7, ఏప్రిల్ 2011, గురువారం

ఆమె తెలుగు సినీరంగానికే పరిమితమయ్యారు.

ప్రముఖ సినీ నటి సుజాత బుధవారం చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆమె మృతి చెందినట్లు సమాచారం. ఆమె 300కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు, మలయాళం, తమిళం సినిమాల్లో ఆమె నటించారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, శోభన్ బాబు, రంగనాథ్, కమలహాసన్, రజనీకాంత్ వంటి అగ్ర హీరోల సరసన ఆమె హీరోయిన్‌గా నటించారు. ఆమె 1967లో తబస్విని సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆమె తొలి తెలుగు సినిమా దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన గోరింటాకు. గోరింటాకు, సంధ్య, సుజాత వంటి సినిమాలు హిట్ కావడంతో ఆమె తెలుగు సినీరంగానికే పరిమితమయ్యారు.


నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఆమె ఎంచుకున్నారు. గుప్పెడు మనసు, ఏడంతస్థుల మేడ, సర్కస్ రాముడు, గురుశిష్యులు, బంగారు కానుక, శ్రీరామదాసు, ప్రేమతరంగాలు, సూత్రధారులు, పుసుపు పారాణి వంటి పలు హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. తెలుగుకు సంబంధించిన మహిళగా ఆమె గుర్తింపు పొందారు. సుజాత 1952 డిసెంబర్ 10వ తేదీన శ్రీలంకలో పుట్టారు.

తండ్రి ఉద్యోగ రీత్యా శ్రీలంకలో ఉండడంతో ఆమె 8వ తరగతి వరకు శ్రీలంకలోనే చదివింది. ఆ తర్వాత తండ్రితో పాటు కేరళకు వచ్చేశారు. దాంతో చదువు సాగలేదు. అన్న ప్రోత్సాహంతో పలు నాటకాల్లో నటించారు. ఆ నటనానుభవంతోనే ఆమెకు సినిమాల్లో అవకాశం వచ్చింది. 1997లో ఆమెకు సహాయనటిగా నంది అవార్డు లభించింది. తెలుగులో ఆమె తల్లి పాత్రలు కూడా వేశారు. ఆమె కలైమామణి బిరుదు కూడా అందుకున్నారు. ఆమె చెన్నైలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. సుజాత ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటించారు.

ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు దొరుకుతారా ?

గూడవల్లి రామబ్రహ్మం గారి పేరు చెప్పగానే ' మాలపిల్ల ', ' రైతుబిడ్డ ' చిత్రాలు గుర్తుకు వస్తాయి. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆయనదొక సువర్ణాధ్యాయం. ఇంత పరిణితి చెందిన ప్రేక్షకులున్న రోజుల్లో కూడా చిత్ర నిర్మాతలు, దర్శకులు ధైర్యం చెయ్యలేని సాహసాల్ని, ప్రయోగాలని ఆయన ఆ రోజుల్లోనే చేశారు.

ఆయన దగ్గర ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసిన అనుమకొండ సూర్యనారాయణ గారు అకౌంట్స్ లో దిట్ట. అసలు సినిమా రంగంలో నిర్మాణ కార్యక్రమాలకు ప్రొడక్షన్ మేనేజర్ కీలకం. దూషణ, భూషణ, తిరస్కారాలకు సిద్ధంగా ఉండాలి. సరైన ప్రణాళికలు రూపొందించడం దగ్గరనుండి చిత్ర నిర్మాణం సక్రమంగా పూర్తవడం వరకూ ప్రొడక్షన్ మేనేజర్ బాధ్యత వహిస్తాడు.

రామబ్రహ్మం గారు ఉదార స్వభావులుగా పేరు పొందారు. అయితే ఆయనకు ప్రథమ కోపం జాస్తి అని చెప్పుకుంటారు. చిన్న చిన్న విషయాలకు కస్సు బస్సుమనేవారట. అయితే ఆయన వితరణ ముందు ఇవి తేలిపోయేవి. ఆయన తిట్టినా ఎవ్వరూ అంతగా బాధపడేవారు కాదట.

ఒకసారి ఆయన చిత్రం ఒకటి పూర్తయింది. అందరికీ ఇవ్వవలిసిన పారితోషికాలు పూర్తిగా ఇచ్చేసి పంపే పనిలో ఉన్నారు. అందరివంతూ పూర్తయి సూర్యనారాయణగారి వంతు వచ్చింది. మొత్తం చిత్ర నిర్మాణ ఖర్చులన్నీ అప్పగించమన్నారాయన్ని రామబ్రహ్మం గారు.

సరే ! పక్కాగా రాసి ఉంచిన లెక్కల్ని ఆయన ముందు పెట్టారు సూర్యనారాయణ గారు.
మొత్తం జాబితా అంతా పరిశీలించిన రామబ్రహ్మంగారు చివరగా కనబడ్డ ఒక అంశానికి ఆశ్చర్యపోయారు.
ఆ అంశమేమిటంటే ' ఈ చిత్ర నిర్మాణ సమయంలో మీరు నన్ను తిట్టినా తిట్లు 642 ' అని రాసి ఉంది.
అంతే... గూడవల్లి రామబ్రహ్మంగారికి కోపం..... కాదు... ఆయనలోని ఉదారత బయిటికోచ్చింది.
తిట్టుకి రెండు రూపాయిలు చొప్పున 1284 రూపాయిలు సూర్యనారాయణ గారికి ఇచ్చారుట.
ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు దొరుకుతారా ?

ప్రజల ఉదాసీనతే ! అదే ఈనాటి రాజకీయాలకు పెట్టుబడి

అధికారం, ధనం, పలుకుబడి ముందు
సభ్యత, సంస్కారం తలవంచుకుంటున్నాయా ?
రాజకీయాలకు విలువలు లేవా ?
విశృంఖలత్వమే వాటి చిరునామాగా మారిపోతోందా ?
స్వార్థ రాజకీయాలు ..........
రాజకీయ స్వార్థాలు .........
ఉద్యమాలను బలితీసుకుంటున్నాయి
విద్యార్థుల భవిష్యత్తును బలి తీసుకుంటున్నాయి
సామాన్య ప్రజల జీవితాలను బలి తీసుకుంటున్నాయి
ప్రజలిచ్చిన అధికారంతో అందాలాలెక్కుతున్నాయి
మదమెక్కిన జంబుకాలు ప్రజా భవనాలనే
రాసలీలా మందిరాలుగా మార్చేస్తున్నాయి
వారికా భవనాలేవరిచ్చారు ? అధికారమెవరిచ్చారు ?
హోదా ఎవరిచ్చారు ? ధనమెవరిచ్చారు ?
వారికి ఇలా కళ్ళు నెత్తికెక్కడానికి కారణమేమిటి ?
ఇంకేమిటి ? ప్రజల ఉదాసీనతే !
అదే ఈనాటి రాజకీయాలకు పెట్టుబడి
ఎప్పటికైనా ప్రజల్లో ఈ ఉదాసీనత తొలిగిపోతుందా ?

శ్రీశ్రీ వివిధ సందర్భాల్లో ఆయన చెప్పిన సమాధానాలలో కొన్ని......

శ్రీశ్రీ గారి మాటల్లో శ్లేషలకు కొదవలేదు. సందర్భోచితంగా చతురోక్తులు విసరడంలో ఆయనకు ఆయనే సాటి. ఎవరైనా ఆయన్ని ప్రశ్నించడం పాపం ఠక్కున సమాధానం వచ్చేసేది. వివిధ సందర్భాల్లో ఆయన చెప్పిన సమాధానాలలో కొన్ని......

* ' బ్రతుకు ' అంటే అర్థం...... - ' చావకు ' అని.

* బీదవాడికి, సంపన్నుడికి బేధం......... - బీదవాడు ఎప్పటికైనా సంపన్నుడు కావాలని కోరుకుంటాడు. కానీ సంపన్నుడు ఎప్పటికీ బీదవాడు కావాలని కోరుకోడు.

* జనన మరణాలమీద మీ అభిప్రాయం......... - నా అభిప్రాయంతో నిమిత్తం లేకుండానే ఇదివరలో ఇవి సంభవించాయి. ఇక మీద కూడా సంభవిస్తూనే ఉంటాయి.

* రాతల్లో బోలెడు నీతిని ప్రబోధించే మీరు నీతిగా ఉంటారా ? - ఉరికి దారి చెబుతూ రోడ్ మీద బోర్డ్ ఉంటుంది. ఆ రోడ్ వెంట మనం వెళ్ళాలి గానీ ఆ బోర్డు వెళ్ళదు కదా !

* దేశంలో లంచాలు తీసుకునే వాళ్ళందర్నీ ఉరి తీసేస్తే....... - లంచాలిచ్చేవాళ్ళు మిగులుతారు.

* భగవంతుడ్ని ప్రార్థించేటపుడు కళ్ళెందుకు మూసుకుంటారు ? - తమది గుడ్డి నమ్మకం అని తెలియజేయ్యడానికి.

* శ్రీనాథుడికీ, శ్రీశ్రీకీ ఉన్న తేడా....... - శ్రీనాథుడి కావ్యాలు చదివి శ్రీశ్రీ ఆనందించాడు. శ్రీ

RGV'S comments on puttaparthi sai baba

“Am praying hard to the almighty puttaparthi sai baba to use his Godly powers to make himself healthy....I sooo hate to see God bedridden!”

“God is a Baba to Babas but Babas can never be Gods to Gods”

“Babas think they are Babas because they think they are Gods but be-cos Gods dont think Babas are Gods Babas again become Babas”

“God is the biggest Baba and if any Baba thinks he is God then God will make him just a Baba”

“I am on my way to Shirdi Baba to pray for Sai Baba”

“A dead Baba will always be more powerful than an alive Baba because the dead can't die and the alive can't live”

“Dead Babas power is you can neither put them in hospital nor kill them but thy can put you in hospital and kill you. moral of story. Better to pray to Dead”