3, మార్చి 2011, గురువారం

అంతా లొల్లియ(మేము అందరము ఒక్కటే)

తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కలిసి కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెక్ పెట్టే యోచన చేస్తున్నాయి. వైయస్ జగన్ వర్గం కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి సోదరుడు దేవరగుడి నారాయణ రెడ్డిని పోటీకి దించుతోంది. ఈ స్థితిలో ఇంచార్జీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ, మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, వైయస్ వివేకానంద రెడ్డి, కాంగ్రెసు నాయకుడు తులసి రెడ్డి కలిసి తెలుగుదేశం పార్టీలతో సయోధ్యకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. తెలుగుదేశం నాయకుడు పాలకొండ రాయుడితో, మదన్మోహన్ రెడ్డి, పుత్తా నర్సింహారెడ్డిలతో చర్చలు జరిపారు. తెలుగుదేశం పార్టీకి కూడా వైయస్ జగన్ ప్రధాన ప్రత్యర్థి కాబట్టి కాంగ్రెసుకు సహకరించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ స్థితిలో వైయస్ జగన్ వర్గం అభ్యర్థిని ఓడించేందుకు పోటీకి దిగకూడదని తెలుగుదేశం నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. శత్రువు శత్రువు మిత్రుడనే నీతిని తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరించే అవకాశం ఉంది. కాంగ్రెసు తన అభ్యర్థిగా వరదరాజులు రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది.

ఎవడి పని వాడు చెయ్యాలి

జస్టిస్ కృష్ణ కమిటీ ముందు
చిన్నబోయిన తర్కాన్ని
వేర్పాటు వాద న్యాయవాదులు
అంగీకరించడం లేదు

అంది వచ్చిన అవకాశాన్ని
జార విడుచుకొని
తమ తెలివి తేటలను
జనాలకు తెలియజేయాలని
కనిపించిన ప్రతి ప్రజా ప్రతినిధిని
నిలదీస్తూ నిష్టూరపరుస్తున్నారు

గతంలో ఇలాగే తమ పని తాము చేయక
తెలుగు తమ్ముళ్ళ దగ్గర
తన్నించుకోవడం తలుచుకొంటుంటే
గుర్తుకు వస్తోంది
ఎవడి పని వాడు చెయ్యాలి అనే తెలుగు కథ

తల్లడిల్లుతున్న తెలుగు తల్లి

భాషను తల్లి తర్వాత తల్లిగా (ప్రచారం) చేసిన వాడు తెలుగు వాడే !
అలాగే ……
తన సొంత రాష్ట్రం లో తన సొంత భాషను అధికార భాషగా చేసుకోలేక పోయినవాడు,
అరవై ఏళ్లయినా తన భాషను పక్కన పెట్టి ఇంకా పరాయి భాషలో పరిపాలన సాగించే
అసమర్దుడూ తెలుగు వాడే అన్న కఠోర వాస్తవాన్ని కూడా మరచి పోవద్దు.
తమిళ తంబి, హిందీ అన్న ఇతర భాషల వాళ్ళు తమ రాష్ట్రాల్లో చక్కగా ప్రజల భాషలో
పాలన సాగించు కుంటున్నారు.
వాళ్ళేమీ తమ భాషలను తల్లులుగా ప్రచారం చేసి విగ్రహాలు నెలకొల్పుకోక పోయినా
తమ భాషలను అద్భుతంగా పాలనా భాషలుగా తీర్చి దిద్దుకున్నారు.
మనం…
ఏదో తల్లి అంటూ ఆత్మవంచనకు, పర వంచనకు పాల్పడుతున్నాం.
ఇదంతా రాజకీయ కుట్రలో భాగమే తప్ప నిజమైన అభిమానం కాదు.
మనవాళ్ళు ఉత్త వెధవాయిలోయ్ అని గురజాడ ఊరికే అన్నాడా మరి.