ఆత్మ హత్యలు చేసుకొనే రైతుల శవాలపై చల్లడానికి
అత్తరును కూడా అధిష్టానాన్ని అడగలేరు
రైల్వే కేటాయింపులు గురించి
కేంద్రాన్ని అడుగుతారనే ఆశలేదు
ప్రాజెక్టులకు జాతీయ హోదా తెచ్చేంత హోదా లేదు
విపత్తులు వస్తే నిధుల గురించి వీరు చెబితే
వినే నాధుడు కూడా ఉండడని తెలుసు
సాటి ప్రజా ప్రతినిధులని కూడా చూడకుండా
సన్నాసులు దద్దమ్మలు అని అంటుంటే కూడా
ఉలుకూ పలుకు ఉండదు
అటువంటి వారు ఓ రెండు వారాలుగా
ఒకోడి ఇంట్లో ఒకో రోజు పకోడీ సమావేశం పెట్టుకొని
ఆవేశాల హడావిడి చేసి
అమ్మ దయ తలచితే
మేము చెయ్యి చాపి అందుకొంటామని
నోరు కూడా జారారు
ఇప్పుడు తీరా కేంద్ర మంత్రి వర్గ కేటాయింపుల్లో
బోర్లా పడి ‘మొండి చేయి’ చూసారు.