22, మార్చి 2011, మంగళవారం

తేలివిగల వ్యాపారీ ఇక నుంచి వ్యాపారాలు నుంచి తప్పుకుంటాడంట!!!!

కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి షాక్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధమయ్యారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఆటాడుకున్న గాలి జనార్దన్ రెడ్డి కార్యకలాపాలకు క్రమంగా బ్రేక్ పడుతోంది. తాజాగా, గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన బ్రహ్మణి ఇండస్ట్రీస్‌కు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం అయింది. పరిశ్రమల శాఖ తయారు చేసిన నోటీసును జారీ చేయడానికి న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. "ఒప్పందాన్ని ఉల్లంఘించారు. మూడేళ్ళలో తొలి దశ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉండగా కనీసం పది శాతం పని కూడా పూర్తి కాలేదు. ఒప్పంద ఉల్లంఘన జరిగినందున స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించిన భూములు ఎందుకు వెనక్కి తీసుకోకూడదు?'' అంటూ పరిశ్రమల శాఖ తన నోటీసులో పేర్కొంటోంది.


2007 మార్చి 26న అట్టహాసంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధ్యక్షతన కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై గాలి జనార్దన్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి బి. శ్యాంబాబులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం కంపెనీ మూడేళ్లలో తొలి దశ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. పరస్పర అంగీకారంతో ఈ గడువును పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే పొడగింపునకు ఇప్పుడు అవకాశం లేదని తెలుస్తోంది. కొద్ది రోజుల కిత్రమే పరిశ్రమల శాఖ బ్రహ్మణీ ఇండస్ట్రీస్ నుంచి ప్రాజెక్టు ప్రగతిపై నివేదిక కోరింది. ఈ నివేదికలో కంపెనీ 10760 ఎకరాల భూమి లెవలింగ్ పనులతోపాటు కాంపౌండ్ నిర్మాణం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ ప్రాజెక్టుపై 1350 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించారు.

కొంత మేర బ్లాస్ట్ ఫర్నేస్ మెషీనరీ ప్రాజెక్టులో వెచ్చించామని, మరికొంత మొత్తంతో మెషినరీకి ఆర్డర్ చేసినట్లు తెలిపారు. ప్రతిపాదిత స్టీల్ ప్లాంట్ కోసం సర్కారు కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో అంబవరం వద్ద 10760 ఎకరాలు కేటాయించింది. ఈ ప్రాజెక్టు విషయంలో కంపెనీ కనీస ప్రగతి కూడా చూపించలేకపోయినందున భూ కేటాయింపులు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసు జారీ చేస్తున్నారు.

ఈ సంస్థకు ప్రభుత్వం ఎకరా 18 వేల రూపాయల లెక్కన కేటాయించింది. బ్రహ్మణీ ఇండస్ట్రీస్ కోర్టుకు వెళ్లకుండా భూమి వెనక్కి ఇవ్వటానికి అంగీకరిస్తే ప్రభుత్వం ఈ భూమి ధరకు సంబంధించి కంపెనీ చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీకి కేటాయించిన 10760 ఎకరాలను తనఖా పెట్టి బ్రహ్మణీ ఇండస్ట్రీస్ బ్యాంకుల నుంచి రూ.350 కోట్ల రుణం పొందింది. ఇప్పుడు ఈ సంస్థకు కేటాయించిన భూములు వెనక్కి తీసుకుంటే ఈ రుణాన్ని ఎవరు చెల్లించాలన్నది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. తనకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే కావచ్చు, తాను వ్యాపారాల నుంచి తప్పుకుంటానని జనార్దన్ రెడ్డి ఇటీవల ప్రకటించారు

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

గాలి పెద్ద పిస్తా, మా జగన్ బాదం పప్పు. మీ చంద్రబాబు ముద్దపప్పు. పిస్తా బాదం పప్పులను మీరేమి అనగూడదు :)