14, ఏప్రిల్ 2011, గురువారం

తెలంగాణ ఉద్యమానికి చెక్??

తెలంగాణ ఉద్యమానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. తాజా, నో వర్క్ - నో పే జీవోను విడుదల చేసింది. గతంలో తెలంగాణకు చెందిన ప్రభుత్వోద్యోగులు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా, వారు అటువంటి ఆందోళనను తిరిగి చేపట్టకుండా ప్రభుత్వం ఆ జీవోను జారీ చేసినట్లు కనిపిస్తోంది.

పని చేయకపోతే జీతం చెల్లించేది లేదంటూ ప్రభుత్వం బుధవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుంచి ప్రభుత్వ కార్యాలయాలలో పని ఎగగొట్టి ఉద్యమాలు చేస్తామంటే కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలా జరిగితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం పేర్కొన్నది. కొంతమంది ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి సంతకాలుచేసి బయటకు వెళ్లిపోతున్నారని, అటువంటివారికి పని చేయకపోతే జీతాలు చెల్లించడం కుదరదని ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఎవరైనా ప్రభుత్వానికి సహాయ నిరాకరణ అంటే ఊరుకునేది లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

జి.ఒ. వచ్చిన తెల్లవారే ఆ జి.ఒ.ని రద్దు చేయాలని తెలంగాణ ఉద్యోగులు పనులు వదిలేసి ధర్నాలు చేసారు. ఈ ప్రభుత్వం ఏం పీక్కుంది? ఫస్టుకు జీతాలివ్వరా? అప్పుడు పూర్తిగా రోడ్లెక్కి ధర్నాలు చేస్తారు. అప్పుడు ఏం పీక్కుంటుంది? ఉద్యమ లక్ష్య సాధనకై నిరసన కార్యక్రమాలు చేపట్టడం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ఉన్న ప్రజాస్వామ్య హక్కు. మన దేశంలో
మహాత్ముడు చూపిన బాట. అది కాల రాయాలని చూస్తే ఏ కోర్టూ అంగీకరించదు.