28, మే 2010, శుక్రవారం

శ్రీ నందమూరి తారకరాముని 86 వ జయంతి రోజున అంజలి ఘటిస్తూ..

ఫేరు వింటే పరవశం..
తలచుకుంటే తన్మయం..
ఒక తరాన్ని తన నటన తో వుర్రూతలూపి..
ఒక తరాన్ని చేయి పట్టుకు రాజకీయ ఓనమాలు దిద్దించి....
ఒక తరానికి వేగు చుక్కలా వినీలాకాశంలో నిలిచిన ...ఒకే ఒక్కడు..

ఆతను నవరసభరితమైన నటనలో రాగద్వేషాలని..రక్తి కట్టించి రసజగత్తు లో జనసామాన్యాన్ని ఓలలాడించిన విధం నభూతో నభవిష్యతి..
రాముడిగా రావణునిగా
కృష్ణునిగా కృష్ణరాయలుగా
భీష్మునిగా భీమునిగా
కర్ణునిగా కిరీటిగా
బృహన్నలగా భబ్రువాహనునిగా
సత్యహరిశ్చంద్రునిగా
సుయోధన సామ్రాట్టుగా..
చెప్పుకుంటూపోతే.. చిత్రాలు ఎన్నో..
అంతులేని కథ ఆయన
మత్తగజాల ఘీంకారాలు ఆ మందహాసం ముందు మూగబోయాయి
మేరుపర్వతాలు పదివేలు ఆ మొండితనం ముందు మోకరిల్లాయి
వేలవెన్నెల రాత్రులు ఆ వదనారవిందం ముందు వెలవెలపోయాయి

ముక్కుసూటి..ఆవేశం.. మొండితనం.. పట్టుదల.. క్రమశిక్షణ..పదాలకు పర్యాయపదం ఆయన..

ఎంతగా ఎదిగినా..
జనహితం మరువని జగదేకవీరుడతను..
యుగధర్మం తప్పని యుగపురుషుడాయన..
అందుకే..

అన్నవస్త్రాలు లేక అల్లాడుతున్న జనాన్ని వదిలి..
ఆకాశమర్గాన అవినీతి స్వర్గాన హడావిది గ వెళ్తున్న
రాజకీయ రధచక్రాల్ని..
భూమార్గం పట్టించి భూకంపం సృష్టించిన భగీరథుదు NTR


దశాబ్దాలుగా దారితప్పి
దేశరాజధాని లో దేహీ దేహీ అంటున్న
రాష్ట్ర రాజకీయాల్ని
భాగ్యనగరం దిశ పట్టించి మన భాగ్యరేఖల్ని మార్చినవాడు NTR.

గుడిసెల ముందు రాజకీయాన్ని తెచ్చి గుట్టగాపోసిన గుండెగుడిదేవుడాయన..
చైతన్యరధమెక్కి చైతన్యాన్ని అడుగడుగునచాటిన చరిత్రకారుడాయన..
పేదప్రజలకోసం తనదైనప్రపంచాన్ని సృష్టించిన విశ్వామిత్రుడాయన..

వేలవేలు నాయకులున్నా ఒకేఒక్కడిగా ఆయన మాత్రమే ఎందుకు ఎదిగాడు..
పూరిగుడిసెల్లో పటాలు, గుండెగుండెలో గుడి ఆయనకి మాత్రమే ఎందుకున్నాయి..

ఎంత మందికి తెల్సు..1980 కి ముందు జరిగిన వరకట్నహత్యలు..
ఎంత మందికి తెల్సు..1980 కి ముందు మీ ప్రజాప్రతినిధి ఎవరో..
ఎంత మందికి తెల్సు..1980 కి ముందు సగం ఊళ్ళకి బస్సులు కుడా లేవని..

NTR రాజకీయ ప్రవేశం తో రాజకీయాల కి రంగు,రుచి,వాసన వచ్చాయి..

ప్రజలు ప్రశ్నించటం నేర్చుకున్నారు..
ఆడపడుచులకి అస్తిహక్కు వచ్చింది..
రైతాంగానికి రాయితీలు వచ్చాయి..
పల్లెల్లో ప్రాథమిక అవసరాలు తీరాయి..

నేలవిడిచి సాము చేసే నాయకుల నారతీసిన నిరంకుశుడాయన..
పల్లెపల్లెకి పరిపాలనని తీసుకెళ్ళిన ప్రజారాముడాయన..
అధికారయంత్రాంగం అహంకారాన్ని అణిచిన రాజారాముడాయన..

జనం గుండెఘోషనే తనశ్వాసగా మార్చుకుని..
మదిమదిని మైమరిపించిన మహానాయకుడు..

చిరకాలం చెప్పుకునే చందమామకథ ఆయన..
కలత నిద్దుర కలల్లోని కమ్మనిరూపం ఆయన..
ఉదయసాయంసంధ్యల్లో ఉత్తేజపరిచే ఊహ ఆయన..

శక్తిగా మారిన ఒకవ్యక్తి ఆయన..
చరిత్ర కి చిక్కని చిత్రం ఆయన..

అందుకే..అరవయ్యేళ్ళుగా
జనం జీవితాల్లో జీవనది NTR

సూర్యచంద్రులు వున్నన్నాళ్ళు..
కృష్ణాగోదావర్లు పారినన్నాళ్ళు..
తెలుగువారి తొలిదైవం NTR
ఆంధ్రులకి ఆత్మగౌరవాన్నితెచ్చి..
మద్రాసీమచ్చకి మందువేసి..
విశ్వవినువీధుల్లో తెలుగుజెండాని ఎగరేసి సగర్వంగా చెయ్యెత్తి జైకొట్టిన తెలుగోడు..

తను నవ్వితే..జనం నవ్వారు.. ఏడిస్తే జనం ఏడ్చారు ..
తనలోనే దైవాన్ని చూసారు..

ఆ చైతన్యరథం రేపిన దుమ్ము తొలగకముందే.. వడివడిగా వెళ్ళిపోయాడు ఆ రాముడు..
కమ్మకులకీర్తిచంద్రుదు శ్రీ నందమూరి తారకరాముని 86 వ జయంతి రోజున అంజలి ఘటిస్తూ..
నా ఆత్మబంధువు కి అక్షరాభిషేకం చేస్తున్నాను..

"ఆత్మబంధూ !
నీ అభిమాన సింధువు* లో నేనొక బిందువుని మాత్రమే.. (సింధువు-- సముద్రం)
పుష్కరాలకోసం ఎదురుచూసే వరదగోదావరి లా..
అన్నా ! నీ కోసంఆర్తిగా ఎదురుచూస్తున్నాం..
మళ్ళీ పుట్టు మా కోసం.."

కన్నీటి తో..