25, జనవరి 2011, మంగళవారం

మనవాళ్ళకు దక్కాల్సిన అందలానికి మన అంధత్వమే అడ్డవుతోందా

అనగనగా ఒక ధీరుడు గురించి మన అంతర్జాల సమీక్షకులు చిన్నపిల్లలు చూసే సినిమా గా తేల్చేసారు.
కానీ నా దృష్టిలో అది ప్రతి ఒక్క తెలుగువాడు చూసి ఆనందించదగిన చిత్రంగా అనిపించింది.
ప్రతినాయకి గా మంచు లక్ష్మి నటన ప్రత్యేకం. దానికన్నా ప్రత్యేకమయినది దర్శకుని ప్రతిభ.
మొదటి నుండి చివరి వరకు కనులు ఆరగించే విందులో రెప్ప పాటు వల్లా ఏమన్నా తప్పిపోతామో అని సంకోచించే దృశ్య కావ్యం. అంతర్జాతీయ స్థాయి కి తగ్గకుండా డిస్నీ తో కలిసి మన దర్శకేంద్రుని కుమారుడు తీసాడు. సాంకేతికంగా మన తెలుగు సినీ స్థాయి ఒక మెట్టు ముందుకు పడింది. ఒక అరవోడు కాని ఇందులో అర్ధ స్థాయి కి చేరినా అరిచి గోల చేసే వారు. వారితో పాటు పొరిగింటి పులగూర పొగడ్త రాయుళ్ళు రెచ్చి పోయేవారు.
కానీ మనవాళ్ళకు దక్కాల్సిన అందలానికి మన అంధత్వమే అడ్డవుతోందా అనిపిస్తోంది.