8, నవంబర్ 2011, మంగళవారం

ధనం కోసం ధర్మ యుద్ధం చేస్తున్న ధర్మ ప్రభువులు

మా తాతల కాలం నుండి దొరలము
పన్నులు కట్టిన సంపన్నులము అని
సంకలు గుద్దుకుంటూ
చోర కళ తో సంపాదించిన
కరపత్రాలతో
రాష్ట్రంలో రాద్దాంతం చేస్తూ

కోటల్లోకి
వ్యాపార సామ్రాజ్యాల్లోకి
న్యాయ దేవత వడి వడి గా వస్తుంటే
ఆపడానికి

ఓ ప్రక్క ధర్మ యుద్ధం పేరుతో
బెదిరించ చూసి భంగపడి

మరో ప్రక్క అవినీతి ధనంతో
అత్యంత ఖరీదైన న్యాయ వాదులతో
సుప్రీం లో వాదించి
న్యాయ దేవత అడుగులను నిలువరించ చూస్తే

ఆ దేవత కూడా ‘దేవుడి’ బిడ్డను చిన్న చూపే చూసింది

ధనం కోసం ధర్మ యుద్ధం చేస్తున్న
ధర్మ ప్రభువులు

తమను ఎన్నుకొన్న ప్రజలు
తమ రాజకీయ జీవితాలకు
పాతరలు వేయక ముందే
మేల్కోండి

ప్రాణం అంటే పూచిక పుల్లలా తీసేస్తూ
అవినీతి పై ప్రభువులను
పరుగులు పెట్టిస్తున్న
పండుటాకులను చూసైనా
ప్రజల సొమ్ము కాపాడ
కలసి రండి

ధర్మ యుద్ధమని చేస్తున్న
ధన యుద్ధంలో
గెలుపు దక్కదని తెలుసుకోండి.

కామెంట్‌లు లేవు: