ఆశించి భంగపడితే
భరించలేను అని బాధపడడం కన్నా
పక్కింటోడికి కూడా
కరెంటు పోతే కలిగే ఆనందంలా
మనకన్నా ఓ మెట్టు కింద ఉన్న వారితో పోల్చుకొని
స్వాంతన పొందుతుంటాం
అలా జనం డబ్బు
రాజ మార్గంలో కొట్టేసే
వారసత్వపు కుర్చీ దూరమయితే
ఆ బాధకు అంతుండదు
అది అనుభవించే వారికే తెలుస్తుంది
అందుకే స్వాంతనకోసం సచ్చినింట
మళ్ళీ కన్నీళ్లు తెప్పించి
సచ్చినోళ్ళు మన అయ్యలా సంపాదించి ఇవ్వక
పోయారు అని దగ్గరనుండి పోల్చుకొని
స్వాంతన పొందడానికే
మళ్ళీ మళ్ళీ ఓదార్పు చెయ్యాలనిపిస్తోందేమో
ఇదే నిజమైతే ఇక ఎడతెగని ఓదార్పే.