5, ఫిబ్రవరి 2011, శనివారం

బడాయి పోతున్న రాజ్యం బాగుపడేది కలే

ఓ సారి టికెట్టు నిరాకరించి
మరో సారి టికెట్టు ఇచ్చి ఎం పీ చేసిన పార్టీని
వారసత్వ కుర్చీ ఇవ్వలేదని
లక్ష్యం నెరవేరలేదని
దీక్షల మీద దీక్షలు కక్షతో చేస్తూ
కాంగ్రెస్స్ ను హస్తిన కే వెళ్లి కడిగేస్తూ
నా దయా దాక్షణ్యం మీ ప్రభుత్వం అనే
పుల్ల విరుపు మాటలకు విరుగుడుగా

ప్రత్యమ్నాయం అంటూ వచ్చిన
ప్రజారాజ్యం తో మంత్రాంగం నెరిపితే
ఆపద్బాంధవుడు మా నాయకుడే అని
రాజ్యం ప్రతినిధిలు ఉబ్బి తబ్బిబ్బు అవుతూ
కాంగ్రెస్స్ కు రాష్ట్రంలో ఇమేజి ఉన్న నాయకుని కొరతను
మా నాయకుని ప్రత్యామ్నాయం పూడుస్తుందని
పూనకం వచ్చినట్లు ఊగిపోతూ పొంగిపోతున్నారు
125 ఏళ్ల చరిత్ర కల కాంగ్రెస్స్ కౌగిలి
కొత్త బిక్షగాళ్ళకు ద్రుత రాష్ట్ర కౌగిలి అని తెలిసినట్టు లేదు
అంతెందుకు ఈయన ఇమేజ్ ఏంటో
ఎంతో అనుభవం ఉన్న ఆ పార్టీ అంచనావేయదా
కుటుంబ ఇమేజి తప్ప ఎవడి ఇమేజ్ ను భరించని పార్టీ అది
ప్రస్తుతానికి పావుగా వాడుకోబడుతుంటే
బడాయి పోతున్న రాజ్యం బాగుపడేది కలే.