20, జనవరి 2011, గురువారం

నాకు పదవే ముఖ్యం

48 గంటల తరువాత దీక్ష చేస్తే
శరీరంలో ఏ అవయమూ తిప్పలేము
అందుకోసం దీక్ష ఎందుకు దండగ
మడమ తిప్పేది లేదు అనే పదాన్ని
పద్దతిగా అర్థం చేసుకొంటే సరి

ఎన్ని రోజులు బతికామని కాదు
ఎలా బతికామన్నది ముఖ్యం
అందుకోసమే ముఖ్యమంత్రి సీటును
బతికి సాధించాలి
దీక్షలు పొగిడించి టపా కట్టి కాదు.

డబ్బెవడికి చేదు అన్నదే
నా ఆశయానికి ఆయువు పట్టు
అది మా నాన్న జమానా నుండి
ఒడిసిపట్టినాను కాబట్టే
ఈ రోజు పెట్టుబడి పెట్టగలుగుతున్నా
నా కోసం జనాలను రప్పించగలుగుతున్నా
జన నాయకులచే
నాకు దక్కని కుర్చీ నాయకుణ్ణి
నిద్రలేకుండా చేయగలుగుతున్నా
అర్థం చేసుకొంటే మంచిది
ఆలస్యం చేసే కొద్దీ నా అసహనం పెరుగుతుంది
ఆ తదుపరి అధిష్టానం కూడా ఆపలేందు.

నిజంగా రైతులకోసం ఎవరు పోరాడినా మద్దతివ్వాలి
కానీ ఆ పోరాటంలో ఎవడు కుర్చీకి దగ్గర అయినా నేను సహించ
ఆ పోరాటాన్ని పొట్టనింపు కొంటూ చేస్తున్నారని ప్రాపగాండా చేస్తా
దీనితో రైతు సమస్యలు పలుచనైనా పరవాలేదు
నాకు పదవే ముఖ్యం.