1, మార్చి 2011, మంగళవారం

నువ్వు నిశ్చబ్దమైన వేళ !

నువ్వు నిశ్చబ్దమైనపుడు నాలో నువ్వు శబ్దమవుతున్నావ్!
గుండె గగనతలమంతా ఎడతెగని మహా విస్ఫోటనాలతో పగులుతున్నపుడు,
విశ్వాంతరాళాల్లోకి నల్లని వానరాతిరిలా పరుచుకుంటోన్న యేదో రహస్యం లాంటి నిశ్చబ్దం.

జీవితానికావలితీరాలనుంచి స్తబ్దతా గీతాలు నిశ్చబ్దంగా ప్రవహిస్తో
శబ్దం నిశ్చలమవుతో నిశ్చబ్దమై నన్ను ఆపాదమస్తకం అలుముకుంటోంది.

చెలీ!
ఏ నిశ్చబ్దశబ్ద ప్రకంపనాల మధ్య
ఏమిటి నీకళ్లు చెమ్మగిల్లుతున్నాయ్.

నువ్వూ నేననే మహా రూపోత్సవపు స్వప్నాలన్నీ శబ్దమవుతున్న వేళ
నీ నిశ్చబ్ద మహా భినిష్క్రమణం వేళ కాని వేళ !

కామెంట్‌లు లేవు: