8, డిసెంబర్ 2010, బుధవారం

నా తొలి బుల్లి కవిత్వం – ఓ మనసు తత్వం !

మదిలొ మెదిలే ఆలొచనలకు మనసుని మాటలుగా, భావాన్ని అక్షరాలుగా మార్చాలనే పోరాట పటిమతొ “కవిత్వం” అనే సాగరం లొ ఒక చినుకుగా ప్రవహించాలని ఆశతొ ఈ నా తొలి బుల్లి కవిత్వం(?)

పెదవి పలకని మాటలెన్నో, మాటకు అందని మౌనాలెన్నో

ఊహకు అందని ఊసులెన్నో,బాషకు అందని భావాలెన్నో

సమయం సరిపోని స్వప్నాలెన్నో, తనువు గుర్తించని స్పర్శలెన్నో

చూపులకు తెలియని అందాలెన్నో, మంతనాలు సాగని రోజులెన్నో

గుండె దాటని తలపులెన్నొ,గుప్పిట్లొ దాచలేని వన్నెలెన్నో

వయసుకు అందని కోరికలెన్నొ, వర్ణనకు అందని సొగసులెన్నో

దాచకుండ ఉంచని తీపి గుర్తులెన్నో, పాటకు అందని రాగాలెన్నో

కలుపు ఎరుగని వలపులెన్నొ, పంచుకోలేని అనుభవాలెన్నో

వ్యక్తపరచని అనుభూతులెన్నో, ఎన్నెన్నో.. మరెన్నో…!!!