26, మే 2011, గురువారం

లేదంటే ఒకప్పటి వెలిగిన దేశంగా చరిత్రలో మిగిలిపోతుంది.

నరసింహా రావు గారి నాన్చుడు దారిలో
నారా వారు ఇంకా [ఈ కాలం లో కూడా] ప్రయాణిస్తూ
ప్రభుత్వ పగ్గాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు.

కానీ గ్రామ గ్రామానికీ విస్తరించి ఉన్న పార్టీ శాఖ
ఇదే విషయంలో విసిగిపోతోంది.

వయసుమళ్ళిన వాళ్ళు వాహ్యాళికి వచ్చినట్టు
వచ్చి ఇంకా పార్టీ వ్యవహారాలూ నడుపుతుంటే
అవకాశం రాని యువత అంగలారుస్తూ
తక్షణమే పేరొచ్చే పెడదారులను వెతుక్కొంటున్నారు.

రైతు సమస్యలు అవినీతి సమస్యలపై అధినేత అరుస్తున్నా
వాహ్యాళికి వచ్చినట్టు ప్రవర్తిస్తున్న
పండిన వృద్ద ఝంభూకాల జంజాటాన్ని
ఎంత తొందరగా వదులుకొని
జనంలో మమేకమయ్యే మనుషులకు
మేధావులకు పార్టీ పనులు అప్పజేబుతారో
అప్పుడే తెలుగు దేశం దశ తిరుగుతుంది.

లేదంటే ఒకప్పటి వెలిగిన దేశంగా
చరిత్రలో మిగిలిపోతుంది.

కుటుంబంలో ఎవరు జైలుకు పోతే వాళ్ళే సి ఎం అయిపోతారు

కనిమొళక్కో

కరుణ కూతురుగా ఉన్నా

కాస్తా దూరంగానే ఉంటివి

రాక రాక రాజకీయాలకు వస్తివి

రాజ్య సభకు వెళ్తివి

కుటుంబ గొడవల్లో కళైంజర్ ఛానెల్ పెడితివి

రాజాతో చేరి చేసిన రచ్చ

రచ్చ రచ్చ అయ్యి

అది కాస్తా 2 జీ అయ్యి

బైలు దొరక్క

జైలు పాలవుతున్నావు

అయినా మీ కుటుంబంలో

ఎవరు జైలుకు పోతే వాళ్ళే సి ఎం అయిపోతారు

బాధపడకు.

ఎప్పడూ ‘ఓదార్పు’ పేరుతొ ఏడుపేనా అనే సందేహం వద్దు

ఈ సీరియల్ లో
కథా నాయకుడు
కన్నీళ్లు తుడిచే నెపంతో వస్తాడు.
ఆ పాత్రను స్వయంగా కథా నాయకుడే
ఆవిధంగా మలుచుకొన్నాడు.
మధ్య మధ్య లో దీక్షల ఎపిసోడ్స్ తో అలరిస్తున్నా
అడపా దడపా ఎన్నికలంటూ డబ్బులు ఎదజల్లే
ఎపిసోడ్స్ తో ప్రత్యేక టెలి ఫిల్ములు చేస్తున్నా
ఈ సీరియల్ మాత్రం
తనకు ఖశ్చితంగా
కుర్చీ తెచ్చిపెడుతుందని నమ్మినందువల్లా
కథానాయకుడు ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లతో
ఏడిపించడానికి
రెండో సంవత్సరానికి దగ్గరవుతున్నా
రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తున్నాడు
ఎప్పడూ ‘ఓదార్పు’ పేరుతొ ఏడుపేనా అనే
సందేహం వద్దు
ఏడిపించబోయే ఇంటికి వెళ్లక ముందు
డబ్బులు కొడుతూ
బాణా సంచా కాలుస్తూ
బహు సందడి తో
హాస్యాన్ని కూడా పండిస్తారు.
లైవ్ సీరియల్ కాబట్టి
షూటింగ్ వచ్చిన వాళ్ళందరికీ
కవరేజి గ్యారెంటీ తో
గమ్మత్తు కలగజేస్తారు.
వీలయితే షూటింగ్ కు వెళ్ళండి
లేదంటే 24 గంటల లైవ్
టీ వీ ల లో వస్తుందని మరచిపోకండి.

తోడు పంపిస్తారని భయమా?

యువనేత తనకు మాత్రమే
రైతు సమస్యలపై పేటెంటు ఉన్నట్టు
మిగిలిన వారు ఎవరు ఏమి చేసినా
కనీసం ప్రస్తావించినా
కిందా మీదా పడి
తనను కాపీ కొడుతున్నారని
మొసలి కన్నీరనీ మొత్తుకొంటున్నాడు
ఇన్నాళ్ళూ సభ్యుడై ఉండీ
భత్యాలు తీసుకొంటూ
సభ్యత కోసమైనా
పార్లమెంటులో ఒక్క సారైనా ప్రస్తావించాడా?
ఇక్కడ మాట్టాడి కుర్చీ కొట్టేద్దామనే బదులు
అక్కడ ప్రస్తావిస్తే ప్రసారం చేసే
సొంత మీడియా ఉండదనా లేక
హసన్ అలీ లేక మధు కోడాకు చేసిన సత్కారం చేసి
2 జీ రాజా కు తోడు పంపిస్తారని భయమా?

ఓదార్పు అంటూ ఏడిపించడానికి వెళతారు.

సొంతంగా పార్టీ పరంగా గెలిచిన
ఎం ఎల్ ఏ ఒక్కరే.

మిగిలినవి అన్నీ కప్పదాట్లే.
అవి కూడా పాతికకు మించి లేదు.

పాలకులు తలుచుకొంటే
కప్ప దాట్లను సభకే రానివ్వకుండా చెయ్యొచ్చు.

ఇన్నీ తెలిసి పాలకులను పడగొట్టేస్తాం అని
పదే పదే చెప్పడం ఎందుకో ?

సిన్సియారిటీ చూస్తుంటే చిరంజీవి గుర్తుకు వస్తున్నాడు
ఏ పిలుపు వచ్చి డిల్లీకి వెళ్ళినా పోలవరం అంటాడు
తరువాత పత్తా ఉండడు.

సేం డిటో అలానే రైతు సమస్యలు అని ఓ టెంట్ వేస్తారు
కానీ ఓ సొంత పార్టీ ఎం పీ గా
విత్త మంత్రులను నిద్రలేపే వినతి పత్రం ఇవ్వలేరు.

టెంటు అవుతూనే
కుర్చీ సుమన్ అవతారం ఎత్తి
ఓదార్పు అంటూ ఏడిపించడానికి వెళతారు.

వెళ్ళిన చోట్లల్లా
ట్రాఫిక్ లేని జంక్షన్లు వెదికి
విగ్రహాన్ని పెడుతూ
యువ నేత మహా నేత విగ్రహావిస్కరణ అని
తన మీడియా లో రోజులో ఎప్పుడు చూసినా
తప్పించుకోకుండా బాధుతారు.

కుర్చీ తన బాబు సొత్తు అనే బాధ ఎక్కువగా ఉండేట్టు ఉంది
కూల్చేదేదో కూల్చేసి ఆ భారం దింపుకొంటే బావున్ను.

నేనే ఎలికవ్వాలని అనుకొంటే ఎలా కుదురుతుంది.

తానూ ఓ ఏలిక అవ్వాలని
ఓ ఎలుక
తన కుటుంబం మొత్తంతో
ఇంట్లో చిందర వందర చేస్తుంది
అందరూ చూసే లోపల
తన కుటుంబం మొత్తాన్ని
కలుగులో ఉంచుకొంటుంది
చిందర వంద చేస్తున్న భాగాన్ని
తన ఏలుబడికి వదిలేయమని
తతిమా ఎలుకలేవీ అలా సెయ్యకుండా
ఏదన్నా ప్రయత్నించినా
కలుగు దాటి బయటకు వచ్చి
ఇంట్లో ఇంకో మూల చప్పుడు చేసినా
ఎలికవ్వాలని కలలుగనే ఎలుక
చప్పుడు చేసే ఎలుకల కలుగుల ముందర
టమోటో పిండేసి గుడ్ల పెంకులు పెట్టేసి
నా నా రభస చేస్తోంది
అన్ని ఎలుకలూ ఒక్కటై
చెత్త జేస్తే కదా ఈ ఇంట్లో ఉండలేమని
సామాన్లు సర్దుకు పోయేది అక్కడ ఉన్నోళ్ళు.
నచ్చినప్పుడు కలుగు బయట వచ్చి
చిందర వందర చేసి
మిగిలినప్పుడు కలుగులోకి వెళ్లి పోయి కాలాక్షేపం చేస్తూ
నేనే ఎలికవ్వాలని అనుకొంటే
ఎలా కుదురుతుంది.

అరిచే కుక్క కరవదు

అని అందరికీ ఓ నమ్మకం
ఒక వేళ కరిస్తే బొడ్డు చుట్టూ
పద్నాలుగు సూదులు పొడి పించుకోవాలనే
మరో నమ్మకం
ఆ నమ్మకాలన్నీ విడిచి పెట్టండి.
అట్టని నేను జన విజ్ఞాన వేదిక కార్యకర్తను కాను,
ఆంధ్రాలో రోజుకొక్కరైనా కుక్క కరిచి చస్తున్నారు
పద్నాలుగు బదులు వచ్చిన ఒక్క సూది కూడా
ఆంధ్రాలో దొరకదు
అలా తయారయ్యింది మన ఆస్పత్రుల పరిస్థితులు.

మనకు ఉచితంగా వచ్చే ఆరోగ్య శ్రీ లు కావాలి కానీ
కుక్క కరిచి పోతే ఏమి అని అనుకొనే రోజులు వచ్చేసాయి.

అమెరికా వాళ్ళకు ఈ విషయం తెలియనట్టు ఉంది
లేదంటే ఈ పాటికి ఆంధ్రాకు వెళ్లి కుక్క కరిచి చావకండి
అని అందరూ కాండ్రించి ఉమ్మేట్టు
తమ పౌరులకు హెచ్చరికలు చేసి ఉండేది.

అందరివాడికి అమాత్య పదవి అందని ద్రాక్షేనా?

అన్నను ఆదర్శంగా తీసుకొని
అబ్దుల్ కలాం పిలుపందుకొని
ముఖ్యమంత్రి పదవికి కోసం పార్టీ పెట్టి
సామాజిక న్యాయాన్ని మంది మదిలో చొప్పించలేక
రెంటికీ చెడ్డ రేవడి అయి
గౌరవ నిష్క్రమణకోసం చూస్తుంటే
కేంద్ర మంత్రి ఇంటికి రాంగానే
తనకో కేంద్ర అమాత్య పదవి వస్తుందేమోనని ఆశపడి
పెట్టే బేడాతో సహా పార్టీని చేతిలో పెట్టడానికి ఒప్పుకొని
చేతి కోసం ఓట్లడిగి
తనూ రాహుల్ గాంధీ లాంటి వాడేనని నిరూపించుకొని
ఒగరుస్తూ ఓపిగ్గా హస్తిన ప్రయాణాలు చేసి
హస్త రేఖలు చూసుకొని మురిసిపోతూ
ప్రజల మధ్య ఉండాలను కొంటున్నానని
సముద్రం (చేతి పార్టీని సముద్రం పార్టీ గా వర్ణిస్తారు రాజకీయ విశ్లేషకులు)
ఒడ్డున నిలుచుకొని కేకేసి చెప్పి
ఇంటికొచ్చి అలక పాన్పు ఎక్కేసాడు
మరో సారి ప్రయాణం కట్టమని హస్తిన నుండి పిలుపొచ్చింది
అమాత్య పదవి కోసం అడిగి మళ్ళీ భంగపడుతాడో ఏమిటో?

ఇక్కడ భంగపడతాడు అని ఖశ్చితంగా ఎందుకు చెబుతున్నాను అంటే
ఈయనకు పదవిచ్చి ఖాళీ అయ్యే తిరుపతి లో
పరపతి నిలుపుకొనే ధైర్యం సముద్రానికి లేదు కాబట్టి
అదీ స్థానిక ఎన్నికల ముందు అసలు ఆ ఊసే ఊహకు కూడా రానివ్వరు.
అందుకే అందరివాడికి అమాత్య పదవి అందని ద్రాక్షే అవుతుంది
కాదు అమాత్యాడు అవ్వాలని మొండిఘటం అయితే రాష్ట్రం లో ఇస్తారు.

గోనె పట్టలు కూడా రైతులకు ఇవ్వలేని ఘోర ప్రభుత్వంలో
ముఖ్యమంత్రి పదవికి కోసం పార్టీ పెట్టి
రాష్ట్ర మంత్రులలో ఓ బోడి లింగ మవ్వడానికి
మనః సాక్షి అంగీకరిస్తుందా అన్నది ఓ ప్రశ్న?

జూ ఎన్టీఆర్‌కు చంద్రబాబు చెక్?

తన కుమారుడు నారా లోకేష్‌కు అడ్డం పడాలని చూస్తున్న తన మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెక్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పూర్తి కాలం రాజకీయాలపై దృష్టి పెట్టలేని స్థితిని గమనించి ఆయన నారా లోకేష్‌ను పార్టీలోకి దింపుతున్నట్లు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మంత్రి గల్లా అరుణ పాగా వేశారు. ఒకప్పుడు చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరి గల్లా అరుణ చేతుల్లోకి పోవడాన్ని దృష్టిలో ఉంచుకుని మళ్లీ తాను పాగా వేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇందులో భాగంగా తన కుమారుడు నారా లోకేష్‌ను అక్కడి నుంచి రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నారు. దీనివల్లనే చంద్రగిరి నియోజకవర్గం పార్టీ నేతలు నారా లోకేష్‌ను ఇంచార్జీగా నియమించాలని పట్టుపడుతున్నారు.

కాగా, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అతను సినిమాలను తగ్గించుకోవడానికి కనీసం పదేళ్లయినా పడుతోంది. ఈ పదేళ్ల లోపు అతను పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదు. నందమూరి హరికృష్ణ ముందుకు వచ్చి పార్టీ నాయకత్వం చేపట్టే స్థితి కూడా లేదు. హరికృష్ణకు తగిన సమర్థత కూడా లేదు. పార్టీ నాయకులు అందుకు అంగీకరించే అవకాశం లేదు. ఇప్పుడిప్పుడే సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చే సాహసం జూనియర్ ఎన్టీఆర్ చేస్తాడని అనుకోలేం. అందువల్ల నారా లోకేష్‌ను అడ్డుకుని జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించే అవకాశాలు లేవు. వచ్చే పదేళ్ల కాలంలో, అంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల వైపు దృష్టి సారించాలని అనుకునే సరికి నారా లోకేష్ నాయకుడిగా స్థిరపడిపోతారు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఏ విధమైన ఆటంకాలు ఉండవని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ, బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని అనుకుంటే మాత్రం కాస్తా తేడా రావచ్చు. కానీ, లోకేష్‌ను అల్లుడిగా చేసుకున్న బాలకృష్ణ అందుకు సాహసించకపోవచ్చు. ఇప్పటికే, చంద్రబాబు, బాలకృష్ణల మధ్య ఒక అవగాహన కుదిరినట్లు చెబుతున్నారు. మొత్తం మీద, కుమారుడు నారా లోకేష్‌కు చంద్రబాబు లైన్ క్లియర్ చేసి పెట్టారు. పార్టీ ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా నారా లోకేష్‌ను సమర్థించేవారే. అంటే చంద్రబాబు మాటకు కట్టుబడి ఉండేవారే. నామా నాగేశ్వర రావువంటి నాయకులు నారా లోకేష్‌కే మద్దతు తెలుపుతారు