13, మే 2011, శుక్రవారం

కడప కింగ్ ఆవినీతి గెలిచింది

కడప లోకసభ, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల ఫలితాలు పలు ప్రశ్నలను ముందుకు తెస్తున్నాయి. ఉప ఎన్నికలు వైయస్ జగన్ చెప్పినట్లు రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులకు నాంది పలుకుతాయా అనే ప్రశ్న అత్యంత ప్రధానంగా ముందుకు వస్తుంది. భారీ మెజారిటీతో వైయస్ జగన్, వైయస్ విజయమ్మ విజయం ఏ విధమైన సంకేతాలను అందిస్తోందనేది ప్రధానాంశం. సాధారమైన మెజారిటీతో వీరిద్దరు గెలిచి ఉంటే ఈ ప్రశ్నలకు అవకాశం ఉండేది కాదు. సెంటిమెంటు వల్ల విజయం సాధించారని చెప్పి తప్పించుకోవడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది.

వైయస్సార్‌కు లభించిన దాని కన్నా ఎక్కువ మెజారిటీ విజయమ్మకు, జగన్‌కు లభించింది. వైయస్సార్ మరణం వల్ల పెల్లుబుకిన సానుభూతి ఎన్నికల్లో ఏదో మేరకు పని చేసిందని అంగీకరించక తప్పదు. కానీ, అంతకు మించిన సంకేతాన్ని ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఇచ్చాయని అంటున్నారు. వైయస్సార్ రాజకీయ వారసత్వాన్ని వైయస్ జగన్‌కు కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారనే విషయాన్ని కూడా చెప్పినట్లు విశ్లేషిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసులో ఉండడం వల్లనే సంక్షేమ పథకాలను అమలు చేశారని, అవన్నీ కాంగ్రెసు పథకాలేనని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని కూడా అర్థమవుతోంది. కాంగ్రెసులో ఉన్నప్పటికీ ఆ పథకాలను రాజశేఖర రెడ్డి కాబట్టే అమలు చేశారని, మరో ముఖ్యమంత్రి అయితే అమలు చేసి ఉండేవారు కారని ప్రజలు భావిస్తున్నట్లు చెప్పవచ్చు.

జనాదరణ లేని నాయకులను ముఖ్యమంత్రులుగా నిలబెట్టే కాంగ్రెసు అధిష్టానం వైఖరిపై నిరసనగా కూడా ఫలితాలను చూస్తున్నారు. పైగా, ఓ కొడుకును, ఓ తల్లిని ఒంటరి చేసి ఓడించాలని ప్రయత్నాలు చేస్తున్నారని వైయస్ జగన్ తన ప్రచారంలో చెప్పిన మాట బాగానే పని చేసిందని కూడా అంటున్నారు. అలాగే, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తనను ఓడించడానికి కుమ్మక్కయ్యాయని జగన్ వర్గం చేసిన విమర్శ కూడా ప్రజల్లోకి వెళ్లిందని చెబుతున్నారు. వైయస్ జగన్ అవినీతిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పవచ్చు. అలాగే, వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించిన కాంగ్రెసు నాయకులను కూడా ప్రజలు తిప్పి కొట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో వ్యక్తమైన ప్రజాభిప్రాయమే వ్యక్తం కావచ్చుననే ఆందోళన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను తీవ్ర మథనానికి గురి చేసే అవకాశాలున్నాయి. ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా చూపడానికి జగన్ వర్గం వెనకాడదనేది నిజం. ఏమైనా, వైయస్ జగన్‌కు ఉప ఎన్నికల ఫలితాలు ఎనలేని మనో ధైర్యాన్నిచ్చాయని చెప్పక తప్పదు.

నేనంటే నాకెంతో ఇష్టం

చెక్కిలి మీంచి జారి పడే నీ కన్నీటి చుక్కలని
నేల బడకుండా నా దోసిలి పట్టి
అందులో నేను నీకు చూపించే
ముడుచుకున్న నీ ప్రతిబింబం లొ
నువ్వు మరిచిపోయిన
చిరునవ్వు ఆనవాలు లేదని చెప్పి
నవ్వుల పువ్వులు నీ మోముపైన
పూయించిన ప్రతి సారీ...

నేనంటే నాకెంతో ఇష్టం
నీ కష్టం లొ నేనున్నందుకు
ఆ దోసిలి నాదైనందుకు..

తల్లి కొడుకు ఈ రోజుల్లొ ఎంత వరుకు ??

నవ మాసాలూ మోసి
నలుగు పెట్టి స్నానం చేయించి
నాలుగు ముద్దలు పెట్టి
నడక నేర్పించి బడికి పంపి
నచ్చిన పిల్లకిచ్చి పెళ్లి చేసి
నా బంగారు కొండ అని మురిసిన తల్లికి
నడుం పడిపోయి మంచం పట్టగా
చూసుకోడానికి రావాల్సిన కొడుకు - కనపడుట లేదు
చివరగా కట్టుకున్న పెళ్ళాం కౌగిలిలో
కళ్ళు మూసుకుని వుండగా చూసిన గురుతు

ఇప్పుడు నిద్ర కావాలన్నాపట్టట్లేదు

నీ కమ్మని ఒడిలో
నా కన్నుల కిటికీలు మూసి
కరిగిపోవాలని ఉంది ..
సాయంకాలం సూర్యున్ని పంపేసి
వెలుతురుని వెళ్ళ గొట్టేసి
మిణుగురులని కూడా తరిమేసి
మబ్బుల్లాంటి మెత్తటి పరుపు మీద
చక్కటి దుప్పటి కప్పుకుని
దిండు మీద తల పెట్టి
నా గుండె సడి వినపడే నిశ్శబ్దంలో
నీ రాక కొరకు వేచి వున్న నాకు
నీ దర్శన భాగ్యం కలగదేమి?
వయసులో వున్నప్పుడు
నిన్ను నిర్లక్ష్యం చేసానని
నా మీద కక్ష కట్టావా?
నన్ను మన్నించు
నీ కౌగిట కరిగించు

ఇది ఎందుకంటే:
రాత్రంతా మెలకువగా ఉండే అలవాటు నాకు..
చిన్నప్పుడు అమ్మ పదే పదే పడుకోమని చెప్పినా పట్టించుకునే వాడిని కాదు..
ఇప్పుడు నిద్ర కావాలన్నాపట్టట్లేదు
"అందుకే చిన్నప్పటి నించి తొందరగా నిద్ర పోరా అని చెప్పా" అని అమ్మ అంటుంటే
ఇలా నిద్రా దేవికి విన్నపం రాసాను..

నిరాశతో అందరినీ నిందిచాలనుకున్నాను

నా చుట్టూ పరుచుకున్న చీకటిలో
కళ్ళు నులుముకుని కర్తైన్ తీసి చూస్తే


చందమామ వెన్నెల చల్లుతున్నాడు
మంచు పూలతో తడిసిన నేల
తెల్లని తివాచి లా వెలిగిపోతుంది
మబ్బులు మేమేం తక్కువ తిన్నామా అని
వెన్నెలకి తమ దూది మేనులతో మెరుపులు దిద్దాయి
మినుకు మినుకు మంటూ మధ్యలో చుక్కలు
మెరిసి మెరిసి మాయమవుతున్నాయి


ఎంత పిచ్చి వాడిని నేను
కళ్ళు మూసుకుని లోకమంతా
చీకటిలో వుందని చింతిస్తున్నాను
కళ్ళు వుండీ లాభంలేదని
నిరాశతో అందరినీ నిందిచాలనుకున్నాను

రెప్పలు తీసే ప్రయత్నం
కిటికే చేరే పయనం
కర్తైన్ తీసే ధైర్యం చేస్తే..

నా కోసం లోకంలో చీకటిని తరిమేయ్యడానికి
నా నేస్తాలు చేసిన సాయం కనిపించింది
లోకం బావుంది నలువైపులా
నన్ను అలుముకున్న సంతోషంలా

పొద్దున్నే మూడున్నరకి కిటికీ CURTAIN తెరిస్తే కనిపించిన దృశ్యం స్ఫూర్తిగా....