26, ఫిబ్రవరి 2011, శనివారం

ప్రతిరోజూ ఒక మంచిమాట

మన ప్రవర్తనే మనకు మిత్రులనుగానీ, శత్రువులనుగానీ సమకూరుస్తుంది.

లోకంలో ఎప్పుడూ ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోలేం. ప్రేమతో మాత్రమే ద్వేషాన్ని ఎదుర్కోగలం

ప్రతి పక్షికి కావల్సిన ఆహారాన్ని భగవంతుడు ఇస్తాడు. అంతేగాని దాని నోటికి ఆహారాన్ని అందివ్వడు.

రాంగోపాల్‌వర్మ చేతిలో కంప్లీట్‌గా క్లీన్‌బోల్డయిన రజనీకాంత్

రోజూ అందరినీ రకరకాల ప్రశ్నలతో కంఫ్యూజ్ చేసి కంగారుపెట్టే TV9 రజనీకాంత్ ఈరోజు రాంగోపాల్‌వర్మ చేతిలో కంప్లీట్‌గా క్లీన్‌బోల్డయ్యాడు. గంటసేపు జరిగిన ప్రోగ్రాంలో కనీసం ఒక్కసారి కూడా రాంగోపాల్‌వర్మకు సమానస్థాయిలో కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇవ్వలేకపొయ్యాడు. అనేక సందర్భాల్లో డిస్కషన్ ఎలా నడపాలో తెలియక వెర్రిమొహం వేశాడు. తనవాదనకు పనికొస్తారేమోనని ఇద్దరు మూవీ జర్నలిస్టులని పిలిస్తే వాల్లు ఇంకొంచెం కంఫ్యూషన్ క్రియేట్ చేశారు కానీ ఏవిధంగానూ రజనీకాంత్‌కు సహాయం కాలేకపొయ్యారు.

రోజూ అందరు పబ్లిక్ ఫిగర్లపైనా బురదచల్లి, మల్లీ వారొచ్చి తమపైన వచ్చిన వార్తలను ఖండిస్తే మరొకసారి అదికూడా చూపించి టీఆర్పీ పెంచుకోవడానికి చీప్‌ట్రిక్స్ ఆడే TV9 రాంగోపాల్‌వర్మతో ఎందుకు పెట్టుకున్నామురాబాబూ అనుకునేలా డిస్కషన్ నడిచింది. ఎలాగయినా సరే వర్మను వెధవను చేద్దామని అదే ప్రశ్నను మల్లీమల్లీ ఎపాటిలాగే అడిగిన రజనీకాంత్ ఈసారి మల్లీమల్లీ వెధవయ్యాడు.

రాంగోపాల్‌వర్మ పూర్తి డిస్కషన్‌లో ఒకే పాయింటుపైన ఉన్నాడు. తను తీసే సినిమాలు బాగులేవని విమర్శించొచు, కానీ వర్మ ప్రేక్షకులను వెధవలు అనుకుంటాడని ఆయన తరఫున వీరెలా చెబుతారనే దానికి రజనీకాంత్ దగ్గర సమాధానం లేదు. కాస్సేపు బురద జల్లుడు కార్యక్రమం, కాస్సేపు వర్మకు సలహాలిచ్చే కార్యక్రమం, కాస్సేపు ప్రేక్షకులను రక్షించబోయే కార్యక్రమం చేసి అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు. ఇక ఏనాడూ సమాజానికి పనికొచ్చే ఒక్క స్పెషల్ రిపోర్టు చూపించక ఎప్పుడూ పనికిమాలిన డిబేట్‌లు పెట్టి ఒకరినొకరు తిట్టుకునేట్టు చెయ్యడం, లేకపోతే పబ్లిక్‌ఫిగర్లపై బురదజల్లడం చేసి టీఆర్పీ పెంచుకునే TV9 వర్మకు సామాజిక స్పృహ నేర్పే ప్రయత్నం చెయ్యబొయి బోర్లాపడ్డం గమ్మత్తుగా ఉంది. పనిలో పనిగా ఇందులో యండమూరి కూడా ఫూల్ అయ్యాడు.

తిరోగమన పథంలో మమత రైలు

రైల్వే బడ్జెట్‌ చరిత్రలో 2011 ఫిబ్రవరి 25 చిరస్థాయిగా నిలిచిపోతుంది. అయితే ఈవిధంగా నిలిచిపోవటానికి కారణం ఏదో సాధించినందువల్ల కాదు. ఏమీ సాధించలేకపోవటం వల్లనే. సాధారణంగా బడ్జెట్‌ అంటే గత సంవత్సరం పని తీరును పరిశీలించుకుని అసంపూర్ణంగా మిగిలిన లక్ష్యాలను, అందుకు కారణాలను మదింపు చేసుకోవటం, ఆ వెలుగులో వర్తమాన కర్తవ్యభారం స్వీకరించటం. మమతా బెనర్జీ ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్‌లో ఈ మూడింటిలో ఏదీ జరగలేదు. ఒకసారి మంత్రిగారి ఉపన్యాసం విన్న వారికి, చదివిన వారికి ఎవరికైనా ఈ బడ్జెట్‌ 2011-2012 సంవత్సరానికే లేక రానున్న దశాబ్ద కాలానికా, అర్థదశాబ్దానికా అన్న సందేహం కలుగుతుంది. ప్రతిపాదించిన కొత్త రైల్వే లైన్ల సర్వే మొదలు, లైను డబ్లింగ్‌ వరకూ, స్టేషన్‌ నిర్మాణాల మొదలు, సంబంధిత పరిశ్రమల నిర్మాణాల వరకూ 12వ పంచవర్ష ప్రణాళికలో చేపడతామని బడ్జెట్‌ ప్రసంగం చెప్తోంది. ఇంకా మనం 11వ పంచవర్ష ప్రణాళిక ముగింపు దశకు చేరుకోలేదు. ఇక 12వ ప్రణాళికా కాలంలో చేపట్టం అంటే సదరు ప్రాజెక్టులు కాగితాలకే పరిమితం కావటం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత ఆర్థిక వ్యవస్థ కంటే రైల్వేల ప్రగతి వేగవంతంగా ఉందని చెప్పిన మంత్రి దానికనుగుణంగా మిగిలిన పనులు చేపట్టకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
నిపుణుల అంచనా ప్రకారం ఆర్థిక వ్యవస్థ 9 శాతం వృద్ధి రేటుతో ముందుకెళ్తుంటే రవాణా రంగం ప్రత్యేకించి రైల్వే 11 శాతం వృద్ధిరేటు సాధించాలి. అప్పుడే విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చటానికి సాధ్యమవుతుంది. దీనికి భిన్నంగా గత రెండేళ్లుగా భారత రైల్వే విస్తరణ రైల్వేబోర్డు మాజీ సభ్యుల అంచనాల మేరకు కేవలం 5 శాతానికి పడిపోయింది. రైల్వేల ఆర్థికశక్తి సామర్ధ్యాలకు, మనుగడకు ఆపరేషన్‌ రేషియో కీలకం. వంద రూపాయాల ఆదాయం సాధించటానికి ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందో దాన్ని ఆపరేషన్‌ నిష్పత్తిగా నిర్ధారిస్తారు. నాలుగేళ్ల క్రితం వరకూ 76 శాతంగా ఉన్న ఈ నిష్పత్తి గత రెండు సంవత్సరాల్లో 95 శాతానికి పెరిగింది. వాస్తవిక అంచనాలు, నిధుల లభ్యత, ద్రవ్యోల్బణం వంటివి పరిగణలోకి తీసుకుంటే ఈ నిష్పత్తి 115చేరుతుంది. అంటే వంద రూపాయలు సంపాదించటానికి భారత రైల్వే 115 రూపాయలు ఖర్చుపెడుతోంది. దక్షిణ మధ్య రైల్వేలో వందరూపాయల సంపాదనకు 146 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే మొత్తంగా భారత రైల్వే సగటున 15 శాతం లోటులో నడుస్తోంది. బహుశా భారతరైల్వే చరిత్రలో ఇంత అథమ స్థాయిలో ఎన్నడూ లేని పరిస్థితిని నేడు రైల్వేలు చవిచూస్తున్నాయి.
మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఎక్కిన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం మత్తు రైల్వే శాఖకూ ఎక్కింది. ఈ విధానం కింద 52 ప్రాజెక్టులు గత సంవత్సరం ప్రారంభించారు. వీటి ప్రగతి గురించి ఒక్కమాట కూడా బడ్జెట్‌ ప్రసంగంలో లేదు. కేవలం ఇవన్నీ ఈ సంవత్సరం పూర్తవుతాయి, సమగ్ర పరిశీలన దశలో ఉన్నాయి అన్న మాటలు తప్ప వీటి గురించి మరిన్ని వివరాలు కనిపించవు. రైల్వేల విస్తరణకు మూల నిధి ఖాతా, అభివృద్ధి నిధి ఖాతాలు కీలకం. ఈ రెండు ఖాతాల్లో నిధులు నామమాత్రపు దశకు చేరుకోవటంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పథకాలకు కేటాయించాల్సిన మేర కూడా రైల్వే శాఖ వద్ద నిధులు లేవు. దాంతో ఈ పథకం కింద వచ్చిన ప్రతిపాదనలన్నింటినీ మూటకట్టి అటకెక్కించారు. మరో ముఖ్యమైన విషయం మిగులు నిధుల పద్దు. ఈ పద్దు నుండే తక్షణ వ్యయం సమకూర్చబడుతుంది. 2007-2008లో 25000 కోట్ల రూపాయలు ఉంటే 2010-2011 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులు 1328 కోట్లకు కుదించుకుపోయాయి. నూతన పథకాలు, ప్రాజెక్టులు చేపట్టకపోవటానికి ఇదీ మూల కారణం. ఈ విషయాన్ని దాచిఉంచటానికి రైల్వే శాఖ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. విస్తరణ విషయంలోనూ బడ్జెట్‌ సంతృప్తికరంగా లేదు. గత సంవత్సరం బడ్జెట్‌లో సంవత్సరానికి వెయ్యి కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం పూర్తిచేస్తామని లక్ష్యంగా పెట్టుకొంది. 2009లో ప్రకటించిన విజన్‌ 2020 పత్రం ప్రకారం 2020 నాటికి దేశంలో అదనంగా మరో 2,5000 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాలు నిర్మాణం జరగాలి. అంటే మరో ఎనిమిదేళ్లలో ఈ నిర్మాణాలు పూర్తి కావాలి. అయితే దీనికి సంబంధించి శక్తి సామర్ధ్యాలు, శ్రామికులు, నిధులు, స్థల సేకరణ, ప్రణాళికల తయారీ గురించి పల్లెత్తు మాట లేకుండానే బడ్జెట్‌ ప్రసంగం ముగిసింది. పైగా ఈ సంవత్సరానికి మరో 800 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం కొత్తగా చేపడతామని డాబుసరిప్రకటనకు మాత్రం బడ్జెట్‌లో చోటు దక్కింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద ఈపాటికేవచ్చిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోగా మరో ఏడు రంగాల్లో ఇటువంటి ప్రాజెక్టులు చేపట్టాలని బడ్జెట్‌ ప్రతిపాదిస్తోంది. మరో 190 రైల్వే లైన్లకు సంబంధించి సర్వే పూర్తి చేయటానికి 12వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని లక్ష్యంగా నిర్ధారించుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న భద్రాచలం కొవ్వూరు రైల్వే లైను సర్వే కూడా ఏకంగా పన్నెండవ ప్రణాళికా కాలానికి గెంటివేయబడింది. అంటే కేవలం సర్వేకే మరో ఐదేళ్లు పడితే, 2017 నాటికి పూర్తి అయ్యేట్లయితే కేవలం మిగిలిన మూడు సంవత్సరాల్లో నిర్మాణం ఎలా పూర్తవుతుందన్నది ఎవరికీ అంతుబట్టని బ్రహ్మ రహస్యంగానే మిగిలిపోయింది.
రైల్వేల విస్తరణకు కీలకమైన ఇంజనీరింగ్‌, కోచ్‌, వ్యాగన్‌ పరిశ్రమల నిర్మాణానికి ప్రభుత్వం ఎంచుకున్న కేంద్రాలు పరిశీలిస్తే రైల్వే శాఖ మానసిక స్థితి గురించి సందేహాలు రాకపోవు. జమ్ము కాశ్మీర్‌లో రైలు బ్రిడ్జిలు, మణిపూర్‌లో డీజిల్‌ ఇంజన్లు తయారు చేసి దేశమంతటా పంపిణీ చేస్తామన్న మంత్రి ప్రకటన వెనక భారతదేశ భౌగోళిక పరిస్థితులు, దానికున్న పరిమితులు గురించిన అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరాఖండ్‌ కొన్ని సరిహద్దు ప్రాంతాలకు రోడ్డు నిర్మాణానికి కావల్సిన యంత్ర సామాగ్రిని తరలించాలంటే కనీసం ఆర్నెల్ల వ్యవధి అవసరం. అటువంటిది జమ్ము కాశ్మీర్‌లో తయారు చేసిన రైలు బ్రిడ్జి సామగ్రి దేశంలో మిగిలిన ప్రాంతాలకు చేరవేయటానికి ఎంత సమయం పడుతుంది ? అసలు జమ్ము కాశ్మీర్‌ నుండి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు మధ్య ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ ఎంత? అందులో వ్యాగన్‌లు తరలించగలిగిన నెట్‌వర్క్‌ ఎంత అన్నది పరిశీలిస్తే ఈ ప్రతిపాదనల హేతుబద్దతను ప్రశ్నించకుండా ఉండలేము. అదేవిధంగా మణిపూర్‌లో నిర్మించిన డీజిలు ఇంజన్లను కనీసం ఈశాన్యభారతంలోని ఏడు రాష్ట్రాలకు చేరవేయటానికే ఏళ్ల గడువు పడుతుంది. అటువంటిది మిగిలిన దేశానికి చేరవేయటానికి ఉన్న సాధనాల గురించి కూడా పరిశీలించకుండా ప్రాజెక్టు ప్రతిపాదనలు తయారు చేసిందీ ప్రభుత్వం. ఏతావాతా చెప్పాలంటే ఈ బడ్జెట్‌ అత్యంత అశ్రద్ధతో, అసమంజస ప్రతిపాదనలతో, వచ్చే సంవత్సరాల కోసం రూపొందించిన బడ్జెట్‌ తప్ప కనీసం రానున్న ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌ కాదు అన్నది స్పష్టంగా రూఢి అవుతోంది.

బడ్జెట్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం

"హల్లో ఆల్! టీవీ జీరో సమర్పిస్తున్న బడ్జెట్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. పదండి అసెంబ్లీ కెళ్ళి అక్కడున్న మా ప్రతినిధి భిక్షపతితో మాట్లాడుదాం. హల్లో భిక్షు! అసెంబ్లీలో ఏం జరుగుతోంది!"

"హల్లో...ఆ..హల్లో...."

"ఆ...హల్లొ! భిక్షు, నేను ఉల్లి వెంకట్, టీవీ జీరో స్టుడియో నుంచి...అసెంబ్లీలో ఏం జరుగుతోంది?"

"వెంకట్! రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు శ్రీ ఆనం రాంనారాయణ రెడ్డి గారు రాష్ట్ర బడ్జెట్ వివరాలను చదివేందుకు రాబోతున్నారు. ఎప్పుడూ గంభీరంగా, హుందాగా కనబడే రెడ్డిగారు ఈరోజు మరింత హుందాగా ఆఫీసు గదిలోకి అడుగుపెట్టడం మేము చూసాం. చాలా సాధారణమైన దుస్తులతో వచ్చారు."

"భిక్షు! సాధారణమైన దుస్తులు అన్నారు. అవేంటో మన ప్రేక్షకులకి వివరించగలరా?"

"వెంకట్! తెలుపు కలర్ సిల్కు చొక్కా, తెలుపు కలర్ రెమాండ్స్ ప్యాంటు, రెండు మూడు బంగారు ఉంగరాలు, ఒమేగా వాచు మొదలైనవి"

"థాంక్స్ భిక్షు! మీరు అసెంబ్లీలోకి వెళ్ళండి మేమూ మిమ్మల్ని ఫాలో అవుతాము"

**********

"వెంకట్! అసెంబ్లీలో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మన ఆర్థిక మంత్రి ఆనం రెడ్డి గారు తమ సిల్కు రెమాండ్స్ దుస్తుల్ని వదిలేసి తెల్ల కాటన్ పంచె, ఎర్ర చొక్కా, పసుపు తలపాగాతో భుజం మీద తంబూర మోసుకొని మైకు ముందుకు వచ్చారు. ఆయనకు ఎడంవైపు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, గులాబీ కలర్ పంచె మీద నలుపు చొక్కా వేసుకొని డప్పు పట్టుకొని నిలబడ్డారు. మరో వైపు గీతారెడ్దిగారు తామర మొగ్గలున్న కాషాయం కలర్ చీరలో డప్పు పట్టుకొని నిలబడున్నారు"

"అలాగా! అసలిదంతా దేనికి జరుగుతోంది భిక్షు?"

"ఆగండి వెంకట్! ఆనంగారేదో ఆడబోతున్నారు!"

ఆనం: "థా ఝంక తరికిట తరికిట థా"

నల్లారి & గీత: "ఆహా", "ఓహో"

ఆనం: "కనరా తింగరి తెలుగువాడా! అంకెల తీరులను!

నల్లారి & గీత: "తందాన తానా"

ఆనం: "ఒక్కటి పక్కన సున్నాలు పేర్చి, బడ్జెట్టు కూర్చేము"

నల్లారి & గీత: "తందాన తానా"

ఆనం: "కూర్చిన బడ్జెట్ కూర్చుని చెబితే బోరుగ ఉండేను"

నల్లారి & గీత: "తందాన తానా"

ఆనం: "బోరే కొడితే మీరంతా బలు గురకలు పెట్టేరు"

నల్లారి & గీత: "తందాన తానా"

ఆనం: "అందుకోసమే చిందులు వేస్తూ, వందలు వేల లక్షలు తెచ్చి, ఎలెక్షన్లలో వాగ్దానాలకు కలెక్షన్లతో కనెక్షనిచ్చి ఈ బడ్జెట్ తెచ్చాము"

నల్లారి & గీత: "తందానా...తందానా బల్ దేవ తందనానా"

ఆనం: "థా ఝంక తరికిట తరికిట థా...అయ్యలారా, అమ్మలారా! సోనియా మేడమ్ ఘనమైన ఆశీర్వాదాలతో, చచ్చి పరలోకములో ప్రజా సంక్షేమం చింతిస్తున్న వైయెస్సార్ ఆత్మ సాక్షిగా, మేము ప్రతిపాదిస్తున్నాము మరో లక్ష కోట్ల బడ్జెట్...ఈ బడ్జెట్ లోని అంశాలేవయ్యా అంటే... "

నల్లారి & గీత: "ఏవయ్యా!"

ఆనం: "బోధన ఫీజులు చెల్లించలేము"

నల్లారి & గీత: "లేము"

ఆనం: "చేనేత కార్మికులనాదుకోము"

నల్లారి & గీత: "కోము"

ఆనం: "బడుగు రైతుల బకాయిలన్నీ...."

నల్లారి & గీత: "అన్నీ..."

ఆనం: "మాఫీ చెయ్యలేము"

నల్లారి & గీత: "తందాన బల్ తానె తందన...తానె తందనానా"

**********

"వెంకట్! గట్టిగట్టివన్నీ గాలికి కొట్టుకుపోతే పుల్లిస్తరాకు గతేంటన్నట్టు ఆనంగారు, వారి వంతలు వంతులేసుకుని పాడుతున్నారు. ఈ "బుర్ర" క(వ్య)ధ ఇప్పట్లో ముగిసేట్టు లేదు. మన సాటిలైటు బిల్లు పెరక్కముందే ఈ ప్రసారాన్ని ఇంతటితో ముగిస్తే మేలు. జై హింద్!"

23, ఫిబ్రవరి 2011, బుధవారం

స్వతంత్ర భారత దేశాన్ని . . . . . . . . . .

నేత్తురోడ్చి, ఆత్మార్పణకావించుకుని ఎందరో వీరులు మనకు అందించినా ఈ స్వతంత్ర భారత దేశాన్ని ఎలాంటి నాయకులకు అందిస్తున్నాం!!

ప్రజారంజకమైన, సామాన్యులకి చేయుత నిచ్చే పధకాలు ప్రవేశపెట్టడం, వాటిని సక్రమంగా అమలు చేసేలా చూడటం.. ప్రజా సమస్యలు గురించి చ...ర్చించడం
నల్లధనాన్ని భారతదేశానికీ తిరిగి రప్పిచ్చడం, దానిని విద్య,వైద్యం, అన్ని మౌలిక అవసరాలకు, వెనకపడిన ప్రాంతాల అభివృద్ధికి వినియోగపడేలా చేయటం
ఇవి మీ నుండి అసిస్తున్నవి
ఒకరినొకరు తిట్టుకుంటూ అడ్డుగోలుగా సంపాదిస్తూ తన మీదకి కత్తి వచ్చినపుడు కుల,మత,ప్రాంతాలని అడుపెట్టుకుంటూ Divide and Rule అనుకునే నిచమైన రాజకీయవాదులు
..మసాల వార్తలే వ్యాపరమనుకునే మీడియా... అంత ప్రజలు గమనిస్తూనే వున్నారు.
గొప్ప ఉద్యమాలను స్వప్రయోజనాలకి వాడుతూ అమయుకులని బలి చేస్తూ పోతే మీకే ఘోరి కట్టగలరు

హైదరాబాదు అందరిదీ, ఎవరి అబ్బ సొమ్మూ కాదు.

హైదరాబాదు అందరిదీ, ఎవరి అబ్బ సొమ్మూ కాదు.
హైరరాబాద్ ఎవరిది అన్న వాదనకి చరిత్ర నుండి సాక్ష్యాలు
===============================
హైదరాబాదు కట్టి 400 ఏళ్ళు దాటింది అంటే సుమారు 1600 లలో
1600-1788 వరకూ నిజాం పాలన లో ఉన్న సర్కార్ జిల్లాల (కోస్తా ఆంధ...్ర జిల్లాలు) ప్రజలు.
1600-1800 వరకూ నిజాం పాలన లో ఉన్న దత్తమండలాల (రాయలసీమ జిల్లాలు) ప్రజలు
1600-1948 వరకూ నిజాం పాలన లో ఉన్న మరట్వాడ (మహారాష్ట్ర మరట్వాడా జిల్లాల) ప్రజలు
1600-1948 వరకూ నిజాం పాలన లో ఉన్న 4 కర్నాటక జిల్లాల ప్రజలు
1600-1948 వరకూ నిజాం పాలన లో ఉన్న తెలంగాణా జిల్లాల ప్రజలు
1948-1956 వరకూ భారత హైదరాబాదు ప్రావిడెన్సు ప్రజలు
1956-2011 వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు
వీళ్ళ అందరి డబ్బులూ ఉన్నాయి
1800-1948 వరకూ హైదరాబాద్ సంస్థాన సైనిక సాయంకోసం సర్కారు (కోస్తా ఆంధ్ర జిల్లాలు), దత్తమండలం(రాయలసీమ జిల్లాలు) ప్రాంతాలని బ్రిటిష్ వాళ్లకి అమ్మగా వచ్చిన డబ్బులూ ఉన్నాయి. ఈ డబ్బు ను హైదరాబ్ అభివృద్దికి వాడారు. హైదరాబాద్ ప్రతి ఇటుకలో ప్రతి ఆంధ్రుడి ముత్తాతల దగ్గర నుండి ఈ తరం వరకు ఉన్న వాళ్ళ సొమ్ము ఉంది.

హైదరాబాదు అందరిదీ, ఎవరి అబ్బ సొమ్మూ కాదు. తెలంగాణా వాళ్ళ అబ్బ సొత్తు అసలే కాదు, హైదరాబాద్ కావాలనుకుంటే కలిసిఉండాలి లేకపోతే శుభం.

ప్రతిరోజూ ఒక మంచిమాట

నాలుక కత్తిలాంటిది, ఎలాంటి రక్తపాతం లేకుండానే ఇది మనుషులను చంపివేయగలదు.



పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే , మనుషులు నాలుకలు కారణంగా చిక్కుల్లో పడతారు.



పగ తీర్చుకుంటే ఆరోజు మాత్రమే ఆనందం కలుగుతుంది. ఒకరోజు ఆనందం కోసం చిరకాలం కలిగే ఆనందాన్ని బలిపెట్టకూడదు.

ఓ యువకా మేలుకో, పుట్టుకతో వృద్ధుణ్ణి కానని చాటుకో

"వెళ్ళండి, దేశంలో ఎక్కడెక్కడ కరువు కాటకాలు సంభవించి దారిద్య్రం తాండవిస్తుందో, ఎక్కడైతే ప్రజలు కష్టాలు కన్నీళ్లతో బాధపడుతున్నారో మీరందరూ ఆయా చోట్లకు వెళ్ళండి. వాళ్ళకు చేయి అందించండి. కష్టాలను ఉపశమింపజేయండి. వారలనాదుకునేందుకు ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడండి. మహా అయితే ఆ ప్రయత్నంలో మరణించవచ్చు. చావు ఎప్పటికైనా తప్పదు. ప్రజలకు సేవ చేసే కర్తవ్యంలో చావడాన్ని మహదావకాశంగా స్వీకరించండి. భావితరాలకు ఆదర్శంగా నిలవండి. ఈ దేశ భవిష్యత్తు గురించిన ఆశలన్నీ యువకులైన మీపైనే ఉంచుతున్నాను" ఈ మాటలన్నదెవరో కాదు. నిరంతరం ప్రజల కోసం పరితపించిన మహా తాత్వికుడు స్వామి వివేకానందుడు.


ఈ గమనంలో యువకులదే ప్రధాన పాత్రగా ఉండాలని పూర్వపు నాయకులందరూ కాంక్షించారు. వివేకానందుడుకూడా ఒక దేశపు ఉన్నతి యువతపైనే ఆధారపడియుందని (What we want is muscles of iron and nerves of steel....& Arise, Awake and Stop not till the goal is reached....etc) బోధించాడు

ఆహార భద్రత అంటే చాలీ చాలని సరుకుల్ని తక్కువ రేట్లకు పంచి పేదరికాన్ని మరింత పెంచడమూ, పేదల్ని అవమానించడమా? రైతు భద్రతతో కూడిన ఉత్పాదన, నిల్వలు, పేదల కొనుగోలు శక్తీ పెంచడమా?

ఐరాస రూపొందించిన మానవాభివృద్ధి సూచికలో మన దేశం భూటాన్, లావోస్‌కన్నా వెనుకబడి ఉన్నది. కాని ఇదే దేశంలో ఫోర్బ్స్ పత్రిక జాబితాకెక్కిన 49 మంది శతకోటీశ్వరులు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది ప్రభుత్వ సంపదను ఉచితంగా అందుకున్నవారే. నిజానికి డబ్బు కొరత మన దేశానికి లేనేలేదు. ప్రస్తుత బిల్లుకు ఆహార భద్రత అని పేరు పెట్టామే కాని 'ఆహార హక్కు' అనలేదు.
"ప్రతిరంగంలోనూ చైనాను అధిగమించడమే మన టార్గెట్" అంటూ ఆడంభరంగా చెప్పుకునే మన నేతలు (వాస్థవానికి అత్యంత జనాభాగల దేశంగా తప్ప మరే విషయంలోనూ ఇప్పట్లో మనకది సాధ్యం కాదు) అదే చైనా జూన్ 1, 2009 నుండే "ఆహార భద్రతా చట్టాన్ని" అమలు చెయ్యడమేకాకుండా ఇప్పుడు దాన్ని మరింత మెరుగు పరిచి నాణ్యమైన "నూతన ఆహార భద్రతా ప్రమాణాల వ్యవస్థను" రూపొందించేందుకు ఆరోగ్యశాఖ, ఇతర ప్రభుత్వ సంస్థలతో కలిసి కృషి చేస్తోంది" అనే విషయం తెలియదనుకోవాలా?
ఆహార భద్రత అనే ఓపేరుగొప్ప కార్యక్రమం చేపట్టి తామేదో పేదల్ని ఉద్ధరించబోతున్నట్లు, ప్రపంచంలో ఇంతవరకు ఎవడూ పొడవనిది తామే ప్రధమంగా పొడవబోతున్నట్లు మొన్నటి కాంగ్రేసు ప్లీనరీలో "ఆహారాన్ని ఓ హక్కుగా ప్రజలకు అందించే దేశం ప్రపంచంలో మరొకటి ఉంటుందా?" అంటూ గడసరిగా ఆశ్చర్యాన్ని ప్రకటించి జనాల చెవుల్లో పబ్లిగ్గా పువ్వులు పెట్టాలని చూసిన ప్రణబ్ ముఖర్జీ గారికీ, వారి సోనియమ్మకూ ఈ విషయం తెలియదనుకోవాలా?? దాదాపు 22 దేశాలు ఆహార హక్కును అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు ఆహార హక్కును బ్రెజిల్ రాజ్యాంగం స్పష్టంగా గుర్తించింది. గత ఏడాది ఫిబ్రవరి 3న అక్కడి ఉభయ సభలూ బిల్లును ఆమోదించాక బ్రెజిల్లో రాజ్యాంగ సవరణను ఆమోదించారు. ఇప్పుడు అక్కడ ఆహార హక్కు రాజ్యాంగపరమైన మానవ హక్కుగా ఏర్పడింది. అదే విధంగా తగినంత ఆహారాన్ని పొందే హక్కును గౌరవించి, రక్షించి, నెరవేర్చాలనే స్పష్టమైన బాధ్యతను రాజ్యానికి కల్పించే అంతర్జాతీయ మానవహక్కుల చట్టాలపై కూడా బ్రెజిల్ సంతకాలు చేసి, ఆమోదించింది.

ఆమధ్య అమెరికా ప్రెసిడెంటెవడో ఇండియాలో పేదలక్కూడా బలవబట్టే (సంపాదన పెరగడమట!)& తెగతింటుండడంవల్లే ప్రపంచంలో ఆహార నిల్వలు తరిగిపోతున్నాయన్నప్పుడు మన నేతలు తెగ గింజుకున్నారు.
ఇప్పుడు మన ఘనతవహించిన యూపీయే పాలక ప్రభువులూ దాదాపు అదేవాగుడు మరోలా వాగారు.
ద్రవ్యోల్భణ కట్టడికై గురువారం నాడు ఉన్నతస్థాయి జుట్టుపీక్కొనే సమావేశంలో "వేగవంతమైన అభివృద్ధివల్ల(??) పేదల చేతుల్లోకూడా డబ్బులు ఉంటున్నాయనీ (ఇంకా నయం పేదలుకూడా డబ్బులెక్కువై స్విస్సు బ్యాంకుల్లో దాచుకుంటున్నారనలేదు!), ఫలితంగా ఆహార వినియోగం పెరిగి దరలు అదుపులో ఉండడంలేదని సూత్రీకరించారు.రోజుకు 11 రూపాయలు సంపాదించేవారు యుపిఎ ప్రభుత్వం దృష్టిలో పేదలు కారట. నిజంగా నేడు 330రూపాయలతో ఒక మనిషి నెలంతా జీవించగలగటమనేది సాధ్యమేనా?

జీవించే హక్కు వాస్తవరూపం దాల్చాలంటే ఆహార హక్కు ప్రాథమికావసరమని మన రాజ్యాంగంలోని 21వ అధికరణం చెబుతోంది. అందరికీ ఆహార భద్రతను హామీ ఇచ్చేందుకు చట్టబద్ధమైన ప్రాతిపదికను అందించే విధంగా జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేస్తామని 2009లో రాష్ట్రపతి పార్లమెంటులో చేసిన ప్రసంగంలో సూచించారు. పేదలకు నిర్దేశిత హక్కులతో ఆహారానికి చట్టబద్ధమైన గ్యారంటీ ఇవ్వడం అనేది దేశంలో ఆహారం, పౌష్టికత భద్రతను హామీ ఇచ్చే దిశలో ఒక ముఖ్యమైన చర్యగా భావించారు.
ఈ కొత్త బిల్లు ప్రకారం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నెలకు 25 కిలోల బియ్యం లేదా గోధుమలు కేజీ 3 రూపాయల వంతున సరఫరా చేయాలి. ప్రభుత్వం గుర్తించిన పేద కుటుంబాలకు నిర్దేశించిన విధంగా ఆహార ధాన్యాలు సరఫరా చేయడంలో విఫలమైనట్లయితే ఆ కుటుంబాలు 'ఆహార భద్రతా అలవెన్స్‌' నగదు రూపంలో పొందే అవకాశం ఆహార భద్రతా చట్టం కల్పిస్తోంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ(Targeted Public Distribution System or TPDS) దారిద్య్ర రేఖ(బిపిఎల్)కు దిగువన ఉన్న జనాభాకు సబ్సిడీపై ఆహార ధాన్యాలను అందించాల్సి ఉన్నప్పటికీ ఆ వ్యవస్థలో ఉన్న అనేక లోపాలూ, అవినీతి వల్లా, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లా ఆ లక్ష్యాలను చేరుకోలేకపోతోంది. బహిరంగ మార్కెట్లో 15 నుండి 20 రూపాయల వరకూ ఉన్న బియ్యాన్ని(రెండో రకం)2రూపాయలకే అందించడంవల్ల చాలామంది పేదలకు ఉపయోగకరంగానే ఉన్నా, ఎందరో అనర్హులు (కొందరు మధ్య, ఉన్నత స్థాయి వర్గాలకు కూడా తెల్ల రేషన్ కార్డులున్నాయి), కొందరు మధ్య తరగతి, పేద వర్గాలవారుకూడా ఈ బియ్యాన్ని మార్కెట్లో 8 నుండి 10రూపాయలకు అమ్ముకుంటున్నారనేది బహిరంగ రహస్యం. దీన్ని అరికట్టడం ప్రభుత్వాలకు చేతకాదని తేలిపోయినందున అంత్యోదయ వర్గాలకుతప్ప మిగతా వర్గాలకు పీడీ్ఎస్ ను పూర్తిగా రద్దుపరచి వారికి నగదు బదిలీ పధకంలాంటివాటిద్వారా సామాజిక రక్షణ కల్పించి వారికి కావలిసిన సరకులేవో వారే (మార్కెట్ ధరలకే) కొనుక్కునేలా చేయడం తద్వారా పీడీ్ఎస్ సరకుల నాణ్యత బాగాలేనందున అవి అమ్ముకొని మంచి బియ్యాన్ని కొనుక్కుంటున్నామనే అపవాదునుండి తప్పుకోవచ్చేమో? అయితే ఇందులోనూ అవే ఇబ్బందులు-అంటే అర్హుల గుర్తింపు, కట్టుదిట్టమైన వ్యవస్థలేకపోవడం వంటివాటివల్ల ఇదికూడా అనర్హుల జేబుల్లోకి చేరడం తద్వారా మరింతమంది సోమరుల్ని తయారు చెయ్యడం జరగొచ్చన్న వాదనలు లేకపోలేదు. అయితే వస్తు సబ్సిడీల ద్వారా అనర్హులకూ లబ్ది చేకూర్చేబదులు బహిరంగ మార్కెట్‌ను ప్రోత్సహించి పేదలకు నగదు సహాయం చెయ్యడమనేది నిజమైన ప్రత్యామ్నాయమని నేను నమ్ముతాను.రైతు సేద్యానికి వాడే ట్రాక్టర్లకిచ్చే డీజిల్ సబ్సిడీ పేరుతో రోల్స్రాయిస్ కార్లలో తిరిగేవాడిక్కూడ సబ్సిడీపై డీజిల్ ఇచ్చే దుష్ట వ్యవస్థను ప్రక్షాలించి గ్రామస్థాయిలో ట్రాక్టర్లుండే రైతన్నలందరికీ నేరుగా డీజిల్ సబ్సిడీ (నగదు ౠపేణా) ఇవ్వండి. ఇదే సూత్రం గ్యాస్ సిలిండర్‌కూ వర్తిస్తుంది. పేదోడికోసమని సిలిండర్ ధర పెంచం. కానీ పెద్దోడు నెలకు ఒకటి వాడితే పేదోడు మూడునాలుగు నెలలకు ఒకటి వాడతాడు. 100లో ఉండే 60మంది ఉండే పేదోళ్ళు సంవత్సరానికి (60X3=180) సిలిండర్లు వాడితే పెద్దోళ్ళు (40X12X1=240) సిలిండర్లు వాడతారు. ఒక్కో సిలిండరుపై పెద్దోళ్ళకు 200 ఎక్కువ వడ్డించి పేదోడికి ఇంకో వంద తగ్గించినా (2400X200-180X100= 10000) ఇంకా 10000 ప్రభుత్వానికి లాభమే:)
దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం తరహాలో స్వయం ప్రతిపత్తి గల కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు/అనర్హులు అవకతవకలకు పాల్పడకుండా అన్ని బిపిఎల్‌ కుటుంబాలకూ ఆహార ధాన్యాలు కేటాయించగలుగుతాయి.

స్వతంత్రతంటే తెలియని స్వాతంత్ర్య బానిసలుగా బ్రతికేద్దాం!

1) ఓటు కోసమే నోటి మాటలు,
నేటి వరకే ఈ నీటిమూటలు.

ప్రజధనం కొల్లగోట్టే ముఠాదొంగలు,
ప్రజలకేమో చేస్తారు ఒంగిదండాలు.

అతివినయం చూపించే రాబంధులు,
పదవీ నియామకం కోసమేగా ఈ పకడ్బందీలు.

రోజుకోక పుట్టగోడుగులా పార్టీ జెండాలు,
ప్రజాసంపధ కాజేయడామే వారి ఎజెండలు.

పదవి చేతికిప్పించే ప్రజలు అమాయకులు,
పెదవిమాట దాటేసే రాజకీయ నాయకులు.

మార్పుకోసమే ఎదురుచూసే పిచ్చిజనాలు,
ఏనాటికి జరగదదని తెలుసుకోలేరు పచ్చినిజాలు.
2) నిరుపేదలను రోడ్డున వదిలేయటమే మేము నేర్చుకున్న మానవత్వం,
నిస్సహాయులని చూసి నవ్వుకోవటం మేము నేర్చుకున్న మా'నవత్వం'!

కులాల చిచ్చులు రేపటం మేము నేర్చుకున్న మానవత్వం,
మనుషులని చంపటం మేము నేర్చుకున్న మా'నవత్వం'!

ఐకమత్యాన్ని ఆచరించకపోవటం మేము నేర్చుకున్న మానవత్వం,
ఒకరిని చంపైనా మేము బాగుపడాలనుకోవటం మేము నేర్చుకున్న మా'నవత్వం'!

మంచిని మరచి వంచన చేయటమే మేము నేర్చుకున్న మానవత్వం,
మా దేశం నేర్పిన పాఠం ఇదే, మా మనుషులు నడిచే బాట ఇదే?!

ప్రేమను మరచి,స్వార్దంతో బతకటమే మాకు తెలిసిన మానవత్వం,
ఇదే మేము నేర్చుకున్న మానవత్వం, మా నవతకు నేర్పుతున్న మా'నవత్వం'?!

3) బ్రతికేద్దాం... బ్రతికేద్దాం...
మనకెందుకులే అని బ్రతికేద్దాం!
మానవతను వదిలేద్దాం.....
బ్రతుకు హీనమైపోతున్నా, భవిత పాడైపోతున్నా,
ప్రజలు చచ్చిపోతున్నా,ప్రగతి పతనమవుతున్నా,
బ్రతికేద్దాం... బ్రతికేద్దాం!!

రాష్ట్రం రగిలిపోతున్నా, బాంబులు పేలిపోతున్నా
హింస రేగిపోతున్నా, ధరలు మండిపోతున్నా,
బ్రతికేద్దాం... బ్రతికేద్దాం!!

సిగ్గులేక బ్రతుకేద్దాం, గోడమీది పిల్లిలా వ్యవహరిద్దాం,
మార్పు రాలేదని బాధపడదాం, ఎదుటివారి మీద నిందలేద్దాం,
మనం మాత్రం మారక్కర్లేదని సరిపెట్టుకుందాం!

బ్రతికేద్దాం... బ్రతికేద్దాం....
బ్రతుకలేక బ్రతుకీడుస్తూ బ్రతికేద్దాం,
స్వతంత్రమంటే ఏంటో తెలియని స్వాతంత్ర్య బానిసలుగా బ్రతికేద్దాం!!

ప్రభుత్వమునకు మంగళాశాసనము-అథర్వణవేదము- దీనికి మన నాయకులెలా భాష్యం చెబుతున్నారో చూడండి

ఓ ప్రజాపాలకా! నీవు ప్రజలచే ఎన్నుకొనబడిన సత్యమైన పాలకుడవుగా ప్రవర్తింపుము.దివ్యతేజ స్సంపన్నుడవై ప్రకాశింపుము.నీవు ప్రజల ఆపదలను తొలగించి సన్మార్గమున అభీష్టసిద్ధి నందునట్లు నడిపింపుము.నీకు ప్రజలందరు మోకరిల్లి నమస్కరింతురు.దేవతలు అదృశ్యముగ నిన్ను అనుగ్రహింతురు. న్యాయము-దయ నీకు పరమ ధర్మములు.సంపదను ప్రజాహితమునకై వినియోగింపుము.సద్వర్తనమే నీ కీర్తికి బాట. దృఢమైన దయగల పాలకుడుగ పది కాలములు జీవింపుము. అందరితో కీర్తిని పంచుకొని ఆర్జింపుము.ఆనందింపుము. అహంకారము,అధికారమదము నీ దరిచేరకుండుగాక. (అధర్వణ వేదము-3-4-2)

మరి మన నాయకుడు దీనికి తన భాష్యం ఎలా చెబుతున్నాడో చూద్దాం

నేను పేరుకే ప్రజలచే ఎన్నుకోబడ్డాను కానీ నావెనుక అండగా EVMలున్నాయి తెలుసుగా.అక్రమార్క స్సంపన్నుడనై ప్రకాశిస్తా.ప్రజలు ఒకవేళ పొరపాటున సుఖసంతోషాలతో ఉన్నా వారికి లేని ఆపదలను సృష్టించి అంటే వేర్పాటువాదాలు,మతఘర్షణలు లాంటివి కలిగించి ఇబ్బందుల పాలుజేస్తా.సన్మార్గములో నడిచే వాళ్ళను కూడా పెళ్ళికి ముందు అది తప్పుకాదు ఇది తప్పుకాదు అని న్యాయస్థానాలతో తీర్పులిప్పించి వాళ్ళను చెడిపోయేటట్లు తయారుచేస్తా.ప్రజలందరినీ భయకంపితులనుజేసి నాకు మోకరిల్లేటట్లు చేస్తా.సారావ్యాపారాలు చేస్తూ దేవాలయాల ధర్మకర్తగా దేవతలనే ఓ ఆటాడిస్తా.వాళ్ళు చచ్చినట్లు నన్ననుగ్రహించేటట్లు చేసుకుంటా. అన్యాయము-కాఠిన్యము నాకు పరమ ధర్మములు.దేశసంపదను నా కుటుంబహితమునకు మాత్రమే వినియోగిస్తా.దుర్వర్తనమే నా కీర్తికి రాజమార్గం.దృఢమైన కఠిన హృదయము గల పాలకుడుగా పది కాలాలు జీవిస్తా. సహ మంత్రులందరితో కీర్తిని పంచుకొంటా. ఆనందిస్తా.అహంకారము, అధికారమదమే ఎల్లప్పుడూ నా సుగుణాలుగా భాసిల్లునట్లు చేసుకుంటా.

ఆంధ్రా సీమలో మనదే హవా

నాన్న బిక్ష
నా దయా దాక్షిణ్యం అని
దీక్షల మీద దీక్షలు చేసి
హైదరాబాదులో ఏడురోజుల దీక్ష సెట్టు వేసి
బ్యాక్ గ్రౌండులో
ఆంధ్రా సీమలో మనదే హవా
అనే సర్వే పాట వినిపించినా
వినిపించుకొనే నాధుడు లేదు
జనం సొమ్ము తిన్నాడనే ఫీలింగో ఏమో
అయ్యోపాపం మూడు రోజులుగా తినడం లేదు
అనే జాలి కూడా కలగడం లేదు జనాలకు

20, ఫిబ్రవరి 2011, ఆదివారం

ప్రతిరోజూ ఒక మంచి మాట

రాజకీయాలు అంత అప్రతిష్టపాలైన వ్యాపారం కానే కాదు. కానీ ప్రతిష్టలేని వ్యక్తులే దాన్ని అలా తయారు చేస్తారు.

ఏమీ తెలియనప్పుడు మౌనంగా ఉండాలి. అలాగే అన్నీ తెలిసినప్పుడు కూడా.


మీకు కాలం అనుకూలంగా లేనప్పుడు, మీరే కాలానికి అనుకూలంగా మెలగండి.

త్రాగుబోతులు

త్రాగండిరా! త్రాగి తూలండిరా!తూలి తూలి ఎప్పుడో ఒకప్పుడు చావండిరా! నువ్వు చస్తే ప్రభుత్వానికేమి బాధరా?
బాధంతా నిన్ను నమ్ముకున్న నీ తల్లిదండ్రులదీ,నీ పైన ఆధారపడ్డ నీ భార్యాబిడ్డలదే గానీ నీలాంటివాళ్ళ త్రాగుడుతో
వచ్చే ఆదాయంతో నడిపే ఈ పనికిమాలిన ప్రభుత్వానిది కాదురా!

ప్రపంచదేశాలు మన భారతీయ సంస్కృతి,సంస్కారాలు చాలా గొప్పవని భావిస్తూ మన సంస్కృతికి నమస్కరిస్తూ గౌరవిస్తుండగా మీరేమో ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ,మత్తులో మునుగుతూ మీ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటూ ఇంటిలోని వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు.

ప్రజలకు విద్య,ఆరోగ్యం,ఉపాధి అందించాల్సిన ప్రభుత్వం ప్రజల కష్టార్జితంపై,వారి వ్యసనాలపై వచ్చే ఆదాయంతో ప్రభుత్వాన్ని
నడపడం ఎంత సిగ్గుచేటు,ఇలాంటి ప్రభుత్వంలో బ్రతులీడ్చడం మనం చేసుకున్న దౌర్భాగ్యం.

ఈమధ్య త్రాగి బండి నడుపుతూ క్రిందపడి ఆస్పత్రి పాలయిన స్నేహితుని పరిస్థితి చూసి నా ఆవేదన ఇది.

నూటికి తొంభై శాతం ప్రమాదాలు త్రాగుడు వల్లే జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదేమో! సాయంత్రం ఆరయిందంటే
చాలు మందు షాపుల దగ్గర చూడాలి కోలాహలం.ఏ గుడి గోపురాల్లో కూడా ఉండరేమో అంత జనం. ఇంతకు ముందు
గుట్టుగా త్రాగేవారు ఇప్పుడంతా బహిరంగమే.త్రాగడమే ఓ గొప్ప అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి.ఎప్పుడు మారునో ఈ పరిస్థితి?

17, ఫిబ్రవరి 2011, గురువారం

గవర్నరు గారూ, వాళ్ళ దౌర్జన్యాలు చూసారు కదా..!

గవర్నరు గారూ,
ఏనాడూ జరగని సంఘటనలు సభలోనూ బయటా జరిగాయి. ఒక శాసనసభ్యుడికే రక్షణ లేకుండా పోయింది. ప్రజాస్వామ్యమంటే నచ్చని కొందరి కారణంగా ఇవ్వాళ స్వేచ్ఛకు విఘాతం ఏర్పడింది. స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెల్లడించే ఒక గౌరవనీయ సభ్యునికి, తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అవమానం జరిగింది. ’మేము చెప్పినదే నిజం, మేము చెప్పేదే అందరూ వినాలి, అవతలి పక్షం మాటలను వినం, విననివ్వం, అసలు అవతలి వారిని మాట్టాడనివ్వం’ అనే ధోరణి గల నియంతల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.

ఇవ్వాళ సభలోను, బయటా జరిగిన ఏ సంఘటన కూడా సభకు గౌరవాన్నివ్వదు. మనకు ప్రజాస్వామ్యమున్నదనే స్పృహనూ కలిగించదు.

1. సభలో గవర్నరు ప్రసంగం చేస్తూండగా నిరసనలు తెలపడం మామూలే. గవర్నరు దగ్గర్నుంచి ప్రసంగం కాగితాలు లాగేసుకోడం కూడా విన్నాం. గవర్నరు మైకును ఇలా గతంలో కూడా లాగేసుకున్నారేమో తెలవదు. అయితే గవర్నరు మాట్టాడుతూండగా వెనక్కి నక్కినక్కి వెళ్ళి ఆయన కుర్చీ లాగిపడెయ్యడం, ఆయన మీదకు దాడికి పోవడం ఎక్కడైనా చూసారా? సభలోనే, గవర్నరుకే ఇట్టా జరిగిందంటే.. ఇక బయట పరిస్థితి ఎట్టా ఉండబోతోంది?
2. ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇందుకేనా మనల్ని ప్రజలు ఎన్నుకున్నది? అంటూ ఆవేదన చెందిన జయప్రకాశ్ నారాయణ పై చేసిన దాడి చూసారు కదా? సభ ఆవరణలోనే, ఒక శాసనసభ్యుడిపై, మరొక సభ్యుడి అనుచరుడే, ఈ దాడికి పాలబడ్డాడు! వాళ్ళ దుశ్చర్యలను నిరసిస్తే వాళ్ళు చేసిన నిర్వాకం ఇది. బైట పరిస్థితి ఎలా ఉండబోతోంది?
3. ’కొట్టుండిరా ఆణ్ణి’ అని రెచ్చగొట్టి అనుచరుల చేత కొట్టించిన నాయకుణ్ణి, రెచ్చగొడుతూండగా టీవీల్లో చూసాం. ఇలాంటి నాయకుల నుండి ప్రజాస్వామ్యానికి రక్షణ లేదు, శాసనసభ్యుడికి దిక్కు లేదు.., మరి మామూలు జనం గతేంటి?
4. సంఘటనను టీవీల్లో చూసాక కూడా, చర్చల్లో పాల్గొని అడ్డగోలుగా వాదిస్తున్నారు తెరాస నాయకులు. ఒకాయన, ’అబ్బే అసలు కొట్టనే లేదు’ అంటూ పచ్చి అబద్ధం చెప్పాడు. ఆ కొట్టేవాడి వెనకే ఉన్నా డితగాడు. సరే, వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పుకున్నా చెప్పుకోనీండి, విచారణలో నిజాలు ఎలాగూ తేలతాయి. అయితే కొందరు తెరాస నాయకులు మరీ భయంకరమైన వాదన వినిపిస్తున్నారు.. జేపీ తన ఇష్టం వచ్చినప్పుడు మాట్టాడి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాడు, తెలంగాణ ప్రజల మనోభావాలను అవమానపరచాడు, అందుచేతే దాడి చేసారు అంటూ దుర్మార్గంగా మాట్టాడుతున్నారు. విషయాన్ని దారి మళ్ళిస్తున్నారు. వీళ్ళు తప్పుడు పనులు చేస్తూంటే జేపీ వాళ్ళ తప్పులు ఎత్తి చూపించాడు. దుష్టుడికి వాడి దౌష్ట్యాన్ని విమర్సిస్తే నచ్చదు, ఎదురు తిరిగి వాదిస్తాడు. కానీ తమను విమర్శిస్తే తెలంగాణ ప్రజలను విమర్శించినట్టే అంటూ ఈ దౌర్జన్యకారులు చెబుతున్నారు. ప్రజల నోళ్ళు నొక్కేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో మీ ప్రభుత్వం శాంతి భద్రతలను నియంత్రించడంలో కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. ప్రభుత్వపు పనితీరు చూస్తూంటే ఆ శక్తి ఈ ప్రభుత్వానికి ఉందనే నమ్మకం కలగడం లేదు. ప్రజలకు ఆ నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మీరు ముఖ్యమంత్రిని ఆదేశించాల్సి ఉందని విజ్ఞప్తి.

తూలుతున్న ఉద్యమం

తాగుబోతు నాయకత్వంలో
దహనాలు చేయడం
ప్రజా ప్రతినిధులను కొట్టడం
పైసలివ్వకుండా ప్రయాణాలు చేయడం
రోజుకో ఎలక్షన్ పెట్టుకోవడం
ఇంటిల్లిపాది పాదుకలు మొయ్యడం
కిరోసిన్ ఆత్మహత్యలు
పరీక్షలు ఎగ్గోట్టడాలతో
ఉద్యమం తూలుతోంది.

ప్రతిరోజూ ఒక మంచిమాట

కోపం మరో వ్యక్తికి హానికలిగించేందుకు ముందే నీకు హాని కలుగజేస్తుంది.

ప్రారంభంలో ప్రతీకారం తృప్తిగా ,తియ్యగా ఉంటుంది. ముందుకెళ్ళినకొద్దీ అది ఎదురుదెబ్బ కొడుతూ, వగరెక్కి విషతుల్యమవుతుంది.


పిల్లలకు తల్లిదండ్రులిచ్చే అతిపెద్ద బహుమానామేమిటంటే వారిద్దరూ అన్యోన్యంగా ఉండడమే.

16, ఫిబ్రవరి 2011, బుధవారం

ఒక మంచిమాట

చదువుకున్నవారందరూ మానవాళి గురించి ఆలోచిస్తారు. కానీ తమ పొరుగువారిని మాత్రం వారు ద్వేషిస్తారు.

మనకి ఎవరైనా అసహనం కలిగించినప్పుడు,వెంటనే ప్రతీకారదృష్టితో ఆలోచించకుండా ఎదుటి వ్యక్తివైపు నుంచి కూడా ఆలోచించిచూస్తే,మన మనస్సులో కొత్త మార్పు రావచ్చు.మాత్రలూ,మంత్రాలూ వాడటం కాకుండా,‘నాకు అసహనం ఎందుకు కలిగింది’ అని పరిశీలించుకుని మన ఆలోచన ధోరణిని అవగాహన చేసుకోగలిగితే,అసహనం దానంతటదే అంతరించిపోతుంది

ఉషోదయం

మబ్బుతో మబ్బు పోటీపడ్డట్టు కొత్తందాలు
పొద్దులో ముద్దబంతి పూవల్లే సూరీడు చందాలు
ఎద్దుల మెడలో గంటల కూనిరాగాలు
అబ్బురపరచెడి ఎన్నో ఉదయాలు
కుంచెతో అద్దిన చేయికి వందనాలు

* * * * * * * * * * * * * * *

ఏటి మలుపులో మావ పిలుపులు
కొండ దాపున కోయిల అలుకలు
గూటి పడవలో కన్నియ కలలు
ఊరు నిదురకి పిట్టల జోలలు
ఉదయరాగాల ఉషోదయాలు

* * * * * * * * * * * * * * *

ఆత్మబంధువా, అభ్యర్థన మన్నించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

అలో లచ్మనా! ఓయ్ నేన్రెడీ!

నాటి లక్ష్మణుడు కష్టాల్లో రాముని వెంటే ఉన్నాడు
నేటి లక్ష్మణుడు భారత క్రికెట్టును ఓటమి కష్టాలనుంచి కాపాడడానికి ఎప్పుడూ నేనుంటానంటున్నాడు .మరీ ఆ లక్ష్మణుడుకి ప్రసంశలు ఎవి?

15, ఫిబ్రవరి 2011, మంగళవారం

ప్రతిరోజూ ఒక మంచిమాట

మనల్ని ఇతరులు ఎలా గౌరవించాలని వాంఛిస్తామో , అదే గౌరవం ఇతరులపట్ల చూపడాన్ని సభ్యత అంటాము

ఖర్చులకోసం వెంటవస్తున్న వారితో

తాత కష్టార్జితాన్ని
నాన్న పాదయాత్ర చేసి కడుక్కొని
కొడుక్కు కొరత రాకుండా
వెనకేసి వెళ్ళిపోయాడు

నాన్న పాదయాత్ర చేసిన కష్టార్జితం కోసం
తన కష్టార్జితాన్ని వదిలించుకోవడం
ఎలాగో తెలీక

ఖర్చులకోసం వెంటవస్తున్న వారితో
తిరునాళ్ళు జరిపిస్తూ
తిప్పలు పడుతున్నాడు

పోయినోడి చిత్త సుద్ధి

ధన యజ్ఞం అజెండా ప్రకారం
కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చి
కమీషన్లు నొక్కేసి
ఖాళీ కాలువలు చూపి
కాలం చేసాడు
కానీ అడ్వాన్సులకు కావాల్సిన డబ్బులకోసం
గ్రామ గ్రామానికి బెల్టులు పెట్టి
మద్యాన్ని పారించిన యజ్ఞాన్ని
ఆయన సుపుత్రుడు
జల యజ్ఞంగా జనాలకు చెబుతూ
అర్ధాంతరంగా ఆగిపోతోందని ఆవేశ పడుతూ
పాదయాత్రలు చేస్తున్న తీరు చూస్తుంటే
‘గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది’ అనే
గాఢ నమ్మకంతో
గద్దె కోసం కమీషన్ల ఖర్చుతో చేస్తున్న
జాతరను చూసి జాతి మురిసిపోవునా?

పోయినోడి చిత్త సుద్ధి

ధన యజ్ఞం అజెండా ప్రకారం
కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చి
కమీషన్లు నొక్కేసి
ఖాళీ కాలువలు చూపి
కాలం చేసాడు
కానీ అడ్వాన్సులకు కావాల్సిన డబ్బులకోసం
గ్రామ గ్రామానికి బెల్టులు పెట్టి
మద్యాన్ని పారించిన యజ్ఞాన్ని
ఆయన సుపుత్రుడు
జల యజ్ఞంగా జనాలకు చెబుతూ
అర్ధాంతరంగా ఆగిపోతోందని ఆవేశ పడుతూ
పాదయాత్రలు చేస్తున్న తీరు చూస్తుంటే
‘గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది’ అనే
గాఢ నమ్మకంతో
గద్దె కోసం కమీషన్ల ఖర్చుతో చేస్తున్న
జాతరను చూసి జాతి మురిసిపోవునా?

నేను సైతం కలలు గన్నాను

అబ్దుల్ కలాం కనమన్నట్టు
అద్భుతమైన కలలో తేలి
నేను సైతం కలలు గన్నాను
తేరగా తెరవేలుపుకు కుర్చీ వచ్చేస్తుందని

సినిమా ఠాగూర్ చెప్పినట్లు
నేను సైతం అంటూ
తెరవేలుపుతో పాటు వచ్చాను

తెగితే వెంట్రుకే కదా అని
అరంగేట్రం అయితే అద్భుతం

ఆ తరువాత ‘చేతి’ కి
వ్యతిరేకంగా పనిచేయడానికి
చేతి చమురు చాల వదిలింది

టికెట్టుకు పోతే టీత్ బయటబెట్టి నవ్వి
డబ్బులు తియ్యమంటే
అరువిప్పిచ్చుకొని
అరవిందు దగ్గర టికెట్టు తీసుకొని
అయిన వాళ్ళ దగ్గర అవమానాలు పొంది
ఓటర్ల చేతిలో అన్యాయం చెయ్యబడినా

పార్టీకి భగ్న ప్రేమికుడిగా భంగపడుతూ
భవిష్యత్ నాయకుడిగా
కలలను కొనసాగిస్తుంటే
హస్తిన రాయభారంతో
బ్రాంతి నుండి బయటపడి
బాధపడుతున్నా

అధ్యక్షులకైతే ఆ సముద్రంలో
ఏదో ఒక పదవి వస్తుంది
రెండిట్లో ఒకటోడి ఒక చోట
నాయకుడనిపించుకొన్నాడు మరి

గెలిచిన మిగితా వాళ్ళు కూడా
మిణుకు మిణుకు మనే ఆశలతో
మేము సైతం అంటూ
సముద్రంలో దూకడానికి సంసిద్దమయ్యారు

ఓడిన నేను ఇప్పుడు
ఓండ్ర పెట్టి ఒనగూర్చుకోనేది ఏముంది?

రక్త దానం చేసి చేసి మిగిలి ఉన్న
రక్తాన్ని మరగబెట్టుకోవడం ఎందుకు?

రేపటి తరం ధీరులకు రక్త వారధులు కట్టి
రిక్త హస్తాలతో నిలిచి
కుటుంబాలను కునారిల్లించుకోకండి అనే
సలహా ఇవ్వడం తప్ప చేసేదేముంది?

9, ఫిబ్రవరి 2011, బుధవారం

ఆత్మీయపు తెప్పను తగలబెట్టెస్తున్నాడు....

నగిషీ కొసం ప్రాకులాడే మానవుడు

అందని చుక్కలవైపు చూపును నిలుపుతున్నాడు ...

కళ్ళముందు కదలాడే కటిక నిజాలను చూడకుండా...

గాలి మేడల సౌదాలలొ గుడ్దివాడై జీవిస్తున్నాడు.....

జీవన నాడులైన అప్యాయతలను వదిలి....

స్వర్గాన్ని అందుకొవాలనే ప్రేరాశతొ నింగికి నిచ్చేనలేస్తున్నాడు....

అనురాగల విలువ మరిచి... అనుబంధపు పేగు తెంచి....

సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలలా మారుతున్నాడు...

మమకారాలను అదృష్యం చేస్తూ.....

మానవ ఇతిహసాని మరిపింపచేసే ఈ చదువు సంష్కారాలేందుకు......!

కరుణను కాల్చే మతాన్ని ఆస్వాదిస్తూ....

గుండేను దయ లేని బండగా మార్చే కులాలతొ నిండిన ఈ సారం లేని సాంప్రదాయాలేందుకు....!

బుణం తీర్చుకొనే తరుణం వస్తే పురాతన జీవితాన్ని బూడిద చేస్తున్నాడు...

ఆర్బాటపు ఏరుకు చెరుకొగానే.... ఆత్మీయపు తెప్పను తగలబెట్టెస్తున్నాడు....

ఎప్పుడు మారుతుంది ఈ సమాజం....మనసున్న మనిషిగా అభిలషిస్తున్నాను.....

నీ ప్రతి ఉదయంలొ వేకువ నేను...

నీ కనులకు కాంతి నేను....

నీ కలలను కన్నది నేను....

నీ కష్టమైన... నష్టమైన... మొత్తం నేను....

నీ చిరునవ్వు.... దిగులు... నేను....

నీ ప్రతి ఉదయంలొ వేకువ నేను...

నీ ప్రతి నిమిషం తొడై నిలిచేది నేను....

నువ్వు కన్పించక పొతే బెంగతొ వెతికేది నేను...

నీ కన్నిటిని తుడిచేది నేను....

నువ్వు గెలిచిన విజయం నేను...

నీ అలసట తీర్చేది నేను....

నీ మెలుకువకు దీపం నేను....

నిన్ను అడుగడుగున నడిపించేది నేనని మరువకు మిత్రమా.....

యువత వేతుకులాట

దేనికొసం ఈ యువత వేతుకులాట...!?

అందం కొసమా....?

తగ్గుతున్న లావణ్యం కొసమా...?

కానే కాదు....

మారని తమ బ్రతుకుల ప్రక్షాళన కొసం....!

బద్దలైంది మీ బద్దకాల అద్దమే....మీలొ రగులుతున్న కసి కాదు.....

ఎదురు చూస్తుంది విజయమే ...గేలిచేస్తున్న అపజయం కాదు....

శకాలాల నిండా మీ ఆత్మవిశ్వాసమే....దెబ్బతిన్న మీ నీరాశలు కాదు....

మగత నిద్రలొ నిప్పులు లేవు... మరిగే గుండెలొ అరుపులు తప్పా...!

మనుగడ కొండపై రుధిర జ్వాలలు లేవు...జీవం చిందుస్తున్నా సింధూరాలు తప్పా...!

ఆవిరవుతుంది ఆత్మసాక్షి కాదు.... మది వీడని ఓటమి కలవరం తప్పా....!

రెప్పల తెరల్లొ చీకటి లేదు....తూర్పు రేఖల సూర్యతేజం తప్పా....!

నీరాశతొ నిండిన కళ్ళూను కడిగి చూడు....పరుగులు తీసే లక్ష్యం ఉంది....

మరిగే చెమట చుక్కను తుడిచి చూడు....చేరువయ్యే మార్గం చెంతనే ఉంది....

అత్మసైర్ధ్యం

గెలుపు కొసం కదిలే నీ పాదాలకు సందేహపు అడ్డుకట్ట వేయ్యకు...

నదిలా పరుగులు తీసే నీ ఆశయపు పయనాన్ని నిరాశతొ ఆనకట్ట కట్టకు...

నీ కలల వెనుక కదిలే ఆశల ఆరాటాన్ని అలసిపొనివ్వకు....

క్షణాలలొ కుదుటపడే ఆవేశాన్ని ఆరని చితిగా మార్చకు....

కృంగదీస్తున్న కష్టాలపై కసిరగలాలి....

అడుగంటుతున్న నీ జీవితం ... వసంతంతొ చిగురించాలి....

బ్రతుకును గేలి చేస్తున్న ప్రతి అపజయం....

నీ పట్టుదల పిడికిలిలొ బందికావాలి....

విర్రవిగుతూ విరుచుకుపడే అవమానాలు...

నీ ఆత్మవిశ్వాసం ముందు విలవిలబొవాలి.....

నీ చేదు జ్ఞాపకమేదయినా అనుభవాన్నిచ్చే ఓదార్పుగా నిలవాలి....

పసితనం దాటిన నీ ప్రాయం... సమరానికి స్వాగతమవ్వాలి...

పసిడితనంతొ నిండిన నీ యువ్వనం....ప్రయత్నంలొ ఎదురైన పరాజయాలను ఆస్వాదించాలి.....

రగిలే శ్వాసే నడిచే నీ గమ్యాన్ని చేర్చే దిశగా మారాలి..

కంటిదడిలొ నీ కన్నీరు ఇంకిపొయినా...బ్రతుకు ఓడిలొ నవ్వులు విరియాలి ...

కలగనే నీ సౌదమేదయినా దైర్యాన్ని పునాదిగా కట్టాలి...

యదను తాకే గాయాలు ఏవైనా... మదిని పుసే చైత్రాలవ్వాలి...

ఎదురుచూసే కాలలు ఏన్నతైనేంటి.....విజయాన్ని ఆస్వాదించే ఆ ఒక్కరొజు కావాలి....

వెలుగుగా మారే వేకులేన్నుంటేనేం... అడియాసలను చీల్చే ఆనందం రావాలి.....

సుటిపొటి మాటలు తూపాకులైతేనేంటి...ధగా చేస్తున్న కాలపు గుండెల్లొ తూటవవ్వాలి...

గగనమే నీ తొలి కడలి....బ్రమరమే నీ మజిలి....

అలలుగా మారిన నీ ఆలొచన సంద్రాన్ని నలుదిశల విస్తరించు.....

హేలన చేసిన అపజయం ....నీ నమ్మకమనే ఆత్మసైర్ధ్యానికి బానిసవుతుంది.....

నా "నీడ"

నీ వెవరొ నాకు తెలుసు....

నా వెంట పడుతున్నావని తెలుసు...

నాకు తొడుగా వుంటావని కూడ తెలుసు....

కాని కొన్ని సమయాలలొ....అంటే....

మబ్బులు కమ్మినప్పుడు మేఘగర్జనకు భయపడి పారిపొతావు...

వర్షం పడినప్పుడు తడిసిపొతానని భయపడి దాగుంటావు....

చీకటి అలుముకున్నప్పుడు భయపడి నాలొ కలిసిపొతావు...

కాని ఒక్కటి మాత్రం గుర్తుంచుకొ....

నన్ను ఒంటరి వాడిని చేసినా..

నన్ను వీడి పారిపొయినా...

భయపడను.... బాధపడను....

ఎందుకొ తెలుసా....

నీవు ఎందుకు పనికిరాని నా "నీడ"వి కాబట్టి.....!

కొతలు కొసిన చేతకాని జాతినేత మన రైతు.....

ఓటు నాడు నీతుల కొతలు కొసిన చేతకాని జాతినేత మన రైతు.....

మ్రోగిస్తున్నారు కరెంటు బిల్లు మోత....

విదిస్తున్నారు బారీ విధ్యుత్తు కొత......

బ్రతుకు బరువై...గుండె చెరువై....

వర్షం మరుగై.....నీరు కరువై.....

భొరు...భొరున విలపిస్తూ....

భూమాతకు చిల్లులు వేసినా....

బొరు లొన నీటిచుక్క వెక్కిరిస్తుంది....

అప్పులతొ బ్రతుకును భయపేడుతుంది....

క్షేమం మరచి... క్షామం వలచి

కనికరించని వరునుడు....

ఈ రీతీ బాధల వాగులలొ సాగే కర్షక జాతి....

భాగొగులు మారెదేప్పుడు.....

వారి తలరాతలు మార్చేదెవ్వరొ....

తమ పొలంలొ పచ్చదనం చూసేది ఎప్పుడో.....



ఎందుకొ నాకనిపిస్తుంది.....! మరి ఎందుకొ??????

ఇష్టమైన సంధ్యాకాలం...చిరాకు పుట్టే మధ్యాహ్నం....

ఇష్టమైన సంధ్యాకాలం...చిరాకు పుట్టే మధ్యాహ్నం....రెండూ సూర్యుడు నుండే వస్తాయి...

వాసన ఇచ్చే పూలు...నేల రాలే ఆకులు... రెండూ చెట్టు నుండే వస్తాయి...

ఆహ్లదనిచ్చే చిరు జల్లులు....ప్రాణాలు తీసే తుఫాను... రెండూ మేఘాలే సృష్టిస్తాయి....

ఆకలిని తీర్చే పంటలు...కలచవేసే భూకంపాలు ... రెండూ పృధీ నుండే పుడతాయి...

ఎగిసిపడే అలలు...ముంచెత్తే సునామీలు....రెండూ సముద్రం నుంచే జ్వలిస్తాయి...

జన్మనివ్వటం...ప్రాణాలు తియ్యడం...రెండూ దేవుడి నుంచే అవతరిస్తాయి...

అందానిచ్చే పర్వాతాలు...ఆత్మహత్యల లొయలు...రెండూ కొండల నుండే జ్వనిస్తాయి...

కృంగదీసే కష్టాలు...సేదతీరే సుఖా:లు...రెండూ మానవ ఇతిహాసంలొ బాగాలవుతాయి...

తొక్కుతున్న బండ...మ్రోక్కుతున్నా శిలలు...రెండు రాయి నుండే వస్తాయి...

కంటని తడిపే ఓటమి...కన్నీటిని తుడిచే చెలిమి...రెండు జీవితానికి బొమ్మ బొరుసులవుతాయి...

తప్పటడుగుల పసితనం...తప్పుటడుగుల యువ్వనం...రెండు వయస్సు నుండే పుడతాయి....

గుండెలొ ద్వేషం...ఆదరించే అభిమానం...రెండు ప్రేమనుండే వస్తాయి...

సమతుల్యం కోసం ప్రతి దానిలోనూ మంచి చెడు రెండు ఉంటాయి...

మంచిని ఆస్వాదించాలి...చెడుని పోరాడాలి...అప్పుడు గెలుపు నీ ఇంటిపేరవుతుంది...

అనాధ పిల్లలు వేదన

రోజూ తాగి పారేసే మీ సిగరెట్ల ఖర్చులో

అర శాతమైనా నాకు సాయం చేయ్యండి...!


ప్రతి క్షణమూ మీ సెల్ తో పలకరించే

మీ శ్రేయోభిలాషి కాల్ ఖర్చులో ఒకటో వంతు నా కొరకు విదిలించండి!


మీ గర్ల్ ఫ్రెండ్ తో షికారుకయ్యే పెట్రోల్ ఖర్చులో

ఒక చుక్క విలువను నాపై కార్చండి!


మీరు తిని పారేసే కాగితపు పొట్లాలలో

మిగిలింది ఏరుకోవడానికి నేనిప్పుడు

ఒక అంతరాష్ట్ర యుద్ధాన్నే చేస్తున్నాను !


రైలు బండిలో మీ సీట్లకింద బుగ్గిని

తుడిచే పిలగాడినీ నేనే....!


మీ ఎంగిలి ప్లేట్లను కడిగి

మీరు తిన్న బల్లలను ఉడ్చేది నేనే....!


లంచం రుచిమరిగిన ఈ ఖాకీ పులుల మద్య

తప్పుడు కేసు కొసం ప్రతి క్షణం వేటాడబడుతున్నది నేనే ....!.


ఏతల్లి చేసిన పాపానికో మీ పుణ్యమూర్తుల

లోకాన ఉమ్మివేయబడ్డాను......


నాయీ పాపిష్టిజన్మకు విముక్తి ఎన్నడో?

నాకెవరిమీద అసూయ లేదండీ.....!


మీరు... మీ పిల్లల౦తా... మీ కోటు జేబులకు

ఎర్రగులాబీలను గుచ్చుకో౦డి!


నేనీ ఈ రాతిరి అమావాస్య చీకటిలో

రైలు పట్టా పక్కన నిశీధి స౦గీతాన్ని

ఈ విరిగిన వేణువుతో ఆలపిస్తాను.....


నా ఆలాపనా ఏలాగొ మీ గుండెలకు చేరదు....

ఏకదాటిగా కురుస్తున్న నా కన్నీరు ఆగదు....

రేపటి నా పయనం

నేను జేబులలో అదృష్టాన్ని వేసుకుని రాలేదు.....

గుండెల్లొ సంకల్పాన్ని నింపుకొని వచ్చాను......


నా శరీరానికి సుఖాన్ని అత్తరుగా పూసుకొని రాలేదు....

కష్టాలా శిలువను స్వేదబిందువులతొ తెంచుకొని వచ్చాను....


గతాన్ని నా పిడికిళ్లలొ దాచుకొని....

గుర్రంలా పరుగు తీస్తున్న అలుపెరుగని ఆ కాలాని చూస్తున్నా....

రేపటి నా పయనం ఎటువైపని....


వెలుగు... విధితొ స్నేహమాడుతున్నట్లుంది ... అందుకే

నా జీవిత మార్గానికి దారి చూపలేకపొతుంది....


చీకటి... శూన్యాన్ని ప్రేమిస్తున్నట్లుంది... అందుకే

అసమర్ధుడిగా ఈ సమాజం ముందు నిలబెడుతుంది...


పదే పదే ఓటమి హొయలొలుకుతూ నేరజాణై నన్నుహత్తుకుంటుంది....

గెలుపు అస్వతంత్ర్యయుడిని చేస్తూ అంటరానివాడినని నిందిస్తుంది....


స్వర్గం... నరకంతొ సంధి చేసుకున్నట్లుంది.... అందుకే

సమస్యల సుడిగుండానికి పగలు ఏంటి... రాత్రి ఏంటని... చర్చించుకుంటున్నాయి...


ధైర్యంతొ కట్టుకున్న ఆశల సౌదాలును నేలకూలుస్తూన్నాయి...

మదిలొ ఆశయాలు నిశ్మబ్ధంగా నల్లబారిపొతున్నాయి....


ఎన్ని రాత్రులు గడిచినా ... ఎన్ని పొద్దులు పొడిచినా....

కాంతీ హీనుడిని చేస్తూ ఆనందాని నిక్కచ్చిగా దొచుకొవాలని ....

ఆకలి రాణి నాపై దండాయాత్ర చేస్తూనే ఉంది....

వర్షిస్తున్న చూపుతొ మరొ ప్రపంచం కొసం నా అన్వేషణ....



తల్లడిల్లే గుండెపై గెలుపు జెండా ఎగరాలి.....

మీ చేతిలో బాంబ్

మొబైల్‌ఫోన్ లేకపోతే ఏమవుతుంది..? ఒక్కసారి ఆలోచించండి.. అమ్మో ప్రపంచం ఆగిపోతుంది అంటారా..? కావచ్చు.. సెల్ చేతిలో లేకపోతే ఒక్కక్షణం కూడా మనకు తోచదు. రోజులో ఒక్కకాల్ అయినా రాకపోతే.. మనసు విలవిలలాడిపోతుంది. ఆదిలాబాద్‌లో ఉన్నవాడిని.. అనకాపల్లిలో ఉన్నవాడిని.. అమెరికాలో ఉన్నవాడినీ ఒక్క క్షణంలో కలిపేశక్తి మొబైల్ సొంతం. కానీ.. అదే సెల్‌ఫోన్.. ఇప్పుడు మన పాలిట పిశాచిలా మారింది. మన ప్రాణాన్ని బలితీసుకోబోతోంది.

మన చేతిలో... మన జేబులో.. మన ఇంట్లో.. చివరకు మన జీవితంలో.. ప్రతీ చోటా బాంబ్... ఒకరూ ఇద్దరూ కాదు... దేశంలో 70 కోట్లమంది మృత్యువును చేతుల్లో పెట్టుకుని తిరుగుతున్నారు.. మీ చేతిలో బాంబ్ ఎప్పుడైనా పేలొచ్చు.. ఎవరి ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు.. ఎలాగైనా పోవచ్చు.. ఆ బాంబే.. సెల్‌ఫోన్. మన ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతున్నమహమ్మారి. మన ప్రాణాన్ని కబలించడానికి సెల్ చురుగ్గా పావులు కదుపుతోంది. అత్యంత ప్రమాదకరమైన బ్రెయిన్ క్యాన్సర్‌ను కలిగిస్తోంది సెల్‌ఫోన్. సాధారణ వ్యక్తులతో పోల్చితే.. సెల్ వాడుతున్నవారికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు దాదాపు 400 శాతం ఎక్కువట. దీన్ని బట్టి.. మీ చేతిలో ఉన్న సెల్‌ఫోన్ ఎంత డేంజరో ఒక్కసారి ఆలోచించండి..

ఈ విషయాన్ని ఏదో అల్లాటప్పా సర్వే తేల్చింది కాదు.. పిచ్చిసర్వే చెప్పింది అంతకన్నా కాదు.. మన కేంద్ర ప్రభుత్వం తేల్చిన విషయం. సెల్‌ఫోన్ రేడియేషన్ ఎఫెక్ట్‌పై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం నిజానిజాలను వెలికి తీయడానికి, ఎనిమిదిమంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మెంబర్ సెక్రటరీ, డీఓటీ నుంచి సభ్యులను ఈ కమిటీలో నియమించింది. సెల్‌ఫోన్ వినియోగంపై విస్తృతంగా పరిశోధించిన ఈ కమిటీ.. సెల్‌ఫోన్ రేడియేషన్‌కు సంబంధించి భయంకరమైన వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. అందులో కీలకమైన విషయమే.. బ్రెయిన్ క్యాన్సర్ ఎఫెక్ట్. అందుకే.. సెల్‌ఫోన్ రేడియేషన్‌పై ఇంత ఆందోళన. బ్రెయిన్ క్యాన్సర్‌ను 400 శాతం పెంచుతుందంటే.. సెల్‌ఫోన్ తెచ్చిపెట్టే ముప్పును ఊహించవచ్చు.

క్యాన్సర్ అత్యంత ప్రాణాంతక వ్యాధి. బ్రెయిన్ క్యాన్సర్ కూడా అంతే. ఎర్లీస్టేజ్‌లో గుర్తించకపోతే.. ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. మెదడులో కణుతులు అసాధారణంగా పెరిగిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. సెల్ వాడకం ఎక్కువైతే.. బ్రెయిన్‌లో అసాధారణ మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకే.. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని ఎన్నో పరిశోధనలు కూడా చెప్పాయి. ఇది వాస్తవమా.. కాదా అన్నది తేల్చడానికే ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏకంగా 400 శాతం ఎక్కువని తేలడంతో.. సెల్ వినియోగంపై అంతా దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచిస్తోంది. సెల్లే కదా అని ఈ విషయాన్ని సిల్లీగా తీసుకుంటే మాత్రం.. మీ లైఫ్‌కు గ్యారెంటీ ఉండదు. సెల్ వినియోగదారులూ... తస్మాత్ జాగ్రత్త.

ఎన్నో సమస్యలు

రాత్రుళ్లు సరిగ్గా నిద్రపట్టడం లేదా...? ఎంత ట్రై చేసినా కళ్లు మూతపడడం లేదా..? మనిషి జీవితంలో నిద్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఉదయమంతా అలసిపోయిన శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకొని, కొత్త శక్తిని సంపాదించుకొనేది నిద్రపోయే సమయంలోనే. కానీ.. ఎంతో అవసరమైన ఈ నిద్రే ఇప్పుడు చాలామందికి సమస్య. నిద్రలేమితో రాత్రుళ్లు నెట్టుకొస్తున్నవాళ్లు ఎంతోమంది. అర్థరాత్రి దాటినా వారికి కునుకుపట్టదు.. ఫలితం.. పగలు పూర్తిస్థాయిలో పనిచేయలేరు. అంతా చికాకుగా ఉంటుంది.

దీనికి కారణం.. సెల్‌ఫోన్ వాడకం. నిద్రలేమితో బాధపడుతున్నవారిలో నూటికి డెబ్బై శాతం మంది సెల్‌బాధితులే. మొబైల్‌లో కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని మర్చిపోయేవారినే ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది. బెడ్ ఎక్కిన తర్వాత సెల్‌ను వాడుతూనే ఉంటారు. ఇలాంటి వారికేసరిగ్గా నిద్రపట్టడం లేదని కేంద్రం నియమించిన కమిటీ తన రిపోర్ట్‌లో పేర్కొంది..
సెల్‌ఎక్కువగా వాడితే వచ్చే మరో సమస్య తలనొప్పి. మొబైల్‌ను విపరీతంగా వాడేవారిలో తరచూ కనిపించే సమస్య ఇది. సెల్‌ఫోన్ కారణంగా తలలో జరిగే మార్పులే దీనికి కారణం. మొబైల్ ఫోన్‌ను చెవికి అతికించేసుకుని మాట్లాడేవారూ మనమధ్య తరచూ కనిపిస్తుంటారు. వారికి సెల్లే లోకం. అలాంటి వారిని చెవి సమస్యలు చుట్టుముడతాయి. చెవిలో ఏవో శబ్దాలు మారుమోగుతున్నట్లు అనిపిస్తుంది. క్రమంగా వినికిడిశక్తి తగ్గిపోతుంది. నాలుగేళ్లకన్నా ఎక్కువకాలం సెల్‌ఫోన్ వాడుతున్నవారిలో చెవి సంబంధ వ్యాధులు ఎక్కువగా బయటపడుతున్నట్లు ఎన్నో పరిశోధనల్లో తేలింది.
సెల్‌తో మాటలు కలుస్తున్నాయేమో గానీ, మనశ్సాంతి మాత్రం కరువవుతోంది. సెల్‌వాడకంతో ఒత్తిడి పెరుగుతుంది. సెల్‌ఫోన్ రేడియేషన్‌పై ప్రభుత్వానికి కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను పరిశీలిస్తే.. ఏకాగ్రత తగ్గిపోవడం, విసుగు, అరుగుదల లోపించడం, చర్మ సంబంధిత వ్యాధులు రావడం, శరీరంపై ట్యూమర్లు రావడం, మగతగా ఉండడం.. మతిమరుపు పెరగడం లాంటి ఎన్నో సమస్యలు సెల్‌కారణంగా వస్తున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి లక్షణాలు మీలోనూ కనిపిస్తే.. మీరు చేయాల్సిందల్లా.. వేలాదిరూపాయలు పోసి ట్రీట్‌మెట్ తీసుకోవడం కాదు... సింపుల్‌గా సెల్‌ను పక్కన పెట్టేయడం.

మగాళ్లకూ ముప్పే

సెల్‌ఫోన్‌తో మగాళ్లకు అతిపెద్ద ముప్పు పొంచి ఉంది. ప్యాంట్ జేబుల్లో సెల్ పెట్టుకుంటే ప్రమాదంలో పడ్డట్లే అని హెచ్చరిస్తున్నారు ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ పరిశోధకులు. సంతానోత్పత్తికి కీలకమైన వీర్యకణాల సంఖ్య ఈ సెల్‌ఫోన్ వల్ల తగ్గిపోతున్నాయన్నది జెఎన్‌యూ పరిశోధకులు తేల్చిన విషయం.
మగ ఎలుకలపై చేసిన పరిశోధనల్లో ఈ విషయాన్ని జెఎన్‌యూ స్కాలర్స్ కనిపెట్టారు. సెల్‌ఫోన్ వెలువరిచే రేడియేషన్‌కు ఈ ఎలుకలను గురిచేసినప్పుడు వాటిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ కారణంగా స్పెర్మ్ సెల్స్‌లోని డీఎన్‌ఏ విచ్చిన్నం కావడాన్ని వీరు గుర్తించారు. దీని వల్ల వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందన్నది వారి అంచనా. ఇదే ఎఫెక్ట్ మనుషులపైనా ఉంటుందని జెఎన్‌యూ పరిశోధకులు చెబుతున్నారు. అందుకే, సెల్ వినియోగించేవిషయంలో మగాళ్లు చాలా జాగ్ర్తత్తగా ఉండాలంటున్నారు. వీలైనంతవరకూ ప్యాంట్ జేబులో సెల్ పెట్టుకోకూడదంటున్నారు..

పిల్లలకు ఫోనొద్దు
మహిళలకూ సెల్‌తో ప్రమాదమే. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మరీ ప్రమాదం. గర్భం దాల్చిన తర్వాత ఫోన్‌ను ఎక్కువగా వాడితే.. కడుపులోని బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. కొన్ని అవయవాలు సరిగా ఎదకపోవచ్చు. ఇక చిన్నపిల్లలను మొబైల్‌ఫోన్‌కు వీలైనంత దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎదిగే వయస్సులో మొబైల్ వాడడం వల్ల రేడియేషన్ ప్రభావం వారిపై చాలా ఎక్కువగా పడుతుంది.
మొబైల్ ఫోన్లు మాత్రమే కాదు.. సెల్ టవర్లు మరీ ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. కొన్ని నిమిషాలు గంటలు మాత్రమే వినియోగించే ఫోన్ వల్లే ఇన్ని సమస్యలున్నప్పుడు.. 24గంటలూ రేడియేషన్‌ను వెలువరిచే సెల్‌టవర్ల వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి ఊహించండి. టవర్‌కు సమీపంలో ఉండేవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా తగ్గిపోతుందని ఎన్నో రిపోర్ట్స్‌లో బయటపడింది. ఈ ప్రాంతాల్లో ఉండేవారికి చర్మసంబంధ వ్యాధులూ ఎక్కువగా వస్తాయి. ఏవైనా వ్యాధులు వస్తే.. అవి తగ్గడమూ చాలా ఆలస్యమవుతుంది. ఇలా ఏ రకంగా చూసినా.. సెల్‌ద్వారా.. సెల్ టవర్ల ద్వారా ఎన్నో ఇబ్బందులు పడాల్సిందే.


శరీరం ఛిద్రం

అమెరికా నుంచి ఫోన్ చేసినా.. అరక్షణంలోనే మనకు ఫోన్ వచ్సేస్తుంది. మనం మాట్లాడేది వెంటనే అవతలివైపు చేరిపోతుంది. ఇంత వేగంగా ఎలా వెళ్లగలుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..? దానికి కారణం.. సెల్ సిగ్నల్స్ వెళ్లే వేగమే.. సెకనుకు లక్షమైళ్ల వేగంతో ఈ సిగ్నల్ పాస్ అవుతుంటాయి. ఇదే రేడియేషన్. గామారేస్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, ఆల్ఫా ఆర్టికల్స్ లాంటివి ఇందులో భాగంగా ఉంటాయి. ఇవన్నీ కలగలిసి... దూసుకుపోతుంటాయి. మన శరీరాల్లోనుంచి కూడా ఇవి చొచ్చుకుపోతాయి. అంతవేగంతో ఇవి ప్రయాణిస్తూ.. మన శరీరంలోని కణాలను అవి ఢీకొడితే.. ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించండి... అందుకే శరీరంలో కణజాలం దెబ్బతింటుంది.
మనం ఉపయోగించే ప్రతీ ఎలక్ట్రానిక్ పరికరమూ రేడియేషన్‌ను విడుదల చేస్తుంది. మైక్రోవేవ్ ఓవెన్‌, రేడియో, సెల్‌ఫోన్, టెలివిజన్ ఇలా ప్రతీదీ ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్‌ను విడుదల చేయవడం వల్లే అవి మనకు ఉపయోగపడుతున్నాయి. ఎలక్ట్రో మాగ్నెటిక్ స్పెక్ట్రమ్‌లో ఈ రేడియేషన్ పాస్ అవుతుంది.
సెల్‌ఫోన్‌ను వాడుతున్నప్పుడు కూడా... ఈ రేడియేషన్ ఎక్కువగా విడుదల అవుతుంది. మొబైల్‌ను మనం చెవికి ఆనించి ఉంచుతాం కాబట్టి.. ఆ రేడియేషన్ ఎఫెక్ట్.. మన తలపై ఎక్కువగా పడుతుంది. దాని కారణంగా మెదడులో వేగంగా మార్పులు చోటుచేసుకుంటాయి. సున్నితమైన మెదడు.. ఈ రేడియేషన్ ఎక్కువగా ప్రభావితం అవుతుంది.
రేడియేషన్ కారణంగా మన శరీరంలోని రక్త కణాల్లో ఎలాంటి మార్పులు వస్తాయన్నదానిపై పరిశోధన జరిగింది.రేడియేషన్ లేనప్పుడు.. రక్తకణాలు విడివిడిగా ఉంటాయి. అదే లో రేడియేషన్‌కు గురిచేసినప్పుడు ఈ కణాలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. కొన్ని విడిగా ఉన్నాయి. అదే కంప్యూటర్ ముందు గంటకు పైగా గడిపినప్పుడు ఈ రక్తకణాలు మరికాస్త దగ్గరకు జరిగాయి. అదే పది నిమిషాల పాటే సెల్‌పోన్‌లో మాట్లాడితే ఆ రక్తకణాలు కుచించుకుపోయాయి. ఈ తరహా రక్తకణాల అమరిక.. సాధారణంగా క్యాన్సర్ పేషెంట్లలోనే కనిపిస్తుంటుంది. అందుకే.. సెల్ వాడుతున్నవారికి క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువవుతున్నాయి.

తస్మాత్ జాగ్రత్త!

మీ సెల్ మీకు హెల్ చూపించకూడదనుకుంటే.. మొదటి అడుగు నుంచే జాగ్రత్త పడాలి. సెల్‌ఫోన్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మొబైల్.. రేడియేషన్ ఎంత విడుదల చేస్తుందన్నవిషయాన్ని ప్రతీ కంపెనీ తప్పనిసరిగా మ్యాన్యువల్‌లో పేర్కొనాలి. దీన్నే స్పెసిఫిక్ అబ్సార్పషన్ రేట్.. SAR అంటారు. మన దేశంలో దీని మాగ్జిమమ్ లిమిట్ 2 వాట్ పర్ కేజీ. ఓ రకంగా ఇది కూడా ప్రమాదకరమైన స్థాయే. SAR వాల్యూ 2 వాట్ ఉంటే హైరేడియేషన్‌ను ఆ ఫోన్ వెలువరుస్తుందని అర్థం. అందుకే... అంతకన్నా తక్కువగా ఉన్న ఫోన్లలో కొనుగోలు చేయాలి.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఈ SAR విలువపై కీలకమైన సలహాను ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న 2 వాట్‌ను.. 1.6 వాట్‌కు తగ్గించాలని సూచించింది. ఇక రేడియేషన్ తగ్గించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. అందులో ముఖ్యంగా స్కూల్స్, హాస్పిటల్స్ ఉన్న చోట నుంచి మొబైల్ టవర్లను తొలగించడంతో పాటు జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయకూడదని సూచించింది. సెల్ వినియోగం పెరగడంపైనా ఆ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. సెల్ వాడుతున్నవారు.. అత్యవసరానికి మాత్రమే ఫోన్‌ను వాడాలే తప్ప.. అనవసరంగా వాడితే ఆరోగ్యసమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది.
ఇప్పటికే దేశంలో దాదాపు మూడున్నర లక్షల సెల్‌టవర్లు ఉన్నట్లు అంచనా. ప్రతీ కంపెనీ దేనికదే సెల్‌టవర్లను ఏర్పాటు చేసుకొంటోంది. అయినా.. చాలాప్రాంతాల్లో ఇప్పటికీ సిగ్నల్స్ అందవు. అందుకే.. టవర్ల సంఖ్య పెరగుతూనే ఉంది. పైగా కొత్త కంపెనీలు రావడంతో ఈ టవర్లు విచ్చలవిడిగా జనం మధ్య కొలువుతీరవచ్చు. అంటే ఓ రకంగా మరింత రేడియేషన్‌ మనపై దాడిచేయబోతుందన్నమాట. ఈ విషయంలోనే ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అన్ని కంపెనీలు ఒకేటవర్‌ను వాడుకునేలా నిబంధనలు మార్చాలి. అప్పుడు రేడియేషన్ ప్రభావం కాస్త తగ్గొచ్చు. అంతే తప్ప.. జనం మధ్య టవర్లే లేకుండా చేస్తే.. సెల్ మూగబోతుంది. జనానికి పిచ్చెక్కుతుంది.
మొబైల్ వాడే వారూ.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నేరుగా ఫోన్‌ను చెవికి ఆనించడం కన్నా, ఇయర్ ఫోన్స్ వాడడం మేలు. కాల్ చేసేటప్పుడు శరీరానికి కనీసం ఒక ఇంచ్ దూరంలో ఫోన్‌ను పెట్టడం వల్ల రేడియేషన్ నేరుగా శరీరంలోకి చొచ్చుకుపోదు. ఒకవేళ ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడాల్సి వచ్చినప్పుడు.. చెవి వేడెక్కితే వెంటనే కాల్‌ను ఎండ్ చేయాలి. వీలైనంతవరకూ తక్కువ మాట్లాడడం వల్ల రేడియేషన్‌కు గురికాకుండా ఉండొచ్చు.

వెర్రి పరుగు

దేని వెంటో పరుగు
ఎండమావిని అందుకోవాలని ఆరాటం
ఈ పరుగు పందెంలో
మనిషి ఎంత అలసిపోతున్నాడు
ఎంత కోల్పోతున్నాడు
సుఖాన్ని,శాంతిని
సంతోషాన్ని,సంబరాన్ని
గుండె నిండా అనుభవించలేని
అసంకల్పిత పరుగు
ఆగి ఆయాసం తీర్చుకునే
తీరికలేని పరుగు
చుట్టూ పరుచుకున్న అద్భుతాల్ని
చిన్న ఆనందాల్ని
తోసిరాజని పరుగే పరుగు
ఇంధ్ర ధనుస్సు ఎదురొచ్చినా
తలెత్తి చూడకుండానే
వాన చినుకులు కురుస్తున్నా పట్టించుకోకుండానే
ఉరుము ఉరిమినా
మెరుపు మెరిసినా
ఆకాశంలో విద్యుల్లతలు విరగ పూసినా
నా కోసం కాదులే
నాకవసరం లేదులే
అంతా నిర్లిప్తత,నిరాసక్తత
ప్రక్రుతిలో మమేకం కాలేకఫొవడం
మనిషి చేస్తున్న మహా తప్పు

అదొక మానసిక స్థితి

సంతోషాన్ని నిర్వచించగలమా
ఆనందానికి అర్ధం చెప్పగలమా
అదొక మానసిక స్థితి
ఈ మానసిక స్థితి శరీరంలో ప్రతిఫలించడం
ఎవరైనా ఎపుడైనా చూసారా
పరవశంలో పొంగి పొర్లుతున్న మనసు
ముఖంలోనే కాదు
మొత్తం శరీరంలో ప్రతిఫలించడం
ఎవరైనా ఎపుడైనా చూసారా
పాపికొండల పారవశ్యం ఒకవేపు
గోదారమ్మ గలగలలు మరోవైపు
నీ స్నేహ మాధుర్యం మరోవైపు
ముప్పేటలా నన్ను ముంచెత్తిన వేళ
నా ముఖంలో వెయ్యి మతాబుల కాంతి
వెలుతురు విరజిమ్మతున్న పరిసరాల్లో
నిన్ను చుట్టుకున్న చేతుల్లో
పూసిన కాంతి పుంజరాలు
సంతోషాన్ని మనస్సే కాదు
శరీరం కూడా వ్యక్తం చేస్తుందని
ప్రక్రుతి పచ్చదనమే కాదు
ప్రియ నెచ్చలి వెచ్చని స్పర్శ కూడా
ఒళ్ళంతా విద్యుత్తరంగాలు పుట్టిస్తుందని
మన చాయాచిత్రం చూసాకే అర్ధమైంది.

కొత్తగా పునర్నిర్మాణం అంటున్నాడు

అమాత్య పదవి రాలేదని
వేర్పాటు వాద సిద్దాంతం తో పుట్టిన పార్టీని
కూడా జాతీయ స్థాయి పార్టీ
కాదు కాదు అవినీతిలో అంతర్జాతీయ స్థాయి కి
కృషి చేస్తున్న పార్టీలోకి
కలుపు కొంటామని
ఆ పార్టీ వాళ్ళు చెబుతుంటే
వేర్పాటు నాయకుడు ఖండిస్తూ
రాష్ట్రాన్ని చీల్చడమే కాదు
రెండో ముక్క
పునర్నిర్మాణం లో కూడా
భాగం పంచుకొంటామని చెబుతున్నాడు
అంటే పునర్నిర్మాణం జరిగేలా
పునాదులతో కూడా
ఆంద్ర రాష్ట్ర తిరోగమనం
జరిగే వరకు గమ్మున ఉండే
ప్రసక్తే లేదని ప్రస్పుటం చేస్తున్నాడు.

రెండున్నర ఏళ్ళు తీసి తగలెట్టిన రీళ్ళలోని పాపులర్ డైలాగు

రెండున్నర ఏళ్ల రీళ్ళను
వెనక్కు తిప్పితే

వెంకన్న సాక్షిగా
ఆయన పాదాల చెంత
సామాజిక న్యాయం
ప్రజా రాజ్యం తో సాధ్యం అని పొలికేక పెట్టే డైలాగుతో
షాట్ మొదలయ్యింది

అందరూ అంచనా వేసినట్టే
హీరో అవినీతి సామ్రాట్టులకు మళ్ళీ
అధికారం అందించడంలో
విజేతగా నిలిచే సన్నివేశాలు చిత్రీకరించి

ఇక జెండా పీకేద్దాం అని గుస గుసలు పోయినప్పుడు
గుస్సా అయి అంతెత్తున లేచి
జనం గుండెల్లో నుండి తీసేసేదెవరు అని
తీక్షణంగా ప్రశ్నించే సన్నివేశాన్ని బాగా పండించి

మరో షాట్ లో
నేనే పోయినా
పార్టీ ఉంటుందని ఉద్ఘాటించే సన్నివేశంలో
ఉద్విగ్నత ను చూపి

నూట ఏభయ్యో సినిమా కథ కోసం
వెతుకుతున్నానంటూ
అభిమానులకు ఎన్నో ఆశలు కల్పించే
మరో సన్నివేశంతో
కథలో కీలక మలుపు తిప్పి

రెండున్నర ఏళ్ల రీళ్లకు
హస్తినలో దహన సంస్కారాలు చేసే సన్నివేశంతో
షాటు మొదలెట్టి
దానికి దర్శకురాలిగా
విదేశీ పరిజ్ఞానంతో
స్వదేశీలో రెచ్చిపోతున్న
సోనియా గాంధీని ఎన్నుకొని
కొత్త సినిమాను మొదలెట్టాడు

ఆంటోనీ కథా చర్చలు గావిస్తే
పటేల్ రాసిన మాటలతో
మొయిలీ క్లాప్ తో
రెండున్నర ఏళ్ళు తీసి తగలెట్టిన రీళ్ళలోని
పాపులర్ డైలాగు ‘సామాజిక న్యాయాన్ని సాధించడానికి’ అంటూ
హీరో కొత్తగా చెప్పడాన్ని
డీ ఎస్ కిరణ్ కేరింతల మధ్య
దర్శకురాలి దగ్గర చాన్స్ రాని
మరో హీరో ఫ్యాన్సు కుత కుతల మధ్య
అద్బుతంగా ప్రారంభమయ్యింది

వెర్రి బాగుల వాడు

వెనకటికి మా ఊరిలో ఒక సామెత ఉండేది. ఎందుకూ పనికి రాని ఒక వెర్రి బాగుల వాడిని, ఒరేయ్ నీకు పొలం ఎంత ఉందిరా అని అడిగితే, రాజు గారిదీ నాదీ కలిపి నూటఒక్క ఎకరాలు అని చెప్పుకొనేవాడంట. ఇంతకీ అందులో నీది ఎంతరా అని గుచ్చి అడిగితే మాత్రం సిగ్గు పడుతూ ఒక ఎకరం నాది, వంద ఎకరాలు రాజు గరివీ అని ఒప్పుకొనేవాడంట.
కొత్త గా సోనియమ్మ జపం చేస్తున్న మన వెర్రి బాగుల వాడు కూడా, ఇప్పుడు నావీ కాంగ్రెస్ వీ కలిపి నూటా డబ్బయ్యి స్థానాలు అని చెప్పుకొంటున్నాడూ. కలిపి సరే, నీవి సొంతం గా ఎన్ని అని ఎవరన్నా పొరుగు రాష్ట్రం వారు అడిగితే మాత్రం వెకిలి గా నవ్వుతూ పద్దెనిమిదిలో రెండు పోగా పదహారు అని చెప్తున్నాడు. ఇలాంటి సిగ్గులేని మనుషులు పుడతారని ముందే ఊహించి కాబోలు మన పెద్దలు అలాంటి సామెతలు సృష్టించారు.

తిరుపతి లో హోటెల్ గదిని ఏదో దొంగల స్తావారాన్ని వెతికినట్టు వెతికించినది ఈ కాంగ్రెస్ వారే అన్నది గుర్తుందో లేదో ఈ కొత్త బిచ్చగానికి.

5, ఫిబ్రవరి 2011, శనివారం

ఆశ

ఇష్టంతో కష్టపడి, కష్టాన్నే ఇష్టపడి
కష్టపడి ఇష్టపడి, ఆశయానికి కట్టుబడి కన్నీటిని బంధించి
భాధల్ని గర్జించి,రేపటి ఉదయం కొసం వేచిచూడు....
నేడు ఎవ్వరిదైనా , రేపు మనది...

నిరీక్షణ

ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిది...
ఆవేశం ఏనాడు కలిగెనో, ఆనాడే తెలిసిందది.....
ఏ మేఘం ఏ వాన చినుకై....
చిగురాకై మొలకెత్తెనో.....
ఏ రాగం ఏ గుండె లోతున, ఏ గీతం పలికించునో...
ఆనాడైనా నా నిరీక్షణ ఫలించునా????

నమ్మకం

నమ్మకం
చీకటి లో ఉన్నానని చింత పడకు
దానిని చీల్చుకొని వచ్చే వెలుగు కోసం ఎదురుచూడు
ఓటమి పొందానని కలత చెందకు
ఓటమినే ఓడించి గెలిచే మర్గాన్ని వెతుకు
నమ్మకం నీ చేతిలో ఒక ఆయుథం
ఆ నమ్మకం తో ముందుకు వెళ్ళు
విజయం అన్ని వేళలా నీ చెంతనే ఉంటుంది

నా బాల్యమా

చిన్న నాటి ఊసులలో ఎంత హయి ఉంది.....అది
తల్చుకున్న కొద్దీ బాధ రగులుతుంది
కరుణలేని కాలప్రభువు ఇంద్రజాలమిది
అదితెలియని హ్రుదయాల ఆవేదన ఇది...
ఓ చిలిపినవ్వు ప్రాయమా ఏమైపోయావు????
నా బాల్యమా....నీవేమైపోయావు॥

రాయబారం!!.....

ఆకాశం అందుకోవాలని సాగర కెరటాల ఆరాటం...
దిగంతాల్లో కలుస్తానంటూ ఓక వాగ్దానం
చందమామ సాక్ష్యంగా మిగిలింది
వెన్నెల వెలుగు దారాలతో రాయబారం......

నేనూ సైనికుడినే

విజ్గ్నానం వేటలో
సౌకర్యాల దాహంలో
ధనసముపార్జనా సమ్మొహనంలో
దూరతీరాలను చేరి
ఉభయసంధ్యల మధ్య
పరుగుపందెంగా మారి
సరిహద్దు గస్తీ సైనికుడి నిరంతర కవాతులా
విరామమెరుగని జీవితం అలసిన క్షణాన
భవిష్యత్తు ప్రణాళికకై నేను ఒక సైనికుడిలా శ్రమిస్తున్నాను.....

దృశ్యం మారదేం????

రోజూ చేస్తున్న అదే పని...
అవే ఉదయాలు , అవే సాయంత్రాలు
అవే హృదయాలు , అవే అనుభూతులు
రోజులు గడుస్తున్నాయ్ , ఋతువులు మారుతున్నయ్
కానీ దృశ్యం మారదేం?????
ప్రతి రోజూ ఉరుకులు పరుగులు
వెక్కిరిస్తూ ట్రాఫిక్ జాం.... లు
చావడానికి బ్రతుకుతున్న మనుషులు
బ్రతకడానికి చస్తున్న మనుషులు
క్రొత్త సంవత్సరాలు వస్తున్నాయ్.....
పాత సంవత్సరాలు పొతున్నయ్....
కానీ దృశ్యం మారదేం????
దృశ్యాన్నిమారుస్తుందని "క్రొత్త"ని అహ్వానిస్తే
మరుక్షణం లో "పాతై" పోయి , నన్ను వెక్కిరిస్తోంది!!!!
వెక్కిరింతలోనైనా నాకు అవగతమౌతుందా???
దృశ్యం ఎప్పటికీ మారదని.....
మార్చాల్సింది నా దృష్టిని అని !!!!!!

అలసిపోతున్నాను.....

కాల భూతం యంత్ర దంతాలలో చిక్కిన
అనుభూతుల అవశేషాలను పోల్చుకోలేక!
కాల వర్తన పద ఘట్టనలో చిట్లిన
అందమైన అవకాశాలను అందుకోలేక!!
నిద్రలేని సాంత్వనలో ఛిద్రమైన స్వప్నాలను
అతికించి తిలకించి పులకించి అలిసాను...........
వర్తమానం పైన బెంగ లేదు,ఆశ అనేది ఉంటేగా!!!!
గతం వల్ల బాధ లేదు,గుర్తుండాలిగా ముందు!!!
భయమంతా భవిష్యత్తు గురించే? ఎదురవుతుందా అసలు అని?!!!!
మరింకా చేసేదేముంది,వర్తమానం గతం అవుతుందని
భవిష్యత్తు ఇప్పుడే వస్తుందని, వేచి ఉండడం తప్ప????????

అనుభవాల ఆలాపన

జీవితం ఒక అనుభవాల మూట

ఎప్పటికప్పుడు దాన్ని కట్టిపడేస్తూ ఉంటే

గుట్టు చప్పుడు కాకుండా ఊంటుంది…॥

మూట ముడి విప్పావంటే…

ఆనుభవాలు సాంతం నిన్ను చుట్టుముట్టేస్తాయి...

నాన్నా..

నాన్నా అను పదమే.. నాదసుధారసమై
నడిపించును జీవితం
నవరస భరితం… నవరస భరితం

చిటివ్రేలు పట్టి లోకచిత్రాలే చూపించు
తప్పటడుగులే దిద్ది సత్పధాల నడిపించు
జిలిబిలి ఆటలలోనే జీవితాశయాలు నింపి
ఇంతింతై ఎదుగువేళ..ఎంతెంతో మురిసిపోవు.. నాన్నా ..

తనయుడె తన జీవమని.. తనకే సర్వస్వమని
కనులముందు తన రూపే.. కదలాడుట భాగ్యమని

తలమునకలు వేయునంత
తనకొకింత దూరమైన
తల్లడిల్లి తపియించే
తండ్రికి వేరెవరు సాటి .. నాన్నా ..

హితమై జీవితమై
మహిత మార్గదర్శకమై
ఉపదేశామృతమై
ఉజ్వల భవితవ్యమై

సఖుడై గురుడై జనకుడె
స్వాచార్యదేవుడై
సతము సుతుని నీడయై
చల్లని దీవెనలనిచ్చు.. నాన్నా..

పోలవరం పోరాటానికి రెండో నాయకుడు

పోలవరం పై పోరాటం అని
మీడియా ముందు
గతంలో ఓ సునామీ నాయకుడు శివాలెత్తి పోయాడు
జనం లోకి వెళ్లి చైతన్యం తేలేక చతికిల బడి

రాష్ట్రంలో ప్రభుత్వానికి
పోగాలం వస్తుంది అని అనిపించినపుడు
కేంద్రం నుండి పోలేరమ్మ పిలిస్తే
పొంగిపోతూ వెళ్లి
అధికార భాగస్వామ్యం కోసం బాసలు చేసుకొని
దానికి పోలవరం పై చర్చలు చేయడానికి వెళ్లానని ప్రతిసారీ చెబుతూ
ఆ సమస్య పై ఆ సునామీ వీరుడు వేలాడుతూ ఉండగానే

పోగేసిన జనం డబ్బుల మూటల పై
ముప్పిరిగొంటున్న సమస్యలతో సతమవుతూ
అరెస్టు ఎప్పుడు జరుగుతుందో అని అదిరిపడుతూ
మడమ తిప్పలేక ముందుకు వెళ్ళలేక
ముచ్చటగా మూడు దీక్షలు చేసి
నాన్న ఆరేళ్ళ జమానాలో అంటుకోని సమస్యను
ఈ రెండో నాయకుడు తోడుతున్నాడు
పీఠం కోసం అలిగిన ఈ పెంకి నాయకుడు
ఈ సమస్య ఎత్తుకొంటే సమస్యే మరుగున పడడం ఖాయం

బడాయి పోతున్న రాజ్యం బాగుపడేది కలే

ఓ సారి టికెట్టు నిరాకరించి
మరో సారి టికెట్టు ఇచ్చి ఎం పీ చేసిన పార్టీని
వారసత్వ కుర్చీ ఇవ్వలేదని
లక్ష్యం నెరవేరలేదని
దీక్షల మీద దీక్షలు కక్షతో చేస్తూ
కాంగ్రెస్స్ ను హస్తిన కే వెళ్లి కడిగేస్తూ
నా దయా దాక్షణ్యం మీ ప్రభుత్వం అనే
పుల్ల విరుపు మాటలకు విరుగుడుగా

ప్రత్యమ్నాయం అంటూ వచ్చిన
ప్రజారాజ్యం తో మంత్రాంగం నెరిపితే
ఆపద్బాంధవుడు మా నాయకుడే అని
రాజ్యం ప్రతినిధిలు ఉబ్బి తబ్బిబ్బు అవుతూ
కాంగ్రెస్స్ కు రాష్ట్రంలో ఇమేజి ఉన్న నాయకుని కొరతను
మా నాయకుని ప్రత్యామ్నాయం పూడుస్తుందని
పూనకం వచ్చినట్లు ఊగిపోతూ పొంగిపోతున్నారు
125 ఏళ్ల చరిత్ర కల కాంగ్రెస్స్ కౌగిలి
కొత్త బిక్షగాళ్ళకు ద్రుత రాష్ట్ర కౌగిలి అని తెలిసినట్టు లేదు
అంతెందుకు ఈయన ఇమేజ్ ఏంటో
ఎంతో అనుభవం ఉన్న ఆ పార్టీ అంచనావేయదా
కుటుంబ ఇమేజి తప్ప ఎవడి ఇమేజ్ ను భరించని పార్టీ అది
ప్రస్తుతానికి పావుగా వాడుకోబడుతుంటే
బడాయి పోతున్న రాజ్యం బాగుపడేది కలే.

అవినీతి పార్టీకి ఆసరాగా వచ్చిన అందరి వాని పార్టీ

ప్రజలందరూ కలిసి
అవినీతి మంత్రుల
పంచలూడ గొట్టమని
పవనుడు యువ రాజాగా చెప్పడం
అల్లుడని కూడా చూడకుండా
అత్తోల్ల ఊరిలో
అన్నయ్య పై నమ్మకం నభూతో నభవిష్యత్గా
ప్రజలు తప్పుగా అర్థం చేసుకోవడం
ఆదరించడం జరిగిపోయింది

అభిమానుల రక్తానికి సేవ అనే లేబులు వేసి
ప్రజలను కూడా పీల్చడానికి వస్తే
పిచ్చి వదిలించి పంపారు

కానీ అన్నయ్య
పాలక పక్షంతో
లోపాయకారిగా అంటకాగిన విధం
ఎన్నికలయ్యి ఏడాది కాక మునుపే బయటపడింది
అధికార యావ ప్రజలకందరికీ తెలిసి వచ్చింది
కానీ అంతిమంగా నష్టపోయింది ప్రజలే
అవినీతి పార్టీకి ఆసరాగా వచ్చిన
అందరి వాని పార్టీ అని
గ్రహించక మరో సారి పాతక పాలక పార్టీ
గ్రహణాన్ని పొడిగించుకొన్నారు

చేతి ఉండ సాక్షిగా

ప్రజలకు పసందుగా ప్రసాదం పెట్టి
కొడుకు కోసం కొల్లగొట్టడానికి
అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంటే
ఆయన పాలనలోని పాపాలను
ఓ పత్రిక చేసే ప్రతి ఆరోపణకు
కన్న కొడుకినే సాక్షిగా పెట్టి
ఉచితానుచితాలు మరిచి
ఉండ తో ప్రత్యారోపణ చేయిస్తూ
మొదటి పేజిలో వల్లించిన సుభాషితాలు
కడుక్కున్న బురద
ప్రజల మది నుండి మాయం అవక ముందే
ఉండ తిరగబడి ఆ కొడిక్కే బురద జల్లుతోంది
తను తీసిన గోతిలో తనే పడ్డాడు అనే సామెత
‘చేతి’ ‘ఉండ’ ‘సాక్షిగా’ నిరూపితమయ్యింది.