంపదను
పరుల దోసిట పట్టించి
కొడికి కంపెనీలలోకి
పెట్టుబడులు రప్పించి
కొడుకును పెద్ద వ్యాపార వేత్తగా
చూపించిన
నాన్నది తప్పా?

కొడుక్కోసం పాల వ్యాపారం చేస్తున్న
అమ్మది తప్పా?

కొడుకు రాజకీయ పదవి కోసం
అన్ని ఆరోపణలకు వెనకేసుకొని వస్తూ
రాజకీయ ప్రత్యర్ధులను వేధించడం మొదలెట్టిన
అమ్మది తప్పా?